
కాటేస్తున్న కాల్ నాగులు
బాపట్ల
శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025
అడ్డదిడ్డంగా సర్కార్ ప్లాన్
అస్తిపంజరం కలకలం
సాగర్ నీటిమట్టం
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.300 టీఎంసీలకు సమానం.
దుర్గమ్మకు వెండి పంచపాత్ర
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్ర సమర్పించారు.
సదరం క్యాంప్
తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది. 50 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు.
బాపట్ల: పొదుపు సంఘాలలోని 30 వేల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పేర్కొన్నారు. పొదుపు మహిళల జీవనోపాధుల కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధి అంశాలపై సమావేశం బాపట్లలోని సాయిరామ్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం నిర్వహించారు. డీఆర్‌డీఏ, మెప్మాలోని క్షేత్రస్థాయి పట్టణ, గ్రామ సంఘాల నాయకులకు మెగా వర్క్‌షాప్ నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా అమలయ్యే పథకాలు, రాయితీలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. సీడాప్ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణలు, ఉద్యోగ అవకాశాలపై రూపొందించిన పోస్టర్‌లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను ప్రథమంగా నిలిపి ఏపీ గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం, అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిని అధికారులు, గ్రామ సంఘాల నాయకులు సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని అన్నారు. వారంతా నికర ఆదాయం సాధించేలా చైతన్య పరచాలని సూచించారు. బాపట్ల జిల్లాలో 33,390 పొదుపు సంఘాలు ఉండగా అందులో నాలుగు లక్షల కుటుంబాలు సభ్యులుగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది ముప్పై వేల కుటుంబాల జీవన స్థితిగతులను మార్చడానికి కార్యోన్ముఖులు కావాలని వారిలో స్ఫూర్తి నింపారు. సూర్య ఘర్ పథకంతో ప్రకృతికి మేలు ఇస్తూనే సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలో 60 వేల గృహాలకు సౌర విద్యుత్ యూనిట్లు స్థాపించడం లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో అవకాాశాలను కల్పిస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె.శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల జిల్లా పర్యాటక రంగంగా అభివృద్ధి జరగనుంద న్నా రు. జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు ద్రాక్షావల్లి, సీపీడీసీఎల్ ఎస్‌ఈ ఆంజనేయులు, ఎల్‌డీఎం శివకృష్ణ, మెప్మా పీడీ పి.శ్రీహరి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పనులు వెంటనే చేపట్టాలి
నీటి పారుదల శాఖలోని ఆపరేషన్, నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, పర్చూరు, చీరాల నియోజకవర్గాలలో నీటిపారుదుల శాఖ కు ఆపరేషన్, నిర్వహణ కింద మొత్తం 454 పనులకు రూ.12 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం పొందిందని తెలిపారు. తాగునీటికి సంబంధించి ఈనెల 10వ తేదీన నీటిని నిలుపుదల చేసినందున, మరమ్మతులు ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా, నిల్వలపై బాపట్ల మున్సిపల్ కమిషనర్‌ను అడిగి ఆరా తీశారు. గుంటూరు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ పి వెంకటరత్నం పాల్గొన్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: చీరాల నియోకవర్గంలో కాల్ నాగులు బుసకొడుతున్నాయి. అవసరానికి అప్పు తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నాయి. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. అప్పు తీసుకున్న వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతూ మానవత్వం మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నాయి. బాధితులు ఇల్లు, గ్రామ విడిచి పారిపోయేలా చేస్తున్నాయి. ప్రజలు వడ్డీ జలగల వలలో చిక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా బాధితుల ఇళ్ల పైకి వెళ్లి దాడులకు పాల్పడుతున్నారు. నగదు కట్టకపోతే ఇంటికి తాళాలు వేసి బాధితులను ఇంటి నుంచి బయటకు గెంటుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లిన బాధితులకు న్యాయం జరగడంలేదని వాపోతున్నారు.
వేధింపులు, దౌర్జన్యాలు..
● వడ్డీకి ఇచ్చిన నగదు ఏదైనా కారణంతో బాధితులు కట్టలేకపోతే వారికి వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు మొదలవుతాయి. అంతటితో ఆగకుంటా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఇళ్లపై దాడి చేసి వారి ఇళ్లకు తాళాలు వేసిన సంఘటన ఉన్నాయి. ఎదురు తిరిగి మాట్లాడితే దాడికి పాల్పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు, దౌర్జన్యాలు తాళ లేక బాధితులు ఇల్లు, గ్రామం విడిచి పారిపోయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు.
● దేశాయిపేట పంచాయతీ విజయనగర్ కాలనీకి చెందిన షేక్ ఖజీ మొఘల్ బెల్దారు పనులు చేస్తూ జీవిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులతో అదే ప్రాంతానికి చెందిన దంపతుల వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దానికి సంబంధించి రూ.1.30 లక్షలు తిరిగి చెల్లించినట్లు బాధితులు తెలిపారు. అయినప్పటికీ ఇంకా రెండు లక్షలు చెల్లించాలని లేదంటే చంపేస్తామని బెదిరించి ఇంటిపై దాడి చేసి ఇంట్లో నుంచి బయటకు నెట్టి ఇంటికి తాళాలు వేసినట్లు బాధితులు తెలిపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
● వడ్డీ వ్యాపారుల బెదిరింపులు, దాడులకు భయపడి రామానగర్ మూడోలైనుకి చెందిన ఒక కుటుంబ మూడు నెలల కిందట ఇంటికి తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లిపోయింది.
● రామన్నపేట పంచాయతీ స్ట్రయిట్ కాలవ కట్టపై నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటున్న రెండు కుటుంబాలు వడ్డీ వ్యాపారుల దాడులకు భయపడి మూడు నెలల కిందట ఇల్లు వదిలి కుటుంబాలతో గుంటూరు తరలిపోయారు.
● అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో ఒక కుటుంబం వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన సంఘటన ఉంది.
● రామన్నపేట పంచాయతీ అచ్చుకట్లలంపలో నివాసం ఉంటున్న కుటుంబం తమ కుటుంబ అవసరాల కోసం అప్పు చేయడంతో వడ్డీ వ్యాపారులు వేధింపులు, దాడులతో ఇల్లు విడిచి 8 నెలల కిందట హైదరాబాద్ వెళ్లిపోయారు.
● ఇప్పటికై నా ఉన్నత అధికారులు కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల బారి నుంచి పేద ప్రజలకు కాపాడాలని కోరుతున్నారు.
7
న్యూస్‌రీల్
వడ్డీ వ్యాపారం తీరుతెన్నులు..
దేశాయిపేట పంచాయతీ విజయనగర్ కాలనీకి చెందిన ఒకరు, ఈపురుపాలెం నుంచి వచ్చి విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మరొకరు. చీరాల–వేటపాలెం రోడ్డు పక్కన వేటపాలెం ఆర్టీసీ పెట్రోల్ బంక్ దగ్గరలో మరో ఇద్దరు, రాపూరిపేట అచ్చుకట్లలంపలో నలుగురు మహిళలు, కొత్తపేటలో మరొకరు ఇదే విధంగా మరి కొందరు కొంత మొత్తంలో నగదు అప్పుగా ఇస్తారు. రూ.10 వడ్డీగా వసూలు చేస్తారు. ఇచ్చిన అప్పును కిస్తీల రూపంలో ప్రతి రోజూ కొంత మొత్తంగా నగదు చెల్లించేలా అవగాహన కుదుర్చుకుంటారు.
పట్టి పీడిస్తున్న వడ్డీ జలగలు
అసలుకు నాలుగింతులు
కట్టినా వేధింపులు
దాడులకు పాల్పడుతున్న
వడ్డీ వ్యాపారులు
పోలీసుల తూతూ మంత్రపు చర్యలు
ఇల్లు, గ్రామం విడిచి
పారిపోతున్న బాధితులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు

కాటేస్తున్న కాల్ నాగులు