టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్‌ బట్టబయలు చేసిన కేశినేని నాని | Kesineni Nani Exposed Kesineni Chinni Fraud With URSA Clusters Private Limited Land Scam In Visakhapatnam | Sakshi
Sakshi News home page

URSA Land Scam: టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్‌ బట్టబయలు చేసిన కేశినేని నాని

Apr 22 2025 9:18 AM | Updated on Apr 22 2025 4:44 PM

Ursa: Kesineni Nani Exposed Kesineni Chinni Fraud

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్‌ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు.  కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్‌ వేదికగా తలిపారు.

"ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.

‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్‌మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్‌, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.

	ఉర్సా వెనుక డీల్ ను బయటపెట్టిన మాజీ ఎంపీ కేశినేని నాని

ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'

చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement