బాబు సర్కార్‌ మళ్లీ అప్పు | Chandrababu Naidu govt debt to reach Rs 3,61,055 crore in AP | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ మళ్లీ అప్పు

May 1 2026 5:04 AM | Updated on May 1 2026 5:04 AM

Chandrababu Naidu govt debt to reach Rs 3,61,055 crore in AP

రూ.3,61,055 కోట్లకు చేరనున్న చంద్రబాబు ప్రభుత్వం అప్పు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్‌ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌ పరిధిలో రూ.9,000 కోట్లు అప్పు చేసింది. మే ఐదో తేదీ (మంగళవారం) మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,698 కోట్లు, రోజుకు సగటున రూ.523 కోట్లు అప్పు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement