
సాక్షి, విజయవాడ: హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు.
గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకోగా.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్‌కు వస్తే.. 15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు.