
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు 328 మంది హాజరు
వేటపాలెం: సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు 328 మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, సెక్రటరీ ఎం లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి షిఫ్ట్‌లో 176 మంది హాజరు కావాల్సి ఉండగా 164 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. సాయంత్రం రెండో షిఫ్ట్‌లో 176 మందికిగాను 164 మంది హాజరైనట్లు తెలిపారు. 24 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ జగదీష్‌బాబు తెలిపారు.
ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
నలుగురికి గాయాలు
సంతమాగులూరు (అద్దంకి రూరల్): క్వారీలో పనికి వెళ్తూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం రాత్రి సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఇలుమలై నాగరాజ్ (44) సజ్జాపురం గ్రామంలో ఉన్న తిరుమల సాయిచంద్ర గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి ట్రాక్టర్ కొండ ఎక్కుతుండగా తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న నాగరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేపు డీఈవో కార్యాలయం ముట్టడి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సోమవారం సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈనెల 21న డీఈవో కార్యాలయ ముట్టడి యథాతథంగా నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకుడు కె.బసవ లింగారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపాదించిన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం వరకు వ్యవధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు 328 మంది హాజరు