
మిథున్ రెడ్డి సిట్ విచారణ అప్‌డేట్స్..
విజయవాడ
మద్యం పాలసీ కేసులో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ
విజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి
ఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్‌రెడ్డి
సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
తిరుపతి..
- మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది
- వైఎస్సార్‌సీపీలో ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో పాటు మిగిలిన వారిని టార్గెట్ చేసుకుని ఇలా సిట్ వేధింపులకు గురిచేస్తున్నారు.
- 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదు
- నీతిగా నిజాయితీగా పాలన చేశాం
- వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది.. అవినీతికి అవకాశం లేదు
- ఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచారు
- జగనన్న పాలనలో బెల్ట్ షాపులు లేవు.
- ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించాం
అంబటి రాంబాబు కామెంట్స్..
- ఇది పూర్తిగా తప్పుడు కేసు.
- ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారు.
- మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
- రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా మద్యం అక్రమ కేసు.
- ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు.
తాడేపల్లి..
- మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..
- ఏపీలో కక్షసాధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది
- జగన్ చుట్టూ ఉండే కీలక నాయకుల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు
- కూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు
- సాక్ష్యాలు ఏం ఉన్నాయో చూపాలని కోర్టు అడిగితే సిట్ చూపించలేక పోయింది
- రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం
- 2014-19 మధ్య అసలైన లిక్కర్ స్కాం జరిగింది
- దాన్నుంచి తప్పించుకునేందుకే కొత్తగా మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు
- ఎంపీ మిథున్ రెడ్డి స్వచ్చందంగా విచారణకు హాజరయ్యారు
- విచారణ సందర్భంగా ఒక యుద్ద వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసింది
- రోడ్డు పొడవునా పోలీసులను పెట్టి హడావుడి చేస్తోంది
- ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు
- చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు
ఎంపీ గురుమూర్తి కామెంట్స్..
- మిథున్‌రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు.
- రాజకీయ కక్షతోనే మిథున్‌రెడ్డిపై కేసు.
- కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.
భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్
- చంద్రబాబు, నారా లోకేష్ కక్ష్య సాధింపుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.
- వైఎస్సార్‌సీపీలో కీలక నేత, జగన్ సన్నిహితుడు అయిన ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్రలు జరుగుతోంది.
- ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర.
- మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేని మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు.
- ఓ అభూత కల్పనతో దారుణాలకు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతున్నారు
- ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు
- ఇదంతా లోకేష్ డైరెక్షన్‌లోనే జరుగుతోంది.
- కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, కొట్టడం చేస్తున్నారు.
- రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు
మిథున్ రెడ్డి కామెంట్స్..
- రాజకీయ కక్షతో కేసు పెట్టారు.
- ఇది పూర్తిగా తప్పుడు కేసు.
- మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.
- కేసులకు భయపడే ప్రసక్తే లేదు.
- రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు.
- సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.
- తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను.
సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డి.
సిట్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు.
విజయవాడ..
- ఎనికేపాడు వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
- గన్నవరం విమానాశ్రయం నుండి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు బయల్దేరిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
- సిట్ కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు
- ఎవరిని అనుమతించని పోలీసులు
- సిట్ కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణును ఆపేసిన పోలీసులు..
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి.
మద్యం కేసులో విచారణకు హాజరుకానున్నారు.
ఏపీలో మద్యం కేసులో విచారణ విషయమై.. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే మిథున్ రెడ్డి.. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
నేడు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో హంగామా చేస్తున్నారు.
విమానాశ్రయం ఎంట్రన్స్‌లో భారీగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు.
వాహనదారుల వివరాలు అడిగి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం నేపథ్యంలో ఆంక్షలు విధించారు.