
సచివాలయ ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి కె.వి.కృష్ణారెడ్డి
రేపల్లె: సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం వేధింపులను ఆపాలని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి కె.వి.కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి పౌర సేవలను ప్రజల ముంగిటికీ చేర్చారన్నారు. ఎన్నికల ముందు వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా విధుల్లోకి తీసుకోకుండా వారి ఉపాధిపై దెబ్బకొట్టిందన్నారు. ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పలు రకాల సర్వేల పేరుతో పని ఒత్తిడి కల్పించి మానసికంగా వేధిస్తుందని చెప్పారు.