ఎంతకాలమీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు బాబూ!
మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత. రాజు అంటే పరిపాలకుడు మొండివాడుగా ఉండొద్దు అన్న అర్థమూ ఉంది దీంట్లో. పట్టు విడుపుల్లేని రాజకీయం, ప్రజాస్వామ్యంలో విజ్ఞత, విచక్షణల అవసరమని గతానుభావాలు చెబుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ప్రజాక్షేమమే పరమావధి కావాలి మినహా వ్యక్తిగత పట్టింపులు కాదు. ఈ విషయాలను విస్మరిస్తే ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. అచ్చం... ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్నది ఇదే. ఎవరు కాదన్నా.. వద్దంటున్నా ప్రైవేటీకరణకు మంకుపట్టు పట్టుకున్న చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఈ అహేతుక నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తోంది. ప్రజల అభిమతానికి భిన్నంగా నడుచుకుంటే రాజకీయ పార్టీలకు ఇక్కట్లు తప్పవన్న సంగతి ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. తెలుగువారంతా కలిసి ఉండాలనుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు ఎన్టీఆర్ అందుకు తగ్గట్టుగా ‘‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే’’ అన్న సందేశాత్మక పాటలను తన సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీని అక్రమంగా లాగేసుకున్న తరువాత చాలాకాలం అదే విధానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల ఓటమి తరువాత జరిగిన మహానాడులోనూ టీడీపీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ 2009 వచ్చేసరికి ప్రత్యేకవాదంపై ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ నేతలు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. అది ఆంధ్రుల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా మారింది. దాంతో 2009లోనూ ఓటమిపాలైంది. 1999లో విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని పాదయాత్ర లో ప్రకటించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని ఎద్దేవ చేశారు. 2004 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది ఒక కారణమైంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపారు. దాంతో చంద్రబాబు కూడా తన వైఖరి మార్చుకుని గత టర్మ్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ను కొనసాగించారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలు, తదుపరి మాటలు మార్చడం గురించి ఇక్కడ చర్చ కాదు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సరస్వతిని అమ్ముతారా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు. అతకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వపరంగా గత ముఖ్యమంత్రి జగన్ కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి ఎక్కడలేని కృషి చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. దానికి ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలికి ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించరాదని సంతకాలు చేశారు. జగన్ వారి పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు చేస్తున్నందంతా ఒక స్కామ్ అని, ఇందులో ప్రైవేటు సంస్థలు భాగస్వాములైతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని, తిరిగి కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని జగన్ విస్పష్టంగా తెలిపారు. బహుశా ప్రజా వ్యతిరేకత, జగన్ హెచ్చరికలను గమనంలోకి తీసుకున్నాయో, ఏమో కాని, ప్రైవేటు సంస్థలు కాలేజీలకు టెండర్లు వేయలేదు. నాలుగు కాలేజీలకు గాను ఆదోని కాలేజీకే ఒక ప్రైవేటు వైద్య సంస్థ కిమ్స్ మాత్రం బిడ్ వేసిందని ప్రభుత్వం చెప్పింది. అయితే తాము బిడ్ వేయలేదని కిమ్స్ ప్రకటించడంతో ప్రభుత్వం పరువు పోయింది. కిమ్స్‌లో పనిచేసే ఒక డాక్టర్ ఈ టెండర్ వేశారని, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల తప్పు జరిగిందని, ఇది చిన్న విషయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పని చేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అయినా చంద్రబాబు మళ్లీ సమీక్ష చేసి మొండిగా ముందుకువెళ్లాలని నిర్ణయించారు. పైగా ఆయా ప్రైవేటు సంస్థలకు ఆర్థిక, ఇతర రాయితీలు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇక్కడే ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఆ కాలేజీలకోసం వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించింది. కొన్ని కాలేజీలకు భవన నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి అవసరమైన పరికరాలు కూడా సమకూర్చారు. ఇలాంటి వాటన్నిటిని ప్రైవేటు వారికి అప్పగించడం ఏమి హేతుబద్దత? ఈ ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా, రెండేళ్లపాటు సిబ్బందికి జీతాలూ ఇస్తారట. అయినా ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రైవేటు సంస్థలకు వయబిలిటి గ్యాప్ ఫండ్ కూడా ఇస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. జగన్ కోటి సంతకాల ఉద్యమం సందర్భంగా చేసిన హెచ్చరిక పని చేసిందన్నది ప్రజాభిప్రాయంగా ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. అదే టైమ్‌లో ఈ కాలేజీలు తీసుకున్నా, ఎంత ప్రభుత్వం ఆస్తులు ఇచ్చిన నష్టం రావచ్చునని ప్రైవేటు సంస్థలు అనుమానించాయా? లేక చంద్రబాబు బలహీనతను క్యాష్ చేసుకొన్ని మరిన్ని రాయితీలు పొందాలని అనుకుని ఉండవచ్చు. మొత్తం ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా కేంద్రం పీపీపీ విధానాన్ని అమలు చేయాలని తెలిపిందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కొత్త ప్రచారం ఆరంభించారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందన్నది అనుమానమే. కేంద్ర మంత్రి నడ్డా నిజంగానే అలా లేఖ రాసి ఉంటే దానిని బహిర్గతం చేసి ఉండేవారు కదా! ప్రజాధనం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995-2004 మధ్యకాలంలో 54 ప్రబుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. ఆ ప్రైవేటు సంస్థలకు మంచి విలువైన భూములు కట్టబెట్టగా, అవి ఆ తర్వాత కాలంలో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాయని చెబుతారు. గత టర్మ్‌లో విజయవాడకు, కడప వంటి విమానాశ్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి విమానాలు నడపడం ఆర్థికంగా లాభతరం కాదని చెప్పిన విమానయాన సంస్థలకు ఖాళీగా ఉండే సీట్ల టిక్కెట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రజాధనాన్ని వెచ్చించారు. దీనినే వయబిలిటి గ్యాప్ ఫండ్ అంటారు. ఇదే సూత్రాన్ని మెడికల్ కాలేజీలకు వర్తిస్తారట. అత్యవసర సమయాలలో ఇలా చేస్తే ఫర్వా లేదు కాని, లేని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఇలా వృథా వ్యయం చేయవచ్చా? ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ టర్మ్‌లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికి సుమారు రూ.47 వేల కోట్ల రుణం తీసుకు వస్తున్నారు. కాని వైద్య కాలేజీలకు ఐదువేల కోట్ల డబ్బు లేదని చెబుతున్నారు. అమరావతి ఆవకాయ పేరుతో ఐదు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వెయ్యి రూపాయలు అదనంగా ఫించన్ పెంచి దానిని ఇవ్వడానికి లక్షల రూపాయలు వృధా వ్యయం చేస్తున్నారు. విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. కాని మెడికల్ కాలేజీలను నడపలేమని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసింది. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ఆస్పత్రులు కార్పొరేట్ తరహాలోనే పనిచేసే స్థితి వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులే గొప్ప అన్నట్లు మాట్లాడుతూ తన ప్రభుత్వం చేతకానిదన్న సంకేతం ఇస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటూ కొత్త రాగం ఆలపించారు. పేదలకు నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు వారికి కాలేజీలు ఇస్తారట.ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయో అందరికి తెలుసు. పోనీ ప్రైవేటు కాలేజీలు సొంతంగా భూమి సమకూర్చుని, నిర్మాణాలు చేసుకుని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు పెట్టుకుంటే అదో పద్దతి అనుకోవచ్చు.ప్రభుత్వమే అన్ని సమకూర్చి,అప్పనంగా కాలేజీలను ప్రైవేటువారికి ఇవ్వడం ద్వారా పేదలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో అర్ధం కాదు.కేంద్రం జగన్ టైమ్ లో ప్రభుత్వరంగంలో పనిచేసేలానే ఈ 17 కాలేజీలను మంజూరు చేసిందన్న సంగతిని దాచేయాలని యత్నిస్తున్నారు.కేంద్రం కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేట్లయితే మంగళగిరిలో ఎయిమ్స్ ను ప్రభుత్వపరంగా ఎలా నిర్మించిందన్నదానికి జవాబు దొరకదు. ప్రజల ఆస్తులుగా ఉన్న ఈ కాలేజీలను చంద్రబాబు తనకు కావల్సినవారికి సంపదగా మార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ప్రజల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న ఈ మొండి నిర్ణయం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక చేదు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
మీరు బిజినెస్‌లో కింగ్ అవ్వాలంటే..
సెలక్టర్లకు వార్నింగ్.. భారీ సెంచరీతో చెలరేగిన ధ్రువ్ జురెల్
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
పేరెంట్స్ చేత ట్రీట్ ఇప్పించుకోండి..! వైరల్‌గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్
కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే: వైఎస్ అవినాష్‌రెడ్డి
Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం
ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ!
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్‌బాస్ 'ఇనయా' కన్నీళ్లు
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
PPP అంటే పరువు పోగొట్టుకున్న ప్రభుత్వమని ఎవరన్నారయ్యా?
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగయోగం
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
మీరు బిజినెస్‌లో కింగ్ అవ్వాలంటే..
సెలక్టర్లకు వార్నింగ్.. భారీ సెంచరీతో చెలరేగిన ధ్రువ్ జురెల్
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
పేరెంట్స్ చేత ట్రీట్ ఇప్పించుకోండి..! వైరల్‌గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్
కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే: వైఎస్ అవినాష్‌రెడ్డి
Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం
ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ!
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్‌బాస్ 'ఇనయా' కన్నీళ్లు
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
PPP అంటే పరువు పోగొట్టుకున్న ప్రభుత్వమని ఎవరన్నారయ్యా?
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగయోగం
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
ఫొటోలు
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)
బుక్‌ఫెయిర్ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్ ప్రపంచ రికార్డు (ఫొటోలు)
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)
బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
సినిమా
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.చిన్నారులతో సరదాగాఅందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.మధురమైన జ్ఞాపకంవాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా "జన నాయగణ్" మూవీ ఆడియోలాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. భారీ స్టేజ్ సెటప్, లైటింగ్, సౌండ్ డిజైన్ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారి కోసం విజయ్ స్టేజీపై స్టెప్పులేశాడు.కిందపడ్డ విజయ్మలేషియాలో అంతా అనుకున్నట్లుగానే ఈవెంట్ విజయవంతంగా జరిగింది. అయితే భారత్‌కు తిరిగొచ్చిన విజయ్‌కు చెన్నైలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్టులో హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అత్సుత్సాహంతో ఎగబడ్డారు. దీంతో తోపులాట కారణంగా విజయ్ కారు ఎక్కే సమయంలో తడబడి కిందపడిపోయాడు. వెంటనే సిబ్బంది ఆయన్ను పైకి లేపి క్షేమంగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమావిజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగణ్. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లోనూ స్పష్టం చేశాడు. ఈ మూవీ విషయానికి వస్తే.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. తెలుగులో వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి జననాయగణ్గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పాడు.மலேசியாவில் இருந்து சென்னை திரும்பிய விஜய்க்கு உற்சாக வரவேற்பு அளித்த ரசிகர்கள்..! #Vijay #JanaNayaganAudioLaunch #PoojaHegde #Rollsroyce #NAnand #ThalapathyThiruvizha #ThalapathyKacheri #JanaNayagan #AudioLaunch #Malaysia #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/F1TIpaGjXR— KAVI (@tamiltechstar) December 29, 2025చదవండి: ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
సీరియల్ నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు రవికృష్ణ. మొగలిరేకులు సీరియల్‌తో బుల్లితెరకు పరిచమైన రవికి బిగ్‌బాస్ షోతో మరింత గుర్తింపు వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చాన్స్‌లు వచ్చాయి. విరూపాక్ష సినిమా రవి కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత రవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన దండోరాలో కీలక పాత్ర పోషించాడు. కులం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి..తక్కువ కులానికి చెందిన యువకుడిగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో హత్యకు గురవుతాడు. సినిమా చూసిన ప్రేక్షకులు రవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నారు రవి. దండోరా సినిమాలో మాదిరే ఆయన కూడా కుల వివక్షకు గురయ్యాడట. తన కులం చూసి సినిమా చాన్స్‌లు ఇవ్వలేదట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘మాది విజయవాడ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా కంటే ముందు మా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళతా అంటే..ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ చేసి.. సినిమాల్లోకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలియక..చెన్నై వెళ్లాను. అక్కడ ఓ సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. కొన్నాళ్ల తర్వాత వాళ్లే ఓ తెలుగు సీరియల్ చేస్తే..అందులో నటించాడు. అది మూడు నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని.. ఇక్కడకు వచ్చాడు. మా మేనత్త వాళ్ల ఇంట్లో ఉంటూ.. అవకాశాల కోసం తిరిగాను. మొగలి రేకులు సీరియల్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్తే.. అప్పటికే పూర్తయిపోయాయని చెప్పారు. వాళ్లను రిక్వెస్ట్ చేసి ఆడిషన్స్ ఇచ్చాను. అలా ఆ సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభం అయింది. ఆ ఫేమ్‌తో సినిమాల్లోకి వచ్చాయి. ఇక్కడ నాకు కుల వివక్ష ఎదురైంది. కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్ చేసి.. చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యాను. అగ్రిమెంట్ సమయంలో నా ఆధార్ కార్డు పంపించా. అక్కడ నా కులం (ఇంటి పేరు చూసి) చూసి.. తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సెట్ కాదు.. ఇంకో ప్రాజెక్ట్‌కి చూద్దాం అని చెప్పేవాళ్లు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి చెప్పుకొచ్చాడు.
ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా
ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కుమారుడు, దర్శకనటుడు మనోజ్ కన్నుమూశారు. దీంతో మనోవేదనకు గురైన భారతీరాజా అనారోగ్యంపాలయ్యారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న ఈయన మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.కాగా 80 ఏళ్ల వయసు పైబడ్డ భారతీరాజా మారోసారి అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని భారతీరాజా బంధువులు తెలిపారు.సినిమాభారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. మెస్సీ రికార్డు బ్రేక్
సౌదీ ప్రీమియర్ లీగ్‌లో అల్ అఖ్‌దూద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అల్-నస్ర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్, అల్-నస్ర్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రొనాల్డోరెండు మెరుపు గోల్స్‌తో అల్-నస్ర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ ఫుట్‌బాల్ స్టార్ మ్యాచ్ 31వ నిమిషంలో ఒక గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. అతడితో పాటు జోవో ఫెలిక్స్ కూడా ఓ గోల్ సాధించాడు. ఈ విజయంతో సౌదీ ప్రో లీగ్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్-నస్ర్ రికార్డు సృష్టించింది.అదేవిధంగా రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 202 ఏడాదిలో రొనాల్డో 40 గోల్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సార్లు నాలభైకి పైగా గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రోనాల్డో చరిత్ర సృష్టించాడు. అతడు తన కెరీర్లో 14 వేర్వేరు సంవత్సరాల్లో 40 పైగా గోల్స్ సాధించాడు.2010 నుంచి దాదాపు ప్రతీ ఏటా రోనాల్డో నాలభైకి పైగా గోల్స్ సాధిస్తున్నాడు. ఒక్క 2019లోనే ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరిట ఉండేది. మెస్పీ తన కెరీర్లో ఇప్పటివరకు 13 సార్లు 40 పైగా గోల్స్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మెస్సీని రొనాల్డో అధిగమించాడు.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!
ఐదో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్ అవుట్
యాషెస్ సిరీస్ 2025-26 తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్టాతక సిరీస్‌లో ఆఖరి టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యాడు.బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో అట్కిన్సన్ తొడ వెనక కండరాలు పట్టేశాయి. అనంతరం స్కాన్ రిపోర్ట్‌లో గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు నిజంగా ఇది భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్‌లో అట్కిన్సన్ తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అట్కిన్సన్ తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. బ్రిస్బేన్‌లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం అడిలైడ్ టెస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్చర్ గాయపడడంతో అట్కిన్సన్ తిరిగి బాక్సింగ్ డే టెస్టు కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ చారిత్రత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు.పాట్స్ ఎంట్రీ?ఇక ఐదో టెస్టులో అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రానున్నట్లు తెలుస్తోంది. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్‌తో కలిసి మాథ్యూ పాట్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఒక వేళ సిడ్నీ పిచ్ కండీషన్స్ బట్టి స్పిన్నర్ ఆడించాలనుకుంటే షోయబ్ బషీర్‌ను తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్పటికే 3-1 తేడాతో కోల్పోయింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని స్టోక్స్ సేన భావిస్తోంది.సిడ్నీ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.
నీకు బీర్ కావాలా? అదిరిపోయే సమాధానమిచ్చిన ఇంగ్లండ్ స్టార్
యాషెస్ నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు.. రిలాక్స్ అవ్వడానికి క్వీన్స్‌ల్యాండ్‌లోని నూసాకు వెళ్లారు. అయితే ఈ బ్రేక్‌లో ఇంగ్లీష్ ఆటగాళ్లు మితిమీరి మద్యం సేవించినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోడ్డుపై ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో డకెట్ కన్పించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ విచారణకు ఆయన ఆదేశించారు.ఈ నేపథ్యంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో బెన్ డకెట్‌ను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. రెండో రోజు ఆటలో డకెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని అతడిని ఎగతాళి చేస్తూ "నీకు ఒక బీర్ కావాలా?" అని గట్టిగా అరిచాడు. వెంటనే అభిమానుల వైపు చూస్తూ, డకెట్ నవ్వుతూ.. "సరే, తీసుకురండి చూద్దాం!" అన్నట్లుగా బీరు తాగే సైగలు చేశాడు.అతడి సమాధానం విన్న ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయి చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పటికే 3-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కోల్పోయింది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్ను మూత
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ క్రికెటర్ హ్యూగ్ మోరిస్ (62) కన్నుముశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోరిస్ ఆదివారం మృతి చెందారు. మోరిస్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన గ్లామోర్గాన్ కౌంటీ జట్టు ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. ఆటగాడిగానే కాకుండా... సీఈఓ గానూ క్లిష్ట పరిస్థితుల్లో క్లబ్‌ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించినట్లు అందులో పేర్కొంది. (Hugh Morris Death)ఇంగ్లండ్ తరఫున 3 టెస్టులు ఆడిన మోరిస్... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించారు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సీఈఓగాను మోరిస్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 314 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్... 19,785 పరుగులు చేశారు. అందులో 53 సెంచరీలు, 98 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో 274 మ్యాచ్‌ల్లో 8606 పరుగులు చేశారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్‌లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
బిజినెస్
పోర్ట్‌ఫోలియోకి దన్నుగా హైబ్రిడ్ ఫండ్స్
అంతర్జాతీయంగా వృద్ధి తీరుతెన్నులు, వడ్డీ రేట్ల అంచనాలు, లిక్విడిటీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి షాక్‌లనైనా తట్టుకుంటూ, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాలను ఒకే దాంట్లో మేళవించి అందించే హైబ్రిడ్ ఫండ్స్, మీ పోర్ట్‌ఫోలియోకి దన్నుగా నిలబడగలవు. వీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మార్కెట్లో ఎలాంటి పరిస్థితులెదురైనా దీర్ఘకాలిక ప్రణాళిక దెబ్బతినకుండా, ఇవి మీ ఆర్థిక ప్రణాళికకు వెన్నెముకగా నిలుస్తాయి.శక్తివంతమైన ఫీచర్లు..ఈ హైబ్రిడ్ ఫండ్స్‌లో పలు శక్తివంతమైన ఫీచర్లు ఉంటాయి. మొదటిది పరిశీలిస్తే, ఇందులోని ఈక్విటీ భాగం దీర్ఘకాలికంగా అధిక వృద్ధి, ద్రవ్యోల్బణానికి మించి రాబడులు అందించగలుగుతుంది. అదే సమయంలో డెట్ భాగమనేది పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని, రాబడిని అందిస్తూనే పతనాల వేళ ఆదుకుంటుంది. ఇక రెండో అంశమేమిటంటే, ఇది ఎమోషనల్ ‘షాక్ అబ్జర్బర్’లాగా కూడా పని చేస్తుంది. ఫిక్సిడ్ ఇన్‌కం భాగమనేది మార్కెట్ భారీగా ఎగిసినప్పుడు ఉన్నప్పుడు ఈక్విటీల్లో అతిగా ఇన్వెస్ట్ చేయాలన్న అత్యుత్సాహాన్ని కాస్త నెమ్మదింపచేస్తుంది. మార్కెట్లు కరెక్షన్‌కి లోనైనప్పుడు పోర్ట్‌ఫోలియో మరీ పతనమైపోకుండా కాపాడుతుంది. పెట్టుబడులను కొనసాగించే శక్తినిస్తుంది. మూడో విషయం చూస్తే.. నిర్వహణపరంగా ఇది చాలా సరళంగా, క్రమశిక్షణను పెంపొందించే విధంగా ఉంటుంది. వివిధ స్కీములవ్యాప్తంగా ఈక్విటీ, డెట్, క్యాష్ పొజిషన్లను చూసుకుంటూ ఉండాలంటే బోలెడంత సమయం, రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చాలా మటుకు ఇన్వెస్టర్లు తరచుగా పోర్ట్‌ఫోలియోను పరిస్థితికి తగ్గట్లు సత్వరం సరిచేసుకోలేరు. తీరా చేసే సరికి సమయం మించిపోతుంది. హైబ్రిడ్ ఫండ్స్ అలా జరగకుండా, పరిస్థితికి అనుగుణంగా పెట్టుబడులను వివిధ సాధనాలకు తగిన రీతిలో కేటాయించి రీబ్యాలెన్స్ చేస్తాయి. తద్వారా ప్రాక్టికల్‌గా, సైకలాజికల్‌గా మీపై ఒత్తిడి తగ్గించే విధంగా ఉంటాయి. ఇవి చాలా సరళంగా ఉండటం వల్ల తప్పిదాలు, లావాదేవీల వ్యయాలు, ట్యాక్స్‌ల భారంలాంటివి తక్కువగా ఉంటాయి. రిస్కు సామర్థ్యాలను బట్టి ఎంపిక..ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా ప్రతి త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను అన్వేíÙంచాల్సిన పని లేకుండా వివిధ రకాల రిస్కు సామర్థ్యాలున్నవారికి అనువైనవిగా హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. వీటిలో అంతర్గతంగా పలు రకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మోస్తరు రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులతో పాటు స్థిరత్వం కూడా కోరుకునే వారి కోసం మధ్యేమార్గంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. ఒడిదుడుకులను ఎక్కువగా ఇష్టపడని వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఇక కాస్త ఎక్కువ రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారి కోసం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. అయితే, దేన్ని ఎంచుకున్నా హైబ్రిడ్ ఫండ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇవి స్వల్పకాలిక ట్రేడింగ్ సాధనాలు కావు. దీర్ఘకాలికంగా క్రమశిక్షణతో వీటిలో పెట్టుబడులను కొనసాగిస్తేనే సిసలైన ప్రయోజనాలు పొందవచ్చు. స్కీమ్ లక్ష్యం గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫండ్‌ని బట్టి ఈక్విటీ, డెట్‌లకు కేటాయింపుల్లో గణనీయంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఫండ్ మెథడాలజీని తెలుసుకుంటే మీ రిస్కు సామర్థ్యాలను బట్టి ఎంచుకునేందుకు వీలుంటుంది. స్వల్పకాలికంగా నగదు అవసరాల కోసం హైబ్రిడ్ ఫండ్స్‌ను ఉపయోగించుకోవడం తప్పిదమవుతుంది. మన ఆర్థిక లక్ష్యాలకు నిర్దిష్ట గడువు, నిర్దిష్ట నగదు అవసరాలు ఉంటాయి. కాబట్టి, స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాల మేళవింపుగా పోర్ట్‌ఫోలియో ఉంటే, మనం నిర్దేశించుకున్న లక్ష్యం గడువు నాటికి మార్కెట్లు ఎలా ఉన్నప్పటికీ, నిధులు చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా, హైబ్రిడ్ ఫండ్స్‌ని పెట్టుబడుల కేటాయింపులకు ఒకానొక మూలస్తంభంగా మార్చుకోవడం ద్వారా ఇన్వెస్టర్లు వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, సంక్షోభాలు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుందనిగుర్తుంచుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్!ఇదీ చదవండి: మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు
మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి డబ్బుతో కూడిన చాలా కలలు ఉంటాయి. సొంతిల్లు, పిల్లల చదువులు, బంగారం, సురక్షితమైన పదవీ విరమణ.. ఇవన్నీ నెరవేరాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు, సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ప్రస్తుత కాలంలో సామాన్యులు తమ పొదుపు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ప్రధాన సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇవే..రియల్టీ..సొంతిల్లు కొనుక్కోవటానికి కరెక్టు వయసంటూ ఏమైనా ఉందా? సొంతిల్లు ఫలానా వయసులోనే కొనుక్కోవాలనే నియమం కానీ, నిబంధన కానీ ఏమీ లేదు. ఇక్కడ వయసుకన్నా దీర్ఘకాలం సెటిల్మెంట్ ముఖ్యం. మీరు గనక తరచూ ప్రాంతాలు మారాల్సి వచి్చందనుకోండి. అప్పుడు సొంతిల్లు కొనుక్కునీ ప్రయోజనం ఉండదు. స్థిరమైన ఆదాయం లేనప్పుడు సొంతింటి లాంటి ఆలోచనలు చేయకూడదు. అందుకని వయసు కన్నా ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలం అదే ప్రాంతంలో ఉండే అవకాశం, స్థిరమైన ఆదాయం అనేవి ప్రధానం.బ్యాంకింగ్..ప్రతినెలా నా ఆదాయంలో కొంత మిగులుతోంది. దీన్ని సిప్ చేయటం మంచిదా... లేక రికరింగ్ డిపాజిట్ చేయొచ్చా?రికరింగ్ డిపాజిట్... సిప్, రెండూ మంచివే. కాకపోతే రికరింగ్ డిపాజిట్లో భద్రత ఎక్కువ. కానీ రాబడి పరిమితంగా ఉంటుంది. సిప్ అనేది స్టాక్ మార్కెట్లకు, మ్యూచువల్ ఫండ్లకు మంచిదే. దీన్లోనూ భద్రత ఉంటుంది కానీ... గ్యారంటీ ఉండదు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు సిప్‌తోనే సాధ్యమవుతాయి. కాబట్టి మీరు దీర్ఘకాలం వేచి చూసేటట్లయితే సిప్‌ను, స్వల్ప కాలానికైతే ఆర్డీని ఎంచుకోండి.బంగారం బంగారంలో నెలవారీ ఇన్వెస్ట్ చేయొచ్చా? దీనికున్న సాధనాలేంటి?నెలవారీనే కాదు. వారం, రోజువారీ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నపుడు భౌతికంగా గోల్డ్‌ను కొనే ప్రయత్నాలు వద్దు. డిజిటల్ గోల్డ్ లేదా గోల్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయండి. రకరకాల ఫిన్‌టెక్ యాప్‌లు కూడా అత్యంత సులువుగా గోల్డ్‌లో ఎప్పుడు, ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కలి్పస్తున్నాయి. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ... ధర పతనమైనప్పుడు ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయటమూ మంచిదే.స్టాక్ మార్కెట్...2026లో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చాలా ఐపీఓలు అధిక ధరలతో వస్తున్నాయి. కాబట్టి లిస్టింగ్‌లో రకరకాల కారణాల వల్ల లాభాలొచి్చనా అవి ఎక్కువకాలం నిలవటం లేదు. ఇప్పటి ఐపీఓలు కొని దీర్ఘకాలం ఉంచుకునేట్లుగా లేవు. కాబట్టి కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి, వాళ్లు తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నారనిపిస్తేనో, కంపెనీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంటేనో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లిస్టింగ్ లాభాల కోసం మాత్రం ఐపీఓల వెంట పడొద్దు. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగులేని పక్షంలో లిస్టింగ్నాడే పనతమయ్యే అవకాశాలూ ఉంటాయి.మ్యూచువల్ ఫండ్స్...నేను కొన్ని సంవత్సరాలుగా ‘సిప్’ చేస్తున్నాను. ఇప్పుడు ఆపేయవచ్చా? సిప్‌లో ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశామన్నది ముఖ్యం కాదు. ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేశాం... మనకు ఎంత రాబడులు వచ్చాయి అనేవే ముఖ్యం. మీరు ఏ లక్ష్యం కోసమైతే ఇన్వెస్ట్ చేశారో ఆ లక్ష్యం నెరవేరిందని అనుకోండి. అప్పుడు సిప్ ఆపేయొచ్చు. లేకపోతే మీకు సిప్ వల్ల బాగా నష్టాలు వస్తున్నాయని అనుకుందాం... అపుడు తాత్కాలికంగా సిప్‌ను నిలిపేసి అంతకన్నా ఎక్కువ రాబడులొచ్చే మార్గాలేమైనా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్నాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అది సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే కవరే జీ మొత్తం చాలా పరిమితంగా ఉంటుంది. పైపెచ్చు ఉద్యోగానితో ముడిపడి ఉంటుంది. ఉద్యోగం పోతే బీమా ఉండదు. నిబంధనలపై మీకు ఎలాంటి నియంత్రణా ఉండదు. ఇక చాలా గ్రూప్ ఇన్సూరెన్స్‌లలో కుటుంబ సభ్యులకు పరిమితి ఉంటుంది. తల్లిదండ్రులకు కవరేజీ ఉండదు. వీటన్నిటితో పాటు ఉద్యోగానంతరం మీకు సొంత ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం రూపంలో చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మొదట్నుంచీ ఉంటే తక్కువ ప్రీమియంతో సరిపోతుంది.ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?
మిడిల్ క్లాస్ సప్తపది
జీతం చాలా ఎక్కువ. ఖర్చులు అంతకన్నా ఎక్కువ. ఏం లాభం? అందుకే... ఎంత సంపాదించామన్నది కాదు..! ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పొదుపు చేశాం? అన్నదే ముఖ్యం. అదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం ఆదాయం తక్కువగా ఉండడం కాదు. కాలం చెల్లిన ‘మనీ’ సూత్రాలను పట్టుకుని వేలాడటమే. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకుంటే మధ్యతరగతి వారయినా మహారాజుల్లా బతికేయొచ్చు. అందుకోసం ఈ 7 సూత్రాలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొత్త సంవత్సరంలోనైనా పాటించాల్సిన ఈ ‘సప్త పది’ గురించి వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...అత్యవసర నిధి.. అవసరం వచ్చినప్పుడు సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాచటమనేది చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలను డబ్బుతో కొలవటమనేది తక్కువ. ఇపుడు ఎవరినైనా అడిగినా... వారు ఎంత దగ్గరివారైనా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్లకూ ఏవో అవసరాలు ఉండి ఉండొచ్చు. పైపెచ్చు మన అవసరాన్ని వాళ్లు గుర్తించకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర నిధి అన్నది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. రాజీపడకూడనిది. → కరోనా సమయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్పత్రిలో వైద్యం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారెందరో. కొన్ని సంస్థలు అయితే వేతనాలకు కోత పెట్టాయి. చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి. → వైద్యం కూడా అంతే. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో ఊహించలేం. → అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఉండాలి. కుదిరితే 9 నెలలు, 12 నెలల అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులను కదపకుండా ఉండొచ్చు. అధిక రేటుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. ఈఎంఐలు గీత దాటొద్దు.. → అవసరం వస్తే క్రెడిట్ కార్డు చేతిలో ఉందిలే... వెంటనే రుణం దొరుకుతుందిలే. అనే రీతిలో అన్నింటికీ ‘రుణ’ మంత్రం పనికిరాదు. బ్యాంక్‌లు, ఫిన్‌టెక్‌లు పిలిచి రుణం ఇస్తున్నాయి కదా అని చెప్పి.. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇలా ప్రతిదానికీ అప్పు చేసుకుంటూ వెళితే, ఆర్థిక పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయి. నెల సంపాదనలో 50–60 శాతం వరకు రుణ చెల్లింపులకే వెచ్చించే కుటుంబాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి. → ఆదాయంలో నెలవారీ రుణ వాయిదాలను (ఈఎంఐలు) 35–40 శాతం మించకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దీనివల్ల ఇతర ముఖ్యమైన జీవన అవసరాలకు (గ్రోసరీ, యుటిలిటీ, విద్యా వ్యయాలు) ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. → ఆదాయమనేది నేటి అవసరాల కోసమే కాదు. భవిష్యత్ లక్ష్యాలు, విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా. దీనికోసం ప్రతినెలా కొంత పక్కన పెట్టుకోవాలి. → పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ జీవితం కోసం పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలంటే, ఆదాయంలో ఈఎంఐలు లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవడం ముఖ్యం. → ఈఎంఐలు హద్దు మీరి చెల్లింపుల్లో విఫలమైతే, అది క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. ఆదాయం అప్పులకే పోతుంటే సంపద సృష్టి ఎప్పటికీ సాధ్యం కాదు. ఆదాయాన్ని మించి పెట్టుబడి.. → సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఇపుడు బాగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. ఈ విధానంలో చేస్తున్న పెట్టుబడి, మన వార్షిక ఆదాయ వృద్ధికి మించి పెరిగేలా చూసుకోవాలి. వార్షిక వేతన పెరుగుదల సాధారణంగా 8–10 శాతంగా ఉంటుంది. కానీ, సిప్ పెట్టుబడులపై 12–15 శాతం వరకు రాబడి వచ్చేలా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. → ద్రవ్యోల్బణం కారణంగా కొంత కాలానికి మన పెట్టుబడి దాని విలువను కోల్పోతుంటుంది. మన దగ్గర వార్షిక సగటు ద్రవ్యోల్బణం 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. కనుక ఈ మేరకు మన పెట్టుబడి విలువ ఏటా క్షీణిస్తుంటుంది. → ఇపుడు మన జీవన వ్యయాలు నెలవారీ రూ.10,000గా ఉన్నాయనుకుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం పదేళ్ల తర్వాత అవే అవసరాల కోసం రూ.17,908 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత అయితే రూ.32,071 అవసరం అవుతుంది. → ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు మించిన కాలంలో 12–15 శాతం రాబడులు సాధ్యమేనని చరిత్ర చెబుతోంది. → ఇక నెలవారీ చేస్తున్న సిప్ పెట్టుబడిని సైతం ఏటా ఆదాయ పెరుగుదలను మించిన స్థాయిలో పెంచుకోవడం ప్రధానం. లేదంటే కనీసం ద్రవ్యోల్బణం రేటు స్థాయిలో అయినా సిప్ పెట్టుబడిని ఏటా పెంచుకుంటూ వెళ్లాలి. → ఇలా సిప్ పెట్టుబడిని పెంచుకుంటూ, ఆ పెట్టుబడి ద్రవ్యోల్బణం మించి వృద్ధి చెందేలా చూసుకుంటే, కాంపౌండింగ్ ప్రయోజనంతో పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది. ఆరోగ్య బీమా రూ.5 లక్షలు చాలదు.. → మనలో చాలా మందికి ఆరోగ్య బీమా రక్షణ లేదు. ఉన్న వారిలోనూ చాలా మందికి రూ.5 లక్షలకు మించి కవరేజీ లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే ఈ రక్షణ ఎంత మాత్రం చాలదని స్పష్టమవుతోంది. → వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 12– 14 శాతం స్థాయిలో ఉంటోంది. అంటే చికిత్సలు, ఔషధాలు, ఇతరత్రా చార్జీలు ఈ స్థాయిలో ఏటా పెరుగుతున్నట్టు లెక్క. → అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ తరహా టెక్నాలజీలు రావడంతో క్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసయంగా, విజయవంతంగా చేస్తున్నారు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. అవయవ మార్పిడి కోసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది. → కనుక రూ.5 లక్షల కవరేజీ ఎంతమాత్రం సరిపోదు. ఒక కుటుంబానికి కనీసం రూ.10– 20 లక్షల వరకు అయినా బేసిక్ హెల్త్ ప్లాన్ ఉండాలి. రూ.10–20 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య బిల్లు రూ.10– 20 లక్షల్లోపు ఉంటే బేసిక్‌ప్లాన్ నుంచి, అంతకు మించిన సందర్భాల్లో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. రెండు చేతులా సంపాదించాల్సిందే.. → ఒకవైపు కరెన్సీ విలువ క్షీణిస్తుండగా... మరోవైపు జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి తగ్గట్టు ఆదాయం కూడా వృద్ధి చెందాలి. కానీ మన ఆర్థిక డేటాను పరిశీలిస్తే.. ఆదాయ వృద్ధి కంటే జీవన వ్యయ పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రెండో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టాలి. → అద్దె రూపంలో ఆదాయం లేదంటే తమ నైపుణ్యాల ఆధారంగా ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ వర్క్ లేదంటే వడ్డీ ఆదాయం లేదా డివిడెండ్ ఆదాయం ఇలా ఏదో ఒక మార్గం గుర్తించాలి. ఖర్చులపై కన్ను.. టీవీ ఛానళ్ల కోసం ఒకటి, నెట్‌ఫ్లిక్స్–అమెజాన్ ప్రైమ్, ఆహా ఇలా వేర్వేరు ఓటీటీ చందాలు, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ లైఫ్ కోసం ప్రతి కుటుంబంలో నెలతిరిగేసరికి చందా చెల్లింపుల జాబితా పెరిగిపోతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఈ తరహా రీచార్జ్‌ల కోసం కనీసం రూ.25,000– 40,000 వరకు ఖర్చు చేస్తోంది. కనుక ఏదో ఒక వినోద ఓటీటీ, ఒక లెర్నింగ్ యాప్‌నకు పరిమితమై, అనవసర దుబారాను అదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛకు మార్గం వేసుకోవచ్చు. బంగారం కూడా బీమా లాంటిదే..→ బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కంటే రక్షణ కవచంగానే (హెడ్జింగ్ సాధనం) ఎక్కువ పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరతలప్పుడు, కరెన్సీ విలువ క్షీణించినపుడు, ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడి విలువను కాపాడుకోవడంలో బంగారం కీలకంగా పనిచేస్తుంది. → ఈ ఏడాది బంగారం ధర దేశీ మార్కెట్లో 78 శాతం పెరిగింది. 2020లో రూ.48,000 స్థాయిలో ఉంది. ఐదేళ్లలో రెండు రెట్లు (200 శాతం వృద్ధి) పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో చూస్తే బంగారంపై వార్షిక రాబడి 11–12 శాతంగా ఉంది. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా లేకపోవడం, వాణిజ్య అనిశి్చతులతో గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. ఈ కాలంలో బంగారం విలువను సృష్టించి పెట్టింది. → కనుక పెట్టుబడుల్లో వైవిధ్యానికి, అనిశి్చతులు, కరెన్సీ విలువల నుంచి పెట్టుబడి విలువకు రక్షణ కోసం, అత్యవసరాల్లో రుణం పొందేందుకు సైతం బంగారం అక్కరకు వస్తుంది. → అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో బంగారానికి 10–15 శాతం కేటాయించుకోవాలి.2026 చెక్ లిస్ట్అత్యవసర నిధి: 6–9 నెలలు ఆదాయంలో ఈఎంఐలు: 35 శాతం మించొద్దు సిప్ పెట్టుబడి: ఏటా పెంచుకుంటూ వెళ్లాలి, ఆదాయాన్ని మించి వృద్ధి చెందాలి హెల్త్ కవరేజీ: కనీసం రూ.10–20 లక్షలకు బీమా ఉండాలి పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు: 10–15 శాతం రెండో ఆదాయం తప్పనిసరి డిజిటల్ లైఫ్ ఖర్చును నియంత్రించుకోవాలి
గణాంకాలే గేమ్ ఛేంజర్స్
దేశీ స్టాక్ మార్కెట్లకు ఈ వారం దేశ, విదేశీ అంశాలు కీలకంగా నిలవనున్నాయి. నూతన సంవత్సరం తొలి రోజు యూరోపియన్, యూఎస్ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్ల యాక్టివిటీ తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక ఆటుపోట్లకు అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం ఈ వారం భారత్‌సహా యూఎస్, చైనా ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా నేడు(29న) గత నెల(నవంబర్)కు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో ఐఐపీ వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం పుంజుకుంది. 30న ఎన్ఎస్ఈ డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. 31న నవంబర్ చివరికి బడ్జెట్ లోటు వివరాలు వెల్లడికానున్నాయి. కొత్త ఏడాది తొలి రోజు వాహన విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి 2న డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ ఇండెక్స్, విదేశీ మారక నిల్వల స్థితి డేటా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురికావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా.. అంతర్జాతీయంగా చూస్తే డిసెంబర్ నెలకు చైనా తయారీ, తయారీయేతర పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. యూఎస్ తయారీ ఇండెక్స్‌తోపాటు.. అక్టోబర్ నెలకు వాణిజ్య ముందస్తు అంచనాలు విడుదలకానున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా సమావేశ వివరాలు(మినిట్స్) 31న వెల్లడికానున్నాయి. చివరి వారానికి నిరుద్యోగ క్లెయిమ్‌ల గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాల ఎఫెక్ట్ → ఈ కేలండర్ ఏడాది ముగియడానికి 3 రోజులే గడువున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) లావాదేవీలు మందగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. → డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో కొత్త సిరీస్(2026 జనవరి)కు జరిగే రోలోవర్లకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఈ వారం సైతం ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. అంచనాలు అందుకున్నప్పటికీ నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు టెక్నికల్ అంశాలు అంచనా వేసినట్లు బ్రేకవుట్ సాధించినప్పటికీ తిరిగి డీలా పడ్డాయి. అయితే చివరికి స్వల్ప లాభాలతో ముగియడం గమనార్హం! వెరసి బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్లు పుంజుకుని 85,041 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 26,042 వద్ద స్థిరపడింది.బుల్లిష్ ధోరణిలోనే.. రెండు వారాల నష్టాల ధోరణికి అడ్డుకట్టవేస్తూ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ వారం సైతం హెచ్చుతగ్గుల మధ్య బలాన్ని పుంజుకునేందుకే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,060 పాయింట్లను దాటి 26,236కు ఎగసింది. వెరసి ఈ వారం నిఫ్టీకి 25,920– 25,800 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిల నుంచి పుంజుకునేందుకు వీలుంది. ఇలా జోరందుకుంటే 26,450 పాయింట్లవరకూ బలపడే అవకాశముంది. స్వల్ప కాలంలో 27,000 పాయింట్లస్థాయికి చేరడానికీ వీలుంది. → గత వారం అంచనాలకు అనుగుణంగా సెన్సెక్స్ 85,350 పాయింట్లను దాటి 85,738కు ఎగసింది. వెరసి ఈ వారం 84,600– 84,200 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ కనిపించవచ్చు. ఇక్కడినుంచి బలపడితే.. 85,800, 86,200 పాయింట్ల గరిష్టాలను తాకవచ్చు. ఈ బాటలో సమీప కాలంలో 87,000 పాయింట్ల మైలురాయికి చేరే అవకాశముంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఫ్యామిలీ
సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండల వీరుడు సల్మాన్‌కి ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. 60లలో సైతం యువ హీరోలను కూడా వెనక్కి నెట్టి తన హ్యాండ్సమ్ లుక్, వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు బాయిజాన్. ఆయనకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తిని, కుతుహలాన్ని రేకెత్తిస్తుంటుంది. తాజాగా ఆయన చేతికుండే వెండి బ్రాస్లెట్ గురించే అందరి అటెన్షన్. అది సాధారణ బ్రాస్లెట్లా కాకుండా ఒక రత్నంతో చాలా పెద్ద బ్రాసెలెట్. అంద పెద్దిది బాయిజాన్ ఎందుకు ధరిస్తారు అనేది అందరి మదిని తొలిచ్చే సందేహం ఇది. దీని వెనుకున్న కథను సల్మానే స్వయంగా వివరించి అభిమానుల అనుమానాలకు చెక్‌పెట్టారు. అంతేగాదండోయ్ దాని ధర, ప్రాముఖ్యత రెండు అత్యంత స్పెషాల్టీనే. సికిందర్ భాయ్‌గా పిలిచే మన సల్లూ భాయ్ చేతికి ఉండే వెండి బ్రాస్లెట్ని ఎట్టిసమయంలో స్కిప్ చేయరు. ప్రతి ఫంగ్షన్లో ఆయన చేతికి అది తప్పనిసరిగా ఉంటుంది. బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా ఉన్నప్పుడూ, పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడూ ఎప్పుడు దాన్ని అస్సులు బయటకు తీయడు. దబాంగ్ వంటి చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే దాన్ని ధరించలేదు. ఆ మూవీ క్యారెక్టర్‌కి నప్పదు కాబట్లి సల్లూభాయ్‌కి తీయక తప్పలేదు. దీన్ని ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్గా పిలుస్తారట. దీని ధర దగ్గర దగ్గర రూ. 80,000/- పైనే పలుకుతుందట.అదంటే ఎందుకంత ఇష్టం..సల్మాన్‌కి ఆ బ్రాస్లెట్ అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి. దానిని మణిక్టు నుంచి తీయడం అత్యంత అరుదు. ఇది సుల్తాన్ నటుడు సల్మాన్ తండ్రి సలీంఖాన్ వద్ది ఇదే బ్రాస్లెట్ ఉండేది. తాను చిన్నప్పుడు దానితో ఆడుకునేవాడినని పంచుకున్నారు. అయితే తాను సినీఫీల్డ్‌లోకి వచ్చినప్పుడూ అచ్చం అలాంటి బ్రాస్లెట్నే బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ రాయిని ఫిరోజా అంటారు. దీనిని సజీవరాయిగా పిలుస్తారు. అయితే సల్మాన్ దీన్ని ఫ్యాషన్ కోసం కాదు, ప్రశాంతత, ఆశావాద దృక్పథన్ని ఇచ్చే సెంటిమెంట్ బ్రాస్లెట్గా విశ్వసిస్తాడు. అందువల్లే మన సల్లుభాయ్ చేతికి ఆ బ్రాస్లేకుండా అస్సలు కనిపించడు. స్పెషాల్టీ ఏంటంటే..మనపై వచ్చే ప్రతికూలతలను ఇది గ్రహిస్తుంది. ఆ తర్వాత ఇది పగిలిపోవడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు ఏడు రాళ్లు మార్చినట్లు సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. ఇది ఆకాశ నీలం-ఆకుపచ్చ షేడ్లలో ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. View this post on Instagram A post shared by Salman Khan (@salmankhanfanclub) (చదవండి: ధురంధర్ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?)
ఆ గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం..!
ఇంతవరకు అధిక జనాభా అన్న మాటలే విన్నాం. భారత్, చైనా దేశాలు అనగానే అధిక జనాభానే గుర్తుకొస్తుంది. అత్యధిక జనాభా కలిగిన దేశాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఇవే. కానీ జనాభా తగ్గిపోయినా..ఒక్కసారిగా సంతానం కనుమరుగైతే పరిస్థితి ఎంత హృదయవిదారకంగా, ఘోరంగా ఉంటుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. ఏమైందో గానీ ఒక్కసారిగా ఆ దేశంలోని గ్రామం జనాభా కుంటుపడిపోయింది..అనూహ్యంగా వృద్ధుల జనాభా పెరుగుతోంది..పాఠశాలలకు వెళ్లే చిన్నారులు లేక మూతపడేపరిస్థితికి వచ్చేశాయ్. కారణం తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఇంతకీ ఈ దారుణమైన పరిస్థితి ఎక్కడంటే..ఇటలీలోని పర్వత గ్రామమైన పగ్లియారా డీ చిన్నగ్రామమైనప్పటికీ అక్కడ నెలకొన్న పరిస్థితి ఇటలీ అంతటా ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. అక్కడ పాఠశాలలు ఖాళీగా దర్శనమిస్తాయి. కేవలం వృద్ధ జనాభానే అధికంగా కనిపిస్తుంది. అక్కడి గ్రామాలు, పట్టణాలు మనుషులు సందడి లేక వెలవెలబోయాయి. అక్కడ ఎటుచూసినా యథేచ్ఛగా తిరుగుతున్న పిల్లులు దర్శనమిస్తుంటాయి. నిజానికి ఆ గ్రామంలో దశాబ్దాలుగా జనాభా క్షీణతతో నిశబ్దం అలుముకుంది. ఆ నిశబ్దాబ్న్ని చేధిస్తున్నట్టుగా సుమారు 30 ఏళ్ల తర్వా తొలి బిడ్డ జననం..ఒక్కసారిగా ఆ గ్రామాన్ని ఆనందకేళి ముంచెత్తింది. ప్రస్తుతం ఆ చిన్నారి రాకతో ఆ గ్రామ జనాభా 20కి చేరిందట. ఆ చిన్నారి పేరు లారా బుస్సీ ట్రాబుకో. ఆమెను చూసేందుకు చుట్టపక్కల గ్రామాలతో సహ, ఇంతవరకు ఈ పగ్లియారా డీ అనే గ్రామం పేరు వినని వాళ్లు సైతం ఇక్కడకు తరలి రావడం విశేషం. అక్కడ ప్రసవాలు అరుదు కావడంతో లారా ప్రధాన ఆకర్షణగా మారింది. లారా తల్లి సిన్జియా ట్రాబుకో..తన కూతురు జననంతో మా ఊరి పేరు కూడా వార్తల్లో నిలిచిందంటూ మురిసిపోయింది. కేవలం తొమ్మిదినెలలు వయసుకే ఎంత ఫేమస్ అయ్యిందో అంటూ కూతురుని చూసి తడిసి ముద్దవుతోంది ఆ తల్లి. ఇక్కడ ఆ చిన్నారి లారా జననం అక్కడ వారిందరిలో ఆనందాన్నినింపినప్పటికీ..ఈ ఘటన ఒకరకంగా ఆక్కడ ఉన్న తీవ్రమైన జనాభా సమస్యను హైలెట్ చేసింది. జాతీయ గణాంకాల ప్రకారం..2024లో అక్కడ జననాల సంఖ్య మూడు లక్షలకు పడిపోయింది. గత 16 ఏళ్లుగా పరిస్థితి అలానే కొనసాగుతోంది. అక్కడ సంతానోత్పత్తి రేటు కూడా రికార్డు స్థాయిలో కనిష్టానికి చేరుకుంది, అలాగే మహిళలు సగటున కేవలం 1.18 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు. కారణాలు..సరైన ఉద్యోగం లేకపోవడం, యువత విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం చేసే తల్లులకు మద్ధతు లేకపోవడం..దీనికి తోడు పురుషలలో వంధ్యత్వం సమస్యలు అధికంగా ఉండటం, కొందరు జంటలు పిల్లలను వద్దనుకోవడం తదితర కారణాల రీత్యా జనాభా క్షీణిస్తుండటం మొదలైంది. 2025 నాటి జననాల సంఖ్య మరింత దారుణంగా పడిపోతూ వచ్చింది. ఇది ఒక్క పాగ్లియారా డీ మార్సిలో కనిపిస్తున్న పరిస్థితి కాదు..మొత్తం ఇటలీలోనే ఇదే పరిస్థితి. ఇది ప్రభుత్వ సేవలు, ఆర్థివ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోందట. జనాభా క్షీణించినా కూడా .. పరిస్థితి ఇంత అధ్వానన్నంగా ఉంటుందా అని అనిపిస్తోంది కదూ..!.(చదవండి: 'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..)
యాపద్బాంధవులు
ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ యాప్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి...మై సేఫ్టీపిన్క్రౌడ్ సోర్స్ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్ యాప్. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్ ట్రాకింగ్’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్ రూట్, క్విక్ అడిట్, సపోర్ట్ నెట్వర్క్, లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లాంటి కీలకమైన ఫీచర్లు ‘మై సేఫ్టీపిన్’ యాప్‌లో ఉన్నాయి.నూన్లైట్నూన్లైట్ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్ సేఫ్టీ యాప్. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా మనం ఉన్న స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్ ఆపరేటర్లను మనకు కనెక్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే... ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్‌స్క్రీన్ బటన్‌ను నొక్కాలి. సర్టిఫైడ్ ఆపరేటర్లు మనకు టెక్ట్స్ లేదా ఫోన్ కాల్ చేస్తారు. మనం ఉన్న లొకేషన్‌కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్ షేరింగ్, పీస్ ఆఫ్ మైండ్లాంటి కీలక ఫీచర్లు ‘నూన్‌లైట్’లో ఉన్నాయి.112 ఇండియా యాప్మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్...112 ఇండియా. ఇది కస్టమర్లను ఒకే నంబర్ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్ రూమ్ లేదా సమీపంలోని వాలంటీర్లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్’ ఫీచర్ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్’ సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లను అప్రమత్తం చేస్తుంది.యూ ఆర్ సేఫ్హ్యాండ్స్–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్కు ఉపయోగపడే పర్సనల్ సేఫ్టీ యాప్... యూఆర్సేఫ్. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్–ఫ్రీ ఎస్‌వోఎస్: సింగిల్ ట్యాప్ లేదా వాయిస్ కమాండ్‌తో అలర్ట్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ అండ్ స్ట్రీమింగ్: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్‌ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌తో సేఫ్టీ స్కాడ్ (మన సన్నిహిత బృందం)కి షేర్ చేస్తుంది.ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్‌ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్ చేస్తుంది. సేఫ్టీచెక్స్: లొకేషన్ బేస్డ్ సేఫ్టీ ట్రిగ్గర్స్తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్ అండ్ ఫాల్ డిటెక్షన్: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్ పంపుతుంది.విత్ యూ‘ఐయామ్ ఇన్ డేంజర్’లాంటి మెసేజ్‌ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్... ‘విత్యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్ పదేపదే రిపీట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్స్ మూమెంట్‌ను ట్రాక్ చేస్తుంది. ఫోన్ పవర్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ‘విత్యూ’ యాక్టివేట్ అవుతుంది. ‘ఐయామ్ ఇన్ డేంజర్’ ‘ఐ నీడ్ హెల్ప్’ ‘ప్లీజ్ ఫాలో మై లొకేషన్’లాంటి మెసేజ్‌లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపుతుంది.షేక్ 2 సేఫ్టీమహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్... ‘షేక్ 2 సేఫ్టీ’. ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా లేదా పవర్‌బటన్‌ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్ఎంఎస్/కాల్) పంపుతుంది. ఆఫ్‌లైన్, లాక్డ్ స్క్రీన్‌లోనూ పనిచేస్తుంది. యాప్ సెట్టింగ్స్‌లో ఎమర్జెన్సీ కాంటాక్స్‌ను యాడ్ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్‌వోఎస్ మెసేజ్‌లకు సంబంధించి సైరన్ బట్ యాడ్ చేయవచ్చు. సర్కిల్ ఆఫ్ 6మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్‌ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్ ఆఫ్ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్ వివరాల ప్రీ-ప్రోగ్రామ్డ్ ఎస్ఎంఎస్ను మన సర్కిల్‌కు పంపిస్తుంది. హాట్‌లైన్‌కు వేగంగా యాక్సెస్ అయ్యేలా చేస్తుంది. సింపుల్ ఐకాన్స్, జీపీఎస్‌ని ఉపయోగించి ‘సర్కిల్’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్ అండ్ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్డ్గా రూపొందించిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వరల్డ్ ఎమర్జెన్సీ అసోషియేషన్... టాప్ 10 ఉమెన్ సేఫ్టీ యాప్స్దిల్లీ పోలీసులు ‘హిమ్మత్ ప్లస్’ అనే ఉమెన్ సేఫ్టీ యాప్‌ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్ లొకేషన్–షేరింగ్ యాప్...లైఫ్360. లైవ్ లొకేషన్ షేరింగ్, ఎస్‌వోఎస్ అలర్ట్స్. ప్లేస్ అలార్ట్స్, రైడ్–షేర్ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్ ఎమర్జెన్సీ అసోసియేషన్’ ప్రకటించిన టాప్ 10 సేఫ్టీ యాప్‌లలో...మై సేఫ్పిన్, నూన్‌లైట్, లైఫ్ 360, యూఆర్సేఫ్ యాప్‌లతో పాటు మై ఎస్‌వోఎస్ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్ అయిన సిటిజన్, ఐయామ్ సేఫ్. గూగుల్ పర్సనల్ సేఫ్టీ, సేఫ్టీ యాప్‌లు ఉన్నాయి.అక్కలాంటి... అమ్మలాంటి యాప్ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్ లిటిల్సిస్టర్’ వారి యాప్ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్ లిటిల్ సిస్టర్ యాప్’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్’ అనే యాప్ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్‌కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్‌ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్‌లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి.
ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే
2025వ సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్నెస్ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్ ఏమిటో తెలుసుకుందాం..ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్ మెంబర్షిప్ తీసుకుని ఫిట్ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్ చేసుకుందాం.మొబైల్ ఫిట్నెస్ యాప్స్ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్నెస్ను (Fitness) ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, హార్ట్ రేట్ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్నెస్ను సొంతంగా ట్రాక్ చేసుకున్నారు.మితంగా తినే మినిమల్ ఈటింగ్ హ్యాబిట్ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ రీల్స్ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్లో మంచి మార్పులు చేసుకున్నారు.ఔట్‌డోర్ యోగా2025లో అధిక సంఖ్యాకులు ఫిట్నెస్ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ప్రజల ఫిట్నెస్ రొటీన్లో భాగమయ్యాయి.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?మార్నింగ్ వర్కవుట్స్సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.కలిసి మెలిసి..2025లో వైరల్ అయిన వాటిలో గ్రూప్ ట్రైనింగ్ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడంలో మునిగిపోయారు.
అంతర్జాతీయం
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF— Elon Musk (@elonmusk) December 26, 2025
ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో?
బంగ్లాదేశ్‌లో రాడికల్ నేత ఉస్మాన్ హాది హత్య తీవ్ర అంతర్గత సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో హింస చెలరేగింది. హిందువులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నేరస్థులు భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. భారత్ వ్యతిరేక భావజాలం ఉన్న నేతలు ప్రస్తుతం అక్కడ బలంగా ఉండడంతో పాటు ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం ఆదేశానికి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదేశానికి చెందిన కొంతమంది నేతలు ఇండియాపై కారుకూతలు కూశారు. అంతేకాకుండా ఇటీవల అక్కడ భారత వ్యతిరేక భావజాలం ఉన్న విద్యార్థి నేతల ఉస్మాన్ హాదీ హత్య తరువాత అక్కడ అలర్లు చెలరేగాయి. ఇద్దరు హిందూ యువకులను తీవ్రంగా కొట్టి కిరాతకంగా చంపారు. కాగా ఇప్పుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన వారు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు.అక్కడి అడిషనల్ కమిషనర్ నార్జూల్ ఇస్లాం మాట్లాడుతూ" ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు నేరస్థులు, మైమెన్ సింగ్ జిల్లాలోని హాలుఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోని మేఘాలయలోకి ప్రవేశించారు. అనంతరం వారిని పూరి అనే వ్యక్తి రిసీవ్ చేసుకొని, సమీ అనే ట్యాక్స్ డ్రైవర్ అక్కడి టూరా సిటిీలో దించారు." అని తెలిపారు. ఈ వివరాలను అక్కడి డైలీ స్టార్ పత్రిక ప్రచురించింది.అయితే పూరి, సమీలిద్దరినీ భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారే అనధికార సమాచారం తమకు అందిందని ఆయన తెలిపినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. నేరస్థులను బంగ్లాదేశ్ రప్పించేలా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపాయి . అయితే ఈ ఆరోపణల్ని మేఘాలయ పోలీసులు ఖండించారు. ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు భారత్‌లో ప్రవేశించలేదని తెలిపారు.బంగ్లాదేశ్ మీడియా సంస్థలు మేఘాలయ ప్రజలన భయభ్రాంతులకు గురిచేసేలా కథనాలు ప్రచురిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పూరి, సమీలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచురించారని అది కూడా పూర్తిగా అసత్య ఆరోపణలని వారు తెలిపారు
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్‌లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్‌కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు.
2026 మరింత భయానకం.. వణికిస్తున్న నోస్ట్రడామస్ జోస్యం!
ప్రముఖ ఫ్రెంచ్ భవిష్యవేత్త నోస్ట్రడామస్ రాబోయే 2026కు సంబంధించి చేసిన సంచలన అంచనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూ, అందరిలో వణుకుపుట్టిస్తున్నాయి. ‘న్యూస్ 24’ కథనం ప్రకారం నోస్ట్రడామస్ అంచనా వేసిన భయానక పరిణామాలు, ముంచుకొస్తున్న విపత్తుల వివరాల్లోకి వెళితే..2026 మధ్యకాలంలోలో మూడవ ప్రపంచ యుద్ధం?నోస్ట్రడామస్ జోస్యం ప్రకారం 2026 మధ్యకాలం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం (World War III) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అత్యంత వినాశకరంగా మారుతుందని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. మతం, జాతీయవాదం పేరుతో జనం ఒకరినొకరు చంపుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తూర్పు దేశాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం.సముద్ర యుద్ధాలు - రాజకీయ మార్పులునోస్ట్రడామస్ అంచనాల ప్రకారం.. 2026లో జరిగే భారీ నౌకాదళ ప్రమాదం లేదా సముద్ర యుద్ధం ప్రపంచాన్ని కుదిపేయనుంది. ఒక భారీ నౌక మునిగిపోవడం లేదా నౌకాదళాల మధ్య పోరు ప్రారంభమై అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగి, అగ్రరాజ్యాల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు. సముద్రంలో నౌక మునిగిన రోజున.. ఆ సముద్ర శక్తి ప్రపంచ రాజకీయాల గమనాన్ని మారుస్తుందని నోస్ట్రడామస్ తన పద్యాలలో పేర్కొన్నారు.ఆర్థిక సంక్షోభం- సామాజిక అశాంతి2026లో అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగి, సామాజిక అశాంతికి దారితీయవచ్చు. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతల పదవులు చేజారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.ప్రకృతి ప్రకోపం: తీవ్రమైన ఎండలు, వరదలుపర్యావరణ పరంగా కూడా 2026 అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోంది. నోస్ట్రడామస్ తెలిపిన వివరాల ప్రకారం తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పలు ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలతో భీకర వరదలు సంభవిస్తాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల పర్యావరణానికి, మానవజాతికి అపార నష్టం వాటిల్లుతుందని ఈ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు అంచనా వేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యంరాబోయే కాలంలో సాంకేతిక రంగంలో వచ్చే కీలక మార్పులను ఆయన ముందే ఊహించారు. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సలహాదారుగా మాత్రమే కాకుండా, నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు, అన్ని వ్యవస్థలు ఏఐ నియంత్రణలో నడిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.అణు దాడి- అంతరిక్ష కార్యక్రమాల పతనంమరో భయానక అంచనా ప్రకారం.. 2026లో అణు దాడి జరిగే అవకాశం ఉంది. ఇది మానవజాతి అంతరిక్ష పరిశోధనలపై ప్రభావం చూపనుంది. ‘మార్స్’పై చీకట్లు కమ్ముకుంటాయని, అలాగే ఒక ప్రముఖ దేశం అణు దాడికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.ఆహార ధాన్యాల ధరల పెరుగుదలనోస్ట్రడామస్ అంచనాల్లో గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కూడా ఉంది. ఆయన పద్యాల్లో నిర్దిష్టమైన తేదీలు లేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నోస్ట్రడామస్ చెప్పిన ఈ అంచనాలు చాలా వరకు అస్పష్టంగా ఉంటాయని, వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నోస్ట్రడామస్ అంచనాలకు దగ్గరగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఉన్నాయని పలువురు అంటున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో..
జాతీయం
భారతీయ వారసత్వ విశ్వరూపం
ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు. వందేమాతరం @ 150 1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్‌కాంగ్‌లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు. జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం సెపె్టంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది. దీపావళికి విశ్వ కిరీటం భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.మరాఠా కోటల ప్రపంచ రికార్డు జూలైలో పారిస్‌లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్‌గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం. మహనీయుల స్మరణఅహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సుయునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’! – సాక్షి, నేషనల్ డెస్క్
ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడాన్ని బాధితురాలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, పటిష్ట భద్రత కలి్పంచాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి విన్నవించారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష తగ్గించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమ బంధువులపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, జైలుపాలు చేశారని తెలిపారు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ధర్నాకు అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించాయి.
హదీ హంతకులు భారత్‌లోకి రాలేదు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్ఎఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్‌లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్‌లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఆ ఓటర్లను విచారణకు పిలవొద్దు
కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సందర్భంగా ‘అన్ మ్యాప్డ్’గా పేర్కొన్న ఓటర్లను ప్రస్తుతానికి విచారణకు పిలవొద్దని జిల్లా స్థాయి ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. విచారణకు రావాలంటూ వారికి అందినవన్నీ ఆటో జనరేటెడ్ నోటీసులని స్పష్టంచేసింది. 2002 నాటి ఎలక్టోరల్ రోల్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఈ గందరగోళానికి దారితీసినట్టు బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘‘వాటి పీడీఎఫ్ వెర్షన్‌ను సీఎస్వీ ఫార్మాట్‌కు మార్చే క్రమంలో బూత్ అధికారుల యాప్‌లో లింకేజీ వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. నిజానికి అన్మ్యాప్డ్గా పేర్కొన్న ఓటర్లలో చాలామంది నిజమైన ఓటర్లే. ఈ కేసులను జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించాలి. నిజంగా అవసరమని భావించిన కేసుల్లో మాత్రమే ఓటర్లకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలి’’ అని పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు
ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం
భారతదేశం, శ్రీలంక, అండోరా, మెక్సికో, నేపాల్ దేశాల శాశ్వత ప్రతినిధులతో పాటు ఇతర సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒకచోట చేరి ప్రాచీన ధ్యాన సాధనను జరుపుకున్నాయి. ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు దీని ప్రాధాన్యతను పంచుకున్నాయి.ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక రాజనీతితో సమ్మిళితం చేసిన ఒక విశేష క్షణంలో, రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గుర్తుచేసేందుకు సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యాయి. ప్రపంచ శాంతి, మానసిక శ్రేయస్సు మరియు నాయకత్వానికి ధ్యానం ఎంతగా ప్రాసంగికమవుతోందో ఈ సమావేశం మరొకసారి స్పష్టం చేసింది.“ప్రపంచ శాంతి సమరసత కోసం ధ్యానం” అనే శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేయడంతో పాటు మార్గనిర్దేశిత ధ్యానాన్ని కూడా నిర్వహించారు. భారతీయ నాగరిక వారసత్వంలో పుట్టిన ఈ సాధనను ప్రపంచంలోని అత్యంత కీలకమైన దౌత్య వేదిక కేంద్రానికి తీసుకువచ్చిన ఘట్టమిది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వక్తలు ఇదే భావనలను ప్రతిధ్వనించారు. అండోరా రాయబారి జోన్ ఫోర్నర్ రోవిరా, తన దేశ విద్యా వ్యవస్థలో ధ్యానాన్ని సమీకరించడం వల్ల విద్యార్థుల దృష్టి సామర్థ్యం భావోద్వేగ నియంత్రణ మెరుగుపడిందని తెలిపారు. మెక్సికో ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి అలీసియా గ్వాడలూపే బుయెన్‌రోస్త్రో మాసియూ, దీర్ఘకాలిక ప్రపంచ సమరసతకు అంతర్గత శాంతే పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు.నేపాల్ రాయబారి లోక్ బహాదూర్ థాపా, హిమాలయ ప్రాంతంలో ధ్యానానికి ఉన్న లోతైన నాగరిక మూలాలను ప్రస్తావిస్తూ, వాతావరణ మార్పు నుంచి తప్పుడు సమాచారం వరకు పరస్పరంగా ముడిపడిన ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనేందులో ధ్యానం పోషించే పాత్రను వివరించారు.ఈ కార్యక్రమంలో హాజరైన ఇతర ప్రముఖులు: మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. రాబర్ట్ ష్నైడర్; యోగమాత ఫౌండేషన్‌కు చెందిన యోగమాత కేకో ఐకావా;బ్రహ్మ కుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ పరిపాలనా ఆధ్యాత్మిక అధిపతి బీకే మోహిని పంజాబీ; జీవన్ విజ్ఞాన్ ఫౌండేషన్ నేపాల్‌కు చెందిన ఎల్. పి. భాను శర్మ, రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన డా. లసంత చంద్రన గూనెతిల్లేకె; భౌతిక శాస్త్రవేత్త, శాంతి కోసం శాస్త్రవేత్తల గ్లోబల్ యూనియన్ అధ్యక్షుడు మరియు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉద్యమ నాయకుడు డా. జాన్ హాగెలిన్.ఈ కార్యక్రమం ముగింపులో, గురుదేవ్ రాయబారులు, ప్రతినిధులను 20 నిమిషాల మార్గనిర్దేశిత ధ్యానంలో నడిపించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అరుదైన నిశ్శబ్ద క్షణాన్ని సృష్టిస్తూ, ప్రాచీన సంప్రదాయాల్లో పుట్టిన సాధనలు నేటి ప్రపంచ వేదికపై కూడా ఎలా కొత్త ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయో గుర్తు చేశారు.డిసెంబర్ 21న జరగనున్న ప్రపంచ ధ్యాన దినోత్సవం వైపు ప్రపంచం ముందుకు సాగుతున్న వేళ, ఈ ఉద్యమం ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పరిధిని దాటి శీర్షికల్లో నిలుస్తోంది. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ “World Meditates with Gurudev” అని ప్రకటించే బిల్లుబోర్డులతో వెలిగిపోతోంది ప్రపంచ వేదికపై ఒక భారతీయ ఆధ్యాత్మిక నాయకుడి నేతృత్వంలో జరుగుతున్న అరుదైన గ్లోబల్ ఘట్టానికి ఇది సంకేతం. న్యూయార్క్ నుంచే గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ధ్యానంలో పాల్గొంటారు.
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
క్రైమ్
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్‌కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు.
యువతి శవంతో ప్రియుడి ఇంటిముందు ఆందోళన
నారాయణఖేడ్: తమ కూతురు మృతికి ప్రేమికుడే కారణమంటూ యువతి శవంతో ప్రేమికుడి ఇంటి ముందు ఆమె కుటుంబీకులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లి మాణిక్ నాయక్ తండాలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం కడ్పల్ విఠల్ నాయక్ తండాకు చెందిన వడిత్య కావేరి (23), నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండాకు చెందిన సభావత్ శ్రీకాంత్ (24)లు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించడంతో వారు నిరాకరించారు. దీంతో ప్రేమికులు హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబా ద్ శివార్లలోని బాలాపూర్ ప్రాంతంలో కావేరి తాము నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి తమ కూతురు మృతికి ప్రేమికుడు శ్రీకాంతే కారణమంటూ మాణిక్ తండాలోని అతని ఇంటి ముందు కావేరి మృతదేహంతో ఆందోళనకు దిగారు.ఆదివారం ఉదయం వరకు వారు అక్కడే బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకుని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రెండు తండాలకు చెందిన పెద్దలు, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కావేరి అంత్యక్రియలను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు నిర్వహించేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
ప్రాణాలు తీసిన సరదా
కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్ కాలుజారి కుంటలో పడిపోయాడు. కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేకపోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు. ఇంటర్ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్ మర్రిగూడెం హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
నేరాలపై ఉక్కుపాదం: కోరుట్ల పోలీసుల ఏడాది రికార్డు
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు ప్రజల ప్రశంసలు పొందారు. అలాగే 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. వాటిలో రూ.1.72 కోట్ల నగదు తిరిగి బాధితులకు అందజేశారు. న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. అలాగే ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో 11 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల నిర్వహించి రాష్ట్రంలోనే జగిత్యాల రెండో జిల్లాగా నిలిచింది. జగిత్యాలక్రైం: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే 5.05శాతం నేరాలు తగ్గాయి. 2024లో 5,620 నేరాలు నమోదు కాగా.. 2025లో 5,919 నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి 229 కేసులు, (5.05 శాతం) తగ్గాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 770 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో 135 నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 29 హత్య కేసులు నమోదు కాగా.. వీటిలో కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.381 దొంగతనాలు381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా.. వాటిలో 187 కేసులను చేధించి రూ.22,92,37,439 విలువైన ఆస్తి (69.85 శాతం)ని రికవరీ చేశారు. 104 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి. జిల్లాలో 19 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులను, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.30,62,036 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9,290 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ.. మృతుల సంఖ్య తగ్గింది. మాదక ద్రవ్యాలపై 86 కేసులుమాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 86 కేసుల్లో 203 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. 75 హిస్టరీ, 33 రౌడీషీట్ కేసులుతరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై 75 హిస్టరీ షీట్లు ఓపెన్ చేశా రు. హత్య కేసుల్లో పాల్గొన్న వారిపై 33 రౌడీ షీట్లు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. డయల్ 100కు 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసుల్లో 54 మందిని అరెస్ట్ చేశారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 11లో భాగంగా 11 కార్యక్రమాలు నిర్వహించి 76 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎన్నికల్లో 21 కేసులుఇటీవల జిల్లాలో రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశారు. 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి రూ.180,800 విలువైన 199.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలుహన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న సోదాలు చేపట్టారు. శ్రీనివాస్‌పై ఆదాయానికి మించి ఆస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 6న జిల్లా రవాణా శాఖ అధికారి బానోవత్ భద్రునాయక్, ఆయన డ్రైవర్ అరవింద్ జేసీబీ వాహనానికి పొల్యుషన్, ఇన్సూరెన్స్ లేదని యజమానిని బెదిరించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. సదరు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వీడియోలు
అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి
ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్
టీటీడీ భూములు ప్రైవేట్ హోటల్స్ కు అప్పగింత బాబుపై శ్రీనివాసానంద సరస్వతి ఫైర్
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
కడప రెడ్డెమ్మ పైసా వసూల్..!
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
రూ. 1000 కోట్లకు ప్లాన్ చేసిన.. రజినీకాంత్ జైలర్ 2
అసలు నీకు బుర్ర ఉందా? బీటెక్ రవిని ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

