
భావదేవుడు
యుగయుగాల దేవుడు..
జనసందోహం నడుమ ఊరేగింపుగా వెళ్తున్న భావదేవుడు
బాపట్ల: భావపురి నడిబొడ్డున కొలువుతీరిన భావదేవుడి రథోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది.రూ.1.50కోట్లతో నిర్మించిన నూతన రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత శ్రీక్షీరభావన్నారాయణ స్వామివారికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అలయ అర్చకుల సమక్షంలో అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై పట్టణంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం నుంచి 1432వ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించారు.
కిటకిటలాడిన వీధులు
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలిరావడంతో రథంబజార్ సెంటర్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. స్థానిక భావన్నారాయణ స్వామి దేవాలయం నుంచి రథం బజార్ సెంటర్ మీదుగా ఆంజనేయస్వామి దేవాలయం వరకు రథోత్సవం నిర్వహించారు. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భక్తులు స్థానిక భావన్నారాయణస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి రథానికి కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా భావదేవుడి రథోత్సవం జనసందోహంగా మారిన రథంబజార్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు

భావదేవుడు

భావదేవుడు