
సాక్షి,అమరావతి: విశాఖలో లులు గ్రూప్‌కు ఖరీదైన భూములు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషనర్ పిటీషన్ దాఖలు చేశారు. లులు సంస్థకు బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ భూములు కేటాయించడం చట్ట విరుద్ధం. గతంలో బిడ్ల ద్వారా భూమిని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
విజయవాడలో కూడా లులు గ్రూప్‌కు ప్రభుత్వ భూములు కేటాయింపు జరిగింది. భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం జీరో జారీ చేసింది. విశాఖలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారు. అయితే, భూ కేటాయింపుల్లో కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది అన్నారు. లులుకు భూములు కేటాయించడాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
