
చెరువును చెరబట్టారు
చుండూరు(వేమూరు):అధికారంలోకి వచ్చింది దరిమిలా కూటమి నేతలు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలతో పేట్రేగుతున్నారు. చెరువులకు చెరువులనే చెరపడుతూ మట్టిని అక్రమంగా తోడేస్తూ, లక్షలు ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చుండూరు మండలంలోని పెదగాదెవర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో మట్టిని కూటమి నేతలు అక్రమ తవ్వేస్తూ, ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.800కి అమ్మేస్తూ జేబులు నింపుకొంటున్నారు. పట్టపగలు మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీరు–చెట్టు పథకం కింద చెరువులను తవ్వేసిన టీడీపీ నేతలు అక్రమంగా రూ.లక్షలు ఆర్జించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో నేతల కన్ను చెరువులపై పడింది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి లక్షలు ఆర్జించాలనే థ్యేయంతో ముందుకెళుతున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
చుండూరు మండలం పెదగాదెలవర్రు చెరువులో కూటమి నేతల అక్రమ మట్టి తవ్వకాలు
జగన్న కాలనీల్లో మెరక కోసమే..
జగనన్న కాలనీల్లో మెరకలు వేసేందుకు చెరువు తవ్వకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మండలంలోని పెదగాదెలవర్రు, చుండూరు, అంబేడ్కర్ నగర్, నడిగడ్డవారి పాలెం, చిన గాదెవలవర్రు, చినపరిమి, కారుమూరు పాలెం గ్రామా ల్లో జగనన్న కాలనీలకు మట్టి తరలిస్తున్నాం.
– నాగరాజు, చుండూరు తహసీల్దార్