‘వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది పండుగ లేకుండా చేశారు’ | YSRCP Leader Narayana Swamy Takes On Chandrababu Naidu Govt | Sakshi
Sakshi News home page

‘వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది పండుగ లేకుండా చేశారు’

Mar 30 2025 4:36 PM | Updated on Mar 30 2025 4:40 PM

YSRCP Leader Narayana Swamy Takes On Chandrababu Naidu Govt

విజయవాడ: ఏపీలో వాలంటీర్ల ఉద్యోగాలు తీసేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి ఉగాది పండుగ లేకుండా చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎన్నికల సమయంలో వారికి రూ. 10 వేలు జీతం పెంచుతామని చెప్పి ఉన్న ఉద్యోగం కూడా తీసేసిన ఘనత చంద్రబాబుదంటూ ధ్వజమెత్తారు. 

‘చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చిత్తూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్త మురళీరెడ్డిపై దారుణంగా దాడి చేశారు. ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. ఏడాది కాకుండానే ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో రోడ్డెక్కుతున్నారు. 

నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు.  ఎన్ని లక్షల కోట్లు అప్పులున్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా అని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అన్ని అప్పులు లేకపోయినా ప్రజలను మోసం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement