breaking news
Amaravati
-
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
-
టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !
-
అమరావతి కోసం మళ్ళీ భారీ అప్పు
విజయవాడ అమరావతి కోసం మళ్లీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. నాబార్డ్ ద్వారా రూ. 7,387 కోట్లు అప్పు చేసింది. APCRDAకి నాబార్డ్ రుణం రూ.7,387.70 కోట్లు పొందేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అమరావతి కోసం ఇప్పటికే 40 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో అప్పుకు సిద్ధమైంది. తాజా రుణంతో కలిసి అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. 47 వేల కోట్లను దాటనుంది. -
‘అమరావతి బిల్లు’ వెనక్కి!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అమరావతి’ని ఏపీ రాజధానిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా.. కేంద్రం ఏమైనా మెలిక పెడుతోందా.. నిధుల ప్రశ్న తలెత్తుతోందా.. వీటన్నింటికీ రాజకీయ విశ్లేషకులు ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చిందంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2014 నుంచి ఏపీ రాజధానిగా ‘అమరావతి’ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను కేంద్రం వెనక్కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2024ను పరిగణనలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయ పరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్‌తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్‌ను వెనక్కు పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. నోటిఫికేషన్ ఫైల్ వెనక్కు రావడంతో న్యాయ పరమైన చిక్కులను తొలగించుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్లు మారింది. రాజధానిపై కేంద్రం ప్రశ్నలురాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ‘అమరావతి’కి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ‘అమరావతి’ని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది. ‘పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ‘హైదరాబాద్’ రాజధానిగా ఉంది కదా? ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014’లో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2024 నుంచి రాజధానిగా ‘అమరావతి’కి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందు పరిచింది. ఇందులోని సబ్ సెక్షన్ 2లో.. ‘విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుంది’ అని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్ సెక్షన్ 3లో కేంద్రం పేర్కొంది. నోటిఫికేషన్ వెనక్కు?ఈ సందర్భంగా న్యాయ, చట్టపరమైన చిక్కులను అధిగవిుంచే సూచనలతో రావాలని నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్5(2)లో ‘అమరావతి’ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం ఆశ పడింది. కేంద్రం ఆమోదించి, వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయ పరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. ఈ అంశంపై ‘సాక్షి’ ఇద్దరు ఎంపీలను ఆరా తీయగా.. సమయం వచ్చినప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తుందంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఎలా ముందుకు వెళితే బావుంటుందో సూచించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలిసింది. -
మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
సాక్షి,అమరావతి: రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్) సమావేశంలో ఆయన మంత్రుల పని తీరు, శాఖల నిర్వహణ, కేంద్ర నిధుల సమీకరణపై స్పందించారు. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు. -
రెండో దశ భూ సమీకరణ నిలిపివేయాలి
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): రాజధాని అమరావతి పేరిట రెండో విడత భూ సమీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం పదే పదే దగా చేస్తోందని మండిపడింది. తొలుత భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘అమరావతి భూ సమీకరణ 2.0’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమరావతి రైతు నాయకులు గద్దె తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. మళ్లీ రెండో విడత పేరుతో భూములు తీసుకోవాలని నిర్ణయించడం దారుణమన్నారు. 24 ప్లాట్ఫారాలతో రైల్వేస్టేషన్ కడతానంటున్నారని.. నిజంగా అంత పెద్ద రైల్వేస్టేషన్ అవసరమా? అని ప్రశి్నంచారు. చంద్రబాబు పగటి కలలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని నిలదీశారు. ఎప్పుడు నిర్మిస్తారో తెలియని ఔటర్ రింగ్ రోడ్‌కు ఇప్పుడు భూ సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు.భూ సమీకరణ జీవో చెల్లదు! ఔటర్ రింగ్ రోడ్ అంటూ ప్రజలను మోసం చేసి భూములు తీసుకుంటున్నారని ప్రొఫెసర్ రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో వెనుక వారి ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులకు ఇచ్చిన హామీలన్నీ పెద్ద మోసాలన్నారు. రైతులకు విద్య, వైద్యం అందించాలని ల్యాండ్ పూలింగ్ జీవో చెబుతున్నప్పటికీ అవేవీ కల్పించలేదన్నారు. సమీకరణపై తెచ్చిన జీవో చెల్లదని, దీనిని కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.అన్‌స్టాపబుల్‌గా భూ సమీకరణ.. అమరావతి అన్‌స్టాపబుల్ అని చెబుతున్న చంద్రబాబు.. భూ సమీకరణ కూడా అన్‌స్టాపబుల్‌గా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సచివాలయాన్ని రెండేళ్లు, పార్లమెంట్‌ను మూడేళ్లలో పూర్తి చేశారని.. కానీ మన రాజధాని మాత్రం టీవీ సీరియల్లా సాగుతోందని ఎద్దేవా చేశారు. ఒక ప్రాంతంలోనే అంతా ఖర్చు చేస్తున్నారని రాయలసీమలో అలజడి మొదలైందని హెచ్చరించారు. సామాజిక కార్యకర్త వసుంధర మాట్లాడుతూ.. రెండో విడత భూ సమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. అమరావతి మున్సిపాలిటీగా కాదు.. పంచాయతీగా మిగిలిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో సీపీఐ నేత అక్కినేని వనజ, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, అమరావతి రైతులు ఎం.రవి, రఘునాథ్, గన్నవరం ఎయిర్‌పోర్టు బాధితులు వేదవతి, శ్రీధర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు పోలారి, తదితరులు పాల్గొన్నారు. రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారా?ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగులుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చంద్రబాబూ.. రైతులను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారా? లేదా అవమానించాలని అనుకుంటున్నారా? అమరావతి రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. – బుచ్చి తిరుపతిరావు, అమరావతి రైతు చంద్రబాబుకు ప్రణాళిక లేదు చంద్రబాబు అమరావతి రైతులను పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రమంతా భూ సమీకరణ చేస్తాడు. అసలు చంద్రబాబుకు ప్రణాళిక లేదు. అమరావతి రైతులంతా కలిసి చంద్రబాబు మెడలు వంచాలి. – రాజేంద్రప్రసాద్, రైతు -
సర్వం భవ్యం.. అనామక సంస్థకు పెద్దపీట
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన, అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలను కాదని అతి చిన్న, ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతుండటం నివ్వెర పరుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్‌కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన 108, 104ల నిర్వహణ కాంట్రాక్ట్‌ను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతటితో ఆగకుండా బరితెగించి ఇతరత్రా శాఖల్లో సైతం కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెట్టి.. మీకింత–మాకింత అంటూ కమీషన్లు దండుకుంటున్నారని స్పష్టమవుతోంది. పశు సంవర్థక శాఖలో పశు సంచార వైద్య సేవలు, ఏపీ జెన్కో ఆస్పత్రుల నిర్వహణ, తదితర కాంట్రాక్టుల ద్వారా ఊరూ, పేరు లేని సంస్థకు ఏకంగా రూ.3,025 కోట్ల విలువై కాంట్రాక్టులు అప్పగించడం దుమారం రేపుతోంది. తద్వారా ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టులను ఓ సాధనంగా మలుచుకున్నారనడానికి ఈ వ్యవహారమే ఓ ఉదాహరణ. తస్మదీయ కాంట్రాక్టర్‌కు పొగబెట్టి.. గతేడాది చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తస్మదీయ కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్‌కు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో నిబంధనలు మార్చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అత్యవసర వైద్య సేవల కల్పన కోసం టెండర్లు పిలిచినప్పుడు అంబులెన్స్‌లు /ఎంఎంయూ /తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సంచార వైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు ఉంటాయి.భవ్యకు మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌లు నిర్వహించిన అనుభవం ఉందనే కారణంతో ఈ నిబంధనను టెండర్ మార్గదర్శకాల్లో చేర్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టెండర్ నిబంధనలన్నింటినీ భవ్యకు అనుకూలంగా మార్చేశారు. దీంతో టెండర్లలో పాల్గొన్నా ఏదో ఒక సాకుతో బిడ్లను తిరస్కరిస్తారని గ్రహించడంతో దేశంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు కనీసం బిడ్లు కూడా వేయలేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు విజయవంతంగా భవ్యకు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టేశారు. ఐదేళ్ల కాల పరిమితితో 731 అంబులెన్స్‌ల నిర్వహణను రూ.1,100 కోట్లతో, 904 ఎంఎంయూలకు రూ.675 కోట్లు, ఎంఎంయూల్లో వైద్య పరీక్షలకు రూ.810 కోట్లు, కాల్ సెంటర్ నిర్వహణకు రూ.129 కోట్ల చొప్పున మొత్తం రూ.2,714 కోట్ల కాంట్రాక్ట్‌ను భవ్య కైవసం చేసుకుంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షల నిర్వహణకు వైద్య శాఖ పైలెట్ నిర్వహిస్తోంది. త్వరలో వైద్య పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ అట! అరంబిందోను వెళ్లగొట్టాక.. ఎన్నడూ లేనట్లుగా 108, 104తో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నిర్వహణకు ఒకే టెండర్‌ను పిలిచారు. అత్యవసర వైద్యసేవల్లో విశేష అనుభవం ఉన్న పెద్దపెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొంటే భవ్య సంస్థకు కాంట్రాక్ట్ దక్కదనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ చర్యలతో పోటీ, పారదర్శకత లేకుండా పోయింది. తర్వాత 768 అంబులెన్స్‌లు, 904 మొబైల్ మెడికల్ యూనిట్లతో పాటు, వందకుపైగా సీట్లతో కాల్‌సెంటర్ నిర్వహించే అతిపెద్ద కాంట్రాక్ట్‌ను ఏ రాష్ట్రంలోనూ పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం లేని భవ్య హెల్త్ సర్వీసెస్‌కు అప్పగించారు.క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పేరుతో టెక్నికల్ ప్రజంటేషన్‌కు 80, ఫైనాన్షియల్ బిడ్‌కు 20 మార్కులు కేటాయించి భవ్యకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 340 సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి కోసం 1962 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్ గడువు గతేడాదితో ముగిసింది. దీంతో రూ.200 కోట్లకు పైగా అంచనాలతో ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నూతన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి టెండర్లు పిలిచారు. భవ్యకే కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం టెండర్ నిబంధనలన్నింటినీ మార్చేశారు. ఎంత తేడా? ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్ స్పెషలిస్ట్ డాక్లర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు రూ.1,700 ఇస్తే చాలన్నాయి. కానీ తక్కువ నిధులు కోట్ చేసిన సంస్థలను కాదని భవ్యకు రూ.100 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టేయడం దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం మంగంపేటలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హెల్త్ సెంటర్ కాంట్రాక్టును కూడా ఇదే భవ్యకే అప్పగించేశారు. తద్వారా ఐదేళ్లకు రూ.11.70 కోట్లు దండుకోనుంది. నిబంధనల ఉల్లంఘన ఇలా. ➤108, 104 నిర్వహణతో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అంటూ లింక్ పెట్టి పెద్ద సంస్థలు పోటీకి రాకుండా చేశారు. ➤సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలకు సంబంధించి గతంలో టెండర్లలో పాల్గొనే సంస్థల టర్నోవర్ 50 శాతం ఉండాలని నిబంధన ఉండేది. దీన్ని 17 శాతానికి తగ్గించేశారు. నెట్‌వర్త్ విలువ 35 శాతం నుంచి 11 శాతానికి కుదించారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎంఎస్ఎంఈలకు బిడ్ సెక్యురిటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ➤రాష్ట్రానికి చెందిన సంస్థలకు 5 మార్కులు, ఐదేళ్ల అనుభవం కలిగిన కంపెనీలకు మరో 5 మార్కులు, ప్రజంటేషన్‌కు 30 మార్కులు అంటూ భవ్యకు అనుకూలంగా నిబంధనలు మార్చేశారు.➤ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి రూ.వంద కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జెన్కో టెండర్ పిలిచింది. ఒకే టెండర్లో హైడల్, థర్మల్‌కు వేర్వేరుగా బిడ్ దాఖలు చేయాలని పేర్కొంది. దీంతో పలు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. మార్చిలో మరోసారి టెండర్లు పిలిచి వాటిని కూడా రద్దు చేశారు. మూడోసారి టెండర్ పిలిచి జూలైలో ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి టీడీపీలోని డాక్టర్ పవన్‌కు చెందిన భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేలా నిబంధనలు మార్చేశారు.➤మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. కానీ మూడోసారి అవేవీ లేవు. పైగా భవ్య కంటే తక్కువ ఖర్చుతో సేవలందిస్తామన్న యశోద హాస్పిటల్‌పై అనర్హత వేటు వేసి పక్కకు తప్పించారు. అందుకు విచిత్ర కారణం చెప్పారు. జెన్కో ఆసుపత్రుల నిర్వహణను చూసే సంస్థ ఏదైనా ఆసుపత్రితో ఒప్పందం చేసుకోవాలని నిబంధన పెట్టారు. సొంత సంపద వృద్ధి కోసం సంపద సృష్టిస్తాం.. పంచి పెడతాం.. అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు సొంత సంపద సృష్టి కోసం నిరంతరం తపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును.. 108, 104 కాంట్రాక్ట్‌లలో వీలైనంత దోపిడీ చేయడానికి పూనుకున్నారు. ధరల పెరుగుదలను సాకుగా చూపి సంస్థకు చెల్లించే నిధులను ఏటా 3 శాతం పెంచి ఖజానాకు గండి కొడుతున్నారు. ఇదంతా ఆయన సొంత సంపద వృద్ధి కోసమేనని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వమే 104, 108 వాహనాల్లో ఔషధాలు, పరికరాలు, ఇతర అవసరమైన వాటిని అందిస్తుంది. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ఐటీ, ఇతర సదుపాయాల ఖర్చు తిరిగి చెల్లింపుతో పాటు సేవల్లో అలసత్వం చూపినా మూడు నెలల పాటు జరిమానాలు విధించకుండా ఉండేలా నిబంధనలు మార్చారు.మరోవైపు మొత్తం పెనాల్టి.. కేపిటల్ విలువ మీద 10 శాతానికి మించొద్దనే షరతు విధించారు. అత్యవసర సేవల్లో వేగం, పారదర్శకత, అలసత్వం కట్టడికి.. ప్రజలు, ప్రభుత్వానికి పకడ్బందీగా మేలు చేసేలా కాకుండా, కాంట్రాక్టర్‌కు లాభాలు వచి్చపడేలా ప్రభుత్వమే నిబంధనలు రూపొందించింది. తద్వారా మళ్లించిన నిధులన్నీ అస్మదీయ సంస్థ ద్వారా తమ చేతుల్లోకి వచ్చేలా ప్రభుత్వ పెద్దలు మార్గం ఏర్పాటు చేసుకున్నారని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్ పాలనలో పారదర్శకత, పోటీనే ప్రామాణికం2019కి ముందు చంద్రబాబు ‘108’ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే వైఎస్ జగన్ మళ్లీ వాటిని బలోపేతం చేశారు. 2019 వరకు 336 వాహనాలతో అంబులెన్స్ సేవలు అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒకటి కూడా లేని దుస్థితి. వైఎస్ జగన్ సర్కారు ఏడాదిలోపే 412 అంబులెన్స్‌లు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న వీటిని ప్రారంభించారు. 26 నవజాత శిశు (నియోనాటల్) అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు చేరింది. ఇందుకు మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్‌లో రూ.4.76 కోట్లతో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. అలా 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగిన పాత వాహనాల స్థానంలో 146 కొత్త అంబులెన్సులనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అత్యవసర సేవల బలోపేతం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మందికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. నేరుగా ప్రభుత్వమే అత్యాధునిక వసతులతో కొత్త అంబులెన్స్‌లు, ఎంఎంయూలు కొనుగోలు చేశారు. తద్వారా ఏ రాష్ట్రంలోనూ లేని అతిపెద్ద అత్యవసర, సంచార వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేశారు.దేశంలోనే దిగ్గజ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచి పోటీ పెంచారు. సేవల నిర్వహణకు పిలిచిన టెండర్లలోనూ అత్యంత పారదర్శక విధానాలు పాటించారు. అనేక వడపోతల అనంతరం చాలా తక్కువ ఫైనాన్షియల్ బిడ్ కోట్ చేసిన సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించారు. సేవల్లో అలసత్వం వహించిన సందర్భాల్లో భారీగా పెనాల్టీలు విధించేలా నిబంధనలు పెట్టి నిర్వహణ సంస్థలో జవాబుదారీతనం పెంచారు. -
Vadde Sobhanadreeswara: నీ పగటి కలల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు
-
‘చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు’
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల కోసం గంపమట్టివేయలేదని సీపీఎం జాతీయ నాయకులు గఫూర్ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప వేరే అజెండా ఏమీ లేదని మండిపడ్డారు. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నావని, చేసింది మాత్రం ఏమీ లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు రోజు ఉపన్యాసాలు చేస్తుంటావు కాని ఆలూరులో రోడ్ల పరిస్థితి ఒకసారి చూడు. జిల్లాల సమగ్రాభివృద్ధికి కొరకు నంద్యాల జిల్లా చేశారు వైఎస్ జగన్. అదే విదంగా చంద్రబాబు ఆదోని జిల్లా చేయాలి. కర్నాటక ప్రభుత్వం ఆంధ్ర నీళ్ళను జల దోపిడీ చేస్తున్నా.. చంద్రబాబుకు పట్టదు. చంద్రబాబు వేదవతి ప్రాజెక్టు కోసం ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు. చంద్రబాబు పోలవరం ,అమరావతి తప్ప వేరే అజెండా పట్టదు’ అని మండిపడ్డారు. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్‌లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్‌ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్‌ను వైజాగ్‌లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్‌లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్‌ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ 53 వేల ఎకరాలకే దిక్కులేదు..
అధికారంలో ఉంటే చంద్రబాబుకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? నేషనల్ హైవేలు కిలోమీటర్‌కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నీ స్కాములు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు రైతుల నుంచి ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు వెనుకాడటం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని.. సింగపూర్, గింగపూర్ ఎక్కడికి పోవాలో.. మన దగ్గర నుంచే ఏదైనా కానీ.. మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డప్ చేస్తున్నానని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు. ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత? రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్ల రూపాయలు కావాలని సినిమా చూపిస్తూ రూ.5 వేల కోట్లు పెట్టాడు. మళ్లీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.’ అని చెప్పారు.స్కాముల కోసమే అది చాలదంటున్నారు‘ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8 వేల ఎకరాలు మిగిలిందని, దాంతోనే రాజధాని అయిపోతుందని చెప్పాడు. మళ్లీ ఈ రోజు అది చాలదంటున్నాడు. అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలు కిలోమీటర్‌కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ జరిగేది ఒక్కటే... ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ పక్కన భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరే చోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు. వేసే రోడ్లు ఏవో వీళ్ల మనుషులకు ప్లాట్లు ఇచ్చిన చోట వేసుకుంటారు’ అని చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న అవినీతి కేసులు తీసేయించుకుంటున్నారన్న ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి’ జగన్ అన్నారు. -
ముంబైతో అమరావతి పోటీ నవ్వకండి..సీరియస్ మ్యాటర్
-
రాజధాని కోసం మరో 20 వేల ఎకరాలు.. రెండో విడత భూ సమీకరణ
-
రాజధానిలో రెండో విడత భూసమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడతలో 20,494.87 ఎకరాల భూసమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల్లో 16,562.56 ఎకరాలు పట్టా, 104.01 ఎకరాల అసైన్డ్ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరించనుంది. మంత్రుల బృందం(జీవోఎం) 21వ సమావేశం మినిట్స్ ప్రకారం ఆ భూములను ఏపీ సీఆర్డీఏ చట్టం సెక్షన్–55(2) ప్రకారం రైతుల నుంచి సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలతోపాటు 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్డీఏ కమిషనర్ సమీకరించనున్నారు. అంటే.. రెండో విడత భూసమీకరణలో మొత్తం 20,494.87 ఎకరాల భూమిని సీఆర్డీఏ సమీకరించనుంది. రాజధానిలో రెండో విడత భూసమీకరణకు జూన్ 24న రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తొలుత గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 11 గ్రామాల్లో 44,676.44 ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.తొలుత ఏడు గ్రామాల పరిధిలో 20,494.87 ఎకరాల సమీకరణకు గత నెల 28న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడత భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు జూలై 1న జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం పేర్కొంది. భూసమీకరణ ఇలా...ప్రస్తుతం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పట్టాభూమి 1,965 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1,395.48 ఎకరాలు, పెదమద్దూరులో పట్టా భూమి 1,018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, యండ్రాయిలో పట్టా భూమి 1,879 ఎకరాలు, అసైన్డ్ భూమి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, కర్లపూడి లేమల్లెలో పట్టా భూమి 2,603 ఎకరాలు, అసైన్డ్ భూమి 51 ఎకరాలు, ప్రభుత్వ భూమి 290.75 ఎకరాలను సమీకరిస్తారు.అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పట్టా భూమి 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72, ప్రభుత్వ భూమి 168.86, హరిశ్చంద్రాపురంలో పట్టా భూమి 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 977.87 ఎకరాలు, పెదపరిమిలో పట్టా భూమి 5,886.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 627.34 ఎకరాలను సమీకరిస్తారు. -
అమరావతి నాడు ఇంటర్నేషనల్.. నేడు.. మున్సిపాల్టీ!
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిలో అత్యద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తానంటూ 2014 నుంచి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చే వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే నమ్మబలికారు! కానీ ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ వితండ వాదనకు తెరతీశారు. నాడు ఇంటర్నేషనల్ సిటీ అంటూ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు మున్సిపాల్టీ అంటూ బీద అరుపులు అరవడమేమిటని మేధావులే కాదు.. రాజధాని రైతులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాడే ఈ మాట చెప్పి ఉంటే.. అసలు రాజధానికి భూములు ఇచ్చేవాళ్లమే కాదని రైతులు మండిపడుతున్నారు. భూములిచ్చి 11 ఏళ్లవుతున్నా.. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు రెండో విడత అంటూ 20,494.87 ఎకరాల భూసమీకరణకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు రగిలిపోతున్నారు. రెండో విడతలో సమీకరించే భూములను ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో తక్కువ ధరకు బినామీలు, సన్నిహితులకు కట్టబెట్టేసి.. ఇప్పటికే తొలి విడతలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..?సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానంటూ 2014లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధాని ఏర్పాటుపై బినామీలు, సన్నిహితులకు లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భారీ ఎత్తున భూములు కాజేశారు. ఆ తర్వాత రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ) రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రచించారు. ఆ పరిధిలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియం ‘సుర్బానా–జురాంగ్’లకు రూ.28.96 కోట్లు చెల్లించి 2015–16లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో రాష్ట్రానికి అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ నాడు చంద్రబాబు నమ్మబలికారు. మన ఇంజనీర్ల మాస్టర్ ప్లాన్‌తో నిర్మిస్తే అవి మురికివాడలుగా మారుతాయంటూ మన రాష్ట్ర, దేశ ఇంజనీర్లను అప్పట్లో అవమానించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో 53,748 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు 2014 నుంచి చెబుతూ వచ్చారు. తాజాగా 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది అంటూ కాడి పారేశారు! అంటే.. మరి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధాని విషయంలోనూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ దాగుడుమూతలాడుతున్నారని మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్‌కు రాజధాని ముసుగు..!ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న 53,748 ఎకరాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఇతర అవసరాలు పోనూ ప్రభుత్వం వద్ద ఇంకా 8,274 ఎకరాలు మిగులు భూమి ఉందని 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబే వెల్లడించారు. ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీతోపాటు స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు ఆ భూమి సరిపోతుందని నిపుణులు, రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో సమీకరించిన భూముల్లోనే ఇప్పటికీ రాజధాని పనులు ప్రాథమిక దశ దాటలేదని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు నేటికీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఆ పనులను 2036 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకుకు చెబుతోందని పేర్కొంటున్నారు. రాజధాని నిర్మించడమంటే నగరం నిర్మించడం కాదని.. పరిపాలన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని.. ఆ తర్వాత తనకు తానుగానే నగరంగా రూపుదిద్దుకుంటుందని.. హైదరాబాద్ అందుకు నిదర్శనమని నిపుణులు స్పష్టం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలు, సన్నిహితులతో కలిసి కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారని విశ్లేషిస్తున్నారు.ఐఎంజీ భారత్, బిల్లీ రావు తరహా బినామీలను ముందు పెట్టి.. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధి ముసుగులో ఊరూ పేరులేని ఐఎంజీ భారత్ అనే సంస్థ ముసుగులో బిల్లీరావుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలు, శంషాబాద్‌కు సమీపంలో 450 ఎకరాలు కేటాయించేశారు. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో స్టేడియంలు, క్రీడా మైదానాలను బిల్లీరావుకు 45 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేసి వాటి నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. నాడు చంద్రబాబు భూకుంభకోణానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చెక్ పడింది. ఇప్పుడు అదే రీతిలో అమరావతిలో మరో భూకుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. రాజధాని తొలి విడత, రెండో విడతలో సమీకరించే భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పేరుతో 5 వేల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు పేరుతో మరో 2,500 ఎకరాలను బిల్లీరావు లాంటి సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనకా తప్పడం లేదు.చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.మొంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.దారుణంగా పడిపోయిన ధరలు:మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్‌కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. -
అమరావతికి రెండో విడత భూ సమీకరణ
సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్డీఏ(CRDA) కమిషనర్‌కు అప్పగించింది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది.రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన సీఎం చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు.మరోవైపు, మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను అథఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా.. పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం పిల్లలను వేధిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ గత ఏడాదిన్నరకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తరువాత చేతులు ఎత్తేసింది. ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఎనిమిది క్వార్టర్ల ఫీజుల డబ్బులు రూ.5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో రూ.2,200 కోట్లతో కలిపి ఏకంగా రూ.7,800 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా, పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. తేలికగా ఎగ్గొట్టవచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాలో కాకుండా, తాము కాలేజీల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. ఉన్నత విద్యలో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి ఐదేళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్‌లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. అనంతరం అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు సుమారు ఎనిమిది క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేసింది. ప్రభుత్వ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల నిలుపుదల.. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే గానీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమనే పరిస్థితికి ఉన్నత విద్య దిగజారిపోయింది. చివరికి ప్రభుత్వ వర్సిటీలు సైతం ఇదే బాటలో పయనిస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపేశాయి. సర్కారు బాధ్యతారాహిత్యానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విలువైన ఉద్యోగ అవకాశాలు, పీజీ విద్య సీట్లను కోల్పోతున్న దుస్థితి దాపురించింది. ఎంటెక్, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 2014–19లో టీడీపీ హయాంలో 16.73 లక్షల మంది విద్యార్థులకు బకాయి పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం పలికి ఆర్నెల్లకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామంటూ కళాశాలలను, విద్యార్థులను నిలువునా ముంచేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కళాశాలలు.. రాష్ట్రవ్యాప్తంగా 230కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు, 1,250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కనీ్వనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి బోధిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు సుమారు రూ.7,800 వేల కోట్ల చెల్లింపులు నిలిపివేయడంతో నిర్వహణ భారాన్ని భరించలేక అటు కాలేజీలు ఇటు విద్యార్థులు ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. వసతి దీవెనకు మంగళం.. పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు హాస్టల్ మెయింటెనెన్స్ (వసతిదీవెన) ద్వారా ఆరి్థక సాయం అందించి ఆదుకున్నారు. భోజన, వసతి ఖర్చుల కోసం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫీజులను నీరుగార్చగా.. వసతి దీవెనను ఏకంగా ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు ఎగ్గొట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చే అంశాన్ని పక్కన పడేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్య అభ్యసిస్తున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు బృందం నమ్మబలికింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టింది. విద్యకు లోటు బడ్జెట్ఒక్కో విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయింపులు చూపించి నిధులు మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. అదే వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ఫీజుల కోసం రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు సైతం చెల్లించింది. కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు నిశ్చింతగా చదువుకునేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన కోసమే ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. ‘ఎక్స్’లో ట్వీట్ల పిట్టలా లోకేశ్! ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ స్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం.. అంటూ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్ నుంచి మొదలు కాగా ఈ ఏడాది నవంబర్ వచి్చనా బకాయిలు చెల్లించకపోవడంతో కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్ అక్టోబర్ చివరిలో కంటి తుడుపుగా విదిల్చారు. పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం రూ.60 వేలు ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారం పంపించింది. తమకు రీయింబర్స్మెంట్ జమ కానందున ఫీజులు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.కదిరిలోని ఎస్ఎంజేఎల్ డిగ్రీ కాలేజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. కొందరు బాలికలను చదువు మానిపించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నపరెడ్డి గారి గంగిరెడ్డి సొంతూరు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లె కొత్తపల్లి. ఆయన కుమార్తె గౌరీప్రియ రాజంపేటలో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసి కాలేజీలో చెల్లించారు. రెండో ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని వాపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి బీటెక్ ఎలాంటి ఆర్థిక ఆటంకాలు లేకుండా పూర్తయిందని గుర్తు చేసుకుంటున్నారు. ఎంబీఏ పూర్తయి ఏడాదిన్నర.. రామచంద్రపురం కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశా. ఫీజు చెల్లించలేదని సరి్టఫికెట్లు ఇవ్వడంలేదు. రూ.48,500 వరకు కట్టాలని చెబుతున్నారు. నాన్న ఇటుక బట్టీలో కార్మికుడు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా – ఎస్.గంగరాజు, సందిపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించా మా కుమార్తె తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతోంది. ఇప్పటి వరకు ఫీజు రీయిబర్స్‌మెంట్ అందలేదు. కళాశాల యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక బంగారు నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాం. నా భర్త చనిపోయారు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా. – సుభద్రమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతిమానసికంగా కుంగిపోతున్నా.. కర్నూలు జీఎన్ఎంలో నర్సింగ్ మూడో ఏడాది చదువుతున్నా. గతంలో మా అమ్మ ఖాతాలో జగనన్న విద్యా దీవెన సకాలంలో జమయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమకాలేదు. పెండింగ్ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఇంట్లో ఫీజులు అడగలేక.. కాలేజీలో ఒత్తిళ్లు తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నా. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. – కె.సురేష్, నర్సింగ్ విద్యార్థిసి.బెళగల్ మండలం, ముడుమూల మా పీక పట్టుకుంటుంది.. మా అబ్బాయి కార్తికేయ భీమిలి మండలంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో ఏడాది చదువుతున్నాడు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఒక క్వార్టర్ ఫీజు మాత్రమే జమ చేసింది. అప్పటికే కళాశాల యాజమాన్యం రూ.20 వేలు చొప్పున వసూలు చేసింది. జిరాక్స్ షాపుపై ఆధారపడి జీవిస్తున్న నేను అతి కష్టం మీద ఆ డబ్బులు కట్టా. లేదంటే సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వబోమంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందనే కాలేజీలో చేర్చాం. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే యాజమాన్యం మా పీక పట్టుకుంటుంది. – గంటా రాజు, భీమిలి మండలం సకాలంలో ఇస్తే మాకీ అవస్థలుండవు నా కుమారుడు హుసేన్ అమీద్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. మాకు ఎలాంటి చర, స్థిర ఆస్తులు లేవు. చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఏటా ప్రభుత్వం సకాలంలో ఫీజులు జమ చేస్తే మాకీ అవస్థలు ఉండవు. – హుసేన్‌బీ, విద్యార్థి తల్లి, పాములపాడు, నంద్యాల జిల్లాచిల్లి గవ్వ ఇవ్వలేదు.. నా కుమారుడు రోషన్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కళాశాలలో ఫీజు కట్టకపోతే పంపొద్దు అంటూ బెదిరిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం సాయం చేస్తుందనే ధైర్యంతో ఉన్నత విద్యలో చేరి్పంచాం. – బాబు, విద్యార్థి తండ్రి, చిత్తూరుమదనపల్లె సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్న విజయ్‌బాబుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ చదివిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి జూన్‌లో రూ.25 వేలతో మొదటి ఏడాది ఫీజు కట్టారు. ఉన్నత చదువులు చదవాలని ఆశతో ప్రభుత్వాన్ని నమ్ముకుని ఎంబీఏలో చేరితే తన పరిస్థితి తల్లకిందులైందని.. రెండో ఏడాదీ ఫీజు తానే కట్టుకోక తప్పదని విజయ్‌బాబు వాపోతున్నాడు. -
లక్ష ఎకరాల పంట భూముల్లో అవినీతి పునాదులపై అమరావతి..!
-
అవినీతి పునాదులపై అమరావతి
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే ఎల్లో మీడియా వంశీకుడు. నిజమే కదా, ఎవరున్నారక్కడ? 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములిచ్చి జీవనాధారం కోల్పోయి, ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న త్యాగరాజుల కుటుంబాలు తప్ప! సర్కారిచ్చే ప్లాట్లు అమ్ముకుంటే గదా వారికి బ్యాంకులతో పని. ఆ భూము లపై ఆధారపడి పొట్టబోసుకున్న వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయో? భూసేకరణ ఫలితంగా సుమారు లక్ష కుటుంబాలు భుక్తిని కోల్పోయిన ఇచ్చోటనే నిన్న (శుక్రవారం) అమరావతి ఆర్థిక నగరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్య భాగస్వామి కావటం మూలాన ఆయనకు ఆనందం కలిగించే విధంగానే కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాదులో ఆయన స్థాపించిన ఆర్థిక నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ, ఇది కూడా అలాగే అభివృద్ధి సాధించాలనీ ఆమె ఆకాంక్షించారు. హైదరా బాదులో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’కి 2004 నవంబర్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని ఉజ్జ్వల ప్రస్థానం ప్రారంభమైంది. ‘క్రెడిట్ చౌర్యం’ అనేది బాబు బలహీనత. ఆ బలహీనతలో భాగంగా ఐటీ విప్లవం దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మాణం దాకా అనేక చరిత్రాత్మక ఘట్టాలు ఆయన ఖాతాలో చేరిపోతుంటాయి. అసలైన సమాచారం కంటే నకిలీ సమాచారమే ఎక్కువగా అందుబాటులో ఉన్నందువల్ల కేంద్ర మంత్రి కూడా పొరపాటు పడి ఉండవచ్చు. బౌద్ధ తాత్వికుడు, రసాయన శాస్త్ర పితామహుడైన ఆచార్య నాగార్జునుని పేరును కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం వాడైన నాగార్జునుని గురించి టిబెట్ విద్యార్థులకు కూడా తెలుసన్న సంగతిని తాను అక్కడికి వెళ్లినప్పుడు గమనించానని ఆమె చెప్పారు. దేవతల రాజధానయిన అమరావతిని అల నుంచి ఇలకు దించిన అపర భగీరథుడి గురించి కూడా ప్రపంచ ప్రజలకు తెలుసని ఆమె చెప్పకపోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ‘స్కిల్ కుంభకోణం’ కేసులో చంద్రబాబు అరెస్టయి నప్పుడు 55 దేశాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేశారని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రభావం అంతో ఇంతో ఉంటుందేమోననే అను మానం సహజం.అట్టి దేవతల రాజధాని అమరావతికి ఇప్పుడున్న 54 వేల ఎకరాలు సరిపోవని, అర్జెంటుగా ఇంకో 20 వేల పైచిలుకు ఎకరాల భూముల సమీకరణకు సర్కార్ సైరన్ మోగించింది. ఇంతటితో ఆగదట! ఇంకో పాతిక వేల ఎకరాల కోసం మూడో రౌండ్ సమీకరణ కూడా సిద్ధంగా ఉన్నదని విశ్వసనీయ సమా చారం. ఏతావతా రాజధాని పేరుతో లక్ష ఎకరాల సారవంత మైన పంట భూమికి సర్కార్ టెండర్ పెట్టింది. ఇప్పుడీ లక్ష ఎకరాల్లో నివసించడానికి లక్షల సంఖ్యలో నర నారీ జనసందోహం ఎక్కడ నుంచి వెల్లువెత్తి రావాలి? ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేసే వారు లేదా ప్రైవేటు కంపెనీలు వస్తే వాటిలో పని చేసేవారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ మోడల్లో కార్పొరేట్ రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అద్దెలు గాని, అమ్మకాలు గాని మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువు కోవడానికి ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు పెట్టబో తున్నారు? ప్రైవేట్ విద్యాసంస్థలకు భూ పందేరాలు చేయడం తప్ప, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వగైరా ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తాయి. విజయ వాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి అన్ని వసతు లున్న పట్టణ ప్రాంతాలు చేరువలో ఉండగా అమరావతిలోనే ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పడు తుందో చెప్పడం కష్టం. నాలుగొందల ముప్పయ్యేళ్ల్ల కిందట గోల్కొండ రాజైన ఖులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తూ ‘‘సముద్రాన్ని చేప లతో నింపినట్టు ఈ నగరం కూడా ప్రజలతో నిండి ఉండేట్టు ఆశీర్వదించమ’’ని అర్థించాడు. తాను మహారాజు గనుక ఆదే శాలు జారీ చేసినంత మాత్రాన ప్రజలు నివసించబోరనీ, సరైన ఉపాధి, నివాసయోగ్య పరిస్థితులు ఏర్పడితేనే నగరం అభివృద్ధి చెందుతుందనీ గ్రహింపు ఉన్నవాడు కనుకే అటువంటి పరిస్థితు లను కల్పించాలని అల్లాను అభ్యర్థించాడు. అప్పటికే గోల్కొండ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రమైనప్పటికీ దైవంపైనే ఖులీ భారం వేశాడు. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అటువంటి నివాసయోగ్య పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ముఖ్యం.గాంధీనగర్‌ను గుజరాత్ రాజధానిగా నిర్మించి 50 ఏళ్లు దాటినా అది ఇప్పటికీ అహ్మదాబాద్ నీడలోంచి బయటకు రాలేదు. మహానగరంగా మారలేదు. భువనేశ్వర్ ఇప్పటికీ కటక్ కొంగు పట్టుకునే నడుస్తున్నది. నయా రాయ్‌పూర్ కథ కూడా అంతే! మలేసియా రాజధానిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ‘పుత్రజయ’ ఇప్పటికీ కౌలాలంపూర్‌కు అనుబంధ నగరమే. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజన్’ వంటి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం వేరు, అది రాజధాని నగరమే కావాలను కోవడం వేరని నిపుణులు చెబుతున్నారు. ‘గ్రోత్ ఇంజన్’గా అభి వృద్ధి చెందడానికి మానవ సంకల్పంతో పాటు కొన్ని సహజమైన అనుకూలతలు కూడా ఆ నగరానికి ఒనగూడి ఉండాలి. అటువంటి అనుకూలతలు అమరావతితో పోల్చితే విశాఖపట్నానికి దండిగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నది. విశాఖను ‘గ్రోత్ఇంజన్’గా మార్చుకొని, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలంటే లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపా యల అప్పు అవసరం లేదు.ఒక రాష్ట్రానికి గాని, దేశానికి గాని అభివృద్ధి ప్రణాళికలను రచించే ముందు ఆ ప్రాంత బలాబలాలను గమనంలోకి తీసు కుంటారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్‌కున్న సహజ బలాల్లో మూడు ముఖ్యమైనవి – ఒకటి సముద్రతీరం, రెండు వ్యవసాయ రంగ మయితే, మూడోది బహుళ పట్టణ వ్యవస్థ. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా 15 ప్రగతిశీలమైన పట్టణాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించి, దృష్టి పెడితే విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలకుతోడు మరో 10 పట్టణాలు ఒక్కోటి పది లక్షల జనాభాకు ఉపాధినీ, ఆశ్రయాన్నీ ఇవ్వ గలవు. అమరావతి కోసం ఇప్పుడు సేకరించిన భూమే రాజ ధాని అవసరాలకు సమృద్ధిగా సరిపోతుంది. మరింత భూసేక రణ, మరింత రుణ సేకరణ వంటి వృథా ప్రయాసలు తప్పు తాయి. పట్టణీకరణ నిపుణులు చెబుతున్న మాటలివి. ప్రతి పక్షాల విమర్శలు కావు.రాజధాని అప్పులు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసింది. రాజధాని కోసం 40 వేల కోట్లు చేశారు. మొదటి దశలోని 53 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి 77 వేల కోట్లు కావాలని చంద్ర బాబు స్వయంగా అన్నారు. ఇప్పుడిది లక్ష ఎకరాలకు మారింది. ఇంకెంత కావాలి? కేవలం రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రెండు కోట్ల చొప్పున లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని నిర్మాణ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, ఇతర అవస రాల కోసం ఇంకో లక్ష కోట్లు. మొత్తం మూడు లక్షల కోట్ల అప్పును ఎక్కడ తెస్తారు? దానిని ఎవరి నెత్తిన రుద్దుతారు? రాజధానితో సంబంధం లేకుండా ఏడాదిన్నరలోనే రెండు లక్షల కోట్లు దాటిన మిగతా అప్పు ఐదేళ్లలో ఎంత కావాలి? ఈ భార మంతా ఎవరు మోయాలి? ప్రజలే కదా! అమరావతిని రాజ ధానిగా కొనసాగిస్తూనే, సింగిల్ గ్రోత్ ఇంజన్ మోడల్ (విశాఖ), మల్టిపుల్ గ్రోత్ ఇంజన్ల మోడల్ (డజన్ నగరాలు) వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, లక్ష ఎకరాలు, మూడు లక్షల కోట్లు, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో రిస్కులతో కూడిన బాటలోనే పయనించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారో కనిపెట్టడం కష్టసాధ్యం కాదు.నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తిన వార్తలు విన్నాము. కానీ నగరంలోంచి నీళ్లను నదిలోకి ఎత్తిపోసే విడ్డూ రాన్ని మనం కేవలం అమరావతిలోనే చూస్తున్నామని ఒక నిపు ణుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నదులకైనా, వాగులువంకలకైనా వాటి సహజ ప్రవాహ గతి వాటికి ఉంటుంది. కృత్రి మంగా దారి మళ్లింపు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాటి సహజ మార్గాలను వెతుక్కుంటూ, బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాము. కొండవీటి వాగు కృష్ణలో కలిసే సహజ మార్గంలో మహానగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని వరద నీటి ఎత్తిపోత అనే రిస్కును తలకెత్తుకోవడానికి కారణం నిధుల ఎత్తిపోత అనే మహద్భాగ్య అవకాశమేనని వస్తున్న విమర్శలను కాదనగలరా? రాజధాని నగరంలో నిర్మాణాలకు చదరపు అడుగుకు తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎంత వైభవోపేతంగా కట్టినా నాలుగున్నర వేలు దాటదని నిర్మాణరంగంవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆరు వరుసల జాతీయ రహదారులను నిర్మించడానికి ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ కిలోమీటర్‌కు 25 కోట్లు ఖర్చు పెడుతున్నదట! మన అమరావతిలో దాన్ని 53 కోట్లుగా డిసైడ్ చేశారు. ఇటువంటి అవినీతి వ్యవహారాల మీద ‘సాక్షి’ మీడియాలో సవివరంగా కథ నాలు వచ్చినా, నిపుణులు ఎందరో సోషల్ మీడియా వేదికపై గొంతు విప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. అంటే, అందులో ఖండించడానికి ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన ప్రభుత్వం అప్పులు తెచ్చి రాజధాని కోసం మూడు లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో సగభాగం కైంకర్యాలకే సరిపోతుందన్నమాట! బలమైన ఆధా రాలు, అనుమానాలతో వస్తున్న ఈ విమర్శకు ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది కనుకనే పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నదని జనం నమ్ముతున్నారు.పాలక కూటమి కార్యకర్తలు, ఛోటానేతలు కూడా రాజధాని అవినీతిని నమ్ముతున్నారు. అందువల్లనే క్షేత్రస్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. ‘‘మంత్రిగారి కొడుక్కి నీ మీద మనసైంది. రా వచ్చెయ్’’మంటూ ఒంటరి మహిళలకు మంత్రిగార్ల పీఏలు బరితెగించి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఛోటామోటా నాయ కులు నిరుపేద హాస్టల్ బాలికలను నిర్జన ప్రదేశాలకు లాక్కెళ్తు న్నారు. ‘‘నీ ఉద్యోగం మాకు కావాలి, నువ్వు రాజీనామా చేసెయ్’’ అంటూ బలహీనవర్గాల చిరు మహిళా ఉద్యోగులను జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కీచక పర్వాలను సృష్టిస్తున్నారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, పేకాట మాఫియా చెలరేగిపోతున్నాయంటూ ఒక పోలీస్ హోమ్ గార్డ్ నిస్సహాయ ఆవేదనతో ఎస్పీకి పంపిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విధి నిర్వహణ కోసం అక్రమార్కుల ఆచూకీ తీస్తే లాఠీలతో తొక్కి చంపుతామన్నారట! తన పై అధికారులు కూడా ఈ మాఫియా ముఠాలకు భయపడుతున్నారని ఆ హోంగార్డు ఆవేదన వెలిబుచ్చారు. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.ఇక సాధారణ పరిపాలనను చాప చుట్టేశారు. ‘ఓన్లీ అమరా వతి’! ఇదే సర్కారు వారి తిరుమంత్రం! గిట్టుబాటు ధరల్లేక, రవాణా ఖర్చులు కూడా రాని దుఃస్థితిలో పంట పొలాలను దున్నేస్తున్న రైతుల కన్నీటి గాథలు అన్ని ప్రాంతాల్లోనూ వినిపి స్తున్నాయి. ధాన్యం సేకరణ మాట అటుంచి దాచుకునేందుకు గోనె సంచుల్ని కూడా అందివ్వలేని జుగుప్సాకరమైన పరిస్థి తుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మార్కెట్లో ఏ పంటకూ మద్దతు ధర దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్కవ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వయంత్రాంగం నిస్తేజంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జన జీవితం గాలిలో దీపం. కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్లు దిష్టి పెట్టారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారట! ఇక ఆ రైతాంగం ఆయనకు సమస్యల గురించి ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఏం చెబు తారో? న్యూయార్క్, లండన్ నగరాలు మన అమరావతికి దిష్టి పెట్టాయని ఆయన అనకుండా ఉండుగాక!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Ambati: రాజధాని పేరిట భారీ కుట్ర మరో 20 వేల ఎకరాలు స్వాహా!
-
బాబు భూదాహం.. ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్
-
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
మూడో దశ ల్యాండ్ పూలింగ్‌కు వెళ్తాం
సాక్షి, అమరావతి: రాజధానిలో మూడో దశ ల్యాండ్ పూలింగ్‌కు కచ్చితంగా వెళ్తామని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఎంత భూమి సేకరించాలన్నదానిపై వర్కవుట్ చేస్తున్నామన్నారు. కనీసం మరో 20వేల నుంచి 25వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రెండో విడతలో ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, రైల్వేట్రాక్, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు.వీటితోపాటు 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉందన్నారు. రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవనస్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అమరావతి రాజధానిలో భూముల రేట్లు పెరగాలన్నా, గ్రోత్ రేటు పెరగాలన్నా కచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు ఉండాలన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లేనిదే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. రెండో దశలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు సమీకరిస్తున్నామని చెప్పారు. గతంలోని నిబంధనలే వర్తింపు...ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చే రైతులకు గతంలో ఇచ్చిన విధంగానే నిబంధనలు వర్తిస్తాయని నారాయణ చెప్పారు. జరీబు భూములు ఇచ్చిన వారికి నివాస ప్లాటు కింద 1,000 చదరపు గజాలు, వాణిజ్య ప్లాటు కింద 450 చదరపు గజాలు, మెట్ట భూములు ఇచ్చిన వారికి నివాస ప్లాట్ కింద 1,000చదరపు గజాలు, వాణిజ్య ప్లాట్ కింద 250 చదరపు గజాలు కేటాయిస్తామన్నారు. కౌలు కూడా గతంలో మాదిరిగానే చెల్లిస్తామని, పెంచే ఆలోచన లేదని నారాయణ తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పంపించిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు కేటాయించగా, ఒలింపిక్స్ వంటి ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించే స్థాయిలో ఈ సిటీని తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం 2,500 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం నిర్ణయించారని నారాయణ వెల్లడించారు. అందుకోసమే స్పోర్ట్స్ సిటికీ భూ కేటాయింపులు పెంచుతున్నామన్నారు. గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చామన్నారు. కొన్నిచోట్ల ప్లాట్ల కేటాయింపుపై ఉన్న సమస్యలు నెల రోజుల్లో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. గ్రామ కంఠాల విషయంలో ఎవరికైనా పొరపాటున ఎక్కువ భూమి ఇచ్చి ఉంటే మళ్లీ వెనక్కి తీసుకుంటామని మంత్రి చెప్పారు. మరోవైపు అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తుందని తెలిపారు. -
మరో 20,494.57 ఎకరాల సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభించి రైతుల నుంచి భూమి తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరో 3,828 ఎకరాల అసైన్డ్, పోరంబోకు భూమిని రాజధాని కోసం తీసుకోనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన భూములను సమీకరణలో తీసుకుంటామని, ఇందులో భాగంగా దేవదాయ, వక్ఫ్ భూములున్నా నిబంధనల మేరకు తీసుకుంటామని స్పష్టం చేశారు.⇒ ధాన్యం సేకరణ కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం.⇒ ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలపై సోలార్ రూఫ్ టాప్ కోసం నాబార్డు నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో డిస్కమ్‌లు రూ.3,762.26 కోట్లు రుణం పొందేందుకు ఆమోదం.⇒ రాష్ట్ర నూర్ బాషా, దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను రద్దు చేసి ఏపీ నూర్ బాషా, దూదేకుల కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటుకు ఆమోదం. ⇒ పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు ఆమోదం. పట్టణ స్థానిక సంస్థల్లో రెగ్యులేషన్, డిస్ప్లే కంట్రోల్ డివైజెస్ ఏర్పాటు. నిర్మాణ సమయంలో ఖాళీ భూమిపై పన్ను మినహాయింపు కోసం మునిసిపాలిటీల చట్టం 1965, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం 1955సవరణలకు ఆమోదం.⇒ ఒడిశా పవర్ కన్సార్షియంకు రెండు ప్రాజెక్టులు కేటాయిపు. ⇒ భారత్ నెట్లో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం.⇒ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ బలోపేతంలో భాగంగా 16 పోస్టులు డిప్యుటేషన్/కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకానికి ఆమోదం.⇒ పోలవరం పనులకు రూ.542.85కోట్లతో పరిపాలన అనుమతి. ⇒ గతేడాది జూన్ 15 వరకు తెల్లపేపర్‌పై అగ్రిమెంట్ చేసుకున్న చిన్న, సామాన్య రైతుల భూముల లావాదేవీల క్రమబద్ధీకరణకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించేందుకు చట్ట సవరణలకు ఆమోదం.⇒ తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఎకరా రూ.2.5 కోట్ల విలువైన భూమి ఉచితంగా స్పోర్ట్స్ అథారిటీకి బదిలీ చేసేందుకు ఆమోదం. ⇒ ఇతర రాష్ట్రాలలో మరణించిన వారి వారసత్వ వ్యవసాయ ఆస్తుల బదిలీ విషయంలో విభజన డీడ్లపై స్టాంప్ డ్యూటీని నిర్దేశిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం.అమరావతి రైతులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు!మంత్రులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యరాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు పూర్తి సంతృప్తిగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. -
44వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించే దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భూ దాహం తీరడం లేదు. మలి విడతలో తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోని 11 గ్రామాల పరిధిలో 44,676.74 ఎకరాల భూమిని సమీకరించే దిశగా అడుగులు వేశారు. గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు. మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి.. మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచి్చంది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ పదేపదే చెబుతూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలీటిగా మిగిలి పోతుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే– మలి విడత భూ సమీకరణ తప్పదంటూ గురువారం రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఇందుకు రైతులు సహకరించకపోతే అమరావతి చిన్న మున్సిపాలీటిగా మిగులుతుందని అన్నారు.మూడో విడత కూడా ఖాయం ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్లో రెండో విడత తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిలో రైతులకు చెందిన 16,666.57 ఎకరాల పట్టా భూమి, మరో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి వెరసి.. 20,494.57 ఎకరాల భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. మిగతా నాలుగు గ్రామాల్లో (మొతడక, తాడికొండ, కంతేరు, కాజా) 24,182.17 ఎకరాలను మూడో విడతలో సమీకరించడం ఖాయమని అధికార వర్గాలు తెలిపాయి. భూ సమీకరణ మూడో విడత కూడా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేయడం దీన్ని బలపరుస్తోంది. మొత్తంమ్మీద 98,424.74 ఎకరాలలో రాజధాని నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టమవుతోంది. అందుకయ్యే వ్యయాన్ని అప్పుగా తెచి్చ.. రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని ఆరి్థక నిపుణులు తేగిసి చెబుతున్నారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఏమాత్రం కాదన్నది మలి విడత భూ సమీకరణతోనే స్పష్టమైందని చెబుతున్నారు. మిగిలిందన్న 8,250 ఎకరాల మాటేంటి? గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు 2015లో ప్రభుత్వం సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కలి్పంచేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు భూములు లేవని చెప్పడంపై రైతులే విస్తుపోతున్నారు. ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లోనే.. రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని గత ఏప్రిల్ 16న 16వ ఆరి్థక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.1.50 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676.74 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి మరో రూ.1.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధానా.. రియల్ ఎస్టేట్ వెంచరా? చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందా.. లేక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వ్యాపారం చేస్తోందా.. అని ఆరి్థక రంగ నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజ«దాని నిర్మాణంపై దృష్టి సారించకుండా.. మలి విడత భూ సమీకరణకు సిద్ధమవ్వడం ఏమిటని నిలదీస్తున్నారు. పదేళ్ల క్రితం రాజధానికి భూములు ఇచి్చన రైతులకు ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని.. అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి18 నెలలైనా, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రాజధాని రైతులు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ఈ స్థితిలో మలి విడతగా 44,676.74 ఎకరాల సమీకరణకు సిద్ధమవడంపై అటు రైతులు, ఇటు ఆర్థిక వేత్తలు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.భూముల ధరలు పెంచుకోవడం, కమీషన్లే లక్ష్యం రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం మలి విడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలను నిపుణులు, అధికార వర్గాల వారు ఎత్తిచూపుతున్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక (నిధులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోకుండా) లేకుండా రాజధాని ప్రాంతంలో 2016–19 మధ్య రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఈ పనుల కోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్లను అప్పు తెచ్చింది. కానీ.. ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే 2019 మే నాటికి వ్యయం చేసింది. ఆ పనులు పూర్తి కావాలంటే రూ.28,047.82 కోట్లు కావాలి. ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. 2018–19 ధరలతో పోలి్చతే.. పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరల్లో పెద్దగా మార్పులేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105% పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు, ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి రూ.7,500 కోట్లు, ఏపీఎస్పీసీఎల్ నుంచి రూ.1,500 కోట్లు వెరసి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే రూ.61 వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. రాజధాని కామధేనువు కాదు.. అప్పులకుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది పెరుమాళ్లకెరుక! రాజధాని నిర్మాణ పనులు రూ.62 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించి.. అందులో పది శాతం అంటే రూ.6,200 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పేసి నీకింత–నాకింత అంటూ పెద్దలు పంచుకుతిన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2014–19 మధ్య రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుంచి పెద్దల తరఫున కమీషన్లు వసూలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికిపోయిన అధికారికే ఇప్పుడూ అదే బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అటు తమ భూముల ధరలు పెంచుకోవడం, ఇటు నిర్మాణ పనుల్లో కమీషన్లు కాజేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇటీవల జపిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 5వేల ఎకరాలు, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణాన్ని సమీప వ్యక్తులకు కట్టబెట్టి.. కమీషన్లు దండుకునేందుకు వ్యూహం సిద్ధమైందని సమాచారం. -
అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ
సాక్షి, విజయవాడ: అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో రైతుల నుంచి 50 వేల ఎకరాల సమీకరణ చేపట్టగా.. ఇప్పుడు రెండో దశలో మరో 20 వేల ఎకరాలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.అమరావతి కోసం రైతుల నుంచి 50వేల ఎకరాల భూమి సేకరణ చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16వేల ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించింది. ఇప్పుడు రెండో విడత సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలను సేకరించనుంది. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను సీఆర్డీఏ విడుదల చేయనుంది. -
అధికార దుర్వినియోగంతో చంద్రబాబు కేసుల మాఫీ
సాక్షి, తాడేపల్లి: గతంలో వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆ కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దోచుకున్నారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేసింది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారు. అధికారులను బెదిరించి కేసులను విత్ డ్రా చేయిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రివిలేజ్ ఫీజు విషయంలో వేల కోట్లు ఖజానాకు రాకుండా చేశారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి👉ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేసి తమవారి భూములు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఫైబర్ నెట్ లో రూ.350 కోట్లు అవకతవకలు చేశారు. సీఐడీ కూడా ఆధారాలతో పట్టుకుంది. అసైన్డ్ భూముల కుంభకోణంతో పేదల పొట్ట కొట్టారు. రూ.4,239 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేతలు కొట్టేశారు. రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూడా కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది.. 👉.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే 13 చోట్ల నోట్ ఫైల్ మీద సంతకాలు పెట్టారు. రూ.372 కోట్లు కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎం హోదాలో బెదిరించి అధికారులను బెదిరించి కేసులు విత్ డ్రా చేయిస్తున్నారు👉ప్రశ్నిస్తానన్న పవన్ ఈ కేసులపై ఎందుకు ప్రశ్నించటం లేదు?. పవన్ వలన దమ్మిడి లాభం లేనప్పుడు విమానాల్లో తిరగటం ఎందుకు?. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టించుకోవటం ఎందుకు?. అవినీతి, అరాచకాలను ప్రశ్నించలేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు పవన్?👉తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలను చంద్రబాబు తీశారు. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు అద్భుతంగా పని చేసింది. అలాంటి వ్యక్తిని విచారణ పేరుతో సీఐడీ వేధిస్తోంది. 👉ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పదంగా చనిపోతే మా పార్టీ వారి మీద దారుణమైన ఆరోపణలు చేశారు👉రాజధానిలో దారుణమైన అవినీతి జరుగుతోంది. వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. నేషనల్ హైవేల కంటే ఎక్కువ ధరకు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారుపశ్చిమ ప్రకాశంలో తాగు, సాగు నీరు లేక జనం అల్లాడిపోతుంటే చంద్రబాబుకు కనపడటం లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ వెలిగొండ ప్రాజెక్టును తీసుకువస్తే దాన్ని కూడా చంద్రబాబు ముందుకు పోనివ్వటం లేదు. టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. నీళ్లు ఇస్తామంటూ నిధులు తోడుకుంటున్నారు. రూ.17 కోట్లు దోచుకున్నారు. ఇలాంటివి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలో నే అట్టడుగున ఉంది. దాన్నిబట్టే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారాయన. -
భూములు ఇవ్వాల్సిందే..! తేల్చేసిన బాబు.. ఆందోళనలో అమరావతి రైతులు
-
భూములు ఇవ్వకపోతే..! అమరావతి రైతులకు బాబు బెదిరింపులు
-
బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తుపానుకు యెమెన్ దేశం ‘దిత్వా’(అక్కడి ప్రసిద్ధ జలాశయం దిత్వా లగూన్ పేరు మీద)గా నామకరణం చేసినట్లు పేర్కొంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని తెలిపింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకు కదులుతోందని వెల్లడించింది. ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. కాగా, ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి తుపాను నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ధాన్యం తడవకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ధాన్యం తడిచిపోయి.. తక్కువ ధరకు రైతులు బయట విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ఆదేశించారు. -
ధాన్యం.. దళారుల భోజ్యం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం ఆరబోసిన దృశ్యం చంద్రబాబు క్యాబినెట్‌లోని మంత్రి పార్థసారథిని అవాక్కయ్యేలా చేసింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంబాడు గ్రామం నుంచి పామర్రు సెంటరు–గుడివాడ వెళ్లే రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాలన్నీ రోడ్లపై ధాన్యాన్ని పోసి పగలంతా ఆరబెట్టుకోవడం.. రాత్రి అయితే అక్కడే చలిలో కాపలా ఉండటం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు 75 కిలోల బస్తాను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న దుస్థితి. బుధవారం ఈ రహదారిలో వెళ్తున్న మంత్రి పార్థసారథి రోడ్లపై ధాన్యాన్ని చూసి కారు దిగేసరికి.. అన్నదాతలు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలు చేయట్లేదని, రంగు మారిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని వాపోయారు. మంత్రి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోంథా తుపానుతో అతలాకుతలమైన ధాన్యం రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం డబుల్ గేమ్ అడుతోంది.. ఓ వైపు నష్టపోయిన రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోగా, ఇప్పుడు అంతంత మాత్రంగా చేతికందిన పంటను కొనుగోలు చేయడంలో దళారులకు మేలు జరిగేలా అంతర్గతంగా సహకరిస్తోంది.. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి.. నిర్దయగా తిరస్కరిస్తోంది.. గోనె సంచులు లేవు.. టార్పాలిన్లు లేవు.. రవాణా వాహనాలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి రైతులు ధాన్యాన్ని అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర కూడా లేదు.. ఈ దళారీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటని అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ధాన్యం సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసింది. రెండు మూడు గ్రామాలకు ఒక దళారి చొప్పున అప్పగించి, అందినకాడికి దోచుకోమని పచ్చ జెండా ఊపింది. సంచులు, లారీలు, ధర విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచి్చంది. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న వారు అతి తక్కువ ధరకు అడుగుతుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకు అమ్ముకోవడం తప్ప అన్నదాతలకు మరో మార్గం లేకుండా చేసింది. రైతు నేరుగా మిల్లులోకి ప్రవేశించే పరిస్థితి లేకుండా కుతంత్రం సాగిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ దశలోనూ ప్రభుత్వ పర్యవేక్షణ అన్నదే లేదు. ధాన్యం కొనాలనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు సర్కార్ కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కలి్పంచకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల దందాకు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా ముంచేస్తోంది. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు ఖరీఫ్‌లో ధాన్యం కోతలు ఊపందుకున్నా, మరోవైపు కొనుగోళ్లు మాత్రం ముందుకు కదలట్లేదు. ఇటీవల వరుస వాయు గుండాలు, మోంథా తుపాన్ రైతులను తీవ్రంగా దెబ్బ తీశాయి. మిగిలిన అరకొర పంటలను చేజిక్కించుకున్నా, అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు ఉత్సవ కేంద్రాలుగా మారాయి. కనీసం పంట పట్టుబడికి గోనె సంచులూ సమకూర్చలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోయింది. ఫలితంగా రోజుల తరబడి రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఎత్తుకోవడం.. లేదా దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం తప్ప మరో దారి కనిపించట్లేదు. దళారుల దోపిడీ పర్వంచంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ రైతులకు మద్దతు ధర అందించిన పాపాన పోలేదు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ పర్వానికి తెరతీసి వేడుక చూస్తోంది. పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా, దళారుల అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా పంట పొలం నుంచి మిల్లులకు చేరే పరిస్థితి లేదు. పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా, నిరాశే ఎదురవుతోంది. రోజుల తరబడి షెడ్యూల్ ఇవ్వక పోవడం, గోనె సంచులు సమకూర్చక పోవడంతో కోసిన పంటను నిల్వ చేసుకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఒకవేళ పట్టుబడి చేసినా రోజుల తరబడి లోడు మిల్లులకు చేరట్లేదు. అదే, దళారులు చెప్పిన రేటుకు ధాన్యాన్ని ఇస్తే మాత్రం క్షణాల్లో తరలించేస్తున్నారు. ఫలితంగా రైతులు 75 కిలోల బస్తాను రూ.400–500 తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే, సాధారణ రకానికి రూ.1,777, ఏ–గ్రేడ్‌కు రూ.1,792 మద్దతు ధర ఉంటే.. దళారులు ఇచ్చేది రూ.1,200–1,300 మాత్రమే. ఆరు కోట్ల గోనె సంచులు ఎక్కడ?ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు ఏకంగా 7,53,000 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో రైతులకు పంట పట్టుబడికి మాత్రం సంచులు దొరకట్లేదు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మరో వైపు 30 వేలకు పైగా రవాణా వాహనాలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా, లోడింగ్‌కు మాత్రం కనీసం ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇదిలా ఉండగా, ఇటీవల పౌర సరఫరాల సంస్థ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కాంట్రాక్టును, వాటి సాఫ్ట్‌వేర్‌ను ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు ఒకే సంస్థ పరిధిలో అన్ని రకాల జీపీఎస్ డివైజ్న్లను అనుసంధానం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా చాలా చోట్ల జీపీఎస్‌లు పనిచేయక పోవడంతో లారీల్లో లోడింగ్‌కు ముందుకు రావట్లేదు. బ్యాంకు గ్యారంటీలు కట్టని మిల్లర్లు ప్రభుత్వం 3,013 రైతు భరోసా కేంద్రాలు, 2,061 పీపీసీ (పీఏసీఎస్)ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు చెబుతోంది. కానీ, చాలా చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కులో భాగంగా కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించేలా పరోక్షంగా కుట్ర చేస్తున్నారు. అంటే.. ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనకపోగా.. దళారులతో కలిసి రైతులను దోపిడీ చేస్తూ.. మళ్లీ అదే దళారీ, రైతు పేరుతోనే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకుని లాభపడేలా దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మిల్లర్లు రూ.3 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 50 శాతం కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మిల్లులకు ధాన్యాన్ని తరలించలేక అధికార యంత్రాంగం చేతులు ఎత్తేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పెట్టగానే.. ధాన్యం కొంటామంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, రైతు నేరుగా కొనుగోలు కేంద్రానికి వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. తేమ.. తూకంలోనూ మోసం! మోంథా తుపాన్ దెబ్బతిన్న పంటను కోత కోయించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఎకరానికి రూ.4 వేలు పెట్టి మిషన్ల ద్వారా కోతలు కోయిస్తున్నారు. కోసిన పంటను కోసినట్టు అమ్ముకుందామంటే ప్రభుత్వం 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిరాకరిస్తోంది. ప్రభుత్వం రైతులకు పంట ఒబ్బిడికి టార్పాలిన్లు ఇవ్వకపోగా, తేమ శాతం పేరుతో కొనుగోలుకు నిరాకరిస్తోంది. రంగుమారిన ధాన్యాన్నీ కొనడం లేదు. దీనికి తోడు గోనె సంచికి రెండు కిలోల బరువు కట్టి, అంతే మొత్తాన్ని రైతుల ధాన్యంలో నుంచి లాగేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో సుమారు 81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పింది. అయితే తుపాను, ఇతర కారణాల వల్ల అంత దిగుబడి రాలేదు. ఇప్పటిదాకా 7.19 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుపాను వస్తేనే పరదాలు ఇస్తారట! ఈ రైతు పేరు ఆరుమళ్ల రాజశేఖర్‌రెడ్డి. కృష్ణా జిల్లా పామర్రు గ్రామం. సొంత పొలం మూడెకరాలు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. ప్రస్తుతం మిషన్ సహాయంతో రెండు ఎకరాలు నూరి్పడి చేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు 25–27 బస్తాలే వస్తోంది. పంటను ఆరబెట్టుకునేందుకు పరదాలు (టార్పాలిన్లు) కావాలని ఆర్బీకేకు వెళ్లి అడిగాడు. ‘ప్రస్తుతం పరదాలు ఇచ్చేది లేదు.. తుపాను వస్తేనే ఇస్తాం’ అని చెప్పారని వాపోయాడు. గోనె సంచులైతే చిరిగిపోయినవి ఇస్తున్నారని, కష్టపడి పంటను ఆరబెట్టుకుంటే లోడింగ్‌కు లారీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువకు రేటు కడదామని చూస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన ఎస్ సత్యనారాయణ ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల మోంథా తుపాను వల్ల పొలం నీట మునిగి పోవడంతో నష్టపోయాడు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి మళ్లీ తుపాను హెచ్చరిక రావడంతో భయంతో కోతలు ప్రారంభించాడు. అధిక వ్యయంతో యంత్రాలతో కోతలు నిర్వహిస్తే ఎకరాకు 33 బస్తాల ధాన్యమే దిగుబడి వచి్చంది. మద్దతు ధర దక్కడం గగనంగా మారింది. పొలాల వద్దకు వచ్చే వ్యాపారులు 75 కిలోల బస్తా రూ.1,300కే అడుగుతున్నారు. విక్రయించేందుకు సిద్ధమైనా సిండికేట్‌గా ఏర్పడి కొనుగోలు చేయకుండా మరింత తక్కువ రేటు కడదామని చూస్తున్నారని వాపోయాడు. ధాన్యం ఎవరికి అమ్మాలి? గత నెలలో తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ధాన్యం బాగా దెబ్బతింది. తేమ అధికంగా వస్తోంది. రెండు రోజుల కిందట కోతలు మొదలు పెట్టాం. వాతావరణంలో మార్పులు రావడంతో హడావిడిగా ఒబ్బిడి చేస్తున్నాం. ధాన్యం కల్లాల్లోనే బరకాలతో కప్పి ఉంది. ఆర్బీకేలో సవాలక్ష నిబంధనలు పెట్టారు. వ్యాపారులు కూడా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పెద్దిరెడ్డి సత్యనారాయణ, గాడిలంక, -ముమ్మిడివరం మండలం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రోజుకో రేటు నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. కొనుగోలు కేంద్రంలో స్పందన లేకపోవడంతో ఏజెంట్లను అడిగితే రోజుకో రేటు చెబుతున్నారు. మూడు రోజుల కిందట రూ.1,400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,330కి పడిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారు. తేమ శాతం, పొట్టు, మట్టి గెడ్డలు, పూర్తిగా ఆరబెట్టినవి మాత్రమే కొనుగోలు చేస్తారట. ధాన్యం ఆరబెట్టడానికి జాగా లేని మేము ఏం చేయాలి? – కట్టేపోగు నాగులు, శృంగారపురం గ్రామం, దుగ్గిరాల, గుంటూరు జిల్లా గోనె సంచులు ఇవ్వట్లేదు నేను ఎకరానికి రూ.20 వేలు వంతున ఖర్చు చేసి 13 ఎకరాలలో వరి సాగు చేశా. నూరి్పడులు కూడా పూర్తయ్యాయి. వాతావరణ మార్పుల హెచ్చరికలతో గుండెల్లో గుబులు మొదలైంది. నాకు ఈ ధాన్యం పట్టడానికి 500 గోనె సంచులు అవసరం. కానీ, 200 మాత్రమే ఇచ్చారు. తుపాను ఆందోళనతో గోనెలు లేకపోతే పంట నష్టపోవడం కంటే దళారులకు అమ్ముకోవడం ఉత్తమం అనిపిస్తుంది. అయితే, క్వింటాకు రూ.400 నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గోనె సంచులు ఇవాలి. – కనకల శ్రీనివాసరావు, బోని, ఆనందపురం మండలం, విశాఖపట్నం -
తిరుమలలో చిరుత సంచారం కలకలం
సాక్షి,తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల నివాసాల వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటు కోళ్ల షెడ్డుపై దాడికి ప్రయత్నించింది. అనంతరం, అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లు కనిపిస్తోంది.అంతేకాదు, నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్ది నిమిషాలు అక్కడే తిరుగాడి సమీప అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలకు ఉపక్రమించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ..‘తిరుమల అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటం, ఆహార వనరులు అందుబాటులో ఉండటం వల్ల చిరుతలు అప్పుడప్పుడు మానవ నివాస ప్రాంతాలకు చేరుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలు మోహరించాం’అని తెలిపారు.ఉద్యోగులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నామని, రాత్రివేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తుపాన్ వాహనంలోని నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఒరిస్సా నుంచి విశాఖకు వెళుతుండగా ఆదివారం తెల్లవారు జామున ఘటన జరిగినట్లు సమాచారం.మృతులు భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)లుగా పోలీసులు గుర్తించారు. -
పల్నాడులో అగ్నిప్రమాదం
సాక్షి,అమరావతి: పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రెంటచింతల మండలంలో బయోడీజిల్ బంక్‌లో పేలుడు సంభవించింది. బయోడీజిల్ అన్లోడ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో మరణించిన వ్యక్తి గురజాలకు చెందిన రషీద్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
AP 10th Exams: ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,అమరావతి: ఏపీ విద్యార్థులకు ముఖ్యగమనిక. ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం (నవంబర్ 21) ఎస్ఎస్ఈ బోర్డు విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం..16-03-2025 సోమవారం రోజు ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ) 18-03-2025-బుధవారం సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు20-03-2025-శుక్రవారం ఇంగ్లీష్23-03-2026-సోమవారం మ్యాథ్స్25-03-2025-బుధవారం ఫిజికల్ సైన్స్30-03-2025-సోమవారం -సోషల్ స్టడీస్31-03-2025-ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2) 1-04-2025-ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలను బోర్డ్ నిర్వహించనుంది. -
చంద్రబాబు మరో టెండర్.. అమరావతికి వరద తప్పించేలా మరో భారీ ప్రాజెక్ట్
-
రాజధాని వరద నివారణకు మరో ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు ఉండవల్లి వద్ద మరో ఎత్తిపోతల నిర్మాణ పనులకు ఏడీసీఎల్(అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉండవల్లి వద్ద కొండవీటివాగు నుంచి రోజుకు 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసే ఈ ఎత్తిపోతల పనులకు రూ.423.64 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.503.06 కోట్లన్నమాట. ఈ టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు తుది గడువు డిసెంబర్ 9. అదే రోజున సాంకేతిక బిడ్ తెరుస్తారు. డిసెంబర్ 10న ఆర్థిక బిడ్ తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు డిసెంబర్ 19లోగా పనులు అప్పగించేలా ఏడీసీఎల్ షెడ్యూలు ప్రకటించింది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసి.. 15 ఏళ్లపాటు నిర్వహించాలని షరతు విధించింది.కొండవీటివాగు, గుంటూరు చానల్‌పై 2 లేన్ బ్రిడ్జికరకట్ట రోడ్డును అనుసంధానిస్తూ కొండవీటివాగు, గుంటూరు చానల్‌పై షిప్ లాక్, రెగ్యులేటర్‌తో కూడిన రెండు వరుసల(2 లేన్) బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.55.85 కోట్ల కాంట్రాక్టు విలువతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో రూ.10.66 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసి, మరో రెండేళ్లపాటు నిర్వహించాలని షరతు విధించింది. రెండు వందల సంవత్సరాల్లో గరిష్ట వర్షపాతాన్ని అంచనా వేసి.. ఆ స్థాయిలో వరద వచి్చనా ఎలాంటి ముప్పు లేకుండా కొండవీటివాగు, గుంటూరు చానల్‌పై షిప్ లాక్, రెగ్యులేటర్‌తో కూడిన 2 లేన్ బ్రిడ్జిని నిర్మించాలని నిర్దేశించింది. జాతీయ జలరవాణా మార్గం–4లో ఉండవల్లి నుంచి నీరుకొండ మధ్య కార్గో రవాణాకు వీలుగా షిల్డ్ లాక్‌ను నిర్మించాలని నిర్ణయించింది. కృష్ణానది వరద కొండవీటి వాగులోకి ఎగదన్ని ముంపు కొండవీటి కొండలలో పేరేచెర్ల వద్ద పురుడుపోసుకునే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి.. ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. రాజధాని ప్రాంతంలో 23.85 కిమీల పొడవున ప్రవహిస్తుంది. కొండవీటి వాగు, కృష్ణా నదికి ఒకే సారి వరద వచ్చినప్పుడు కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్ని రాజధాని ముంపునకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కొండవీటివాగు వరద ముప్పును తప్పించడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిర్దేశించాయి. ఈ నేపథ్యంలో కొండవీటి వాగు వరద ముప్పు నుంచి రాజధానిని తప్పించేందుకు రోజుకు 5,250 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా ఉండవల్లి వద్ద 2018లో రూ.260.48 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఎత్తిపోతలను నిరి్మంచింది. అప్పట్లోనే కొండవీటివాగు వరద జలాలు 4 వేల క్యూసెక్కులను కృష్ణా డెల్టా పశి్చమ కాలువలోకి మళ్లించే పనులను పూర్తి చేసింది. కొండవీటివాగులో ఉండవల్లి వద్దకు గరిష్టంగా 17,650 క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొండవీటి వాగు నుంచి ఉండవల్లి వద్ద మరో 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా మరో ఎత్తిపోతల నిరి్మంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
ఏపీలో హైఅలర్ట్
సాక్షి,అమరాతి: ఏపీలో హైఅలర్ట్. అడవిని వదిలిన మావోయిస్టు అగ్రనేతలు రాష్ట్రంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 28 మంది మావోయిస్టులు పట్టుబడగా.. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. మరోవైపు ఇవాళ ఉదయం విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది.భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్ -
ఇదిగో ఆధారాలు..పవన్ పేషీ భూకబ్జా..!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్న వ్యక్తిపై వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన భీమర శెట్టి రమణబాబు అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో తనకు చెందిన 11 ఎకరాల 30 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సురేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ భూమిపై 2004 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ భూమిని తమకు అప్పగించకపోవడం బాధాకరమని రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సత్య అనే వ్యక్తితో పాటు మరొకరు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరికి సురేష్ అండగా ఉన్నారని ఆరోపించారు. తన భూమికి సంబంధించి పాస్‌బుక్‌లు ఇవ్వకుండా సురేష్ అడ్డుపడుతున్నాడని, చుట్టుపక్కల భూములకు పాస్‌బుక్‌లు వచ్చినా తన భూమికి మాత్రం ఇవ్వకపోవడం అన్యాయమని రమణబాబు అన్నారు. తన భూమి విలువ రూ.110 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, తన పేషీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రమణబాబు కోరారు. నా భూమిని నాకు అప్పగించకపోతే, పవన్ కళ్యాణ్‌ను కలసి, ఆయన పేషీలో జరుగుతున్న విషయాలను బహిరంగంగా వెల్లడిస్తాను’ అని హెచ్చరించారు. ఓవైపు అవినీతి, భూకబ్జాలపై పోరాడతానని చెబుతున్న పవన్ కళ్యాణ్, తన పేషీలోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అని రమణబాబు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పిన కృష్ణానది పెను పడవ ప్రమాదం
సాక్షి,కృష్ణా: కృష్ణానదిలో మరోసారి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల పడవ మార్గ మధ్యలో సాంకేతిక లోపం కారణంగా నదిలో ఆగిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ప్రయాణం మధ్యలో పడవ ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దీంతో పడవ నది ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయింది. ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, పడవలో ఉన్న సిబ్బంది వెంటనే లంగర్ వేసి పడవను నిలిపే ప్రయత్నం చేశారు.గింజపల్లి ఒడ్డున ఉన్న స్థానిక గ్రామస్తులు అప్రమత్తమై పడవను తాడులతో ఒడ్డుకు లాగారు. వారి సహకారంతో పడవను సురక్షితంగా తీరం చేరవేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. ప్రమాద సమయంలో పడవలో ఉన్న 30 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిలో కొందరికి స్వల్ప అస్వస్థతలు తప్ప, ఎటువంటి గాయాలు సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. -
అమరావతిలో కరెన్సీ రోడ్లు!
-
అసలే అప్పు.. అపై దుబారా!
‘‘అప్పు చేసి పప్పు కూడు’’ అని ఒక సామెత. ‘‘నాడా దొరికింది.. గుర్రాన్ని కొందాం’’ అనేది ఇంకో నానుడి. ఇలాంటివన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారుకు బాగా వర్తిస్తాయి. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. ఇప్పటికే రూ.26 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. తాజాగా ఇంకో రూ.32500 కోట్లు తీసుకుంటోంది. ప్రభుత్వ అవసరాల కోసం చేసిన రూ.1.60 లక్షల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ.55 వేల కోట్లు దీనికి అదనం. అమరావతిలో రూ.91639 కోట్లతో 112 పనులు చేపడుతూంటే అందులో సుమారు రూ.53,338 కోట్ల వ్యయమయ్యే 87 నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వీటిలో ప్రధాన మౌలిక వసతుల కల్పన, రైతులకు కేటాయించిన స్థలాల లే-అవుట్ల అభివృద్ధి, పరిపాలన నగరంలో హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం వంటి ఐకానిక్ టవర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటి పనులు చేపడతారట. ఇవేవీ ప్రభుత్వానికి కొత్తగా ఆదాయం తెచ్చేవి కావు. అవసరమైన నిర్మాణాలకు ఓకేగానీ.. భూమి సేకరించాం కనుక, అనవసరమైన నిర్మాణాలు చేపట్టడం ఎంత వరకూ ఉపయోగకరం? ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి వందల కోట్లు వ్యయం చేశారు. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. మూడువేల మంది సిబ్బంది కూడా ఉండని సచివాలయం కోసం ఏభై అంతస్తుల టవర్లు నిర్మించబోతున్నారట. అంతకుముందు 2014 టర్మ్‌లో ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో సుమారు రూ.పది వేల కోట్లు వెచ్చించింది. అప్పులు చేసి ఇలా దుబారా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు, కొన్ని చోట్ల రహదారుల నిర్మాణానికి కిలోమీటరుకు ఏకంగా రూ.75 కోట్ల నుంచి రూ. 174 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవడం చూస్తుంటే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే. హైదరాబాద్‌లో ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్న భవనాల్లో చదరపు అడుగు ఖర్చు నాలుగైదు వేలకు మించడం లేదు. కానీ అమరావతిలో భూమి ఖర్చు లేనప్పటికీ చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క రాజ్ భవన్ నిర్మాణానికే రూ.212 కోట్లు వెచ్చించబోతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది కుడి గట్టుకు 1.71 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.303 కోట్లు వెచ్చించబోతున్నారు. గత ప్రభుత్వం రూ.474 కోట్లతో 5.66 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించింది. అంటే కిలోమీటర్‌కు రూ.84 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం కిలోమీటర్‌కు రూ.177.5 కోట్లు పెడుతోందన్న మాట. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చాలాసార్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదని చెబుతుండేవారు. సేకరించిన భూముల్లో వాడుకోగా మిగిలిన భూముల అమ్మకంతో నిధులు సమకూరతాయని నమ్మబలికేవారు. కానీ.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో తదితర సంస్థల ద్వారా రూ.అరవై వేల కోట్ల అప్పు చేసేశారు. ఇంకెన్ని వేల కోట్ల అప్పు తీసుకుంటారో తెలియదు. ఇదేదో కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తోందని అనుకుంటే ఓకే కానీ.. అంతా ఏపీ ప్రజలపై రుణభారం పెంచే వ్యవహారమే. కేవలం 29 గ్రామాల పరిధిలో చేసే ఖర్చు బరువును అన్ని ప్రాంతాల వారూ భరించాల్సిందే కదా?అమరావతిలో ఇప్పటికి సేకరించిన 33 వేల ఎకరాల భూమి, అందుబాటులో ఉన్న 20 వేల ఎకరాలు సరిపోదని, మరింత సేకరించకపోతే అది మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ముఖ్యమంత్రి రైతులను బెదిరిస్తున్నారు. మరో 44వేల ఎకరాల భూమిని తీసుకు తీరతామనే సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాక తొలిదశలో భూములు ఇవ్వని సుమారు 1800 ఎకరాలకు చెందిన రైతుల నుంచి బలవంతపు భూ సేకరణకు రెడీ అవుతున్నారు. ఏదో తమకు కాస్త ఆదాయం వస్తుందిలే అని ఆశించిన రైతులకు ఈ పరిణామాలేవీ మింగుడు పడడం లేదు. కొత్తగా భూమి సమీకరణ జరిగితే ఆ ప్రాంతం అభివృద్దికి మరో లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తానఇన కూడా అప్పుగా పరిగణిస్తే వడ్డీలతో కలిపి ఏపీపై రుణభారం రకంగానే అప్పులు చేసుకుంటూ పోతే, అప్పులు, వడ్డీలు కలిసి ఐదు లక్షల కోట్లు మించినా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిలో రూ.24790 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డును జాతీయ రహదారి 16కి అనుసంధానించడానికి కిలోమీటర్‌కు రూ.174.4 కోట్లు అంచనా వేశారు. ఇప్పటికే నిర్మించిన సీఆర్డీయే భవనానికి రూ.338 కోట్లు వ్యయం చేశారు. చదరపు అడుగుకు రూ.11 వేలు పడిందని వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు చెప్పారు. ముంబైలో స్టార్ హోటల్ నిర్మాణానికి చ.అ. రూ.4500 మాత్రమే అవుతోందని ఆయన వివరించారు. 2016లో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణానికి రూ.1150 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు శాశ్వత సచివాలయం, హెచ్ఓడిల కోసం రూ.4688 కోట్లతో భారీ టవర్లను నిర్మిస్తోంది. ఒక వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఐదారు వేల కోట్ల రూపాయలు లేవని చెబుతున్న ప్రభుత్వం ఈ రకంగా వేల కోట్ల ప్రజాధనాన్ని ధారాళంగా ఖర్చు చేయవచ్చా? చత్తీస్ఘడ్ తాజాగా ఆవిష్కరించిన కొత్త అసెంబ్లీ భవనం వ్యయం కేవలం రూ.325 కోట్లు. ఏపీలో మాత్రం సోకులకు పోతూ భారీ ఎత్తున వ్యయం చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సీఆర్డీయే అధికారులు రైతుల సమావేశం ఏర్పాటు చేసి రాజధానిలో చేపట్టే ఇళ్లకు ప్రహరీ గోడలు కట్టకూడదని, విదేశాలలో ఉన్నట్లుగా ఇళ్లను నిర్మించుకోవడంతో పాటు గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారట. అలాగే నిర్దిష్ట ప్లాట్ల సైజు ప్రకారమే కాలనీలు ఉండాలని.. ఇలా రకరకాల సూచనలు చేస్తే రైతులకు ఇదేమిటా అని తలపట్టుకోవాల్సి వచ్చిందట.రైతులు వ్యక్తం చేసిన అనుమానాలను మాత్రం నివృత్తి చేయలేకపోయారట. అసలు ప్లాట్లే ఇవ్వకుండా, ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా గ్రీనరీ, నిబంధనలు అని ఆదేశాలు ఇవ్వడమేమిటో అని రైతులు ప్రశ్నించారట.ఈ ప్రాజెక్టు ఒక వైపు 2034 కు పూర్తి అవుతుందని ప్రపంచ బ్యాంక్ కు చెబుతూ తొలిదశ మూడేళ్లలో అవుతుందని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. వీటిలో దేనిని నమ్మాలి?నిజానికి గుంటూరు-విజయవాడ మధ్య రెండు, మూడు వేల ఎకరాలలో అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాలు, హైకోర్టు, న్యాయమూర్తుల, మంత్రుల, అధికారుల నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటే రూ.పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం జరిగిపోయేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో రాజధాని కార్యాలయాల కోసం వాడుతున్న భూమి వెయ్యి ఎకరాలకు మించదని అంటున్నారు. ఇలాకాకుండా.. రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుని, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడం రియల్ ఎస్టేట్ మోడల్ తప్ప మరొకటి కాదు. దానివల్ల ప్రభుత్వానికి కలసివచ్చేది పెద్దగా ఉండదు. కాని చంద్రబాబు తాను ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకోవడం కోసం ఏపీ ప్రజల నెత్తి మీద అప్పుల భారం మోపడం ఎంతవరకు కరెక్టు? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇది నీకు..ఇది నాకు అమరావతి పనుల్లో అడ్డగోలు దోపిడీ
-
SRM వర్సిటీలో ఫుడ్ పాయిజన్‌తో 300మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి,గుంటూరు: SRM యూనివర్సిటీలో సబ్ కలెక్టర్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యూనివర్సిటీ క్యాంటిన్లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు.ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ.. SRM యూనివర్సిటీలో దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల నుంచి సుమారు రోజుకి 50 మంది అస్వస్థకు గురి అవుతున్నారువాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతున్నారు. ఎక్కువమంది కలుషిత ఆహారం తినడం వల్ల తమ అస్వస్థకు గురయ్యామని చెప్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించాం. ఫుడ్ శాంపిల్స్ ,వాటర్ శాంపిల్స్ సేకరించాం. ఇద్దరు విద్యార్థులు ఎన్నారై హాస్పటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులు ఇవ్వాల్సిన రేషన్ రెండు రోజులే ఇస్తున్నారు. వృద్ధులకు ఇంటికెళ్లి ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదు. రేషన్ తరలిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి దృష్టి పెట్టాలి’అని డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడిస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటినే జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతారేమోనన్న ఉద్దేశ్యంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్,టీచర్,సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది.ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
మీడియాపై సీఎం చంద్రబాబు అసహనం
సాక్షి,విజయవాడ: మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు’అంటూ ఆయన మీడియాపై ఘాటుగా స్పందించారు.గురువారం ఏపీలో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం) ద్వారా తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారం తక్షణమే తెలుసుకున్నామని తెలిపారు. అయితే, ‘ఆ డేటాను కేంద్రానికి పంపించారా?’ అని మీడియా ప్రశ్నించడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ‘అన్నీ రియల్ టైమ్‌లో ఎలా సాధ్యమవుతాయి?’ అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ‘మీకు సెన్సేషన్ వార్తలు కావాలి, రియాలిటీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇంకా నివేదిక పంపించలేదని, త్వరలో పంపించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. -
పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయం
కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.శుక్రాచార్యుడి సందేహంఅసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ సమయాలు...మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. -
మోంథా బీభత్సం..30మంది విద్యార్థులకు కరెంట్ షాక్?
సాక్షి,విజయనగరం: ఏపీలో మోంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మోంథా తీవ్రతతో భారీ వర్షాలు, వరదలు, కుండపోత వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు నేలమట్టమవుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. సెల్ టవర్స్ దెబ్బతింటున్నాయి.ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కస్తూర్బా హాస్టల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభం పాఠశాల గోడపై పడింది. విద్యార్థులు గోడను పట్టుకోవడంతో విద్యుత్ ప్రసారం కావడంతో 30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. -
బంగారంతో రోడ్లు వేస్తున్నారా? అమరావతి పేరుతో భారీ దోపిడీ
-
చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. కోర్టుకు అమరావతి బాధితులు
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు బిగ్‌షాక్
సాక్షి,విజయవాడ: ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మస్కా కొట్టింది. డీఏ జీవోలోనూ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డీఏ జీవో ఇచ్చింది. అయితే, డీఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు విస్తుపోతున్నారు. 2024 జనవరి డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాకే ఇస్తామని కొర్రీ పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రిటైర్డ్ అయిన పెన్షనర్లను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. పెన్షనర్ల డీఏ అరియర్స్ వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవోను చూసి ఉద్యోగ సంఘాలు విస్తుపోతుంటే.. ఇచ్చిన ఒక్క డీఏకి ఇన్ని కొర్రీలా అంటూ మండిపడుతున్నారు. -
అమరావతి ఓఆర్ఆర్.. 190 కిలో మీటర్లు.. 24,790 కోట్లు
సాక్షి, అమరావతి: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) కంటే పెద్దగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 190 కి.మీ.మేర 140 మీటర్ల వెడల్పులో భూసేకరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్మించింది. మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.అమరావతి ఓఆర్ఆర్ డీపీఆర్‌లో ప్రధాన అంశాలు ఇవీ... 👉హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవు 158 కి.మీ. కాగా, అమరావతి ఓఆర్ఆర్ను 190 కి.మీ. మేర నిర్మించాలని నిర్ణయించారు. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్ను నిర్మిస్తారు. అందుకోసం అమరావతిలో 190 కి.మీ. పొడవునా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. భూసేకరణ వ్యయంలో రూ.వెయ్యి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 👉ఓఆర్ఆర్లో భాగంగా కృష్ణా నదిపై రెండు వంతెనలు నిర్మిస్తారు. ముప్పలూరు వద్ద 3.15 కి.మీ. మేర మొదటి వంతెన, మున్నంగి వద్ద 4.8 కి.మీ. మేర రెండో వంతెన నిర్మించాలని నిర్ణయించారు. గంగినేనిపాలెం అటవీప్రాంతంలో రెండు టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 1.64 కి.మీ., రెండో టన్నెల్ 2.68 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇందుకోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. 👉అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో అనుసంధానిస్తూ రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తారు. తెనాలి నుంచి కాజ టోల్ ప్లాజా వరకు 17.5 కి.మీ. మేర మొదటి స్పర్ రోడ్డు, నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.20 కి.మీ. మేర రెండో స్పర్ రోడ్డు నిరి్మస్తారు. 👉అమరావతి ఓఆర్ఆర్ కోసం రూ.24,790 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,117 కోట్లు భరించనుంది. ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. -
అతకని అతిశయోక్తులతో ప్రధాని ప్రసంగం...
దేశ రాజధాని ఢిల్లీ.. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిట. దేశ ప్రగతిలో కీలకంగా మారాయట. ఈ వ్యాఖ్యలు ఎవరో ఆషామాషీ వ్యక్తులు చేసింది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నవి. మరీ ఇంత అతిశయోక్తా? ఢిల్లీ ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతమన్నది అందరికీ తెలుసు. కానీ అమరావతి? అమరావతి అభివృద్ది చెందుతుందని, దానికి తమ సహకారం ఉంటుందని చెబితే ఫర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇదే నిజమైతే ముంబై, బెంగుళూరు, చెన్నై హైదరాబాద్, పూణేల మాటేమిటి? అవి కదా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నవి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీయే పాలనలో వేగవంతమైన అభివృద్ది జరుగుతోందని ప్రధాని అన్నారు. అదేంటో కాస్తా వివరించి ఉంటే బాగుండేది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటకు అప్పనంగా అప్పగించేయడమేనా ముఖచిత్ర మార్పు అంటే? లేక... ఏడాదిన్నర కాలంలో రూ.2.10 లక్షల కోట్లు అప్పులు చేయడమా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మరచిపోయారు. మొన్నటికి మొన్న ఎన్డీయేను వీడిన చంద్రబాబును మోడీ, అమిత్ షాలు అనని మాటలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకున్నారని విమర్శించడం మాత్రమే కాదు.. తనకన్నా సీనియర్ అని చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లోకేశ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగానూ తెగనాడిన ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన్నో యువనేతగా అభివర్ణిస్తున్నారు. మనోడైతే వారసత్వ రాజకీయాలు చేసినా ఓకే అన్నమాట. జీఎస్టీ రేట్లలో తగ్గింపులను ఉత్సవాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ, చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడరు. వాస్తవానికి పెట్రోలు, డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రూకలు మిగులుతాయి. సూపర్ గిఫ్ట్ అవుతుంది. విశాఖలో రానున్న అదానీ, గూగుల్ల డేటా సెంటర్‌ను ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.22 వేల కోట్ల రాయితీల్లో కొంత కేంద్రమూ భరిస్తుందని చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గిఉండేది. ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమన్న ప్రధాని ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా, టమోటా, ఉల్లి, మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చేసిన వాళ్లు అయ్యేవారు. అదేదీ చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో. మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి. బహుశా ఇది టీడీపీ, జనసేనలకు నిరాశ కలిగించి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని రాష్ట్రనికి ఇచ్చిందేమీ లేదని, పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు వృథా చేస్తోందని అవుతోందన్న విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తే.. మోడీ కూడా బాబు, పవన్‌లను కీర్తించి వెళ్లారు. ఎందరో ప్రధానులతో పనిచేసిన తనకు మోడీ లాంటి నేత అస్సలు కనపడనే లేదని, విలక్షణ నాయకుడని, జాతికి ఎనలేని సేవలందిస్తున్నారని చంద్రబాబు కీర్తిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు. కూటమి ఏపీలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. మోడీ దార్శనికతతో, చంద్రబాబు స్పూర్తితో సమష్టిగా ముందుకు వెళతామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపులనే డబుల్ బెనిఫిట్లు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పు చేయకుండా వారం గడవని పరిస్థితుల్లో, ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న చంద్రబాబు ఈ మాటలనడం ఆత్మవంచనే అవుతుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందన్న భయమున్నా అది సూపర్ అని ప్రచారం చేయక తప్పడం లేదు. జీఎస్టీ తగ్గింపువల్ల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై కూడా ప్రయోజనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన ప్రతిభే అని అన్నిచోట్ల చెప్పుకునే చంద్రబాబు ఈసారి మాత్రం అన్నీ మోడీ చలవేనని చెప్పుకున్నారు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైన కొన్ని డిమాండ్లను సీఎం హోదాలో జగన్ ప్రస్తావించే వారు. వినతిపత్రం లాంటివి ఇచ్చేవారు. చంద్రబాబు ఈ పని మాత్రం చేయలేకపోయారు. కారణమేమిటో మరి?తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ తనకు ఇచ్చిన శాఖలను సమర్థం నిర్వహిస్తున్నారని పవన్ పొగడడం గమనించాల్సిన అంశమే. లోకేశ్ నాయకత్వానికి పరోక్షంగా ఆమోదం చెప్పినట్లు అనుకోవాలి. లోకేశ్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. మోడీ లోకేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. రాజకీయ వారసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభ ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్దిస్తుందన్నదే డౌటు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది. ఆపై జనార్ధన్రావుతో జోగి రమేష్ పేరు చెప్పించింది.జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో రికార్డ్ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్‌రావు దగ్గర ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
‘బాబు కరకట్ట డాబు’.. సీఎం నివాసానికి కోట్లు వెదజల్లిన ఏపీ ప్రభుత్వం!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు తాజాగా మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో కొత్త వాహనాల కొనుగోలు కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి కరకట్ట ప్యాలస్ ఖర్చులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలే సీఎం నివాసంగా ఉపయోగిస్తున్న కరకట్ట ప్యాలస్ మరమ్మతులు, సౌకర్యాల కోసం రూ. కోటి 21 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇది కొత్తది కాదు. గత రెండు నెలల్లోనే కరకట్ట ప్యాలస్‌కు సంబంధించి రూ.95 లక్షలు, రూ.36 లక్షలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధుల్లోరూ.20 లక్షలు: మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకురూ.16.50 లక్షలు: వంటశాల సదుపాయాల కోసంరూ.19.50 లక్షలు: నివాసం చుట్టూ చెదల నివారణకుఇంతకు ముందు కరకట్ట ప్యాలస్ సౌకర్యాల కోసం రూ. కోటి 44 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ రూ. కోటి 21 లక్షలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా, ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి సౌకర్యాల కోసం రూ.95 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఖర్చులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలకు దారి తీస్తున్నాయి. -
చంద్రబాబుకు షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతులు షాకిచ్చారు. తమను ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా అమరావతి రైతులు నాలుగు డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని నెరవేర్చని పక్షంలో పోరాటం దిశగా అడుగులు వేస్తూ తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్12) అమరావతి రైతులు గుంటూరులో సమావేశయ్యారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభానికి భూమి ఇచ్చిన రైతులను కూడా ఆహ్వానించ లేదని మండిపడ్డారు. సీఆర్డీఏలో అవినీతి పెరిగిపోందన్న అమరావతి రైతులు.. 15నెలలు గడుస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు.తమ సమస్యల్ని పరిష్కరించాలని సీఆర్డీఏ మున్సిపల్ శాఖ మంత్రి వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటం తప్పదని అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 👉ఇదీ చదవండి: ఎవరి అక్షయపాత్ర అమరావతి? -
అప్పులు తెచ్చి అడ్డగోలు వ్యయం!
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయ భవనం, దానిపక్కనే మున్సిపల్ శాఖ విభాగాల (ఏపీయూఎఫ్ఐడీసీ, ఏపీ టిడ్కో, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, ఏపీయూజీబీసీ ఆఫీసు, ఏపీ రెరా అప్పిలేట్ అథారిటీ, డీటీసీపీ, రెరా ఆఫీసులు, మెప్మా, ఇతర విభాగాలు) కోసం పీఈబీ (ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్) పద్ధతిలో ఇప్పటికే మూడు షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. తాజాగా సీఆర్డీఏ భవనానికి ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఇతర పనులకు రూ.72.69 కోట్ల కాంట్రాక్టు విలువతో సీఆర్డీఏ శనివారం స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనరేజీ, జీఎస్టీ లాంటి పన్నుల రూపంలో రూ.20.71 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. మున్సిపల్ శాఖ నిర్మాణాలకు విపరీత ఖర్చు.. ఇక మున్సిపల్ శాఖ విభాగాల కోసం 37,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ఫ్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.49.63 కోట్ల అంచనా వ్యయంతో శనివారం సీఆర్డీఏ స్వల్పకాలిక టెండర్ నోటిపికేషన్ జారీ చేసింది. పన్నుల రూపంలో అదనంగా రూ.15.92 కోట్లు ఇస్తామంది. దీంతో సీఆర్డీఏ భవనం, మున్సిపల్ శాఖ కార్యాలయాల కోసం నాలుగు షెడ్ల నిర్మాణం కోసం రూ.469.95 కోట్ల వ్యయంతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరో వైపు అమరావతిలో వెలగపూడి వద్ద రూ.1,151 కోట్ల వ్యయంతో 6 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతంతో 2016లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. శాశ్వత సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల కోసం 52,20,496 చ.అడుగుల నిర్మిత ప్రాంతంలో ఐదు భారీ భవనాల నిర్మాణ పనులను రూ.4,688.82 కోట్లకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పటికే అప్పగించింది. అందులో మున్సిపల్ శాఖ కార్యాలయాల కోసం భారీగా స్థలం కేటాయించింది. ఆ భవనాలు పూర్తయితే.. ఇప్పుడు నిర్మిస్తున్న సీఆర్డీఏ కార్యాలయం, మున్సిపల్ శాఖ కోసం నాలుగు పీఈబీ షెడ్లు వృథాగా మారుతాయని.. వాటి కోసం చేసే వ్యయం రూ.469.85 కోట్లు.. తాత్కాలిక సచివాలయం కోసం చేసిన వ్యయం రూ.1,151 కోట్లు మాదిరిగానే వృథా అవుతాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను భారీ ఎత్తున వృథా చేస్తూ రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో రైతులకు హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా పనులు పూర్తి చేయకుండా కమీషన్ల కోసం షెడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సీఆర్డీఏ భవనంలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీసు, ఐదు భారీ మీటింగ్ హాళ్లు, సీఆర్డీఏ కార్యాలయం కోసం మూడు ప్లోర్లు, ఏడీసీఎల్ ఆఫీసు, సీడీఎంఏ ఆఫీసు, రెరా ఆఫీసు, డీటీసీపీ ఆఫీసు, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఆఫీసు, మున్సిపల్ శాఖ మంత్రి, శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు. మిగిలిన విభాగాల కోసం సీఆర్డీఏ ఆఫీసుకు సమీపంలోనే పీఈబీ పద్ధతిలో మూడు షెడ్ల నిర్మాణ పనులను మార్చి 29న రూ.28.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థ ఎన్సీసీకి అప్పగించారు. ఆ మూడు షెడ్లకు ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులను ఎన్‌సీసీకే రూ.40.35 కోట్లకు అప్పగించారు. తాజాగా నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ఫ్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టేందుకు పన్నులతో కలిపి రూ.65.55 కోట్ల కాంట్రాక్టు విలువతో సీఆర్డీఏ స్వల్ఫకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని బట్టి నాలుగు షెడ్ల కోసమే ఏకంగా రూ.134.59 కోట్లు వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జీ+1 నుంచి జీ+7 స్థాయికి సీఆర్డీఏ కార్యాలయం విస్తరణ..» రాజధానిలో సీఆర్డీఏ కార్యాలయ భవనం నిర్మాణ పనులకు తొలుత జీ+1 పద్ధతిలో 55,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో.. జీ+7 అంతస్తులతో భవనాన్ని నిర్మించేలా పునాది, డిజైన్ పనులకు రూ.39.80 కోట్ల అంచనాతో 2017, అక్టోబర్ 21న టెండర్లు పిలిచారు. ఆ పనులను 0.27 శాతం తక్కువకు అంటే రూ.39.69 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ప్రీకా సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇందులో 2019, మే నాటికే రూ.17.12 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. » ఆ తర్వాత జీ+1 నిర్మిస్తున్న భవనంపై అదనంగా ఆరు అంతస్తులు నిర్మించే పనులకు రూ.43.35 కోట్ల అంచనా వ్యయంతో 2018, మే 14న టెండర్లు పిలిచారు. ఈ పనులను 3.93 శాతం అధిక ధరకు అంటే రూ.45.05 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ప్రీకా సొల్యూషన్స్ సంస్థే దక్కించుకుంది. ఇందులో 2019, మే నాటికే రూ.26.58 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది.» సీఆర్డీఏ భవనంలో జీ+3 వరకూ లోపల, బయటా విద్యుదీకకరణ, ఫర్నిచర్ సహా ఇంటీరియర్ వర్క్స్, చిల్డ్ వాటర్ సిస్టమ్, ఐటీ, బీఎంఎస్ తదితర పనులకు 2019 జనవరి 12న రూ.38.19 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులను 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.39.90 కోట్లకు కేపీసీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. » సీఆర్డీఏ కార్యాలయాన్ని లోపలా, బయటా కళాత్మకంగా తీర్చిదిద్దడంతోపాటు భవనం లోపల, బయట అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతి తీసుకోకుండానే 2024, సెపె్టంబరు 18న రూ.129.69 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులను రూ.135.97 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కేపీసీ ప్రాజెక్ట్స్ సంస్థే దక్కించుంది. ఆ పనులను కేసీపీ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగిస్తూ 2024, అక్టోబర్ 16న సీఆర్డీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి ఈ పనుల వ్యయం రూ.160 కోట్లు అవుతుంది. ఇదే రకమైన పనులను జీ+3 అంతస్థు వరకూ 2019, జనవరి 12న రూ.39.90 కోట్లకు ఇదే సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే అంచనాలు పెంచేసి గతంలో అప్పగించిన సంస్థకే మళ్లీ కొత్తగా పనులు అప్పగించారనే ఇంజనీర్లు చెబుతున్నారు.» తాజాగా సీఆర్డీఏ భవనానికి ఫర్నీచర్, ఇంటీరియర్స్, ఇతర పనులకు పన్నులతో కలిపి రూ.93.4 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 3,89,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో చేపట్టిన సీఆర్డీఏ భవనం కోసం రూ.335.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంటే.. చదరపు అడుగుకు రూ.8,616.64 వ్యయం చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఫైవ్‌స్టార్ వసతులతో కూడిన భవనాల నిర్మాణ వ్యయం సైతం రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ భవన నిర్మాణంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చెబుతున్నారు. -
బాబు..డాబు.. కాన్వాయ్‌లో మరో రెండు ఫార్చూనర్ కార్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌లో మరో రెండు ఫార్చూనర్ కార్లను చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రూ.88 లక్షల నిధులను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీఎం కాన్వాయ్‌లో పదుల సంఖ్యలో వాహనాలు ఉన్నప్పటికీ, తాజా ఉత్తర్వులతో మరో రెండు విలాసవంతమైన వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేసింది. -
బాబు పతనం స్టార్ట్.. త్వరలో ప్రజా తిరుగుబాటు!
-
వాళ్లు ఇచ్చేదేంటి? భూములు లాక్కోండి..! బాబు సంచలన ఆదేశాలు
-
రేవంత్‌కు ఆశ లావు.. పీక సన్నమైంది!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. హుసేన్ సాగర్‌ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్‌గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్‌గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్ అండ్ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్‌కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్‌ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్‌ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్‌ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం - ఉధృతం
-
‘అమరావతి పనులు 10 శాతం కూడా పూర్తవలేదు!’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులు 2014–19 మధ్య కాలంలో 10 శాతం కూడా పూర్తి కాలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అంగీకరించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో, పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ బదులిస్తూ.. ‘2014–19లో 10 శాతం కంటే తక్కువ పనులు జరిగాయి. ఇంకా 90 శాతం పనులు ఉన్నాయి. కాబట్టే.. పాత రేట్లకు కాంట్రాక్టర్లు టెండర్లు కొనసాగించలేమన్నారు. అందుకే వాటిని రద్దు చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం ఉండాలనే టెండర్లలో నిబంధనలు రూపొందించి కొత్తగా పెరిగిన రేట్లకు కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చాం’ అని తెలిపారు. ప్రస్తుతం అమరావతి క్యాపిటల్ సిటీలో సీఆర్డీఏ 21 పనులు, ఏడీసీఎల్ 64 పనులు చేపట్టిందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాదుల్లో నీళ్లు ఉండిపోయాయని, నీళ్లు తొలగించాక పునాదుల పటిష్టతను పరిశీలిస్తామన్నారు. రూ.50 వేల కోట్ల కాంట్రాక్టులు నవరత్నాలకేనా! అమరావతిలో రూ.50 వేల కోట్లతో 84 పనులకు కాంట్రాక్టుల నవరత్నాల మాదిరిగా కేవలం 9 సంస్థలకే ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో 3 వేల మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక నలిగిపోతున్నారన్నారు. అమరావతి పనుల్లో కనీసం సబ్ కాంట్రాక్టులు అయినా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సీఆర్డీఏ, ఏడీసీఏల్ కాంట్రాక్టర్లు పనులు చేసి బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, వారు గతంలో చేసిన పాత పనులను రద్దుచేసి ప్రభుత్వం కొత్తవారికి కొత్త రేట్లకు టెండర్లు ఇచ్చారన్నారు. నవరత్నాలకు ఎల్1 దర్శనమా? మిగిలిన వాళ్లకు జనరల్ దర్శనమా అని నిలదీశారు. ఆర్థిక శాఖ వింత పోకడలతో కొత్త వెబ్సైట్లు తీసుకురావడంతో పాత బిల్లులు మైగ్రేట్ అవ్వలేదన్నారు. -
రైతుల భూములు బెదిరించి లాక్కుంటున్నారు రాజధానికి లక్ష కోట్లు..?
-
Amaravati: మీటరు రోడ్డుకు రూ.10 లక్షలు!
సాక్షి, అమరావతి: రాజధానిలో రోడ్ల నిర్మాణ పనుల అంచనాల్లో ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) తన రికార్డులను తానే బద్ధలుకొడుతోంది. ఈ–13 రహదారిని 6 వరుస (లేన్)లతో ఎన్‌హెచ్–16 వరకూ పొడిగించే పనులను కి.మీకు రూ.66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టరుకు అప్పగించిన ఏడీసీఎల్, తాజాగా.. సీడ్ యాక్స్‌స్ రోడ్డును మూడో దశలో 6 వరుసలతో 755 మీటర్ల పొడవు (ఇందులో కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువపై 130 మీటర్ల పొడవుతో నిర్మించే స్టీలు బ్రిడ్జితో కలిపి)తో నిర్మించి, పాత మంగళగిరి హైవేతో కలిపే పనులకు రూ.61.67 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.13.15 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. 755 మీటర్ల రోడ్డు కాంట్రాక్టు విలువ రూ.74.82 కోట్లన్న మాట. అంటే.. మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆ రోడ్డును మట్టి, రాళ్లు, తారుతో నిరి్మస్తున్నారా లేక బంగారం పూతతో వేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారులను మీటరు రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షలతోనే ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నిరి్మస్తోందని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముడుపుల కోసమే రోడ్డు పనుల అంచనాలను పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.పనుల పూర్తికి 4 నెలలు గడువు.. రాజధానిలో ప్రధాన ప్రాంతానికి (సీడ్ కేపిటల్) కోల్‌కత–చెన్నై జాతీయ రహదారిని అనుసంధానించేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డు (ఈ3)ను ఏడీసీఎల్ నిరి్మస్తోంది. అందులో భాగంగా ఈ రోడ్డును పాత మంగళగిరి హైవేతో అనుసంధానం చేసే పనులను మూడో దశలో టెండరు పిలిచింది. మూడో దశలో 755 మీటర్ల పొడవున 6 వరుసల (స్ట్రీట్‌లైట్లు, ఫుట్‌పాత్, యుటిలిటీ డక్ట్లు, వరద నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు)తో నిర్మించే పనులకు టెండర్లు పిలిచింది. ఇందులో.. కృష్ణా డెల్టా పశ్చిమ కాలువపై 130 మీటర్ల పొడవున స్టీలుబ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ పనుల పూర్తికి 4 నెలలు గడువుగా నిర్దేశించి ఈనెల 3న టెండరు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ టెండరులో బిడ్ దాఖలు గడువు గురువారం సా.5 గంటలతో ముగియనుంది. ఆర్థిక బిడ్ శుక్రవారం తెరిచి.. తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థను ఎల్–1గా తేల్చి.. ఆ సంస్థకే పనులు అప్పగించాలని సీఆర్డీఏకి ఏడీసీఎల్ సీఈ ప్రతిపాదన పంపనున్నారు. -
KSR Live Show: అమరావతి మున్సిపాలిటీ పేరుతో రైతులను భయపెట్టే కుట్ర?
-
చంద్రబాబు లీక్స్ అమరావతి ఒక మున్సిపాలిటీ..!
-
రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్
-
‘ చంద్రబాబు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎప్పుడూ విజన్‌తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్‌ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్‌బుల్‌గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు. -
బాబు విజన్.. ఒక్క రోజే రూ.5వేల కోట్ల అప్పు
సాక్షి,అమరావతి: తొలి అడుగు అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ, దీనికి విరుద్ధంగా ‘అప్పుల పాలనలో సర్కార్ అడుగులు’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కారు తీరు. మంగళవారం మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పుల సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2లక్షల వేల కోట్లకు చేరాయి.చంద్రబాబు సర్కార్ మంగళవారం మరో రూ.5వేల కోట్లు అప్పుగా తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులను సమీకరించింది. ఇలా 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.2 లక్షల 9 వేల కోట్ల అప్పు చేసింది. తద్వారా ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా అప్పులు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది.సూపర్ సిక్స్ ప్రధాన హామీలు అమలు చేయని చంద్రబాబు..రికార్డ్ స్థాయిలో అప్పులు తీసుకొస్తుంది. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా చంద్రబాబు ప్రభుత్వం నిలిచింది. -
భక్తులకు అలెర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్
సాక్షి,విజయవాడ: భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్ అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు.అభ్యంతరకర దుస్తులలో వచ్చే భక్తులకు దేవాలయంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి డ్రెస్‌కోడ్ తప్పనిసరి విధించింది. ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకుంది.విధి నిర్వహణలో సిబ్బంది సెల్ఫోన్ల వాడకంపై నిషేదం. ఈ కొత్త నిబంధనలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్‌ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్‌లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్లో సంబంధం లేకుండా ప్లే స్లిప్‌లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్‌సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్‌లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్‌లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్‌కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్‌కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్‌లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గుంటూరు ఛానెల్లోకి వచ్చిన నీరు కొండవీటి వాగుదే: Ambati Murali
-
అమరావతి రాజధాని వరద ముంపునకు గురైంది: దొంతిరెడ్డి వేమారెడ్డి
-
అమరావతి మునిగింది.. నిజం చెప్పిన మంత్రి నారాయణ.. ఎల్లో మీడియా పరువు పాయే..
-
అమరావతి ముంపుపై నిజాన్ని ఒప్పుకున్న మంత్రి నారాయణ
-
అమరావతి మునిగిపోయిందా?.. మంత్రి పర్యటనతో క్లారిటీ
సాక్షి, విజయవాడ: వరద నీళ్లలో మునిగిపోతే.. ‘అబ్బే అదేం లేదూ.. అవన్నీ ఫేక్ కథనాలే’ అంటూ కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా చానెల్స్‌లో, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా కళ్లెదుట నీరు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నా.. ప్రశ్నించినందుకు కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. అయితే రాజధాని అమరావతి ముంపునకు గురైందన్న విషయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణే స్వయంగా ఒప్పుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది!!.ఎగువ ప్రాంతాల్లో వరద పెరుగుతున్న నేపథ్యంతో చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లయిన్లతో నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో.. ‘‘కొండవాటి వాగు నీరు వెనక్కి తన్నింది. వెస్ట్ బైపాస్‌రోడ్డు నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఆ నిలిచిన నీరుపోవడానికి బైపాస్కు గండ్లు పెడుతున్నాం’’ అని అన్నారాయన.అదే సమయంలో.. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు, అత్యాధునిక డిజైన్ అంటూ మళ్లీ పాత పాటే వినిపించారు. మంత్రి ప్రకటన ప్రకారం.. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జ్ నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం అని అర్థం. అంటే ఓవైపు ముంపు లేదని ఎల్లో బ్యాచ్ చెబుతుంటే.. మరోవైపు నీరు వెనక్కు తన్నిందని స్వయానా మంత్రే అంటున్నారు. ఈ లెక్కన అమరావతి ముంపునకు గురైందని ఒప్పుకున్నట్లే కదా!. -
కేసులకు భయపడను.. అమరావతిని ముంచింది కొండవీటి వాగే..
-
అమరావతి గోవిందా! నీటిలో నా రాజధాని
-
Ambati: అమరావతిలో కొన్ని వేల ఎకరాలు చెరువుల మారిపోయాయి..
-
‘ఆ వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవం’
తాడేపల్లి: భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాస్తే సాక్షి చానల్ సహా ఇతర చానల్స్‌పై కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనడానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు.ఈరోజు(సోమవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత సాక్షి చానల్ మీద కేసు వేయించారు. సాక్షి చానల్, కొన్ని ప్రైవేట్ చాన్సల్స్ను బెదిరించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారు. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగింనేది వాస్తవం కొండవీటి వాగు సహజ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తే ఆగుతుందా?, అడ్డదిడ్డంగా తవ్వి కట్టలు వేయడం వల్ల కొండవీటి వాగు పొలాల మీద పడింది. హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి. ఈ వాస్తవాలతో వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు. అమరావతిపై మాకు అసూయ లేదు. అమరావతిపై రూ. 52 వేల కోట్లు అప్పు చేశారు. అమరావతి రైతులకు చంద్రబాబు ఏమైనా సహాయం చేశాడా?, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు ఆయన మీదే కేసులు పెట్టాలి. రూ. 220 కోట్లతో కొండవీటి వాగుపై లిఫ్ట్ పెట్టారు.. అది నిరుపయోగం అయ్యింది’ అని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి నీట మునిగిన ఫోటోలను అంబటి ప్రదర్శించారుఇక మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఎమ్మెల్యే కూన రవి కుమార్, జూనియర్ ఎన్టీఆర్‌పై తప్పుడు మాటలు మాట్లాడిన మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌లపై చర్యలేవని ప్రశ్నిచాచు. వారిపై ఎందుకు కేసులు పెట్టరు.. ఎందుకు సస్పెండ్ చేయరని అంబటి నిలదీశారు. -
ఫ్యూచర్ సిటీ టు అమరావతి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాలుగో నగరి.. ఫ్యూచర్ సిటీతో రాష్ట్రాభివృద్ధి మరో దశకు చేరనుందని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తు నగరాన్ని వచ్చే వెయ్యేళ్ల అవసరాలను తీర్చేలా, ఒక నమూనాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న సర్కారు.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మధ్య ఎనిమిది లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించింది. ఈ రహదారి నిర్మాణం తర్వాత హైదరాబాద్–విజయవాడ మధ్య దూరం 70 కిలో మీటర్ల మేర తగ్గుతుందని చెపుతున్నారు. మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), రీజనల్ రింగ్ రైల్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టులను ఓడరేవుతో అనుసంధానిస్తే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య రవాణాతో పాటు బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులను ఆకర్షించడం సులువవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నంలో బందరు పోర్టుకు అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. దీనికి త్వరలోనే అనుమతి మంజూరు అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వెంట రెండు డ్రై పోర్ట్‌లు.. ఆర్ఆర్ఆర్, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులకు కూడా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. రీజనల్ రింగ్ రైల్‌ను బందరు పోర్టు లేదా ఇతర ఓడరేవుతో అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ట్రిపుల్ఆర్ వెంట రెండు డ్రై పోర్ట్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్, చౌటుప్పల్ లేదా ఖమ్మం వద్ద వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్.. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (ఓఆర్ఆర్ లోపల), సెమీ ఆర్బన్ (ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య), గ్రామీణ (ఆర్ఆర్ఆర్, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల మధ్య) ప్రాంతం.. అని మూడు భాగాలుగా విభజించిన సర్కారు.. వీటిని సేవా, పారిశ్రామిక, వ్యవసాయ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తెలంగాణ రైజింగ్–2047 విజన్ పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించనుంది. దీనిని వచ్చే డిసెంబర్ 9న విడుదల చేయనుందని తెలుస్తోంది. ఆ రోజు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం కావడం గమనార్హం. -
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:చోద్యం చూస్తున్నారు:ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్‌కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటోలు చూపారు)సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.కాంట్రాక్టర్‌ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
ఒక్క వానకే మునిగిన బాబు విజన్ అమరావతి
-
పూర్తిగా నీట మునిగిన అమరావతి
-
భారీ వర్షాలు ..వరద ముంపులో రాజధాని అమరావతి (ఫొటోలు)
-
99 పైసలకే 22 ఎకరాలు.. బాబు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.ఇదే సమయంలో టీసీఎస్, లులు కంపెనీలకు భూ కేటాయింపులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా కాగ్నిజెంట్‌కు సంబంధించిన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.99 పైసలకే 22 ఎకరాల భూ కేటాయింపులపై పిల్...కాగ్నిజెంట్ కంపెనీకి భూ కేటాయింపులను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ విశాఖ జిల్లా అధ్యక్షురాలు నక్కా నమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, విశాఖ నడిబొడ్డున రూ.1,109 కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. సేల్‌డీడ్ ద్వారా కాగ్నిజెంట్‌కు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. లీజు విధానంలో మాత్రమే భూ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు. -
వరద ముంపులో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. -
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది. -
అమరావతి కోసం మళ్లీ చందాలు మొదలుపెట్టిన బాబు సర్కార్
-
అమరావతి కోసం మళ్లీ చందాలు ప్రారంభించిన చంద్రబాబు
-
‘డబ్బుల్లేవ్.. అమరావతికి చందాలివ్వండి.. కూటమి క్యూఆర్ కోడ్’
సాక్షి, విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి అని ఎవరికి అడిగినా చెబుతారు. ఆయన మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు. ఇది ఇప్పటికే ఎన్నోసారు నిరూపితమైంది. ఇక, తాజాగా మరోసారి చంద్రబాబు మాటల్లో మోసం రుజువైంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబు.. దీనికోసం ఇప్పటికే వేల కోట్ల అప్పులు తీసుకురాగా.. మళ్లీ చందాల సేకరణకు నడుం బిగించారు.చంద్రబాబు సర్కార్ అమరావతి కోసం మళ్ళీ చందాలు అనే ప్లాన్ ముందుకు తీసుకువచ్చింది. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టింది. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలంటూ చందాలు సేకరణ ప్రారంభించింది. విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సీఆర్డీఏ వెబ్సైట్ crda.ap.gov.in లో ఇందుకు ప్రత్యేకంగా ‘డొనేట్ ఫర్ అమరావతి’ అనే ఆప్షన్ ఇచ్చారు.ఇక, 2015లో కూడా రాజధాని నిర్మాణం కోసం ‘మై బ్రిక్..మై అమరావతి’ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో ఈ-ఇటుకను రూ.10 పేరుతో విరాళాల సేకరించారు. అప్పటి విరాళాలు ఏమయ్యాయో లెక్కను మాత్రం సీఆర్డీఏ ఇప్పటి వరకు చెప్పకపోవడం విశేషం. మళ్ళీ ఇప్పుడు విరాళాల సేకరణకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. కాగా, అమరావతికి అప్పులు పుట్టక చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేపడుతున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే అమరావతి కోసం 31 వేల కోట్లు అప్పులు చేశారు. మరో 70వేల కోట్ల అప్పులు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.రైతులతో మంత్రి భేటీ..ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అమరావతి రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం అమరావతి రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని జేఏసీ నేతలు బహిరంగ విమర్శలు చేసిన తర్వాత సమావేశం అవుతున్నారు. అమరావతిలో రైతులు కేటాయించిన ప్లాట్లు డెవలప్ చేయట్లేదని, భూముచ్చిన రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నాలుగు రోజుల ముందు అమరావతి జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అమరావతి రైతులు.. సీఆర్డీఏ కార్యాలయాల్లో రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని, పనిచేయాలంటే లంచాలు అడుగుతున్నారని బహిరంగ విమర్శ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబూ.. మీ భుజాలు మీరే చరచుకుంటే ఎట్లా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్లో చేసిన ప్రసంగాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవేనా? నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి నారాయణ తదితరులు ఆరు రోజుల సింగపూర్ పర్యటన పెట్టుకోవడమే ఆశ్చర్యం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం వరకూ ఓకే కానీ.. ఆ సింగపూరే సర్వస్వం అన్నట్లు మాట్లాడటం వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని, దాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమనడం మరీ అతిగా అనిపించింది. సింగపూర్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారట. తాను జైలులో ఉన్నప్పుడు డెబ్బై, ఎనభై, తొంభై దేశాలలో తెలుగు వారు తమ పనులు మానుకుని నిరసనలు తెలిపారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన ఏ కేసులో అరెస్టు అయింది మాత్రం వివరించలేదు. సింగపూర్ అత్యంత నీతివంతమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆ దేశ మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన ఈశ్వరన్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లిన విషయాన్ని విస్మరిస్తే సరిపోతుందా!.సింగపూర్ అవినీతి బాగా తక్కువ ఉన్న దేశం కావచ్చు. కానీ, ఇతర దేశాల అవినీతి డబ్బుకు కేంద్రం అన్న పేరు కూడా ఉంది. సింగపూర్ కంపెనీలు అమరావతికి ఎంతవరకు వస్తాయో డౌటే అంటూనే.. సంప్రదింపులతో పాత ఒప్పందాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని చంద్రబాబు ఈ టూర్‌కు ముందు చెప్పారు. అంటే మళ్లీ సింగపూర్ కంపెనీలకు 1700 ఎకరాలు కట్టబెట్టి, ఆ భూమి అభివృద్ది కోసం ప్రభుత్వమే రూ.5500 కోట్లు వెచ్చించి, ఆ ప్లాట్ల అమ్మకానికి వారికి అప్పగిస్తారా? తద్వారా వచ్చే ఆదాయంలో 58 శాతం వారికే ఇస్తారా?. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం సింగపూర్ కంపెనీలతో పనేముంది?. ఏపీకి సంబంధించిన పలు సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి కదా!. ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు దేశీ సంస్థలకే ఇచ్చారు కదా!. అందులో తెలుగువారి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. వారు చేయలేని పని ఏదో సింగపూర్ కంపెనీలు చేస్తాయన్నట్లు చంద్రబాబు వంటి సీనియర్ నేత మాట్లాడడమే ఏపీకి పరువు తక్కువ. ఆ దేశ మంత్రితో చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. అమరావతి కోసం కన్సార్షియం ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు కూడా. సాంకేతిక సాయం అందిస్తామని మాట వరసకు అన్నట్లు అనిపిస్తుంది. సింగపూర్ అయినా, మరో దేశం అయినా ఇక్కడ జరిగే నిర్మాణాలలో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటే గౌరవం కాని, మనం వెళ్లి పిలిస్తే లోకువ అవడం లేదా!. దీనిని పక్కనబెడితే సింగపూర్ వెళ్లి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటి?. అది ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీయడం కాదా!. నిజానికి ఏపీలో ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర పరువును దెబ్బతీశాయి. ప్రతి నిత్యం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ టూర్‌కు వెళ్లినా ఆంక్షలు పెట్టడం, రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా!. ఈ తరహా నియంతృత్వం ఏపీకి పేరు తెస్తుందా?. అపకీర్తి తెస్తుందా?. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న దందాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న స్కాంలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న తీరు.. ఇవి కదా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేది?. వాటిపై వివరణ ఇవ్వకుండా, జగన్‌పై ఆరోపణలు చేస్తే ఏమి లాభం?.జగన్ టైమ్‌లో విధ్వంసం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు కదా!. ఈ 14 నెలల కాలంలో అది ఏంటో ఎన్నడైనా చెప్పారా?. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఆధారాలు చూపారా?. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి రావడం అప్రతిష్ట కాదా!. అప్పులు పుట్టడం లేదంటూనే సుమారు రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది. ఆ విషయం సింగపూర్ లేదా ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారికి తెలియదన్న నమ్మకంతో మాట్లాడుతున్నారా?. జగన్ తీసుకు వచ్చిన ఓడరేవులు, వైద్య కళాశాలలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా తదితర సంస్థల భవనాల నిర్మాణం వంటివి ఏపీకి ఉపయోగమా? కాదా?. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓడరేవులు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?. ఏపీకి వచ్చిన వైద్య కళాశాలల సీట్లను కూటమి ప్రభుత్వం ఎందుకు వదలుకుంది?.జగన్ టైమ్‌లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నోరు వెళ్లబెట్టడం, లేదా అన్నీ చేసేశాం కదా అని దబాయించడం ఏపీకి వన్నె తెచ్చిందా?. ప్రతి ప్రభుత్వం కొన్ని విధానాలు నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం ముందుకు వెళుతుంది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు తన మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఇన్ని హామీలను ఇలా అమలు చేసి ప్రజల ముందు గర్వంగా నిలబడ్డామని చెప్పుకునే పరిస్థితి ఉందా?. అసలు పెన్షన్ రూ.1000 పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన వాగ్ధానాలన్నిటిని ఏడాది ఎగవేసిన విషయం వాస్తవం కాదా?. అది చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చిందా? తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వారిపైనే నిందారోపణలు చేయడం ఎంతవరకు పద్దతి అన్నది ఆలోచించుకోవాలి.సింగపూర్ అయినా మరోచోటికి వెళ్లినా, ఏపీకి ఉన్న సానుకూల అంశాలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా లభించే సహకారం మొదలైన అంశాలు తక్కువ మాట్లాడి, ఎక్కువ భాగం జగన్ దూషణకు కేటాయిస్తే ఎల్లో మీడియాలో బ్యానర్లుగా పనికి రావచ్చేమో కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఉపయోగపడవు. సింగపూర్‌లో తెలుగు వారు తన వల్లే ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం, అంతకన్నా మించి ఆయన తనయుడు లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే అది చంద్రబాబు ఘనతేనని పొగుడుకోవడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడు కోవడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టవచ్చేమో కానీ, ఆ తర్వాత ఇలా వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారేంటి అన్న ఆలోచన వచ్చి అవహేళనకు గురవుతారని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇలాంటివి అనుభవమైనా ఈ ధోరణి మారడం లేదు. తల్లికి వందనం స్కీంను లోకేశ్ కనిపెట్టారని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. దానికి కారణం జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు ఇది కాపీ కావడమే.ఇటీవల ఆయా మీటింగ్‌లో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు, లోకేశ్‌లు ప్రకటించగా ఎలా నవ్వులపాలైంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చెబుతున్నాయి. కర్ణాటక మంత్రి బోసు రాజు ఒక ట్వీట్ చేస్తూ ఇప్పటికే కర్ణాటకలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైందని, ఏపీలో తలపెట్టిన దానికన్నా మూడు రెట్లు శక్తిమంతమైందని, ప్రచారం చేసుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ వల్ల చంద్రబాబుకు అపఖ్యాతి వచ్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అబద్దమైనా, నిజమైనా తన గొప్ప తానే ఒకటికి వందసార్లు చెప్పుకుంటే జనం నమ్ముతారన్నది బాబు నమ్మిక. దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్టీసీ స్థలం ఇవ్వడం తప్పుకాదు: నారా లోకేశ్
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడం వ్యర్థమని.. నేరుగా జీఓలే ఇచ్చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. సింగపూర్ పర్యటన అనంతరం గురువారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడంలోగానీ.. అలాగే, 99 పైసలకే భూమి కేటాయింపు చేయడంలోగానీ తప్పులేదన్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. -
లులుకు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
అవినీతి చక్రవర్తీ.. నీకో దండం.. ఛీ కొట్టిన సింగపూర్
-
బాబుకు బిగ్ షాక్.. అమరావతి నిర్మాణానికి నో చెప్పిన సింగపూర్
-
సారీ చంద్రబాబు: సింగపూర్ ప్రభుత్వం
సాక్షి,అమరావతి: సింగపూర్‌తో ఒప్పందాలు పునరుద్ధరించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడ ప్రభుత్వం షాకిచ్చింది. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది. కేవలం పట్టణాభివృద్ధి ప్రణాళికలతో పాటు సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామంటూ అమరావతిపై సింగపూర్ మంత్రి ట్రానీ లెంగ్ కీలక ప్రకటన చేశారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఒప్పందాలు జరిగాయి. అయితే,ఇప్పుడు ఈశ్వరన్ ఒప్పందాలపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. దీంతో సింగపూర్‌లో ఉండగానే చంద్రబాబుకు చుక్కెదురైంది. -
మంత్రిగారి కంపెనీకి 845 ఎకరాలు ధారాదత్తం చేసిన చంద్రబాబు
-
లులు మాల్ కు కారుచౌకగా భూములు
-
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై పుత్తా శివశంకర్ విమర్శనాస్త్రాలు
-
చంద్రబాబుకు అమరావతి రైతులు షాక్.. సెంటు భూమి కూడా ఇవ్వం
-
బాబూ.. మీడియా ప్రచారమేనా?: అమరావతి జేఏసీ ఆగ్రహం
సాక్షి, అమరావతి: అమరావతి పనులు నత్తనడకన సాగుతుండటంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమరావతి ఉద్యమంలో పని చేసిన మాకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ 13 నెలలు అవుతున్నా ఇప్పటి దాకా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సరికదా.. పనుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని జేఏసీ మండిపడింది.అమరావతి జేఏసీ సమన్వయ సభ్యుడు ఆలూరి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటిదాకా చాలావరకు ప్లాట్లలో రోడ్లు వేయలేదు. సరిహద్దు రోడ్లు కూడా వేయలేదు. పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. రాయపూడి వద్ద సీడీఎక్సెస్ రోడ్డు వద్ద పని ఎందుకు ఆగిపోయింది. ఈ పనిని ఎందుకు చేయలేకపోతున్నారు. వెంకటపాలెం వద్ద కూడా అలాగే ఉంది. కరకట్ట రోడ్డు పెంపు లేదు. మీడియాలో మాత్రమే ప్రచారం ఉంది. 10 ఎకరాలు కూడా రైతులను ఒప్పించుకుని ఎందుకు తీసుకుని లేకపోతున్నారు?. రైతులకు కౌలు డబ్బులు ఇంకా జమచేయలేదు.. ఆగస్టు వస్తున్న ఎందుకు చేయలేదు?. రాజధాని చట్టబద్దతపై పార్లమెంట్లో మాట్లాడాలి. అమరావతి ఉద్యమంలో పని చేసిన మాకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ 13 నెలలు అవుతున్నా ఇప్పటి దాకా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు. -
హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్లెస్ ఫెలో
సాక్షి, విజయవాడ : కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదస్తులో తెలియజేసేలా రోజుకో వీడియో బయటకు వస్తోంది. మంత్రి నారాయణ తన నోటికి పని చెప్పారు. అమరావతి రాజధాని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమరావతి పనులను మంత్రి నారాయణ తాజాగా పర్యవేక్షించారు. ఆ సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదంటూ కాంట్రాక్టు సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్లు చెప్పే వాస్తవ పరిస్థితి వివరిస్తున్నా వినకుండా తన ఫ్రస్టేషన్ ప్రదర్శించారు. హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్లెస్ ఫెలో అంటూ అందరి ముందు ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు.కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. జేసీ ప్రభాకరరెడ్డి, గాలి భానుప్రకాశ్, బొలిశెట్టి శ్రీనివాస్, ఇలా ఇప్పుడు ఈ లిస్టులో నారాయణ కూడా వచ్చి చేరారు. -
ఆరు సంవత్సరాలలో అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఒక్కటి చూపించండి
-
‘1,500 ఎకరాల్లో అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణమా?’
సాక్షి, అమరావతి: అమరావతిలో రైల్వేస్టేషన్‌ను భారతదేశంలోనే అతి గొప్ప రైల్వేస్టేషన్‌గా 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతు నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషనా? ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. ‘అత్యంత పురాతనమైన చెన్నై రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. కేవలం 13 ఎకరాలు, అదే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. 16 ఎకరాలు, బెజవాడ రైల్వేస్టేషన్ విస్తీర్ణం ఎంతో తెలుసా?.. కేవలం 8 ఎకరాల్లో ఉంది. అసలు 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్లను ఏమనాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అదే మాట ఎవరైనా మామూలోడు మాట్లాడితే.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడ్ని చెప్పుతీసి కొట్టాలని అంటాం. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం ఏమనగలం? అది పిచ్చివాడు మాట్లాడినట్టుగా అనుకోవాలే తప్ప అంతకు మించి వేరే భాష ఏం మాట్లాడగలం’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
చిన్నారికి నామకరణం చేసిన వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారికి నామకరణం చేశారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు కెవిన్ అనే పేరు పెట్టారు. తమ కుమారుడికి నామకరణం చేయాలని గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కొండాబత్తుల గిరి, జ్యోతి దంపతులు వైఎస్ జగన్‌ను కోరారు. గిరి, జ్యోతి దంపతుల కోరిక మేరకు కెవిన్ అనే పేరు పెట్టి, చిన్నారిని లాలించారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు గిరి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు -
అమరావతిలోని భూ కేటాయింపుల్లో ప్రభుత్వ పెద్దల దమననీతి
-
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్
సాక్షి,కృష్ణాజిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనొద్దని నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పామర్రు మీటింగ్‌లో చెప్పా.నేను ఎవరినీ నరకమని చెప్పలేదు. 8వ తేదీన మాట్లాడితే 12వ తేదీన టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో నాపై డిబేట్లు పెట్టారు. పచ్చ పార్టీ మహిళలతో నన్ను బూతులు తిట్టించారు.చీకట్లో నేను తలలు నరికేయమన్నానని టీడీపీ ఛానల్స్‌లో ప్రచారం చేశారు. వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరమా...అతని కొడుకు లోకేష్ తరమా?రోజులు లెక్కపెట్టుకో కొల్లు రవీంద్ర. వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడబిడ్డ కన్నీరు మీ పచ్చ సైకోలను ఇంటికి పంపించడం ఖాయం.ఓయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినడం లేదు. సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినడం లేదు.బందరు బీచ్‌లో ఇసుక తింటున్నావ్..నువ్వు అన్నం తినడం లేదు.తోట్ల వల్లూరులో ఇసుక తింటున్నావ్.. నువ్వు అన్నం తినడం లేదు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయలు లేదు. కానీ ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు కోట్ల రూపాయల డబ్బులెక్కడివి. కొల్లు రవీంద్ర నీ దోపిడీ బందరును దాటి కృత్తివెన్ను వరకూ పాకింది.ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినడం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’అని హెచ్చరించారు. -
చంద్రబాబు అండ్ కో దోపిడీ.. 10శాతం ఫినిషింగ్ పనులకే రూ.524 కోట్లు విడుదల
సాక్షి,అమరావతి: దోపిడీకి కాదేదీ అనర్హం అన్న రీతిలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ దోపిడీ రాజ్యంగా మారింది. కేవలం 10శాతం ఫినిషింగ్ పనులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లకు రూ.524కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఫినిషింగ్ పనుల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, ల్యాండ్ స్కాపింగ్,ఇతర పనులున్నాయి. 90శాతం ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు గతంలోనే పూర్తి కాగా కేవలం 10శాతం పనులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.524 కోట్లు విడుదల చేయడం గమనార్హం. ఇది చంద్రబాబు అండ్ కో దోపిడీకి నిదర్శనమని ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు. కేవలం మిగిలి పోయిన 10శాతం పనులకు రూ.524కోట్లు కేటాయించడం ఏంటని వారు వారు ప్రశ్నిస్తున్నారు. -
భూసేకరణపై కూటమిలో వణుకు.. చంద్రబాబు రుసరుసలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి మలి విడత భూ సమీకరణపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ భేటీలోనే.. మలి విడత కింద 20 వేల ఎకరాలకు పైగా సమీకరణకు ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి కార్యరంగం సిద్ధమైంది. మున్సిపల్ మంత్రి నారాయణ సైతం భూ సమీకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.అయితే, రాజధాని రైతుల్లోనే ఆందోళన రావడం, తొలి విడత సమీకరణ చేసిన గ్రామాల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కలి్పంచకుండా, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు తిరిగివ్వకుండా రెండో విడత సమీకరణ ఏమిటనే వాదన మొదలైంది. మలి విడత సమీకరణ ద్వారా రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు రాజధాని కడుతున్నారని ప్రస్ఫుటం అవుతోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అందుకే భూ సమీకరణకు ఆమోదం తెలపకుండా.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, రాజధాని మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చించడంతో పాటు ఎందుకు ఈ సమీకరణ చేస్తున్నదీ వివరించిన తరువాత ప్రతిపాదనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు.దీంతోనే మలి విడత భూ సమీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తేలిపోయింది. ఇదంతాచూస్తే.. రాజధాని భూ సమీకరణలో ముందుకెళ్లాలని నిర్ణయించినా ప్రజా వ్యతిరేకత దృష్ట్యా చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సోలార్ ప్రాజెక్టు కోసం 8 వేల ఎకరాలను తీసుకోవడంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయని, మనం తప్పు చేస్తున్నట్లు స్పష్టమైందని, ప్రజలు దీనిపైనే మాట్లాడుకుంటున్నారని మంత్రులు అన్నట్లు సమాచారం.దేనిపైనా సరిగా స్పందించడం లేదు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు భారీగా ప్రజలు తరలిరావడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్ని ఆంక్షలు పెట్టినా అంతమంది ఎలా వచ్చారంటూ మంత్రులపై కోపం చూపించినట్లు తెలిసింది. మంత్రులు సరిగా పనిచేయడంలేదని, దేనిపైనా సరిగా స్పందించడం లేదని మండిపడ్డారని సమాచారం. తోతాపూరి మామిడి కొనుగోలులో సంబంధిత శాఖల మంత్రులు బాధ్యతగా వ్యవహరించలేదని, ఇలాగైతే మంత్రులను మార్చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం.పనిచేయనివారి స్థానంలో కొత్త వారిని పెడతానని అన్నట్లు తెలిసింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విషయంలోనూ మంత్రులు చురుగ్గా వ్యవహరించలేదని, ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఏడాదిలో ఎన్నో అద్భుతాలు చేసినా మంత్రులు ప్రజలకు చెప్పలేకపోతున్నారని, ప్రజలను మేనేజ్ చేయలేని వారికి పదవులు ఎందుకని అన్నట్లు తెలిసింది. వైఎస్ జగన్‌ను నిలువరించడంలో మంత్రులు విఫలం అవుతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోసోల్ భూముల విషయంలో వైఎస్ జగన్ వైఖరిపై మంత్రులు ఎవరూ సరిగా స్పందించలేదని అందువల్లే కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు జనంలోకి వెళ్లిందని అన్నట్లు సమాచారం. వైఎస్ జగన్ పర్యటనలు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్న అంశాలను వివాదాస్పదం, డైవర్షన్ చేయడంపై దృష్టిపెట్టాలని పరోక్షంగా సూచనలు చేసినట్లు తెలిసింది. -
భూములివ్వం.. గోబ్యాక్.. గోబ్యాక్
తాడికొండ: ‘గోబ్యాక్ గోబ్యాక్.. మా భూములిచ్చేది లేదు.. గోబ్యాక్ గోబ్యాక్’.. అంటూ రాజధాని భూసమీకరణ గ్రామసభలలో రైతులు పార్టీలకు అతీతంగా శనివారం కూడా పెద్దఎత్తున నిరసన గళం వినిపించారు. సభ జరిగిన ప్రతీచోటా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రశ్నలతో హోరెత్తించారు. భూములిచ్చేందుకూ ఎవరూ సిద్ధంగా లేరని తెగేసి చెప్పారు. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారంటూ వారిపై విరుచుకుపడ్డారు.రాజధాని భూసమీకరణ సమాయత్త సభలలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో గ్రామసభ నిర్వహించిన అనంతరం తాడికొండ విచ్చేసిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, అధికారులు సభ మొదలు పెట్టేందుకు మైకు అందుకోగానే రైతులు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. భూసమీకరణ పేరుతో రైతుల పొట్టగొట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసలు మా ప్రాణ సమానమైన భూములు ఎందుకివ్వాలి’.. అని పలువురు సూటిగా ప్రశ్నించారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెళ్తే మంచిదని, అంతకుమించి మాట్లాడితే ఒప్పుకునేదిలేదని రైతులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చి న రైతులకు న్యాయం చేయలేదుగానీ.. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు మా భూములు ధారాదత్తం చేసి మమ్మల్ని రోడ్డున పడేసేందుకు వచ్చారా.. భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్పారు. పైగా.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇప్పటికే రూ.6వేలు ఇస్తోందని.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇస్తానని హామీ ఇచ్చి ందని.. ఇలా మొత్తం రూ.26 వేలు వస్తుందని.. కానీ, మీరిచ్చే రూ.30 వేలు కౌలు ద్వారా మాకు అదనంగా దక్కేది కేవలం నాలుగు వేలేనా అని ముక్తకంఠంతో రైతులు నిలదీశారు. పైగా.. భూమిపై వచ్చే పంట సాగు ఆదాయం కూడా తాము కోల్పోతామని వారు కుండబద్దలు కొట్టారు. దీంతో.. చేసేదిలేక సభ వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే, అధికారులు ప్రకటించి అక్కడ నుంచి జారుకున్నారు. పొన్నేకల్లు సభలోనూ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితర అ«ధికారులను రైతులు తరిమికొట్టి సభ జరగకుండా అడ్డుకున్నారు. నిడుముక్కలలోనూ ఉక్కిరిబిక్కిరి.. అనంతరం.. నిడుముక్కల గ్రామంలో నిర్వహించిన సభలోనూ రైతులు వారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్రామానికి చెందిన రైతు బండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మాకెలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మీరు మాకు భరోసా ఇస్తారా’.. అని సభా ముఖంగా ప్రశ్నించడంతో ఎమ్మెల్యే, అధికారులు తెల్లముఖం వేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు యత్నిస్తాం తప్ప మాకేం సంబంధమని వారు మాట దాటవేశారు. దయచేసి మా భూములు వదిలేయండి.. ఈ సభలోనే ఓ మహిళ మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినవన్నీ జరుగుతాయా? ఒకవేళ ఇవన్నీ జరగకపోతే మీరు మాపై దయుంచి మాకు కూడా చట్టాలు వర్తించేలా జీఓ తీసుకురండి.. అప్పుడు రైతులకు న్యాయం జరగకపోతే మీపై చర్యలు తీసుకుంటాం.. అంతేగానీ, అధికారం ఉందని మీరు భూములు తీసుకెళ్లిపోతే తర్వాత మేం టెంట్లు వేసుకుని ధర్నాలు, నిరసనలు చేయలేం.. దయచేసి మా భూములు వదిలేయండి’.. అని తీవ్ర స్వరంతో చెప్పారు. భూములివ్వడానికి ఎవరూ సుముఖంగా లేరు.. ఇక మండల టీడీపీ అధ్యక్షుడు తలశిల ప్రసన్న మాట్లాడుతూ.. గతంలో పూలింగ్ సమయంలో రూ.2 లక్షలు ఉన్న ముంపు పొలాలకు ఇచ్చి న ప్యాకేజీ.. ఇప్పుడు రూ.3 కోట్ల నుంచి రూ.7 కోట్లు పలుకుతున్న మా మెరక పొలాలు ఒకటేనా అని ప్రశ్నించారు. అప్పుటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. అప్పటి అదే ప్యాకేజీనే ఇప్పుడు మాకిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. మీరు హామీ ఉండి మా తరఫున పోరాటం చేస్తానంటే మీ హామీ మీద అయితే భూములిస్తామన్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఏం చెప్పాలో అర్ధంకాలేదు. ఇంతలో మరో రైతు మైకు అందుకుని.. ‘అందరి తరఫున నేను మాట్లాడుతున్నా.. ఇప్పుడు మా భూములకు ధరలు ఉన్నాయి. భూములివ్వడానికి రైతులెవరూ సుముఖంగాలేరు. ముందు 44 వేల ఎకరాలు అన్నారు.. ఆ గ్రామాల్లో సభలు పూర్తయ్యాక మళ్లీ అదనపు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. అసలు ఎంత సమీకరణ చేస్తారు.. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు’ అని ఆయన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతుల ఫైర్.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘గతంలో 33 వేల ఎకరాలు తీసుకుంటే దానికి రైతుల ప్లాట్లు ఇతర అవసరాలకు 60 శాతం భూమి పోగా మిగిలిన భూమిలో అభివృద్ధి చేస్తున్నారు.. అది చాలదు కనుక పెద్ద సంస్థలకు ఇచ్చేందుకు ల్యాండ్ బ్యాంక్ కోసం సమీకరణ చేస్తున్నాం’ అని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. దీంతో.. భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు బరితెగించి భూసమీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసినట్లు తమకు అనుకూలమైన వారితో సంతకాలు పెట్టించుకుంటూ నివేదికలు సిద్ధంచేస్తున్నారు. -
అమరావతిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడి, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూసమీకరణకు ఆమోదం తెలిపింది. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 50వ సమావేశం జరిగింది. ఏడు అంశాలను సీఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పీ(ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన)ను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చింది. రాజధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అవసరమైన ఇసుకను ప్రకాశం బ్యారే జీ ఎగువన డిసిల్టింగ్ ద్వారా సమకూర్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. ఇసుక డిసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకూ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి 2 ఎకరాలు, జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)కి 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించింది. ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్‌కు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, బీజేపీకి 2 ఎకరాలు, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలు కేటాయించింది. గెయిల్, అంబికా గ్రూప్‌కు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేసింది. మంగళగిరి సమీ పంలో ఈ–15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం
-
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
మరోసారి రాజధానికి భూ సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు.రైతులకు ఆశ చూపుతున్న వివీ..» భూములిచ్చిన రైతులకు తొలి ఏడాది మెట్ట భూమికి ఎకరానికి రూ.30 వేలు, మాగాణి భూమికి ఎకరానికి రూ.50 వేలు కౌలు ఇస్తారు. ఏటా కౌలు ఎకరానికి మెట్టకు రూ.3 వేలు, మాగాణికి రూ.5 వేల చొప్పున పెంచుతారు.» నిమ్మ, సపోటా, జామ తదితర ఉద్యానపంటల రైతులకు అదనంగా రూ.లక్ష ఇస్తారు.» పదేళ్లపాటు రైతు కూలీలకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్‌గా ఇస్తారు.» ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.1.50 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తారు.» పూలింగ్ కింద భూమి ఇచ్చే రైతులకు..పట్టా భూమి, మెట్ట భూమి ఎకరానికిగానూ అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ఇంటి స్థలం, 250 గజాల వాణిజ్య స్థలాలను ప్లాట్లుగా ఇస్తారు. మాగాణి భూమికైతే ఎకరానికిగానూ అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ఇంటి స్ధలం, 450 గజాల వాణిజ్య స్థలాలను ప్లాట్లుగా ఇస్తారు. అసైన్డ్ భూమికి కూడా ఇదే తరహాలో ప్రయోజనాలు కల్పిస్తారు. -
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్.. అమరావతి భూసేకరణపై పెద్దిరెడ్డి కామెంట్స్
-
చంద్రబాబును జైల్లో వేయడానికి పర్ఫెక్ట్ ఈక్వేషన్!
-
మరో దోపిడీకి బాబు భారీ స్కెచ్
-
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెన పల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్ ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది. పేర్ని నాని, విడదల రజిని, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను కూడా రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
అమరావతికి మరో 45 వేల ఎకరాలు సేకరణ
సాక్షి, అమరావతి: రాజధాని కోసం గతంలో సీఆర్డీఏ తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్స్ రావాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అప్పుడే టూరిజం... తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను నారాయణ, సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు. ‘‘2015 జనవరి నాటి ల్యాండ్ పూలింగ్ నియమ నిబంధనలను పునరుద్ధరించాం. వాటి ఆధారంగా కొత్తగా 45 వేల ఎకరాలు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును 5వేల ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాల్లో వస్తాయి. కనీసం 45 వేల ఎకరాలు పూలింగ్ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేం. ఈ మొత్తం భూమి కేపిటల్ సిటీ 29 గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. భూసేకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేస్తాం’’ అని నారాయణ చెప్పారు. భవన నిర్మాణ నిబంధనలు సరళీకరణ» భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించినట్లు నారాయణ తెలిపారు. అపార్ట్మెంట్లు్ల, గ్రూప్ డెవలప్మెంట్ ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి ఇప్పటికాదా టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చన్నారు.» గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీలు, ఆస్పత్రుల వంటి భవిష్యత్ అవసరాల కోసమే అమరావతిలో మరోసారి భూ సమీకరణ అని పార్థసారథి పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని భూముల సమీకరణకు ఒకే తరహా నిబంధనలు (యూనిఫాం రూల్స్)ను ఆమోదించినట్లు చెప్పారు. ‘‘ఎన్జీటీ, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా జలాశయాల రక్షణకు చర్యలు తీసుకుంటాం. అసైన్డ్, దేవాదాయ, లంక భూములను జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ చేసి యాజమాన్యాలను నిర్ధారిస్తాం. సరిహద్దు వివాదాలు లేకుండా డ్రోన్స్ సర్వే చేస్తాం. ఆధార్ ద్వారా భూ యజమానులను నిర్ధారిస్తాం. భూమి లేనివారికి నెలకు రూ.5 వేలు చొప్పున పదేళ్ల పాటు పెన్షన్, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తాం. రైతుల వ్యవసాయ రుణాలను రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తాం’’ అని వివరించారు.కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..» అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా జీఏడీ, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణాలను రూ.844 కోట్లతో ఎన్సీసీకి, రూ.1,423 కోట్లతో షాపూర్ పల్లోంజీకి, రూ.1,247 కోట్లతో ఎల్అండ్టీకి ఇచ్చేందుకు ఆమోదం.» అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు 50 ఎకరాలను చదరపు మీటర్‌కు ఏడాదికి రూపాయి చొప్పున 60 ఏళ్లు లీజుకిచ్చేందుకు అంగీకారం.» అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యుటీ కలెక్టర్ ఉద్యోగం. » జాప్యం కారణంగా నంద్యాల జిల్లాలో టయారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో అరబిందో రియాల్టీ– ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్)కు కేటాయించిన 800 మెగావాట్ల అవుకు ప్రాజెక్టు రద్దు. » చిత్తూరు జిల్లా శాంతిపురం, కుప్పం మండలాల్లో వి.కోట, రామకుప్పం వద్ద పాలార్ నదిపై 17 చెక్ డ్యాముల మరమ్మతు, పునర్నిర్మాణానికి రూ.5,355 లక్షలకు, పాలార్ నదిపై 4 చెక్ డ్యాముల మరమ్మతుకు రూ.1,024.50 లక్షలకు పరిపాలనా ఆమోదం. » వైఎస్సార్ కడప జిల్లా గండికోట వద్ద ఓబెరాయ్ (విల్లాస్) రిసార్ట్ అభివృద్ధి కోసం 50 ఎకరాలు ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.» ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వేడుకల సభలు నిర్వహణ. -
సుపరిపాలన సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సాక్షి’కి ఆపాదించడం సరికాదు
సాక్షి, అమరావతి: సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండించింది. తాము ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలను చూపుతామని తెలిపింది. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని వెల్లడించింది.‘సాక్షి’ మొదటి నుంచీ కూడా మహిళల పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తోంది. మహిళల వికాసానికి, వారి అభ్యున్నతికి సంబంధించి అనేక ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తోంది. పాత్రికేయ విలువలకు కట్టుబడి పని చేస్తున్న ‘సాక్షి’ ఏనాడు గీత దాటలేదు. పాత్రికేయ చట్టాలు, నిబంధనల పరిధిలో ప్రజలకు వాస్తవాలను వెల్లడిస్తోంది. దీంతో.. ‘సాక్షి’ని నేరుగా ఏమీచేయలేకపోతున్నామనే బాధలో ఉన్న టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా, ‘సాక్షి’కి ఏమాత్రం సంబంధంలేని వ్యాఖ్యలను చూపించి కుట్రలకు తెర తీస్తుండటం దారుణం అని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని ‘సాక్షి’ టీవీ స్పష్టం చేసినప్పటికీ ఇంకా ఏదో రాద్ధాంతం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదిస్తూ, సంస్థ ప్రతిష్టను దిగజార్చే పన్నాగంతో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుండటం సరికాదంటున్నారు. దురుద్దేశంతో ‘సాక్షి’పై టీడీపీ కుట్రలు ‘సాక్షి’ కార్యాలయాలపైకి తన మూకలను ఉసిగొల్పి సంస్థను ఇబ్బంది పెట్టాలని టీడీపీ వ్యూహ రచన చేస్తుండటం సరికాదని, ఇది కొత్త విష సంస్కృతికి దారి తీస్తుందని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా, ఫలానా మంచి పనులు చేశామని చెప్పుకునేందుకు ఏమీ లేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుండటంతో ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఎప్పటి లాగే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపింది.ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం విజయవాడ ‘సాక్షి’ కార్యాలయం వద్దకు కొంత మందిని పంపించి గొడవ చేయించింది. ‘సాక్షి’కి మహిళలంటే గౌరవమని, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఎంత మాత్రం సమర్థించలేదని, సమర్థించబోమని పోలీసుల సమక్షంలో వారికి స్పష్టం చేయడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు. అయినా కూడా శనివారం రాత్రి పొద్దుపోయాక కూడా టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగింది. పైగా ఆదివారం రాష్ట్రంలోని అన్ని ‘సాక్షి’ కార్యాలయాల వద్ద ఆందోళనలకు సన్నాహాలకు పిలుపునిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదని సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. -
కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: సాక్షి టీవీ
హైదరాబాద్: శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు. -
కేసీఆర్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
-
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్‌గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్‌లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.శంషాబాద్‌లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. -
జగన్ అడిగిందేంటి? బాబు చెప్పేదేంటి!!
అమరావతి రాజధానైతే జగన్‌కు వచ్చే నష్టమేమటి?.. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న ఇది. అయితే తనకు నష్టమని జగన్ ఏనాడూ చెప్పలేదు. భారీ స్కాములతో.. వేల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణాలు చేపడితే ఆ నష్టాన్ని భరించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని అన్నారాయన. నాగార్జున యూనివర్శిటీ సమీపంలోనో ఇంకో చోటో.. 500 ఎకరాలలో నిర్మిస్తే సరిపోయే దానికి లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయలంటూ ప్రజల నెత్తిన పెద్ద అప్పుల కొండ పెట్టడం ఎందుకు? అని జగన్ అడిగారు. దీంతోపాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి కొన్ని ప్రశ్నలు నేరుగానే అడిగారు. కానీ.. చంద్రబాబు వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేక దబాయింపులకు దిగినట్లు స్పష్టమవుతుంది ఆయన స్పందన చూస్తే. పైగా ఆయన తప్పు చేస్తూ దానిని కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని తెలిసిపోతుంది. అమరావతి(Amaravati) పేరుతో చేపడుతున్న నిర్మాణాల వ్యయం గురించి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నిలదీస్తే, దానికి జవాబు ఇవ్వకుండా, అసూయ అని, ఇంకొకటని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? చదరపు అడుగుకు రూ.పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మాణాలు చేస్తున్న మాట నిజమే కదా?. దేశంలో ఎక్కడ కూడా నిర్మాణ వ్యవయం ఎంత ఎక్కువ లేదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాలు కాదు.. అమెరికాలోనూ ఉండవు. పైగా అమరావతిలో భూమి ఖర్చు లేనే లేదు. 👉గతంతో.. పోలిస్తే సిమెంటు, ఉక్కు ధరలు తగ్గాయి. ఇసుకేమో ఉచితం! అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 2018 నాటి ధరల కంటే ఎక్కువ ఎందుకు చెల్లించేందుకు సిద్ధపడుతోందని జగన్ అడిగితే.. రైతులు భూములు రాజధానికి ఇస్తే మీకెందుకు అసూయ? అనడం అసలు విషయాన్ని దాచివేయడం కాదా! మంత్రులు,హైకోర్టు జడ్జీల బంగ్లాలకు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10418, ఐఎఎస్ అధికారుల బంగ్లాలకు రూ.9771, ఐదు టవర్ల నిర్మాణానికి రూ.8981 వ్యయం చేయడం నిధుల దుర్వినియోగమా కాదా? హైదరాబాద్ వంటి నగరంలోనే చదరపు అడుగుకు మహా అయితే రూ.నాలుగు వేలు అవుతుంది. భూమి, ఇసుక ఉచితంగా వస్తున్నా, అంతకు రెట్టింపు కంటే ఎక్కువ రేట్లు ఇస్తున్నారంటే, అందులో అవినీతి ఏ స్థాయిదో అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం చేసిన అంశాన్ని, ఆర్థిక సంఘానికి రూ.77 వేల కోట్లు అవసరం అని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. లక్ష కోట్లు పెట్టి ఏమి చేస్తావు? అంటే అలా అడగకూడదని జగన్ కు చెప్పే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? అమరావతి ఏమైనా చంద్రబాబు సొంత సామ్రాజ్యమా? లేక చంద్రబాబేమైనా ఏపీకి నియంత? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌పై ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు? జగన్ ఇప్పుడు ఆధార సహితంగా ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేక ఎదురుదాడి చేస్తే సరిపోతుందా! నిజానికి అమరావతి కోసం ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పు సమీకరించారట. 👉గతంలో తీసుకున్న 33 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలలోనే ఇంతవరకు అభివృద్ది జరగకపోతే, ఇంకో 44 వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారు? ఆ భూముల యజమానులు అక్కడ పంటలు పండించుకోకుండా ఉండడం, వారికి ప్రభుత్వం కౌలుగా రూ.వందల కోట్లు చెల్లించడం.. చివరికి ఏమి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడం. ఇదంతా ఏపీకి అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో అమరావతికి అసలు ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వ్యయం చేయనవసరం లేదని చంద్రబాబే అన్నారు. ప్రభుత్వానికి మిగిలే ఎనిమిదివేల ఎకరాలు అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికారు. ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదు. కాని, ముందుగా రూ.లక్ష కోట్ల అప్పయితే పడబోతోంది. అసలు, వడ్డీ కలిసి తడిసి మోపెడు అయితే దాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా చెల్లిస్తారా? లేక కేవలం అమరావతిలోని భూములు కలిగిన వారే చెల్లిస్తారా? దీనిని అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ గా చేయడం ప్రభుత్వానికి తగునా!. 👉అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో చెప్పిన దానిని ఎవరైనా నమ్ముతారా?. బడ్జెట్లోనే రూ.6,000 వేల కోట్లు కేటాయించారు కదా? అందులో నుంచి సుమారు రూ.2,800 కోట్లు సీఆర్డీఏకి విడుదల చేసింది అసత్యమా?. ప్రపంచ బ్యాంక్, జర్మని సంస్థ, హడ్కోల నుంచి తీసుకుంటున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం చెల్లిస్తుందా?.. లేదు కదా!. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా? అని చంద్రబాబు అంటున్నారు. నిజంగా చిత్తశుద్దితో అలాంటి భావన ఉండి ఉంటే పది పల్లెటూళ్ల మధ్య లక్షల కోట్లు వ్యయం చేయవలసిన అవసరం ఏమి ఉంది? ఇప్పటికే పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా? అప్పుడీ భారమే ఉండదు కదా! ఈ పల్లెల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు తమ ప్రాంతానికి కూడా అంత పెద్ద మొత్తం చొప్పున ఖర్చు చేయండని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తే అంగీకరిస్తారా?. 👉బెంగుళూరును మించిన విమానాశ్రయం ఏపీకి కావాలట. అందుకోసం మరొకటి కడతారట. విజయవాడకు సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. అంటే ఇంతకాలం గన్నవరం వద్ద సమీకరించిన భూములు, అక్కడి బడాబాబులు కొందరికి అమరావతిలో ప్లాట్లు కేటాయించడం, వేల కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్టులో నిర్మాణాలు చేయడం..అదంతా వృథాయేనా?. శంషాబాద్ విమానాశ్రయం వచ్చాక బేగంపేట ఎయిర్ పోర్టు మూసివేసినట్లు గన్నవరం ఎయిర్ పోర్టును నిలిపివేయక తప్పదు కదా! పోనీ ఇప్పుడు ప్రతిపాదించిన ఎయిర్ పోర్టు విజయవాడ, గుంటూరులకు కూడా నలభై, ఏభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి రోడ్డు సదుపాయం కూడా కల్పించవలసి ఉంటుంది. దీనిని కట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారుడు ఎన్ని షరతులు పెడతారో? ప్రపంచంలో అతి రద్దీ ఉన్న విమానాశ్రయలు ఏవీ కూడా ఇంత విస్తీర్ణంలో లేవట. భారత్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన పలు ఎయిర్ పోర్టులు రద్దీ లేక కార్యకలాపాలు నిర్వహించలేక పోయాయని చెబుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్యే విమానాలు నడపలేమని ప్రైవేటు సంస్థలు చేతులెత్తేశాయే!. వీటన్నిటిని కప్పిపుచ్చి ప్రజలను మభ్య పెట్టడం అవసరమా?. నిజంగానే గన్నవరం వద్ద అంత భారీగా రద్దీ పెరిగితే కొత్త ఎయిర్ పోర్టు కట్టినా ఫర్వాలేదు.అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ కబుర్లు అన్నీ దేనికి! 👉కేవలం సూపర్ సిక్స్(Super Six Promises) తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కోసం వారిని మభ్యపెట్టే రీతిలో డైలాగులు చంద్రబాబు చెప్పడం,వాటిని గొప్ప సంగతులుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం..ఇదే ఏపీలో జరుగుతున్న తంతు.ఇప్పటికే సెక్రటేరియట్, అసెంబ్లీల కోసం కట్టిన భవనాలను ఏమి చేస్తారు.అవి వృథాయేనా? ఒక్కొక్కటి నలభై, ఏభై అంతస్తుల టవర్లు కడితే అసలు ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అవసరం? రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి, ఎవరి భూములో తీసుకుని ప్రభుత్వం వేల కోట్లతో అభివృద్ది చేయవలసిన అవసరం ఏమిటి? వీటికి జవాబు లేక జగన్ ను నిందిస్తే కధ నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మళ్లీ వచ్చింది కన్సల్టెంట్ల రాజ్యం
సాక్షి, అమరావతి: అమరావతిలో కన్సల్టెంట్ల రాజ్యం మళ్లీ వచ్చిoది. గతంలో కన్సల్టెంట్ల పేరిట రూ.వందల కోట్లు వ్యయం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతున్నారు. అమరావతిలో ప్రతి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలను నియమిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బుల్లేవంటూనే అమరావతిలో కన్సల్టెంట్లకు భారీగా వ్యయం చేస్తున్నారు. ఇప్పటికే మూడు కన్సల్టెన్సీలను సీఆర్డీఏ నియమించింది. కొత్తగా జోన్–7లో చేపట్టే ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం సీఆర్డీఏ ప్రతిపాదనల్ని ఆహ్వానించింది. ప్రతిపాదనల సమర్పణకు వచ్చే నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అదేరోజు సాంకేతిక బిడ్‌ను తెరవనున్నట్టు సీఆర్డీఏ తెలిపింది. జూన్ 6న ఆర్థిక బిడ్ తెరుస్తామని స్పష్టం చేసింది. 7వ జోన్లో ల్యాండ్ పూలింగ్ పథకాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని నియమిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికే రూ.86.29 కోట్లు కన్సల్టెంట్లకు.. ఇప్పటికే జోన్ 2, 4, 6, 10లలో చేపట్టిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌ను సీఆర్డీఏ ఎంపిక చేసింది. ఈ జోన్లలో చేపట్టే ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు తనిఖీ నివేదికలను సీఆర్డీఏకు సమర్పించే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.42.33 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది.జోన్ 12, 12ఏలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ బాధ్యతలను నిప్పాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.34.27 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది. అమరావతి రాజధాని ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక నిర్వహణ కన్సల్టెంట్‌ను సీఆర్డీఏ నియమించింది. ఈ బాధ్యతను ప్రైస్ వాటర్ హౌస్‌కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.9.69 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది. ఇలా ఇప్పటికే రూ.86.29 కోట్లు కన్సల్టెంట్లకు దోచి పెట్టేందుకు నిర్ణయించగా.. తాజాగా ఎంపిక చేయనున్న కన్సల్టెన్సీకి రూ.10.60 కోట్లు చెల్లించనున్నట్టు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్డీఏ స్పష్టం చేసింది. -
నవ రాయ్‌పూర్ దారిలో అమరావతి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మే 22న నిర్వహించిన ప్రెస్ మీట్లో అమరావతి పేరుతో జరుగు తున్న ఆర్థిక దోపిడీని ఆధా రాలతో సహా వివరించారు. ఇప్పటి వరకూ రాజధానిగా ఎటువంటి చట్టబద్ధత లేని అమరావతి పేరుతో చంద్రబాబు సుమారు రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. దీని నిర్మాణానికి ఒక్క పైసా కూడా అవసరం లేదనీ, ఇదో సెల్ఫ్ ఫైనాన్స్స ప్రాజెక్టు అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల జారీ ద్వారా 21 వేల కోట్లు అప్పులు చేసి అమరావతికి ఖర్చు చేస్తున్నారు. ఏడాది బడ్జెట్లో అమరావతి కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు. దీనికి తోడు అమరావతి కోసం మరో 50 వేల ఎకరాలు సమీకరించబోతు న్నామనీ, దానికి మరో రూ. 77 వేల కోట్లు అవసర మవుతాయనీ ఆర్థిక సంఘానికి తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, పన్నుల రాబడులు తగ్గాయి. ఏడాది కాలంలోనే లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణాలు చేసి దేశంలోనే అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీని నిలిపారు బాబు. అమరా వతిలో ఇప్పటికీ భూ సమీకరణ పూర్తి చేయలేక పోయారు. రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటూ ఇప్పటికీ తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇంకా 20 శాతం మంది రైతులు తమ భూములను సీఆర్డీఏకు అప్పగించి రిటర్నబుల్ ప్లాట్స్ పొందలేదు. రాష్ట్రం ఏమైపోయినా సరే తాము మాత్రం అమరావతిపై లక్షల కోట్లు కుమ్మరిస్తామంటున్నారు.ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం ఎంత కష్టమో ‘అటల్ నగర్– నవ రాయ్‌పూర్’ను చూస్తే అర్థమవుతుంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20 వేల ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆప సోపాలు పడుతోంది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లయినా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. చంద్రబాబు మాత్రం లక్ష ఎకరాల్లో మహా నగరం నిర్మిస్తానంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అటల్ నగర్ నిర్మాణ విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అనీ, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఆరో నగరమనీ, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అనీ, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామనీ ప్రచారం చేశారు. చిన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందించే దేశంలోని అతిపెద్ద శ్రీసత్యసాయి సంజీవిని ఆస్పత్రి, ప్రపంచంలో నాల్గో అతి పెద్ద క్రికెట్ స్టేడియం, నాలుగు జాతీయ విద్యా సంస్థలు, పది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ పోర్ట్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, జెమ్స్ అండ్ జ్యూయలరీ సెంటర్, జూ, సఫారీ, గోల్ఫ్ విలేజ్, మ్యూజియం, బొటానికల్ గార్డెన్ , ఫిల్మ్ సిటీ, 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేశారు. ఇన్ని ఏర్పాటు చేశామని చెబు తున్నప్పటికీ ఇది ఒక ఘోస్ట్ సిటీగా మారింది. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం రెండు లక్షల 50 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలకు చేరాలంటే 2031 వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు నయా రాయ్‌పూర్ డెవలప్మెంట్ అధారిటీ అధికారులు.ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సదుపాయాలు కల్పించినా, అనేక రాయితీలు ప్రకటించినా నవ రాయ్‌పూర్‌కు పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన లేదు. ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు. 2022–23 లెక్కల ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల జీడీపీ విలువ రూ. 1,467 కోట్లు కాగా, విశాఖపట్నం జీడీపీ విలువ రూ.1,867 కోట్లు. వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన నవరాయ్‌పూర్ జీడీపీ కేవలం రూ. 270 కోట్లు. పక్కనే ఉన్న రాయ్‌పూర్ జీడీపీ రూ. 750 కోట్లు. నగర నిర్మాణం పేరుతో చేసిన అప్పులు తీర్చడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులను కలిసి రూ.4,131 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌గా ఇవ్వాలని కోరారు. నూతన నగరాలను నిర్మించాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. నగర నిర్మాణాల ద్వారా సంపదను సృíష్టించవచ్చని చంద్ర బాబు అంటున్నారు. ఇది నిజం కాదని నవ రాయ్ పూర్ రుజువు చేస్తోంది. అంతే కాదు, చైనాలో కొత్తగా నిర్మించిన అనేక నగరాలు, మలేషియా నిర్మించిన ఫారెస్ట్ సిటీ, పరిపాలనా నగరం ‘పుత్రజయ’ కూడా నిర్మానుష్య నగరాలుగా మారాయి. ఈ నగరాలు సంపద సృష్టించకపోగా అప్పులు, నిరర్థక ఆస్తులు మిగి ల్చాయి. ఇదే పరిస్థితి అమరావతికి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర లేదు!వి.వి.ఆర్. కృష్ణంరాజువ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ప్రెసిడెంట్ ‘ 89859 41411 -
KSR Live Show: నారా లోకేష్ కు నెలకు 45కోట్ల ముడుపులు!
-
అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు
-
అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు
-
అప్పుల కుప్ప అమరావతి
-
సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం
-
రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొంత ఇబ్బంది పడటం నిజమే. అయినా వారి త్యాగం ఊరికే పోదు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన చరిత్ర అమరావతిది. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని కడతాం. ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తే నీకు (మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) వచ్చిన నష్టం ఏమిటి?’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం జన్‌పథ్–1లోని అధికారిక నివాసంలో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో వైఎస్ జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని, అలా రాకపోతే ఎలా.. అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరినట్లు చెప్పారు. ఏపీలో 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని, రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు తెలిపారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రక్షణ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు. జగ్గయ్యపేట–డోలకొండ క్లస్టర్లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉందని, ఇక్కడ క్లస్టర్‌ను మిస్సైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం–బనకచర్ల ప్రతిపాదన రూ.80 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వివరించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని చెప్పారు. షార్, లేపాక్షి వద్ద స్పేస్ సిటీల అభివృద్ధి విషయంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలసి మాట్లాడానని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్’ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ పోషించగల పాత్రను వివరిస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదిక సమర్పించానని చెప్పారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ల పేర్లను ఈడీ ప్రస్తావించిన విషయంపై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా.. ‘అవునా? ఎప్పుడు? ఏమో మరి.. నాకు దాని గురించి తెలియదు’ అంటూ దాటవేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై కూడా తాను మాట్లాడనని స్పష్టం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. -
కొండంత అప్పు.. బాబు ‘సెల్ఫ్’ డప్పు!
కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు.. మీరు మోసుకొస్తే చాలు.. నేను మోసేస్తా..! అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు! రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8 వేల ఎకరాలను విక్రయించి రూ.లక్ష కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని.. అందుకోసం మరో 44 వేల ఎకరాలకుపైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెబుతున్నారు!! రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు లక్ష ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘‘రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది..!’’ సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లను కేటాయించింది.రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.తాజాగా స్మార్ట్ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఇక అందులో నిర్మాణ పనులు చేపట్టి.. మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని.. ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజధానిపై లీకులు.. ఇన్సైడర్ ట్రేడింగ్! రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని.. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధాని అమరావతిని తలపించే రీతిలో ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిరి్మస్తానంటూ 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులిచ్చారు. ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ద్వారా తన బినామీలు, సన్నిహితులు కారు చౌకగా రైతుల నుంచి భూములు కాజేశాక రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలను సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములతో కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ.) రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు. కామధేనువు కాదు అప్పుల కుప్ప.. ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పులు ఓ చిన్న ఇల్లు కట్టాలన్నా ముందుగానే తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాంటిది ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే (నిధులున్నాయో లేదో చూసుకోకుండా) 2016–19 మధ్య రాజధాని ప్రాంతంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధి పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఇందుకోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్ల అప్పులు తెచ్చింది. అయితే 2019 మే నాటికి ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.28,047.82 కోట్లతో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు రద్దు చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. 2018–19 ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరలు పెద్దగా పెరగలేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105 శాతం పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు వెరసి రూ.31 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. అమరావతి కామధేనువు కాదు.. అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి! ఇకపోతే రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వడం గమనార్హం. మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా.. భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దాంతో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్ ప్రాజెక్టులు వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిరి్మంచాలని చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవంటూ.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో 44,676.64 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక ఆ భూముల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణంతోపాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి పెరిగే ధరలను (ఎస్కలేషన్) పరిగణనలోకి తీసుకుంటే అన్నీ కలిపి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని లెక్కగడుతున్నారు. అదంతా అప్పులు చేయాల్సిందే. వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందో ఊహించవచ్చు. ఆ అప్పు అంతా చివరకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతోనే తీర్చాల్సి ఉంటుందని తేటతెల్లమవుతోంది. అమరావతిపై బాబు డాబుసరి మాటలివిగో..‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. భూ సమీకరణ కింద తీసుకున్న భూములు.. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లుతోసహా అన్ని పోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వాటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి అందరికి ఆమోదయోగ్యమైంది. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ – 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ – 2024 జూన్ 19న సీఎం చంద్రబాబు‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ – 2024 జూన్ 20న సీఎం చంద్రబాబు -
స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్
-
అమరావతి పేరుతో దోపిడీ.. స్కాంలకు పరాకాష్ట: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో జరుగుతున్న స్కాంలకు పరాకాష్ట.. అమరావతి పేరుతో దోపిడీనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఆర్థిక దోపిడీని వివరించారు. ‘‘అమరావతి పనుల కోసం 2018 లోనూ టెండర్లు పిలిచారు. నాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41, 107 కోట్లు. దాదాపు 6 వేల కట్లు పనులు చేశారు. మిగిలిన రూ. 35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉంది. కానీ, ఈ టెండర్లు రద్దు చేేశారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కాకుండా మళ్లీ కడతారట. అంటే అన్నీ గంగపాలు చేసినట్లే!. అక్రమాలకు అడ్డు కాకూడదని.. మా హయంలో తెచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ తీసేశారు. రివర్స్ టెండరింగ్నూ రద్దు చేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు లేవు. కానీ, స్కాంల కోసమే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తెచ్చారు. అడ్వాన్స్‌ల పేరిట 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. 2018 ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనులను ఇప్పుడు నిర్మాణ వ్యయం 4,468 కోట్లు. 2018తో పోలిస్తే దాదాపు రూ.2,417 కోట్లు (105 శాతం) పైగా పెంచారు. చదరపు అడుగుకు రూ.8, 931.. అంటే ఏమైనా బంగారంతో కడుతున్నారా?మీరు సాయం చేస్తే.. పుంజుకుంటాం(ఈనాడు క్లిప్‌ను ప్రదర్శిస్తూ..) అంటూ చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా అప్పులు చేస్తున్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. సొంత లాభాలు, బినామీ ఆస్తులను పెంచుకునే పని పక్కన పెడితే.. ఇంతేసి అప్పులు చేయాల్సి ఉండదు కదా’’ వైఎస్ జగన్ సూచించారు. -
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
చిన్న వర్షానికే .. మునిగిన అమరావతి
-
భారీ వర్షానికి తడిసి ముద్దైయిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి
-
రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడం బాధాకరం
-
మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెంచండి!
విజయవాడ: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధానం ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపైనే మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు చంద్రబాబు.మద్యం ద్వారా అమ్మకాల ద్వారా రూ. 33, 882 కోట్లు ఆదాయం తేవాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారలతో కమిటీ వేయాలన్నారు.29 శాతం పెంచాలంటూ..!చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిపోవడంతో కేంద్ర నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 11 వరకూ రూ. 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29 శాతం ఆదాయం పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29 శాతం ఆదాయం ఎలా పెంచాలని అధికారులకు తలలు పట్టుకుంటున్నారు. -
సుప్రీంకోర్టులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఊరట
ఢిల్లీ: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరుకావాలని, అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ
అమరావతి: తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు(శుక్రవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత విషయంలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్న కారణంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత పునరుద్దరించేలా వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగ్గా, వైఎస్ జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.‘‘వైఎస్ జగన్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. కావాలనే జగన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే భద్రతకు సంబంధించిన అంశంపై ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది’అని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


