
జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
బాపట్ల టౌన్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆదివారం జిల్లా పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు, చొరబాటుదారులను నిరోధించి, నిషేధిత, పేలుడు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే ముఖ్య ఉద్దేశంతో తనిఖీలను చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే విధంగా సంఘ విద్రోహుల చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పోలీసు బృందాలు ఆకస్మికంగా ఆయా ప్రదేశాల్లోకి ప్రవేశించి అనుమానితుల లగేజీలు, బ్యాగులు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు, ప్రయాణ గమ్యం, ఉద్దేశం తదితర వివరాలను సేకరించినట్లు వివరించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యంగా, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల రక్షణకు దృఢమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో ట్రాక్‌ల వెంట, పార్సిల్‌లను, లగేజీలలో అనుమానాస్పద వస్తువులను గుర్తించేందుకు జాగిలాలతో తనిఖీ చేసినట్లు తెలిపారు.
రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ముమ్మరం

జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు