Sakshi: విజయవాడ సాక్షి కార్యాలయంపై పచ్చమూకల దాడి | TDP Leaders Attack On Vijayawada Sakshi Office, More Details Inside | Sakshi
Sakshi News home page

Sakshi: విజయవాడ సాక్షి కార్యాలయంపై పచ్చమూకల దాడి

Jun 9 2025 1:26 PM | Updated on Jun 9 2025 5:46 PM

Tdp Leaders Attack Vijayawada Sakshi Office

విజయవాడ,సాక్షి: విజయవాడలో  పచ్చమూకలు రెచ్చిపోయారు. విజయవాడ సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అనుచరులు వీరంగం సృష్టించారు. సాక్షి యూనిట్‌ కార్యాలయం బోర్డులను టీడీపీ నేతలు పగలకొట్టారు. సాక్షి బోర్డులు పీకేసీ తగులబెట్టారు. అనంతరం, సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు, రాళ్లు విసిరేశారు. సాక్షి కార్యాలయంపై దాడి గద్దె రామ్మోహన్‌ సతీమణి అనురాధ సమక్షంలోనే జరిగింది.  అయితే, సాక్షి కార్యాలయంపై పచ్చమూకలు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.  

AP: మీడియా స్వేచ్ఛపై పచ్చ పంజా

Advertisement
 
Advertisement
Advertisement