ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత | Several Injured After Side Screen Fell On Public During International Yoga Day 2025 Celebrations In Vijayawada | Sakshi
Sakshi News home page

ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత

Jun 21 2025 9:22 AM | Updated on Jun 21 2025 12:33 PM

Yoga day Celebrations In Vijayawada Side Screen Fall

సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న కేంద్రం వద్ద లైవ్ సైడ్ స్క్రీన్ పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే యోగా చేసే వారిపై స్కీన్‌ పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు.. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో యోగా సందర్భంగా అరకొరగా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగా చేసేందుకు స్టేడియంకు వచ్చిన వారికి కావాల్సిన మొత్తంలో మ్యాట్స్‌ ఇవ్వకపోవడంతో వాటి కోసం అందరూ ఎగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారికి చెదరగొట్టారు.

ఇదిలా ఉండగా.. విశాఖలో యోగా డే సందర్భంగా ప్రమాదం తప్పింది. యోగా డే వేడుకల కోసం ప్రజలను తరలిస్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హనుమంతువాక విశాలాక్షి నగర్ వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారంతా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement