విజయవాడ కల్చరల్: ఏపీ సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి, దక్షిణమండల సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యాన 6 రోజులపాటు నిర్వహించే సురభి నాటకోత్సవాలు దుర్గాపురంలోని సంగీత కళాశాలలో శనివారం ప్రారంభమయ్యాయి
తొలి రోజు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్, విజయ భారతి నాట్యమండలి ఆధ్వర్యాన సురభి జయచంద్రవర్మ పర్యవేక్షణలో భక్తప్రహ్లాద నాటకాన్ని రసరమ్యంగా ప్రదర్శించారు
ఒకే కుటుంబానికి చెందిన 50 మంది చిన్నా పెద్దా కళాకారులు పాల్గొనడం విశేషం
తొలుత నాటకోత్సవాలను గ్రీవెన్స్ అధికారి చిన్నారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు
సురభి నాటకాలకు 140 సంవత్సరాల చరిత్ర


