AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం | Mahadharna Of Muslims On March 29th At Dharna Chowk Vijayawada | Sakshi
Sakshi News home page

AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం

Mar 28 2025 9:08 PM | Updated on Mar 28 2025 9:23 PM

Mahadharna Of Muslims On March 29th At Dharna Chowk Vijayawada

విజయవాడ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలంటూ ముస్లింలు సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు(శనివారం) విజయవాడ ధర్నాచౌక్ లో మహాధర్నాకు సన్నద్ధమయ్యారు.  రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వర​కూ ధర్నా చేయనున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని ముస్లిం సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ప్రభుత్వ ఇఫ్తార్‌ బహిష్కరణ
వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా నిన్న(మార్చి 27వ తేదీ గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్‌ (జేఐహెచ్‌) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్‌ అహ్మద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్‌ కార్యాలయంలో బుధవారం(మార్చి 26వ తేదీ) ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఫీక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం  సమర్థనీయం కాదన్నా­రు. సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమో­దం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసన­సభలో  బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయా­లని డిమాండ్‌ చేశారు.  కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement