breaking news
vijayawada
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)
-
సినీ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు.గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకోగా.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్‌కు వస్తే.. 15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
చంద్రబాబు, పవన్‌ల రోడ్ షో.. అంబులెన్స్‌కు తప్పని కష్టాలు!
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు విజయవాడలో శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) చేపట్టిన రోడ్ షోలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీరు బస్సులో విజయవాడ బస్టాండ్‌కు వెళ్తూ చేపట్టిన రోడ్ షో కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడేపల్లిలో సర్వీస రోడ్, హైవే మద భారీగా ట్రాఫిక జామ్ అయయింది. అదే సమయంలో అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్ వచ్చినప్పటికీ చంద్రబాబు కాన్వాయ్ దారి ఇవ్వలేదు. అంబులెన్స్‌కైనా దారి కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. వాహనాల మధ్యలో నిలిచిపోయింది అంబులెన్స్. -
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి (ఫొటోలు)
-
Vijayawada: చెట్టు మీద పడి మరొకరు మృతి
-
ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains In AP Updates:బుడమేరు వాగు ఉధృతిభారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహంసరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలుబుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావులోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలుకృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందంవిజయవాడలో దంచికొడుతోన్న వర్షంరోడ్లు జలమయంపొంగిపొర్లుతున్న డ్రైన్లులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరువిద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరుగన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షంవిజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్‌తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.గులాం మొహిద్దీన్ స్ట్రీట్‌లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికలు నిర్వహించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని మండి పడింది. దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్‌కుమార్ యాదవ్, సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్, సుధాకర్‌బాబు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తదితరులను పోలీసులు బయటే ఆపేయడంతో తోపులాట జరిగింది. దీంతో వారంతా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరుగుతూ వాగ్వాదానికి దిగారు.‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి విడనాడాలి..’ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వారిని వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు అనుమతించారు. పోలింగ్ బూత్‌లు మార్చడానికి వీల్లేదని, బైండోవర్ కేసులు పెట్టి కనిపించకుండా దాచిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని వారు ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దయనీయం.. ఘోరం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, దయనీయంగా, ఘోరంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కళ్లు, చెవులు మూసుకొని కమిషన్ ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రోత్సహించడం కోసం, ఓటింగ్ శాతం పెంచడానికి వ్యవస్థను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సింది పోయి.. పులివెందులలో అందుకు విరుద్ధంగా ఓటర్లకు దూరంగా పోలింగ్ కేంద్రాలను తీసుకెళుతుండటం దారుణం. – పేర్ని నాని, మాజీ మంత్రి దేవుని దయవల్ల బతికి బయట పడ్డానుబీసీ సామాజిక వర్గానికి చెందిన నాపై అతి ఘోరంగా బండరాళ్లు, సుత్తులతో దాడి చేశారు. పెట్రోలు పోసి నన్ను చంపేందుకు ప్రయతి్నంచారు. దేవుని దయతో బతికి బట్ట కట్టాను. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తామే గెలవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చారు. – రమేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఈ అధికారం శాశ్వతమా? పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే ఇక్కడ మమ్మల్ని పోలీసుల చేత నెట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ఎందుకంత కండకావరం? ఈ అధికారం శాశ్వతమా? – టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల కమిషనర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. – దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
పులివెందులలో ఈసీ నిద్ర నటిస్తోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. తర్వాత.. వారికి లోపలికి అనుమతి ఇవ్వడంతో పులివెందులలో పరిస్థితులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు , కైలే అనిల్ కుమార్ , ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్, పూనూరు గౌతమ్ రెడ్డి, నారాయణ మూర్తి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రశాంతంగా ఉన్న పులివెందులను రక్త చరిత్ర పులివెందులగా మార్చారు. పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రచారానికి వెళ్లిన మాపై దాడి చేశారు. మమ్మల్ని హతమార్చేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో నేను ప్రాణాలతో బయటపడ్డా. తాజాగా పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. దోచుకున్న డబ్బును పులివెందులలో పంచుతున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కమిషనర్‌ను కలిసి పరిస్థితులను వివరించాం. ఎమ్మెల్సీనైన నాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. టీడీపీ తరపున పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్లుమూసుకుని నిద్ర నటిస్తోంది. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు. నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది. ఓటర్‌కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తున్నారు. ఎన్నికల కమిషనర్ సీట్లో కూర్చునే ముందు చేసిన ప్రమాణాలను గుర్తుచేసుకోవాలని కోరాం. కేవలం జెడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు కాళ్ల వద్ద పడేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపారని, రమేష యాదవను హత్య చేయాలని చూశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈసీ మొద్దు నిద్ర వీడాలని ఆయన హెచ్చరించారు. -
అమ్మ చల్లగా చూడమ్మా...ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)
-
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్‌రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
బాబూ.. నేను ఎమ్మెల్యేను!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ (జనసేన పార్టీ)కి మంగళవారం దుర్గగుడిలో చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆయన ఆలయ అధికారులకు, ప్రొటోకాల్‌కు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో కారులో ఘాట్‌రోడ్డు మీదగా ఓం టర్నింగ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ నుంచి సమాచారం లేనందున అక్కడే కారు నిలుపుకోవాలని డ్రైవర్‌కు సూచించారు. కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినా సిబ్బంది వినలేదు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దం కిందకు దింపి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతలో విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించడంతో వారు కారును సమాచార కేంద్రం వరకు అనుమతించారు.దీంతో, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు. ఆలయ ఈవో శీనానాయక్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక తాను ఈ అంశాన్ని తేలికగా తీసుకోనని, ఆలయ ప్రొటోకాల్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా నివేదన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించినా ఆయన శాంతించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్‌పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్‌రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్‌రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు. -
రూ.4,150 కోట్ల అంచనాతో విజయవాడ ‘మెట్రో’ తొలి దశ పనులు
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులకు రూ.4,150 కోట్ల అంచనా వ్యయంతో సోమవారం ఏపీఎమ్మార్‌సీఎల్(ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో 30 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఫ్రీబిడ్ సమావేశాన్ని ఈ నెల 18న ఎపీఎమ్మార్సీఎల్ కార్యాలయంలో నిర్వహించనుంది.విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులను 38.40 కి.మీ. పొడవున వయాడక్ట్(ఇందులో 4.33 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్ లేన్ ఫ్లైఓవర్, మోట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వేస్టేషన్‌తో పాటు 32 స్టేషన్లను నిర్మించేలా పనులు చేపట్టింది. ఈ పనులను రెండు కారిడార్లుగా చేపట్టింది. మొదటి కారిడార్‌ను 25.9 కి.మీ పొడవున పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు, రెండో కారిడార్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిమీల పొడవున మెట్రో రైల్ వయాడక్ట్, స్టేషన్లు నిర్మించనుంది.మెట్రో తొలిదశ కన్సల్టెన్సీలకు రూ.401.28 కోట్లువిశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనుల పర్యవేక్షణకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.401.28 కోట్లు చెల్లించనుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ కన్సల్టెన్సీ బాధ్యతలను సిస్ట్రా సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.212.40 కోట్లు చెల్లించనుంది. అలాగే, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశకు కన్సల్టెన్సీ బాధ్యతలను టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్ఏ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.188.88 కోట్లు చెల్లించనుంది.ఇక విశాఖపట్నంలో తొలిదశ కింద మూడు కారిడార్లలో 46.23 కి.మీ.ల పొడవున వయాడక్ట్ (ఇందులో 20.16 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్‌లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), 42 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 24న రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వనించింది. ఫీజుకింద రూ.212.40 కోట్లను చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ సిస్ట్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది.మరోవైపు.. విజయవాడలో తొలిదశ కింద 38.40 కిమీ పొడవున వయాడక్ట్ (ఇందులో 4.33 కిమీ డబుల్ డెకర్ ఫోర్‌లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌తోపాటు మరో 32 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, పనులు పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ కోసం ఏప్రిల్ 30న ఏపీఎమ్మార్‌సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.188.88 కోట్లు చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్ఏ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు టెండర్లను ఏపీఎమ్మార్‌సీఎల్ ఆమోదించి, కన్సల్టెన్సీలుగా ఆ సంస్థలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ బాధ్యతలను ఆ సంస్థలకు అప్పగిస్తూ వాటితో ఒప్పందం చేసుకుంది. -
Malladi Vishnu: పవన్ మిత్రుడికి 1200 ఎకరాలు కట్టబెట్టారు
-
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఐక్య ఉద్యమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని, విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని లులు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 6న విజయవాడలో పౌర వేదిక తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు.చంద్రబాబుకు భూదాహం..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయవాడలో అత్యంత చారిత్రక నేపథ్యంతోపాటు రూ.400 కోట్ల విలువైన 4.15 ఎకరాల పాత బస్టాండ్ స్థలాన్ని, విశాఖపట్నంలో 13.7 ఎకరాలను బహుళజాతి సంస్థకు అçప్పగించే ప్రభుత్వ చర్యలు సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని, అమరావతిలో మరోమారు భూ సమీకరణకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.ఐక్య ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలివైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ పాలకులు ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో యథేచ్ఛగా భూసంతర్పణ చేయడం ఆక్షేపణీయమన్నారు.సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ (సీపీఎం), నరహరశెట్టి నరసింహరావు (కాంగ్రెస్), దోనేపూడి శంకర్ (సీపీఐ), పి. ప్రసాద్ (సీపీఐ–ఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరనాథ్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్)లతోపాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్, జోనల్ కార్యదర్శి వైఎస్ రావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ అంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. ఆర్టీసీ స్థలాన్ని అన్యాక్రాంతం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, జీఓ నెంబర్ 137ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
తిమ్మిని బమ్మి చేయబోయి..
సాక్షి, అమరావతి: రాజకీయ మాయల ఫకీర్ చంద్రబాబు నోట్ల కట్టల మాటున సాగించిన మహా కుట్ర బెడిసికొట్టింది. రెడ్‌బుక్ కుట్రలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ సిట్ పన్నాగం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించేందుకు పన్నిన తాజా కుతంత్రం విఫలమైంది. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించేందుకు తెగించిన ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల బరితెగింపు బయటపడింది. ఈ అక్రమ కేసులో రూ.11 కోట్ల నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామాను కప్పిపుచ్చే సిట్ ఎత్తుగడ చిత్తయింది.హైదరాబాద్ శివారులో పట్టుకున్నట్టు చెప్పిన నగదును గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ తాజా కుయుక్తి పన్నింది. తద్వారా... ఈ కేసులో సాక్షులను బెదిరించి, ఆ నగదును తామే తెప్పించి జప్తు చేసినట్టు ఆడిన హైడ్రామాను కప్పిపుచ్చాలని యత్నించింది. కాగా, సిట్ తాజా కుట్రపై ఉప్పందడంతో అక్రమ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు శనివారం వెంటనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని, వాటిపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.దీన్ని విచారించిన కోర్టు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని విస్పష్టంగా పేర్కొంది. న్యాయస్థానం ఉత్తర్వుల కాపీని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి ఎస్బీఐ అధికారులకు అందజేశారు. నగదును ప్రత్యేకంగా భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. దీంతో రూ.11 కోట్ల జప్తు పేరిట సాగించిన కుట్రను తొక్కిపెట్టాలన్న సిట్ పన్నాగం బెడిసికొట్టింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ సాగించిన కుట్ర... కోర్టు సత్వర స్పందనతో బట్టబయలైన వైనం ఇదిగో ఇలా ఉంది.లేని ఆధారాలు సృష్టించేందుకు జప్తు డ్రామామద్యం అక్రమ కేసులో ఏదో విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. తద్వారా నిందితుల బెయిల్‌ను అడ్డుకోవడమే ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల పన్నాగం. అందుకే సిట్ రూ.11 కోట్లు పట్టివేత కనికట్టు చేసింది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగా కపట నాటకానికి తెరతీసింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి బెంబేలెత్తించింది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి భార్య దివ్యారెడ్డి హైదరాబాద్‌లోని ఎరేట్ హాస్పిటల్లో మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారు.హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి కూడా ఈ హాస్పిటల్లో భాగస్వామి. ఆయనకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. అయితే, వర్ధమాన్ కాలేజీతో గానీ విజయేందర్‌రెడ్డి ఇతర వ్యాపారాలతోగానీ రాజ్ కేసిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ, లేని ఆధారాలు సృష్టించేందుకు విజయేందర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సిట్ వేధించింది. రాజ్ కేసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించే తమ కుట్రకు సహకరించాలని పోలీసు మార్కు బెదిరింపులకు పాల్పడింది. దాంతో విజయేందర్‌రెడ్డి సిట్ అధికారుల ఒత్తిడికి తలొగ్గినట్టు తెలుస్తోంది.తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌ను సిట్ అమలు చేసింది. అందులో భాగంగా వర్ధమాన్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను ఎవరికీ తెలియకుండా విజయేందర్‌రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీకి సరిగ్గా ఎదురుగానే ఉండే సులోచన ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ పనికూడా ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ అట్టపెట్టెలు తీసుకెళ్తే ఎవరైనా ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చిన తర్వాత... సిట్ అధికారులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు... రూ.11 కోట్లను గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు. ఆ నగదంతా రాజ్ కేసిరెడ్డిదేనని... 2024 జూన్ నుంచి అక్కడ ఉంచారని కట్టు కథ వినిపించారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజ్ కేసిరెడ్డిరూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకు గానీ తన కుటుంబానికిగానీ ఏ సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈమేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎరేట్ హాస్పిటల్లో తన భార్య కేవలం మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారని, విజయేందర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఇతర వ్యాపార సంస్థలతో తమకు సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు.దీనికితోడు సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ నగదును పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆర్బీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. కుట్ర కప్పిపుచ్చే కుతంత్రంన్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసుల బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది. అలా చేస్తే బ్యాంకులో ఉండే ఇతర నగదుతో పాటు ఈ రూ.11 కోట్లను కలిపేస్తారు.ఆ నగదు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి సిట్‌కు ఓ డిపాజిట్ పత్రం ఇస్తారు. అంటే నగదు రూపంలో ఉన్న రూ.11 కోట్లు డిపాజిట్ పత్రం రూపంలోకి మారిపోతాయి. బ్యాంకు ఆ నగదును వివిధ అవసరాలకు వాడుకుంటుంది కూడా. అలా ఆ నోట్లు మిగతా నోట్లతో కలిసి మార్కెట్లోకి చెలామణిలోకి వెళ్లిపోతాయి. సిట్ అధికారులు హైదరాబాద్‌లో జప్తు చేసిన నోట్ల కట్టలు ఏవీ అంటే ఎవరూ చెప్పలేరు. ఇదీ సిట్ పన్నాగం...! ఇందుకోసం సిట్ అధికారులు శుక్రవారం రాత్రే రంగంలోకి దిగారు.శుక్రవారం రాత్రి నుంచే హైడ్రామా...శుక్రవారం రాత్రే విజయవాడ ఎస్బీఐ పటమటలోని సీసీఎస్ బ్రాంచి, మాచవరం బ్రాంచి అధికారులను సంప్రదించారు. అంత భారీ నగదును డిపాజిట్‌గా స్వీకరించాలంటే ముందుగా రెండుసార్లు నోట్ల కట్టలను డినామినేషన్ చేసి పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు చాలా సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. మొదటి దశ కింద డినామినేషన్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో దశ డినామినేషన్ శనివారం మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని భావించారు. న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్..సిట్ కుట్రను పసిగట్టిన రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు సత్వరం స్పందించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 నోట్ల కట్టలను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓ సారి జప్తు చేసినట్టు న్యాయస్థానానికి నివేదించిన నగదు, ఇతర ఆస్తులపై పూర్తి అధికారం కోర్టుకే ఉంటుంది.అటువంటిది కోర్టు అనుమతి లేకుండానే ఆ నగదును డిపాజిట్ చేయడం ద్వారా సిట్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని నివేదించారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ రూ.11 కోట్లను డిపాజిట్ చేయకుండా సిట్‌ను ఆదేశించాలని కోరారు. అప్పటికే చేస్తే వాటిని ఎస్బీఐలోని ఇతర నోట్లతో కలపకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని సిట్‌తో పాటు ఎస్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం శనివారం విచారించింది. ఈ సందర్భంగా సిట్ విచారణ అధికారి ఏకంగా కోర్టునే తప్పుదారి పట్టించేందుకు యత్నించడం గమనార్హం. రూ.11 కోట్లు ఎక్కడ ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారిని ప్రశ్నించగా.. అప్పటికే ఎస్బీఐలో డిపాజిట్ చేసేశామని ఆయన చెప్పారు. దీనిపై రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ నగదును ఇంకా డిపాజిట్ చేయలేదన్నారు. చేసి ఉంటే బ్యాంకు కౌంటర్ ఫాయిల్ చూపించాలన్నారు. ఈ ప్రశ్నకు సిట్ అధికారి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ నగదు డిపాజిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో సోమవారం అఫిడవిట్ సమర్పిస్తామని చెప్పారు. అందుకు దుష్యంత్‌రెడ్డి సమ్మతించ లేదు. తమకు సిట్‌పై ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలో సిట్ పావుగా మారిందన్నారు. రూ.11 కోట్లకు సంబంధించిన బ్యాంకు కౌంటర్ ఫాయిల్ ఫొటోను వాట్సాప్ ద్వారా తెప్పించుకుని అయినా చూపించమని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పరిణామంతో తనకు సమయం కావాలన్న సిట్ అధికారి దాదాపు గంట వరకు పత్తా లేకుండాపోవడం గమనార్హం. రూ.11కోట్లను ప్రత్యేకంగా భద్రపరచండిరాజ్ కేసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టమైన తీర్పునిచ్చింది. రూ.11 కోట్లను విడిగా భద్రపరచాలని సిట్ అధికారులు, ఎస్బీఐ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే డిపాజిట్ స్వీకరించి ఉంటే బ్యాంకులోని ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా భద్ర పరచాలని స్పష్టం చేసింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని సిట్‌ను ఆదేశించింది. మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని తేల్చి చెప్పింది. దాంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది.ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు బెంబేలుఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నగదు కట్టలను రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది.అంతేకాదు, ఆ నోట్ల కట్టలను ఏ ఏ తేదీల్లో బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారన్నది కూడా ఆర్బీఐ అధికారులు పరిశీలించి వెల్లడిస్తారు. ఆ నోట్ల కట్టలు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024, జూన్ తరువాత బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసినట్టు వెల్లడైతే సిట్ బండారం బట్టబయలవుతుంది. చివరకు కోర్టును తప్పుదారి పట్టించిన సిట్ అధికారులపై న్యాయస్థానం తీవ్రమైన చర్యలకు ఆదేశించవచ్చు. ఆపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన ఈ అక్రమ కేసు కుట్ర బెడిసికొడుతుంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు హడలిపోయారు.విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదనజప్తు చేసిన ఆస్తుల విషయంలో చేయాల్సింది ఇలా...పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు తాము జప్తు చేసే స్థిర, చర ఆస్తులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను న్యాయ వ్యవస్థ విస్పష్టంగా పేర్కొంది. అవి ఏమిటంటే...⇒ జప్తు చేసిన నగదు, స్థిర, చర ఆస్తులను మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేయాలి. ⇒అనంతరం పంచనామా చేయాలి. అంటే ఆ స్థిర, చర ఆస్తుల పరిమాణం, స్వరూప స్వభావాలను స్పష్టంగా పేర్కొనాలి. నగదు కాబట్టి.. ఆ నోట్లపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు, మొత్తం విలువ, వాటిని ఎందులో భద్రపరిచింది? మొదలైన వివరాలతో పంచ నామా చేయాలి. ⇒ జప్తు చేసిన నోట్ల కట్టలను ప్యాకింగ్ చేసి న్యాయస్థానంలో ప్రదర్శించాలి. ప్యాకింగ్ తెరచి మరీ న్యాయస్థానానికి చూపించాలి. ⇒ అనంతరం న్యాయస్థానం అనుమతితో ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో భద్ర పరచాలి. కోర్టు కోరితే ఎప్పుడైనా సరే వాటిని మరోసారి తీసుకొచ్చేందుకు వీలుగా ట్రెజరీలోనే ఉంచాలి. ⇒ కోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి.కానీ, సిట్ ఏం చేసిందంటే..⇒హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌లో రూ.11కోట్లు జప్తు చేసినట్టు ప్రకటించింది. ⇒జప్తు చేసిన నోట్ల కట్టలను న్యాయస్థానానికి చూపించనే లేదు. జప్తు చేసినట్టు కేవలం ఓ నోట్ సమర్పించి చేతులు దులుపుకొంది.⇒ ఆ రూ.11 కోట్లను ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరచలేదు.⇒ కోర్టు అనుమతి లేకుండానే ఆ రూ.11కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించింది. తద్వారా బ్యాంకులోని ఇతర నోట్ల కట్టలతో వాటిని కలిపేయాలన్నది సిట్ కుట్ర. తద్వారా జప్తు పేరిట తమ కుట్ర బయటపడకుండా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.నోట్ల కట్టలన్నిటికీ బ్యాంక్ పిన్, సీల్స్⇒ వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది⇒ మరి రూ.11 కోట్లని ఎలా నిర్ధారించారు?⇒ లెక్కపెట్టే యంత్రాలను ఎక్కడా చూపలేదు..⇒ అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారు⇒ కానీ, ఇక్కడే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామాసిట్ కపట నాటకంలో మరో అంకం ఇది.. అది జప్తు చూపించిన డబ్బు అంతా కట్టలకు బ్యాంక్ పిన్, సీల్స్‌తో ఉంది. దీన్నిబట్టి కనీసం వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది. అలాగైతే.. ఆ మొత్తం రూ.11కోట్లని ఎలా నిర్ధారించారు? అనేది సమాధానం చెప్పాలి. పైగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా ఎక్కడా చూపలేదు. అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారని స్పష్టం అవుతోంది. కానీ, ఫామ్‌హౌస్‌లోనే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామా నడిపించింది.నోట్ల నంబర్లు రికార్డు చేస్తే సిట్ బండారం బట్టబయలునోట్ల నంబర్లు రికార్డు చేస్తే ఏ బ్యాంకు ద్వారా ఎప్పుడు డ్రా చేశారు? ఎవరి బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు? ఏ టైమ్‌లో డ్రా చేశారు? అనేది స్పష్టంగా తేలిపోతుంది. అందుకే అది తెలియకుండా ఉండేందుకు బహుశా ప్రపంచంలో ఏ విచారణ సంస్థ కూడా చేయని విధంగా సిట్ బరితెగించింది. భారీ స్కెచ్ వేసింది. స్వయంగా డబ్బు తానే పెట్టి.. జప్తు పేరిట కపట నాటకం ఆడింది. ఇదంతా బయటపడకుండా ఉండేందుకు బ్యాంకులోని మిగతా డబ్బులో కలిపేసే కుతంత్రానికి తెరతీసింది. -
న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.‘‘నేను 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు. -
ముగిసిన మిథున్ రెడ్డి రిమాండ్.. విజయవాడకు తరలింపు
-
విశాఖలో లులుకు ఖరీదైన ప్రభుత్వ భూముల కేటాయింపు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి,అమరావతి: విశాఖలో లులు గ్రూప్‌కు ఖరీదైన భూములు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషనర్ పిటీషన్ దాఖలు చేశారు. లులు సంస్థకు బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ భూములు కేటాయించడం చట్ట విరుద్ధం. గతంలో బిడ్ల ద్వారా భూమిని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.విజయవాడలో కూడా లులు గ్రూప్‌కు ప్రభుత్వ భూములు కేటాయింపు జరిగింది. భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం జీరో జారీ చేసింది. విశాఖలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారు. అయితే, భూ కేటాయింపుల్లో కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది అన్నారు. లులుకు భూములు కేటాయించడాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
దొంగ.. దొంగది.! అర్ధరాత్రి ఇంట్లోకి దూరి
పటమట(విజయవాడతూర్పు): ఇంటిలోకి చొరబడి నగలు చోరీ చేసిన కేసులో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. పటమట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భవానీపురానికి చెందిన బాలిక(16), మొగల్రాజపురానికి చెందిన మీసాల అజయ్(19) గతంలో వాసవీ కాలనీలో ఉండేవారు. వన్‌టౌన్ కోమలా విలాస్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నిర్వహించే చిరుమామిళ్ల గిరిజా శంకర్ ఇదే కాలనీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి గిరిజా శంకర్ ఇంటిలో నిద్రిస్తుండగా వీరిరువురూ ఇంటిలోకి చొరబడి విద్యుత్ సరఫరాను ఆపేసి ఇంటిలోని 365 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయటంతో నిందితులు పట్టుబడ్డారన్నారు.పలు కేసుల్లో నిందితులు..నేరంలో భాగమైన బాలిక, అజయ్ ప్రేమికులు. వీరువురూ ఈ చోరీకి ముందు ఇదే ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్కను కూడా చోరీ చేశారు. గిరిజా శంకర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి చోరీ చేశారు. శంకర్ ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత చాకచక్యంగా ఇంటిలోకి చొరబడ్డారు. అజయ్ ఇంటిలోకి వెళ్లగా బాలిక బయట స్కూటర్‌పై కాపలా ఉండి, అజయ్ ఇంటి నుంచి రాగానే బండిపై అక్కడి నుంచి ఉడాయించారు. భవానీపురంలోని బాలిక బంధువుల వద్ద చోరీ సొత్తును దాచిపెట్టారు. వీరిపై నిఘా పెట్టడంతో బాలిక, అజయ్ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద పట్టుబడ్డారు. బాలికను జూవైనల్ హోంకు పంపామని, అజయ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామని తెలిపారు. బాలిక, అజయ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తన కూతురును అజయ్ వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్‌పై పోక్సో కేసు నమోదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందన్నారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ పవన్ కిషోర్, ఎస్.ఐలు డి.హరికృష్ణ, ఆర్ఎస్ కృష్ణ వర్మ, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. అత్త సొమ్ము అల్లుడి దానమా?: శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారు.చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంది. విశాఖలో లులు కంపెనీకి కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టాడు. గతంలో విజయవాడ స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశాడు. అప్పుడు నేను హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజీవ్ గాంధీ పార్క్‌ను అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని చూశాడు. కెనాల్ గెస్ట్ హౌస్ నాలుగు ఎకరాలు టూరిజం పేరుతో గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాడు. 200 కోట్ల రూపాయల స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడు.చంద్రబాబు ఎవరి చెవిలో పువ్వులు పెడతాడు. డీమార్ట్, రిలయన్స్‌కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా?. విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది. చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నాడు. అమరావతికి 34వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి. రైతులు, వ్యవసాయం అంటే చంద్రబాబుకు లెక్కలేదు. ప్రస్తుతం చేసిన భూముల కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
జైల్లో మిథున్ రెడ్డి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమైన తల్లి స్వర్ణలత
-
ఇటు ప్రకృతి విధ్వంసం.. అటు పాలకుల నిర్లక్ష్యం
-
చంద్రబాబు లులూ భజన..!
-
విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
-
విజయవాడలో ధియేటర్ అద్దాలు పగలగొట్టిన పవన్ సైకో ఫ్యాన్స్
-
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపైనే ప్రశ్నిస్తున్నాం: మేయర్ భాగ్యలక్ష్మి
-
అత్యంత దారుణంగా విజయవాడ రోడ్లు
-
యూజ్ లెస్ ఫెలోస్ అంటూ అధికారులపై మంత్రి నారాయణ చిందులు
-
చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్‌రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ38గా చేర్చింది. -
Vijayawada: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజువల్స్
-
Central Jail: జైల్లో నేలపైనే మిథున్ రెడ్డి
-
విచారణకు రావాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం
సాక్షి,విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డికి జైలులో వసతులు కల్పించాలనే ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారనే ఫిర్యాదుపై రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు(మంగళవారం, జూలై 22) కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, విష్ణు వర్ధన్లు ఫిర్యాదు చేశారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించారని న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. అనంతరం, రాజమండ్రి జైలు అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలు అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. -
విజయవాడలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తుల సారె.. (ఫొటోలు)
-
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి మిథున్ రెడ్డి
-
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరుపర్చనుంది. లేని మద్యం కేసును సృష్టించి.. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది. మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయి. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మిథున్‌రెడ్డి కడిన ముత్యంలా బయటకొస్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. లేని మద్యం కేసును సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. కాగా, విచారణకు ముందు.. మిథున్‌రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే అని అన్నారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. విచారణ సమయంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన మాజీ ఎంపీ వంగా గీతమీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టే వాటిని మేము ప్రశ్నిస్తామని భయపడి YSRCP నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అందరికీ తెలుసు.చంద్రబాబూ.. నిజాయితీగా పాలన చేస్తున్నవారు ఎవరూ ఇలా అక్రమ అరెస్టులు చేయించరు.మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా.లేని మద్యం కేసును సృష్టించి, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది: ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రిఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది అనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యంచంద్రబాబు గారూ మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.మిథున్ రెడ్డిపై అక్రమ అరెస్టును ఖండిస్తున్నా: గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీప్రజల అండదండలు మాకు ఉన్నాయి.మీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.మిధున్ రెడ్డి అరెస్ట్ పై X లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ఇంకెక్కడా కుంభకోణం???? కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్నఈ కుట్రలో మిథున్ అన్నను కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది చంద్రబాబు గారి ప్రతీకార డ్రామామిథున్ రెడ్డి అరెస్ట్ కుట్రపూరితం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: గురుమూర్తి, ఎంపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల సమస్యలు గాలికి వదలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపులకు ప్రాధాన్యం ఇస్తుంది.ఎన్నికలలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చే విధంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఈ కుట్రలన్నింటికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. -
మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం
మిథున్‌రెడ్డి అరెస్టును ఖండించిన కాసు మహేష్రెడ్డికూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయితప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదుమిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారువైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం: ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికక్ష సాధింపు లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారుఏపీ లో కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారుమిథున్ రెడ్డి ఖచ్చితంగా న్యాయ పోరాటంలో విజయం సాధిస్తారువైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్రేపు కోర్టులో హాజరుపర్చనున్న సిట్లేని మద్యం కేసును సృష్టించి.. కుట్రలకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వంమిథున్రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహంవిజయవాడసిట్ కార్యాలయంలో 6 గంటలకు పైన కొనసాగుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి విచారణఏ సమయం వరకు విచారణ సాగిస్తారో చెప్పని అధికారులురాత్రికి సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథ్న్ రెడ్డిని ఉంచనున్నట్లు సమాచారంసిట్ కార్యాలయం బయట ఉదయం నుండి భారీ భద్రతలిక్కర్ కేసుకు సంబంధించి చార్జీ షీట్‌ను జడ్జి ఇంటికి తీసుకెళ్ళిన సిట్ అధికారులుజడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్ షీట్‌ను వెనక్కి తీసుకొచ్చిన సిట్ అధికారులు300 పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు సమాచారంపూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో ఉంచాలని చూస్తున్నారంటున్న వైఎస్సార్సీపీవిజయవాడమద్యం పాలసీ కేసులో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణవిజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డిఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్రెడ్డిసిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తిరుపతి..మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందివైఎస్సార్సీపీలో ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో పాటు మిగిలిన వారిని టార్గెట్ చేసుకుని ఇలా సిట్ వేధింపులకు గురిచేస్తున్నారు.50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదునీతిగా నిజాయితీగా పాలన చేశాంవైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది.. అవినీతికి అవకాశం లేదుఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచారుజగనన్న పాలనలో బెల్ట్ షాపులు లేవు.ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించాం అంబటి రాంబాబు కామెంట్స్..ఇది పూర్తిగా తప్పుడు కేసు.ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారు.మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా మద్యం అక్రమ కేసు.ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. తాడేపల్లి..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..ఏపీలో కక్షసాధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందిజగన్ చుట్టూ ఉండే కీలక నాయకుల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారుకూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుసాక్ష్యాలు ఏం ఉన్నాయో చూపాలని కోర్టు అడిగితే సిట్ చూపించలేక పోయిందిరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం2014-19 మధ్య అసలైన లిక్కర్ స్కాం జరిగిందిదాన్నుంచి తప్పించుకునేందుకే కొత్తగా మా పార్టీ నేతలపై కేసులు పెట్టారుఎంపీ మిథున్ రెడ్డి స్వచ్చందంగా విచారణకు హాజరయ్యారువిచారణ సందర్భంగా ఒక యుద్ద వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసిందిరోడ్డు పొడవునా పోలీసులను పెట్టి హడావుడి చేస్తోందిఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదుచిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఎంపీ గురుమూర్తి కామెంట్స్..మిథున్‌రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు.రాజకీయ కక్షతోనే మిథున్‌రెడ్డిపై కేసు.కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్చంద్రబాబు, నారా లోకేష్ కక్ష్య సాధింపుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.వైఎస్సార్సీపీలో కీలక నేత, జగన్ సన్నిహితుడు అయిన ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్రలు జరుగుతోంది.ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర.మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేని మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు.ఓ అభూత కల్పనతో దారుణాలకు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతున్నారుఇప్పటి వరకు అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవుఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, కొట్టడం చేస్తున్నారు.రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు మిథున్ రెడ్డి కామెంట్స్..రాజకీయ కక్షతో కేసు పెట్టారు.ఇది పూర్తిగా తప్పుడు కేసు.మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కేసులకు భయపడే ప్రసక్తే లేదు.రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు.సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డి. సిట్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు. విజయవాడ..ఎనికేపాడు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుగన్నవరం విమానాశ్రయం నుండి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు బయల్దేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు.సిట్ కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలుఎవరిని అనుమతించని పోలీసులుసిట్ కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణును ఆపేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి.మద్యం కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఏపీలో మద్యం కేసులో విచారణ విషయమై.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే మిథున్ రెడ్డి.. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.నేడు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో హంగామా చేస్తున్నారు.విమానాశ్రయం ఎంట్రన్స్‌లో భారీగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల వివరాలు అడిగి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం నేపథ్యంలో ఆంక్షలు విధించారు. -
Rowdy Gang: గజగజ లాడుతున్న బెజవాడ
-
Hyderabad: దంచికొట్టిన వర్షం
-
మరో నారాయణ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,విజయవాడ: నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. భవానీపురం నారాయణ కాలేజీలో జీవన్ సాయి చదువుతున్నాడు. అయితే,ఈ క్రమంలో మార్కులు తక్కువ వచ్చాయని జీవన్ సాయిని కాలేజీ లెక్చరర్ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన జీవన్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న భవానిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.తన కుమారుడి మరణానికి నారాయణ కాలేజీ యాజమాన్యమే కారణమని విద్యార్ధి తల్లి శిరీష కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాబిడ్డను అందరి ముందు కొట్టారు. నా కొడుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ సాయి ఆత్మహత్యపై భవానిపురం నారాయణ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. లెక్చరర్ కొట్టడంతో మనోవేదనకు గురై ఆత్మ చేసుకున్న విద్యార్థి ఏమీ పట్టనట్లు కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాలేజీపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. -
విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్
-
బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్
-
ఉప్పల హారిక పై దాడి.. విజయవాడలో మహిళలు భారీ నిరసన
-
టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుంది: వరుదు కల్యాణి
సాక్షి, విజయవాడ: జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మహిళపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు. మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజున్న బాబు,పవన్ ఎక్కడ?’’ అంటూ నిలదీశారు.టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా?. కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారు. కచ్చితంగా చంద్రబాబు సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ‘‘జడ్పీ చైర్‌పర్సన్‌పై జరిగిన దాడి సిగ్గుచేటు. బీసీ మహిళపై దాడితో సభ్య సమాజం తలదించుకుంటుంది. బీసీలు అంటే బ్యాక్ బోన్స్ అని చెప్పిన చంద్రబాబు.. ఆ బోన్స్ విరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం.. సంక్షేమంలో రికార్డు లేదు కానీ.. దాడుల్లో రికార్డ్ సాధించింది. గంటసేపు మహిళపై నానా బూతులు మాట్లాడారు...దాడి చేయడమే కాకుండా ఉప్పాల రాముపై కేసు నమోదు చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మహిళా సంఘం చైర్మన్ మౌనంగా ఉంది?. చట్టం అందరికీ ఒకటే అనే సంగతి మరిచారా?. తక్షణం హోం మంత్రి, డీజీపీ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి. దాడి చేయడమే కాకుండా ఉప్పాల హారికని మహానటి అనడం దారుణం’’ అని కల్పలతారెడ్డి మండిపడ్డారు. -
కొనసాగుతున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె
-
Vijayawada: పనిమనిషే ప్రాణం తీసింది
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
జయహో శాకంబరీ మాత!
అమ్మవారంటే సాక్షాత్తూ అమ్మే. ఈ సృష్టిలోని జీవరాసులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరి దేవి అవతారంలో ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆకలి బాధ ఉండదనీ భక్తులు విశ్వసిస్తారు. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాధ తెలుసుకుందాం...∙ఆషాఢ ఉత్సవాలువేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తి హీనులై΄ోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.ఋషులు, దేవతలు సర్వ శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో ‘శతాక్షి’గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితి ని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్దచెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.పార్వతీదేవి దుర్గగా, తన నుంచి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో ఆషాఢ మాసం లో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి.వరంగల్‌లోని భద్రకాళీ ఆలయంలో మొదటిసారిగా ఆషాడ శుద్ధ సౌర్ణమి నాడు శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు... అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు... వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడవుతాడు.చదవండి: తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేస్తున్నా: ఉపాసన కొణిదెల ఆషాఢమాసంలో ఆలయానికి వెళ్లే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు, కూరగాయలను ఉంచి, వీలయితే వాటితో అమ్మవారిని అలంకరించి, ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది. అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకంబరీ ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలచుకుని పేదలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం ఫలదాయకం.వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో గత నెల జూన్ 26న సహస్ర కలశాభిషేకంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు. నేడు గురువారం పౌర్ణమి సందర్భంగా మహాశాకంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!– అడ్లూరి సునందాశివప్రసాద్ సాక్షి, హన్మకొండ కల్చరల్ -
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
పల్నాడు: భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లికీ చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. విజయవాడ పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్ డ్రిల్ (ఫొటోలు)
-
‘ప్రభుత్వానికి ఇగో ఏంటి?.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?’
విజయవాడ: విదేశీ వైద్య విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఇగో ఏంటో అర్థం కావడం లేదని,. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే తమకు ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం అధ్యక్షులు సీదిరి అప్పలరాజు తెలిపారు. పర్మినెంట్ రిజస్ట్రేషన్ల కోసం ధర్మాచౌక్లో ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) సైతం నిరసన చేపట్టిన వైద్య విద్యార్థుల ఆందోళనకు డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితరులు తమ మద్దతు తెలిపారు. విద్యార్థుల శిబిరానికి చేరుకుని వైఎస్సార్సీపీ నేతల మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా సీదిరి అప్పలరాజా మాట్లాడుతూ.. ‘న్యాయమైన డిమాండ్ ను అడిగితే విద్యార్ధులను రోడ్డుకు ఈడుస్తారా?, విద్యార్ధినుల జుట్టుపట్టి కొట్టేస్తారా?, మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ...తాలిబాన్ లో ఉన్నామా?, వైద్య విద్యార్ధులను జుట్టుపట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేస్తారా?, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది?, 13 నెలలుగా కాలయాపన చేసి చివరికి విద్యార్ధులను ఎండలో కూర్చోబెట్టారు. వైద్య విద్యార్ధుల ఏడుపు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలి. వైద్య రంగం సంపూర్ణంగా పనిచేయాలని జగన్ కృషి చేశారు. 50 వేల మందిని రిక్రూట్ చేశారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే...ఈ ప్రభుత్వం వాటిని కట్టకుండా ఆపేసింది. ఏడాదిలో లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చారు చంద్రబాబు. ఆరువేల కోట్లతో పూర్తయ్యే మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటున్నారు. లక్ష కోట్లతో బిల్డింగ్లు ,బొలేరోలు కొనుక్కోవడానికి డబ్బులున్నాయంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెడుతున్నారు. బ్లాకే మెయిల్ చేస్తారా అని సాక్షాత్తూ మంత్రే విద్యార్ధులను బెదిరిస్తున్నారు విద్యార్ధుల పట్ల మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. ఇది ప్రభుత్వం చేతగానితనంవైద్య విద్యార్తులు రోడ్డెక్కాల్సిన రావడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనిరవాసరెడ్డి. ‘ చంద్రబాబు,లోకేష్ పరిపాలనను గాలికొదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పై దృష్టిపెట్టారు. ఎవరి పై కేసులు పెట్టాలి...ఎవరిని లోపల పెట్టాలనేదే వాళ్ల ఆలోచన. విద్యార్ధుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నారు. ఏపీలో మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నారు. ఏపీలోనే ఎందుకు ఈ సమస్య వచ్చిందిమీకు ఇవ్వడం చేతకాకపోతే ఎన్ఓసి ఇవ్వండి వేరే రాష్ట్రానికి వెళ్లి తెచ్చుకుంటారు. 68 మంది విద్యార్ధుల పై కేసులు పెట్టారు. ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి తమ పిల్లలను చదివించుకున్న తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. చంద్రబాబు,లోకేష్ ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడనాడండి. డాక్టర్లను రోడ్డు మీదకు వదిలేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి వైద్య విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలి’ అని గోపిరెడ్డి శ్రీవినాసరెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి -
యోగా టీచర్లపై పోలీసుల జులుం
-
చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్ల నిరసన
-
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్‌లో ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం.. విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తీసుకొచ్చారు. -
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఆషాఢ సారె (ఫొటోలు)
-
ఇదే కనుక జరిగితే నీటి సరఫరా, విద్యుత్ బంద్..
-
విజయవాడలో అర్ధరాత్రి భారీ వర్షం (ఫొటోలు)
-
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్‌ను ఎస్ఐ పలుసార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
పేరు గొప్ప.. ఊరు దిబ్బ విజయవాడ జీజీహెచ్ పరిస్థితి (ఫొటోలు)
-
చెవిరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా.. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని తెలిపారు. -
ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న కేంద్రం వద్ద లైవ్ సైడ్ స్క్రీన్ పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే యోగా చేసే వారిపై స్కీన్ పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు.. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో యోగా సందర్భంగా అరకొరగా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగా చేసేందుకు స్టేడియంకు వచ్చిన వారికి కావాల్సిన మొత్తంలో మ్యాట్స్ ఇవ్వకపోవడంతో వాటి కోసం అందరూ ఎగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారికి చెదరగొట్టారు.ఇదిలా ఉండగా.. విశాఖలో యోగా డే సందర్భంగా ప్రమాదం తప్పింది. యోగా డే వేడుకల కోసం ప్రజలను తరలిస్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హనుమంతువాక విశాలాక్షి నగర్ వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారంతా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. -
విజయవాడలో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో సదస్సు
-
విజయవాడ: జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత
సాక్షి, విజయవాడ: జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వాంతులు, విరోచనాలు, డీ హైడ్రేషన్‌తో వంశీ బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఆయన గత నెలలో కూడా తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్థారించారు.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.కాగా, వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. -
వివాహితను నవవధువుగా చెప్పి మోసం
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వివాహమై పిల్లవాడు ఉన్న యువతిని పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి లక్షలు దండుకొని మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కర్నాటక కొప్పుల్ జిల్లాకు చెందిన జి.దుర్గాప్రసాద్ (34) వివాహం కాకపోవడంతో స్థానికంగా ఉన్న మ్యారేజీ బ్యూరోకి చెందిన శ్రీదేవి అనే మహిళ ద్వారా రాజమండ్రి, విజయవాడలోని మధ్యవర్తులను ఆశ్రయించాడు. వారు విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని పరిచయం చేశారు. విజయవాడకు చెందిన తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావు కృష్ణలంకకు చెందిన పల్లవి అలియాస్ ఆమని అనే యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడ కృష్ణలంకలోని ఒక హోటల్లో పెళ్లి చూపులు తతంగం జరిపించారు. అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే రూ.2.70 లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం మరో రూ.18 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు పార్వతి అనే మహిళకు రూ.50 వేలు ఇచ్చారు. ఈ నెల ఐదున దుర్గగుడిలో వివాహం జరిగింది. కర్నాటక వెళ్లి ఏడో తేదీన వరుడి ఇంటి వద్ద రిసెప్షన్ జరుపుకొన్నారు. పల్లవి వెంట కర్నాటక వెళ్లిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద రూ.50 వేలు తీసుకుని అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తరువాత పల్లవి తనకు అంతకు ముందే వివాహమైందని, ఒక బాబు కూడా ఉన్నట్లుగా చెప్పింది. దాంతో దుర్గాప్రసాద్ తాను మోసపోయినట్లు గుర్తించి తన కుటుంబ సభ్యులకు వివరించాడు. పల్లవిని తీసుకొని ఈ నెల 14వ తేదీన విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేయటమే కాకుండా తన నుంచి రూ.2.88 లక్షల నగదును సైతం కాజేశారని వాపోయాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు దుర్గాప్రసాద్‌ను వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు పంపించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
Malladi Vishnu: జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం
-
జూన్ 26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ: ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు, 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవ రాత్రులు, జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఆషాఢ మాసోత్సవాలు.. అమ్మవారికి సారె ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా భక్తులు దుర్గమ్మకు సారె సమర్పిస్తారు. నెల రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మూలవిరాట్ దర్శనానంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. గుప్త నవరాత్రులుఆషాఢంలో దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు (గుప్త నవరాత్రులు) నిర్వహిస్తారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఆలయ వైదిక కమిటీ, అర్చకులు ఈవోతో చర్చించారు. శాకంబరీదేవి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లో దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసే కదంబం ప్రసాదం శాకంబరీదేవి ఉత్సవాల ప్రత్యేకత. చదవండి: Today recipes : బ్రెడ్‌తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?వైదిక కమిటీ, అర్చకులతో ఈవో సమీక్ష దుర్గగుడిలో ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం ఆలయ వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, ఆలయ ఏఈవో, ఫెస్టివల్ విభాగంతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థ్ధానంపై ఉందని ఆలయ అధికారులతో పేర్కొన్నారు. దర్శన వేళలు, రద్దీ సమయాల్లో వ్యవహరించాల్సిన విధానాలు, ప్రస్తుతం అమలులో ఉన్న వీఐపీ ప్రత్యేక బ్రేక్ దర్శన వేళలు వంటి అంశాలను చర్చించారు. సమీక్షలో ఈఈ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు శ్యావాశ్వ మహర్షి, సీహెచ్ ఆంజనేయ ఘనాపాటి, ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధానఅర్చకులు కోట ప్రసాద్, ఏఈవో ఎన్. రమేష్‌బాబు, బి. వెంకటరెడ్డి, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్ -
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
విజయవాడ: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వేసవి సెలవులు మగిసిన తర్వాత హైదారాబాద్ బయల్దేరారు ఏపీలోని ప్రజలు. అయితే ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సుల ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో ప్రయాణికలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. ప్రత్యేక బస్సులు నడపడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనబడింది. వేసవి సెలవులు ముగిశాయని తెలిసినా ప్రభుత్వం మాత్రం సాధారణ బస్సు సర్వీసులకే పరిమితమైంది. ఎటువంటి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట చేయకపోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. గతరాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని, ప్రత్యేకంగా గత ఏడాది కూడా ఇలానే వచ్చినా ఈ తరహాలో బస్సులు లేకుండా ఇబ్బందులు పడలేదని ప్రయాణీకులు అంటున్నారు. -
Sakshi: విజయవాడ సాక్షి కార్యాలయంపై పచ్చమూకల దాడి
విజయవాడ,సాక్షి: విజయవాడలో పచ్చమూకలు రెచ్చిపోయారు. విజయవాడ సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. సాక్షి యూనిట్ కార్యాలయం బోర్డులను టీడీపీ నేతలు పగలకొట్టారు. సాక్షి బోర్డులు పీకేసీ తగులబెట్టారు. అనంతరం, సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు, రాళ్లు విసిరేశారు. సాక్షి కార్యాలయంపై దాడి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ సమక్షంలోనే జరిగింది. అయితే, సాక్షి కార్యాలయంపై పచ్చమూకలు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. -
‘సీజ్ ద షిప్ అన్న మీరు.. లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?’
విజయవాడ: ఏపీలో రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు. బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది. గతంలో పవన్ వెళ్లి సీజ్ ద షిప్ అన్నారు. పవన్ షిప్‌ను సీజ్ చేసినప్పుడు మీరు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?, కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్(బీపీఎల్) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్?, ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు. -
విజయవాడలో సెలూన్ షాప్ ప్రారంభించిన పవన్ కల్యాణ్
-
శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిటీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాంలోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్రరెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్‌ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. -
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
విజయవాడ శాతవాహన కాలేజీని కూల్చివేసిన పచ్చమాఫియా
-
విజయవాడ: శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
సాక్షి, విజయవాడ: ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్‌ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్‌తో వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు.. బోర్డులు ఏర్పాటు చేశారు.కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండిపడుతోంది.విద్యార్థుల పరిస్థితి ఏంటి?శాతవాహన కాలేజీ భవనాలు కూల్చివేతతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కళాశాల భవనాలు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శాతవాహన కాలేజీకికు దశాబ్ధాల చరిత్ర ఉందని.. కోర్టు ఆదేశాలను సాకుగా చూపి కళాశాల భవనాలు కూల్చేయడం దారుణమన్నారు.విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్టిఫికెట్లు, రికార్డులన్నీ శిథిలాల కిందే ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?. తక్షణమే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. విద్యార్ధులకు న్యాయం చేయాలి’’ అని రవిచంద్ర డిమాండ్ చేశారు. -
విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి వల్లభనేని వంశి
-
విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
-
కక్షగట్టి.. పొట్టకొట్టి!
‘‘వలంటీర్లను నమ్మించి దెబ్బకొట్టినట్టే రేషన్ వాహనాల డ్రైవర్లను వంచించి ముంచారు. మాకు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎండీయూల రద్దును వెనక్కి తీసుకోకపోతే రేషన్ దుకాణాల వద్ద జూన్ 1న ప్రజల తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ – రేషన్ వాహనాల డ్రైవర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ‘‘75 శాతం ప్రజలు ఎండీయూల సేవలను కోరుకుంటున్నారు. 35 మార్కులు వస్తే పరీక్షల్లో పాస్. అలాంటిది 75 శాతం అంటే డిస్టింక్షన్. అలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ చేస్తోంది. పాఠశాలలు తెరిచేముందు రద్దు చేయడంతో పిల్లలకు ఫీజు కూడా కట్టుకోలేని దుస్థితి. మంత్రి నాదెండ్లకు అవగాహన లేదు. ఎండీయూల రద్దుపై మీకు నచ్చిచనవాళ్లతో ప్రజల దగ్గరకు వెళ్లి సర్వే చేసుకోండి. వారు తిరస్కరిస్తే మీ ఇష్టం. అన్యాయంగా మా జీవితాలను దెబ్బకొట్టొద్దు’’–కర్నూలుకు చెందిన రేషన్ వాహన డ్రైవర్ కేశవ్‘‘రేషన్ అక్రమ రవాణాను అరికడతామనే కదా.. చంద్రబాబు గతంలో ఈ–పొస్ మిషన్లు తెచ్చింది. డీలర్ల ద్వారా పంపిణీ సక్రమంగా జరగట్లేదని చెప్పారు కదా? పేదల బియ్యాన్ని డీలర్లు బొక్కేస్తున్నారని 22 ఏళ్ల కిందట వ చ్చిన ఠాగూర్ సినిమాలో చిరంజీవి చూపించలేదా? అప్పుడేమైనా ఎండీయూ వ్యవస్థ ఉందా? వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారా? ఇప్పుడు మాపై బురదజల్లి దొంగల చేతికి తాళాలిస్తూ మమ్మల్ని బలిపశువులను చేస్తారా’– రేషన్ వాహనాల డ్రైవర్ల సంఘం మండపేట మండలం సంఘం అధ్యక్షుడు కిరణ్ సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని తగ్గించాలి గానీ.. ఉన్న ఉద్యోగాలు పీకేసీ ప్రజలను రోడ్డున పడేయకూడదు. ఎన్నికల ముందు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి.. గెలిచాక ఉన్న ఉద్యోగాలు తీసివేయడమేనా అభివృద్ధి? మాపై కక్షగట్టి.. పొట్ట కొట్టడమేనా సంక్షేమం..? బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. పేదల ఇంటికి బియ్యం చేరవేస్తే అనాగరికమా? మా జీవితాలను కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?’’ అంటూ రేషన్ వాహనాల (ఎండీయూ) డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం రెండో రోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చి తీరాల్సిందేనని నినదించారు. ఈ ప్రశ్నలకు బదులేది? ఇవీ న్యాయమైన ప్రశ్నలు అంటూ రేషన్ వాహన డ్రైవర్లు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. అవేంటంటే? » మేము ఎప్పుడైనా జీతం పెంచాలని కోరామా? » ఎండీయూ వ్యవస్థ ప్రారంభంలో లీటర్ పెట్రోల్ రూ.70. ఇప్పుడు రూ.110. అయినా మేం పనిచేయట్లేదా? » మాకు ఉచితంగా వాహనం ఇవ్వడం లేదు. మేం డిపాజిట్లు కట్టాం. ప్రతి నెల మా జీతంలో బ్యాంకులకు వాయిదాలు కడుతున్నాం. ఉచితమని ఎలా చెబుతారు? » ముగ్గురు డీలర్లు చేసే పనిని ఒక్క ఎండీయూ చేస్తోంది. మాకు ఇచ్చే రూ.21 వేలల్లో చేతికి వచ్చేది రూ.18 వేలు. అందులో హెల్పర్లకు, హమాలీలకు సగం మేమే చెల్లించుకోవట్లేదా? » ఒక్కో డీలర్‌కు రూ.12 వేలకు పైగా కమీషన్లు ఇస్తున్నారు. అంటే ముగ్గురు డీలర్లకు సుమారు రూ.40 వేలు. కానీ, ఒక్క ఎండీయూ చేతికి వచ్చేది రూ.18 వేలు. » 9,260 ఎండీయూలపై 288 కేసులు ఉన్నాయంటున్నారు. మా సంఖ్యలో ఒక్క శాతం కూడా కాదిది. మరి 28 వేలమందికిపైగా డీలర్లలో 6 వేలకుపైగా కేసులు లేవా? » నాయ్యంగా మా అగ్రిమెంట్ వరకు కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి? ప్రజలను మళ్లీ రేషన్ దుకాణాల ఎదుట క్యూలో నిలబెడితే వచ్చేదేమిటి?రాజకీయాలు చూస్తే నాకు బండి రాదు కదా? నేను టీడీపీ కార్యకర్తను. గత ప్రభుత్వంలో నాకు రాజకీయాలకు అతీతంగా మేలు జరిగింది. కారు డ్రైవర్‌గా ఆప్టింగ్లకు వెళ్లే నేను.. సొంత ఊరిలో రేషన్ వాహన డ్రైవర్‌గా మారాను. ఇద్దరు బిడ్డలను ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే ఇంజనీరింగ్‌లో చేర్పించా. వైఎస్ జగన్ ప్రభుత్వం రాజకీయం చూసి ఉంటే ఇవన్నీ నాకు వచ్చేవి కాదు కదా? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ నీరుగారిపోయింది. నేను మూడు నెలలకు ఒక్కొక్కరికి 9 వేలపైనే ఫీజులు కడుతున్నా. ఇప్పుడు ఎండీయూల రద్దుతో నా ఉపాధి కూడా పోయింది. రాజకీయ క్షక్షసాధింపులు చేస్తే చివరికి బలయ్యేది ప్రజలే. అందులో టీడీపీని నమ్మిన నాలాంటి వాళ్లు కూడా ఉంటారని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. –చెన్ను సత్యం, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా మళ్లీ కూలికి పోవాల్సిందే.. నాలుగేళ్లు రేషన్ వాహనం నడుపుకొన్నా. ప్రభుత్వం నుంచి క్రమంతప్పకుండా గౌరవ వేతనం రావడంతో దిగులు లేకుండా పోయింది. అంతకుముందు రోజూ కూలికి వెళ్తే తప్ప పొట్ట నిండేది కాదు. వర్షాకాలం, వేసవిలో పెద్దగా పనులు ఉండవు. మా చేతుల్లో డబ్బులు కూడా ఉండవు. రేషన్ వాహన డ్రైవర్‌గా ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతికాను. ఇప్పుడు మళ్లీ కూలి పనులు వెదుక్కొనే దుస్థితికి తీసుకొచ్చారు. నాకు ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులే రూ.70 వేలు అవుతున్నాయి. గతంలో అమ్మఒడి, వాహన మిత్ర, చేయూత, అమ్మకు పింఛన్ రూపంలో ప్రభుత్వ సాయం అందేది. ఎప్పుడూ మా అమ్మ నన్ను రూపాయి అడగలేదు. నాకే తిరిగి సాయం చేసేది. జీవితం హాయిగా వెళ్లిపోయేది. ఇప్పుడు అవన్నీ నిలిచిపోవడం, ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. –సుదీర్, పెదకాకాణి, గుంటూరు జిల్లా ఉపాధిని ఊడగొట్టారు.. ట్రాక్టర్ డ్రైవర్‌గా కౌలు వ్యవసాయం చేసేవాడిని. ఎండీయూల రాకతో రేషన్ వాహన డ్రైవర్ అయ్యాను. ప్రతి నెల కొంత సొమ్ము నిర్దిష్టంగా రావడంతో చాలా ఊరటగా ఉండేది. ఆ ధైర్యంతోనే గత ప్రభుత్వం ఇంటి స్థలం ఇస్తే.. బ్యాంకు లోన్ తీసుకుని జగనన్న కాలనీలో ఇళ్లు కట్టాను. ప్రతి నెలా రూ.7 వేలు వాయిదాను కడుతున్నా. నాకు ఇద్దరు పిల్లలు. గతంలో అమ్మఒడి రావడంతో ఫీజుల బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఏ పథకమూ రాకపోగా ఉన్న ఉపాధిని ఊడగొట్టారు. – వై.గోపి, కొల్లిపర, గుంటూరు జిల్లా మళ్లీ మాకు గడ్డు కాలమే..! నేను డిగ్రీ చదివాను. వైఎస్ జగన్ ఎండీయూ వ్యవస్థను తీసుకురావడంతో రేషన్ వాహన డ్రైవర్‌గా సొంత ఊరిలో ఉపాధి దొరికింది. భార్య ముగ్గురు పిల్లలతోపాటు, తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లిని జాగ్రత్తగా చూసుకోగలిగాను. ఇక అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వాహన మిత్ర ఇలా నిత్యం ఏదో ఒక పథకం రూపంలో ఆర్థిక సాయం అందేది. వాటితో మిర్చి, పత్తి పంటను కౌలుకు చేసేవాళ్లం. రేట్లు బాగుండి లాభం వచ్చింది. ఇప్పుడు మొత్తం నష్టాలే. ఉపాధి లేకుండా చేస్తామనడంభావ్యమా? –సీహెచ్ యలమంద, గురజాల, పల్నాడు జిల్లా -
మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి
-
వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్‌కు వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్ జగన్ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
-
వంశీని బలిగొనేందుకు బాబు సర్కార్ యత్నం: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్‌కు తరలించారని.. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని.. వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నను అరెస్టు చేస్తే పైల్స్ అంటూ డ్రామాలు ఆడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. వంశీకి ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా కానీ.. చికిత్స అందించడం లేదు. చెంచాగిరి చేస్తున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతాం. సీఐ భాస్కర్ రావు అయిన, ప్రభుత్వం ఆసుపత్రి సూపరిండెంట్ అయిన ఎవరిని వదిలిపెట్టం’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు.న్యాయ పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ అరుణ్కుమార్వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం.. వంశీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్తాం. నిలబడలేని మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. -
Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్
-
విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)
-
విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)
-
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేశారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇపిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచేశారు. మొగల్ రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కానీ న్యాయం జరగలేదంటూ విజయవాడ కమిషనర్‌ను కలిసేందుకు బాధితులు వచ్చారు. విజయవాడ కమిషనరేట్‌లో స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన కానీ నేటికీ కూడా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని బాధిత నిరుద్యోగులు అంటున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు నిర్వాహకులను అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు నాగరాజు, హెచ్ఆర్ శిరీషలను అరెస్ట్ చేయకుండ మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చంటూ హేళనగా సమాధానం చెబుతున్నారని బాధితులు అంటున్నారు. చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని సీపీ రాజశేఖర్‌బాబు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలతో పాటు రెండు షురీటిలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో నలుగురకి బెయిల్ వచ్చింది. సత్యవర్డన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఈ రోజు(మంగళవారం) కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిసన్ పై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)
-
సై‘బరి’ తెగింపు
‘విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వచ్చాయి. వెంటనే ఓ ఆగంతకుడి నుంచి కాల్ వచ్చింది. పొరపాటున మీ నంబర్‌కు నాకు సంబంధించిన కోడ్, ఓటీపీ వచ్చిందని, దయచేసి దాన్ని తనకు చెప్పాలని ఆగంతకుడు అభ్యర్ధించాడు. ఫోన్లలో ఇలాంటి పొరపాటు మెసేజ్‌లు రావడం సహజమేనని నమ్మి. ఆ ఆగంతకుడికి ఆ వ్యక్తి కోడ్, ఓటీపీ చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే గుడ్‌మార్నింగ్ మెసేజ్ తన స్నేహితులకు పంపేందుకు ఆ వ్యక్తి విఫలయత్నం చేశాడు. 12 గంటల పాటు తన వాట్సాప్‌కు ఎలాంటి మెసేజ్‌లు, ఫొటోలు రావడం లేదని, తన నుంచి ఎవరికీ మెసేజ్‌లు వెళ్లడం లేదని గ్రహించాడు. ఎట్టకేలకు తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్ పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టాడు’.విజయవాడస్పోర్ట్స్: డిజిటల్ అరెస్ట్, జాబ్‌ఫ్రాడ్, హనీ ట్రాప్, ఫిషింగ్, డేటా బ్రీచ్ తదితర వందకుపైగా స్కామ్‌లతో ప్రజలను ఆరి్ధక దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్లు.., తాజాగా రూటు మార్చారు. ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్పైనా కేటుగాళ్లు కన్నేశారు. వాస్తవ ఖాతాదారులను బురిడీ కొట్టించి హ్యాక్ చేస్తూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే నంబర్‌తో వేర్వేరు ఫోన్లలో ఎన్నైనా వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసుకునే వెసులుబాటును సైబర్ నేరస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘‘ నేరగాళ్లు వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్‌కు మీ నంబర్ ఇస్తారు. దీంతో వాట్సాప్ సంస్థ నుంచి మీ మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వస్తుంది. ఈ రెండూ తెలుసుకునేందుకు మిమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తారు. పొరపాటున కోడ్, ఓటీపీ మీ నంబర్‌కు వచ్చిందని, దాన్ని కాస్త చెప్పాలని అభ్యర్థిస్తారు. కోచ్, ఓటీపీ వారికి చెప్పగానే మీ వాట్సాప్ ఖాతా వారి ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిజెప్పీరింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. మీ వాట్సాప్ వచ్చే అన్ని మెసేజ్, ఫోటోలు పూర్తిగా వారి ఫోన్‌కు వెళ్లేలా సెట్టింగ్స్ చేసి హ్యాక్ చేస్తారు. వాట్సాప్ సంభాషణ పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యక్తిగత హననానికి, ఆర్థిక దోపిడీకి పాల్పడతారు. హ్యాకింగ్‌తో అపరిమితమైన నేరాలువాట్సాప్లో చాటింగ్, గ్రూప్‌ల ఆధారంగా ఆ వాట్సాప్ వినియోగించే వ్యక్తి మనస్తత్వాన్ని నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. ఏయే గ్రూప్‌లకు మెసేజ్‌లు పార్వాడ్ చేస్తున్నారో.., ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారో.., ఎలాంటి సంభాషణలు చేస్తున్నారో.., క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములను వాట్సాప్ ద్వారా డబ్బులు అభ్యర్థిస్తారు. వాస్తవ ఖాతాదారుడికి తెలియకుండానే అతని పేరుతో చాటింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. వాట్సాప్ బ్యాంకింగ్ వ్యాలెట్‌లో ఉన్న నగదునూ లూటీ చేస్తారు. డీపీ (డిస్ప్లే పిక్చర్) ఫొటోను మారి్ఫంగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. వాట్సాప్ కాంటాక్ట్, గ్రూప్‌లలో ఉన్న మహిళల డీపీలను మారి్ఫంగ్ చేస్తారు. మహిళలకు అసభ్య మెసేజ్‌లు పంపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డేటింగ్, బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను వినియోగించడమే కాకుండా గ్రూప్‌లలో ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటారు. వాట్సాప్ గ్రూప్లలోకి, వ్యక్తిగత నంబర్లకు ఏపీకే ఫైల్స్, మాల్వేర్లను పంపిస్తారు. పొరపాటున వాటిని క్లిక్ చేసిన వ్యక్తుల అకౌంట్లను హ్యాక్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫి, పోర్న్ వీడియోలను, న్యూడ్ ఫొటోలను వాట్సాప్ అకౌంట్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తారు. స్త్రీ/పురుషు వ్యభిచారుల(మేల్ ఎస్కార్ట్ సర్వీస్, ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీస్) వివరాలను ఇతరులకు షేర్ చేసేందుకు ఈ వాట్సాప్‌ను వినియోగిస్తారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచార మారి్పడికి హ్యాక్ చేసిన అకౌంట్లను వినియోగిస్తారు. వాట్సాప్ చానల్ ద్వారా సంఘ వ్యతిరేక, అసభ్య సమాచార మార్పిడి చేసి కేసుల్లో ఇరికిస్తారు.లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండికీ ప్యాడ్ ఫోన్ వినియోగించే వారు సైబర్ నేరస్తుల ట్రాప్‌లో అత్యధికంగా పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ఉన్నత విద్యావంతులూ బాధితులుగా ఉన్నారు. వాట్సాప్ మాత్రమే కాకుండా ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్ కోడ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం, షేర్ చేయడం చేయరాదు. సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. గూగుల్లోకి వెళ్లి లా ఎన్ఫోర్స్మెంట్ అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో ‘మీరు పోలీసా’ అని అడుగుతుంది, ‘నో’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయగానే కొత్త ఫారం ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇష్యూష్ ఆప్షన్లో హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదు ఆన్లైన్లో రికార్డవుతుంది. ఫిర్యాదు చేయడంలో ఏమైనా సందేహాలుంటే సైబర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. –శ్రీరామచంద్రమూర్తి రాళ్లపల్లి, ఎస్ఐ, సైబర్ క్రైం, ఎన్టీఆర్ జిల్లా -
సాక్షి ఎడిటర్ పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు విజయవాడ జర్నలిస్ట్ లు ఫైర్
-
విజయవాడలో భారీ వర్షం..(వీడియో)
సాక్షి, విజయవాడ: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం నుంచి విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచే నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల రేకుల షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి. భారీ వర్షం నేపథ్యంలో దుర్గ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసి వేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కనకదుర్గా నగర్ మార్గం మీదుగా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు దుర్గ గుడి ఈవో విజ్ఞప్తి చేశారు. #Vijayawada city getting trashed by powerful thunderstorms, unfortunately #Guntur city missed major spell 🌧️Storms from ntr, #Vijayawada will further cover more parts of eluru, krishna, west & east #GODAVARI districts in upcoming hours 🌧️.. Updates to follow stay tuned 👍 pic.twitter.com/XUbvJvEetI— Eastcoast Weatherman (@eastcoastrains) May 4, 2025Sudden climate change in #VijayawadaHeavy rain with thunderstorms 🌧️ ⛈️ Everyone stay home and stay safe 👍 pic.twitter.com/RLz9BV2hsA— Bhargav (@BhargavTweetz) May 4, 2025 Rain rampage @ Vijayawada.Car ye shake aypothundi. pic.twitter.com/sK5UxPHHBc— Cinema Madness 24*7 (@CinemaMadness24) May 4, 2025మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఏకధాటిగా కురుస్తోంది. అకాల వర్షాల కారణంగా జిల్లాలో వరి, అరటితో పాటు పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇదేం భీబత్సం సామి ⛈️⛈️⛈️భోరున వర్షం, గాలి, భీబత్సం#Vijayawada pic.twitter.com/Lq5qlh8iTE— Vineeth K (@DealsDhamaka) May 4, 2025 -
ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు
సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆంక్షలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆలయ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేయనున్నారు. మరమ్మతుల దృష్ట్యా ఘాట్‌రోడ్డు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు కనకదుర్గానగర్ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. పున్నమి ఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.కాగా, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సాధారణ రోజుల్లో నిత్యం 30 వేల మందికిపైగా, శుక్ర, శని, ఆదివారాల్లో 60 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. అయితే ఆలయంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొండపైకి గత నెల11వ తేదీన ఉత్తరాదికి చెందిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ కాలినడకన చేరుకోవడంతో పెద్ద దుమారమే రేగింది.గత నెలలోనే ఘాట్ రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద నిలిపిన కారులో 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కొండపైన కింద 220 సీసీ కెమెరాలు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదు. వాటిని పర్యవేక్షించే పరిస్థితిలేదు. దీన్నిబట్టే అధికారులకు అమ్మవారి భద్రతపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది. కొంత మంది దేవాలయ అధికారులే దర్శనాల దందా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మొత్తం మీద రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. -
జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత
సాక్షి, విజయవాడ: జైలులో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు సిబ్బంది తీసుకొచ్చారు. గుండె సంబంధిత టెస్టులతో పాటు, బ్లడ్ టెస్ట్‌లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేశారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు తరలించారు. -
‘దక్షిణ భారతంలో కూడా అధికారంలోకి వస్తాం’
విజయవాడ: దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన కిషన్ రెడ్డి.. ‘దక్షిణ భారతదేశంలో కూడా అధికారంలో కి వస్తాం. తమిళనాడు, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారు.అంబేద్కర్ ఉత్సవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిస్టాత్మకం గా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ 14వ తేదీనే కాకుండా 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అంబేద్కర్ దళిత సామాజిక వర్గంలో జన్మించి అనేక ఒడిదుడుకులు ఎదురుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో అవమానాలకి గురయ్యారు.ఒక మేధావిగా ఆయన ఎదిగి అనేక పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ ఎంపీ గా పోటి చేస్తే ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేసారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టి పార్లమెంట్ కి పంపించేలా మేధావులు కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించింది. రాజకీయ స్వలాభం కోసం ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండేది. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానపరిచేలా కాంగ్రెస్ చేసింది. అంబేద్కర్ ఒక మేధావి అయినప్పడికి అనేక రకాలుగా కాంగ్రెస్ అవమానపరిచింది. మొదటి సారి ప్రధానిగా మోదీ ఎన్నిక అయినప్పుడు అంబేద్కర్ కి నివాళులు అర్పించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తి తోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని మరింత శక్తీవంతంగా ఉంచాలని మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. రాజ్యాంగానికి గౌరవం ఉండేలా మోదీ ప్రభుత్వం ఉంటుంది. అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. అంబేద్కర్ ఉన్న ప్రదేశాలని పంచ తీర్థ పేరుతో నిర్మాణం చేపట్టాం. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత ప్రధాని మోదీది. దేశానికి సేవ చేసిన అంబేద్కర్ కి కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది. అంబేద్కర్ సిద్ధాంతం, స్ఫూర్తి తో ప్రధాని మోదీ పని చేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. కాగా, నెల రోజుల నుంచి కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్లో నాగతేజను ఆ యువతి కలిసింది.ఇద్దరి కోసం హోటల్లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్‌లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. -
కేశినేని నానిపై పరువు నష్టం దావా.. టీడీపీ ఎంపీ చిన్నికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.‘‘విజయవాడ ప్రజలు నాకు పది ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి.. నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం. కానీ బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేని దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. నేను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తాను.. రాజీ పడను. సత్యం బెదిరింపులకు భయపడదు.. నేను కూడా భయపడను’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
DYFI ఆధ్వర్యంలో విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
-
మూడు పూట్లా తిండి పెట్టలేకపోతున్నాం
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): ‘మా కుటుంబాలకు మూడు పూట్లా తిండిపెట్టలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఆరోగ్య కేంద్రాల అద్దెలు సైతం మేమే చెల్లిస్తున్నాం. జీతాలు పెంచమని అడిగితే రూ.40 వేలు జీతం ఇస్తున్నామంటూ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. పని ఆధారంగా చెల్లించే ప్రోత్సాహకాల్లోనూ కోత పెడుతున్నారు. ఇచ్చే అరకొర ప్రోత్సాహకం కూడా ఆలస్యమవుతోంది’ అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్‌వో) వాపోయారు. గురువారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో సీహెచ్‌వోల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి సీహెచ్‌వోలు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, గర్భిణులు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్‌వోలను క్రమబద్దికరించాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని, క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్‌వో పునరుద్ధరించాలని, జాబ్ చార్ట్ అందించాలని, హెచ్ఆర్ పాలసీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల కారణంగా పలువురు సీహెచ్‌వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖను పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జీతాలు పెంచమని అడిగితే ఇప్పటికే రూ.40వేలు ఇస్తున్నామని ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదే ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న 119 కేటగిరీల వారికి 23 శాతం వేతన సవరణ చేశారన్నారు. ప్రోత్సాహకాల నెపంతో తమకు వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తీవ్రమైన ఆరి్థక ఇబ్బందులతో కడుపు రగిలి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సందీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4వేల సెంటర్లు అద్దెప్రాతిపదికన నడుస్తున్నాయన్నారు. హెల్త్ సెంటర్ల అద్దెలు, కరెంట్ బిల్లులు తామే చెల్లిస్తున్నామన్నారు. సొంత డబ్బుపెట్టుకొని సేవ చేస్తుంటే ప్రభుత్వం రూ.40 వేలు ఇస్తున్నట్టు దు్రష్పచారం చేస్తోందన్నారు. కేవలం రూ. 25వేలు ఇస్తున్నారని, ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీహెచ్‌వోలు ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చులు, ఎక్స్‌గ్రే షియా కూడా ఇవ్వడం లేదన్నారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో సీహెచ్‌వోలు పాల్గొన్నారు. -
రాజ్ కేసిరెడ్డికి 14రోజుల రిమాండ్
-
విచారణకు వస్తానని చెప్పినా అరెస్ట్ చేశారు: కోర్టులో రాజ్ కేసిరెడ్డి
విజయవాడ తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని ఏసీబీ కోర్డులో రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు(మంగళవారం) రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీనిలో భాగంగా రాజ్ కేసిరెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేశారా? అని న్యాయమూర్తి అడగ్గా, కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసీరెడ్డి తెలిపారు. తన ఇంటితో పాటు బంధువులు ఇళ్లల్లో,స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేశారని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతలో తల్లి దండ్రలను ఇబ్బందులు పెట్టారని తెలిపిన కేసిరెడ్డి.. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు. -
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025 -
విజయవాడలో సందడి చేసిన నటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
సిట్ కార్యాలయానికి YSRCP నేత మిథున్ రెడ్డి
-
సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తాజాగా మద్యం కేసులో విచారణ పేరుతో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో కుట్రపూరిత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో మిథున్ రెడ్డి.. సీపీ కార్యాలయానికి చేరుకున్నారు.మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అధికారులను, ఉద్యోగులను వేధించి పోలీసులు తప్పుడు వాంగ్మూలాలు నమోదుచేశారు. సిట్ అధికారులు వేధిస్తున్నారని వాసుదేవరెడ్డి ఇప్పటికే మూడు సార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం విజయవాడలోని సీపీ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకున్నారు. విచారణకు మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. -
సిద్ధార్థలో శంకర్‌దాదాలు.. అనుమానాస్పదంగా ప్రభుత్వ తీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎంబీబీఎస్ కాపీయింగ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారంలో ఆరోగ్య విశ్వవిద్యాలయంపైనా తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచించడంలేదు. బుధవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు 11 మందికి డీఎంఈ చార్జి మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈనెల 9న సిద్ధార్థ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. అనంతరం మరో ఇద్దరు కాపీ కొడుతూ దొరికారు. దీన్ని పరిశీలిస్తే ఎంతో పకడ్బందీగా కాపీయింగ్ రాకెట్ సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, అధికారులపై వేధింపులు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వస్తేనే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేస్తుంటారు. మరోవైపు గతంలో కాపీయింగ్ ఆరోపణలతో రద్దయిన సిద్ధార్థ సెంటర్‌కు వర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచి్చంది.ఈ పరిణామాలు పక్కా ప్రణాళికతో కాపీయింగ్ నడిచిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అక్రమాలపై ఇంత స్పష్టంగా ప్రాథమిక ఆధారాలున్నా కేవలం చార్జి మెమోలతో ప్రభుత్వం సరిపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్ధం కావడంలేదు. కాపీయింగ్‌లో బాధ్యులైన పరీక్ష కేంద్రం అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటే, వారు తెరవెనుక కథ నడిపే వ్యక్తుల పేర్లు బయటపడతాయి. -
అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కూటమి కుట్ర
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడ సెంట్రల్)/డాబాగార్డెన్స్(విశాఖపట్నం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తులో సామాజిక, న్యాయ మహా శిల్పాన్ని నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.అంబేడ్కర్ చిత్రపటం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఆ మహానుభావుడి విగ్రహంతో చంద్రబాబు వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దళితులపై బాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహం జోలికి వెళ్లావో తగిన గుణపాఠం తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేద్దామన్నారు.మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దశ, దిశ చూపించిన అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ ఆసిఫ్, వేల్పుల రవికుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద ఘనంగా జయంతి విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుక ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, నాయకులు గౌతంరెడ్డి, శైలజారెడ్డి, బెల్లం దుర్గ, షేక్ ఆసిఫ్, ఎ.రవిచంద్ర, దొడ్డా అంజిరెడ్డి, పోతిన మహేశ్, ఎస్సీ సెల్ నాయకులు కాలే పుల్లారావు, శరత్ తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావ్?విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని ఇంకేం పరిపాలిస్తారని రాజ్యాసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు రవీంద్రబాబు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే మాకివ్వండి.. మేమే అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.సోమవారం విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో లేకుండా చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివరామకృష్ణ, నాయకులు బొల్లవరపు జాన్‌వెస్లీ, ద్రోణంరాజు శ్రీవత్సవ్ పాల్గొన్నారు. -
చంద్రబాబుది ధృతరాష్ట్రుడి పాలన: గొల్లబాబు రావు
-
‘పవన్ కల్యాణ్‌కు ఆ స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో కానీ..’
సాక్షి, విజయవాడ: పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటం లేదనుకునే రకం చంద్రబాబు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఏపీని శ్రీలంక చేసేశాడని చంద్రబాబు ప్రచారం చేశారు.. అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో మీ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పాలి’’ అంటూ చంద్రబాబును నిలదీశారు.‘‘గతేడాది 90 వేల కోట్లు అప్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు కాగానే 5750 కోట్లు అప్పుతెచ్చారు. అన్ని కార్పొరేషన్ల పేరుమీద అప్పులు తెచ్చి ఏపీని అప్పులు పాలు చేస్తున్నావ్. అమరావతి రాజధాని పేరుతో 31 వేల కోట్లు అప్పు తెచ్చావ్. ఒక్క అమరావతి రాజధాని కోసమే 62 వేల కోట్లు అప్పు తేవాలని చూస్తున్నారు. అమరావతికి కేంద్రం గ్రాంట్ ఇస్తుందని జబ్బలు చరిచారు. గ్రాంట్ ఎక్కడిచ్చారో సమాధానం చెప్పాలి’’ అంటూ రామకృష్ణ దుయ్యబట్టారు.అప్పులపై సీఎం చంద్రబాబు తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి. బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్లయ్యింది. ఈ పాలనలో ఒక్క సమస్యనైనా పరిష్కరించారా?. హిందువుల గురించి మాట్లాడే మీరు వారికి ఏం మేలు చేశారో సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటైనా చేశారా?. ఈ దేశంలో రైతులకు ఏమైనా మేలు చేశారా?. 2014 నుంచి 2022 వరకూ మోదీ పాలనలో లక్షా 474 మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు, కూలీలు ఆత్మహత్యలపై మీ దగ్గర సమాధానం లేదు’’ అని రామకృష్ణ ధ్వజమెత్తారు.‘‘పేదరికం తగ్గించలేక పోయారు. ధరలు తగ్గించలేకపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేకపోయారు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెప్పిస్తామని వారితో లాలూచీ పడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటేసి ముస్లింలకు టీడీపీ ద్రోహం చేసింది. పేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని పవన్ మాట్లాడుతున్నాడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడో తెలియడం లేదు?. పవన్‌ను ఢిల్లీ తీసుకెళ్లి వక్ఫ్ సవరణ బిల్లుపై స్పీచ్ ఇప్పించాలి’’ అంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.‘‘ఇప్పుడు ముస్లింలపై దాడి చేశారు. తర్వాత క్రిస్టియన్లు, దేవాలయాల స్థలాలపై పెత్తనం చేస్తారు. భారతదేశంలోని అన్ని మత సంస్థలపై పెత్తనం కోసమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేపడుతోంది. ఈనెల 13వ తేదీన విజయవాడలో భారీ సదస్సు నిర్వహిస్తున్నాం’ అని రామకృష్ణ వెల్లడించారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రీస్తురాజపురం ఫిల్మ్ కాలనీకి చెందిన మచ్చా సరస్వతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. భర్త చైతన్య ఆయుర్వేద వైద్యుడు వీరికి ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇంటిని, చిన్న పిల్లలను చూసుకునే నిమిత్తం సరస్వతి తన అక్క కుమార్తె బల్లం శరణ్య(19)ను ఇంట్లో ఉండాల్సిందిగా కోరి తీసుకువచ్చింది. కడప జిల్లా బద్వేలుకు చెందిన శరణ్య గత మూడు నెలలుగా విజయవాడలో పిన్ని ఇంట్లో ఉంటోంది. సరస్వతి ప్రతి రోజు విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రికి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి వస్తుంది. శుక్రవారం యథావిధిగా ఆసుపత్రికి వెళ్లిన సరస్వతి సాయంత్రం 5 గంటల సమయంలో శరణ్యకు ఫోన్ చేసి పిల్లల గురించి అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శరణ్య ఫోన్‌కు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి త్వరగా ఇంటి వద్దకు చేరుకుంది. ఎంత ప్రయత్నించినా తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయం కోరింది. స్థానికులు వెనుక గుమ్మం తలుపులు తీసి లోనికి ప్రవేశించగా శరణ్య ఉరికి వేలాడుతూ కని్పంచింది. సరస్వతి 108 సహాయంతో శరణ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాచవరం పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే... శరణ్య ఉరివేసుకుని చనిపోలేదని, ఆమెను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శరణ్య కుటుంబానికి, సరస్వతి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఉరికి వేలాడుతున్న శరణ్య పాదాలు మంచానికి తాకుతున్నాయని, అలా చనిపోయే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. సన్నని వైర్లను గొంతుకు బిగించి ఆమెను హత్య చేశారని సరస్వతి, చైతన్యలే శరణ్య మృతికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. -
విజయవాడ : ‘జాక్’ మూవీ ప్రమోషన్ లో సిద్ధూ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి హన్సిక (ఫొటోలు)
-
Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)
-
‘వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది పండుగ లేకుండా చేశారు’
విజయవాడ: ఏపీలో వాలంటీర్ల ఉద్యోగాలు తీసేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి ఉగాది పండుగ లేకుండా చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎన్నికల సమయంలో వారికి రూ. 10 వేలు జీతం పెంచుతామని చెప్పి ఉన్న ఉద్యోగం కూడా తీసేసిన ఘనత చంద్రబాబుదంటూ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చిత్తూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్త మురళీరెడ్డిపై దారుణంగా దాడి చేశారు. ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. ఏడాది కాకుండానే ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో రోడ్డెక్కుతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ఎన్ని లక్షల కోట్లు అప్పులున్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా అని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అన్ని అప్పులు లేకపోయినా ప్రజలను మోసం చేస్తున్నారు. -
AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం
విజయవాడ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలంటూ ముస్లింలు సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు(శనివారం) విజయవాడ ధర్నాచౌక్ లో మహాధర్నాకు సన్నద్ధమయ్యారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకూ ధర్నా చేయనున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని ముస్లిం సంఘాలు హెచ్చరిస్తున్నాయి.ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా నిన్న(మార్చి 27వ తేదీ గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం(మార్చి 26వ తేదీ) ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
AP Govt: లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు
విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు. -
ఘనంగా వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, విజయవాడ: సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ పార్టీ జెండాను వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి ఆవిష్కరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పునూరు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని.. వైఎస్ జగన్ కార్మికుల పక్షపాతిగా ఉన్నారన్నారు. ‘‘ఆప్కస్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 1,30,000 మందికి పర్మినెంట్ ఎంప్లాయిస్ తీసుకొచ్చారు. నాలుగు లక్షల మందిని వాలంటీర్లు ఏర్పాటు చేశారు’’ అని గౌతమ్‌రెడ్డి తెలిపారు.సంక్షేమం అందించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులను, కార్మికులను ఇబ్బంది పెట్టలేదని.. ఆటో కార్మికులకు వైఎస్ జగన్ రూ.పదివేలు ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు కార్మికులు అభ్యున్నతను విస్మరించారు. కోవిడ్ సమయంలో కార్మికులకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందరికి అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఎస్సార్సీపీ ప్రతి గ్రామంలో కార్మికులకు అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చి..మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాహన మిత్రతో కార్మికులకు అండగా నిలిచారు. చంద్రబాబు వాలాంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను ఎత్తివేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ప్రశాంతంగా విధులు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు. సంవత్సరం గడుస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం లేదు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేం అని గవర్నమెంట్ రాకమందు చంద్రబాబు తెలియదా’’ అంటూ ఆమె ప్రశ్నించారు.కార్మికులకు వ్యతిరేకంగా కూటమి సర్కార్ నిర్ణయాలు: మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2 వేల మందికి ఆటో కార్మికులకు చేయూతను అందించింది. కూటమి ప్రభుత్వంలో ఆటో కార్మికులపై చలనాలు చేస్తున్నారు. 9 నెలల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు, ఆటో కార్మికులకు ఏం చేశారో చెప్పాలి. విజయవాడ నగరంలో హ్యాకర్లుపై దౌర్జన్యలు పెరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? నిన్న(గురువారం) జరిగిన పరిషత్ ఎన్నికలో విజయాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు ఆపలేకపోయారు. ఎంపీటీసీలు, జడ్పిటిసిలు వైఎస్సార్సీపీ పక్షాన బలంగా నిలబడ్డారు’’ అని ఆయన చెప్పారు. -
Chandrababu: ఇఫ్తార్ విందులో టీడీపీ టోపీ పంచాయితీ
విజయవాడ: ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టోపీ పెట్టే క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్ జలీల్ ఖాన్ ల మధ్య పంచాయితీ జరిగింది. చంద్రబాబుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మొదట టోపీ పెట్టగా, దాన్ని జలీల్ ఖాన్ తీసేసి ఆ స్థానంలో తాను తెచ్చిన టోపీని పెట్టారు. తాను పెట్టిన టోపీని తీయడమేంటని ఆగ్రహించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్.. జలీల్ ఖాన్ పెట్టిన టోపీని కూడా తీసేయబోయారు. దాన్ని జలీల్ ఖాన్ అడ్డగించారు. తాను పెట్టిన టోపీని తీయడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేని అడ్డుకున్న జలీల్ ఖాన్.. ఎమ్మెల్యే చేయిన పక్కకు తోసేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కనిపించింది. ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు.సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందు మాకొద్దు!
సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం...వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్‌లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు. -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్‌గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్‌ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్‌మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్‌నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్‌తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్‌ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్‌కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్‌గా.. చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.కోడ్ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్‌కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం. -
Malladi Vishnu: రకరకాల వేశాలు వేయడం కాదు ఆలయాలు కూల్చి వేస్తుంటే ఏంచేస్తున్నావ్
-
గణపతి ఆలయం కూల్చివేత.. కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్‌కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగింపు
-
బాబూ.. హజ్ యాత్ర పాయింట్ తొలగింపు సరికాదు: అంజాద్ భాషా
సాక్షి, వైఎస్సార్: ఏపీలో మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా. విజయవాడ నుంచి హజ్ యాత్ర పాయింట్ తొలగించడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించినట్టు తెలిపారు.మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నుంచి హజ్ యాత్ర పాయింట్ తొలగించడం సరికాదు. వైఎస్సార్సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించాం. మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పాయింట్ తొలగించారు. గతంలో మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలంటే వేరే ప్రాంతాల నుండి వెళ్ళేవారు. 2019లో కూడా హైదరాబాద్ పాయింట్ నుండి హాజీలు యాత్రకు వెళ్లారు.అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దీంతో, 2020లో మన రాష్ట్రం విజయవాడ నుండి యాత్రకు పాయింట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదు. 2022లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది. 2023లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది.2023లో మన రాష్ట్రం నుండి విజయవాడ వద్ద పాయింట్ నుంచే 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇంత కష్టపడి సాధించిన యాత్ర పాయింట్‌ను తీసేయడం బాధాకరం. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయవాడలో సందడి చేసిన ‘కోర్ట్’ చిత్ర బృందం (ఫొటోలు)
-
విజయవాడలో అప్కాస్ ఉద్యోగుల ఆందోళన
-
కూటమి ప్రభుత్వంపై నిరసన గళం.. అప్కాస్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం
విజయవాడ: అప్కాస్ విధానం రద్దుకు వ్యతిరేకంగా ఉద్యోగులు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకటో తేదీన జీతాలు తీసుకునే స్థితి నుంచి జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందంటూ ఆందోళన దిగారు. అప్కాస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మంచి చేశారని, దాన్ని రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు హోచ్చరించారు. అప్కాస్ ను యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నామున్సిపల్ కార్మికులు సమస్యలు మాత్రం తీరడం లేదు. అప్కాస్ రద్దు చేయడం దుర్మార్గం. గత ప్రభుత్వం కాలంలో చేసుకున్న ఒప్పందాలను నేటి ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరం చేయడం లేదు. సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదనే ఆలోచనకు ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. అప్కాస్ రద్దు చేస్తే మునిసిపల్ వర్కర్స్ ను ఎక్కడ తీసుకుని పెడతారు.ప్రవేట్ కాంట్రాక్టర్ల బందిఖానాలో వర్కర్స్ ను పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అప్కాస్ రద్దు కూటమి ప్రభుత్వంకి సరైనది కాదు. అప్కాస్ లో మొదటి తేదీనే జీతాలు పడుతున్నాయి.. కాంట్రాక్ట్ వ్యవస్ధ జీతాలు సమయంకి పడవు. అప్కాస్ రద్దు చేస్తే రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తాం. పిబ్రవరి చివరి వరకు జీతాల పెంపుకోసం చూస్తాం. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతాం.మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తే స్వచ్చ సర్వేక్షణ్ ఏవిధంగా సాధ్యం అవుతుంది.. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగితే దానికి బాధ్యత కూటమి ప్రభుత్వందే’ అని సిఐటియు నాయకులు కాశీనాధ్ స్పష్టం చేశారు. -
‘అయ్యా బోండా ఉమా.. మా పొట్టలు కొట్టొద్దయ్యా’
సాక్షి, విజయవాడ: ఉపాధికి కేరాఫ్‌గా అడ్రస్‌గా విరాజిల్లుతున్న బెజవాడ బిసెంట్ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (బోండా ఉమ) అనుచరులు గుండా గిరి చేస్తున్నారు. చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. బీసెంట్ రోడ్డు మధ్యలో బోండా ఉమా అనుచరులు 12 తోపుడు బండ్లు ఏర్పాటు చేశారు.తోపుడు బండ్లకు పోలీసుల్ని బందోబస్తు పెట్టారు.అయితే, బోండా ఉమ అనుచరుల తోపుడు బండ్ల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని బీసెంట్ రోడ్డులోని హాకర్స్ వాపోతున్నారు. సేవ్ బీసెంట్ రోడ్డు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన షాపుల యజమానులు తమ నిరసనలు తెలుపుతున్నారు. బోండా ఉమా అనుచరులు ఏర్పాటు చేసిన తోపుడు బండ్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బోండా ఉమా పది మంది అనుచరుల కోసం 300 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. బీసెంట్ రోడ్డు యూనియన్ నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తామని బెదిరిస్తున్నారుపోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి మా పై కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. టీడీపీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
బెజవాడ ధర్నా చౌక్ కు చేరుకుని ధర్నా చేసిన వివిధ వర్గాల కార్మికులు
-
నెలలోగా సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, అమరావతి/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): తమకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయడంతో పాటు కనీస వేతనాలు వర్తింప చేయాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా తమ న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడు తూ 1999లో జారీ చేసిన 551 జీవోలోని గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పీఎఫ్, ఇఎస్ఐ వంటి సౌకర్యాలు 40 వేల మంది పంచాయతీ కార్మికులకు నేటికీ అందడం లేదన్నారు. కనీసం గుర్తింపు కార్డు లు కూడా లేవన్నారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే గానీ, ప్రతి నెలా జీతాలు చెల్లించకుండా పస్తులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.ప్రస్తుతం 4 నుండి 45 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల కులు మారినప్పుడల్లా ఇష్టానుసారం పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తుండటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం తొలగించిన వారందరినీ వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కార్మికుల గోడు వినకపోవడం బాధాకరమని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెల రోజుల్లోగా తమ సమస్యలు పరిష్కారం కావాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా సిద్ధమేనని కె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో, విజయవాడ వరదల్లో పంచాయతీ కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనులు చేశారని గుర్తు చేశారు.సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ గుళ్లు, గోపురాలు తిరగడం తప్ప తన శాఖ పరిధి లోని పంచాయతీ కార్మికులు, ఇతర చిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.పంచాయతీ యూనియన్ రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల నేతలు జి.రామాంజనేయులు, కె.శివప్రసాద్, ఎం.పోలినాయుడు, వాకాటి రాము, ఆంజనేయులు, ఇంటి వెంకటేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్బారావు, రమాదేవి, ఎస్ సురేంద్ర, శారద, గౌరి, చింతల శ్రీనివాసరావు, నాగన్న, గోవిందప్ప, ధనలక్ష్మి, కె.సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వలంటీర్లు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలిచ్చి.. తమను నమ్మించి వంచించారని వలంటీర్లు మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, తొమ్మిది నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 వేలకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ సత్తా ఏపాటిదో భవిష్యత్‌లో కూటమి నేతలకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం వారు విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా తప్పించుకోవడానికి, కూటమి ప్రభుత్వ పెద్దలు 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ మనుగుడలో లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు 2024 మే నెల వేతనాలను జూన్ ఒకటిన ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని గత మార్చిలో హామీ ఇవ్వడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. 2023 ఆగస్టులో ఆ వ్యవస్థ అమలులో లేకపోతే, దానిపై 2024 మార్చిలో ఎలా హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనపెట్టి, 2014–19 మధ్య ఉన్న జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకొచ్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పుట్టని బిడ్డతో ఓట్లెలా వేయించుకున్నారు?వలంటీర్ల విషయంపై ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడం అన్యాయం అని వలంటీర్ల సంఘం ప్రతినిధులు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే మాట చెప్పారని, ఆ తర్వాత నెల రోజులకే మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటప్పుడు పుట్టని బిడ్డకు ఎలా మాయ మాటలు చెప్పారని, వారితో ఎలా ఓట్లు వేయించుకున్నారని నిలదీశారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలైన వలంటీర్లను తాము నెత్తిన పెట్టుకొని మోయాలా.. అని మంత్రి లోకేశ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వారికి పార్టీలతో సంబంధం ఉండదని గుర్తు చేశారు. వలంటీర్లలో ఎక్కువ మంది ఆడపడుచులే ఉన్నందున, తాము వారికి అన్యాయం చేయమంటూ ఎన్నికల ముందు మాట్లాడిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. తమకిచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.సీఐటీయూ అనుబంధ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లంతా సంఘటితమై సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరావు మాట్లాడుతూ మొన్నటి విజయవాడ వరదల్లోనూ వలంటీర్ల సేవలు వినియోగించుకున్న ప్రభుత్వం, ఇపుడు ఆ వ్యవస్థ లేదని మాట్లాడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ ధర్నాకు వలంటీర్ల సంఘ ప్రతినిధులు పిజానీ, శ్యామలా ప్రసాద్ అధ్యక్షత వహించారు. -
విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ (ఫొటోలు)
-
విజయవాడ : సురభి నాటకోత్సవాలు అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన (ఫొటోలు)
-
అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు. -
మాకు న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు.. బాబుపై అంగన్వాడీ వర్కర్లు ఫైర్
-
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్‌తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్‌కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్‌కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్‌కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
విజయవాడ స్పోర్ట్స్: అక్రమ కేసులకు తాము భయపడబోమని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడినా, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించినా, సభలు, సమావేశాలు పెట్టినా అక్రమ కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనను నెట్టుకొస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎల్రక్టానిక్ మీడియా చానల్ చర్చలో మైనర్ బాలిక పేరును గోరంట్ల మాధవ్ ప్రస్తావించారని, ఇది బాలిక హక్కుల రక్షణకు భంగం కలిగిస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్, బీఎన్ఎస్ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మాధవ్ గురువారం విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. మాధవ్‌ను సైబర్ క్రైం స్టేషన్ సీఐ శ్రీను మధ్యాహ్నం 12.40 నుంచి 1.25 గంటల వరకు విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని గతంలోనే నోటీసులు పంపితే ఎందుకు స్పందించలేదు?, మైనర్ బాలిక పేరును చర్చలో ఎందుకు ప్రస్తావించారు?, బాలిక పేరు ప్రస్తావించడం తప్పని మీకు తెలీదా? అని సీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, సాక్షులను బెదిరించవద్దని సూచించి మాధవ్‌ను పోలీసులు పంపించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, సాయిరాం తదితరుల సమక్షంలో మాధవ్ పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం పైనే కూటమి నాయకులు దృష్టి సారించారని మండిపడ్డారు. ప్రజలపై కూటమి నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, ఇకపై జరిగే ఎన్నికల్లో ఆయన గెలిచేది లేదని, వైఎస్ జగన్ ఓడేది లేదన్నారు.