Chandrababu Naidu government
-
పెట్రో బాదుడుపై పోరుబాట
-
నీకు చేతకాకపోతే నోరు మూసుకో.. బాబుపై సిపిఐ నారాయణ ఫైర్
-
ఈ-బస్సుల విధానం ముసుగులో చంద్రబాబు కుతంత్రం.. ఆర్టీసీ.. ప్రై ' వేటు
-
పనికిమాలిన సన్నాసులు.. కూటమి ప్రభుత్వం పై జోగి రమేష్ ఫైర్
-
నాడు కోతలు నేడు వాతలు.. పెట్రోల్ ధరలపై బాబు మౌనం..
-
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
-
దోపిడీ విజన్.. స్కామ్‌కు డిజైన్
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) విజన్‌తో చంద్రబాబు సర్కారు కుంభకోణాలకు డిజైన్ చేస్తుందనడానికి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమే నిదర్శనమని మేధావులు, ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. 2015లో గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూ సమీకరణ చేసిన ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ విమానాశ్రయానికి బొంద పెడుతూ తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి వడివడిగా అడుగులు ముందుకు వేస్తుండటం తెలిసిందే. అప్పట్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన 687 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకుని.. రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లతోపాటు కౌలు ఇస్తామన్న సమాచారాన్ని అస్మదీయులకు చేరవేసింది. దాంతో సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జిబాబు, ఆలూరు శ్రీనివాసరావు వంటి వారు తక్కువ ధరలకే గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, బుద్ధవరం, అల్లాపురం, అజ్జంపూడి గ్రామాల్లో విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములను కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. అవే భూములను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అప్పగించి.. రాజ«ధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను వారు దక్కించుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కీసరపల్లిలో 39.15 ఎకరాల భూమిని సీఎం చంద్రబాబు సన్నిహితుడు, సినిమా నిర్మాత చలసాని అశ్వనీదత్ భూ సమీకరణ కింద ఇచ్చి.. రాజధానిలో వెస్ట్రన్ బైపాస్కు సమీపంలో మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల వాణిజ్య ప్లాటు, దానికి సమీపంలోనే వెయ్యి గజాల చొప్పున 38 నివాస ప్లాట్లు, 150 గజాల మరొక నివాస ప్లాటును దక్కించుకున్నారు. అశ్వనీదత్ 17,580 గజాల వాణిజ్య ప్లాటును యూనియన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ.85 కోట్లు అప్పు తీసుకోవడం గమనార్హం. తమకు మాత్రం తమ భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవడానికి సర్కార్ మోకాలడ్డిందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ప్లాట్లను లాటరీ పేరుతో అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గన్నవరం భూ సమీకరణలో మరో ఇన్సైడర్ ట్రేడింగ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడం కోసం కొత్త రన్ వే, కొత్త టెర్మినల్, ఫ్లై ఓవర్లు, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టేందుకు రూ.4 వేల కోట్ల వ్యయంతో 2015లో కేంద్రం సిద్ధమైంది. అందుకు అవసరమైన 687 ఎకరాలను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ భూమిని భూ సమీకరణ కింద సమీకరించాలని అప్పటి చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పట్టా భూమైతే ఎకరానికి.. మెట్ట, జరీబుతో సంబంధం లేకుండా వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటుతోపాటు ఏడాదికి రూ.50 వేలు చొప్పున.. ప్రతి ఏటా రూ.5 వేలు పెంచుతూ పదేళ్లపాటు కౌలు ఇస్తామని నిర్ణయించింది. ఇదే విషయాన్ని అస్మదీయులకు ఉప్పందించింది. అదే రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తే.. పట్టా భూమైతే అదీ జరీబు అయితేనే ఆ మేరకు ప్రయోజనం కలుగుతుంది. అదే మెట్ట భూమైతే ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు, ఏడాదికి రూ.30 వేల చొప్పున కౌలు ఇస్తారు. రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయానికి భూ సమీకరణ కింద భూమి ఇస్తేనే అధిక ప్రయోజనం చేకూరుతుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు సమీకరించే 687 ఎకరాల్లో (గన్నవరం మండలం కీసరపల్లి, చిన్నఅవుటుపల్లి, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లో) పచ్చ గద్దలు వాలాయి. తమతో తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తూ తొలుత అగ్రిమెంటు చేసుకుని, భూ సమీకరణ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారని రైతులు వాపోతున్నారు. సీఎం సన్నిహితుల్లో కొందరు ఇలా..⇒ సీఎం చంద్రబాబుకు బలుసు శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. రాజధానిలో భారీ ఎత్తున కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. ఈయన కీసరపల్లిలో సర్వే నెంబరు 280/4లో 1.80, 282/7లో 0.11, 282/8లో 0.84, 252/1ఏలో 1.42, బుద్ధవరంలో సర్వే నెంబరు 463/14లో 0.68, 463/12లో 0.45, 463/16లో 0.52, 463/15లో 0.39, 463/13లో 0.48 ఎకరాలు మొత్తం 6.69 ఎకరాలు కొనుగోలు చేసి విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించారు. ⇒ రాజధాని ప్రాంతంలో మందడం గ్రామానికి చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. ఆయన, తండ్రితో కలిసి గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబర్ 252/1బీలో 1.91 ఎకరాలు, 251/2లో 1.50, బుద్ధవరంలో 477/7లో 0.44, 477/12లో 0.89, 452/4ఏలో 0.76, 225/2లో 2.94, 250/26లో 2.53, 426/1లో 4.12 ఎకరాలు (బెజవాడ రమేష్ తండ్రి బెజవాడ సాంబశివరావు), 484/5లో 0.63, 484/4/బీ2లో 0.33, 476/3సీలో 0.35, 476/2సీలో 0.25, 476/3సీలో 1.15, 511/7లో 1.04, 460/1ఏ/2లో 0.64, 452/4సీలో 2.91, 479/4లో 1.29, 491/3బీలో ఎకరం, అల్లాపురంలో సర్వే నంబరు 8/3ఏలో 0.50, 8/3సీలో 0.50, 8/3డీలో 0.50, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబర్ 43/4/బీ2లో 0.32, అజ్జంపూడిలో సర్వే నంబరు 155/1లో 0.27, 40/3లో ఎకరం, 56/2లో 0.24, 56/3బీలో 0.17 వెరసి 28.18 ఎకరాలు కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు.⇒ రాజధానిలో మందడం గ్రామానికి చెందిన ఆలూరు బుజ్జిబాబు, ఆయన సోదరుడు ఆలూరు శ్రీనివాసరావులతో సీఎం చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉంది. వీరు గన్నవరం మండలం కీసరపల్లిలో సర్వే నంబరు 251/1బీలో 1.91 ఎకరాలు, అజ్జంపూడిలో సర్వే నంబరు 142/2లో 0.93, 150/1లో 0.18, బుద్ధవరంలో సర్వే నంబరు 484/5లో 0.63, 516/4లో 1.21, చిన్నఅవుటుపల్లిలో సర్వే నంబరు 40/3లో ఎకరం.. వెరసి 5.86 ఎకరాలను ఆలూరు బుజ్జిబాబు.. గన్నవరం మండలం బుద్ధవరంలో సర్వే నెంబరు 426/2ఏ/1లో 3.96 ఎకరాలు, 426/1ఏలో 2.26, 516/4లో 1.21, 426/2ఏ/1లో 3.81.. వెరసి 11.24 ఎకరాలను కొనుగోలు చేసి గన్నవరం విమానాశ్రయానికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించారు. ⇒ గన్నవరం మండలం కీసరపల్లిలో చలసాని అశ్వనీదత్‌కు 39.15 ఎకరాల భూమి ఉంది. అశ్వనీదత్ భార్య వినయకుమారి సర్వే నంబరు 250/3లో 4, 250/5లో 4, 205/8లో 6.15, 250/6ఏలో ఎకరం, 250/7లో 4, 250/6బీలో ఎకరం.. మొత్తం 20.15 ఎకరాలు.. చలసాని అశ్వనీదత్ సర్వే నంబరు 250/3లో 5, 250/4లో 4, 250/9లో 10.. మొత్తం 19 ఎకరాలు వెరసి రూ.39.15 ఎకరాలు భూమిని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూ సమీకరణ కింద ఇచ్చారు.లాటరీలో వీళ్లకే జాక్‌పాట్!గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి వీరంతా సమీకరణ కింద భూములు ఇచ్చినందుకు రాజధాని ప్రాంతంలో వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించామని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. ప్రధాన ప్రాంతంలో రహదారులకు సమీపంలోనే చలసాని అశ్వనీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ తదిరుతలకు ప్లాట్లు ఎలా తగిలాయని, తమకు అలా ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.సినీ నిర్మాత అశ్వనీదత్‌కు రాజధానిలోని వెస్ట్రన్ బైపాస్ సమీపంలో మూడు రోడ్ల కూడలిలో కేటాయించిన 17,580 గజాల వాణిజ్య ప్లాటు ⇒ చలసాని అశ్వనీదత్, ఆయన భార్య భూ సమీకరణ కింద ఇచ్చిన 39.15 ఎకరాలకుగాను రాజధానిలో వెస్ట్రన్ బైపాస్కు పక్కనే.. డైమండ్ సర్కిల్‌కు అతి సమీపంలో ఉత్తరాన 15.6, తూర్పున 25, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డు అంటే మూడు రోడ్ల కూడలిలో 17,580 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటు దక్కడం గమనార్హం. ఇక ఆ ప్లాటుకు అత్యంత సమీపంలోనే వెయ్యి గజాల విస్తీర్ణంతో కూడిన 38 ప్లాట్లు.. 150 గజాల విస్తీర్ణంతో కూడిన మరో నివాస ప్లాటు పక్కపక్కనే అశ్వనీదత్ కుటుంబానికి దక్కడం తమను విస్మయానికి గురిచేసిందని రాజధాని రైతులు వాపోతున్నారు.⇒ బలుసు శ్రీనివాసరావు గన్నవరం ఎయిర్‌పోర్టుకు భూ సమీకరణ కింద ఇచ్చిన భూమికి గాను.. రాజధానిలో అమృత యూనివర్సిటికీ సమీపంలో తూర్పున 50 మీటర్ల రోడ్డు, పశ్చిమాన 17 మీటర్ల రోడ్డుతో కూడిన 3,660 గజాల వాణిజ్య ప్లాటును లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించడం గమనార్హం. ఈ ప్లాటుకు సమీపంలోనే 25 మీటర్ల రోడ్డు పక్కనే 14,640 గజాల విస్తీర్ణంతో కూడిన నివాస ప్లాటును బలుసు దక్కించుకున్నారు.సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు రాజధానిలో అమృత యూనివర్సిటీకి ఎదురుగా 50 మీటర్ల రహదారి పక్కనే కేటాయించిన 3,660 గజాల వాణిజ్య ప్లాటు ⇒ బెజవాడ రమేష్‌కు రాజధానిలో.. వెస్ట్రన్ బైపాస్ సమీపంలో అశ్వనీదత్‌కు చెందిన 17,580 గజాల వాణిజ్య ప్లాటుకు సమీపంలోనే తూర్పున 17 మీటర్లు, దక్షిణాన 25 మీటర్ల రోడ్డుతో కూడిన 5,940 గజాల విస్తీర్ణం కలిగిన వాణిజ్య ప్లాటును కేటాయించారు. దాని పక్కనే ఆలూరు బుజ్జికి 1,350 గజాల ప్లాటును ఇచ్చారు. వాటి సమీపంలోనే మిగతా వాణిజ్య ప్లాట్లు, నివాస ప్లాట్లను వారికి లాటరీ ద్వారా కేటాయించడం గమనార్హం.సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బెజవాడ రమేష్‌కు అశ్వనీ దత్‌కు కేటాయించిన వాణిజ్య ప్లాటు సమీపంలోనే 5,940 గజాలతో కూడిన రెండు ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ ఆ భూముల విలువ రూ.5,338 కోట్లు.. అభివృద్ధి పనులకు రూ.4 వేల కోట్లు రాజధానిలో కేటాయించిన నివాస ప్లాట్ గజం రూ.50 వేల చొప్పున ఎకరానికి వచ్చే వెయ్యి గజాలకు రూ.5 కోట్లు.. వాణిజ్య ప్లాట్ ధర రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్‌లో సీఆర్డీఏ వేసిన అంచనాల ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు సర్కార్ నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన గన్నవరం విమానాశ్రయం కోసం తీసుకున్న 687 ఎకరాలకుగాను రాజధానిలో కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్ల విలువ రూ.5,298 కోట్లు. ఎకరానికి పదేళ్లకు కౌలు రూ. 7.25 లక్షల చొప్పున 687 ఎకరాలకు రూ.49.80 కోట్లు. ఈ లెక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్న భూమి విలువ రూ.5,347.80 కోట్లన్నమాట.ఈ ఎయిపోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.4 వేల కోట్లు వ్యయం చేసింది. అంటే.. ఈ ఎయిర్పోర్ట్ కోసం రూ.9,338.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2024 వరకు గన్నవరం విమానాశ్రయాన్ని రాజ«దానిలో అంతర్భాగంగానే ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇది రాజధాని ప్రాంతానికి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో రాజధానికి మరో విమానాశ్రయం అవసరం ఎంతమాత్రం లేదని మేధావులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజధానిలో నివాస ప్లాటు గజం రూ.50,000.. వాణిజ్య ప్లాటు రూ.2.70 కోట్లు పలుకుతుందని 2024 సెప్టెంబర్‌లో సీఆర్డీఏ వేసిన అంచనా ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ‘డబ్బుల్’ ధమాకాకు స్కెచ్⇒ రాజధాని నిర్మాణం కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో ప్రభుత్వం 2015లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది.⇒ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ అప్పట్లో సీఎం చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు.⇒ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 29 గ్రామాలకే రాజధాని పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల ధరలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు భూములు లేవని చెప్పడంతో రైతులు విస్తుపోతున్నారు.⇒ వాటి కోసం 11 గ్రామాల్లో 44,676.74 ఎకరాల సమీకరణకు లీకులు ఇచ్చారు. రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని పసిగట్టి.. దాన్ని చల్లార్చేందుకు మలి విడతలో 20,484 ఎకరాలకు సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే సమయంలో తాడికొండ మండలం రావెల వద్ద 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆ భూమిని సేకరించాలా? సమీకరించాలా అన్నది నిర్ణయిస్తామని ప్రభుత్వం చెబుతోంది.⇒ ఇప్పటికే రాజధానికి సమీకరించిన 53 వేల ఎకరాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.1.50 లక్షల కోట్లు అవసరం. తాజాగా సమీకరిస్తున్న 20,484 ఎకరాలతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీకరించే భూమిని కలుపుకుంటే ఆ సౌకర్యాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి ఆ వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే.⇒ ఈ అప్పును వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని, ఇలాగైతే రాజధాని రాష్ట్రానికి గుదిబండగా మారడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిలో భూముల ధరలు పెంచుకోవడం.. ఎయిర్‌పోర్టు పనులను అస్మదీయునికి అప్పగించి కమీషన్లు దండుకోవడం కోసం చంద్రబాబు సర్కారు గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంగళం పాడటంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దేశద్రోహం.. మనోళ్లే వదిలేద్దాం!
‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన ఓ అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతూ, ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. సాక్షి, అమరావతి : ‘మనోళ్లు’ అయితే దేశ ద్రోహానికి పాల్పడినా సరే సమ్మతిస్తాం.. సమగ్ర విచారణ లేకుండా కనికట్టు చేస్తాం.. అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఎంతగా అంటే మావోయిస్టులకు టెలీ కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం, నగదు సరఫరా చేసిన అస్మదీయ కాంట్రాక్టరుకు వత్తాసు పలుకుతోంది. ఆ కేసును నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. ఆ మావోయిస్టులే గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కొందరు పోలీసులను హతమార్చారని తెలిసినా సరే ఉద్దేశ పూర్వకంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది.ఎందుకంటే ఆయన అధికార టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు.. టీడీపీకి వీర విధేయుడైనా ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ లేకుండా విషయాన్ని కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీని ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు కట్టడి చేస్తున్నారు. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం కథ కమామిషు ఇలా ఉంది. ఏవోబీలో మావోయిస్టులకు కీలక పరికరాలు, నిధులు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీకి అనుకూల బడా కాంట్రాక్టు సంస్థకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రధానంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో కాంట్రాక్టు పనులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ యజమానికి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో ఆయన మావోయిస్టులకు భారీగా నిధులు సమకూర్చడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వర్గాలు గుర్తించాయి.ఎస్ఐబీ వర్గాలు ఇచ్చిన సమాచారంతో 2016లో అరకు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాల్లో భారీగా టెలీ కమ్యూనికేషన్ పరికరాలు (నిఘా పరికరాలు), బంగారం, నగదు, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి బృందానికి వాటిని సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్టు విచారణలో వెల్లడైంది.ఎన్నో ఏళ్లుగా ఆ కాంట్రాక్టు్ట సంస్థ మావోయిస్టులకు భారీగా నగదు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌ను అరెస్టు చేశారు. దేశ ద్రోహ నేరంగా యూఏపీఏ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం, టెలీగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి మావోయిస్టులకు ఎన్నేళ్లుగా ఆర్థిక సహయం అందిస్తోంది.. మావోయిస్టులను ఏఏ ప్రాంతాల్లో కలుస్తున్నది.. ఈవ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులెవరనేది గుర్తిస్తారని అంతా భావించారు. కుట్రతో కేసును నీరుగార్చిన అధికారి ⇒ సరిగ్గా అప్పుడే అప్పటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు అధికారి రంగ ప్రవేశం చేశారు. టీడీపీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన అవినీతి గురించి అప్పటికే కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ కేసులో బడా కాంట్రాక్టు సంస్థ యజమానితో ఆయన కుమ్మక్కు అయ్యారు. అందుకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం. అందుకే దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడినా సరే, బరితెగించి పక్కాగా కేసును నీరుగార్చేందుకు కథ నడిపారు. ⇒ నిబంధనల ప్రకారం సంఘటన స్థలంలో అరెస్టు అయిన కాంట్రాక్టు సంస్థ మేనేజర్‌నే కాకుండా నిధులు అందించిన కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలి. ఎందుకంటే యజమాని ఇచ్చిన నిధులు, పరికరాలనే మేనేజర్ మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళుతున్నారు. కానీ ఆ ఐపీఎస్ అధికారి మాత్రం కేవలం మేనేజర్‌పైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టు సంస్థ యజమానిని కనీసం పిలిచి విచారించనూ లేదు. ⇒ యూఏపీఏ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. చార్జ్‌షిట్ దాఖలు చేయాలి. కానీ ఐపీఎస్ అధికారి ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో తాను చెప్పింది చెప్పినట్టు చేసే ఓ సీఐకి విచారణ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆయనతో చార్జ్‌షిట్ దాఖలు చేయించారు. ⇒ యూఏపీఏ కేసులను జిల్లా కేంద్రంలోని మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం విచారించాలి. కానీ ఐపీఎస్ అధికారి ఆ కేసును అరకు న్యాయస్థానంలో విచారణకు పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా కూడా పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. ⇒ఈ నేపథ్యంలో దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరం కేసులో కూడా నిందితులను న్యాయస్థానం విడిచిపెట్టింది. పైగా అరకు న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయకపోవడం గమనార్హం. ఆ బడా కాంట్రాక్టర్ తమకు అస్మదీయుడు కావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చూసీ చూడనట్టు వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమగ్ర విచారణకు ఆదేశం ⇒ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసు విషయం బయటపడింది. ఆ కాంట్రాక్టు సంస్థ సమకూర్చిన నిధులతోనే 2018లో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి బృందం అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశారని కూడా గుర్తించింది. ఎంతో మంది పోలీసులను హతమార్చడానికి కూడా ఆ నిధులనే వాడుకున్నారని వెల్లడైంది. దేశ ద్రోహానికి పాల్పడిన కేసులో నిందితులకు పోలీసులు అండగా నిలవడం ఏమిటని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ⇒ ఫలితంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా ఎస్పీ ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నంలోని ఏడీజే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకు డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, కాంట్రాక్టు సంస్థ యజమానిని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఆదేశించింది. ⇒ దాంతో బడా కాంట్రాక్టరు, ఐపీఎస్ అధికారి (ఆయన అప్పటికి అమరావతికి బదిలీ అయ్యారు) బెంబేలెత్తారు. కేసు సమగ్రంగా విచారిస్తే ఇద్దరి బాగోతం బయట పడుతుందని ఆందోళన చెందారు. అందుకే విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత కథే⇒ హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో పోలీసు శాఖ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బడా కాంట్రాక్టర్, అవినీతి ఐపీఎస్ అధికారి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. ఇక ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్‌బుక్ అరాచకాలకు అండగా నిలుస్తూ బరితెగించి ‘అవినీతి అనకొండ’గా చెలరేగిపోతున్నారు.⇒ ఈ కేసును సమగ్రంగా విచారిస్తే వారిద్దరి బాగోతం బయట పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సమగ్రంగా విచారించాలని విశాఖపట్నం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తోసిపుచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పోలీసు శాఖలో కొందరు సూచించారు. ⇒ హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలి. లేకపోతే ఆ కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే శాశ్వతంగా మూసి వేసినట్టు అవుతుంది.. జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు శాఖకు తీరని మచ్చగా మిగిలిపోతుంది.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, ఇతర కుటుంబాలను అవమానించినట్టు అవుతుందని వారు స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం మాత్రం సుముఖంగా స్పందించలేదని తెలుస్తోంది.⇒ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేందుకు ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా 90 రోజుల గడువు ముగిసేలా చేయాలన్నదే ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం, ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. కేవలం అస్మదీయ కాంట్రాక్టర్, రెడ్‌బుక్ వేధింపులకు అండగా నిలుస్తున్న అవినీతి ఐపీఎస్ అధికారి కోసం ఏకంగా దేశద్రోహం కేసునే అడ్డగోలుగా మూసి వేసేందుకు బరితెగించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మామిడికి రాజకీయ ‘మంగు’.. ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్ జగన్‌ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్లే పల్ప్‌పై ఆ దేశాలు షుగర్ సెస్ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్మాజీమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
-
జంకుబొంకు లే‘కొండ’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే విశాఖలోని కొండలకు గుండు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని.. అధికారపార్టీ నేతలూ ఓ సంస్థకు కూతవేటు దూరంలో కొండల కబ్జాకు కుట్రపన్నుతున్నారు. పెద్ద కొండలపై గద్దల్లా వాలేందుకు జంకుబొంకు లేకుండా సిద్ధమవుతున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని శొంఠ్యాం గ్రామ పరిధిలో సర్వే నంబరు 346, 347లల్లో 469.9 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను పెద్ద కొండలుగా స్థానికులు పిలుస్తుంటారు. ఇవి పచ్చని చెట్లతో విస్తరించి ఉండడంతో అనేక అడవి జంతువులకు స్థావరంగా ఉన్నాయి. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ కొండలపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. దీంతో ఒక కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే పీఏలు ఇద్దరు, రెవెన్యూ అధికారులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొండలను కేకుల్లా కట్‌చేసుకుని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే డ్రోన్లతో ప్రైవేటు సర్వే చేశారు. మొత్తం 469.9 ఎకరాల్లో 150 ఎకరాల భూమికి కొద్ది మంది రైతుల సాగులో ఉన్నట్టుగా బినామీల పేర్లతో దొంగ పట్టాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఎవరి పేరుతో ఎంత భూమి తీసుకోవాలనే లెక్కలు వేసుకున్నారు. బినామీ పేర్లతో తలా 20 ఎకరాల చొప్పున కాజేతకు కుట్రపన్నుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొండల్లో రాళ్లు కూడా పాతినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.3 కోట్ల మేర పలుకుతుంది. అంటే మొత్తం 150 ఎకరాల భూమి విలుఉవ సుమారు రూ.450 కోట్లకుపైగా విలువ చేస్తుందన్నమాట. ఈ వ్యవహారంలో స్థానిక కూటమి నేతలకు కూడా ఐదు నుంచి పది ఎకరాల చొప్పున వాటా ఇస్తున్నట్టు సమాచారం. ఇక రెవెన్యూ అధికారులకు కూడా వారి వాటాగా వారికి 10 ఎకరాలు చొప్పున పంచుకున్నట్టు తెలుస్తోంది. భూ సమీకరణ పేరుతో లబ్ధి పొందేందుకే!వాస్తవానికి ఈ కొండ దిగువన ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అక్కడ సాగులో ఉన్న రైతులకు నిబంధనల మేరకు ఎకరాకు 900 గజాల చొప్పున లే–అవుట్ వేసి మరీ అప్పగించింది. ఈ లే–అవుట్‌కు ఆనుకునే ఈ పెద్ద కొండలు ఉన్నాయి. ఈ కొండలను కూడా త్వరలో వీఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఇందుకోసం త్వరలో గ్రామ సభను నిర్వహించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న సదరు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఇద్దరు పీఏలు, రెవెన్యూ యంత్రాంగం ఈ కబ్జా కుంతంత్రానికి తెరలేపారు. తమ బినామీల పేర్లను జాబితాలో చూపెట్టి.. సాగులో ఉన్నట్టు తప్పుడు రికార్డులను సృష్టించి ల్యాండ్ పూలింగ్‌లో ఎకరాకు 900 గజాల స్థలాన్ని కాజేసేందుకు ఈ తతంగమంతా నడిపిస్తున్నట్టు అర్థమవుతోంది. తద్వారా సదరు కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు పీఏలతో పాటు రెవెన్యూ అధికారులు కాస్తా తమ బినామీ పేర్లతో ఏకంగా తలా 18 వేల గజాల స్థలాన్ని వీఎంఆర్డీఏ నుంచి తీసుకుని.. అనంతరం బినామీల నుంచి కొన్నట్టు చూపి తమపరం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోంది. -
ఆర్టీసీ.. ప్రై‘వేటు’!
సాక్షి, అమరావతి: ప్రగతి రథ చక్రం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రైవేటుపరం చేసే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతోందని తేటతెల్లమైంది. విద్యుత్ బస్సుల ముసుగులో తన కుతంత్రాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని దొంగదెబ్బ తీస్తోంది. మొదటగా 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. మరోవైపు ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుండటం పట్ల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ముసుగు తొలగించి తమ పన్నాగాన్ని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ అసలు విషయం చల్లగా వినిపించారు. తద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ తథ్యం అని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఆయువు తీసేందుకు పావులు కదపడం మొదలు పెట్టింది. వంద శాతం విద్యుత్ బస్సుల (ఈ–బస్సులు) విధానం ముసుగులో పక్కా పన్నాగం పన్నింది. కానీ ఈ–బస్సులను ఆర్టీసీ నిర్వహించవచ్చన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని తిరస్కరించింది. కార్పొరేట్ సంస్థల ద్వారానే ఈ–బస్సులు ప్రవేశ పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సంఖ్యలో కోత విధించవచ్చని కూడా ప్రకటించింది. గత ఏడాది నవంబరులో సీఎం చంద్రబాబు సమక్షంలోనే నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులేఆర్టీసీలో ప్రస్తుతం 11,116 బస్సులు ఉన్నాయి. 2029 నాటికి ఆర్టీసీలో వంద శాతం ఈ–బస్సులే ఉండాలనే విధానానికి ప్రభుత్వం 2024 నవంబర్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 100 ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులను ప్రవేశ పెడతామని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే ఈ–బస్సుల ముసుగులో పూర్తిగా ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నది ప్రభుత్వ పన్నాగమన్నది సుస్పష్టమవుతోంది. ఆర్టీసీ వేలుతోనే ఆ సంస్థ కన్ను పొడిచే పన్నాగాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోంది. ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆ సంస్థ ఉన్నతాధికారుల ద్వారానే నివేదిక ఇప్పించుకోవడం గమనార్హం. 50 శాతం ఈ–బస్సులను ప్రవేశ పెట్టేందుకే అవసమైన వ్యయాన్ని భరించలేమని ఆర్టీసీ ఉన్నతాధికారులే నివేదిక ఇచ్చేలా కుట్ర పన్నింది. అనంతరం ఆ నివేదికను చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమోదించారు. ఆ నివేదిక ప్రకారం 50 శాతం ఈ–బస్సులకు అవసరమైన రూ.8,243 కోట్ల మూల ధన వ్యయంతోపాటు ప్రతి నెల రూ.336 కోట్ల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని తేల్చి చెప్పేశారు. కాబట్టి విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. 50 శాతం బస్సులే నిర్వహించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు ఆర్టీసీలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులు ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తామని తేల్చి చెప్పింది. రూ.6 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటుకు..ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో 12 డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నెముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆయా ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్కన వేసుకున్నా, ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6 వేల కోట్లు! పక్కా కుతంత్రంతో ఆర్టీసీ నిర్వీర్యం⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుతంత్రంతో పావులు కదుపుతోంది. అందుకోసం ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం కింద ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయడం లేదు. ⇒ గత ఆరు నెలల్లోనే కాలం చెల్లిన 264 బస్సులను ఇటీవల సర్వీసుల నుంచి తొలగించారు. కానీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. మరో 2 వేల బస్సులు 15 ఏళ్ల కాల పరిమితి దాటిపోయాయి. ఆ డొక్కు బస్సులనే కొనసాగిస్తోంది. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. కానీ కొత్తగా కొనుగోలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేస్తోంది. ⇒ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీలో దాదాపు 8 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అందుకే జాబ్ కాలండర్లో ఆర్టీసీలో ఉద్యోగాల ఊసే ఎత్త లేదు. ⇒ 2029 నాటికి ఆర్టీసీలో 50 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. దాంతో ఆర్టీసీని మూసివేయవచ్చన్నది బాబు ప్రభుత్వ కుతంత్రంగా ఉందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం బరితెగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీకి స్వర్ణ యుగంఆర్టీసీ అభివృద్ధి, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా.. వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక కలను సాకారం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం వద్దు అని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినా సరే, వైఎస్ జగన్ మాత్రం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అమలులోకి వచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆర్టీసీ ఆర్థిక కష్టాలు తీరాయి. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ఆర్టీసీ ప్రతి నెలా బ్యాంకుల నుంచి అప్పులు చేస్తూ వచ్చింది. ఆ ఆర్థిక ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 2020లో ఆర్టీసీకి ఉన్న రూ.8 వేల కోట్ల అప్పుల్లో 2024 నాటికి రూ.5 వేల కోట్లు అప్పు చెల్లించింది. 220 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. మరో 1,500 బస్సులను రీ–మోడలింగ్ చేసింది. దాంతో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. ఉద్యోగుల అలవెన్సులను ప్రతి నెలా జీతాలతో పాటు చెల్లించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా అటు ఆర్టీసీ అభివృద్ధి, ఇటు ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిందని, అది ఆర్టీసీకి స్వర్ణ యుగమని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకుంటున్నారు. -
మెదళ్లలోకి విషపు విత్తులు!
రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో నంబర్ వన్ అనే అపఖ్యాతిని వదిలించుకొని స్వావలంబన వైపు పయనించవలసిన పరిస్థితి భారత్‌కు ఏర్పడింది. ఆత్మ నిర్భర భారత్ ప్రణాళిక కింద ఇందుకోసం భారత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించింది. ఎడాపెడా 718 పారిశ్రామిక లైసెన్స్‌లను వారికి జారీ చేసింది. భారత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ చొరవ తీసుకొని 14 రాష్ట్రాల్లో అరవైకి పైగా భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రక్షణ ప్రాజెక్టుల కోసం కేంద్రం సరళీకరించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీఎత్తున రెండు డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను రక్షణరంగ పెట్టుబడుల కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి – కర్నూలు ప్రాంతం కూడా ఒకటి!పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) ప్రాజెక్టుకు నిన్న (శుక్రవారం) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలనూ, సాంకేతికతనూ ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు ప్రకటించారని ‘ఈనాడు’ రాసింది. అతిథిగా వచ్చారు కనుక ముఖప్రీతికోసం ఆమాత్రం మాట్లాడి ఉండొచ్చు కూడా! రక్షణ పరికరాల ఉత్పత్తుల కోసం కుదుర్చుకున్న ఎమ్ఓయూల్లో సింహభాగాన్ని తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కే మళ్లించుకున్నామని ఆయన ఇక్కడ చెప్పలేరు కదా? పనిలో పనిగా తమ ఎన్డీయే కూటమిలో రెండో పెద్దపార్టీగా ఉన్న టీడీపీ అధినేతపై కూడా సభా మర్యాదను పాటిస్తూ కొన్ని పొగడ్తలు కురిపించారు.రక్షణమంత్రే స్వయంగా వీరతాడు వేస్తే చంద్రబాబు రెచ్చిపోకుండా ఉంటారా? అదే ఊపులో మాట్లాడుతూ ఇరవై మూడు నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాననీ, ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వీటివల్ల లభిస్తాయనీ పునరుద్ఘాటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇదే పాటను ప్రతిచోట పదేపదే పాడుతున్నారు. ఈమధ్యనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ తాను కల్పించిన ఉద్యోగాల సంఖ్యను కూడా 23 లక్షల కోట్లుగా చెప్పుకున్నారు. ఆ యాంకర్‌కు పాపం మూర్ఛ వచ్చినంత పనైంది. కానీ, యాంకర్ ఇబ్బందిని గమనించే స్థితిలో బాబుగారు లేరు. ఆయన పాడాలనుకున్న పాటను పూర్తిగా పాడేశారు. పుట్టపర్తి సభలో చంద్రబాబు వదిలేసిన భాగాన్ని యువనేత లోకేశ్‌బాబు పూర్తి చేశారు.పుట్టపర్తికి వచ్చి పంచ్ డైలాగ్ కొట్టకుండా నేను వెళ్లలేనని లోకేశ్ వెల్లడించారు. పంచ్ డైలాగ్లపై పేటెంట్ హక్కు సినిమాల్లో మామయ్యదీ, రాజకీయాల్లో తనదీ అనే నమ్మకం కావచ్చు. ఇంతకీ ఆ పంచ్ డైలాగ్ ఏమిటంటే, ‘‘వైసీపీది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్. మనది ఫైటర్‌జెట్ బ్యాక్‌గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా రాజా’’. ఇందులో ఉన్న పంచ్ ఏమిటని వెతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి ఆత్మతృప్తి వారిది. తాను మునిగింది గంగ... తాను వలచింది రంభ... తాను విసిరింది పంచ్... అంతే! ఈ సభలో ఆత్మస్తుతి భాగాన్ని చంద్రబాబు తీసుకుంటే, పరనింద భాగాన్ని చినబాబు తీసుకున్నారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ఈ రెండు భాగాలనూ చంద్రబాబే స్వీకరించారు. ఆయన చెప్పిన ప్రకారం 2019–24 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగైందట! అందులో పావు భాగాన్ని ఎత్తేసరికి 23 నెలల కాలం గడిచిపోయిందట! ఈ లెక్కన మిగిలిన మూడేళ్లలో మిగిలిన చెత్తను ఎత్తే కార్యక్రమమే సరిపోతుంది. ఇంకో ఐదేళ్ల్లకు గెలిపిస్తే సంపద సృష్టికార్యం అప్పుడు మొదలవుతుంది కాబోలు!ఈ ఆత్మస్తుతి, పరనింద అనే రెండంచెల తెలుగుదేశం విధానం కేవలం యథాలాప రాజకీయ విన్యాసం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మకంగా, ఆలోచించి రూపొందించిన ఒక రకమైన కుతర్కం. ఈ కుతర్కాన్ని వ్యాప్తం చేయడంకోసం ఆ పార్టీ ప్రత్యేకమైన పదజాలాన్ని కూడా రూపొందించింది. ఈ పదజాలంతో తనను బ్రాండింగ్ చేసుకోవడంతోపాటు విపక్ష వైసీపీని కూడా బ్రాండింగ్ చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నది. యెల్లో మీడియాగా అపకీర్తి మూటగట్టుకున్న సంప్ర దాయ మీడియాతోపాటు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన యూ–ట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా సైన్యం టీడీపీ బ్రాండింగ్ బాజాను ముందుకు తీసుకొనిపోవడానికి ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయి. ఈ బ్రాండింగ్ భజంత్రీల జుగల్బందీ లెక్క ప్రకారం తెలుగుదేశం అంటే అభివృద్ధి. వైసీపీ అంటే విధ్వంసం. ఎలా అని ప్రశ్నించడం అమాయకత్వం. తర్కానికి నిలబడుతుందా అనే మీమాంసతో కూడా పనిలేదు. ఈ పద జాలాన్ని ఒక ప్రభంజనంలా ప్రచారంలో పెట్టి జనం మెదళ్లలోకి ఎక్కించడమే వారి ఉద్యమం.ఇవాళ్టి శ్రీకాకుళం సభలో కూడా చంద్రబాబు అదే పని చేశారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని మరోసారి చెప్పారు. 2024లో నరకాసుర పాలన అంతమైన తర్వాత మీరంతా దీపావళి పండుగ చేసుకున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చేతులు ఎత్తించుకున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని డిగ్రీలు మెడలో వేసుకున్న పలువురు అజ్ఞానులు సైతం నమ్మడం అనేది వర్తమాన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విషాదం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందన్న సామెత ఉండనే ఉన్నది కదా! ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా ఏరకంగా మీరు అభివృద్ధికి రోల్ మోడలో సెలవీయండని చంద్రబాబును, ఆయన పార్టీని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. వాస్తవ గణాంకాలను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అగత్యం ఏర్పడింది.1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచే ‘నిజమైన’ అభివృద్ధి దేశంలో పట్టాలెక్కిందని మన పెట్టుబడి దారీ ఆర్థికవేత్తలు, మన మేధావులు చెబుతున్నారు. అప్పటి నుంచే లెక్కలోకి తీసుకుంటే ఈ 35 సంవత్సరాల కాలంలో ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 16 సంవత్సరాలపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఇప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నది. అడవులతో నిండిన మధ్య భారత్, కొండలకు నెలవైన ఈశాన్య భారత్, హిమశ్రేణుల ఉత్తర భారత్ ప్రాంతాలు కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ను వెక్కిరిస్తున్నాయి. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రానిది 18వ స్థానం. మానవాభివృద్ధి సూచికల్లో 26వ స్థానం (28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో). నిరుద్యోగిత రేటులో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ తలదన్నింది. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత శాతం 5.2. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది 8.2 శాతం. ప్రజల సగటు ఆయుర్దాయంలో ఈ రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నది. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు మాసాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని జీఎస్టీ వసూళ్ల లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు చేయడంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందనీ, అప్పుకోసం ప్రతి మంగళవారం దేహీ అని యాచించకపోతే పూట గడవని స్థితిలోకి రాష్ట్రం దిగజారిందనీ కూడా అధికారిక గణాంకాలే కుండబద్దలు కొడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన విధ్వంస పాలన ఎట్లా అయింది? ఈ ఆరోపణకు ఉన్న ఆధారాలేమిటి? పేదా–ధనిక వివక్ష లేకుండా, కులమతాల తేడా చూడకుండా ఈ నేలమీద పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య లభించాలని జగన్ మోహన్‌రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్న మాట వాస్తవం కాదా? నాడు – నేడు పేరుతో 35 వేల పాఠశాలలకు పునర్వికాసాన్ని సంకల్పించి, అందులో సగానికి పైగా పూర్తిచేసి, పిల్లలకు మంచి యూనిఫామ్‌ను కూడా ప్రభుత్వమే సమకూర్చి, పోషకాహారాన్ని అందివ్వలేదా? డ్రాపవుట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టి, ఇంగ్లిషు మీడియంలో బోధనను ప్రారంభించి, సీబీఎస్ఈ సిలబస్ పాఠాలు చెప్పించలేదా! ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యా ర్థులకు ట్యాబ్‌లను అందజేసి, డిజిటల్ బోధనకు అంకురార్పణ చేసింది జగన్ సర్కార్ కాదా? అంతర్జాతీయ స్థాయి ఐబి సిలబస్‌ను సైతం సర్కార్ బడి పిల్లలకు సమకూర్చేందుకు సన్నాహాలు చేసింది జగన్మోహన్రెడ్డి కాదా?టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ యజ్ఞం భగ్నమైందని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామ చావడిలో నిలబడి అడిగినా చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలంటే చందాలు వసూలు చేయాలని ఈమధ్యనే ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కూడా గతంలోనే ఆయన చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాలి. సర్కార్ బడి చదువులను చారిటీ పద్దు కిందకు మార్చడమంటే పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరం చేయడమే. పేదరికం నుంచి ఆ కుటుంబాల విముక్త మార్గాన్ని మూసివేయడమే! చదువే ప్రపంచాన్ని మార్చే పదునైన ఆయుధమని అంబేడ్కర్, పూలే, నారాయణ గురు వంటి వేగుచుక్కలే కాదు, మండేలా వంటి ఆఫ్రికన్ సూరీడు కూడా అదే మాట చెప్పారు.చంద్రబాబు ఫిలాసఫీ ప్రకారం నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూళ్లలో చదువు కొనుగోలు చేసే పిల్లలకే దక్కాలి. సర్కార్ బడుల గడప దాటలేని పేద పిల్లలు చీప్ లేబర్‌గా మార్కెట్లో నిలబడిపోవాలి. పేదరిక నిర్మూలనపై కూడా చంద్రబాబు ఆలోచనలు వక్రమార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. సంపన్నులైన వారు కొన్ని పేద కుటుంబాలను చేరదీసి వారిని ఆదుకోవాలట! పేదరికం నుంచి విముక్తి పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కనీ, అది ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యతనీ ఆయన గుర్తించడం లేదు. మరోసారి నెల్సన్ మండేలాను గుర్తు చేసుకుందాము. ‘‘పేదరిక నిర్మూలన అనేది చారిటీ కాదు, అదొక ప్రాథమిక న్యాయం. పేదరికం సహజంగా ఏర్పడేది కాదు, రుద్దబడేది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన పోరాటాలు ఎంత పవిత్రమో, పేదరిక విముక్త పోరాటాలు కూడా అంతే పవిత్ర’’ మని మండేలా చెప్పారు. ప్రాథమిక విద్యే కాదు, ఉన్నత విద్య విషయంలోనూ జగన్ చేపట్టిన సహజ న్యాయ సూత్రాలను చంద్రబాబు తలకిందులు చేశారు. పేదలందరికీ చదువు, వైద్యం సులభంగా అందడం కోసం ఆయన ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వెంపర్లాడుతున్నది. విద్యారంగం, వైద్యరంగం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ఈ ఇద్దరు నేతలు అవలంబించిన విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం జగన్ విధానాలకు చోదక శక్తులైతే, ప్రైవేటుకు పెద్దపీట, ప్రచార పటాటోపం చంద్రబాబు పాలనను నడిపి స్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా లక్షలాది జీవితాలు సాధికా రతకు, ఆత్మగౌరవానికి దూరమవుతున్నాయి. గిట్టుబాటు ధరల్లేక, గింజలు కొనే నాథుడు లేక లక్షలాదిమంది రైతన్నలు అలో లక్ష్మణా అని అలమటిస్తున్నారు. ఇది కదా సామాజిక విధ్వంసం అంటే? దీన్నే కదా విధ్వంస పాలన అనాలి?వైసీపీ గొడ్డలి పార్టీ ఎలా అయింది? టీడీపీ కార్యాలయాల మీద శాంతి కపోతాలు ఎప్పటినుంచి ఎగురుతున్నాయి? జగన్ పాలనతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఇప్పుడు భేషుగ్గా ఉందని ఏ లెక్కలు తేల్చాయి? హత్యలు ఆగిపోయాయా? అత్యాచారాలు ఆసలే లేవా? అపహరణలు ఆగిపోయాయా? గంజాయి ఈ రాష్ట్రం సరిహద్దుల్లోకే రావడం లేదా? విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశమే లేక పల్లెలు పట్టణాలన్నీ ప్రశాంతంగా నిద్రిస్తున్నాయా? కుల మత భేదాలూ కలహాలు లేకుండా ఆకివీడు నుంచి కడప దాకా అన్ని వర్గాల ప్రజలు భుజాల మీద చేతులు వేసుకొని భాయిభాయి అంటూ సంచరించే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, గణాంకాలను చూపకుండా, కేవలం పదజాలపు మాయాజాలంతో జనం మెదళ్లలో విషపు విత్తులు నాటితే, ప్రజలను విభజించి పాలించాలనుకుంటే అది రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎల్లకాలం సాగదు. చరిత్ర మిమ్మల్ని ప్రజా కంటకులుగా అభిశంసిస్తుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేసిన కూటమి ప్రభుత్వం
-
కూటమి సర్కార్ బిగ్ డెసిషన్.. త్వరలో గన్నవరం ఎయిర్ పోర్ట్ మూసివేత...?
-
కొండకి గుండు.. ఏపీ మ్యాప్ నుంచి విశాఖను లేపేసే కుట్ర
-
గన్నవరం ఎయిర్ పోర్టుకు సర్కారు ఉరి
సాక్షి, అమరావతి: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ అనవసర వ్యయాలు తగ్గించుకుని పొదుపు పాటించండని పిలుపునిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ దుబారాలో తనను మించిన వారు లేరని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రచార కండూతి కోసం రాజధానిలో విమానాశ్రయం పేరుతో రూ.7,500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడానికి వెనుకాడటం లేదు.నిన్నటి వరకు గన్నవరం రాజధానిలో భాగమంటూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసి, ఇప్పడు టెర్మింనల్ పనుల టెండర్లను రద్దు చేసి ఎక్కడి పనులను అక్కడే ఆపేశారు. భూ సేకరణ, ఫ్లై ఓవర్లు, కొత్త రన్‌వే, కొత్త టెర్మింనల్ ఇలా రూ.నాలుగు వేల కోట్ల ఖర్చును గంగపాలు చేయడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలో అమరావతిలో 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల పెట్టుబడితో కొత్త విమానాశ్రయం కట్టడానికి సిద్ధపడుతుండటంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఇప్పటిదాక విజయవాడ, గన్నవరం రాజధాని అమరావతి పరిధిలోకే వస్తాయంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. గన్నవరం విమానాశ్రయం అమరావతికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి–16కు ఆనుకొని అందరికీ అందుబాటులో ఉంది. పైగా పశ్చిమ బైపాస్ ద్వారా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకునే వీలుంది. ఇవన్నీ లెక్కలు వేసుకునే అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ఏకంగా 700 ఎకరాలు సేకరించారు.భూ సేకరణ సమయంలో గన్నవరం కూడా రాజధాని పరిధిలోకే వస్తుందని హామీ ఇవ్వడమే కాకుండా, విమానాశ్రయం విస్తరణకు భూమి ఇచి్చన రైతులకు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని అమరావతికి తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు మరింత విస్తరించాల్సింది పోయి దీన్ని మూసి వేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. 1,670 ఎకరాల్లో హీత్రూ విమానాశ్రయం దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత జనాభా 3.4 కోట్లు. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ 1,500 ఎకరాల లోపే. దేశ ఆర్ధిక రాజధాని ముంబై జనాభా 1.25 కోట్లు. అక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఉన్నది 1,850 ఎకరాల్లోనే. హైదరాబాద్ జనాభా 1.10 కోట్లు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కేటాయించినా, ఇప్పటి వరకు వినియోగించుకున్నది 2 వేల ఎకరాలు మాత్రమే. అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా పేరు పొందిన లండన్ హీత్రూ విమానాశ్రయం 1,670 ఎకరాల్లోనే ఉంది. ఆ విమానాశ్రయం నుంచి ఏటా 84 దేశాలకు చెందిన 214 ప్రాంతాలకు 8 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తారు.అయితే మూడు లక్షల జనాభా కూడా లేని అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కోసం దాదాపు 5 వేల ఎకరాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి తొలి దశ పూర్తి కావడానికే 30 ఏళ్లకు పైగా సమయం పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయని, అక్కడ ఇప్పుడు ఇంత భారీ విస్తీర్ణంలో, భారీ ఖర్చుతో కొత్త విమానాశ్రయం అవసరం ఏముందని ప్రశి్నస్తున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేపట్టిన ప్రాజెక్టు తప్ప మరొకటి కాదని, అమరావతి విమానాశ్రయం ఆలోచన ఉపసంహరించుకొని గన్నవరం విమానాశ్రయాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాభవం కోల్పోనున్న విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పిచ్చి కారణంగా విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వచి్చందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తర్వాత రాష్ట్రానికి ప్రధాన నగరంగా వెలుగొందుతున్న విజయవాడ ఇకపై అనామకంగా మిగిలిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. దేశంలో ప్రధాన బస్టాండ్లలో ఒకటిగా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్‌ను కూడా అమరావతికి తరలించి విజయవాడను రాజధానితో అనుబంధం లేకుండా చేస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారు.ఏదైనా ప్రైవేట్ సంస్థ కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మింస్తే సమీపంలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని ప్రభుత్వాలతో కన్సెషన్ ఒప్పందాలు చేసుకుంటాయి. 150 కిలోమీటర్ల దూరంలో అప్పటికే ఎయిర్‌పోర్టులు ఉంటే వాటిని మూసివేయాలి. దీని ప్రకారం అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్టు వస్తే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేయాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం కూడా పక్కపక్కనే రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు అనుమతి ఇవ్వదని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచి్చన తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు మూత పడినట్లే, అమరావతి ఎయిర్పోర్ట్ వస్తే గన్నవరం విమానాశ్రయం కూడా మూసి వేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయినా అంత పెద్ద లండన్‌లోనే ఒకే విమానాశ్రయం ఉండగా, గన్నవరం సమీపంలోని అమరావతిలో మళ్లీ కొత్తగా విమానాశ్రయం నిర్మాణానికి పూనుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పొదుపు చర్యలు అంటే ఇవేనా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. -
పెట్రో ధర పెంపుపై భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. శుక్రవారం ధరల పెంపును నిరసిస్తూ పలు చోట్ల అప్పటికప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. సీపీఎం, సీపీఐలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడంతో అనేక ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (వీఏటీ) తగ్గించి సామాన్యులకు ఊరట ఇవ్వాలని, ధరల పెరుగుదల వల్ల పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.విజయవాడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద ధర్నా చేశారు. ఫ్లాట్ రిక్షాకు బైక్‌ను తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో విజయవాడ–బందరు ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా రంగం కుదేలవుతుందని, నిత్యావసర సరకుల ధరలు పెరుగుతాయని, ప్రజలు, రైతాంగంపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచడం ప్రజలకు నమ్మకద్రోహం చేయడమేనని మండిపడ్డారు.కృష్ణా జిల్లాలో రైతుల నిరసనఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరుగుతాయని, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నాగయలంకలో వారు నిరసనకు దిగారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సీపీఐ శ్రేణులు రోడ్డుపై ఖాళీ గ్యాస్ సిలెండర్లు పెట్టి, తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైఎస్సార్ సర్కిల్ నుండి తిలక్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులోను వామపక్ష పార్టీలు పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నాలు చేశాయి. కడపలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో లారీకి తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. నమ్మించి మోసం చేశారు..పెట్రోల్, డీజిల్‌పై రూ.3కు పైగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం తగదని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ బేసిన్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇచ్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు నేతలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. -
ఏపీలోనే అధిక బాదుడు
నాడుఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్లండంటూ పొరుగు రాష్ట్రాల్లో బోర్డులు పెట్టారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే వాటి ధర ఎక్కువ. ఫలితంగా నిత్యావసరాల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం వేసే పన్నే ఇందుకు కారణం. ప్రభుత్వం తొలుత ఆ పన్ను తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై వేసిన పన్నును తగ్గిస్తాం. తద్వారా రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి. – ఎన్నికలకు ముందు చంద్రబాబునేడుప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలి. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి. తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగించాలి. కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. వారంలో ఒకరోజు నో వెహికల్ డే గా పాటించాలి. – గురువారం కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన రేట్లు భగ్గుమంటున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. శుక్రవారం నుంచి ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగింది. అత్యధికంగా పల్నాడులో లీటరు పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ.101.24కు ఎగబాకింది. ఫలితంగా రవాణా రంగంతో పాటు ఆహార, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది. వాస్తవానికి ఏపీలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 15–20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంది.తాజాగా ధరల పెరుగుదలతో రోజు పెట్రోల్‌పై రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లకుపైగా ఆర్థిక భారం పడుతుంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళంతో పోల్చుకుంటే రూ.3, తమిళనాడుతో పోల్చితే ఏకంగా రూ.10, కర్ణాటకతో చూసినా రూ.7 వరకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ రూ.950–980 ఉంటోంది. కమర్షియల్ గ్యాస్ రూ.3,300కుపైగా చేరింది. నెలల వ్యవధిలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి ఎగబాకడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెరిగిన భారం ప్రభుత్వం భరించకుండా ఇంధనం పొదుపు చేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం పట్ల మండిపడుతున్నారు.రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిపై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్, తదితర పన్నులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నెటిజన్లు ఉతికారేస్తున్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఆర్థిక ఊరట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వంట నూనెలు సహా నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం రేషన్‌లో ఇచ్చే సబ్సిడీ కందిపప్పు, గోధుమ పిండి, చిరుధాన్యాల పంపిణీకి మంగళం పాడేసింది. రైతులకు ధాన్యం మద్దతు ధర దక్కకపోగా, బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. -
దేవుడి దగ్గరకు వెళ్లి మనం గుండు కొట్టుకుంటే - వీళ్ళు మాత్రం దేవుడికే గుండు కొట్టేస్తున్నారు
-
ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయి బాబు ఎందుకు అడ్డుకోవడం లేదు?
-
సంఘం డైరీ ఒక కిక్కు... బోడి మంత్రి పదవి లో ఏముందని...
-
భూసేకరణ పేరుతో 50 వేల ఎకరాలపై కన్నేసిన బాబు..
-
ఏపీలో ఆగని చంద్రబాబు దుబారా ఖర్చు
-
భూ సమస్యలపై ‘రెవెన్యూ’ రాబందులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మా భూమి రెవెన్యూ రికార్డులో ఇబ్బందులున్నాయి. నాకు ఎప్పుడో పట్టా ఇచ్చారు. అయితే ఆన్లైన్లో ప్రభుత్వ భూమి అని ఉంది. పరిష్కరించండి.. అంటూ విశాఖ మధురవాడకు చెందిన ఒక వ్యక్తి విశాఖ కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఫలానా మంత్రి పేషీ నుంచి అంటూ అతడికి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఓ మంత్రి సోదరుడు, ఓఎస్డీ అంటూ కొందరు ఫోన్‌చేసి ఏకంగా అతడి ఇంటికి వెళ్లారు. మీ భూమి సమస్యలను మేం పరిష్కరిస్తాం.. సగం ధరకే మాకివ్వండి.. అంటూ బేరసారాలాడారు. తనకు ఈ సమస్య ఉందని ఏకంగా అమరావతిలోని మంత్రికి ఎలా తెలిసిందో అర్థంగాక ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఆనందపురం, సబ్బవరం, భీమిలిలో డీ–పట్టాలు ఉన్న పలువురు రైతులతోను ఇదే తరహాలో ఓ మంత్రి సోదరుడు, పీఏ అంటూ చర్చలు జరుపుతున్నారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం త్వరలో రెగ్యులరైజ్ చేస్తుందని, మీ భూములను మేం చూసుకుంటామంటూ బేరసారాలు ఆడుతున్నారు. అడ్డకు పావుసేరు ధరకే బేరసారాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. లేదంటే భూసమీకరణ కింద మీ భూములు తీసుకుంటారంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఇవే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో భూమి ధరలు బాగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి సోదరుడు, ఓఎస్డీ, పీఏలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా మధురవాడ, ఆనందపురం, సబ్బవరం, భోగాపురం, అచ్యుతాపురం ప్రాంతాల్లోని విలువైన భూముల విషయంలో తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమికి సంబంధించి ఎవరైనా తమకు సమస్య ఉందంటూ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సదరు మంత్రి అనుచరగణం వాలిపోతోంది. నేరుగా ఫిర్యాదులో పేర్కొన్న నంబరుకు ఫోన్‌చేసి ‘మీ సమస్య మాకు తెలుసు. మేం విశాఖకు వచ్చి మీతో మాట్లాడతాం’ అంటూ మంత్రి పీఏ పేరుతో కాల్స్ చేస్తున్నారు. ఇక డీ–పట్టా భూముల విషయంలోను మీ భూమి భూసేకరణలో పోతుందంటూ భయాందోళనకు గురిచేసి, తక్కువ ధరకే తమ పేరులతో ఒప్పందం రాయించేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఒక అధికారి ఈ వ్యవహారంలో మొన్నటివరకు వారికి సహకరించారు. ఫిర్యాదు కాపీ ఎలా వెళుతోంది?వాస్తవానికి కలెక్టరేట్లోనో, తహశీల్దారు కార్యాలయంలోనే సోమవారం బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత.. ఫోన్ నంబర్లతో సహా ఆ వివరాలు మంత్రి పేషీకి వెంటనే చేరిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఉద్యోగ విరమణ చేసిన ఓ అధికారితో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ రిటైర్డ్ అధికారికి స్థానిక రెవెన్యూ అధికారులతో ఉన్న సంబంధాలతోనే మంత్రి పేషీకి సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూముల విషయాలతో పాటు ఏయే పనులు అవుతాయనేది కూడా స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం ఉండటంతో పక్కాగా మంత్రి అనుచరులు రంగంలోకి దిగి భూదందాలు సాగిస్తున్నట్టు అర్థమవుతోంది.ఓఎస్డీదే పైచేయి వాస్తవానికి ఆ రిటైర్డ్ అధికారిని భూలావాదేవీల వ్యవహారాలు పరిశీలించేందుకు మంత్రి ప్రత్యేకంగా నియమించుకున్నారు. అధికారికంగా నియామకపత్రం లేకుండానే ఆ రిటైర్డ్ అధికారి గత మూడునెలలు సేవలందించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వివాదాస్పద భూములున్నాయి? ఏయే అంశాల్లో రికార్డులను మార్చి వ్యవహారం నడిపించవచ్చనే విషయాలపై మంత్రికి సలహాలిచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాల విషయంలో మంత్రి ఓఎస్డీకి, ఆ రిటైర్డ్ అధికారికి మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. వారం రోజుల కిందట ఆ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో.. రిటైర్డ్ అధికారిని ఇంటికి సాగనంపారు. రిటైర్డ్ అధికారి ఇచ్చిన సలహాలు, సూచనలతోనే విశాఖలోని భారీ విలువ చేసే భూముల వ్యవహారంలో మంత్రి తమ్ముడు, ఓఎస్డీ, పీఏలు భారీగా దందాలు కొనసాగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మంత్రి చెబితేనే చేస్తా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పేదల ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరులోనూ కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. ఇందుకు గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.180 కోట్లు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో ఉన్నా.. కమీషన్ల కోసం ఒక అమాత్యుడు బిల్లులు ప్రాసెస్ చేయకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ ఫైనాన్స్ విభాగంలోని ఒక కీలక అధికారిణి.. మంత్రి చెబితేనే బిల్లులు ప్రాసెస్ చేస్తానని భీష్మించుకుని కూర్చోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి గృహనిర్మాణ సంస్థ వరకు వివిధ దశల్లో రూ.30 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీటిలో రూ.20 కోట్లకుపైనే ఆప్షన్–3 ఇళ్ల బిల్లులున్నట్లు తెలుస్తోంది. రూ.180 కోట్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం అమాత్యుడి ఆదేశాలేనన్న విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీల నిర్వాహకులను తన దగ్గరకు వచ్చేలా చేసుకోవడం కోసం బిల్లులు చెల్లించవద్దని అమాత్యుడు హుకుం జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘రూ.180 కోట్ల నిధులు అమాత్యుడు కేంద్రానికి తిరిగి ఇచ్చేయమన్నారు.ఎవరు చెప్పినా నేను బిల్లులు ప్రాసెస్ చేయను. పెండింగ్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటే నాకు అమాత్యుడి నుంచి ఆదేశాలు రావాలి’ అని సదరు అధికారిణి తేల్చి చెబుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సిఫార్సులు లేకుండా పారదర్శకంగా సాగాల్సిన బిల్లుల చెల్లింపులను చంద్రబాబు సర్కార్ ఏర్పాటయ్యాక గందరగోళం చేసేశారు. తనను కలిసిన ఆప్షన్–3 ఏజెన్సీలకు ప్రాధాన్యత క్రమంలో బిల్లులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశిస్తూ అమాత్యుడు ఆదేశాలు ఇచ్చిన లేఖలు గతంలో వెలుగుచూశాయి. ఉన్నతాధికారులు పూచికపుల్లతో సమానంకేంద్రం గృహనిర్మాణ పథకాన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) విధానం నుంచి స్పర్‡్షలోకి మారుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం దగ్గర ఉన్న రూ.180 కోట్ల నిధులు కేంద్రానికి ఇచ్చేస్తే పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి రూ.180 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్ చేసి ఇళ్ల నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని కాదని చంద్రబాబు సర్కార్ రూ.180 కోట్లు కేంద్రానికి తిరిగి ఇచ్చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దీంతో నిధులు వెనక్కిచ్చే వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లిద్దామని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సైతం ఫైనాన్స్ విభాగం అధికారిణి బేఖాతరు చేస్తున్నారు. అమాత్యుడి అండతో ఉన్నతాధికారులను సైతం పూచికపుల్లతో సమానంగా తీసి పారేస్తుండటం ఇప్పుడు గృహనిర్మాణ శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
అప్పన్న కొండకు గుండు!
ఈ ఫొటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండను డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వే స్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది. నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ‘చప్టా’ కూడా మూసుకుపోవడంతో ముడసర్లోవకూ నీటి ఎద్దడి ఏర్పడనుంది.భీమిలిలోని పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైవేట్ రిసార్టుకు భూమి కేటాయించడంతో భారీ యంత్రాలతో కొండలన్నీ పిండి పిండి చేస్తున్నారు. దీంతో బౌద్దం ఆనవాళ్లు కానరాకుండా పోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పన్న కొండపై అపచారం..! నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రానికే ఎసరు..! అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా.. ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలనూ వదలడం లేదు. ప్రైవేట్ రిసార్టులు, డేటా సెంటర్ పేరుతో కొండలన్నీ నుజ్జు నుజ్జు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేటు రిసార్టులు దర్శనమివ్వనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముడసర్లోవకు నీటి ముప్పు...!సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని (సింహాచలం కొండ) డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు. దీన్ని లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు. సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్లోవలోకి వస్తుంది. కొండ నుంచి వచ్చే నీరు ముడసర్లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. భీమిలిలోని పావురాల కొండను తవ్వేస్తున్నారిలా.. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ వేసవి కాలంలో పీక్ సీజన్లోనూ ఈ కాలనీలకు నీటి ఎద్దడి సమస్య లేదు. కేవలం 60–70 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొండను పూర్తిగా తవ్వేస్తుండటంతో ముడసర్లోవలోకి నీరు వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు కూడా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ రిసార్టుల కోసం పావురాల కొండ...!బీచ్ రోడ్డులో భీమిలికి వెళ్లే మార్గంలో కొత్తవలస వద్ద క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్న పావురాల కొండ ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాచీన బౌద్ధ నిధిగా వ్యవహరిస్తుంటారు. ఈ కొండను ఇప్పుడు ప్రైవేట్ రిసార్టుల కోసం కేటాయించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి బౌద్ధ నిధి ఆనవాళ్లను చంద్రబాబు ప్రభుత్వం భారీ యంత్రాలతో తొలిచే యత్నం చేస్తోంది. పావురాల కొండ ఉన్న కొత్తవలస రెవెన్యూ పరిధిలో 15 ఎకరాలను ప్రైవేటు రిసార్టు కోసం ధారాదత్తం చేశారు. ఈ మేరకు 2025 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం 39) జారీ చేసింది. 66 ఏళ్ల లీజుతో పాటు మరో 33 ఏళ్లు పొడిగించే వెసులుబాటుతో మొత్తం 99 ఏళ్లకు మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థకు కట్టబెట్టింది. దీని కోసం పావురాల కొండను అడ్డంగా తవ్వేస్తున్నారు. ప్రైవేటు రిసార్టుల కోసం పావురాలకొండలోని 15 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రభుత్వం ప్రాచీన బౌద్ధమత ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. పక్కనే మిగతా కొండలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టి పిండి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఇప్పటికే ఎండాడలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ బంధువైన గీతం యజమాని, విశాఖ ఎంపీ భరత్‌కు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దలు మరోవైపు కొండలన్నింటినీ ప్రైవేట్ రిసార్టుల కోసం తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. -
‘మందు’ మార్బలానికే!
సాక్షి, అమరావతి : టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ స్పీడ్ పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా రెండేళ్లపాటు పొడిగించేందుకు ఎత్తుగడ వేసింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా లైసెన్సులు కేటాయించే ప్రక్రియను పక్కనపెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకోసం ముఖ్య నేత ఆదేశాలతోనే ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు రెన్యూవల్...! 2024 నుంచి చేస్తున్న మద్యం దోపిడీని కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకే ప్రస్తుతం టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలకు అనుమతించిన రెండేళ్ల లైసెన్సు గడువు ఈ ఏడాది అక్టోబరు మొదటివారంతో ముగుస్తోంది. సెపె్టంబరులో నోటిఫికేషన్ జారీ చేసి తాజాగా లైసెన్సులు కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు అందరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలి. ఈ పారదర్శక విధానాన్ని విస్మరించి ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు లైసెన్సులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్యనేత స్థాయిలోనే సూత్రపాయంగా నిర్ణయించారు.ఎందుకంటే రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నీ టీడీపీ కూటమి సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. అందుకే ఆ సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయించాలని భావిస్తున్నారు. అందుకు ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. కాగా 2024లో లైసెన్సుల కోసం దరఖాస్తుల ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజు రూపంలో వచ్చిన ఆదాయానికి ఇది అదనం. ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేస్తే.. లైసెన్సు ఫీజు వస్తుంది. కానీ 2024లో దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చిన రూ.1,800 కోట్లను కూడా సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని పరిశీలించాలని ఎక్సైజ్ శాఖకు సూచించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకుని టీడీపీ మద్యం సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు లైసెన్సులు ఏకపక్షంగా పొడిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గతంలోనూ లాటరీ ముసుగులో టీడీపీ సిండికేట్‌కు...2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో మొత్తం 3,736 ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు 2024 అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేసింది. లాటరీ విధానం ముసుగులో టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు కట్టబెట్టింది. సిండికేట్ సభ్యులకు కాకుండా ఇతరులు ఎవరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో బెదిరించారు.ఇక ఆ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలను నిర్వహిస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో మద్యం దోపిడీ విధానం ముసుగులో రూ.25వేల కోట్ల దోపిడీ పాల్పడిన టీడీపీ సిండికేట్... ప్రస్తుతం 2024–29 కూటమి ప్రభుత్వ హయాంలో అంతకు రెట్టింపు దోపిడీకి గురి పెట్టింది. అందుకోసమే టీడీపీ సిండికేట్‌కే మద్యం దుకాణాల లైసెన్సులను మరో రెండేళ్లపాటు పొడిగించాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్యం పాలసీ ముసుగులో మంత్రి మండలిలో ఆమోదించి ఈ దోపిడీ విధానానికి రాజముద్ర ముద్ర వేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అదీ సంగతి. -
రామోజీ చనిపోతే కేసులు ఎత్తేయాలా?
-
ఫీజు రీయింబర్స్ మెంట్ జమపై కూటమి సర్కార్ నో క్లారిటీ..
-
సంక్షేమం.. ఇక సంక్షోభమే
-
ఆరు నూరైనా భూములిచ్చేదే లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో సాగిస్తున్న భూ దందాకు సహకరించే ప్రసక్తి లేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని కోసం అవసరమైనంత భూమిని తొలి దశలోనే సమీకరణ కింద తీసుకున్నప్పటికీ, మళ్లీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంపై మండిపడుతున్నారు. అసలు మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచి ఎక్కువే. 2014కు ముందే అక్కడ ఎకరం రూ.2–3 కోట్లు పలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలోని మరికొన్ని గ్రామాల్లో ఎకరం ధర రూ.లక్షల్లోనే ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకోవడానికి అన్ని చోట్లా ఒకే ప్యాకేజి ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చేశారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్‌జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీసులు ఇస్తోంది. పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు. ఇప్పుడు వాటిని భూసేకరణ కింద పెట్టారు. గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండానే, వారిని సంప్రదించకుండానే నోటీసులు ఇస్తున్నారు. రైతుల గోడు వినడానికి సీఆర్డీఏ కమిషనర్, మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. రైతులు కూటమి పార్టీల నేతలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అపాయింట్మెంట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి.. ఎంత భూమి అవసరం.. ఏ రైతుకు ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కొవడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు, సర్క్యులేషన్ లేని పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చేవరకు ఎవరికీ సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అవసరానికి మించి ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మాకు ఎప్పుడు లబ్ధి కలుగుతుంది? నాకు ఎకరం 40 సెంట్లు ఉంది. ఆ మొత్తం భూమి సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు. నాకు రెండేళ్ల కిందట బైపాస్ ఆపరేషన్ జరిగింది. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో పూలింగ్ సమయంలో విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరు వల్ల మాకు ఎప్పటికి లబ్ధి కలుగుతుంది? మేం భూములు ఇస్తే ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి? మేం రాజధానికి వ్యతిరేకం కాదు. మా బ్రతుకులు పణంగా పెట్టి భూములు ఇవ్వలేమని చెబుతున్నాం. – పద్మారెడ్డి, రైతు, ఉండవల్లిఇది చాలా అన్యాయం ప్రభుత్వం చెబుతున్న రాజధానిలో ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది. విజయవాడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ధర ఉంది. పైగా కమర్షియల్ ఏరియా కావడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల వల్ల రైతులకు నష్టం వస్తుంది. విజయవాడకు పక్కనే ఉన్న మాకూ ఒకే పద్ధతి, ఎక్కడో దూరంగా ఉన్న వారికి కూడా అదే పద్ధతా? ఈ విషయమై గతంలో మేము కోర్టులో వేసినప్పుడు స్టే వచ్చింది. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూమి ఇవ్వండని మొదలుపెట్టి ఇప్పుడు అన్ని భూములు కావాలంటున్నారు. మాతో మాట్లాడకుండానే మాకు నోటీసులు ఇస్తుండటంపై అందరం సమావేశమయ్యాం. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పే చంద్రబాబునాయుడు ఏటా మూడు పంటలు పండే పొలాలను అవసరానికి మించి తీసుకోవడం అన్యాయం. – ఈశ్వరరెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడుప్రాణం పోయినా భూమి ఇవ్వం మాది ఉండవల్లి. 248 సర్వే నెంబర్లో మా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు నివాసానికి తూర్పు పక్కన ఎదురుగా ఉన్న భూమి. దీన్ని 1960లో మా తాత కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మేము సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసుకుంటామంటున్నారు. బదులుగా మాకు వర్షం పడితే నాలుగు అడుగులు నీళ్లు నిలిచే మాలపల్లి చర్చి వద్ద ప్లాటు ఇస్తామంటున్నారు. బంగారం లాంటి మా భూమిని తీసుకుని ఎక్కడో గుంటలో ఇస్తామంటే ఎలా? రేపు నేను భూమి ఇచ్చినా నాకు ప్లాట్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్క రైతు అయినా ఇల్లు కట్టుకున్నాడా? కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. అక్కడ జనం ఉంటే కదా మా వ్యాపారాలు సాగడానికి? మా బతుకుల్ని కొట్టబాకండి. రాజధాని రాకముందే ఈ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. మేం రాజధానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వం. – రఘునాథ్, రైతు, ఉండవల్లిఇలాగైతే నా అప్పు తీరేదెలా? ఉండవల్లిలో నాకు ఎకరం భూమి ఉంది. ఆ భూమిలో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు కోసం నా భూమిని తీసుకుని ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఏవీ డెవలప్ కాలేదు. గతంలో గజం రూ.70 వేల నుంచి 80 వేలకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రూ.20 వేలకు పడిపోయింది. ఇప్పుడు అది కూడా కొనేవారు లేరు. రోడ్డుకు ఎంత కావాలో అంత ఇస్తామని.. మిగిలిన భూమి అమ్ముకోవడానికి అనుమతి అడిగితే స్పందించడం లేదు. మా అమ్మాయికి ఎనిమిదేళ్ల క్రితం అప్పు చేసి పెళ్లి చేశా. ఆ అప్పు ఇంత వరకూ తీరలేదు. ఇప్పుడు పొలం అమ్ముకోవడానికి కూడా లేకుండా పోయింది. – బుర్రా శ్రీనివాసరావు, రైతు, ఉండవల్లికోర్టును ఆశ్రయిస్తాం మావి విలువగల భూములు. చిన్న సన్నకారు రైతులం అని చెప్పాం. రాజధానికి సహకరించాలన్న ఉద్దేశంతో రోడ్లకు, వాగుకు సహకారం అందించాం. ఇంతటితో ఆగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిగతా భూమిని వదిలేస్తే మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా మా భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేం. ఎందుకంటే మీరు ఇచ్చే గజాలు మాకు చాలవు. మాకు ఇక్కడ ఏ ప్రాజెక్టులూ లేవు. మా గోడు వినిపించుకోకుండా భూసేకరణకు పూనుకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. – నరేష్‌రెడ్డి, రైతు,ఉండవల్లి -
సంక్షేమం.. ఇక సంక్షోభమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సంక్షేమంలో భారీగా కోతలు విధించడానికి ఫ్యామిలీ ప్రయోజనం (బెనిఫిట్) కార్డును అస్త్రంగా ప్రయోగిస్తోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిందే కాక, ఇప్పుడు అర్హులైన లబ్ధిదారులను అనర్హుల పేరుతో జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ పథకాలకు కొత్త నిబంధనలను రూపొందించింది. అంతే కాకుండా పథకాల ద్వారా లబ్ధి కలిగే ప్రయోజనాలకు సీలింగ్ విధించింది. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే సాకుతో పథకాలకు ఎగనామం పెట్టేందుకు కుటుంబాల విభజనకు స్వస్తి పలకనుంది. సూపర్ సిక్స్‌తో పాటు వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులను సైతం అనర్హులుగా తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లుకు రూపకల్పన చేసి చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాల డేటా (సమాచారం) ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హులెవరు.. అనర్హులెవరు.. అనే వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తద్వారా రాష్ట్రంలో కేవలం 10.2 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.4 లక్షల కుటుంబాలుండగా, మిగతా కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవిగా తేల్చారు. ఈ 10.2 లక్షల కుటుంబాల నుంచి కూడా అత్యంత పేద కుటుంబాల జాబితాను తయారు చేయనున్నారు. ఇందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టనున్నారు. అంటే తొలి దశలోనే 94 శాతం కుటుంబాలకు అర్హతే లేదని నిర్ధారించారు. ప్రస్తుత లబ్ధిదారుల ఏరివేతప్రస్తుతం అనర్హులు చాలా మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో పాటు వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కొత్త నిబంధనల మేరకు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించనుంది. వివిధ ప్రభుత్వ పథకాల నుంచి ఏడాదికి 48 వేల రూపాయలకన్నా ఎక్కువ ప్రయోజనం పొందకుండా సీలింగ్ విధించాలని నిర్ణయించింది. అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఏడాదికి 48 వేల రూపాయలు ప్రయోజనం పొందితే ఇక ఆ కుటుంబానికి మరే ఇతర పథకాల ప్రయోజనాలను అందించరు. అంటే పెన్షన్ వస్తే మిగతా ఏ పథకాలు ఆ కుటుంబానికి వర్తింప చేయరు.రాష్ట్రంలోని 1.7 కోట్ల కుటుంబాల్లో అర్హత కలిగిన కుటుంబాలు 10.2 లక్షలే అని స్పష్టం చేస్తున్న ప్రభుత్వ డాక్యుమెంట్.. ఈ డాక్యుమెంట్లో ఉన్న అంశాల్లో ఏ ఒక్కటి వర్తించినా వారు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రజెంటేషన్ డేటా అనుసంధానం పూర్తివిద్యుత్ వినియోగం ఆధారంగా అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే నివాసి ఆధార్ నెంబర్‌తో విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్‌ను అనుసంధానించడాన్ని డిస్కమ్స్ నూటికి నూరు శాతం పూర్తి చేశాయి. పట్టణాల్లో దాదాపు 40 లక్షల పట్టణ ఆస్తి రికార్డుల్లో యజమాని ఆధార్‌తో ఆస్తి ఐడీ అనుసంధానాన్ని ధ్రువీకరించడానికి క్షేత్రస్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏకీకృత కుటుంబ సర్వే పూర్తయ్యింది. పౌరుల జనాభా వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలను ధ్రువీకరించడం కూడా పూర్తయింది. మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం వివిధ పథకాల కోసం అనర్హుల ఏరివేతకు 15 అంశాలను ప్రామాణికంగా ఎంపిక చేసింది. ఈ 15 అంశాల్లో ఏ ఒక్కటి ఉన్నా అర్హుల జాబితా నుంచి ఆ కుటుంబాలను తొలగిస్తారు. మంత్రుల కమిటీ సిఫారసులివీ..⇒ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, రాష్ట్ర పథకాల కోసం ‘కుటుంబం’ నిర్వచనం సిఫార్సు.⇒ కుటుంబాలు పొందగలిగే మొత్తం ప్రయోజనాలపై గరిష్ట పరిమితి కోసం ఒక విధానం సిఫార్సు (సమర్థవంతంగా ప్రభుత్వ నిధుల వినియోగాన్ని నిర్ధారించడం)⇒ పథకాల కోసం సవరించిన ఆర్థిక అర్హత ప్రమాణాల సిఫార్సు. (అర్హత లేని లబ్ధిదారులను మినహాయించి, అవసరమైన లబ్ధిదారులను చేర్చడం. ఉదా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్). ⇒ కుటుంబ డేటాబేస్, కుటుంబ కార్డు వినియోగాన్ని అధికారికం చేయడానికి ఫ్యామిలీ బెనిఫిట్ నిర్వహణ వ్యవస్థ బిల్లు రూపకల్పన (డేటాబేస్‌ను నియంత్రించడానికి, ప్రతిపాదిత కుటుంబ కార్డు వినియోగానికి అథారిటీని నియమించడం).⇒ ప్రయోజన పథకాల రూపకల్పనలో సంస్కరణల సిఫార్సు. (పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడానికి, డేటాబేస్‌లో కృత్రిమ కుటుంబ విభజనను నివారించడం).⇒ ఫ్యామిలీ కార్డ్‌ను అమలు చేయడానికి ‘కుటుంబం’కు అధికారిక నిర్వచనం, ఫ్యామిలీ డేటాబేస్ అండ్ కార్డ్‌కు చట్టపరమైన మద్దతు. -
ఫెయిలైతే టీచర్ల బాధ్యత.. పాసైతే ప్రిన్సిపాల్స్ ఘనత..
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మార్కులు తగ్గితే టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అదే ఉత్తీర్ణత శాతం పెరిగితే ప్రిన్సిపాల్స్‌కు సత్కారాలు.. చంద్రబాబు సర్కారుకు ఇదేం ద్వంద్వనీతి అంటూ బీసీ గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరి«ధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఉత్తీర్ణతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్స్‌ను మంగళవారం విజయవాడలో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం వరకు సరే.. ప్రిన్సిపాల్స్‌ను, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను జ్ఞాపికలతో అభినందించడాన్ని బీసీ గురుకుల టీచర్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ముందు ప్రభుత్వం చేసిన హడావుడిని వారు గుర్తుచేస్తున్నారు.బీసీ గురుకులాల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే సంబంధిత టీచర్లకు షోకాజ్ నోటీçసులు ఇస్తామని, ఉత్తీర్ణత శాతం తగ్గితే విధుల నుంచి తొలగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత నుంచి గురుకులాల కార్యదర్శి మాధవీలత వరకు సమీక్ష సమావేశాల్లో హెచ్చరించారు. పరీక్ష ఫలితాలు వచ్చాక ఉత్తీర్ణత తక్కువ నమోదైన గురుకులాల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తక్కువ ఉత్తీర్ణత ఉన్న గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఉత్తీర్ణత బాగున్న గురుకులాల్లో మాత్రం సంబంధిత టీచర్లను గుర్తించి అభినందించకపోగా.. ఆ మొత్తం ఘనత ప్రిన్సిపాల్స్‌దే అన్నట్లు వారిని సత్కరించడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.రాష్ట్రంలోని 105 బీసీ గురుకులాలకుగాను 32 గురుకులాల్లో మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత వచ్చింది. ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్‌ను పిలిచి అభినందించిన కార్యక్రమానికి తమను కూడా పిలిచి తమ కృషిని గుర్తించి ఉంటే బాగుండేదని టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గినా, ఉత్తీర్ణత లేకపోయినా టీచర్ బాధ్యుడని, మంచి ఫలితాలు సాధిస్తే ప్రిన్సిపాల్ ఘనత అని ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించడం సరికాదని గురుకులాల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
భగ్గుమన్న ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ఒంగోలు సబర్బన్: ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పుపెట్టారు. ధరల పెంపు అమల్లోకి వచ్చాక అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండా కంపెనీలు ఏకపక్షంగా ఫీడ్ ధరలు ఏ విధంగా పెంచుతాయని నిలదీశారు. మేత బస్తాలకు నిప్పుపెట్టి.. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేకుండానే ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.8,420 నుంచి రూ,10,530 వరకు పెంచడాన్ని నిరసించారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఫీడ్ ధరలు పెంచిన కంపెనీల ఏకపక్ష ధోరణిపై కన్నెర్రజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు కనీస గిట్టుబాటు ధరలు కల్పించకపోతే సాగు సమ్మెకు దిగుతామని నరసాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన రైతులు అల్టిమేటం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రొయ్య రైతులు ధర్నా చేశారు. ఫీడ్ కంపెనీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగలేదని.. సోయా మీల్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.35కు తగ్గాయని చెప్పారు. వేట నిషేధ వేళలో ఏటా పెరిగే ఫిష్‌మీల్ ధరలను సాకుగా చూపి ధరలు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వానికి చెప్పకుండా, పెద్దల అనుమతి లేకుండా ఏ విధంగా ఫీడ్ ధరలు పెంచుతాయని సంఘం నేతలు ప్రశ్చించారు. తక్షణం పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరించుకోవాలని, అప్సడా అనుమతి లేకుండా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాగైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం ఆక్వా ఫీడ్ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలిడే ప్రకటించాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘాధ్యక్షుడు గొట్టుముక్కల గాం«దీభగవాన్రాజు మాట్లాడుతూ.. వనామీ రొయ్య ఫీడ్‌పై కేజీకి రూ.8, టైగర్ రొయ్య ఫీడ్‌పై రూ.10 పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముడిసరుకు ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలకు, ఇప్పుడు పెంచాలనే ఆతృత ఎందుకని ప్రశ్చించారు. ప్రభుత్వం కూడా రైతుల కంటే కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కంపెనీలతోపాటు ప్రభుత్వంతోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తొలుత ధరలు పెంచిన కంపెనీలను బహిష్కరించాలని, ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆక్వా సంఘం కార్యదర్శి బోణం చినబాబు, రంగయ్య నాయుడు, జాన్‌రాజు పాల్గొన్నారు. నేడు ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో భేటీ ఆక్వా రైతుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు. అప్సడా చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా పెంచేశాయని ఆరోపించారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశమై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేత ధరల పెంపును అడ్డుకోవాలి మేత ధరల పెంపును అడ్డుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టైగర్ రొయ్యల మేతపై టన్నుకు రూ.10,530, వెనామీ రొయ్యల మేత ధర రూ.8,420 చొప్పున పెంచడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు. ఇప్పటికే వైరస్‌లతో దిగుబడులు రాక, కౌంట్ ధరలు పతనమై అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఈ ధరల పెంపు అశనిపాతంగా మారిందన్నారు. తక్షణమే అప్సడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మేత ధరలను పూర్తిస్థాయిలో ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఆక్వా రైతులతో సంప్రదించకుండా మేత ధరలు పెంచడాన్ని ఏపీæ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, కార్యదర్శి ఎం.హరిబాబు తప్పుబట్టారు. మూడు నెలల్లో రెండోసారి ధరలు పెంచడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా రొయ్య రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన ఫీడ్ ధరలతో పాటు ఫిబ్రవరిలో పెంచిన ధరలను కూడా పూర్తిగా ఉపసంహరింప చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం
సాక్షి, అమరావతి: ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేత ధరలు పెంచడం దారుణమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీదిరి అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని స్పష్టం చేశారు. ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ముడుపులు అందుకుంటూ.. ‘ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. ఆక్వా రైతులను దోచుకుతింటున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫీడ్ కంపెనీల నుంచి ముడుపులు అందుతున్నాయి. అందుకే ధరలను ఏకపక్షంగా పెంచినా అడ్డుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా ధరలను ఆ మేరకు తగ్గించలేదు. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఆక్వా ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించలేదు. ఆక్వా ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు అందుతున్నాయి. ఆక్వా రైతుల కష్టం టీడీపీ దోపిడీ పాలవుతోంది. ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచుతారా? వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వా సిండికేట్ ముడుపుల్లో మంత్రి అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి. ఇప్పటికే కరెంట్ లేక, డీజిల్ ఇవ్వక ఆక్వా రైతులు కుదేలయ్యారు. వారిపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా పరిణమించింది. ధరలను తక్షణం తగ్గించకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమిస్తాం’ అని కన్నబాబు, కాకాణి, అప్పలరాజు హెచ్చరించారు. -
మహా న్యూస్‌కు భారీ నజరానా ఆ వీడియోల కోసం 56.64 లక్షలు..
-
ఆక్వా గొంతు నులి‘మేత’
సాక్షి, అమరావతి: టీడీపీ ‘మేత’ వన్నె పులులు ‘రొయ్య’ రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెత్తనమంతా..‘టీడీపీ’ ఫీడ్ కంపెనీలదే రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, వెనామి రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా రూ.15వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్‌దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్‌ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతోపాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరుమెదపలేని దుస్థితి నెలకొందని సమాచారం. రైతులతో చర్చించకుండానే ధరల పెంపు.. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు.. ఆక్వారంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్స్ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమై, వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిరీ్వర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5–15 శాతానికి తగ్గించగా, కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తగ్గించాలి. కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. నాడు కంటి తుడుపు చర్యగా టన్నుకు ఎమ్మారీ్పపై రూ.4వేలు తగ్గించిన కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పా పెట్టకుండా టన్నుకు మళ్లీ రూ.4వేల చొప్పున పెంచేశాయి. తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్‌పై రూ.12వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.14వేలు పెంపునకు అనుమతినివ్వాలంటూ గతనెల 30న మత్స్యశాఖ కమిషనర్‌కు రొయ్య మేత తయారీ దారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్లతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులిచ్చారు. కానీ స్టేక్ హోల్డర్లతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కలిగిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనమి ఫీడ్‌పై రూ.8,420, టైగర్ ఫీడ్ పై రూ. 10,530 పెంచగా.. మిగిలిన కంపెనీలు వెనమి ఫీడ్‌పై రూ.8 వేలు, టైగర్ ఫీడ్‌పై రూ.10 వేలు చొప్పున పెంచాయి. పెట్టుబడిలో సగానికిపైగా మేతకే.. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు పైగా ఉంది. తాజా పెంపుతో మేతధ రలు పన్నులతో కలిపి రూ.1.15లక్షలకుపైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–24 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారూ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్‌గా మారి దోచేస్తున్నారు. ఏపీ అప్సడా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి లేదు. కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి ధరలు ఒక్కసారిగా పెంచాయి. తక్షణమే ఈ పెంచిన ధరలను తగ్గించాలి. –దుగ్గినేని గోపినాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా కంపెనీలు ఏకపక్ష ధోరణి తగదు ఫీడ్ తయారీ కంపెనీలకు ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా పెట్టుబడి ధరలు పెరుగుతున్నాయే తప్ప రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్రం ద్వారా వివిధ రకాల రాయితీలు పొందుతున్న కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా ఫీడ్ ధరలు పెంచేస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఇది తగదు. – టి.నాగభూషణం, అధ్యక్షుడు, కోనసీమ రొయ్య రైతుల సంఘం -
పొగాకు రైతు పోరుబాట
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నోబిడ్ల వంకతో 70 శాతం పొగాకు బేళ్లను వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహంతో సోమవారం వేలం నిలిపేశారు. చండ్రపాడు, గాడిపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 350 మందికి పై గా రైతులు పొగాకును వేలం కేంద్రానికి తీసుకురా గా అధిక శాతం బేళ్లను తిరస్కరించారు. విషయం తెలిసి రైతు సంఘం నాయకులు కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు.జిల్లా రైతు సంఘం ప్రధాన కా ర్యదర్శి జజ్జర జయంత్ బాబు మాట్లాడుతూ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పొగాకు రైతులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు బ్యారెన్‌కు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఈనెల 18వ తేదీన పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
‘శ్రీవాణి’ సొమ్ములు పచ్చముఠాల పాలు!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 5,000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్‌తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఏప్రిల్ 16న దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండరు విధానంలో చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడమంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఆలయాల నిర్మాణాలను రద్దు చేసి.. శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్య్సకార, బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శకంగా టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయగా 622 గుడుల నిర్మాణం అప్పట్లోనే పూర్తయింది. 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగిలిన 1,724 ఆలయాల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. నిర్మాణాలు మొదలు కాని అన్ని ఆలయాల అనుమతులు రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు 2024 సెపె్టంబరులో దేవదాయ శాఖ అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలుపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలన్న నిర్ణయంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గుడికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పూర్తి పారదర్శకంగా అర్హులకు పనులను అప్పగించిందని గుర్తు చేస్తున్నారు.చందాలు పక్కదారి పట్టే ప్రమాదం.. ఆలయాల నిర్మాణ పనులకు స్థానిక అధికార పార్టీ నేతలకు అప్పగించడం అక్రమాలకు దారి తీస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేందుకు భక్తులు, స్థానికులు ముందుకు వస్తుంటారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో పనులు చేపడితే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్‌బుక్ కుట్రలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై మైన్స్ అధికారులతో ఆకస్మిక దాడులకు పూనుకుంది. సోమవారం మైన్స్ డీడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు రెండు బృందాలుగా చీమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్న సూర్య గ్రానైట్స్ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైటెక్ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు సేకరించారు.అమ్మకాలు ఎంత? ఉత్పత్తి ఎంత? అంటూ అక్కడి కార్యాలయంలోని రికార్డుల్లో వివరాలను మైన్స్ అధికారులు సేకరించారు. రామతీర్థం కేంద్రంగా వైఎస్సార్సీపీతో పాటు టీడీపీకి చెందిన వారికి, ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి గ్రానైట్ క్వారీలున్నాయి. చీమకుర్తి పరిసరాల్లో ఉన్న వందలాది క్వారీల వైపు ఏనాడూ తొంగి చూడని మైన్స్ అధికారులు కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై మాత్రమే దాడులు నిర్వహించటం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014–19లో కూడా అప్పటి అధికార టీడీపీకి అనుకూలంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మలచుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. సూర్య గ్రానైట్ క్వారీని రెండేళ్లు మూసేసి ఆర్థికంగా దెబ్బతీశారు. -
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప నీకు ఇంకేం వచ్చు? చేతకాని పాలనా.. అసమర్థుని పాలనా..
-
రైతులకేమో చెరువుల్లో ఇస్తూ.. సన్నిహితులకేమో మంచి ప్లాట్లా?
-
సమీకరణకు భూములివ్వం
తాడేపల్లి రూరల్ : చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరని ద్రోహం చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలుగా విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని, అందరూ ఇవ్వాల్సిందేనని దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఎంత మాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒకతాటిపైకి వచ్చి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తున్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వరరెడ్డి, జొన్నా శ్రీనివాసరావు, గంటు బాలాజీ, పెద్దిశెట్టి వీరస్వామి, శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగరాజు, శివకోటేశ్వరరావు, అశోక్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘మా తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి, తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రైతు రైతే. రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో 2015–2019 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించాం’ అన్నారు. అవసరానికి మించి భూమి ఎందుకు?మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుండి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బంది అని, విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టిందన్నారు. ‘రాజధానికి రైతులు ఎవరూ వ్యతిరేకం కాదు. అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వారు దోపిడీ చేసిన దాంట్లో పాతిక వంతు ఖర్చు పెట్టినా ప్రభుత్వ అవసరాలను అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చు.కనీసం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. ఇలాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములను వారి ఆడపిల్లకు కట్నాలుగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమైనా మనం స్పందించాలి. ఈ నెల 20వ తేదీన ఉండవల్లిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పాలి. ఆ తర్వాత ఆ అభిప్రాయాలను అర్జీల రూపంలో అధికారులకు, ప్రభుత్వానికి అందజేద్దాం’ అని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సీపీఎం, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకు వెళదామని రైతులు నిర్ణయించారు. -
సీఎం సన్నిహితులకేనా జాక్‌పాట్?
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనూషకు వెస్ట్ బైపాస్ పక్కనే నివాస, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్‌పాట్ తగిలిందా.. మాకు తగలదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలుతోపాటు.. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఎకరానికి జరీబు భూమైతే 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు.. మెట్ట భూమైతే 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లే అవుట్లలో సీఆర్డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. బెజవాడ రమేషా.. మజాకా! తుళ్లూరు మండలం మందడంకు చెందిన బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబరు 496/4, 387/2, 143, 22/2, 40, 21/1, 88, 2బీ/4, 139/ఏ, 512/2, 3బీ–0, 6బీ, 455/1ఏ, 131/1, 272బీ, 54బీ/4, 59/ఏ, 57/బీ, 73/2, 29/1, 59/బీ, 136, 135/2, 33/4లలో బెజవాడ రమేష్, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రాహ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చింది. ఇందుకుగానూ ఏటా వారి కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియా(ప్ర«దాన రాజధాని ప్రాంతం)లో సచివాలయానికి ఎదురుగా నాలుగు రోడ్ల జంక్షన్ (కూడలి)లో బెజవాడ రమేష్, మధులకు లాటరీ ద్వారా 2,500 గజాల వాణిజ్య ప్లాటును సీఆర్డీఏ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్సార్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకు ఇచ్చారు.బెజవాడ రమేష్, మధుకు కేటాయించిన 2500 గజాల వాణిజ్య ప్లాట్లు బిట్స్ పిలానీ విద్యా సంస్థకు కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సీఆర్డీఏ కేటాయించింది. సచివాలయానికి కూతవేటు దూరంలో 25 మీటర్లు, 17 మీటర్ల రెండు రోడ్ల కూడలిలలో 4,500 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్‌కు లాటరీ ద్వారా ఇచ్చింది. ఎన్–6 ప్రధాన రహదారికి ఆనుకుని 5,940 గజాల చొప్పున పక్కపక్కనే రెండు వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే రెండు రోడ్ల కూడలిలో 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాటును, సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకుని 2,400 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్‌పాట్ తగిలిందని.. అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.కీలక ప్రాంతాల్లో రాధాకృష్ణ కొడుకు, కూతురుకు ఆరు ప్లాట్లు రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలు మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని నీరుకొండలో సర్వే నెంబరు 71, 72, 73లో 5.39 ఎకరాలు కొనుగోలు చేసి.. 2016 అక్టోబర్ 30న రిజి్రస్టేషన్ చేయించుకుని.. భూ సమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించారు. ఇందుకుగాను ఇతర రైతులలానే వారికి సీఆర్డీఏ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్కు పక్కనే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు.. కూతురు అనూషకూ అక్కడే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు దక్కాయి. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరికీ 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ ఆరు ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం. కోరుకున్న చోట ధనేకులకు ప్లాట్లుధనేకుల సుబ్బారావు తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెంలో సర్వే నెంబరు 66/1ఏలో 0.47, నేలపాడులో సర్వే నెంబరు 95/ఏలో 0.50, 9/ఏలో 0.86, 93/1సీలో ఎకరం, 66/2లో 0.53, 93/1ఏలో 5.53, 93/1బీ 0.60, 98లో 0.10 వెరసి 9.59 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకుగాను వారికి సీఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటుచేసుకుంది. «కొత్తగా నిర్మింస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్ సర్కిల్ దగ్గర ఎన్10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల నివాస ప్లాటు, సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మింస్తున్న ప్యాలెస్‌కు సమీపంలో ఎన్11 ప్రధాన రహదారికి ఆనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాటును, హైకోర్టుకు కూతవేటు దూరంలో ఎన్9 రోడ్డు పక్కనే 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటును ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సీఆర్డీఏ లాటరీ ద్వారా కేటాయించింది. ఇదిగో ప్లాట్ల మాయాజాలం! రైతుల్లో ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాల(217 చదరపు కిలోమీటర్లు)ను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో 34,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో.. నాలుగు రోడ్ల కూడలి.. ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ ప్రజా ప్రతినిధుల మద్దతు ఉన్న వారికే దక్కుతున్నాయని.. తమకు పల్లపు ప్రాంతం, చెరువులు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురుతోపాటు బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ నేతల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో వేలంలో దక్కిన ప్లాట్లను వారు ఎత్తిచూపుతున్నారు. -
ప్రజారోగ్యంపై బాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులతో పరుగులు పెట్టిన వైద్య శాఖను ప్రస్తుతం ఐఏఎస్‌ల కొరత వేధిస్తోంది. ఇప్పుడీ శాఖను కేవలం నలుగురు ఐఏఎస్‌లతోనే పరిమితం చేశారు. నలుగురిలో ఒకరైన జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ సోమవారం నుంచి జూన్ 6 వరకు లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణకు వెళ్తున్నారు. దీంతో ఆయన నిర్వర్తిస్తున్న ఆయుష్ కమిషనర్, ఏపీ శ్యాక్స్ పీడీ బాధ్యతలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్‌కు ఎఫ్ఏసీ ఇస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇప్పటికే ఆరోగ్య శాఖ కమిషనర్, ఐపీఎం కమిషనర్, డైరెక్టర్, ఎన్హెచ్ఎం డైరెక్టర్ బాధ్యతలను వీరపాండియన్ నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో రెండు శాఖలను కేటాయించారు. మరోవైపు ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఆరోగ్యశ్రీ, ఔషధ నియంత్రణ డీజీ స్థానాల్లో పూర్తి స్థాయి అధికారులు లేరు. గత కొద్ది నెలలుగా ఇన్చార్జులే దిక్కయ్యారు. ఉన్న కొందరు ఐఏఎస్‌లకే రెండు, మూడు విభాగాల బాధ్యతలు ఇవ్వడంతో పర్యవేక్షణ లోపించి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. -
2025–26 బాబు సర్కార్ బడ్జెట్‌ను కడిగేసిన కాగ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంలో చూపించే ఉత్సాహం.. ఆస్తుల కల్పనలో, రాష్ట్రాభివృద్ధిలో చూపించడం లేదు. 2025–26 బడ్జెట్‌కు సంబంధించి కాగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఇలాంటి రాష్ట్ర ఆర్థిక ప్రతికూల ముఖచిత్రాన్నే కాగ్ గణాంకాలు చూపించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగిపోయాయి. బడ్జెట్ అంచనాల మేరకు ఆస్తుల కల్పన వ్యయం భారీగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపెట్టడం లేదు. అమ్మకం పన్నుతో పాటు ఇతర పన్నులు, డ్యూటీలు రాబడుల్లో తిరోగమనంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. -
మంత్రిగారి వియ్యంకుడి దందా.. ధాన్యం దోపిడీకి ‘పట్టాభి’షేకం
‘‘గుంటూరు జిల్లాలో వ్యవసాయాధికారుల అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 21 మిల్లులకు సీఎంఆర్ ఇచ్చాం. ఇందులో తొమ్మిది మిల్లులు బ్యాంకు గ్యారంటీలు కట్టలేదు. అందుకే, ధాన్యం కొనుగోళ్లలో స్థానిక మిల్లుల సామర్థ్యం సరిపోదు. పెద్దాపురానికి చెందిన పట్టాభి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ బల్‌్కగా సీఎంఆర్ ధాన్యాన్ని తరలించేందుకు విజ్ఞప్తి చేసింది.ఇందులో 50శాతం రవాణా ఖర్చులు ఆ సంస్థే భరిస్తుంది’’ అంటూ గుంటూరు పౌరసరఫరాల సంస్థ అధికారి జిల్లా జేసీని తప్పుడు లెక్కలతో మోసగిస్తూ ఇచ్చిన నివేదిక ఇది. దీనిని నమ్మిన జేసీ ధాన్యం అంతర్జిల్లా రవాణాకు అనుమతించారు. విచిత్రం ఏమంటే.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో కొనుగోలు చేసింది కేవలం 91వేల టన్నులు మాత్రమే! ఇందులో పట్టాభి మిల్లులకు తరలించింది దాదాపు 22వేల టన్నులు. ఇక్కడ పథకం ప్రకారమే అంతరజిల్లా రవాణాకు అనుమతిచ్చి పట్టాభిని రంగంలోకి దింపి ధాన్యం కొనుగోళ్లలో దోచిపెట్టారనేది స్పష్టంగా తెలుస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లలో భారీగా మద్దతు ధర దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. కూటమి అనుకూల మిల్లర్లు, దళారుల సిండికేట్ చేతిలో ధాన్యాన్ని పెట్టి రైతుల నోటిలో మట్టికొడుతున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా సిండికేట్ చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. కాదంటే.. రైతుకు ధాన్యం పట్టుబడికి గోనె సంచులు అందవు.. రవాణాకు వాహనాలు రావు.. అసలు ప్రభుత్వ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడరు. అదే దళారీ చెప్పిన రేటుకు ఓకే అంటే మాత్రం క్షణాల్లో ధాన్యం మిల్లుకు చేరిపోతుంది. గడిచిన ఖరీఫ్‌లోనూ.. ప్రస్తుత రబీలోనే ఇదే సీన్ రిపీట్ అవుతోంది.ఇక్కడ 75కిలోల బస్తా ధాన్యం ఏ–గ్రేడ్‌కు రూ.1791, సాధారణ రకానికి రూ.1,777 చెల్లించాల్సిన ప్రభుత్వం.. రైతులను గాలికొదిలేయడంతో దళారులకు బస్తా రూ.1,100 నుంచి రూ.1,300కు విక్రయించుకోక తప్పనిస్థితి రైతులది. ఈ లెక్కన చూస్తే ఒక టన్నుకు ఏకంగా రూ.6,500 నుంచి రూ.9,300 వరకు నష్టపోతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమంటే.. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, సిండికేట్ మిల్లర్లు.. అదే ధాన్యాన్ని రైతు పేరుతో పూర్తి మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకోవడం విస్తుగొలుపుతోంది. గడిచిన ఖరీఫ్‌లో ప్రభుత్వం రూ.11వేల కోట్ల విలువైన 49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఇందులో మొత్తం దళారులే రాజ్యమేలడంతో దాదాపు రూ.3,100 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల మద్దతు ధరను కొట్టేసినట్టు స్పష్టమవుతోంది. పట్టాభికే ‘పట్టం’!ఓ మంత్రి వియ్యంకుడికి చెందిన పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కేంద్రంగా ధాన్యం సిండికేట్ దందా నడుస్తోంది. ప్రభుత్వంలోని కీలక పదవిలో ఉన్న మంత్రికి వియ్యంకుడు కావడం, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో పట్టాభి ఇండస్ట్రీస్ గడిచిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ఏకఛత్రాధిపత్యం సాగించింది. ఎన్నడూ సీఎంఆర్ వైపు కన్నెత్తి చూడని పట్టాభి ఇండస్ట్రీస్ ఖరీఫ్‌లో మాత్రం ధాన్యం సేకరించింది. దీనివెనుక భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమవుతోంది.పెద్దాపురంలో ఉన్న పట్టాభి ఇండస్ట్రీస్‌కు అనుబంధ సిండికేట్‌గా ఏర్పడిన ఐదారు మిల్లులు ఏకంగా 300 కిలోమీటర్లు దాటి బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏకంగా రూ.230 కోట్ల విలువైన లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైల్వే వేగన్ల ద్వారా తరలించడం గమనార్హం. స్థానికంగా మిల్లర్లకు సామర్థ్యం లేదనే సాకుతో అంతర్జిల్లా ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ తెరదీసింది.పైగా పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ స్వయంగా వచ్చి తాము సీఎంఆర్ ఇస్తే ధాన్యాన్ని సొంత ఖర్చులతో అంతర్ జిల్లాకు తరలిస్తామని లేఖ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం కొసమెరుపు. వాస్తవానికి స్థానికంగా మిల్లులు లేని ఏజెన్సీ ప్రాంతాల నుంచి/విపత్కర పరిస్థితుల్లో ధాన్యం వేగంగా తరలించేందుకు మాత్రమే అంతర్జిల్లా రవాణా చేస్తారు. ఇలా ఏటా ఖరీఫ్‌లో 60వేల టన్నుల వరకు మాత్రమే అంతర్ జిల్లా రవాణా ఉంటే.. గడిచిన ఖరీఫ్‌లో మాత్రం ఏకంగా 2 లక్షల టన్నులు తరలిపోవడం గమనార్హం. రబీలో సంచులు ఎందుకు లేవు?ఖరీఫ్ గాయం మానకముందే రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. చంద్రబాబు హయాంలో సంపూర్ణ మద్దతు ధర చూడలేమన్న నైరాశ్యానికి వచ్చేశారు. పంట కోసి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో ఆవేదనతో రైతులు రోడ్లపైకి వస్తున్న దుస్థితి. పంట ఒబ్బిడి చేసుకునేందుకు కనీసం ప్రభుత్వం గోనె సంచులు కూడా అందించట్లేదు. దళారుల మాట కాదని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి. గత్యంతరం లేక కోసిన పంటను కోసినట్టు రూ.1,100తో అమ్ముకుని రైతుల నష్టాలపాలవుతున్నారు. పైగా ఇటీవల అకాల వర్షాలకు పంట తడవడంతో ముక్క విరుగుడు సమస్య రైతులను నిలువునా ముంచేస్తోంది. పట్టాభి సిండికేట్ మిల్లులకు లక్ష టన్నులు!చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం గడిచిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో అంతర్జిల్లా రవాణా పేరిట భారీ దోపిడీకి తెరదీసింది. ముందస్తు ప్రణాళిలో భాగంగా పట్టాభి సిండికేట్ రైతుల నుంచి ధాన్యాన్ని కారుచౌకగా కొట్టేసింది. మొత్తం 213 మిల్లులకు రూ.468 కోట్ల విలువైన రెండు లక్షల టన్నుల అంతర్జిల్లా ధాన్యం తరలిస్తే అందులో ఒక్క పట్టాభి అనుబంధ సిండికేట్ ఐదారు మిల్లులకే ఏకంగా లక్ష టన్నుల ధాన్యం చేరడం విస్తుగొలుపుతోంది. మద్దతు ధర 75కిలోల బస్తాకు రూ.1,777 ఉంటే రైతుల చేతిలో రూ.1,100 పెట్టి ధాన్యం దోచేసింది.ఇలా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఏకంగా లక్ష టన్నులపైగా ధాన్యాన్ని సేకరించి ఆ తర్వాత పథకం ప్రకారం స్థానిక మిల్లులకు ఎక్కువ సీఎంఆర్ సామర్థ్యం లేదనే సాకుతో పెద్దాపురం మిల్లులకు తరలించింది. ఇది మిల్లర్ల అసోసియేషన్‌లో భారీ గందరగోళానికి తెరదీయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టాభి సిండికేట్‌కు లబ్ధి చేకూర్చేందుకు కుయుక్తులు పన్నింది.ఇందులో భాగంగానే బియ్యం అక్రమ రవాణా పేరుతో కాకినాడ పోర్టులో హడావుడి చేసి బొక్కబోర్లా పడింది. పైగా ఎక్స్‌పోర్ట్స్ వ్యాపారాన్ని సీజ్ ద షిప్ పేరుతో తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది బియ్యం వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనడం మానేశారు. ఇదే అదునుగా పట్టాభి భారీ సిండికేట్ అవతారమెత్తి మొత్తం ధాన్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్థానిక మార్కెట్‌ను కబ్జా చేసింది. పైగా ఎక్స్‌పోర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఎంఆర్ ద్వారా రెట్టింపు చేసుకోవటం గమనార్హం. -
సర్దుబాటు చేస్తారా? చేతులెత్తేస్తారా?
⇒ ఇతని పేరు జర్సింగి పొట్టన్న(43). అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల గిరిజన బాలుర గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న విధినిర్వహణలో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. సుమారు 17 ఏళ్లు అవుట్ సోర్సింగ్ టీచర్‌గా సేవలు అందించిన అతనికి ఉద్యోగ భద్రత లేకపోగా.. అతని కుటుంబానికి ప్రభుత్వం ఆసరా కల్పించలేదు. ⇒ ఇతని పేరు బి.చంద్రబాబు నాయక్. వైఎస్సార్ జిల్లా కడప గిరిజన బాలుర గురుకులంలో ఏడేళ్లు పీఈటీగా సేవలు అందించారు. ఈ ఏడాది మార్చి 10న బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు.సాక్షి, అమరావతి: వీరేకాదు.. ఇంకా పీలేరు గురుకులంలో ఇంగ్లిష్ టీచర్‌గా ఏడేళ్లు సేవలు అందించిన ప్రకాశ్‌బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. మారేడుమిల్లి గురుకులంలో పదేళ్లుగా సేవలు అందిస్తున్న చెక్క అబ్బాయిరెడ్డి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇలా గడిచిన నాలుగు నెలల్లో దాదాపు ఆరుగురికిపైగా గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లు మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు ఆధారం కోల్పోయాయి. అనారోగ్యం తదితర కారణాలతో అవుట్ సోర్సింగ్ టీచర్ల బతుకులు తెల్లారిపోతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కనీస కనికరం చూపడంలేదు.మృతి చెందిన వారికి ఇస్తామన్న రూ.15వేలు మట్టి ఖర్చులు కూడా విదల్చలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మట్టి ఖర్చులతోపాటు మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారని గిరిజన అవుట్ సోర్సింగ్ టీచర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడంతో దాదాపు 8 నుంచి 15ఏళ్లుగా సేవలు అందిస్తున్నవారి జీవితాలు గాలిలో దీపంలా మారాయి. ఎన్నికల హామీని పూర్తిగా పక్కనపెట్టి.. రాష్ట్రంలోని 191 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు పనిచేసేవారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాలతో వారిలో కొందరు ఉద్యోగాలు మానేయడంతో ప్రస్తుతం 1,143 మంది పని చేస్తున్నారు. వారి పోస్టులను ఇటీవల డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఆ పోస్టుల్లో 1,118 మంది రెగ్యులర్ టీచర్లు విధుల్లోకి చేరడంతో, అవుట్ సోర్సింగ్ టీచర్లు ఉద్యోగం కో ల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. వీరి లో ప్రధానంగా జోన్–1లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన అవుట్సోర్సింగ్ టీచర్లే ఎక్కువమంది ఉండడం గమనార్హం.ఏప్రిల్ 24తో ముగిసిన కొలువు.. అవుట్సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో వీరికి హామీ ఇచ్చారు. ఇదే విషయమై అనేక పర్యాయాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అధికారులతో అవుట్ సోర్సింగ్ టీచర్ల యూనియన్ నేతలు చర్చలు జరిపినా కనీస కనికరం చూపడంలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 2024 నవంబర్ నుంచి దాదాపు 45 రోజులపాటు శాంతియుతంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు.డీఎస్సీలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసినా మీకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేస్తామని, ఉద్యోగ భద్రత కలి్పస్తామని మరోమారు ప్రభుత్వ పెద్దలు చర్చల సందర్భంగా మాట ఇవ్వడంతో ఆందోళన విరమించి విధుల్లోకి చేరారు. తీరా.. ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని, హామీలు గాలికి వదిలేసి తమను రోడ్డుపైకి పడేసిందని వాపోతున్నారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్న వారిని కాంట్రాక్ట్ పద్దతిలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సూచించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.గిరిజన గురుకులాల్లో దాదాపు 10 నుంచి 18 ఏళ్లుగా అడవి బిడ్డలకు అక్షర జ్ఞానం అందించిన వారికి ఏప్రిల్ 24వ తేదీతో కొలువు ముగిసింది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్‌లో వారిని రెన్యూవల్ చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొనసాగించే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. -
ఇలాంటి వాడిని అల్లుడు ఎలా చేసుకున్నావయ్యా.. చేతకానోడు ముఖ్యమంత్రి అయ్యాడు!
-
స్థానిక సంస్థల సొమ్ముతో సర్కారు షో
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,026 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటోంది. నిధులు వచ్చి మూడున్నర నెలలైనా స్థానిక సంస్థలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత గరిష్టంగా పది పనిరోజుల్లో ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జనవరి 29న రూ.410 కోట్లు, ఫిబ్రవరిలో మరో రూ.616 కోట్లు విడుదల చేసింది.ఈ నిధులను 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్‌లకు, పది శాతం జిల్లా పరిషత్‌లకు ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి కూడా మార్చి నెలాఖరుతో ముగిసింది. ఏప్రిల్ 2వ తేదీతో గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. అయినప్పటికీ ఆ నిధులు నేటికీ స్థానిక సంస్థలకు ఇవ్వలేదు. రెండేళ్లుగా ఇదే తీరు.. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఇంతకు ముందు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా నెలల తరబడి స్థానిక సంస్థలకు జమ చేయలేదు. 2025–26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.1,026 కోట్లను గత అక్టోబర్‌లో కేంద్రం విడుదల చేసింది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర నెలల అనంతరం ఈ ఏడాది జనవరి 18న స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ⇒ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను కేంద్రం 2024 సెపె్టంబర్లో విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు నెలల తర్వాత నవంబర్‌లో ఆ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ⇒ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులు రూ.1,121 కోట్లను 2024 డిసెంబర్లో కేంద్రం విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల తర్వాత 2025 సెపె్టంబర్లో స్థానిక సంస్థలకు ఇచ్చింది. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత నిధులు రూ.998 కోట్లను కేంద్రం 2024 మార్చి నెలాఖరులో విడుదల చేసింది. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ నిధులను స్థానిక సంస్థలకు జమ చేయలేదు. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీనే బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ సంవత్సరం ఆగస్టు వరకు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. -
దళారుల జేబులు నింపడానికి మా పొట్టకొడుతున్నారు..
-
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు తగ్గడంతో కేంద్రం ఈ పథకంలో రాష్ట్రానికి నిధుల కేటాయింపును తగ్గించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో కేంద్రం పీఎంజీఎస్‌వై పథకానికి రూ.17,191 కోట్లు కేటాయించగా.. రాష్ట్రానికి కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ పథకానికి కేంద్రం కేటాయించే నిధుల్లో 60 శాతం కేంద్రం గ్రాంట్ కాగా, రాష్ట్రం వాటాగా 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఈ పథకానికి దేశం మొత్తానికి కేంద్రం చేసిన కేటాయింపుల్లో ఒకటిన్నర శాతం నిధులను కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. మార్చి నెలాఖరుతో ముగిసిన గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యం మేరకు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదని కేంద్రం ఈ ఏడాది నిధుల కేటాయింపులు తగ్గించినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సగటు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వ కాలంలో సగానికి సగం తగ్గిపోయింది.వైఎస్ జగన్ పాలనలో పీఎంజీఎస్‌వై ద్వారా సగటున ఏడాదికి 900 కిలో మీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం జరగగా... చంద్రబాబు పాలనలో సగటున ఏడాదికి 435 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే... 2019–24 మధ్య కరోనా విపత్తు సమయం మినహా 2021 మార్చి నుంచి 2024 మార్చి వరకు మూడేళ్లలో 2,701 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయింది. అదే చంద్రబాబు హయాంలో గత రెండేళ్లలో (2024–25, 2025–26) కేవలం 871 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1,282 కి.మీ కొత్త రోడ్ల నిర్మాణం కొనసాగగా, 2022–23లో 1,050 కి.మీ రోడ్ల నిర్మాణం జరిగింది. 2023–24 ఏడాదిలో 369 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2024–25లో 387 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తవగా, గత 2025–26 ఏడాదిలో 484 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.పీఎం – జన్మన్లో మరో రూ.140 కోట్లు కేటాయింపు పీఎం– జన్మన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మరో రూ.140 కోట్లు, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కార్యక్రమం కింద నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.90 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ పథకాల ద్వారా చేపట్టే రోడ్ల నిర్మాణానికి కేంద్ర వాటాగా 60 శాతం, రాష్ట్ర వాటాగా 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఫీజులు కడితేనే ‘పరీక్ష’.. చదువులు చతికిల!
‘‘ఫైనలియర్ పరీక్ష దరఖాస్తు నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చేవరకూ మేం ఎదురు చూడలేం. ఫీజు కడితేనే చివరి ఏడాది పరీక్షలు, ప్రాజెక్టు సబ్మిషన్కు వెళ్లనిస్తాం..!’’ విశాఖలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ ప్రముఖ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం అల్టిమేటం ఇదీ! పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తమకు ప్రభుత్వం చెల్లిస్తుందని.. విద్యార్థులు కట్టాల్సింది ‘సున్నా’ అని అడ్మిషన్ సీటు అలాట్మెంట్ లెటర్లో చూపించిన కాలేజీ యాజమాన్యం.. ప్రస్తుతం ఫైనలియర్ విద్యార్థులు రూ.50 వేల చొప్పున బకాయిలు కట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఒక్క విశాఖే కాదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు సర్కారు అటకెక్కించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇదే! చరిత్రలో ఎన్నడూ లేనంత బకాయిలు పేరుకుపో వడం కూటమి పాలనలో దిగజారిన విద్యారంగం పరిస్థితికి నిదర్శనం. సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను మిథ్యగా మార్చేసింది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యా నాణ్యత పూర్తిగా దిగజారింది. పిల్లల చదువులు ఆగిపోతుండగా.. కాలేజీలు దివాళా తీసే దుస్థితి దాపురించింది. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో పేద కుటుంబాలు ఆర్థిక భారంతో చితికిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు. అటు కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒకవేళ ఎలాగోలా రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. దీంతో విద్యార్థుల చదువులు చెదిరిపోతున్నాయి. దీనంతటికీ కారణం.. చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఫీజు బకాయిలు పెట్టడమే. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున మొత్తంగా 9 క్వార్టర్లకు రూ.6,300 కోట్లు ఫీజుల బకాయిలతోపాటు రెండేళ్లుగా వసతి దీవెన బకాయిలు రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం అరకొరగా విదిలిస్తోంది. ఫీజులు, వసతి దీవెన కింద చంద్రబాబు సర్కార్ ఇప్పటికే రూ.6,100 కోట్లు బకాయిలు పెట్టింది. ఇక దీనికి అదనంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి క్వార్టర్ కింద రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు, వసతి దీవెన కోసం రూ.3,900 కోట్లు అవసరం. అంటే పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.10,700 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.2,766 కోట్లు! నమ్మించి నయ వంచన..ఒకవైపు ఫీజులను తొక్కిపెట్టిన చంద్రబాబు సర్కారు మరోవైపు కనికట్టు చేసింది. రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్టు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వోలు) ఇచ్చి మొత్తం అప్పులు తీర్చేసినట్లు ప్రచారం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో గొప్పలు చెప్పుకున్నారు. నెలలు గడిచినా కళాశాలల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఇదేమిటని అడిగితే చావుకబురు చల్లగా చెప్పింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55 శాతం వడ్డీ రేటుతో అప్పు తెచ్చి, ఆ డబ్బులిస్తామని.. అయితే ముందుగానే వడ్డీ మినహాయించుకుంటామని మెలిక పెట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ పోరాటానికి పిలుపు ఇవ్వడం.. కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలకు నిరాకరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు రెండు విడతల్లో రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతాది ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగంగానే కాలేజీలకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సమాచారం అందడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నాయి.వర్సిటీల నిధులు దారి మళ్లింపుప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా నిధులను దారి మళ్లించిన బాబు సర్కారు వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. తాజాగా మరో రూ.300 కోట్లు కూడా లాగేసుకుంది. మొత్తం రూ.1,500 కోట్లను వర్సిటీల నుంచి ప్రభుత్వం తన సొంత అవసరాల నిమిత్తం లాగేసుకుంది. దీంతోపాటు ఉన్నత విద్యా మండలి నిధులు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేçÜుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు ఆస్రే్టలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనావిుక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు.ఉన్నత విద్యపై వైఎస్ జగన్ హయాంలో రూ.18,663.44 కోట్లు వ్యయంవైఎస్సార్సీపీ హయాంలో కరోనా విలయ తాండవం చేసినా ఐదేళ్లూ ఫీజుల పథకాన్ని సజావుగా కొనసాగించారు. అత్యంత పారదర్శకంగా తల్లుల ఖాతాల్లో ఫీజుల డబ్బులు జమ చేశారు. విద్యార్థుల శ్రేయస్సును కాంక్షిస్తూ గత ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. వైఎస్సార్సీపీ పాలనలో ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. గతంలో చంద్రబాబు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లను కూడా చెల్లించి చిత్తశుద్ధిని చాటుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులను పెండింగ్‌లో పెట్టడంతోపాటు ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. -
అన్నదాతలకు విత్తన కష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలకు విత్తన భరోసా కరువైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి తొలి ఏడాదిలోనే మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తన పంపిణీలోనూ చేతులెత్తేస్తోంది. సబ్సిడీలో అడ్డగోలుగా కోతలుపెడుతున్న ప్రభుత్వం అదునుకు విత్తన సరఫరా చేయకుండా రైతులను ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేలా చేస్తోంది. ఫలితంగా నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.మరోవైపు విత్తన సరఫరాదారులకు రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం, గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని మొక్కుబడి తంతుగా మార్చడంతో సబ్సిడీ విత్తన పంపిణీ అగమ్యగోచరంగా తయారైంది. సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలకు ఒడిగడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీలో అడ్డగోలు కోత ముందస్తు ఖరీఫ్‌కు వెళ్తేనే.. పంటల్ని వైపరీత్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు చెబుతుండగా.. ప్రభుత్వం అదునులో విత్తనం సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచగా.. రూ.268 కోట్ల సబ్సిడీతో 5.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేసింది. రబీ 2023–24 సీజన్లో జగన్ సర్కారు రూ.131.36 కోట్ల సబ్సిడీతో 3.27 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేస్తే రబీ 2024–25 సీజన్లో చంద్రబాబు సర్కార్ కేవలం రూ.51.92 కోట్ల సబ్సిడీతో 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేసింది.ఖరీఫ్–2025లో 6.32 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా.. కేవలం రూ.163 కోట్ల సబ్సిడీతో 4.23 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగలిగారు. రబీ–2025–26 సీజన్లో సబ్సిడీలో మరింత కోత పెట్టడంతో కేవలం రూ.40 కోట్ల సబ్సిడీతో 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. అదునుకు అందని విత్తనం రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39 లక్షల ఎకరాల్లో వరి, 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 9.50 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్దేశించిన సాగు లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల వారీగా విత్తనాల కోసం ఇండెంట్ సేకరిస్తారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో ఉత్పత్తయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన విత్తనాలకు టెండర్లు పిలుస్తారు. సేకరించిన విత్తనాలను తొలుత ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి సీజన్‌కు ముందుగానే రైతు సేవా కేంద్రా(పూర్వపు ఆర్బీకే)ల్లో అందుబాటులో ఉంచేవారు.ఏటా ఏప్రిల్‌లో పచ్చి రొట్ట విత్తనాలు, మే 15న వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, జూన్ 15 నుంచి ఇతర విత్తనాలు పంపిణీ చేపడతారు. కానీ.. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో టెండర్లు ఖరారు చేయకపోవడం, అదునుకు విత్తనాలను అందుబాటులో ఉంచలేకపోవడం వంటి కారణాలలో రైతుల్లో అత్యధికులు ప్రైవేటు విత్తన వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేశారు. అవి నాసిరకం కావడంతో పంటలు దెబ్బతిని, ఆశించిన దిగుబడులు రాక నష్టపోయారు. ఖరీఫ్‌లో పచ్చిరొట్ట, వేరుశనగ, రబీలో పప్పు శనగ విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఖరారు కాని వేరుశనగ టెండర్లు రానున్న ఖరీఫ్–2026 సీజన్లో విత్తన సబ్సిడీని రూ.179 కోట్లకు పరిమితం చేయడంతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. ఆరి్థక శాఖ విత్తనాలకు సబ్సిడీ అవసరమా అనే ధోరణితో ఉండటంతో అధికారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌లో ఏటా దాదాపు లక్ష క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచగా.. 2019–24 మధ్య ఐదేళ్లలో ఏటా సగటున 80 వేల క్వింటాళ్లకు తక్కువ కాకుండా రైతులకు సరఫరా చేశారు. అలాంటిది ఖరీఫ్–2025లో అతికష్టంపై 58 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు.ప్రస్తుత ఖరీఫ్–2026లో 90 వేల టన్నులు అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, అందులో కనీసం 50% కూడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులు ఆలస్యంగా టెండర్లు ఖరారైనప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో ఆర్ఎస్కేల్లో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో లేవు. ఈ సీజన్లో ఏటా 3.80 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయగా.. ఇప్పుడు అడ్డగోలు కోతలతో విత్తన సరఫరాను కుదించేస్తున్నారు. ఖరీఫ్–2025లో అతికష్టంపై 1.93 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేయగా.. ఈ ఏడాది 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం టెండర్లు పిలిచారు.సీమలో వేరుశనగ కనుమరుగువేరుశనగ విత్తన సరఫరాలో ప్రభుత్వం కోత పెట్టడం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వేరుశనగ అధికంగా సాగవుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 16 లక్షల నుంచి 18.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేది. గడచిన రెండేళ్లలో సాధారణ సాగులో 50 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. 2024 ఖరీఫ్‌లో 14.80 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. 6.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఖరీఫ్–2025లో కేవలం 4 లక్షల ఎకరాల్లోనే సాగైంది. వర్షాభావ పరిస్థితులకు తోడు చంద్రబాబు సర్కారు నిర్వాకమే సాగు తగ్గిపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. సకాలంలో విత్తనాల సరఫరా లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక, వాతావరణం అనుకూలించక వేరుశనగ సాగుకు సీమ రైతులు దూరమయ్యారు. -
చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు
-
పవన్ పరువు పాయే.. చిట్టచివరన అటవీ.. పర్యావరణ శాఖ
-
పవన్ కళ్యాణ్ శాఖకి చిట్ట చివరి ర్యాంక్
సాక్షి, విజయవాడ: పనీతీరు ర్యాంకుల్లో పవన్ కల్యాణ్ వెనుకబడ్డారు. ఆయన శాఖకి చిట్ట చివరి ర్యాంక్ లభించింది. కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ర్యాంక్‌లలో అటవీ, పర్యావరణ శాఖ చివరి స్థానానికి పడిపోయింది. శాఖల వారీగా ర్యాంకులను ప్రకటించగా... కీ పెర్ఫార్మెన్స్ ఇండికెటర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.ఏబీసీడీగా ర్యాంకులను వర్గీకరించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖకి ప్రథమ స్థానం లభించింది. 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాఖ నిలిచింది. 90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు నిలిచాయి. -
చంద్రబాబు అండతో భారీ భూ కబ్జా... గీతంకు హైకోర్టు నోటీసులు..
-
నివ్వెరపరిచే ఆదేశాలు!
కొన్ని ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వింటున్నది నిజమేనా అనిపిస్తాయి. ఒరిస్సా హైకోర్టు కొన్ని బెయిల్ దరఖాస్తుల విషయంలో వెలువరించిన ఆదేశాలు అటువంటివే. నిరుడు ఏప్రిల్–సెప్టెంబర్ల మధ్య ఆ హైకోర్టు 50 బెయిల్ దరఖాస్తుల్ని అంగీకరించింది. కానీ అందుకు సంబంధించి విధించిన షరతులు అందరినీ నివ్వెరపరిచాయి. ఆ నిందితులంతా రెండు నెలలపాటు పోలీస్స్టేషన్లు, గుడులు, ఆసుపత్రులు, గ్రామీణ రహదారులు, చెరువులు ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు శుభ్రం చేయాలన్నది వాటి సారాంశం. మైనింగ్ కార్యకలాపాలు నిలిపేయాలంటూ ఉద్యమించిన వారితోపాటు దొంగతనం, హత్య తదితర క్రిమినల్ కేసుల్లో ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. నిందితుల్లో అత్యధికులు దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు కావటం గమనించదగ్గది. ఇలాంటి పారిశుద్ధ్య పనుల కేటాయింపులో న్యాయమూర్తి కులం కోణాన్ని మించి చూడలేకపోయారని ఈ బెయిల్ ఆదేశాలు తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణంగా సామాజిక ఉద్యమకారులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి ఉదంతాలు న్యాయస్థానం దృష్టికి పోతాయి. కానీ ‘ఆర్టికల్ 14’ అనే డిజిటల్ మీడియాలో గత నెల 27న వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం తనంత తానే గమనించటం, ఆ షరతులు చెల్లబోవని వెనువెంటనే ఉత్తర్వులీయటం కొంతలో కొంత ఊరట. ‘కులం పునాదుల మీద మీరు దేన్నీ సాధించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు. ఒక నీతినీ నిర్మించలేరు’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. వచ్చే ఏడాదితో మన దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుని ఎనభైయ్యేళ్లవుతుంది. కానీ దళితులకు, ఇతర అట్టడుగు వర్గాలకూ అడుగడుగునా కులవివక్ష ఎదురవుతూనే ఉంది. కేలండర్లు మారుతున్నా, సాంకేతికత విస్తరించి అభివృద్ధి జరుగుతున్నా ఆ మనస్తత్వం మారటం లేదు. కుల వివక్ష, దానిపేరిట సాగుతున్న హింస దేశాభివృద్ధికే ఆటంకంగా ఉన్నదనీ, అది మనుషులను వేరు చేస్తోందనీ, మనసుల్ని సంకుచితపరుస్తోందనీ స్వామి వివేకానంద ఏనాడో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మార్పు ఎక్కడ?ఇతర వ్యవస్థల్లో ఇలాంటి జాడ్యాలు కనబడినప్పుడు సరిదిద్దాల్సిన న్యాయవ్యవస్థ సైతం ఆ తానులో ముక్కగా మారితే...? ఒరిస్సా హైకోర్టు ఆదేశాలు చూసి రాయగడ అదనపు సెషన్స్ న్యాయస్థానం, మరో ఆరు కింది కోర్టులు ఈ మాదిరి ఆదేశాలే జారీ చేశాయి. ‘ఒడిశా న్యాయవ్యవస్థ వ్యక్తీకరించిన ఈ తిరోగమన మనస్తత్వం మమ్మల్నెంతో కలవరపరుస్తోంది. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించటమేకాక నిందితుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జయ్మాలా బాగ్చీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్మొహమాటంగా తెలిపింది. విచారణకు ముందే నేరం చేసినట్టు నిర్ణయానికొచ్చి ‘శిక్షించటం’ అమల్లోవున్న చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.బాక్సైట్ మైనింగ్ కోసం వేదాంత గ్రూప్ సంస్థలకు రాయగడ, కలహండి జిల్లాల్లో ఇచ్చిన లీజులవల్ల తూర్పు కనుమల్లోని 1560.40 హెక్టార్ల అటవీభూమి నాశనం కాబోతోంది. రెండు జిల్లాల్లోని రెండు గ్రామాలు అదృశ్యమవుతాయి. ఆదివాసీ, దళిత వర్గాలు ఈ లీజుల రద్దుకు 2023 నుంచి ఉద్యమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సైతం విశాఖ ఏజెన్సీలో ఇలాగే లీజుకీయటం, ఉద్యమాలు చెలరేగటం ఎవరూ మరిచిపోరు. అటు తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేసింది. ప్రకృతి విధ్వంసానికి దారితీసే, స్థానికుల జీవికను దెబ్బతీసే ఇలాంటి చర్యను ఒడిశా సర్కారు విరమించుకోకపోగా, ఉద్యమకారుల్ని నిర్బంధిస్తోంది. సకాలంలో జోక్యం చేసుకోకుండా వ్యవస్థలు నిర్లిప్తంగా మిగిలితే ఉద్యమాలు హింసాత్మక రూపం ధరిస్తాయి. వాటిని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించి అణచ టానికి చూస్తాయి. నక్సలైటు ఉద్యమాల తీవ్రత, పర్యవసానాలు చూశాకైనా ఈ పోకడలు మానుకొని, స్థానికుల ఆకాంక్షల్ని గౌరవించే సంస్కృతిని వ్యవస్థలు అలవర్చుకోవాలి. ఈ విషయంలో ఒరిస్సా హైకోర్టు తీరు ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యపట్ల సుప్రీంకోర్టు ప్రదర్శించిన అప్రమత్తత, దిద్దుబాటు చర్యలు నిస్సహాయ పౌరులకు వ్యవస్థలపట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. -
పరిహారానికి పదేళ్లా?
తాడికొండ: ‘రాజధాని కోసం నేను రెండో విడతలో 13 ఎకరాల భూమి పూలింగ్‌కు ఇచ్చాను. అందులో రెండు ఎకరాల్లో కోళ్ల ఫారాలున్నాయి. వాటికి పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ చెబుతున్నారు. నా జీవనాధారాన్ని పోగొట్టుకుని ఎలా బతకాలి? ఇలాగైతే ఎలా?’ అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానుకు చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పూలింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అధికారులు రైతుల గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రెండో విడత ప్రారంభించిన పూలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంపై నమ్మకంతో తాను 13 ఎకరాలు ఇచ్చానన్నారు. ఇందులో సర్వే నెంబర్ 230/బీ, ఏ లలో 2.02 ఎకరాలలో కోళ్ల ఫారాలు ఉన్నాయని, వాటికి తొలి విడత పూలింగ్‌లో రైతులకు ఇచ్చినట్లే తనకు పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. అడిషనల్ కమిషనర్, ఇతర అధికారులు చెప్పిన మాటలు వింటుంటే బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. కోళ్ల ఫారం నిర్మాణం కోసం అప్పట్లో చాలా ఖర్చు చేశానని.. ల్యాండ్ కన్వర్షన్, ఇతర ఫీజులు చెల్లించానని చెప్పారు. అప్పట్లో మరో రెండెకరాల భూమి కొనుగోలు చేసేంత ఖర్చు చేశానన్నారు. కానీ ఇప్పుడు అధికారులు పరిహారం అడిగితే పదేళ్లు పడుతుందని చెప్పడం దారుణం అని అన్నారు. అయ్యా.. నా భూమి నాకిచ్చేయండి తన భూమి తనకు తిరిగిస్తే 10 సంవత్సరాల తర్వాతే పూలింగ్‌కు ఇస్తానని రైతు చుండు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ల్యాండ్ పూలింగ్ను తాను వ్యతిరేకిస్తున్నానని, కోళ్ల ఫారాలను ఏసీ ఫారాలుగా మార్చుకొంటే తనకు నెలకు రూ.5–6 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. తన భూమి తనకు ఇప్పించాలన్నారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్‌ను కలసి అర్జీ ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్మి పొలం ఇస్తే ఇలా నట్టేట ముంచుతారనుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఈనాం భూములు, నిషేధిత భూములను ఆన్లైన్లో తొలగించి, ఇతర రైతులను పూలింగ్‌కు ఒప్పించడం కోసం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ జాబితాలో తాను ఉన్నానని చెప్పారు. 22ఎ/1సీలో తనకు ఈనాం భూమి ఉందని, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఆన్లైన్లో కనిపించకుండా చేశారని, అడిగితే తమకు సంబంధం లేదని, సీసీఎల్ఏ అధికారులు చేశారని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా వీరి లాగిన్‌లో వారు ఎలా వచ్చి ట్యాంపరింగ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన భూమిని తనకిస్తే వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటానని లేదా ల్యాండ్ కన్వర్షన్ చేసిన రెండెకరాల భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పని చెయ్.. పైసలు అడక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లపై బాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఓ పక్క ‘నో వర్క్.. నో పే’ అంటూనే 12 నెలలు పని చేయాలంటోంది. మే నెలకు మాత్రం ఉచితంగా పనిచేయాలని లేకుంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే వచ్చే విద్యా సంవత్సరానికి సర్వీసును పునరుద్ధరించేది లేదని బెదిరిస్తోంది. మే నెలలో అడ్మిషన్లు, ఫెయిలైన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ చూడాలని ఆదేశించిన అధికారులు.. అందుకు వేతనం మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇంటర్ విద్యలో 3,618 మంది, పాలిటెక్నిక్‌లో 303 మంది కాంట్రాక్టు లెక్చరర్లు (మొత్తం 3,921 మంది) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాలిటెక్నిక్‌లో పరిస్థితి మరీ ఘోరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 303 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు గతేడాది నుంచి 11 నెలల జీతమే ఇస్తున్నారు. మే నెలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేస్తున్నారు. అయితే, వీరితో పనిచేయించుకోకున్నా.. మే నెలలో పరీక్ష పత్రాల వేల్యుయేషన్ చేసేందుకు గతేడాది అవకాశం కల్పించారు. ఒక్క పేపర్ దిద్దినందుకు రూ.18 రెమ్యూనరేషన్ ఇస్తారు. రోజుకి ఒక లెక్చరర్ 80 పేపర్స్ వేల్యూ చేయాలి, అంటే రోజుకు రూ.1,440 సంపాదించుకునే వీలుంది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం ఆ అవకాశాన్ని కూడా ఆపేయడంతో నెలరోజుల పాటు తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులను కాదని ప్రభుత్వం ప్రైవేటు పాలిటెక్నిక్ లెక్చరర్లకు వేల్యుయేషన్ అవకాశం ఇవ్వడం గమనార్హం. ‘మే నెలకు జీతం ఎలాగూ లేదు.. కనీసం పేపర్ దిద్దితే వచ్చే కూలీతోనైనా కుటుంబ పోషణ చేసుకోవచ్చని భావించాం. కానీ దానికీ తమను అనుమతించడం లేదు’ అని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు వాపోతున్నారు. -
అనగనగా మరో బరితెగింపు! రూ.1,100 కోట్ల భూమి.. 20 కోట్లకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ముసుగులో సర్కారు పెద్దలు భూములను కొల్లగొడుతున్నారు. కాగితాలపై ప్రైవేటు కంపెనీల పెట్టుబడులను చూపించి రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములను కారుచౌకగా కాజేస్తున్నారు. ఆతిథ్య రంగంలో అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు భూ పందేరం చేస్తూ మీకింత–మాకింత అంటూ దండుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు, ఓ బినామీ మంత్రికి లబ్ధి చేకూర్చేందుకు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాలను ఎకరం కేవలం రూ.90 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిర్ణయించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రేటు ప్రకారం భూమిని ఫ్రీ హోల్డ్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. ‘తిరుపతి వన్’లో భూ ‘మంత్రి’! చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు పేరుతో కలియుగ దైవం పాదాల చెంత హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు రూ.1,100 కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కేటాయించింది. వాస్తవానికి సదరు కంపెనీలకు ఎక్కడా ఆతిథ్య రంగంలో అనుభవం లేదు. అయినప్పటికీ, తిరుపతి జిల్లా వ్యవహారాలు చూసే ఓ మంత్రి తిరుపతి వన్ ప్రాజెక్టులో కీలకంగా చక్రం తిప్పి భూ కేటాయింపులు చేపట్టారు. పైగా సదరు మంత్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. తిరుపతిపై తొలి నుంచి కన్నేసిన ఆ మంత్రి.. పర్యాటకం ముసుగులో ఓ ప్రాజెక్టును తీసుకొచ్చారు. రెండు రియల్ ఎస్టేట్ సంస్థలను అడ్డుపెట్టి భూములు కొట్టేసే ఎత్తుగడ వేశారు. వాస్తవానికి తిరుపతి వన్ ప్రాజెక్టు విలువ రూ.1,200 కోట్లు అయితే.. ప్రభుత్వం భూమితో పాటు ప్రోత్సాహకాల కింద రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తుండటం గమనార్హం. సాధారణంగా విలువైన ప్రాంతాల్లో భూములను ప్రైవేట్ సంస్థలకు వేలం ద్వారా విక్రయించాలి. ఇతర రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారు. లేదా తక్కువ వ్యవధికి లీజుకు ఇవ్వాలి. ఈ సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కుతూ సదరు మంత్రి ఒత్తిడి మేరకు నామ మాత్రపు రేటుకు ఎకరం రూ.90 లక్షలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తుండడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.1,100 కోట్ల విలువైన భూమిని రూ.19.80 కోట్లకు ధారాదత్తం చేస్తోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్ సుంకం రీయింబర్స్మెంట్ కల్పిస్తుండటం గమనార్హం. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరం కేవలం రూ.90 లక్షల చొప్పున కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ‘నోవేషన్ క్లాజ్’ ఎత్తివేత చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములను పక్కా ప్రణాళిక ప్రకారం కూటమి నేతకు దోచిపెడుతోంది. ఏకంగా ఎస్ఆర్వో రేటుకే కారుచౌకగా అమ్మేస్తోంది. ఇదే కొనసాగితే ప్రభుత్వ భూమి తరిగిపోయి ప్రైవేటు వ్యక్తుల ఆదాయం పెరిగిపోతుంది. ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటున్న సంస్థలు ఆ తర్వాత ఆ భూమిని ఏమాత్రం నిర్దిష్ట ప్రాజెక్టులకు వాడతారనే గ్యారంటీ లేదు. ప్రభుత్వం దగ్గర కారు చౌకగా భూమిని తీసుకుని భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించే ఎత్తుగడలో సదరు మంత్రి పథకం వేశారు. అందుకే భూ బదలాయింపుల్లో ‘నోవేషన్ క్లాజ్’ను సైతం లేకుండా చేశారు. నోవేషన్ క్లాజ్ ఉంటే, ఒక ప్రాజెక్టు (భూమి) చేతులు మారినప్పుడల్లా పాత ఒప్పందంలోని పక్షాలు.. అంటే ప్రభుత్వ సమ్మతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా భూ బదలాయింపులు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం దృష్టికి వస్తుంది. అంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది సాగదు. కేవలం ఏ ప్రాజెక్టుకైతే భూమి ఇచ్చారో దానికే వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతితో బదలాయింపు చేస్తే కచ్చితంగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దిష్ట వాటా ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు బదలాయింపు చేసినా ప్రభుత్వానికి లాభాల్లో వాటాలు ఇవ్వాల్సిందే.దీంతో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా నోవేషన్ క్లాజ్‌ను ఎత్తేశారు. లీజు కాదు.. శాశ్వతంగా అమ్మకంతిరుపతి రూరల్ మండలంలోని దామినీడులో జాతీయ రహదారి వెంబడి భూములకు మంచి డిమాండ్ ఉంది. పైగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఇప్పుడు దామినీడు మణిహారంగా మారుతోంది. అక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకుపైగా పలుకుతోంది. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం కారుచౌకగా ఎకరం రూ.90 లక్షలకే అమ్మేస్తుండటం భూ దోపిడీకి అద్దం పడుతోంది. పైగా తిరుపతి వన్‌లో రూ.1,226.32 కోట్ల మొత్తం ప్రాజెక్టులో ఫేజ్–1, ఫేజ్–2 కింద రూ.400 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు.. ఇందులో ఫేజ్–1.. 2029 మార్చి–ఏప్రిల్ నాటికి, ఫేజ్–2 మార్చి/ఏప్రిల్ 2031 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పడం చూస్తుంటే రియల్ ఎస్టేట్ దందా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రెండూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, ఇన్సెంటీవ్స్, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. రూ.1,226.32 కోట్లు పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమిని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించి అమ్మేస్తోంది. -
KSR Debate: ఏపీలో రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు..!
-
కడుపు మండిన కార్మికురాలి కన్నెర్ర
రేణిగుంట: కడుపు మండిన పారిశుధ్య కార్మికురాలు చంద్రబాబు సర్కారుపై కన్నెర్ర చేసింది. ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆక్రోశిస్తూ ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసింది. గేటు ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఎనిమిది నెలలుగా జీతం లేకపోతే ఎలా బతకాలని నిలదీసింది. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీలో మంగళవారం జరిగింది. బాధితురాలికి తోటి కార్మికులు అండగా నిలిచారు. బాధితురాలి కథనం ప్రకారం.. రేణిగుంట మేజర్ పంచాయతీలో చంద్రకళ పారిశుధ్య కార్మికురాలిగా 20 ఏళ్లకుపైగా పనిచేస్తున్నారు.అయితే ఆమెకు ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వడం లేదు. ఏఐటీయూసీలో కీలకంగా ఉంటూ కార్మికుల సమస్యలపై పోరాడినందుకే అధికారులు కక్షకట్టి తనకు జీతం ఆపేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపుతూ మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. ఎనిమిది నెలలుగా జీతం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నానని ఆవేదన చెందారు.అందుకే పంచాయతీ సిబ్బందిని బయటకు పంపి గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసినట్టు వివరించారు. దీంతో ఈవో రమేష్ మంగళవారం సాయంత్రం కార్మికులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి డీపీవో కార్యాలయానికి పంపారు. ఇదిలా ఉంటే చంద్రకళకు మూడు బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల ట్రెజరీలో సాంకేతిక సమస్య వచ్చిందని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఆమె జీతాన్ని చెల్లిస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. -
కేకే లైన్ పాయే
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి గాలికొదిలేసింది. వాల్తేర్ డివిజన్లో అత్యంత కీలకమైన కొత్తవలస– కిరండూల్ రైల్వే లైన్ (కేకే లైన్)ను విశాఖపట్నం రైల్వే డివిజన్లో కొనసాగించేలా చూడటంలో ఘోరంగా విఫలమైంది. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ఎంపీలు పట్టించుకోకపోవడంతో వాల్తేర్ రైల్వే డివిజన్లో అత్యధిక ఆదాయం వచ్చే ముఖ్యమైన లైన్లన్నీ ఒడిశాకు వెళ్లిపోయాయి. కేకే లైన్ ద్వారా ఏడాదికి సగటున రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, ఈ లైన్‌ను కొత్తగా ఏర్పాటు చేసే విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగించేలా చూడాలని ఉత్తరాంధ్ర ప్రజలు, రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు చాలాకాలం నుంచి కోరుతున్నారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రాలు అందించారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కేకే లైన్‌ను కోల్పోవాల్సి వచ్చిందని రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాల్తేర్ డివిజన్లో కీలకమైన కేకే లైన్‌ను రాయగడ డివిజన్లో చేర్చడం వల్ల విశాఖపట్నం డివిజన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, ఆ ప్రభావం విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. కేకే లైన్‌ను రాయగడ డివిజన్లో కలుపుతున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ అందులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 3(4) కింద సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్, భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని కొన్ని ప్రాంతాలను విభజించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఇక నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. భువనేశ్వర్ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్, ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం డివిజన్‌ను దక్షిణ కోస్తా జోన్లో, రాయగడ డివిజన్‌ను తూర్పు కోస్తా జోన్లో చేర్చారు. ఇనుప ఖనిజం రవాణా ద్వారా ఆదాయం వచ్చే కేకే లైన్‌ను రాయగడకు కేటాయించి, కేవలం ప్రయాణికుల రద్దీ ఉండే లైన్లను మాత్రమే విశాఖపట్నం డివిజన్లో ఉంచారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయింపు విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి రైల్వే జోన్ సాధన కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రైల్వే జోన్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వేశాఖ రూపొందించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ముడసర్లోవలో భూమి కేటాయించింది. ఆ భూమిలోనే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. విశాఖపట్నం డివిజన్ ఇలా.. విశాఖపట్నం డివిజన్ మొత్తం 463 రూట్ కిలో మీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందులో ఇచ్ఛాపురం–విశాఖపట్నం–దువ్వాడ మార్గం (270 కి.మీ.), విజయనగరం–కూనేరు మార్గం (102 కి.మీ.), నౌపడ జంక్షన్–పర్లాఖేముండి సెక్షన్ (39 కి.మీ.), బొబ్బిలి జంక్షన్–సాలూరు సెక్షన్ (17 కి.మీ.), సింహాచలం నార్త్–దువ్వాడ బైపాస్ వంటి పర«దీయ మార్గాలు (35 కి.మీ.) ఉన్నాయి. రాయగడ డివిజన్ ఇలా... రాయగడ డివిజన్ మొత్తం 696 రూట్ కిలో మీటర్లలో ఉంటుంది. కోరాపుట్–సింగపూర్ రోడ్(164 కి.మీ.), కొత్తవలస–కిరండూల్ కేకే లైన్(442 కి.మీ.) కూనేరు–థేరువాలి (36 కి.మీ.), గుణుపూర్–పర్లాఖేముండి (54 కి.మీ.) సెక్షన్లు ఈ డివిజన్లో ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వేలో మార్పులు దక్షిణ మధ్య రైల్వే జోన్ (సికింద్రాబాద్) పరిధిలో హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయి. వీటికి అదనంగా పరిపాలన అవసరాల దృష్ట్యా గుంతకల్ డివిజన్ నుంచి రాయచూర్–వాడి సెక్షన్ (108 కి.మీ.)ను సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ చేస్తారు. గుంటూరు డివిజన్ నుంచి విష్ణుపురం–పాగిడిపల్లి–జాన్‌పహాడ్ సెక్షన్ (142 కి.మీ.) కూడా సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి కొండపల్లి–మోటుమర్రి సెక్షన్ (46 కి.మీ.) మాత్రం విజయవాడ డివిజన్‌కు బదిలీ చేస్తారు. కాగా, తూర్పు కోస్తా రైల్వే (భువనేశ్వర్) పరిధిలో సంబల్పూర్ డివిజన్, పునర్వ్యవస్థీకృత ఖుర్దా రోడ్ డివిజన్, కొత్తగా ఏర్పడే రాయగడ డివిజన్ కొనసాగుతాయి. -
‘జీపీఎస్’ బాదుడు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయకుండా అన్నదాతలను నడిరోడ్డుపై నిలబెడుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలతో పంట చేజారిపోతుందనే భయంతో రైతన్న బిక్కుబిక్కుమంటున్నా చలించడం లేదు. ధాన్యం తరలించే వాహనాలకు ‘జీపీఎస్’ పేరుతో భారం మోపుతోంది. రూ.1400 చొప్పున జీపీఎస్ రెన్యువల్ చార్జీలు చెల్లిస్తే తప్ప ధాన్యం కొనుగోలు చేయమంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అధికారులకు టార్గెట్లు పెట్టిమరీ జీపీఎస్ రెన్యువల్ చార్జీలు వసూలు చేయాలని హుకుం జారీ చేయడం అన్నదాతను కలవరపరుస్తోంది.లక్ష్యాలే.. సేకరణ ఎప్పుడు?రబీలో రైతుల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికి వచ్చి మూడు వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం మిల్లులకు తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయడంతో మరిన్ని అవస్థలు తప్పడం లేదు. గతానికి భిన్నంగా రబీ సీజన్లో జీపీఎస్ రెన్యువల్ పేరుతో రూ.1400 చెల్లించాలని ఒత్తిడి చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నా సర్కారు చలించడం లేదు.ఇప్పుడు ఒకవేళ వాహనదారులు రూ.1400 చెల్లించినా ఈ రబీ సీజన్‌కు మాత్రమే వర్తిస్తే... వచ్చే ఖరీఫ్‌లో మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉండటంతో ఇప్పుడెందుకు కట్టాలనే ప్రశ్న ఎదురవుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం రెన్యువల్ చార్జీలు చెల్లిస్తే ధాన్యం తరలిస్తామంటూ మెలికపెట్టడంతో క్షేత్ర స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ గాడితప్పింది. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీపీఎస్ సొమ్ముచెల్లించాలనే నిబంధనను మినహాయించి ధాన్యం సేకరించాలని రైతులు కోరుతున్నారు.అనుభవం లేని మధ్యప్రదేశ్ సంస్థకు జీపీఎస్ ట్రాకింగ్ బాధ్యతలు!గతేడాది పౌరసరఫరాల సంస్థ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీకి స్టేజ్ –1,2 జీపీఎస్ ట్రాకింగ్ టెండర్ ఇచ్చారు. సదరు సంస్థ జీపీఎస్ ట్రాకింగ్ డేటా నిర్వహణలో అనుభవం లేక చేతులు ఎత్తేసింది. అయినా టెండర్ నిబంధనలు పాటించకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ మొత్తం జీపీఎస్ నిర్వహణ బాధ్యతను అదే సంస్థకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పౌరసరఫరాల సంస్థలోని సాంకేతిక విభాగం చూసే ఓ అధికారి చక్రం తిప్పారు. ఆమె స్వయంగా కొందరు ఉద్యోగులను మధ్యప్రదేశ్ సంస్థలో నియమించి ఎలాగోలా నెట్టుకొచ్చారు. పైగా తన బినామీ సంస్థతో కొత్త జీపీఎస్ మిషన్లు రైతులతో బలవంతంగా కొనిపించడం గమనార్హం. -
కంప కోసం రూ.కోట్లు!
సాక్షి,అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ముళ్ల పొదల తొలగింపు వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. కంప తొలగింపు అంతులేని కథలా సాగుతోంది. ముళ్ల పొదలు తొలగించినందుకు రూ.36.50 కోట్లు ఏమాత్రం సరిపోలేదని.. రూ.40.53 కోట్లు కావాలంటూ ఇప్పటికే సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనను గతేడాది జూన్ 20న సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) తోసిపుచ్చింది. తాజాగా ఓ కీలక నేత ఒత్తిడితో సీఆర్డీఏ అధికారులు అదే ప్రతిపాదనను మరోసారి ఈసీకి పంపడం చర్చనీయాంశంగా మారింది.ఇదీ ముళ్ల కథ..!గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో 29 గ్రామాల పరిధిలోని 217 చ.కి.మీ. (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. తాత్కాలిక నిర్మాణాలకు రూ.కోట్లకు కోట్లు ధారపోసి 2017లో ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో రాజధాని పనులు నత్తనడకన సాగాయి. వర్షాల ప్రభావంతో రాజధాని భూముల్లో ముళ్ల చెట్లు పెరిగి పొదలుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని భూముల్లో ముళ్ల పొదల తొలగింపు పనులు చేపట్టేందుకు రూ.36.50 కోట్లతో సీఆర్డీఏ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఆ పనులకు రూ.30,81,54,984 కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 జూలై 10న సీఆర్డీఏ సీఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లలో రూ.31,95,56,718.25 కోట్ చేసిన ‘ఎన్సీసీ’ సంస్థకు ముళ్ల పొదల తొలగింపు పనులను అప్పగించారు. ముళ్ల పొదల తొలగింపు పనులు పూర్తయ్యాయని, అయితే వ్యయం రూ.31.95 కోట్ల కంటే పెరిగిందని, ఆ మేరకు బిల్లులు చెల్లించాలని సీఆర్డీఏను కాంట్రాక్టు సంస్థ కోరింది. దీంతో ముళ్ల పొదల తొలగింపు వ్యయాన్ని రూ.40,53,05,978లకు సవరించాలని సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సీఈ ప్రతిపాదించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ అధ్యక్షతన గతేడాది జూన్ 20న జరిగిన సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ 57వ సమావేశం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ముళ్ల పొదల తొలగింపు వ్యయం పెంచేందుకు నిరాకరించింది. అయితే ఇప్పుడు ఓ కీలక నేత రంగంలోకి దిగి ముళ్ల పొదల తొలగింపు వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేయడంతో సీఆర్డీఏ ఈసీ సమావేశానికి మరోసారి అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మరోవైపు గతేడాది కురిసిన వర్షాలకు రాజధాని ప్రాంతంలో ముళ్ల చెట్లు పెరిగి భారీ పొదలుగా మారాయి. వాటిని తొలగించేందుకు ఇంకెన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. రాజధాని భూముల్లో ముళ్ల పొదల తొలగింపు వ్యవహారం టీవీ సీరియళ్లను తలపిస్తోందంటూ ఇంజనీరింగ్ నిపుణులు, రియల్టర్లు ఛలోక్తులు విసురుతున్నారు. -
చి‘వరి’కి కష్టాలే!
సాక్షి, అమరావతి/నెట్వర్క్: మారుతున్న వాతావరణ పరిస్థితులు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓ వైపు తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రాయలసీమలో వరి పంట ఎండిపోతుంటే.. మరోవైపు విరుచుకుపడుతున్న అకాల వర్షాలు, ఈదురు గాలులకు కోత దశలో ఉన్న వరి చేలు నేలకొరిగి రైతుల ఆశలను చిదిమేస్తున్నాయి. మొక్కజొన్న రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం వరి రైతులను కూడా నిలువునా దగా చేస్తోంది. వరి ధాన్యానికి మద్దతు ధర దక్కక రైతులంతా లబోదిబోమంటున్నారు. కనీసం గోనె సంచులను కూడా పూర్తి స్థాయిలో సమకూర్చలేని దుస్థితి నెలకొంది. అకాల వర్షాల బారినపడి తడిసి ముద్దవుతున్న వరిని చూసి రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రైతుల పుట్టి ముంచిన ప్రభుత్వంరబీలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. గోదావరి, కృష్ణా జిల్లాలో 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలావరకు పంట కళ్లాల్లోనే ఉండిపోయింది. ఈ దశలో మారిన వాతావరణ పరిస్థితులు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యపు రాశులు రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలుల కారణంగా ధాన్యంపై కప్పిన పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యమంతా తడిసిపోయింది. ఈ దశలో యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. కళ్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైతే ముక్క విరుగుడు సమస్య తలెత్తుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి ఈ ఏడాది 65 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు 13 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది.వేధిస్తున్న సంచుల కొరత.. దక్కని మద్దతు ధరధాన్యం సేకరణ కోసం 3.16 కోట్ల సంచులు సిద్దంగా ఉంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో సంచుల కొరత రైతులను వేధిస్తోంది. 40 కేజీల ఖాళీ గోతం రూ.18 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 20–30 శాతం మంది రైతులు సొంతంగానే సంచులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ధాన్యాన్ని సంచుల్లో నింపి తూకం వేసినందుకు ఒక్కొక్క బస్తాకు రూ.9 చొప్పున, బస్తాలను మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్‌కు టన్నుకు రూ.800 చొప్పున రైతులే చెల్లిస్తున్నారు. వాహనాల వెయిటింగ్ చార్జీలు సైతం రోజుకు రూ.1,000 చొప్పున భరిస్తున్నారు. సొంత ఖర్చుతో సంచుల్లో నింపిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం సకాలంలో వాహనాలు సమకూర్చడం లేదు. ఫలితంగా బస్తాల్లో నింపిన ధాన్యం సైతం కళ్లాల్లోనే తడిసిపోతోంది. వ్యయ ప్రయాసలకోర్చి కొందరు రైతులు మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తే క్వింటాకు 5నుంచి 8 కేజీల చొప్పున తరుగు కింద తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. 1,635 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16వేల వాహనాలు సమకూర్చామని చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. డిమాండ్ మేరకు వాహనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పుట్టికి రూ.3 వేలు నష్టపోయిన రైతులుఖరీఫ్ ఆలస్యంగా సాగయ్యే నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు నిలువు దోపిడికీ గురయ్యారు. పుట్టి (850 కేజీల)కి కనీస మద్దతు ధర ప్రకారం ఫైన్ రకానికి రూ.20,136, సూపర్ ఫైన్ రకానికి రూ.20,380 చొప్పున చెల్లించాల్సి ఉండగా.. రైతులకు కేవలం రూ,17 వేల నుంచి రూ,18 వేల మధ్య దక్కింది. పైగా తరుగు పేరిట 48 కేజీలు అదనంగా తీసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా పుట్టికి రూ.20,300 చొప్పున చెల్లించినా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పేరిట అదనంగా 140 కేజీలు తీసుకున్నారు.కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా, దళారులకు అమ్ముకున్నా పుట్టికి రూ.3 వేల వరకు నష్టపోయామని రైతులు చెబుతున్నారు. పైగా కూలీ, రవాణా చార్జీలు పైసా కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలోని రైతులూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర కామన్ రకం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389 కాగా.. 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1.725, గ్రేడ్–ఏ రకానికి రూ.1,777 చొప్పున దక్కాల్సి ఉంది. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రూ.1,250 నుంచి రూ.1,350 మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన బస్తాకు రూ.427నుంచి రూ.527 వరకు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.గోతాలు ఇవ్వకపోగా తరుగు తీస్తున్నారుధాన్యం నింపేందుకు గోతాలు ఇవ్వకపోగా మిల్లుల దగ్గర క్వింటాకి ఐదు కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. గోతాలు లేక ధాన్యం రోజుల తరబడి కళ్లాల్లోనే ఉంచాము. ప్రభుత్వం గోతాలు ఇస్తుందనే నమ్మకం లేక ఒక్కొక్క గోతం రూ.18 చొప్పున కొనుగోలు చేసి ధాన్యం నింపి మిల్లులకు తరలించాం. రవాణా చార్జి టన్నుకు రూ.800, కాటా కూలీ గోతానికి రూ.9 చొప్పున అన్ని మేమే ఇచ్చాం. ఇలా అయితే రైతులకు మిగిలేది ఏమీ ఉండదు. – వి.నర్శిరెడ్డి, రైతు, టేకులపల్లి, ఎన్టీఆర్ జిల్లాసంచులు ఇవ్వడం లేదు తేమ తక్కువ రావడం లేదనే సాకుతో సంచులు ఇవ్వడం లేదు. ధాన్యం ఆరబెట్టుకుని తేమ తక్కువ రావడం కోసం రోజూ శాంపిల్ తీసుకుని రైతు సేవా కేంద్రాలు చుట్టూ తిరగడమే సరిపోతోంది. వాతావరణం చూస్తుంటే భయమేస్తోంది. సంచులు ఇచ్చారనుకుంటే.. ధాన్యం పట్టేందుకు జట్టు దొరకడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక కష్టపడి పండించిన పంట అమ్మేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత సార్వాలో ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇప్పటివరకు ఇవ్వలేదు. – నల్లమిల్లి రామిరెడ్డి, రైతు, జుత్తిగ, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరిసంచులు నేనే కొనుక్కున్నానాలుగు ఎకరాల్లో వరి పండించాను. సంచులు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని వారం రోజులు కళ్లాంలోనే ఉంచేశాను. చేసేది లేక రూ.18 చొప్పున 250 సంచుల్ని కొని ధాన్యం నింపి మిల్లుకు తరలించాను. మిల్లు దగ్గర మూడు రోజులు పడిగాపులు పడిన తర్వాత క్వింటాకి 5 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగు డబ్బులను ముందు చెల్లిస్తేనే ధాన్యం దింపుకున్నారు. – శీలం కృష్ణారెడ్డి, రైతు, టేకులపల్లినెల రోజులైనా కొనడం లేదునెల రోజుల నుంచి సొసైటీల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సంచులు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చే సంచులు ఎందుకు పనికిరావడం లేదు. క్వింటాకు 5 కేజీల కోత పెడుతున్నారు. అయినా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. చాలా ఇబ్బందిపడుతున్నాం. – కోలా రామకృష్ణ, కోదాడఐదు కేజీలు కోత వేస్తున్నారుకోతలు కోసి నెల రోజులైంది. తేమ శాతం ఎక్కువ ఉందని ఆరబెట్టుకున్నాం. రోజూ రైతు సేవా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా ఒక్క గోనె సంచి కూడా ఇవ్వలేదు. అడిగితే సీరియల్ ప్రకారం వస్తుంది కంగారుపడొద్దంటున్నారు. టీడీపీ వాళ్లకు చెందిన ధాన్యం తోలుతున్నారు. వాళ్ల దగ్గర ఒక్క కేజీ కూడా తరుగు తీసుకోలేదు. మా ధాన్యం తోలడం లేదు. ఎప్పుడు తోలుతారో కూడా చెప్పడం లేదు. సొంతంగా మిల్లుకు తోలాలంటే ఒక్కో కాటాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల కిరాయి. పైగా క్వింటాకు 5 కేజీల తరుగు తీసుకుంటున్నారు. వాతావరణం గంటకో రకంగా మారిపోతోంది. వర్షం పడుతుంటే చాలు భయమేస్తోంది. ధాన్యం తడిసి ముద్దయితే ఎవరు కొంటారు. ఇదేనా కొనుగోలు చేసే తీరు – చిరసాని ప్రమీల, రైతు, వావిలాల, ఎన్టీఆర్ జిల్లా -
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో ఆల్ టైం రికార్డు
-
అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్’
సాక్షి, అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తాజాగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి మార్క్‌ఫెడ్ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్‌ఫెడ్ తీసుకునే రూ.1,800 కోట్ల అప్పునకు అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12,053 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ప్రస్తుత రూ.1,800 కోట్ల అప్పు కూడా కలిపితే మార్క్‌ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి తీసుకున్న అప్పు రూ.13,853 కోట్లకు చేరనుంది.చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే బడ్జెట్ పరిధిలో, బడ్జెట్ వెలుపల కలిపి సోమవారం వరకు మొత్తం రూ.3,56,455 కోట్లు అప్పు చేసింది. అయితే, బడ్జెట్ పరిధిలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (మే 5, మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.4,600 కోట్లు రుణం సమీకరించి ఇవ్వనుంది. సోమవారం ఎన్సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీతో అనుమతిచ్చింది.దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు చేసిన అప్పు మొత్తం రూ.3,62,855 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,776 కోట్లు, రోజుకు సగటున రూ.526 కోట్లు అప్పు చేస్తోంది. కాగా, గ్రామీణ విద్యుద్ధికరణ సంస్థ (ఆర్ఈసీ) నుంచి డిస్కమ్స్ తీసుకున్న రూ.7,000 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీని పొడిగిస్తూ సోమవారం ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
వెలగపూడి ప్యాలెస్‌లో ‘భూ’మాయాజాలం!
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలకు మాత్రం వారు ఎలా కావాలంటే అలా ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించడం.. అందులో మార్పులు చేయడం చేసేస్తోంది. దీనికి తార్కాణం రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో శాశ్వత సచివాలయం టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవంతులు నిర్మిస్తున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో, వెలగపూడికి సమీపంలో అత్యాధునిక వసతులతో రూ.వందల కోట్ల వ్యయంతో సీఎం చంద్రబాబు కుటుంబం 25 వేల గజాల్లో (5.17 ఎకరాలు) నిర్మిస్తున్న ప్యాలెస్సే అందుకు తార్కాణం. రాజధానిలోని వెలగపూడిలో కంచెర్ల సాంబశివరావుకు చెందిన సర్వే నంబరు 142–బీ, 142–సీ, 89లోని 4.41 ఎకరాలు, కంచెర్ల శాంతికిరణ్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 160, 163–బీ, 184–బీలోని 11.10 ఎకరాలు, కంచెర్ల ఓంకార్‌కు చెందిన సర్వే నంబరు 136–సీ, 85, 89లోని 14.01 ఎకరాలు.. మొత్తం 29.52 ఎకరాలను భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఇందుకుగానూ రాజధాని ప్రధాన ప్రాంతం వెలగపూడిలో సర్వే నంబరు 111, 112, 113, 122, 150, 152, 239లోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతికిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ల కింద ఇచ్చింది. ఆ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు 2025 ఏప్రిల్ 2న కొనుగోలు చేశారు. ఆ మేరకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన భూమికి ఉత్తరం వైపున పాసివ్ జోన్ (హరిత ప్రాంతం), దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలం, తూర్పు వైపున 17 మీటర్ల రోడ్డు, పశ్చిమ వైపున 25 మీటర్ల రోడ్డును హద్దులుగా పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతాన్ని హరిత ప్రాంతంగా ఎవరి కోసం మార్చారు? నారా బ్రాహ్మణి 25 వేల గజాలను కొనుగోలు చేశాక ఆ ప్లాటు హద్దులు మారిపోయాయి. దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా సీఆర్డీఏ మార్చేసింది. 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలం హరిత ప్రాంతంగా మారిపోయింది. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. ఆ భూమి రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతంగా ఉండి ఉంటే.. ఎకరం చొప్పున రాజధానికి భూములు ఇచ్చిన ముగ్గురు రైతులకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించే అవకాశం ఉండేదంటున్నారు. చెరువుల్లో, ముంపు ప్రాంతంలో రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను.. ఆ ఖాళీ స్థలంలోకి మార్చే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రైతులు మండి పడుతున్నారు. ఇక భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన నివాస స్థలాలు (రెసిడెన్షియల్ ప్లాట్) గజం రూ.50 వేలు పలుకుతుందని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో సీఆర్డీఏ లెక్కగట్టింది. వాణిజ్య (కమర్షియల్) ప్లాట్ ధర రూ.2.70 కోట్లుగా చూపింది. ఎకరం భూమిని సమీకరణ కింద ఇచ్చిన రైతులకు.. పదేళ్లపాటు కౌలు కింద రూ.7,25,000, నివాస స్థలం (వెయ్యి గజాలు.. గజం రూ.50 వేల చొప్పున) రూ.5 కోట్లు, వాణిజ్య స్థలం రూ.2.70 కోట్లు వెరసి రూ.7,77,25,000 ప్రయోజనం చేకూరుతుందని సీఆర్డీఏ లెక్కలు వేసింది. ఈ లెక్కన 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేయడం వల్ల సీఆర్డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవ ధర గజం రూ.7,500 లేనా? లేక మోసం చేశారా?వెలగపూడిలో సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి 25 వేల గజాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారంటే గజం ధర రూ.7,500. అక్కడ రెసిడెన్షియల్ స్థలం ధర వాస్తవంగా గజం రూ.7,500లేనా అని మేధావులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే.. రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదాయపు పన్ను కూడా ఎగ్గొట్టినట్లేనని తేల్చి చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కోడలు కొనుగోలు చేసిన భూమి ధరను బట్టి చూస్తే.. ప్రధాన రాజధాని ప్రాంతంలో ఎకరం ధర రూ.3.63 కోట్లే. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.47,387 కోట్లను చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. ఈ లెక్కన ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాలంటే కనీసం 15 వేల ఎకరాలు అమ్మాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు లెక్కలు వేస్తున్నారు. కానీ.. రాజధాని ప్రాంతంలో అంత భూమి అందుబాటులో లేదు. ఈ లెక్కన అప్పు తీర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి.. అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నిధులు కేటాయించాల్సిందే. అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ సిటీ ఎలా అవుతుందని మేధావులు, ఆర్థిక వేత్తలు నిలదీస్తున్నారు. ఆ ఎకరం శ్మశానమే.. వెలగపూడిలో సర్వే నంబరు 163–బీలో ఎకరం శ్మశానం భూమి. ఇప్పటికీ ఆ భూమిలో సమాధులు ఉన్నాయి. రాజధాని భూ సమీకరణ కోసం వెలగపూడిలో 2015 జనవరి 3న సీఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్లోనూ 163–బీలో ఎకరం శ్మశానంగా స్పష్టం చేసింది. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమిని సమీకరిస్తూ జారీ చేసిన 9.22 ఫార్మ్‌లో మాత్రం ఆ భూమి కంచెర్ల శాంతి కిరణ్దిగా పేర్కొనడం గమనార్హం. ఎవరి ఒత్తిళ్లతో శ్మశానం భూమిని శాంతి కిరణ్‌కు చెందినదిగా మార్చారని వెలగపూడి రైతులు నిలదీస్తున్నారు. 163–బీలో శ్మశానం ఉన్న ఎకరం భూమి కంచెర్ల శాంతికిరణ్దిగా చూపుతూ.. దానికిగాను కేటాయించిన వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలంతోపాటు 25 వేల గజాలను కంచెర్ల శాంతికిరణ్ కుటుంబ సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కొనుగోలు చేయడం గమనార్హం. -
బాత్ రూమ్స్ వద్ద విధులు.. సచివాలయ ఉద్యోగులపై కూటమి కక్ష
-
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం
-
బుర్జు ఖలీఫాను మించి ఖర్చు.. దోపిడీకి కేరాఫ్ అమరావతి
-
సింగిల్ బిడ్‌కే సై.. ఏపీలో అస్మదీయ సంస్థకు పదేళ్లపాటు జీజీహెచ్‌ల్లో క్యాథ్‌ల్యాబ్ పీపీపీ సేవల కాంట్రాక్టు
-
ప్రజలెన్నుకున్నవి కావు.. పాలకులెంచుకున్న ప్రభుత్వాలివి
అనంతపురం/అనంతపురం కల్చరల్: దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పాలకులు అపహాస్యం చేసి.. ప్రజల అభీష్టానికి విలువ లేకుండా చేశారని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, రానున్న రోజుల్లో స్వేచ్ఛగా మాట్లాడే రోజులు ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలక చర్చలు’ అనే అంశంపై వేర్వేరు సదస్సులు జరిగాయి. జీఆర్ ఫంక్షన్ హాలులో సలీం మాలిక్ నిర్వహణలో జరిగిన మొదటి సదస్సుకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్.. ‘రాజ్యాంగం–ఎన్నికలు–ప్రజాస్వామ్యం’, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ అనే అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించే వారని.. కానీ, ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు ఆలోచిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో నిమిషానికి మూడుకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని.. ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారమే 132 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇదెలా సాధ్యమో పాలకులుగానీ, ఈసీ కానీ చెప్పడంలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు తాము వేద్దామనుకున్న వారికి వారి ఓట్లు పడ్డాయో లేదో తెలియడంలేదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నిలదీయాలని పరకాల కోరారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ప్రకటించారని.. 2024 మే 13 రాత్రి 2.15 గంటల్లో 4.16 శాతం (17,19,482) ఓట్లు పోలయ్యాయన్నారు. ఇక తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మొత్తం మీద అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయనిపరకాల చెప్పారు. 90 శాతం నమోదైతేనే రీపోలింగ్ జరుపుతారని, కానీ ఏకంగా 130 శాతానికి పైగా నమోదైనా ఎలాంటి రీపోలింగ్ జరపలేదన్నారు. హిందూయేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతున్నారని తెలిపారు. పౌరుడిని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ అని విమర్శించారు.అమరావతిలో రూ.లక్షల కోట్ల వృథా..ఇక అమరావతిని బలవంతంగా రుద్దుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నా మే«ధావులు స్పందించకపోవడం బాధాకరమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ. రామచంద్రయ్య అన్నారు. అమరావతికి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలోని 15 నగరాలను అద్భుతంగా అభివృద్ధి చెయొచ్చన్నారు. అమరావతికి జనం వచ్చే అవకాశమేలేదని కుండబద్దలు కొట్టారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలపైనే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నారని, ఎక్కడా పారదర్శకతలేదని ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే ధరలు పెంచడం, పన్నులు రెట్టింపు చేయడమేనని విమర్శించారు. ఇక రెండో సదస్సు ‘ప్రజలకు దూరమవుతున్న వైద్యం’ అనే అంశంపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ఎం బాషా అధ్యక్షతన జరిగింది. -
విద్యుత్ కోతలకు ‘సాంకేతిక’ సాకులు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిసినా అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దీంతో విద్యుత్‌ను సక్రమంగా అందించలేకపోతోంది. సాంకేతిక సాకులు చూపించి జనానికి కోతలు తప్పవని సంకేతాలిస్తోంది. విద్యుత్ కోతలపై శనివారం మంత్రి రవికుమార్ చేపట్టిన సమీక్షలో అధికారులు చెప్పిన సాంకేతిక కారణాలే దీనికి తార్కాణం. ‘‘అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి..అకాల వర్షాల కారణంగా సమస్యలు తలెత్తి ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. అందుకే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.’’ అని విద్యుత్ పంపిణీ సంస్థలు సమాధానం చెప్పడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు అమలు చేయడంపై ‘సాక్షి’ కథనాలకు స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం డిస్కంల సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విద్యుత్ కోతలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది లేదే 2023 మే నెలలో భానుడి భగభగలు, వర్షాలు, ఈదురుగాలులు వంటి విపత్తుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎండల వల్ల అవుట్డోర్ వర్క్స్ ఆపేశారు. ఇళ్లల్లో ఏసీలు, ఎయిర్ కండిషనర్ల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడింది. రోజుకి విద్యుత్ వినియోగం 255 మిలియన్ యూనిట్లకు చేరింది. అయినా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. కరెంట్ వాడకం రోజురోజుకూ పెరిగినా గ్రిడ్ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండేలా చూసింది. వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచింది. దీంతో వేసవిలో కూడా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించింది. -
వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మక్కై ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండోఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్‌లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోట్‌చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) కింద 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్షమందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్‌సీ గ్రూపులకు వెయ్యి కిసాన్ డ్రోన్లు, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి రూ.129 కోట్లతో 25 వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లు పంపిణీ చేశారు. కమీషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా, టెండర్ నిబంధనలను తారుమారుచేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్ డ్రోన్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ అర్హతగల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15–20 శాతం కమీషన్ (రూ.25 కోట్లకుపైగా) అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి.కమీషన్ల కోసం చైనా ఉత్పత్తులకు పచ్చజెండా 2025–26 సీజన్లో రూ.240 కోట్లతో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు వెయ్యి, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్లు, సీహెచ్‌సీలకు 164 హైకాస్ట్ మిషనరీ, 1,050 ట్రాక్టర్లతో పాటు 40 వేలకు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్‌లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను బదిలీచేసి విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్ ఏజెన్సీగా ఏపీ ఆగ్రోస్‌ను తప్పించి వ్యవసాయశాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమీషన్లు దండుకోగా, రెండో ఏడాది ఎంపానల్‌మెంట్‌కు ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతోపాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20–25 శాతం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్ ద్వారా కంపెనీల నుంచి కమీషన్ దండుకుంటున్నారని సమాచారం. ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా.. భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్‌చేసిన కంపెనీలతో ఎంపానల్మెంట్ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హైప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ వీడర్/రీపర్, బ్రష్ కట్టర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్ వీడర్ ఎమ్మార్పీ రూ.36 వేలు కాగా, స్మామ్‌లో రూ.57,500గా, రూ.18 వేలున్న బ్రష్కట్టర్ ధరను రూ.25 వేలుగా నిర్దేశించారు.పనితీరుతో పనిలేదురైతులకు పంపిణీ చేసే పరికరాల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగడం లేదు. మన హార్వెస్టర్ల ద్వారా వరికోతలు చేస్తే ధాన్యం నష్టం 1.5 శాతం నుంచి 2 శాతం ఉంటే.. చైనా హార్వెస్టర్ ఉపయోగిస్తే ఈ నష్టం 7.5 శాతం ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా చైనా పరికరాలకే మొగ్గుచూపుతున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నారనే సాకుతో సామర్థ్యం లేని పరికరాలను నేరుగా చైనా నుంచి డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ మేరకు కంపెనీలు కోట్‌చేసే ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు ఏపీ ఆగ్రోస్ ద్వారా ఇటీవల పిలిచిన టెండర్లో స్ప్రేయర్లకు 12 శాతం జీఎస్టీతో ఎల్1 కోట్‌చేసిన ధర రూ.23 వేలు. ఇదే స్ప్రేయర్లను నేడు 5 శాతం జీఎస్టీతో కలిపి కమిటీ ఆమోదించిన ధర రూ.26 వేలు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. ఈసారి రూ.80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాయి. కాగా, ఆన్లైన్లో పిలవాల్సిన టెండర్లను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పిలిచారు. ఇక్కడ పరీక్ష నివేదికలు, ధరల కొటేషన్లు, స్పెసిఫికేషన్లు వంటి పత్రాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వీలు కల్పించారు. అదే ఆన్లైన్లో పిలిస్తే ఒకసారి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. తమకు పర్సంటేజ్‌లు భారీగా ఇచ్చే కంపెనీలకు మేలు చేసేందుకే ఈ విధంగా ఆఫ్‌లైన్‌లో టెండర్లు పిలిచారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
అర్హులపై వేటు.. అనర్హులకు చోటు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు గంగపుత్రుల నోట్లో మట్టికొడుతోంది. సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలను టీడీపీ కార్యకర్తలకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోంది. అధికారంలోకి రాగానే చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి వేట విరామం వేళ ఏటా రూ.20 వేల చొప్పున నిషేధ భృతి చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది తుంగలో తొక్కింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. ఈ ఏడాది మాత్రం అడ్డగోలుగా పార్టీ కార్యకర్తలను వేటకు వెళ్లే మత్స్యకారులుగా నమోదు చేసి వేట నిషేధ భృతిని కాజేసేలా కుట్రలకు తెరతీశారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతోనే టీడీపీ నేతలు దోపిడీకి తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అర్హుల సంఖ్యను భారీగా పెంచి రాష్ట్రంలోని 555 సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలుండగా.. 1.60 లక్షల కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడ్డాయి. 2023–24లో వేటకు వెళ్లే మత్స్యకార బోట్లు 23,209 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 29,252కు చేరింది. వాస్తవంగా మెకనైజ్డ్ బోట్లకు 18 మీటర్లకు పైబడి పొడవు ఉంటే 10 మంది, 18 మీటర్ల కంటే తక్కువ ఉంటే 8 మంది, మోటార్ బోట్లపై ఆరుగురు, ఇంజిన్‌లేని సంప్రదాయ బోట్లపై ముగ్గురు చొప్పున సిబ్బందికి వేట నిషేధ భృతి ఇవ్వాల్సిఉంది. ఈ పథకం మెకనైజ్డ్ బోటు యజమానులకు వర్తించదు.రిజిస్ట్రేషన్ కలిగిన బోట్లపై మార్చి 31 నాటికి 18–60 ఏళ్ల మధ్య వయసున్న వారికి వర్తిస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేట నిషేధ భృతిని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 1.29 లక్షల మంది అర్హత పొందగా.. వారి ఖాతాల్లో అరకొరగా జమ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అర్హుల జాబితాలో భారీగా అనర్హులను చేర్చి 29,252 బోట్లపై 1.57 లక్షల మంది ఆధారపడినట్టుగా లెక్కేశారు.క్షేత్రస్థాయి పరిశీలనలో 28,677 బోట్లపై 1.52 లక్షల మంది అర్హులున్నట్టుగా లెక్కతేల్చారు. అయితే, సోషల్ ఆడిట్ సందర్భంగా అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో జాబితాల్లోని పేర్లపై పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. నిజమైన లబ్ధిదారులను కాదని మైదాన ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కాని టీడీపీ అభిమానులు, కార్యకర్తలను జాలర్లుగా చిత్రీకరిస్తూ జాబితాల్లో నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.లేని బోట్లను ఉన్నట్టుగా చిత్రీకరించి..ఫిషింగ్ బోటు రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి, మరమ్మతుల అనుమతులు వంటి ప్రక్రియల్లో బ్రోకర్ల దందా సాగింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల సిఫార్సుల మేరకు ఇసుక బోట్లను సైతం చేపల బోట్లుగా నమోదు చేయడమే కాకుండా మూలన పడిన, వినియోగంలో లేని బోట్లను మనుగడలో ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారని చెబుతున్నారు. లేని బోట్లను సైతం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ వాటిపై మత్స్యకారులు ఆధారపడినట్టుగా నమోదు చేయించారని చెబుతున్నారు.ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వేట బోట్ల రిజిస్ట్రేషన్లలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 3 వేలకు పైగా బోట్లను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ బోట్లపై నిబంధనల మేరకు 6నుంచి 20 మంది వరకు నమోదు చేయాల్సి ఉండగా.. మైదాన ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తల పేర్లను ఈ జాబితాల్లో చేర్చి అర్హులుగా చిత్రీకరిస్తున్నారు.రూ.60 వేల బోటుపై.. రూ.1.20 లక్షలు కొట్టేసేలా..సంప్రదాయ బోట్ల పేరిట కూడా నిధులు కొట్టేసేందుకు సైతం టీడీపీ నేతలు కుట్ర పన్నినట్టు చెబుతున్నారు. వాస్తవానికి సంప్రదాయ బోటు తయారీకి రూ.60 వేలు ఖర్చవుతుందని అంచనా. ఆ బోటును ఇంజిన్ బోటుగా చిత్రీకరించి.. ఒక్కో బోటుపై ఆరుగురు చొప్పున చేపల వేటకు వెళ్తున్నట్టు లెక్కలు చూపి ఏకంగా ఒక్కో బోటుపై రూ.1.20 లక్షల నిషేధ భృతిని దోచేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు.‘మీకింత.. మాకింత’ అనే ఒప్పందాలతో స్థానిక మత్స్యశాఖ అధికారులతో టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తూ అనర్హులతో జాబితాలు తయారు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అర్హత పొందిన వారికి రూ.300 కోట్లకు పైగా జమ చేయనుండగా.. కనీసం రూ.50 నుంచి రూ.60 కోట్లు అనధికారిక బోట్లు, మత్స్యకారేతరుల పేరిట దారి మళ్లించేందుకు పథక రచన చేసినట్టు చెబుతున్నారు. ఈ భారీ కుంభకోణంపై ఇటీవల విశాఖలోని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని మత్స్యకారులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.విజిలెన్స్ విచారణ జరపాలిఅర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయి. బోట్ల రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలోనే అనర్హులను పెద్దఎత్తున అర్హుల జాబితాల్లో చేర్చారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపి.. వాస్తవంగా వేటకు వెళ్లే వారికి మాత్రమే నిషేధ భృతిని చెల్లించాలి.– వంకా గురుమూర్తి, అధ్యక్షుడు, రాష్ట్ర మత్స్యకార కార్మిక సంఘం -
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
సాక్షి, అమరావతి: భక్తులు గుళ్లలో కానుకలుగా సమర్పించే కోట్ల రూపాయలను తమకు కావాల్సిన వారికి దోచి పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే దేవదాయ శాఖలో టెండరు నిబంధనలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలో ఏటా అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్ పనుల నిర్వహణ, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్టుకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించింది. ప్రభుత్వ ముఖ్య నేతకు బంధువుగా ప్రచారంలో ఉన్న భాస్కరనాయుడికి సంబం«ధించిన పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ఆ పనులు కట్టబెట్టింది. ఇప్పుడు మరో 15 పెద్ద ఆలయాల్లో క్లీనింగ్ పనులను కూడా అదే తరహాలో ఆ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆ 15 ఆలయాలకు కూడా ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ఏడు గుళ్లలో క్లీనింగ్ పనుల కోసం ఉమ్మడిగా టెండర్లు నిర్వహించడం ద్వారా రెండేళ్ల కాలానికి దాదాపు రూ.100 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న ఆ సంస్థకు సగానికి సగం మిగులుతుందని అధికార వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా 15 గుళ్లకు కూడా ఉమ్మడి టెండర్లు ద్వారా మరో రూ.వంద కోట్లకు పైబడి పనులను ఆ సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నాడు నిబంధనలు మార్చి కట్టబెట్టేశారు – గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ గుడిలో క్లీనింగ్ పనుల టెండర్లు ఆ గుడి స్థాయిలో వేర్వేరుగా జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ విధానాన్ని మార్చి.. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. – ఈ ఏడు ప్రధాన ఆలయాలు రూ.60 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వార్షికాదాయం కలిగి, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్న 15 ఆలయాలకు ఏటా రూ.10 కోట్లకు పైబడి ఆదాయం ఉంటోంది. ఇవి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఒకే సంస్థకు ఇలా ముఖ్యమైన ఆలయాల క్లీనింగ్ పనులు అప్పగించడం చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పనే అని స్పష్టమవుతోంది. – తొలుత ఏడు ఆలయాలను అప్పగించేందుకు గత ఏడాది మే నెలలో దేవదాయ శాఖ టెండర్లు నిర్వహించింది. ఆ టెండర్లలో పేర్కొన్న నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన ఆ సంస్థకు అనుకూలంగా లేవని తేలడంతో ఏకంగా ఆ టెండరునే రద్దు చేశారు. తిరిగి నిబంధనలు సవరించి, జూన్‌లో మళ్లీ టెండర్లు పిలిచారు. అందులో పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థనే ఎల్–1గా నిలిచింది. – మరోవైపు.. అప్పుడు ఏడు గుళ్లకు కలిపి ఉమ్మడిగా టెండర్లు నిర్వహించే ప్రక్రియలో కేవలం పెద్ద సంస్థలు మాత్రమే టెండరులో పాల్గొనే అవకాశం ఉండేలా నిబంధనలు మార్చడంతో అంతకు ముందు ఆయా గుళ్లలో వేర్వేరుగా క్లీనింగ్ పనులు నిర్వహించిన సంస్థలు పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. ఉమ్మడి టెండర్ల విధానంలో పోటీ తగ్గడం వల్ల పెద్ద సంస్థలు అధిక ధరకు పనులు పొందేలా ప్రభుత్వమే మార్గ నిర్దేశం చేస్తోంది. – గుళ్లలో పారిశుద్ధ్య పనుల్లో నాణ్యత పెంచేందుకే ఉమ్మడి టెండర్లు నిర్వహించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుండగా.. వాస్తవానికి పనుల నాణ్యత తగ్గిపోయిందని దేవదాయ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడి పరిధిలోని వాష్‌రూంలో ఒక వ్యక్తి చనిపోతే నాలుగు రోజుల తర్వాత ఆ విషయం గుర్తించడం గమనార్హం. అంటే నాలుగు రోజుల పాటు అక్కడ పారిశుధ్య పనులే చేపట్టలేదని స్పష్టమవుతోంది. సరైన పర్యవేక్షణ ఉండి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉంటే వెంటనే ఆ ఘటన వెలుగు చూసేదని భక్తులు చెబుతున్నారు. – ఇప్పటికే కట్టబెట్టిన ఏడు ఆలయాలతో పాటు కొత్తగా మరో 15 ఆలయాల్లో పారిశుద్ధ్య పనులను ఒకే సంస్థకు అప్పగిస్తే పనుల పర్యవేక్షణ తగ్గిపోతుందని అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలను కాదనలేక ఈ విషయంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది
-
మా బాధ వినండి చంద్రబాబు.. రోడ్డెక్కిన YSRCP నేతలు
-
నీ అబ్బా సొత్తా అమరావతి.. అమరావతికి నేను వ్యతిరేకినే..!
-
జగన్ ప్రభుత్వమే బెటర్, మా టీడీపీ ప్రభుత్వంలో నాపైనే కేసులు, మద్యంలో అవినీతి బట్టబయలు
-
అద్దాలకే 2,540 కోట్లా..! సమాధానం చెప్పలేక ఎల్లో మీడియా ఎదురుదాడి
-
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
-
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
-
రోడ్డుపై లారీలను పరిశీలించే విధులూ సచివాలయ ఉద్యోగులకే..
సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థ లక్ష్యానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లుపొడుస్తోంది. ఉద్యోగులకు సంబంధం లేని బాధ్యతలు అప్పగిస్తూ చిన్నచూపుచూస్తోంది. మొన్నటికి మొన్న పల్నాడు జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల వద్ద విధులు వేసిన ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో వింత విధులు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీపీసీ యార్డు నుంచి ఫ్లైయాష్ నింపుకొని వచ్చి పోయే లారీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారమిచ్చేందుకు కాపలా కాసే బాధ్యత కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల నెత్తినే పడింది.అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్ వద్ద గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు ఈ పనిచేసేందుకు 18 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరొకరు చొప్పున రోజుకు ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగించారు.సచివాలయ ఉద్యోగులకు లారీలను పరిశీలించే విధులు అప్పగిస్తూ పరవాడ ఎంపీడీవో జారీ చేసిన ఉత్తర్వులు ఫ్లై యాష్ లోడుతో వెళ్లే లారీలపై టార్పాలిన్ లేకపోతే ఆ లారీ వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని పరవాడ ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై యాష్ రవాణాతో ప్రజలు, జంతువులకు ఇబ్బంది కలుగకుండా, ప్రమాదాలను నివారించేందుకే సచివాలయాల ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించామనిఎంపీడీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అవినీతిలో అ‘ధర’హో!
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త దారులు వెతుకుతోంది.. పూటకో నిర్ణయంతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చిన పనిని మళ్లీ ముక్కలు ముక్కలుగా చేసి అదనంగా దోచి పెడుతోంది.. ప్రజల సొమ్మును అందినకాడికి దండుకోడానికి ఇంతగా బరితెగించడం నిర్మాణ రంగ నిపుణులను విస్మయ పరుస్తోంది.. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ మళ్లీ పెంచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులు చేపట్టేందుకు రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలవడానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏజీఐసీఎల్)కు అనుమతి ఇచ్చింది.దాంతో.. డిజైన్లతో కలిపి శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.18,413.68కు చేరిందని స్పష్టమవుతోంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకుంది.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇంతింతై.. అన్నట్లుగా నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.అప్పులు తెచ్చి.. నీకింత–నాకింతరాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని లెక్కలు వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అప్పుడు, ఇప్పుడు అదే కాంట్రాక్టర్శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాలి్సనంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ నాడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్‌వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది.దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది.గూడుపుఠాణీ కాక మరేంటి?⇒ సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను కూడా బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది.⇒ 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.⇒ 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.⇒ జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.⇒ నాడు, నేడు టెండర్లలో ఒకే కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. టెండర్లలో గూడుపుఠాణీ జరిగిందనడానికి ఇదే తార్కాణమని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.17,356.54అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్‌ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్ రింగ్, రింగ్ రూఫ్ వంటి సివిల్ స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లతో అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54కు చేరుకుంది. -
అమరావతి భవనాల అద్దాలకు అక్షరాలా రూ.2540 కోట్లు
-
రైతులకు విత్తన విపత్తు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2026 ప్రారంభం కానుంది. అంతలోపు అంటే మే నెలలోనే రైతులకు రాయితీతో విత్తనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ రెండో వారం నుంచి విత్తన సేకరణ ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ నాలుగో వారం వచ్చినా విత్తనానికి సంబంధించి చడీ చప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ‘అనంత’ రైతులకు విత్తన విపత్తు తప్పేపరిస్థితి కానరావడం లేదు. గత ఏడాది ఇలా.. ఖరీఫ్–2025లో కూడా రైతులకు విత్తన వేరుశనగ సకాలంలో అందలేదు. దాదాపు నెల రోజులు ఆలస్యంగా అంటే జూన్ 5 నుంచి రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టారు. గతేడాది మొదట లక్ష క్వింటాళ్ల వేరుశనగ అన్నారు. తర్వాత 50 వేల క్వింటాళ్లకు కొర్రీ వేశారు. పంపిణీ బాగా ఆలస్యం చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రబీలో కూడా రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ పంట వేసుకున్న తర్వాత మొదలు పెట్టడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది.రాష్ట్ర క్యాబినెట్లో కీలకమంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ స్వంత నియోజకవర్గం ఉరవకొండ ప్రాంతంలోనే పప్పుశనగ సాగు అధికంగా ఉన్నా సకాలంలో విత్తనం ఇవ్వలేని దుస్థితి కల్పించారు. జిల్లాకు 14 వేల క్వింటాళ్లు కేటాయించినా చివరకు 2 వేల క్వింటాళ్లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. అది కూడా 25 శాతం రాయితీ కల్పించడంతో రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీలో రాయితీ విత్తనం కంటితుడుపుగా ఇవ్వడంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విత్తన సేకరణకు ససేమిరా.. ఏపీ సీడ్స్ ద్వారా గత ఖరీఫ్, రబీలో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయలేదు. దీంతో ఈసారి విత్తన సేకరణకు ఏజెన్సీలు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాదికి సంబంధించి రూ.110 కోట్లు బకాయిలు చెల్లిస్తే కానీ తాము విత్తనం సమకూర్చలేమని ఇటీవల జేడీఏ దగ్గర మొరపెట్టుకున్నారు.కనీసం రైతుల నుంచి వసూలు చేసిన నాన్‌సబ్సిడీ సొమ్ము కూడా తమకు ఇవ్వకుండా వాడేసుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందడం కష్టంగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల జిల్లాలో రబీలో రైతులు పండించిన నాణ్యమైన వేరుశనగ వ్యాపారులు, దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపు చివరకు నాసిరకం, కల్తీ సరుకు అంటగట్టే పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో అవార్డులువైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ద్వారా ఖరీఫ్, రబీ మొదలు కాకమునుపే గ్రామ స్థాయిలో రైతులకు రాయితీ విత్తనాలు విజయవంతంగా అందించారు. ఫలితంగా ఏపీ సీడ్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంది. 2021–22 అలాగే 2022–23 జాతీయ అవార్డులు తీసుకుంది. అలాగే 2022 ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు కూడా అందుకుంది. ఖరీఫ్, రబీలో రైతులకు అవసరమైన నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు సకాలంలో అందించిన ఏపీ సీడ్స్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయితీ తగ్గించడంతో పాటు విత్తన కేటాయింపులకు కూడా సగానికి సగం మేర కొర్రీలు వేసింది. దీంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాన్ని నమ్ముకోలేక బయట ప్రాంతంలో స్వంతంగా సమకూర్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. -
‘ముఖ్య’నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్ రైట్.. ‘పూలింగ్’.. పక్కా ప్లానింగ్!
సాక్షి, అమరావతి: రాజధాని రెండో విడత భూసమీకరణలో చంద్రబాబు సర్కార్ మాయాజాలానికి ఇదో తార్కాణం! 2015లో రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి కారుచౌకగా రైతుల నుంచి భారీ ఎత్తున భూములు కాజేసిన పచ్చ ముఠా.. ఇప్పుడు రెండో విడత భూసమీకరణలోనూ అక్రమాలకు పాల్పడుతోందని రైతులు మండిపడుతున్నారు. సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే..ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల్లో 53,749.49 ఎకరాలను రాజధానిగా 2015లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37,941.58 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తామని పేర్కొంది. అయితే 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ మలి విడతలో మరో 44 వేల ఎకరాలను సమీకరిస్తామని చంద్రబాబు 2024లో లీకులు ఇచ్చారు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో విడతల వారీగా సమీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూసమీకరణ కింద ఎకరం భూమి ఇస్తే.. మెట్ట భూమికైతే అభివృద్ధి చేసిన వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి అయితే వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు సీఆర్డీఏ ఇస్తుంది.పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీగా లబ్ధి..భూసమీకరణతో ప్రయోజనం స్వల్పమే.. అదే మినహాయింపు లభిస్తే భారీగా లబ్ధి పొందవచ్చు. దీంతో భూసమీకరణ పథకం నిబంధనలను అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలు లేఅవుట్లను తెరపైకి తెస్తున్నారు. మలి విడత భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఆ విధి వి«ధానాల ప్రకారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలను సమీకరించడానికి సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ చేశారు.అంటే.. అప్పటి ఆ గ్రామాల పరిధిలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం–2025లో పదో నిబంధనను అడ్డుపెట్టుకుని లేఅవుట్లకు మినహాయింపు పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి ముఖ్యనేత సన్నిహితులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం పెదపరిమిలో 9.798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆ గ్రామంలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి వారం ముందు సీఆర్డీఏ కమిషనర్ ఆమోదించారు. లేఅవుట్‌కు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల.. ఆ లేవుట్‌లో ప్లాట్ల విస్తీర్ణం 21,623.12 చదరపు మీటర్లు(25,861.04 చదరపు గజాలు) పుట్టి రామచంద్రరావుకు వస్తుంది.ఒకవేళ అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే.. ఆయనకు 9,798 గజాల ఇంటి స్థలం, 1,959.6 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వస్తుంది. ఇక మల్లవరపు లక్షి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ పొందిన భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు పెదపరిమిలో 3.8301 ఎకరాల్లో లేఅవుట్ అనుమతి కోసం అందచేసిన దరఖాస్తుపై ఏప్రిల్ 6న సీఆర్డీఏ కమిషనర్ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల వారికి 9,408.91 చదరపు మీటర్లు (11,252.97 చదరపు గజాలు) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అదే వారు భూసమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగిస్తే.. 3,830.1 చదరపు గజాల ఇంటి స్థలం, 766 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వచ్చేది.రాజధాని నిర్మాణానికి అదనంగా భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం(భూసమీకరణ పథకం)– 2025 విధి విధానాలను 2025 జూలై 1న ప్రభుత్వం జారీ (జీవో ఎంఎస్ నెంబరు 118) చేసింది.పల్నాడు జిల్లాలో అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి.. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 విధి విధానాల ప్రకారం సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెంబరు 252) జారీ చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో భూసమీకరణ యూనిట్–1 కింద 3,072.23 ఎకరాలు.. భూసమీకరణ యూనిట్–2 కింద 3,056.72 ఎకరాలను సమీకరించేందుకు ఏప్రిల్ 13న సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ..పెదపరిమి భూసమీకరణ నోటిఫికేషన్ జారీకి సరిగ్గా వారం ముందు అంటే ఏప్రిల్ 6న అదే గ్రామంలో సర్వే నెంబరు 447/1బీ(పీ), 447/1సీ(పీ), 447/2లో 9.798 ఎకరాలలో పుట్టి రామచంద్రరావు వేసిన లేఅవుట్‌కు.. సర్వే నెంబరు 82/బీ(పీ)లో 3.8301లో మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ తీసుకున్న సన్ సిరి ప్రాజెక్ట్స్ గ్రీన్ డిలైట్ కేపిటల్ మేనేజింగ్ పార్టనర్లు భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావుæ వేసిన లేఅవుట్‌కు సీఆర్డీఏ కమిషనర్ అనుమతి ఇచ్చేశారు.ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 పదో నిబంధన ప్రకారం వీజీటీఎం, ఉడా, సీఆర్డీఏ, డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్లను భూసమీకరణ నుంచి మినహాయించాలి. అంటే.. పుట్టి రామచంద్రరావు, భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావులు వేసిన లేఅవుట్లకు సంబంధించి 13.8301 ఎకరాలకు భూసమీకరణ నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా వారికి భారీ ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాక.. లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం ముందు లేఅవుట్లకు అనుమతి ఇవ్వడంపై రాజధాని రైతులు విస్తుపోతున్నారు. ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే సన్నిహితులకు ఒక న్యాయం.. తమకో న్యాయమా..! అంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. -
విద్యుత్ కోతలు స్టార్ట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపై వరుసగా ఇంధన కష్టాలు దాడి చేస్తున్నాయి. గ్యాస్ కష్టాలు, పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇప్పుడు విద్యుత్ కోతలు తోడయ్యాయి. ఓ వైపు అనధికార విద్యుత్ కోతలు విధిస్తూ, మరోవైపు నిరంతరం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్దమని సాక్షాత్తూ మంత్రులే బయటపెట్టడం విశేషం. డీజిల్ సరఫరాలో విఫలమైన చంద్రబాబు సర్కారు దాని నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆర్డీఎస్ఎస్’ పనుల పేరుతోనూ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.మంత్రి అచ్చెన్నాయుడు బయటపెట్టిన నిజంకొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రాయల సీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోతోంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో విద్యుత్ కొరత ఏర్పడి కోతలు అనివార్యమవుతున్నాయి. దీనిని ప్రభుత్వంగానీ, ఇంధన శాఖ అధికారులుగానీ ధృవీకరించడం లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అమలు చేయడం లేదని, సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని బుకాయిస్తున్నారు. కానీ ‘‘ఆక్వా కల్చర్ రంగానికి రోజుకి సగటున 2గంటలు విద్యుత్ కోత ఉంది’’ అని సాక్షాత్తూ కూటమి ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నామని స్వయంగా మంత్రులే వెల్లడించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఆక్వాతోపాటు గృహాలకూ పవర్ కట్మంత్రి చెప్పినట్లు ఆక్వా రంగానికి రోజుకు సగటున రెండు గంటలు కాదు అంతకు మించి సరఫరా తగ్గింపు అమలు చేస్తుండగా, గృహ విద్యుత్ వినియోగదారులు రోజులో కనీసం 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పీక్ అవర్స్‌లో అంటే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో పవర్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తున్నారు. వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేసి అడిగితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు వంటివి మారుస్తున్నందున ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఈ సమస్య అత్యధికంగా ఉంది.కొరతను దాచేందుకు కాకి లెక్కలు రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 270.578 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గరిష్ట డిమాండ్ 13,793 మెగావాట్లకు చేరింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గతంలో 120 మిలియన్ యూనిట్ల వరకూ ఉండగా, ఇప్పుడు 91.944 మిలియన్ యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జల విద్యుత్ కేవలం 5.516 మెగావాట్లు వస్తోంది. అధికారికంగా లోడ్ రిలీఫ్ లేదంటూనే అనధికార కోతలు విధిస్తూ డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ కొరత ప్రభావంతో బహిరంగ మార్కెట్లో రాష్ట్ర అవసరాలకు రోజూ 38.750 మిలియన్ యూనిట్లు కొంటున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్లో రాత్రిపూట విద్యుత్ ధర యూనిట్‌కు రూ.10కి చేరింది. దీంతో రాత్రి వేళ మన రాష్ట్రం కొనడం లేదు. పగటి వేళ మాత్రం యూనిట్ రూ.4 చొప్పున కొంటున్నారు. దీని కోసం రోజూ రూ.8.355 కోట్లు వెచ్చిస్తున్నారు. -
స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగులు రోజు కూలీలా?
సాక్షి, అమరావతి: ‘‘స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు శాఖలో పని చేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగులా లేక రోజుకూలీలా?’’ అంటూ స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర శాఖల్లో వేసిన డెప్యుటేషన్లు వెంటనే రద్దు చేసి, అర్హతలను బట్టి ఉద్యోగులను సరైన ప్రాతిపదికన ఆయా శాఖల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరింది. రేషనలైజేషన్ పేరుతో పనిభారం పెంచే ప్రక్రియ వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.ఒకే జీతంతో రెండు పనులు చేయించడం అన్యాయమైన చర్యగా పేర్కొంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులకు స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోని వార్డు సచివాలయాల్లో ఆరు విభాగాల ఉద్యోగుల్లో ఒక్కరికీ పదోన్నతి కల్పించకుండా తాత్సారం చేయడం అన్యాయమని మండిపడింది., ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జాని పాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బాబు సర్కార్ మళ్లీ అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.9,000 కోట్లు అప్పు చేసింది. మే ఐదో తేదీ (మంగళవారం) మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,698 కోట్లు, రోజుకు సగటున రూ.523 కోట్లు అప్పు చేస్తోంది. -
అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు అది చాలదన్నట్లుగా ఆ భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్‌మాల్‌కు పచ్చజెండా ఊపింది! ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా రూ.2,540 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టు ఇచ్చేందుకు కేబినెట్ పరిపాలన ఆమోదం ఇచ్చింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో రూ.798 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టుకు పరిపాలన ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బుల్లేవంటూ పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తి అయ్యేవని, వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా రూ.3,338 కోట్ల వ్యయానికి పరిపాలన ఆమోదం ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు. ⇒ అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. మూడు ప్యాకేజీలుగా లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిడెట్ ఎండీకి అనుమతి. ⇒ శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ అండ్ అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్ పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం. లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి. ⇒ రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు రద్దు. ఆ భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయం. ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు ఆమోదం. ⇒ అమరావతిలో కృష్ణా కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం కోసం రూ.443.26 కోట్లతో కరకట్ట బలోపేతం, విస్తరణకు ఆమోదం. రూ.149.82 కోట్లు, రూ.146.47 కోట్లు, రూ.146.97 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పరిపాలన అనుమతి మంజూరు. గతంలో కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ.1304.89 కోట్లతో ఇచ్చిన పరిపాలన అనుమతి రద్దు. ⇒ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ రెండు టవర్లు నిర్మాణానికి రూ.1,208 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో జోన్––11 పరిధిలో ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ స్కీము కింద మౌలిక సదుపాయాల పనులకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో కొన్ని కూడళ్లలో మిగిలిన పనులకు గతంలో ఇచ్చిన రూ.1082 కోట్ల పరిపాలన అనుమతి వ్యయాన్ని రూ.1180 కోట్లకు పెంచేందుకు ఆమోదం. ⇒ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీములో సవరణలకు ఆమోదం. యాన్యుటీ పెంపు, అప్పు మాఫీ కట్ ఆఫ్ తేదీ సరళీకరణకు సవరణలు. సీఆర్డీఏలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం. ⇒ రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యత్యాస పనులకు ఆమోదం. అదనంగా రూ.354 కోట్ల వ్యయానికి ఆమోదం. ⇒ ఢిల్లీలో 11.536 ఎకరాల భూమిలో కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి ఆమోదం. రూ.124.50 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, నిర్మాణ పనులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీ)కు అప్పగించేందుకు అనుమతి. ⇒ పోలవరం నిర్వాసిత కుటుంబాలకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఇళ్లు నిర్మాణానికి యూనిట్ ధర రూ.2.85 లక్షల నుండి రూ.3.57 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ సహాయ పునరావాస కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ల స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో 525 మీటర్లు పొడవున ఎస్కేప్ చానల్ తవ్వకం అదనపు పనులు నామినేషన్‌పై అప్పగించేందుకు ఆమోదం. ⇒ శ్రీసత్యసాయి జిల్లా హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్–11 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా రూ.309 కోట్లకు పరిపాలన ఆమోదం. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి తాజాగా రూ.1586.69 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. -
పేదలపై బాబు సర్కారు కక్ష!
సాక్షి, అమరావతి: సామాజిక సమతూకం.. స్థానికులకు ప్రాధాన్యం.. మహిళా సాధికారత.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ రాజధాని అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేసింది. తద్వారా పేదలకు రాజధానిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంటే కొంత మందికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునేందుకు గురువారం కేబినెట్ పచ్చ జెండా ఊపింది. పేదలకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయించింది.ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఓ వైపు పేదల గూటి కలలను కూల్చి వేస్తూ.. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణం కోసం మాత్రం కారుచౌకగా భూ కేటాయింపులు చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం కేవలం బడా బాబులకే సొంతమనే రీతిలో వ్యవహరిస్తూ పేదలను గెంటేసేలా నిర్ణయం తీసుకుంటున్నారనేందుకు సర్కారు తాజా నిర్ణయమే తార్కాణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ప్రత్యామ్నాయంగా కనీసం వారికి ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారో కూడా చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని సర్కారు సరికొత్త భాష్యం చెప్పడం దారుణమంటున్నారు. రాజధాని సహా రాష్ట్రంలో ఎక్కడా పేదలకు ఒక్క గజం కూడా భూమి ఇవ్వని చంద్రబాబు.. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడం గమనార్హం. రాజధానిలో బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 900 ఎకరాలతో ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది. దానిని భారీ లేవుట్‌గా అభివృద్ధి చేశారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. సంపద సృష్టిస్తూ.. విలువైన ఆస్తిని మహిళల చేతికి అందించింది. పేదల ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 78 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ఏకంగా 17 వేలకుపైగా కాలనీలు రూపుదిద్దుకున్నాయి. 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి వందల ఇళ్ల నిర్మాణంతో ఆయా చోట్ల కొత్త గ్రామాలే ఆవిష్కృతమయ్యాయి. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు సైతం చోటు ఉండాలని, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్ 5 జోన్‌ను ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏమాత్రం గిట్టని చంద్రబాబు సర్కారు పేదలపై కక్ష కట్టి తన తీరును మరోమారు చాటుకుంది. సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
బాబుపై చింతా మోహన్ సెటైర్లు.. రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి పెడుతున్నావ్
-
కర్రలు.. రాళ్లతో దాడులు.. భయపడేలా అక్రమ కేసులు.. బాబు, లోకేష్ విధ్వంస పాలన
-
అమరావతిలో మరో భారీ దోపిడీకి స్కెచ్
-
ఇంధనానికి బంధనం.. కొరత లేదంటూనే కోత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ బూటకపు ప్రచారం చేయడం తప్ప బంకులకు సరఫరాను మెరుగుపర్చట్లేదు. వారం గడిచినా ఇప్పటికీ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌పై పరిమితి కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలకు కేవలం రూ.200కు మించి పెట్రోల్ నింపడం లేదు. కార్లకు అయితే గరిష్టంగా 10–15 లీటర్లు, లారీలకు 50 లీటర్ల వరకే డీజిల్ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకసారి రెండు లీటర్ల డీజిల్ నింపుకుని వెళ్లొచ్చేలోగా అయిపోతోంది. మళ్లీ హడావుడిగా బంకుల దగ్గర పరుగెత్తాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ప్రయాణికులతో మార్గంమధ్యలో ఆగిపోవాల్సి వస్తోంది. ఆటోలను తోసుకెళ్లలేక ఖాళీ బాటిళ్లలో ఇంధనం నింపుకుని వద్దామంటే ప్రభుత్వ ఆదేశాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఖాళీ టిన్నులు, బాటిళ్లలో ఇంధనం నింపొద్దని చంద్రబాబు సర్కార్ జారీ చేసిన ప్రకటన బడుగుల జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అవసరానికి మించి ఇంధనం తీసుకుంటే ప్రజలను సైతం శిక్షిస్తామని బహిరంగంగా పోస్టర్లు వేయడం అరాచక పాలనకు అద్దం పడుతోంది. తనిఖీల పేరుతో బంకుల సీజ్ రాష్ట్రంలో ఇండెంట్‌కు, అవసరాలకు తగ్గట్టుగా బంకులకు ఇంధన సరఫరా జరగడం లేదు. దీంతో ప్రభుత్వం తనిఖీల పేరుతో పెట్రోల్ బంకుల యజమానులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. నో స్టాక్ బోర్డులు పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. పైగా తనిఖీల్లో స్టాకు లేనట్టు గుర్తిస్తే అక్కడ అక్రమంగా ఇంధనాన్ని దొడ్డిదారి పట్టించారంటూ బంకులను సీజ్ చేస్తోంది. సంక్షోభం సమయంలో ఇలా బంకులను సీజ్ చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారనే కనీసం విజ్ఞత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోంది. బంకుల యజమానులు తమకు సాధారణ రోజుల్లో మాదిరి ఇంధనం రావడం లేదని ఎంత మెరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంధనం అయిపోతే బంకులదే బాద్యత అంటూ విచిత్ర వాదన తీసుకొచ్చి నిత్యం నరకం చూపిస్తోంది. చాలా బంకులకు రెగ్యులర్ వినియోగదారులుంటారు. వారంతా ఆయా బంకుల్లోనే తమ వాహనాలకు ఇంధనాన్ని నింపుతుంటారు.అలాంటి వారికి చాలా బంకులు క్రెడిట్(అప్పు)పై ఇంధనం విక్రయిస్తుంటాయి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రవాణా రంగం కుదేలైంది. డైలీ క్యాబ్ సర్వీసులు, దూర ప్రాంతాలకు సరుకులు చేరవేసే మినీ వ్యాన్లు అర్థంతరంగా రోడ్లపై ఆగిపోతున్నాయి. పెద్ద వాహనాలకు 100 లీటర్ల డీజిల్ పోస్తారని ప్రకటించినా బంకుల్లో లభ్యత లేకపోవడంతో అరకొరగానే నింపుకోవాల్సి వస్తోంది. క్రెడిట్ ఎత్తేసిన కంపెనీలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా దివాళ తీస్తోంది. అప్పులపై వడ్డీలు.. ఆ వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడంతోనే పరిపాలనను నెట్టుకొస్తోంది. ఫలితంగా సామాన్య పొదుపు సంఘాల క్రెడిట్ పరపతి ఎప్పుడో కుదేలైంది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు రంగంలోని బంకులకూ అది పాకింది. ప్రభుత్వ పనితీరును నిత్యం మదింపు చేసుకుంటున్న ఆయిల్ కంపెనీలు క్లిష్ట సమయంలో బంకులకు క్రెడిట్(అప్పు)ను నిలిపివేశాయి. ముందుగా చెల్లిస్తే తప్ప స్టాకును పంపించట్లేదు. ఒక్కసారిగా రూ.లక్షల్లో నగదు సమకూర్చలేని స్థితిలో బంకుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, దోపిడీ విధానాల కారణంగా డబ్బులు కట్టినా ఏకంగా సరఫరాను కుదించేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యనేత సాధారణ బంకుల నుంచి కమర్షియల్, బల్క్ డీజిల్‌ను తరలించాలని ఆదేశాలివ్వడంతో పరిస్థితి దిగజారిపోయింది. కమర్షియల్‌లో డీజిల్ రేటు రూ.153 ఉండటంతో ప్రభుత్వం రిటైల్ రేటుకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్‌ను బంకుల నుంచి సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీని ఫలితంగా బల్క్ ఆర్డర్లకు డీజిల్ తరలించుకుపోవడంతో కొరత తీవ్రమైంది. రిటైల్ నుంచి కమర్షియల్‌కు దారి మళ్లింపు రాష్ట్రంలో సగటున రోజువారీగా 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి నేటివరకు దాదాపు లక్ష కిలో లీటర్ల డీజిల్ బ్యాక్ లాగ్ ఉంది. అంటే, ఇప్పటికిప్పుడు లక్ష కిలో లీటర్ల డీజిల్ అందుబాటులోకి వస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదు. మరుసటి రోజు నుంచి యథావిధిగా రోజుకు 20 వేల కిలో లీటర్ల డీజిల్ సరఫరా ఉండాల్సిందే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఒక్క రాజధాని ప్రాంతంలోనే 10 లక్షల లీటర్లకుపైగా రిటైల్ ఇంధనాన్ని కమర్షియల్‌లో వాడేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిటైల్‌ను కమర్షియల్‌లోకి దారి మళ్లించేశారు. ఏపీలో 100కు పైగా లారీలు, టిప్పర్లను ఆపరేట్ చేసే కంపెనీలు స్థానికంగానే మార్కెట్ కంటే రూ.10 అదనంగా చెల్లించి భారీస్థాయిలో ఇంధనం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రజలకు చేరాల్సిన డీజిల్, పెట్రోల్ పక్కదారి పడుతోంది. -
‘విజనరీ’ కాదు.. విఫల పాలకుడు!
సాక్షి, అమరావతి: ‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు...! అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి! విజనరీ, పరిపాలనా దక్షుడని టీడీపీ కూటమి, ఎల్లో మీడియా ఊదరగొట్టే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రిటైల్ బంకులలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చంద్రబాబు సర్కారు అడ్డదారిలో ఉత్తర్వులు జారీ చేయడంతో వారం రోజులు వాహనదారులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంపై రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్‌లో అవసరమైతే కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కొనుగోలు చేయాలి. అందుకోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. బల్క్‌లో కొంటే లీటర్ డీజిల్‌కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్ బంకుల్లో రిటైల్‌గా అయితే లీటర్ డీజిల్ రూ.98కే దొరుకుతుండటంతో అడ్డదారిలో కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో బాబు సర్కారు బండారం బట్టబయలైంది. పాలన గాలికి వదిలేసి మొద్దునిద్ర..!పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు అల్లాడుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తుండటం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. రాష్ట్రంలోని 4,500 బంకుల్లో ఇంధన కొరత వేధిస్తోంది. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి బారులు తీరుతున్నా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనమే లేకుండాపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చలేక చేతులు ఎత్తేశారు. అత్యవసర సేవలు, సరఫరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం మరోసారి బట్టబయలైంది. కీలక సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజులపాటు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఈనెల 24 నుంచి పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తింది. బంకుల వద్ద వాహనదారులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్ర వీడలేదు. పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తినట్లు అదే రోజు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కావడంతో అధికారులు నిస్సహాయంగా మిగిలారు. దాంతో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చి బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా లారీలు, ఇతర వాహనాల సర్వీసులు నిలిచిపోయాయి. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితి పూర్తిగా దిగజారింది. బంకుల వద్ద ఘర్షణలు చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వాహనదారులు ఆందోళనతో ఒక బంకు నుంచి మరో బంకు చొప్పున నాలుగైదు చోట్లకు తిరిగినా అంతటా అదే పరిస్థితి నెలకొంది. వాహనాల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనం ఖర్చు కావడం మినహా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. చమురు కంపెనీలపై ఆగ్రహం అంటూ లీకులు..ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనదారులు గగ్గోలు పెట్టారు. ఎట్టకేలకు గత ఆదివారం సాయంత్రానికిగానీ చంద్రబాబు కుంభకర్ణ నిద్ర వీడలేదు. అధికారులతో సమీక్ష పేరిట మభ్యపుచ్చేందుకు యత్నించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై సీరియస్ అయినట్లు ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకవైపు వాణిజ్య అవసరాల కోసం వినియోగించాల్సిన డీజిల్‌ను సిండికేట్ కాంట్రాక్టు సంస్థల కోసం దారి మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు మరోవైపు చమురు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకులిచ్చారు. కొరత ఎందుకు ఏర్పడిందో తనకు స్పష్టంగా తెలిసినా పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నా కనీసం పెట్రోలియం శాఖ మంత్రితో చర్చించకపోవడం గమనార్హం. తుస్సుమన్న రియల్ టైమ్ గవర్నెన్స్..చంద్రబాబు ఘనంగా చెప్పుకునే రియల్ టైమ్ గవర్నెన్స్ గాలి బుడగలా పేలిపోయింది. పెట్రోల్, డీజిల్ కొరత లాంటి సాధారణ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. వెలగపూడిలోని ఆర్టీజీఎస్ ఆఫీసు నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చిటికెలో పరిష్కరిస్తామని చంద్రబాబు గొప్పగా చెబుతూ ఉంటారు. వారం రోజులుగా బంకుల వద్ద బారులు తీరిన వాహనదారుల ఫొటోలు, వీడియోలను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ చూపించలేదా? లేక సమస్యను పరిష్కరించడం కూటమి ప్రభుత్వానికి చేతకాలేదా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పలు ప్రాంతాల్లో తనిఖీల పేరిట బంకు యజమానులను వేధిస్తున్నారు. స్టాక్ లేదనే వంకతో బంకులను సీజ్ చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.చినబాబు మౌనం.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసంపెట్రోల్, డీజిల్ కొరత ఇంత తీవ్రంగా వేధిస్తున్నా మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసే వారిద్దరూ పెదవి విప్పడం లేదు. గుప్త పర్యటన కోసం వెళ్లిన లోకేశ్ సామాన్యుల సమస్యతో తనకేం సంబంధం అన్నట్లుగా మిన్నకుండిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతం వీడలేదు. కనీసం ఫోన్లో కూడా అధికారులను ఆరా తీయలేదు. -
పెట్రో దెబ్బకు కూర‘గాయాలు’!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సిండికేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కారు నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ డీజిల్‌ను అడ్డదారిలో మళ్లించడంతో రవాణావాహనాలకు డీజిల్ దొరక్క నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. వారం వ్యవధిలోనే భారీగా పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఇప్పటికే సర్కారు నిర్వాకంతో వంట నూనెల ధరలు చుక్కలనంటుతుండగా ఆ జాబితాలో కూరగాయలు కూడా చేరాయి. డీజిల్ కొరత కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఓవైపు డీజిల్ కొరతతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కూరగాయలు కుళ్లిపోతుండగా మరోవైపు సరఫరా ఆగిపోవడంతో ధరలు పెరిగిపోయి వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రమంతా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో పెరిగిన ధరల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు కథనం ఇదీ!వారం రోజులుగా వాహనాల్లోనే వేల టన్నులు..రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలకు కూరగాయలు, నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలకు చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో బ్రేకులు పడ్డాయి. రిటైల్ బంకులలో సాధారణ ప్రజలు వినియోగించే డీజిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిండికేట్ కాంట్రాక్టర్ల కోసం మళ్లించడంతో వ్యవస్థ గాడి తప్పింది. డీజిల్ దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల నుంచి నిత్యావసరాలు మోసుకొచ్చే లారీలను హైవేల పక్కన రోజుల తరబడి నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా వేల టన్నుల కూరగాయలు వాహనాల్లోనే మగ్గిపోయి కుళ్లిపోతున్నాయి. మార్కెట్‌కు సరుకు రాకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లకు మదనపల్లె, కర్నూలు నుంచి టమాటా... బాపట్ల, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పచ్చిమిర్చి.. ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాదుంపలు.. కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లి.. కర్నాటకలోని కోలార్ నుంచి క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బీట్రూట్, కాలిప్లవర్ వస్తుండగా మిగిలిన కూరగాయలు కృష్ణా, గుంటూరు, గోదావరి లంక గ్రామాల నుంచి రవాణా అవుతుంటాయి. ఆకుకూరలు పూర్తిగా లంక గ్రామాలతో పాటు స్థానిక పల్లెల నుంచే వస్తుంటాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాలకు రోజూ 275–300 టన్నుల వరకు కూరగాయలు రవాణా అవుతుంటాయని అంచనా.రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలు..రాష్ట్ర పరిధిలో రోజుకు 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగమవుతుండగా అందులో 30 శాతానికి పైగా సరుకు రవాణా వాహనాలే వినియోగిస్తుంటాయి. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలుండగా 40 శాతం వాహనాలు పూర్తిగా కూరగాయలు, నిత్యావసరాలను చేరవేస్తుంటాయి. డీజిల్ సంక్షోభం మొదలైన తర్వాత ఇవి ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. విశాఖ, విజయవాడ లాంటి ప్రధాన నగరాలకు రోజూ వచ్చే సరుకుల లోడు 30 నుంచి 40 శాతం తగ్గిపోయింది. రూ.కోట్ల విలువైన పంట ఉత్పత్తులు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. మదనపల్లి, కర్నూలు, అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి, టమాటా లోడులతో బయల్దేరిన లారీలు డీజిల్ దొరక్క దారి మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చిందని చిత్తూరుకు చెందిన ఓ లారీ యజమాని ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉండిపోవడంతో ఎండవేడికి కూరగాయలు కుళ్లిపోతున్నాయి. డీజిల్ కొరతతో కిరాయిలు రెట్టింపు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.20–30 శాతం పెరిగిన ధరలువేసవిలో ఉత్పత్తి తగ్గడం..దానికి డీజిల్ సంక్షోభం తోడు కావడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రైతులకు కిలో రూ.3–5కు మించి ధర లభించని టమాటా రిటైల్ మార్కెట్లో మూడు రెట్లు పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో కిలో రూ.15–20 పలికిన టమాటా ప్రస్తుతం రూ.45–55 పలుకుతోంది. మిగిలిన ప్రధాన కూరగాయల ధరలన్నీ 20–30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆకుకూరలు సైతం 10–20 శాతం ధరలు పెరిగాయి. విజయవాడలోని ప్రధాన రైతుబజార్లలో ఈ నెల ప్రారంభంలో కిలో రూ.16 ఉన్న టమాటా ధర ప్రస్తుతం రూ.35కు చేరింది. వంగ రూ.20 నుంచి రూ.35కి ఎగబాకింది.సకాలంలో రాకపోవడంతో..డీజిల్ కొరత కారణంగా రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనాలు మధ్యలోనే నిలిచి పోయాయని చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా సరుకు రాకపోవడంతో స్థానికంగా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. – గాదే వెంకటేశ్వరరావు, కూరగాయల వ్యాపారి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాఒక్కసారిగా పెరిగాయి..కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 15 రోజుల క్రితం వరకు నిలకడగా ఉన్న ధరలు ప్రస్తుతం అమాంతం పెరిగిపోయాయి. టమాటా మూడు రెట్లు పెరిగింది. ఇతర కూరగాయల ధరలు కూడా రూ.10–30 వరకు పెరిగాయి. డీజిల్ కొరత కారణంగా వాహనాలు రావడం లేదు. సరుకు లేకపోవడం వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. – వన్నంరెడ్డి సురేష్, శ్రీనగర్ కాలని, విజయవాడజేబులకు చిల్లు పడుతోందిఇప్పటికే వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెరగడం భారంగా ఉంది. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వమే పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. డీజిల్ కొరత కారణంగా సరుకు రవాణా తగ్గి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.– ఆత్మకూరి శ్రీనివాసరావు, పేరవలిపాలెం, బాపట్ల జిల్లా -
పంతం నెగ్గించుకున్న ‘ముఖ్య’నేత!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేందుకు ‘ముఖ్య’నేత మార్గం సుగమం చేసుకున్నారు. అధికారం అండతో మేనేజింగ్ కమిటీలో అందరూ తమకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పావులు కదిపారు. బుధవారం జరిగిన కమిటీ ఎన్నికల్లో అంతా ముఖ్యనేత అనుకున్నట్లే జరిగింది. కాలేజీని ముఖ్యనేత పరం చేసేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడగా దాదాపు అందరూ ముఖ్య నేతకు కాలేజీని బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కమిటీ కోసం ముఖ్య నేత మనుషులు 20 రోజులుగా ‘ప్రత్యేక ఆపరేషన్’ నిర్వహించారు. పాత డైరెక్టర్లలో ఒక వర్గాన్ని గతంలోనే లొంగదీసుకోగా మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. బెదిరింపులతోపాటు అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది. రాజధాని పనులు పర్యవేక్షించే మంత్రి ఈ వ్యవహారంలో అన్నీ తానై వ్యవహరించారు.ముఖ్య నేత ప్రాపకం కోసం.. ముఖ్యనేత బినామీగా పేరు పొందిన ఓ పారిశ్రామికవేత్త, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ మొదట అన్ని విషయాలు పర్యవేక్షించి పాత డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్య నేత అభీష్టాన్ని తెలుసుకున్నాక మంత్రి కూడా రంగంలోకి దిగారు. ముఖ్య నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకున్నారు. కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి నయాన భయాన దారికి తెచ్చుకున్నట్లు తెలిసింది. దీంతో ముఖ్యనేతకు అనుకూలంగా వ్యవహరించే మేనేజింగ్ కమిటీ ఏర్పాటైంది. ఇక ఈ కమిటీ ద్వారా కాలేజీని ముఖ్యనేత తమ కుటుంబం పరం చేసుకోవడమే మిగిలింది. అత్యంత కారుచౌకగా కాలేజీ, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు పాత డైరెక్టర్లు చర్చించుకుంటున్నారు.రూ.2 వేల కోట్ల ఆస్తి.. పప్పు బెల్లాలకు!కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2003లో ఈ ప్రాంతానికి చెందిన 32 మంది ఎన్ఆర్ఐ వైద్యులు ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్‌ను స్థాపించారు. మంగళగిరిలో 50 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కాలేజీ, దానికి అనుబంధంగా ఆస్పత్రిని నిర్మించారు. అనతి కాలంలోనూ అది ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందగా దాని విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలేజీ విలువ రూ.2 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. మేనేజింగ్ కమిటీలో తలెత్తిన విభేదాలతో దీనిపై ముఖ్య నేత కన్ను పడింది. వీటిని ఆసరాగా తీసుకుని ఏకంగా కాలేజీనే సొంతం చేసుకునే ఎత్తుగడ వేశారు. ఇందుకోసం తన బినామీలను రంగంలోకి దించి డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా కమిటీ ఏర్పాటయ్యేలా కుట్రలు పన్నారు. కాలేజీని కారుచౌకగా ముఖ్యనేత కుటుంబ పరం చేసేలా పావులు కదిపారు. కాలేజీకి చెందిన రూ.240 కోట్ల కార్పస్ ఫండ్‌తోపాటు ఇతర విలువైన ఆస్తులను దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. -
అమరావతికి డీజిల్ తరలింపు.. ఏపీలో మాత్రమే ఇంధన కొరత
-
24 గంటల డెడ్ లైన్.. పెట్రోల్ బంకుల వద్ద YSRCP ధర్నా..
-
బాబుకు బెస్ట్ రిఫార్మర్ అవార్డు ఎలా..? చేసింది గోరంత..చెప్పుకునేది కొండంత
-
డీజిల్ కొరతకు కారణం ప్రభుత్వమే.. ఇదే ప్రూఫ్
-
నోట్ల రద్దు అప్పుడు ఇదే ప్రభుత్వం ఉంది.. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఉంది..
-
చెత్త సీఎం.. జగన్ దగ్గర నువ్వు జీరో.. బాబుని ఏకిపారేసిన తిరుపతి మహిళలు
-
అమరావతి కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కోసం.. ఇంధన సంక్షోభం సృష్టి
-
అమరావతి పేరుతో డీజిల్ గేమ్ ? బాబు నిర్ణయంపై కేంద్రం ఫైర్
-
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ఇక్కట్లకు కర్మ, కర్మ, క్రియ చంద్రబాబు ప్రభుత్వమే... రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్ సరఫరా
-
ఇంధన సంక్షోభం తీగ లాగితే.. అమరావతి డొంక కదిలింది.. అమ్మ చంద్రబాబూ..!
-
ఒకేసారి 6,124 మంది సచివాలయ ఉద్యోగులకు డిప్యుటేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 6,124 మందిని వివిధ ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధ్యక్షతన మార్చి 13న వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ నెల 22న అన్ని శాఖలకు చేరాయి. మొత్తం 19 శాఖలకు 10,465 మంది ఉద్యోగులు అవసర మని ఆయా శాఖలు ప్రభుత్వానికి తెలియ జేయగా.. 6,124 మందిని సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులలో 2వేల మందిని హోంశాఖలో సిటిజన్ సర్వీస్ ఫెసిలిటేటర్లుగా, మరో 783 మందిని మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య విభాగం ఉద్యోగులుగా.. ఇంకో 406 మందిని మెప్మాలో కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లుగా.. 129 మందిని సెర్ప్‌లో లైవ్లీ హుడ్ (జీవనోపాధుల కల్పన) అసిస్టెంట్లుగా.. 100 మంది మహిళా పోలీసులను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా, 9 మందిని మైనార్టీ శాఖకు డిప్యుటేషన్‌పై పంపాలని ప్రతిపాదించారు.ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సైతం..గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను సైతం వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపించాలని నిర్ణయించారు. వారిలో 430 మందిని గృహ నిర్మాణ శాఖ, 367 మందిని ఆర్ అండ్ బీ, 250 మందిని ఆర్డబ్ల్యూఎస్, 70 మందిని వైద్యశాఖ పరిధిలోని సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఇంకో 50 మందిని విద్యా శాఖలో ఇంజినీరింగ్ పనులకు, 20 మందిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 10 మందిని టూరిజం ఇంజనీరింగ్ పనులకు ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు.గిరిజన శాఖ పరిధిలోని ఐటీడీఏలో 28 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, సమగ్రశిక్ష విభాగంలో 113 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డిప్యుటేషన్ విధానంలో నియమించాలని ప్రతిపాదించారు. 562 మంది వార్డు ఎమినిటీస్ సెక్రటరీలను పట్టణాభివృద్ది శాఖలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు, 530 మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలను టౌన్ ప్లానింగ్ విభాగంలో వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. 140 మంది వార్డు రెవెన్యూ సెక్రటరీలను సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్లు, కేర్ టేకర్లుగా, 125 మంది వీఆర్ఏలను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లుగా డిప్యుటేషన్‌పై పంపాలని ప్రతిపాదించారు.సచివాలయాల ఉద్యోగులు కూలీలా..సచివాలయ ఉద్యోగులను కూలీల మాదిరిగా ఏ శాఖకు కావాలంటే ఆ శాఖకు పంచుతుండటం దుర్మార్గమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ అబ్దుల్‌రజాక్, ప్రధాన కార్యదర్శి శిష్టు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను బలహీనపరచడానికి, అస్తవ్యస్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. డిప్యుటేషన్‌పై పంపించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
చరమ‘గీతమే’ లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు ప్రతి మంగళవారం వేలకు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... మరోవైపు విశ్వవిద్యాలయాల నిధులను కూడా దోచేస్తోంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఖజానాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ.300 కోట్ల మేర ఏయూ నిధులను చంద్రబాబు ప్రభుత్వం కాజేసింది. ఏయూ నిధులు రూ.150 కోట్లు చొప్పున రెండు విడతల్లో రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు ప్రభుత్వం జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయాలనైనా పాలకవర్గం (ఈసీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గీతంలో పనిచేసి, గీతం వలన ఏయూ వీసీగా వచ్చిన రాజశేఖర్‌కు ఇవేవీ లెక్కలోలేవనే విమర్శలున్నాయి. ఈసీతో పనిలేకుండానే నేరుగా ఆయన ఏయూ నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించినట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్ల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఏయూ ఖజానా నుంచే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే రూ.200 కోట్లను వర్సిటీ వేతనాలకు వినియోగించింది. ఇక నూరేళ్ల చరిత్రను పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు సైతం ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఇందుకోసం కూడా సుమారు రూ.63.5 కోట్లను వర్సిటీ ఖజానా నుంచే వెచ్చించినట్లు సమాచారం. ఈ విధంగా వర్సిటీ ఖజానాను ఖాళీ చేయడం ద్వారా ఏయూలో అభివృద్ధి లేకుండా చూడాలనే పన్నాగం ఒకటి అమలవుతోందన్న ఆరోపణలున్నాయి. అంతిమంగా గీతం అనే ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏయూను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.శతాబ్ది ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం1926 నుంచి 2026కు నూరేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఏయూలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఏడాది కాలంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. పైగా శతాబ్ది ఉత్సవాలకు వెచ్చించిన రూ.63.5 కోట్లను ఏయూ ఖజానా నుంచే ఖర్చు చేశారు. అంతేగాకుండా కొద్దిరోజుల కిందట మరో రూ.300 కోట్లను ప్రభుత్వం లాగేసుకుంది. మరోవైపు ఉద్యోగుల జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో రూ.200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లించారు.వెరసి ఇప్పుడు ఏయూ ఖజానా డొల్లగా మారింది. ఒకవైపు ఏయూ ఖజానాను కొల్లగొడుతున్న చంద్రబాబు.. శతాబ్ది ఉత్సవాల్లో మాత్రం రూ.500 కోట్లు కేటాయిస్తానంటూ ప్రకటించారు. వాస్తవానికి 2016లో జరిగిన ఏయూ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో కూడా సీఎం హోదాలో ఏయూకి రూ.13.9 కోట్ల మేర మ్యాచింగ్ గ్రాంటు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలుమ్ని అసోసియేషన్ కార్పస్‌ఫండ్‌కు రూ.10 కోట్లు నేరుగా కేటాయిస్తామని చెప్పారు. అయినా ఆయన ఒక్కపైసా కూడా విదల్చలేదు. తాజాగా ఇప్పటికే ఏయూ ఖజానాను గుల్లచేసిన చంద్రబాబు.. ఇప్పుడు రూ. 500 కోట్లు కేటాయిస్తానని చెప్పడాన్ని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.‘గీతా’లాపన కోసమే..!చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏ వ్యవహారం జరిగినా అంతిమంగా గీతంకి లబ్ధి చేకూర్చేందుకేనని తెలుస్తోంది. మొన్నటికి మొన్న గీతం ఆక్రమించుకున్న రూ.5 వేలకోట్ల విలువైన భూములను సక్రమం చేసేందుకుగాను దాడులు చేసి మరీ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం జరిగేలా చూశారు. ఏకంగా దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికైన మొదటి విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించిన ఏయూలోని కేంద్రాన్ని పూర్తిస్థాయి స్కూలుగా మార్చాలని గతంలో నిర్ణయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణ కేంద్రాన్ని మూసేశారు.దీంతో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. ఇక యూనివర్సిటీలో బాగా డిమాండ్ ఉన్న దూరవిద్యలో అందించే రక్షణరంగ కోర్సులను ఎత్తేశారు. తద్వారా ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లించేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణశాఖ ఏయూని భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడాన్ని గమనిస్తే.. ఏయూలో వ్యవహారాలన్నీ గీతం కోసమే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గీతం కోసమే ఏయూను భ్రష్టుపట్టించే కార్యక్రమం జరుగుతోందని స్పష్టమవుతోంది. -
అంగన్వాడీలకు సెలవుల సంగతేంటి?
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఎండలు మండుతాయి. వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన చిన్నారులు, బాలింతలు, గర్భిణుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎండల తీవ్రత దృష్ట్యా రెండునెలల రేషన్ ఒకేసారి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నా... అంగన్వాడీ కేంద్రాలకు సెలవుల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. చర్చల సమయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం చెబుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇచ్చిన హామీకి ఇంత వరకూ అతీగతీ లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో సెలవుల ప్రకటన రెండు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనుంది. అయినా అంగన్వాడీలకు మే 1 నుంచి వేసవి సెలవుల ఇచ్చే విషయమై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అంగన్వాడీలకు మే 1 నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. 20 రోజుల క్రితమే చర్చించినా.. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని 20 రోజుల కిందటే అంగన్వాడీ యూనియన్ నేతలు కలిసి వేసవి సెలవుల విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా చాలా రోజులు సమయం ఉందని, సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఏప్రిల్ ముగిసి మే నెల వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంత వరకు సెలవుల విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సెలవులు ప్రకటించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి వద్దే రేషన్(టీహెచ్ఆర్) అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు. -
డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం.. సిండికేట్‌కు ‘ఇంధనం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారం రోజులుగా మండుటెండల్లో రోడ్లమీద నరకయాతన.. పెట్రోలు బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు.. సాధారణ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారుల దీనావస్థ, ఇక్కట్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబు సర్కారేనని రుజువైంది. ప్రజల కళ్లకు గంతలు కట్టి సర్కారే దొంగాట ఆడుతున్నట్లు తేలిపోయింది! దోచుకో.. పంచుకో.. తినుకో..! విధానంతో బరి తెగించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్న టీడీపీ పెద్దలు ప్రజలు ఏమైపోతే తమకేమంటూ జనం జీవితాలతో చెలగాటమాడేందుకు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో ఇంధన కొరతపై సమీక్షించిన సీఎం చంద్రబాబు చమురు కంపెనీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. విరుచుకుపడ్డారని ఎల్లో మీడియా, సీఎంవో ఇచ్చిన లీకులు ఉత్తుత్తివేనని తేలిపోయింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి జోక్యం చేసుకోవడంతో చంద్రబాబు బడాయిల బండారం బట్టబయలైంది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్ డీజిల్‌ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్ పెట్రోలు బంకులలో రాజధాని నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ బాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయటాన్ని కేంద్రం తప్పుబట్టింది. ఇది చట్ట విరుద్ధమని, ఆ ఉత్తర్వులు చెల్లవని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించిది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఢిల్లీలో పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులను కలసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఏపీలో వారం రోజులుగా ప్రజల దుస్థితిని వివరించడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను బాబు సర్కారు ఏపీలో కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పిస్తూ వాణిజ్య అవసరాల కోసం దారి మళ్లించినట్లు బహిర్గతమైంది. ఈ అడ్డగోలు ఆదేశాలే రాష్ట్రంలో డీజిల్ సమస్యకు కారణం రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వులుకాంట్రాక్టర్లు నేరుగా కాదు.. బల్క్‌లో కొనాల్సిందేరాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ. వందల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయమే ఏపీలో డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరతకు దారి తీసిందన్నది బట్టబయలైంది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్ డీజిల్‌ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్ పెట్రోలు బంకులలో కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 24న ఓ సర్క్యులర్ జారీ చేయడమే ఈ ఇక్కట్లకు అసలు కారణం. వాణిజ్య అవసరాలకు భారీ మొత్తం(బల్క్)లో డీజిల్, పెట్రోల్ అవసరం అవుతుంది. కాంట్రాక్టర్లు నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నుంచే బల్క్‌గా డీజిల్ కొనుగోలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ నిబంధన విధించింది. వాణిజ్య అవసరాలకు బల్క్‌గా కొంటే లీటర్ డీజిల్‌కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్ బంకుల్లో రిటైల్‌గా కొంటే డీజిల్ లీటర్ ధర రూ.98 మాత్రమే. అంటే..ఒక లీటర్‌పై రూ.55 మేర రాజధాని కాంట్రాక్టర్లకు బాబు సర్కార్ ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోందని ఓఎంసీ వర్గాలు చెబుతున్నాయి. బంకుల నుంచి రిటైల్ ధరకు కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో డీజిల్‌ను అందించడం వల్లే ఏపీలో డీజిల్, పెట్రోల్ దొరక్క అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోతలు, పరిశ్రమల్లో ఉత్పత్తులు ఆగిపోయాయి. డీజిల్, పెట్రోల్ కొరతతో రాష్ట్రం స్తంభించిపోయినా అంతా బాగుందంటూ ప్రభుత్వం చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధం.. వెంటనే వెనక్కి తీసుకోండి: కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని.. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని తేల్చిచెబుతూ ఈనెల 25న సీఎస్‌కు కేంద్రం రాసిన లేఖ తొమ్మిది సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టి..సీఆర్డీఏ, ఏడీసీఎల్(అమరావతి అభివృద్ధి సంస్థ) నేతృత్వంలో రాజధానిలో రూ.58 వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యనేత సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టి భారీ ప్రయోజనం చేకూర్చారు. కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. అందులో 8 శాతం కమీషన్ రూపంలో వసూలు చేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి లాభం చేకూర్చడంతో ఆగకుండా డీజిల్లోనూ ప్రయోజనం కల్పిస్తూ మరో అడుగు ముందుకేశారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆగమేఘాలపై..అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రిటైల్ ధరకు పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ కేటాయించి సరఫరా చేయాలంటూ సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కమిషనర్ ఈనెల 23న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ మరుసటి రోజే పౌరసరఫరాల శాఖ కమిషనర్ కె.కన్నబాబు దీనిపై స్పందించి.. రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు 27,566.25 కిలోలీటర్లు(2,75,66,250 లీటర్లు) డీజిల్‌ను రిటైల్ ధరకు పెట్రోల్ బంకులలో కేటాయించి సరఫరా చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో రిటైల్ ధరకు డీజిల్, పెట్రోల్ అందించాలంటూ ఇదే రీతిలో పలు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24 నుంచే రాజధాని కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో డీజిల్‌ను రిటైల్ ధరకు పెట్రోల్ బంకులు అందించాయి. ఆ రోజు నుంచే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడి రోజురోజుకూ తీవ్రంగా మారి సంక్షోభంగా రూపాంతరం చెందింది. ఇంధనం లేక తిరుపతిలో మూసివేసిన ఓ బంకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేంద్రంరాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో రిటైల్ ధరలకు పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ అందించాలని చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది చట్టవ్యతిరేకమని స్పష్టం చేసింది. తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బల్క్‌గా రిటైల్ ధరలకు డీజిల్ సరఫరా అందించాలంటూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఆ ఉత్తర్వులు నిత్యావసర సరకులు (ఎసెన్షియల్ కమోడిటీస్) చట్టం–1995ను ఉల్లంఘించడమేనని ఆ లేఖలో తేల్చిచెప్పారు. ఇది పెట్రోల్, డీజిల్ కొరతకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీల వద్దకే ఓఎంసీల నుంచి నేరుగా బల్క్‌గా డీజిల్ సరఫరా చేసే వ్యవస్థ ఇప్పటికే ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చి.. జనజీవనం స్తంభించిపోతున్నా సరే రాజధాని కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చుతూ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించకుండా చమురు కంపెనీలపైనే చంద్రబాబు ఎదురుదాడికి దిగడం విస్మయం కలిగిస్తోంది.రిటైల్ బంకుల నుంచి డీజిల్ బల్క్ సరఫరా చట్టవిరుద్ధంఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం అభ్యంతరంరిటైల్ బంకులకు బల్క్ సప్లై లైసెన్సులు ఉండవని స్పష్టీకరణ ఆ ఆదేశాలను తక్షణం ఉపసంహరించు కోవాలని ఏపీ సీఎస్‌కు కేంద్రం లేఖసాక్షి, న్యూఢిల్లీ: అమరావతి రాజధానిలో నిర్మాణ పనుల కోసం సాధారణ పెట్రోల్ బంకుల (రిటైల్ అవుట్లెట్ల) నుంచి భారీ పరిమాణంలో (బల్క్) డీజిల్ సరఫరా చేయాలంటూ ఏపీ పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయిప్రసాద్‌కు కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఈ నెల 25న లేఖ రాశారు. అమరావతి నిర్మాణ కార్యకలాపాల కోసం బల్క్ డీజిల్‌ను రిటైల్ అవుట్లెట్ల నుంచి సరఫరా చేయాలంటూ ఈ నెల 24న ఏపీ పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు 2002 పెట్రోలియం నిబంధనలు (ముఖ్యంగా ఫామ్–14 కండిషన్ 16(4)), పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) మార్గదర్శకాలకు విరుద్ధమని కేంద్ర కార్యదర్శి తన లేఖలో తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం రిటైల్ బంకుల్లో వాహనాల ఇంధన ట్యాంకుల్లోకి లేదా ఆమోదించిన కంటైనర్లలో గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం పోసేందుకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. బల్క్ సప్లై చేసేందుకు రిటైల్ బంకులకు ఎలాంటి లైసెన్సులు ఉండవని స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ బంక్ వద్ద బారులు తీరిన వాహనదారులు భద్రతకు ముప్పు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు 1955 నిత్యావసర వస్తువుల చట్టం కింద జారీచేసిన మోటార్ స్పిరిట్ అండ్ హై–స్పీడ్ డీజిల్ (సరఫరా, పంపిణీ నియంత్రణ, అక్రమాల నివారణ) ఆర్డర్–2005 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టులకు బల్క్ ఇంధనం సరఫరా చేయడానికి ఓఎంసీలకు ప్రత్యేకంగా డైరెక్ట్ సేల్స్ యంత్రాంగం ఉందని గుర్తుచేసింది. ఆ విధానాన్ని కాదని రిటైల్ బంకుల ద్వారా మళ్లించడం చట్టవిరుద్ధమే కాకుండా భద్రత, లైసెన్సింగ్, నిర్వహణ పరమైన ఆందోళనలను రేకెత్తిస్తుందని హెచ్చరించింది. స్థిరమైన పరికరాలకు ఇంధనాన్ని సురక్షితంగా సరఫరా చేయడానికి కేంద్రం నోటిఫై చేసిన డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్ (డీడీడీ) పథకం అమల్లో ఉందని, పెసో ఆమోదిత బౌజర్ల ద్వారా సరఫరా చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏపీ పౌరసరఫరాలశాఖ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకునేలా సీఎస్ జోక్యం చేసుకోవాలని కేంద్ర కార్యదర్శి నీరజ్ మిట్టల్ కోరారు.ఇవీ నిబంధనలు..నిబంధనల ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులను రిటైల్ అవుట్లెట్లలో వాహనాల ఇంధన ట్యాంకులు, అనుమతించిన కంటైనర్లలోనే నింపాలి. అది కూడా గరిష్టంగా 200 లీటర్లకు మించి నింపకూడదు. రిటైల్ అవుట్లెట్లలో బల్క్ అవసరాల కోసం విక్రయించేందుకు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పెట్రోల్, డీజిల్ కొరతకు దారి తీసే ప్రమాదం ఉంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్‌గా డీజిల్ విక్రయించేందుకు చమురు కంపెనీలకు ఇప్పటికే పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉంది. -
పక్క రాష్ట్రాల్లో లేని సమస్య మనకే ఎందుకుంది? ప్రభుత్వం నిద్రపోతుందా?
-
చంద్రబాబు కాదు.. చేతకాని బాబు బాబుపై మహిళల ఉగ్రరూపం
-
బాబుకి బుద్ధి రావాలి... రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ వద్ద YSRCP భారీ నిరసన
-
చేతకాని దద్దమ్మలు, నారా లోకేష్ ఎక్కడికో పారిపోయాడు
-
కృత్రిమ ఇంధన కొరత సృష్టిస్తున్న.. బాబు పాలనపై జగన్ ఫైర్
-
బాబు క్యూ విజన్.. నలిగిపోతున్న ఏపీ ప్రజలు
-
వైజాగ్ ఇన్ఫోసిస్ @ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్‌ను తీసుకువస్తే.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కారు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలుగా అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పులేదు.రూ.వేల కోట్ల లాభాలను గడిస్తూ... ఒకపక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్‌కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్‌లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. తొలిసారిగా టైర్–2 నగరానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్‌లో 1,000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్‌ను 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు నెలలకు ఒకసారి రూ.8,500 కోట్లకుపైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. గతేడాది బెంగళూరులో తన వద్ద అదనంగా ఉన్న 53 ఎకరాలను ఇన్ఫోసిస్ రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించిందని, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశి్నస్తున్నారు. భూములివ్వడంతోపాటు భవన నిర్మాణానికీ డబ్బులు..! చంద్రబాబు సర్కారు ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్‌లు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ పేరిట కే.రహేజా, సత్వా, కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అంతేకాకుండా ఇలా కేటాయించిన భూముల్లో 50 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘వైద్యం’.. నైవేద్యం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో మరో భారీ అవినీతికి ‘కాంట్రాక్టు’ కుదిరింది. ‘వైద్యం’ ప్రాజెక్ట్ పేరుతో నచ్చినవారికి అడ్డగోలుగా ప్రజాధనాన్ని నైవేద్యంగా సమర్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్యశాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్ట్‌కు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్ ఆహ్వానించారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘వైద్యం’ అని పేరు పెట్టారు. 66 నెలల కాలపరిమితితో కూడిన సుమారు రూ.40 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను ఉద్యోగుల ముఖ హాజరు సేవలు అందిస్తున్న కంపెనీకి అడ్డగోలుగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ బిడ్‌ను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ–క్వాలిఫికేషన్లో ఆమోదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఏబీడీఎం భాగస్వామ్యం లేకపోయినా ‘వైద్యం’ ప్రాజెక్ట్ టెండర్‌కు నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. టెండర్ నిబంధనల ప్రకారం ఆ కంపెనీలు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)లో భాగస్వామ్యం కలిగి ఉండాలి. టెండర్లు వేసిన నాలుగు కంపెనీల్లో ఒకటైన ఉద్యోగుల ముఖ హాజరు సేవలు అమలు చేస్తున్న సంస్థకు ఏబీడీఎంలో భాగస్వామ్యం లేదు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను బిడ్‌లో పొందుపరచలేదు. అందువల్ల ప్రీ–క్వాలిఫికేషన్ దశలోనే బిడ్‌ను తిరస్కరించాలి. అయితే, ఈ సంస్థకు అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు డీల్స్ కుదరడంతో ప్రీ–క్వాలిఫికేషన్లో బిడ్‌ను ఆమోదించడానికి వైద్యశాఖలోని ఓ ఉన్నతాధికారి అక్రమాలకు తెరలేపారని తెలుస్తోంది. ఏబీడీఎంలో భాగస్వామ్యమైన కంపెనీలనే అనుమతించాలని టెండర్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా... ఉద్యోగుల ముఖ హాజరు ప్రాజెక్ట్ అనుభవం ఆధారంగా బిడ్ ఆమోదించేలా స్వయంగా ఉన్నతాధికారే అక్రమాలకు తెరలేపారని సమాచారం. వాస్తవానికి ఏపీటీఎస్ టెండర్ ఆహ్వానించిన అనంతరం నిర్వహించిన ప్రీ–బిడ్ సమావేశంలో 10 నుంచి 20 కంపెనీలు పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఏబీడీఎంలో భాగస్వామ్యం నిబంధనను సడలించాలని 10కి పైగా కంపెనీలు కోరగా, వైద్యశాఖ అంగీకరించలేదు. ఇప్పుడా నిబంధనను తుంగలో తొక్కి అర్హత లేని కంపెనీ బిడ్‌ను ఆమోదించడానికి సర్వం సిద్ధం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
చంద్రబాబు అసమర్థ పాలనతోనే ఇంధన కొరత
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్/కడప కార్పొరేషన్/యర్రగొండపాలెం: చంద్రబాబు అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు లేదా పెట్రోల్, డీజిల్ కోసం కొట్లాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు తీరి ఉన్నాయన్నారు. రవాణా వాహనాల వారి నుంచి ఆటో సోదరుల వరకు పడిగాపులు పడుతున్నారని చెప్పారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ నడుపుతున్న ఈ ప్రభుత్వంలో ప్రచారం తప్ప పని కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరతతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఒక్క ఏపీలో మాత్రమే ఈ దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు క్యూలైన్ కష్టాలు తప్పడం లేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు, గ్యాస్ కోసం జనం క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చీమ చిటుక్కుమంటే పబ్లిసిటీ కోసం మీడియా ముందుకొచ్చే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇండిగో విమానాలు ఆగిపోతే తనకే మాత్రం సంబంధం లేకున్నా మంత్రి లోకేశ్ సమీక్షించాడని ఎల్లో మీడియా ఊదరగొట్టిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తుపాన్‌ను తప్పించానని చెప్పిన చంద్రబాబు పక్కనే ఉన్న హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్ నుంచి పెట్రోల్, డీజిల్ తెప్పించలేకపోతున్నారా?.. అంటూ ఎద్దేవా చేశారు. కాగా, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని పెట్రోలు బంకుల వద్ద పరిస్థితుల్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు పడుతున్న అవస్థల్ని అడిగి తెలుసుకున్నారు. -
రవాణాకు బ్రేకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రియల్ టైమ్ గవర్నెన్స్ ఉత్త డొల్లగా మారింది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిచ్చాయి. రేపటికల్లా ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించిన తర్వాత సమస్య మరింత తీవ్రతరమైంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన కొరత రవాణా రంగానికి విస్తరించడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి లారీలు బంకుల వద్ద బారులు తీరినా డీజిల్ దొరకలేదు. సోమవారం అన్ని ప్రధాన నగరాల్లో లారీలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాలు భగ్గుమన్నాయి. కూరగాయల ధరలు 40 నుంచి 50 శాతం పెరగ్గా.. నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా 30% పెరిగాయి. మరోపక్క వరి కోత యంత్రాలకు డీజిల్ లభించకపోవడంతో బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న యజమానులు రైతుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాత అటు ధాన్యానికి సరైన ధర లేక.. ఇటు కోత యంత్రాల అద్దె భారంతో రెండు విధాలా నష్టపోతున్నాడు. వరి కోత మిషన్ల చార్జీలు గంటకు రూ.2,800 నుంచి ఒకేసారి రూ.3,500కు పెంచేశారు. ప్రస్తుతం రబీ కోతల సమయం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క కోసిన పంటను సైతం మిల్లులకు తరలించే వాహనాలు దొరక్క ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతున్న పరిస్థితి. ఫలితంగా రైతన్నలు అన్ని విధాలా నష్టపోతున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాజుపాలెం హైవేపై ఓ పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కోసం బారులు తీరిన లారీలు హైవేల్లో నిలిచిపోయిన వాహనాలు బంకుల్లో నిల్వలు అడుగంటడం.. భారీ వాహనాలకు 50 నుంచి 100 లీటర్ల డీజిల్‌ను మాత్రమే ఇస్తూ రేషన్ విధించడంతో రవాణాకు బ్రేకులు పడ్డాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రధాన నగరాల్లో వేలాది లారీలు ఆగిపోయాయి. దీనివల్ల లారీ యజమానులు భారీగా నష్టపోవడమే కాకుండా వాహనాల ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క డీజిల్ దొరక్క పలు లారీలు జాతీయ రహదారుల వెంట నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో డీజిల్ అయిపోయి రోడ్డు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో ఎన్‌హెచ్–16పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ప్రైవేట్ బస్సులకూ డీజిల్ గండం ఏర్పడింది. విజయవాడ, విశాఖ నుంచి దూర ప్రాంతాలకు తిరిగే బస్సులకు డీజిల్ దొరకలేదు. దీంతో పలు రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. తిరుగుతున్న కొద్ది బస్సుల్లో ఆపరేటర్లు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. తిరుపతిలోని వరదరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బంక్‌లో పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వచ్చిన వాహనదారులు ఇక నిత్యావసరాల వంతు? ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. శుభకార్యాలకు వెళ్లాల్సిన వారు డీజిల్ దొరక్క ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఆటోలు తిరగకపోవడం, బైకులలో పెట్రోల్ లేకపోవడంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఉచిత బస్సుల పేరుతో సర్వీసులను తగ్గించిన సర్కారు.. పెరిగిన ఒత్తిడికి తగ్గట్టు బస్సులను పెంచలేదు.ఇంధన సంక్షోభం నిత్యావసర ధరలపై మరింత ప్రభావం చూపవచ్చని, అన్ని సరుకుల ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకు రవాణా వాహనాలు నాలుగు రోజుల్లో చేరాల్సిన గమ్యాన్ని వారం రోజుల్లో చేరుతున్నాయి. ఇంధన కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో హైవేల్లో ఆయిల్ బ్లాక్ దందా పెరిగిపోయింది. డీజిల్‌పై లీటర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నట్లు లారీ యజమానులు వాపోతున్నారు. ఇంధన ఖర్చులు, డ్రైవర్ల జీతాలు తడిసి మోపెడు అవుతున్నాయని లారీ ఓనర్ల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశాఖలోని సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద రద్దీ ఇలా... 29 తర్వాత పెట్రో ధరలపై కీలక నిర్ణయం! ఏపీలో ఇంధన సరఫరాను ప్రధానంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలు నిర్వహిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో నష్టాలు వస్తున్నాయని, లీటరుపై రూ.30 చొప్పున నష్టం భరించాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున రెండో విడత ఎన్నికలు ముగిశాక ఈనెల 29 తర్వాత డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.అనంతపురంలో పెట్రోల్ కోసం క్యూ లో వేచి ఉన్న వాహనదారులు డీజిల్ లేక నిలిచిన ప్రైవేట్ బస్సు సీఐ చొరవతో బస్సు గమ్యస్థానానికి ఇబ్రహీంపట్నం: డీజిల్ కష్టాలు ప్రయాణీకుల పాలిట శాపంగా మారాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకోగానే డీజిల్ అయిపోయింది. బస్సు హైవే పక్కన పెట్రోల్ బంకు సమీపంలో ఆగిపోయినప్పటికీ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు ఉండడంతో డ్రైవర్‌కు ఏంచేయాలో దిక్కుతోచలేదు. మరోవైపు.. ప్రయాణికులు బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ సుబ్రహ్మణ్యం అక్కడికొచ్చి 50 లీటర్ల డీజిల్ సేకరించి, బస్సును గమ్యస్థానానికి పంపించారు. పరీక్షకెలా వెళ్లాలి? నేను మంగళవారం జరగనున్న పీజీఈసెట్ పరీక్షకు హాజరు కావాలి. నాలుగు కిలోమీటర్ల దూరంలోని రేణిగుంట రోడ్డులోని పరీక్ష కేంద్రానికి ఉదయం 9గంటలకే చేరుకోవాలి. దీంతో సోమవారం బైక్‌లో పెట్రోల్ పోయిద్దామని అన్ని బంకులూ తిరిగాను. ఎక్కడా దొరకలేదు. ఇక తప్పదు. సైకిల్‌పైనే వెళ్లాలి. –విశ్వనాథ్‌రెడ్డి, ప్రవేశ పరీక్షార్థి, తిరుపతిఒక్క రోజు ఉపాధి పోయినట్లే నేను ఆటో డ్రైవర్‌ను. సోమవారం తెల్లవారుజామున డీజిల్ అయిపోయింది. డబ్బాలు పట్టుకుని టౌన్ అంతా తిరిగా. ఎక్కడా డీజిల్ దొరకలేదు. ఇప్పుడు ఈ బంకు వద్దకు వచ్చి క్యూలో ఉన్నా. నాలుగైదు గంటలు కావస్తోంది. ఇప్పటికి మా వంతు రాలేదు. మొత్తం మీద ఈ రోజు ఉపాధి పోయినట్లే. – సుబ్రమణ్యంరెడ్డి, ఆటోడ్రైవర్, మంగళంబతికేది ఎలా? ఆటో నడుపుతూ జీవిస్తున్నా. ప్రయాణికులను తీసుకుని విజయనగరం వచ్చాను. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బంక్‌కు వెళ్లి ఆయిల్ పోయమంటే లేదన్నారు. రోజువారి వచ్చే ఆదాయంతో జీవించే మాలాంటి వారికి బతుకుబండి నడవకపోతే ఇబ్బందులు తప్పవు. మేం బతికేది ఎలా? – శంకరరావు, సీతారామునిపేట నెల్లిమర్ల మండలం,విజయనగరం జిల్లా25 కిలోమీటర్లు వచ్చినా ప్రయోజనం లేదు పల్నాడు జిల్లా రెంటచింతలలో డీజిల్ దొరక్క 25 కిలోమీటర్ల దూరంలోని మాచర్ల వచ్చా. పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఉన్నా డీజిల్ దొరకలేదు. పంట రవాణాకు డీజిల్ కావాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – వెంకటేశ్వర్లు, రైతు, తుమృకోట, రెంటచింతలకుదేలైన పారిశ్రామిక రంగం ఇంధన కొరత మూలంగా నియోజకవర్గంలోని పౌడర్, సున్నపురాయి, గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ రంగంతో పాటు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయారు. – బాల తిమ్మారెడ్డి, పారిశ్రామికవేత్త, నంద్యాల జిల్లా -
ఏపీలో ‘పెట్రో’ కటకట!
స్వోత్కర్షలకూ, చేదు వాస్తవాలకూ మధ్య తేడా ఎంత ఉంటుందో తెలియజెప్పే వైనమిది. ‘మా రాష్ట్రానికి రండి... పెట్టుబడులు పెట్టండి. మా సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా మీరే తెలుసుకోండి’ అంటూ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నగరంలో జరిగిన ఒక అవార్డుల ఉత్సవంలో గప్పాలు కొట్టుకున్న క్షణానికే రాష్ట్రం మొత్తం ఇంధన కొరతతో అల్లాడిపోయింది. అన్ని జిల్లాల్లోనూ బంకులముందు ఆ రోజు ఉదయానికే ‘నో స్టాక్’ బోర్డులు ప్రత్యక్షమై జనం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్రోల్, డీజిల్ దొరక్క వేలాది ట్రావెల్ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రోడ్లపై నిలిచాయి. అనేకచోట్ల ట్రాఫిక్ స్తంభించిందని సమాచారం. వందలాదిమంది పిల్లలు, వృద్ధులు ఎటూపోలేక మండుటెండల్లో మలమలమాడారు. ఇప్పటికీ మారిందేమీ లేదు. ఇంత జరిగినా ఇదేమిటని ఆరా తీసే నాథుడు కరువయ్యాడు. కొందరు మంత్రులు పాలనలో పాఠాలు నేర్చుకొస్తామని దేశాలు పట్టిపోయారు. ముఖ్యమంత్రి అగమేఘాలపై మరో రాష్ట్రానికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్క రాష్ట్రంలో అస్వస్థత నుంచి కోలుకుంటున్నారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తిగత విషాదంలో ఉన్నారు. మామూలు సమయాల్లో సర్వజ్ఞ సింగభూపాలుడి మాదిరి సకల శాఖల్లోనూ పెత్తనం చేసే ‘రెడ్‌బుక్’ మంత్రి లోకేశ్ మాత్రం ఆచూకీ లేకుండాపోయారు! రాష్ట్రంలో సంస్కరణల సంగతలావుంచి, పాలన ఎంత ముదనష్టంగా మారిందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా! సామాజిక మాధ్యమాలు తిరగేస్తే, చానెళ్లు వీక్షిస్తే ఈ అరాచకాన్ని అరక్షణంలో ‘స్వయంగా’ తెలుసుకునే సౌలభ్యం ఉండగా... ఎంత తెలివితక్కువవారైనా అందుకోసం పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వదుల్చుకునే సాహసం చేస్తారా?అధికారంలోకి రావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా అరాచకానికి తెరలేపి, ఇప్పటికీ దాన్ని వదలకుండా కొనసాగిస్తున్న ఘనులకు ఇంధన కొరతపై కనీస జ్ఞానం కరువైందంటే దిగ్భ్రాంతికరం. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం అధికారులతో చర్చించారనీ, మూడు రోజుల ముందే సమస్య వచ్చిపడుతోందని తెలిసినా పట్టించుకోలేదేమని ప్రశ్నించారనీ మీడియాలో కథనాలు ప్రత్యక్షమయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఏం జరుగుతున్నదో స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పుకునే సీఎంకు ఇలా ప్రశ్నించటానికి సిగ్గుండాలి. వారు విఫలమయ్యారు సరే... కానీ తనలోని ‘హైటెక్ నిపుణుడు’ ఏమైనట్టు? పోనీ ఈ సమీక్ష తర్వాతైనా పరిస్థితి మారిందా? లేదే!సమస్య మూలాలపై సీఎం మొదలుకొని ఎవరికీ సరైన అవగాహన లేదని వారి మాటలు చూస్తే అర్థమవుతుంది. మూడు రోజుల కిందటే సమస్య ఉందని బాబు అంటే... రాష్ట్రంలో కావలసినంత స్టాక్ ఉందని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు! కేవలం వదంతులవల్ల జనం ఒక్కసారిగా రావటంతో ‘సరఫరా లోపం’ ఏర్పడిందని కొట్టిపారేస్తున్నారు. ఎవర్ని నమ్మాలి? వీరి అయోమయం కారణంగా సాధారణ జనం మాత్రమే కాదు... రైతులు సైతం అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం, రవాణా, ఆక్వా రంగాలు కూడా డీజిల్ లభించక గుడ్లు తేలేస్తున్నాయి. కోల్డ్ స్టోరేజిలు సరేసరి. ఉత్పత్తులు నాశనమై, రైతులు నష్టపోతే ఈ పాలకులకు వారిని ఆదుకునేపాటి ఉదారతైనా ఉండదు. నిజానికి ఏపీ మెరుగైన స్థితిలో ఉండాలి. కర్ణాటకలోని పాదూరు, మంగళూర్లతో పాటు విశాఖలో కూడా వ్యూహాత్మక చమురు నిల్వలుంటాయి. విశాఖకు 13 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అంతర్జాతీయంగా సమస్యలొచ్చినా ఈ నిల్వలవల్ల పదిరోజులపాటు దేశం నిశ్చింతగా ఉండొచ్చంటారు. ఇక విశాఖ చమురు శుద్ధి కర్మాగారానికి రోజుకు 3 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉంది. అంటే ఏడాదికి కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నులు. పైగా మాది ‘డబుల్ ఇంజన్ సర్కార’ని చెప్పుకుంటారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు వీరి దయాదాక్షిణ్యాలపైనే సాగుతోంది. మరి ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఏపీకే ఎందుకొచ్చినట్టు? పాలన మరిచి అరాచకాన్నే నమ్ముకుంటే, స్వోత్కర్షలకూ, స్తోత్రపాఠాలకూ అలవాటుపడితే జరిగేది ఇదే. ఈ బాపతు పాలకుల్ని ఏం చేయాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో జనం గ్రహిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. -
ఏపీలో ఇంధన కొరత.. చేతులెత్తేసిన బాబు
-
ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని YSRCP నిర్ణయం
-
పిచ్చి కుక్కలు.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
-
అసమర్థులు కూటమిపై YSRCP నేతలు ఫైర్
-
ఆకు రౌడీలతో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుంది.. భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్
-
సస్పెండ్ కాదు ఏకంగా డిస్మిస్.. ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై రెడ్ బుక్
-
కుప్పంలో షాకింగ్ ఘటన ఇద్దరు మహిళలపై.. ఐదుగురి దాడి
-
నీ అనుభవం ఎందుకూ పనికిరాదు, నీ కొడుకేమో కనబడట్లేదు..
-
దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే.. మొద్దు నిద్రలో చంద్రబాబు..
-
పెట్రోల్, డీజిల్ కొరత.. బంక్ ల వద్ద బారులు తీరిన వాహనదారులు
-
No పెట్రోల్.. No డీజిల్.. ఈ పాపం సర్కారుదే!
-
ఉద్యమం ఉధృతమే..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) హెచ్చరించింది. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రాధాన్యత జాబితాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు లేరని, అందువల్లే సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఇక ఉపేక్షించబోమని స్పష్టంచేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. రెండో రోజు దీక్షలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి తదితర నాయకులు మాట్లాడారు. ‘12వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలి. పీఆర్సీ నిర్ణయాలు అమల్లోకి వచ్చే వరకు 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలి. స్థానిక సంస్థల పాఠశాలల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలి. హైస్కూల్ ప్లస్‌లను బలోపేతం చేయాలి. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలి. సరెండర్ లీవు బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఫ్యాప్టో కోరుతున్న న్యాయమైన 17 డిమాండ్లను పరిష్కరించాలి’ అని నాయకులు డిమాండ్ చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం‘పంచాయతీరాజ్ యాజమాన్యంలోని స్కూళ్లలో ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు అనుకూలంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. దాని అమలు కోసం జీవో నంబర్లు 72, 73, 74 విడుదల చేశారు. ఈ జీవోలపై కోర్టు అభ్యంతరాలు కూడా లేవు. అయినా అమలు చేయడం లేదు. స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉద్యోగ, ఉపాద్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను చేపట్టకపోవడం దారుణం.ఏకీకృత సర్వీస్ రూల్స్, కారుణ్య నియామకాల సాధన కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తాం’ అని ఫ్యాప్టో నాయకులు స్పష్టంచేశారు. ఫ్యాప్టో నిరాహార దీక్షకు ప్రైవేట్ స్కూల్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.ప్రసన్న సంఘీభావం తెలిపారు. ఫ్యాప్టో రాష్ట్ర కో–చైర్మన్లు కె.నరహరి, కాకి ప్రకాష్ రావు, డెప్యూటీ సెక్రటరీ జనరల్‌లు ఎన్.వెంకటేశ్వర్లు, కె.బసవ లింగారావు, కార్యవర్గ సభ్యులు సీహెచ్ మంజుల, జి.హృదయరాజు తదితరులు పాల్గొన్నారు. -
కోరి తెచ్చుకుంటే.. కాలేజీని కాజేస్తోంది!
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ ఇది తమ పార్టీ, తమ ప్రభుత్వమని భావిస్తే తమనే మింగేయాలని చూస్తోందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్లు లబోదిబోమంటున్నారు! కాలేజీని సొంతం చేసుకోవడానికి ‘ముఖ్య’నేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలెత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ముఖ్యనేత సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముఖ్యనేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెరవెనుక చక్రం తిప్పుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. నయాన భయాన లొంగదీసుకునే యత్నాలు..ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసలైన డైరెక్లర్లు ఎవరో తేల్చుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఇటీవల మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు (పాత డైరెక్టర్లు, కాలేజీ వ్యవహారాల్లో ముఖ్యులు) సమావేశమయ్యారు. కొత్త డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఆ సమావేశంలో నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిప్రకారం వారంతా తమ అభిప్రాయాలను తెలిపి తిరిగి కొత్త మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 29వతేదీన మరో సమావేశం నిర్వహించనున్నారు. అందులో కొత్త డైరెక్టర్లు, కొత్త మేనేజింగ్ కమిటీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులోపు కొత్త కమిటీని నియమించుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 29న జరిగే సమావేశం కీలకంగా మారింది. డైరెక్టర్లను నయాన భయాన లొంగదీసుకునేందుకు ముఖ్యనేత తరఫున ఓ మంత్రి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల గురించి ఆరా తీస్తూ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ముఖ్య నేత మాట కాదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి వార్నింగ్‌లు ఇస్తున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆశించిన డైరెక్టర్లు తాజా పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషించామని, గత ఎన్నికల్లో గెలిపించేందుకు శాయశక్తులా పని చేశామని, కానీ ఇప్పుడు తమపై గురి పెట్టటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకించినా కాలేజీ విషయంలో జోక్యం చేసుకోలేదని, తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు. -
పరిహారం అడిగితే.. ఊరు దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై దమనకాండను కొనసాగిస్తోంది. అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది. న్యాయం కోసం అర్థించిన నోళ్లను అధికారంతో నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. తమ భూములు తీసుకున్నందుకు పరిహారం కావాలని అడిగితే, తమ ఊరినే దిగ్బంధించారని విశాఖజిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి భూమినే నమ్ముకుని బతుకుతున్న వందలాదిమంది తర్లువాడ డీ–పట్టా, జిరాయితీ రైతుల ఉసురు పోసుకుంటూ మంగళవారం ‘గూగుల్ డేటా సెంటర్’ శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కన్నీరు పెట్టుకున్నారు. మెరుగైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. నమ్మిన రైతుల్ని నట్టేట ముంచేస్తూ.. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా వారి భూములను బలవంతంగా లాక్కుంది. కనీస నష్టపరిహారం ఊసే ఎత్తకుండా, పోలీసుల పహారాలో భూసేకరణ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులతో ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. శంకుస్థాపనకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో.. తర్లువాడని ఖాకీలు నిర్బంధిస్తూ.. 144 సెక్షన్ విధించారు. రైతులకు అండగా నిలబడేందుకు వస్తున్న ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసుకుంటున్న భూమిని అప్పనంగా లాక్కోవడమే కాకుండా, పరిహారం అడిగితే అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. కప్పదాటు హామీలుఆనందపురం మండలం తర్లువాడలో కొందరు రైతులకు నామమాత్రపు పరిహారం ఇచ్చిన సర్కార్, దశాబ్దాలుగా డీ పట్టా భూముల్ని సాగు చేసుకుంటున్న 520 మంది రైతులకు మాత్రం పైసా పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంది. అలాగే 12 ఎకరాల జిరాయితీ భూములను సాగుచేసుకుంటున్న మరో 6 కుటుంబాలకు కూడా మొండిచేయి చూపింది. గూగుల్ వచ్చిన తొలి నాళ్లలో రైతులందరికీ తగిన పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు తరఫున భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధికారులు ప్రజలకు నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటను గాలికి వదిలేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జిరాయితీ భూములు ఉన్న వారికి నిబంధనల ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా.. ఒక్కొక్క ఎకరం డీ పట్టా భూములున్న 520 మంది రైతులకు 5 సెంట్లు భూమి, రూ.5 లక్షలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. ఆ తర్వాత లేదు లేదు... 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం మరో హామీ ఇచ్చింది. ఆ రెండింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేసి... ఇప్పుడు బలవంతపు భూ సేకరణకు ఉపక్రమించింది. పరిహారం అడిగితే బెదిరిస్తున్నారుమా కుటుంబంలోని ముగ్గురికి 60 ఏళ్ల క్రితమే తర్లువాడలో 4.64 ఎకరాల పట్టా భూమి ఉంది. దాని చుట్టూ 1.61 ఎకరాల బంజరు భూమి మా ఆధీనంలోనే ఉంది. ఇటీవల బంజరు భూమిలో చెట్లను తొలగించి రోడ్డు వేశారు. బంజరు భూములకు పరిహారం అడుగుతున్నాం. జిరాయితీ భూములను కూడా డి. పట్టా భూముల తరహాలోనే ప్రభుత్వానికి ఇచ్చేయమని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే న్యాయస్థానం ద్వారా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. మేము జిరాయితీ భూములకు అదే విలువ గల భూమి అడుగుతున్నాం. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది.– బి.వెంకటేశ్వరరావు, తర్లువాడ రైతుభూమి పూజ చేసినా.. ఆందోళన కొనసాగిస్తాంబంజరు భూములు అభివృద్ధి ప«థకంలో భాగంగా 2001 లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బలహీన వర్గాల మహిళలకు ఎకరం వంతున భూమి ఇస్తే అందులో మొక్కలు వేసుకున్నాం. సాగు ఫలాలు దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం. ఈ భూములు కావాలని ప్రభుత్వం అడిగింది. తొలుత..భూములకు ప్రతిఫలంగా 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు ఇవ్వడం లేదు. మాకు పరిహారం కావాలని ఆందోళన చేస్తుంటే.. నిరసనలు తెలపకూడదంటూ మా ఊరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. గూగుల్‌కు భూమి పూజ జరిగిన తర్వాత కూడా.. రైతులందరం కలిసి ఆందోళనలను కొనసాగిస్తాం.– బాలి సూరమ్మ, తర్లువాడ -
ఈ పాపం సర్కారుదే!
కమర్షియల్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు/కాంట్రాక్టర్లకు సంబంధించిన బంకులకు సరఫరా అయ్యే ఇంధన చార్జీలు పెరిగాయి. రిటైల్-కమర్షియల్ ఇంధనం ధరలో సగానికి సగం వ్యత్యాసం ఉంది. దీంతో పెద్ద కాంట్రాక్టర్లు కొన్ని రిటైల్ బంకుల నుంచి బ్లాక్‌లో కొంటున్నారని ఆయిల్ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిటైల్ బంకులకు సరఫరా తగ్గించేశాయి. ఇక్కడ నిఘా పూర్తిగా కొరవడింది. సమన్వయం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ అసలే లేదు. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే. అందుకే సమస్య తీవ్రతరమైంది. నిజంగా ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎందుకో మరి ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేదు.-ఇంధన రంగానికి చెందిన ఓ నిపుణుడు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్‌ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్‌కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్‌కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగం కుదేలైంది. పెద్ద వాహనాల రవాణా నిలిచిపోయింది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతోంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌కు ఏమాత్రం కొరత లేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. సమన్వయం లేదు.. నిఘా లేదు.. పరిష్కారం దిశగా చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే నో స్టాక్ బోర్డు పెడితే ఊరుకోమని సీఎం హెచ్చరించడం నవ్వులపాలవుతోంది. పెట్రోల్, డీజిల్ సరఫరానే లేదని బంకుల యజమానులు వాపోతుంటే.. సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి బంకులకు వార్నింగ్ ఇవ్వడం ఏమిటని చర్చ జరుగుతోంది. గుంటూరు లాడ్జి సెంటర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన వాహనాలు సీఎంది ఓ లెక్క.. సివిల్ సప్లై శాఖ మంత్రిది మరోలెక్క రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతోంది. వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడం విస్తుగొల్పుతోంది. పెట్రోలియం సంస్థలు శనివారం 10,345 కిలో మీటర్ల పెట్రోలు, 14,156 కిలో లీటర్ల డీజిల్‌ను డీలర్లకు సరఫరా చేసినట్టు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఉంటే.. శనివారం 8,489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయని, డీజిల్ సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలో లీటర్లు అమ్మకాలు జరిగితే శనివారం 10,556 కిలో లీటర్లకు పెరిగిందన్నారు. కర్నూలులోని నారాయణ పెట్రోల్ బంక్‌లో సైకిల్‌పై వచ్చి పెట్రోలు తీసుకెళ్తున్న యువకుడు సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఇంధన వినియోగం వివరాలను వెల్లడించారు. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలో లీటర్లు అని, డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉందన్నారు. అంతేగాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్‌ను 2.4% అదనంగా పెంచినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన లెక్కలకు, సివిల్ సప్లై శాఖ మంత్రి లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఈ లెక్కన ఇంధన వినియోగంపై ఇప్పటి దాకా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలే లేవని తేటతెల్లమవుతోంది.అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద వాహనదారులతో నిండిపోయిన ఇండియన్ పెట్రోల్ బంక్ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చడంతో అది రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు వంటివి సగానికి పైగా తిరగడం లేదు. ఈ నెలాఖరుకు ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో సరఫరా ఆపేశారనే చర్చ జరుగుతోంది. అయితే ఇది కూడా వాస్తవం కాకపోవచ్చని, అలాగైతే పొరుగు రాష్ట్రాలకు ఎలా సరఫరా అవుతోందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలోని హెచ్‌పీ బంకు వద్ద పెట్రోల్ కోసం బారులుతీరిన వాహనాలు ⇒ ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్‌లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్లలో విక్రయాలు ఆపేశారు. -
ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు
-
రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు
ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనే లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే.. రెండో పంటకు మద్దతు ధర దక్కక, కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అప్పులతో సాగు చేసి పండించిన పంటను అయినకాడకి తెగనమ్ముకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక, మద్దతు ధర దక్కక, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు 30కి పైగా పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల వెతలు వర్ణనాతీతం. ఏ పల్లెకు వెళ్లినా రైతుల ఆక్రందనలే.. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. కళ్లెదుట పంటకు మద్దతు ధర దక్కక పోవడంతో చమర్చిన కళ్లతో దుఃఖాన్ని పంటి కింద అదిమి పెట్టుకొని రైతన్నలు మౌనంగా రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. పెట్టుబడులు పెరిగిపోయాయి రెండెకరాల్లో కౌలుకు చేస్తున్నా. ఎకరాకు రూ.20 వేలు కౌలుకు చెల్లించాను. రబీలో మొక్క జొన్న సాగుకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతకు రూ.4 వేలు తీసుకుంటున్నారు. పంటను తోలేందుకు ట్రాక్టర్‌కు రూ.1,000 డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి. ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్లో చూస్తే రూ.1,650కి మించి కొనడం లేదు. ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోతున్నా. – తాళ్లూరి ఇసాక్, గణపవరం, పల్నాడు జిల్లా ఈ రైతు పేరు లగడపాటి వీరాంజనేయులు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఈయన రబీలో కౌలుకు తీసుకున్న 30 ఎకరాల్లో శనగ, 10 ఎకరాల్లో తెల్లజొన్న వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.6 లక్షలు కౌలుకే చెల్లించాడు. రెండు పంటలకు రూ.15 లక్షల వరకు రూ.2కు వడ్డీకి తెచ్చి సాగు చేశాడు. తెల్లజొన్న 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, శనగ 8 క్వింటాళ్లకు మించి రాలేదు. తెల్లజొన్న రూ.1,600కు అమ్ముకున్నాడు. శనగకు క్వింటాకు రూ.4,900కు మించి ధర లేదు. ‘అతి కష్టమ్మీద 40 క్వింటాళ్ల శనగను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా రెండు నెలలైనా పైసా జమ కాలేదు. గతేడాది నల్లబర్లి పొగాకు సాగుతో రూ.10 లక్షలు నష్టపోతే ఈసారి మరో రూ.15 లక్షలకు పైగా నష్టపోతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ రైతు పేరు శివ వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్న పరిమి గ్రామానికి చెందిన ఈయన 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.32 వేలు కౌలు చెల్లించాడు. అదునుకు యూరియా దొరకక బ్లాకులో బస్తా రూ.350–450 మధ్య కొనుగోలు చేశాడు. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో ఐదుసార్లు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎకరాకు రూ.50 వేల చొప్పున అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా రూ.1,600కు మించి కొనడం లేదని, ఈ ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. వైఎస్ జగన్ హయాంలో ఇదే మొక్కజొన్నను రూ.2,650కు అమ్ముకున్నానని, పచ్చి వడ్లకు రూ.2,200 ధర దక్కిందని చెప్పాడు. జగన్ ప్రభుత్వంలో మంచి ధరలు లభించాయని, ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ రైతు పేరు వేటు వెంకటేశ్వరరెడ్డి. బాపట్ల జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకొని తొలి పంట వరి వేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే అకాల వర్షాలకు 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. దాంట్లో సగం కౌలుకే ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ధాన్యం బస్తా (75 కేజీలు) రూ.1,350 చొప్పున అమ్ముకున్నాడు. రబీలో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడితో జొన్న సాగు చేశాడు. మోంథా తుపానుకు మూడొంతులు పంట పోతే రెండోసారి విత్తగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. తీరా మార్కెట్‌కు తెస్తే కొనేవారు లేరు. ‘రెండు పంటలకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.5 లక్షలే చేతికొచ్చింది. ఈ సీజన్లో రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను’ అని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రైతు పేరు నల్లమోతు సత్యనారాయణ. పల్నాడు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, 1.60 ఎకరాల్లో బొప్పాయి పంటలు సాగు చేశాడు. ఎకరాకు మొక్కజొన్నకు రూ.50 వేలు, బొప్పాయికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటా రూ.1,600కు అమ్ముకోగా, బొప్పాయి పంటకు నాందేడ్ తెగులు సోకడంతో నాణ్యత తగ్గింది. ‘ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.10కి మించి కొనేవారు లేరు. తెగులు సోకిందంటే కిలో రూ.5కే అడుగుతున్నారు. కనీసం కిలోకు రూ.15–16 ధర వస్తే కానీ గిట్టుబాటు కాదు. గతేడాది 10 ఎకరాల్లో వంగ తోట వేసి నష్టపోయాను. ఈసారి మొక్కజొన్న, బొప్పాయి వేసి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని కన్నీటి పర్యంతమయ్యాడు. పల్నాడు జిల్లా నాదెళ్లలో తెగుళ్ల బారిన పడిన బొప్పాయి పంట (పంపాన వర ప్రసాదరావు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గతేడాది సాగు చేసిన నల్ల బర్లీ పొగాకుతో తీవ్ర నష్టాలను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు బేలచూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు రూ.5–10 లక్షల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు.. లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరూ వాడ ప్రచారం చేసింది. మరొక వైపు గతేడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరుచిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప తదితర కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. పల్నాడు జిల్లా అమీన్‌సాహెబ్ పాలెంలో మిర్చిని ఆరబోస్తున్న రైతులు తీపిని పంచాల్సిన పుచ్చకాయ, కర్బూజ తోటలు రైతులకు కన్నీటి చేదును మిగిలిస్తున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్ వైఫల్యం వల్లనో నష్టపోవడం లేదని.. ముమ్మాటికీ పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని తెనాలికి చెందిన ఎం.భాస్కరరావు అనే కౌలు రైతు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనే వారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని అయ్యారుపేటకు చెందిన పొపూరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మరో కౌలు రైతు కుసుమర్తి ముసలయ్య కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి జలగల్లా పీలుస్తుంటే ప్రభుత్వం కళ్లున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులు వెలవెలఎప్పుడూ కళకళలాడే మార్కెట్ యార్డులు కొనుగోళ్లు లేక నిశ్శబ్దానికి వేదికలవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొనేవారు లేక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక హమాలీలుగా పని చేయాల్సి వస్తోందని ఐతానగర్‌కు చెందిన శనవం గోపిరెడ్డి వాపోయారు. పేరుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగా మూసేశారని, క్వింటాకు రూ.4,800కే దళారులకు తెగనమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. మరొక వైపు మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.1,650 మధ్య పలుకుతోంది. అది కూడా వ్యాపారుల కాళ్లా వేళ్లా పడితే కానీ కొనడం లేదంటున్నారు. జొన్న రైతుల పరిస్థితీ అంతే.. మద్దతు ధర క్వింటా రూ.3,749 కాగా, మార్కెట్లో రూ.1,600–1,850 మధ్య దక్కుతోంది. దాచుకునేందుకు డబ్బుల్లేక సన్న, చిన్నకారు రైతులు ఈ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారైతే గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ మద్దతు ధర కోసం ఇబ్బంది పడలేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఏదైనా సందర్భంగా మార్కెట్లో కాస్త ధర తగ్గితే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేదని గుర్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని వాపోతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. ⇒ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క జొన్న కొనుగోళ్లకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే మొక్కజొన్నే కాదు ఏ పంటనూ కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడినా ఒకటేనని మండిపడుతున్నారు. ⇒ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతులకు లాభసాటి ధరలు దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంలో విఫలమవుతోంది. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం, పంట నష్టపరిహారం వంటి పథకాలు అందక పోవడం వంటి కారణాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్లలో రూ.25 వేల కోట్ల సంపదను రైతులు నష్టపోయారు.గతంలో బస్తా రూ.2 వేలు పలికేది ఐదెకరాల్లో గోరు చిక్కుడు సాగు చేశా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 60 బస్తాలు (బస్తాకు 10 కేజీలు) దిగుబడులొచ్చాయి. మార్కెట్‌కు పోతే 10 కేజీల బస్తా రూ.240కు మించి కొనడం లేదు. గతంలో రూ.2 వేల వరకు ధర పలికేది. ఈసారి తీవ్రంగా నష్టపోతున్నా. – ఎరుపల్లి శ్రీనివాసరావు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాబాండ్ ఇచ్చినా..ఇబ్బందులే..ఐదెకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశాను. ఐటీసీ బాండ్ కూడా ఇచ్చింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చేసరికి గోదాములు ఖాళీగా లేవంటూ రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు. కొనే సమయానికి నాణ్యత లేదంటున్నారు. ధర తగ్గించేస్తున్నారు. గతేడాది నల్లబర్లి సాగు చేసి నష్టపోయాం. ఈసారి వర్జీనియా సాగు చేసి ఇబ్బంది పడుతున్నాం. – మందుల నాగరాజు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఅప్పులోళ్లకు జమ చేశారు ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరన్నర కౌలుకు తీసుకుని తెల్లజొన్న పంట వేశాను. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.75 వేల వరకు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 40 టిక్కీలు (టిక్కీ 60 కేజీలు) చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3,749 మాట దేవుడెరుగు.. కనీసం మార్కెట్లో కొనేవారు లేరు. అప్పులోళ్లు వడ్డీల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చేసేది లేక క్వింటా రూ.1,850కు ఓ వ్యాపారికి తెగనమ్ముకున్నా. చేతికి రూ.44 వేలు రావడంతో దాన్ని అప్పులోళ్లకు జమ చేశాను. ఇంకా కౌలుకు చెల్లించాల్సి ఉంది. ఇంటికి పైసా కూడా తీసుకెళ్లలేదు. – పాటిపండ్ల వీరయ్య, ఐతానగరం, బాపట్ల జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్‌కుమార్ రెడ్డి, సాహెబ్‌పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్‌కుమార్ రెడ్డి, సాహెబ్‌పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఆ ఐదేళ్లూ... అన్నదాతకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ధర లేని ప్రతీసారీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. వాటి ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి ఇవ్వకపోయినా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. చివరకు ఎన్నికల వేళ రబీ 2023–24 సీజన్లో ఓ దశలో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే కేంద్రం నుంచి అనుమతులు రాకున్నా మార్క్‌ఫెడ్ ద్వారా రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి తమది రైతు ప్రభుత్వమని వైఎస్ జగన్ నిరూపించారు. -
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను చంద్రబాబు.. రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్
-
నిరుద్యోగ భృతిపై విశాఖలో YSRCP భారీ ర్యాలీ
-
సెల్లెఫోన్ లైట్ల వెలుగులో రోగులకు వైద్యం


