శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన | Ysrcp Protest At Satavahana College Vijayawada | Sakshi
Sakshi News home page

శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన

Jun 8 2025 1:06 PM | Updated on Jun 8 2025 1:30 PM

Ysrcp Protest At Satavahana College Vijayawada

సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.

అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.

విద్యార్థుల పక్షాన వైఎస్సార్‌సీపీ:  డిప్యూటీ మేయర్‌ శైలజా రెడ్డి
టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాం

లోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్ర
రెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే  ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్‌ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement