
ఫ్లోరోసిస్‌తో అనర్థాలు
ఎముకల ఫ్లోరోసిస్‌తో కాళ్లు, చేతులు వంకరపోవడం, వెన్నుముక కట్టెల్లా బిగుసుపోవడం, కండరాలు, లిగమెంట్స్, కణజాలాలు, ఎర్ర రక్తకణాలు, వీర్య కణాలు, ఉదర భాగంలోని జీర్ణవ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తుంది. ఎముకలు పెలుసుబారిపోతాయి. దంత ఫ్లోరోసిస్ వల్ల పళ్లు పసుపు లేదా గోధుమ రంగు నుంచి నలుపుగా మారతాయి. ఫ్లోరోసిస్ నీటిని తాగడం వల్ల వెన్నముకలో ఉండే లిగమెంట్స్ ఉబ్బిపోతాయి. వెన్నుముకపై నరాలు ఒత్తుకుని కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. గర్భవతులకు పరీక్షలు చేయడం వల్ల పుట్టబోయే పిల్లలు ఫ్లోరోసిస్ బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
– డాక్టర్ జె. నరేష్‌బాబు, సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు