సిద్ధార్థలో శంకర్‌దాదాలు.. అనుమానాస్పదంగా ప్రభుత్వ తీరు | Mass Copying In MBBS Exams 2025 At Vijayawada Govt Medical College, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు.. అనుమానాస్పదంగా ప్రభుత్వ తీరు

Apr 17 2025 9:18 AM | Updated on Apr 17 2025 11:26 AM

Mass Copying in MBBS Exams 2025 at Vijayawada Govt Medical College

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎంబీబీఎస్‌ కాపీయింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారంలో ఆరోగ్య విశ్వవిద్యాలయంపైనా తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచించడంలేదు.

 బుధవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు 11 మందికి డీఎంఈ చార్జి మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈనెల 9న సిద్ధార్థ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. అనంతరం మరో ఇద్దరు కాపీ కొడుతూ దొరికారు. దీన్ని పరిశీలిస్తే ఎంతో పకడ్బందీగా కాపీయింగ్‌ రాకెట్‌ సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, అధికారులపై వేధింపులు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వస్తేనే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్‌ చేస్తుంటారు. మరోవైపు గతంలో కాపీయింగ్‌ ఆరోపణలతో రద్దయిన సిద్ధార్థ సెంటర్‌కు వర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచి్చంది.ఈ పరిణామాలు పక్కా ప్రణాళికతో కాపీయింగ్‌ నడిచిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అక్రమాలపై ఇంత స్పష్టంగా ప్రాథమిక ఆధారాలున్నా కేవలం చార్జి మెమోలతో ప్రభుత్వం సరిపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్ధం కావడంలేదు. కాపీయింగ్‌లో బాధ్యులైన పరీక్ష కేంద్రం అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటే, వారు తెరవెనుక కథ నడిపే వ్యక్తుల పేర్లు బయటపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement