
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.
‘‘నేను 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్‌బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు.
