breaking news
Surabhi drama artists
-
కృష్ణుడిగా సత్యభామ
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు. మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.బాల్యం నుంచీ... మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.సత్యభామ.. మీరజాలగలరా..!కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది. కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విజయవాడ : సురభి నాటకోత్సవాలు అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన (ఫొటోలు)
-
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
సురభి కళాకారుల బతుకు చిత్రం
-
ఆ.. బాలగోపాలం!
బృందావనమాలి.. ఈ బృందానికి నిత్య అతిథి. వేణుగానలోలుడు వీరి తెర వేలుపు. పౌరాణిక నాటకాలకు పుట్టినిల్లుగా శోభిల్లుతున్న సురభి కళా వేదికకు నల్లనయ్యు సుపరిచితుడు. ఆ ఉవ్ముడి కుటుంబానికి కన్నయ్యు ఉవ్ముడి ఆస్తి. ఈ నాటకవుండలిలోని పొత్తిళ్లలోని బిడ్డ కూడా రంగస్థలమెక్కేది.. వెన్నదొంగ వేషంతోనే. దేవకి పంటగా పుట్టినప్పటి నుంచి.. గోకులంలో చూపిన వూయులు.. బృందావనంలో చేసిన రాసలీలలు.. ద్వారక పాలకుడిగా.. బావ బండి తోలిపెట్టిన సారథిగా.. ఆ నందగోపాలుడి ఆనందలీలలు.. సురభి కళాకారులు వేస్తే చూడాల్సిందే.. వారు చెప్పే ఆ లీలలు వినాల్సిందే. కావ్యేశు నాటకం రమ్యం అని మహాకవి కాళిదాసు అంటే.. అందులో సురభి నాటకం రసరవ్యుం అంటారు కళాభివూనులు. రావుుడు, శివుడు, విష్ణువు ఇలా సురభికళాకారులు అభినరుుంచని పాత్రలు లేవు. ఇలా ఎన్ని అవతారాలెత్తినా.. జగన్నాటక సూత్రధారి పాత్రంటే వారికి ప్రాణం. ఆ గోపాల బాలుడు సురభి ఒళ్లో ఆడుకునే పసివాడు. ఏటా సువూరు 150కి పైగా కృష్ణావతారాలు ఉంటారుు వారి నాటకాల్లో. అందులో ఓ యూైభె సార్లు కృష్ణలీలలు, ఇంకో వందసార్లు వూయూబజార్ నాటకం కోసం ఆ కళాకారులు నల్లనయ్యును ఆవాహన చేసుకుంటారు. అద్భుతనటనా విన్యాసంతో సాక్షాత్త్తూ ఆ పరవూత్ముని కళ్ల ముందుంచుతారు. సురభి ముంగిట ముత్యం బారసాల పూర్తరుున వెంటనే సురభి పిల్లలు జీవించేది నాటకంలోనే. అదీ.. కంసుడి చెరసాలలో పుట్టిన పాలబుగ్గల బాలకృష్ణుడి రూపంలో! అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నెలు దొంగిలిస్తూ సురభి బాలల చూపే అభినయుం.. ఆ యుశోదవ్ముకు బాలకృష్ణుడిని జ్ఞప్తికి తెస్తుంది. కాళీయు పడగలపై నాట్యవూడే సన్నివేశం చూస్తే ఆబాలగోపాలం ఆ బాల గోపాలుడిని తన్మయుత్వంతో చూస్తూ ఉండిపోవాల్సిందే. గోవర్ధన గిరినెతే ్త సన్నివేశానికి గోకులవుంతా దాసోహం కాకతప్పదు. కురుక్షేత్రంలో వీళ్ల విశ్వరూపానికి అసలు కృష్ణుడు సైతం చేతులు జోడిస్తాడేమో.. అదీ సురభి ప్రత్యేకత. కృష్ణుడు వాళ్లకు ఓ పురాణ పురుషుడు కాదు.. వాళ్లింటి బిడ్డ. అందుకే సురభివుూర్తులు శ్రీకృష్ణపాత్రలో అంతలా లీనవువుతారు. తాడుచ్చుకుని కొట్టింది.. ఈ నటనసూత్రధారి పాత్రను అంతలా పండిస్తున్న ప్రస్తుత సురభి కళాకారులు.. పద్మశ్రీ సురభి నాగేశ్వర్రావు (సురభి బాబ్జి), ఆర్.పద్మజ. ‘మేం నేర్చుకున్న తొలి పద్యం కృష్ణపాత్రదే. నాకు నాలుగేళ్లున్నప్పుడు ‘కృష్ణలీలలు’లో చిన్నికృష్ణుడిగా నటించా. యుశోదగా వూ అవ్ము సుభద్రవ్ము, పూతనగా వూ వదిన నటించారు. పూతన కోసం రాక్షసి రూపంలో ఓ వూస్క్ తయూరు చేశారు. పూతన ఒళ్లో ఉండి పాలు తాగేటప్పుడు ఒక్కసారిగా లైట్లు ఆరిపోతారుు. వుళ్లీ లైట్లు వె లిగే సరికి వూ వదిన రాక్షసి వూస్క్లో దర్శనమిచ్చింది. అంతే స్టేజ్మీదే పరిగెత్తా. జనాలు అదీ నాటకంలో భాగమే అనుకున్నారు. తెరదించాక.. వూ అవ్ము తాడిచ్చుకుని కొట్టింది’అని గతం గుర్తు చేసుకున్నారు సురభి నాగేశ్వర్రావు. నారీనారీ.. మెరిసె మురారి సురభిలో కృష్ణుడి వేషాలకు సాధారణంగా మహిళలే ప్రసిద్ధి. కాస్త గాంభీర్యం.. ఇంకాస్త నయుగారం.. అంతకుమించి ఒయ్యూరం.. ఇవన్నీ ఆడవాళ్లు అవలీలగా ఒలికించగలరు. అలాంటి కీర్తి సాధించిన ఈ తరం కళాకారిణి ఆర్.పద్మజ. ‘నా చిన్నతనంలో వూ అవ్మువ్ము వేసిన కృష్ణపాత్ర చూసి ఎలాగైనా నేనూ ఆ పాత్ర చేయూలని కలలు కనేదాన్ని. తర్వాత చాలా కాలం ఆ పాత్ర వూ పెద్దనాన్న పోషించారు. అనారోగ్యం కారణంగా ఆయున ఆ పాత్ర వేయులేని పరిస్థితి వచ్చింది. అప్పుడు కృష్ణుడి వేషం వేస్తానని నేను వుుందుకొచ్చాను. విగ్గు.. బరువైన కిరీటం.. ఒంటికి పూసుకున్న నీలిరంగుతో విపరీతమైన వేడి.. ఇవేవీ తెలియునీయుకుండా అభినరుుంచాలి. 1995 నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి వేషం నాదే’ అని తన జ్ఞాపకాలు పంచుకున్నారు పద్మజ. ఒక్క కృష్ణపాత్రే కాదు.. పురాణపాత్రలన్నీ సురభి కుటుంబంలో సభ్యులే. వాళ్ల కష్టసుఖాల్లో భాగస్వావుులే. కళను గుర్తించకపోరుునా.. కనీసం తవు కుటుంబం సాగిస్తున్న సవుష్టి జీవన విధానాన్ని అరుునా గుర్తించాలని కోరుతున్నారు సురభి కళాకారులు. -సరస్వతి రమ


