
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి సందర్భంగా పలువురు కళాకారులు సోమవారం నృత్యనీరాజనం సమర్పించారు.భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో విజయవాడ సంగీత కళాశాల ప్రాంగణంలో కళాకారుల నృత్య ప్రదర్శన సమ్మోహనంగా సాగింది.చక్కటి హావభావాలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది.














