సాక్షి, చైన్నె: వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్బుచోలై పేరిట కొత్త పథకాన్నిరూపొందించింది. అన్ని రకాల సేవలు వృద్ధులకు అందించేందుకు వీలుగా ఈ పథకం అమలు కానుంది. తిరుచ్చి వేదికగా సోమవారం సీఎం ఎంకే స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకాలైన విషయం తెలిసిందే. ద్రావిడ మోడల్ ప్రభుత్వ పథకాలను తలదన్నే రీతిలో ద్రావిడ మోడల్ 2.ఓలో నూ పథకాలు విస్తృతం అవుతాయని సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో రెండు రోజుల క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం తిరుచ్చి, పుదుకోట్టైలో సీఎం స్టాలిన్ సోమ, మంగళవారాలలో పర్యటించనున్నారు. తొలి రోజున పుదుకోట్టైలో పర్యటించనున్నారు. ఇక్కడ రూ. 767 కోట్లతో చేపట్టనున్న ప్రగతి పనులకు పునాదులు వేయనున్నారు. మధ్యాహ్నం తిరుచ్చిలో పర్యటించనున్నారు. వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇక్కడ అన్బు చోలై పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో 25 మంది సీనియర్ సిటిజన్స్‌కు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అన్బుచోలై పథకంను అంకితం చేయనున్నారు. వృద్ధులే సమాజానికి మార్గదర్శక శక్తి అని చాటే విధంగా ఈపథకం అమలుచేయనున్నారు. వృద్ధులు ఆనందంగా, సంతోషంగా జీవించే విధంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 మంది వృద్ధులకు సేవలను అదించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం తగినంత స్థలం, మౌలిక సదుపాయాలు, డే కేర్ సెంటర్ల సౌకర్యాలు, రవాణా సౌకర్యం తదితర వాటిని కల్పించనున్నారు. అన్బుచోలై కేంద్రాలను సందర్శించే వృద్ధుల కోసం ఆహారం, స్నాక్స్, తదితర వాటితోపాటుగా ఆరోగ్య పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. సురక్షితమైన వాతావరణంలో వృద్ధులు గడింపేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Tamil Nadu
సాక్షి, చైన్నె : ఉత్తమ సేవా అవార్డులతో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో జరిగింది. వీఎంసీసీ హాల్‌లో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2025 అవార్డుల ప్రదానోత్సం జరిగింది. తమ విద్యా సంస్థతో ఉన్న అనుబంధాలను ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు పంచుకున్నారు. 400 మందిపూర్వ విద్యార్థులు తరలి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. ఆ విద్యా సంస్థ ఛాన్సలర్ డాక్టర్ ఎఎస్ గణేషన్, ఉపాధ్యక్షురాలు అనురాధాలు పూర్వ విద్యార్థులను ఆహ్వానించడమే కాకుండా వారిని ఉత్తమ అవార్డులో సత్కరించారు. విభిన్న వృత్తులు,రంగాలలో ఉన్న పూర్వ విద్యార్థులు తమ విజయ గాథలను, అనుభవాలను, ప్రోత్సాహకర అంశాలను ఈసమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహుతులను ఆకట్టుకున్నాయి.
జనవరిలో తెరపైకితమిళసినిమా: నటుడు సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి నటుడు ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి స్వామికి, ఇంద్రస్, యోగిబాబు, శివద, సుప్రీత్ రెడ్డి, అనక, భామ, రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. తాజాగా కై ్లమాక్స్ సన్నివేశాలను చైన్నెలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నటుడు సూర్య మినహా ఇతర నటీనటులు పాల్గొనగా దర్శకుడు ఆర్జే బాలాజీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని గాడ్ మోడ్ అనే పల్లవితో సాగే పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయగా విశేష స్పందన తెచ్చుకుంది. దీంతో కరుప్పు చిత్రాన్ని 2026 జనవరి 23న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. తాజాగా సూర్య తన 46వ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక 47వ చిత్రాన్ని మాలీవుడ్ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నటుడు సూర్య నూతనంగా ప్రారంభించిన నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
తిరువొత్తియూరు: తూత్తుకుడి నుంచి చైన్నెకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థులు విమానంలో ప్రయాణించారు. వివరాలు.. పండారంపట్టిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే టి.ఎన్.టి.టి.ఎ. ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో తూత్తుకుడి సమీపంలోని పుదుక్కోట్టై ప్రాంతానికి చెందిన నెల్సన్ పొన్ రాజ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందిన ఆయన ఈ పాఠశాలను డిజిటల్ కేంద్రంగా మార్చి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంతోపాటూ తన సొంత ఖర్చులతో పాఠశాలకు కొత్త భవనాలను కూడా నిర్మించారు. గతేడాది ఆయన వద్ద చదువుకున్న కొందరు విద్యార్థులు తమ తలల మీదుగా తరచూ విమానం ఎగురుతోందని, అయితే తాము అందులో వెళ్లగలమా? అని సరదాగా అడిగారు. అయితే, దీని గురించి ఆయన ఆలోచించకుండా సుమారు 18 మంది విద్యార్థులను గతేడాది తన సొంత ఖర్చులతో చైన్నెకి విమానంలో తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా తన విద్యార్థులను విమానంలో తీసుకెళ్లడానికి నిర్ణయించారు. ఈక్రమంలో పూర్వ విద్యార్థులు 8 మంది, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు 10 మంది కలిపి మొత్తం 18 మందిని శనివారం విమానంలో చైన్నెకి తీసుకెళ్లారు. ఈయనతో పాటూ పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ మారిచెల్వి, చరిత్ర పరిశోధకుడు ముత్తాలంకురిచి కామరాజ్ కూడా వెళ్లారు. తూత్తుకుడి విమానాశ్రయంలో శనివారం విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్ ఇళంబగవత్ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఇక విద్యార్థులు చైన్నెలోని కన్నిమారా లైబ్రరీ, మ్యూజియం, సచివాలయం, నాయకుల సమాధులను సందర్శించారు. తర్వాత మెట్రో రైలు ద్వారా ఎగ్మోర్‌కు వచ్చి అక్కడి నుంచి ముత్తునగర్ రైలు ద్వారా ఆదివారం ఉదయం తూత్తుకుడికి తిరిగి చేరుకున్నారు.
తమిళసినిమా: వెళ్లకుదిరై చిత్ర యూనిట్‌కు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిజం సినిమా పతాకంపై హరీష్ ఓరి నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం వెళ్లకొదిరై. అభిరామిబోస్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి చరణ్ రాజ్ సెంథిల్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. భరత్ ఆశీవగన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఒక కొండ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇది . కాగా ఇది 62 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి 54 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. కాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, దర్శకుడు భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్‌కుమార్, పేరరసు, అజయ్‌బాల, డ్రీమ్ వారియర్ గుహన్, ధనుంజయన్, విధార్థ్ పాల్గొన్నారు. అభిరామి బోస్ మాట్లాడుతూ తాను ఇంతకుముందు మరాఠీ హిందీ చిత్రాల్లో నటించినా,వెళ్లకుదిరై చిత్రం తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు చరణ్‌రాజ్ చింతల్‌కుమార్ మాట్లాడుతూ తమ ఊరు కొండపైకి వెళ్లడానికి రోడ్డు లేక ప్రజలు కష్టపడుతున్న ఇతివ్రతంతో చిత్రం చేయాలని నిర్మాత కోరడంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ చరణ్‌రాజ్ సెంథిల్‌కుమార్ ఉత్తమ దర్శకుడు అని ఈ చిత్రం విడుదలైన తరువాత చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను పొందిన ఆయన కచ్చితంగా ఉత్తమ దర్శకుడేనని పేర్కొన్నారు.
వేలూరు: రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని ధన్వంతరి ఆరోగ్యపీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామిజీ 66వ జన్మదినోత్సవం పురస్కరించుకొని పీఠంలో అన్నదాన భవనం ఏర్పాటు చేశారు. భవనాన్ని రాష్ట్ర మంత్రి ఆర్‌గాంధీ ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. పీఠాధిపతి 66వ జన్మదినోత్సవం సందర్భంగా గత 66 రోజులుగా పీఠంలో ప్రత్యేక యాగ పూజలు, రెండవ కాల పూజలు, కామధేను శ్రీరంగనాధర్, గజలక్ష్మి, తంగబల్లి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి మహా దీపారాధన పూజలు చేశారు. మంత్రి గాంధీ పాల్గొని అన్నదాన భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. మురళీధర స్వామిజీ మాట్లాడుతూ పీఠంలో మూడురోజులపాటు ప్రత్యేక యాగ పూజలతో పాటు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం ధన్వంతరి పీఠాన్ని బంగారుగుడి పీఠం పీఠాధిపతి శ్రీశక్తిఅమ్మ సందర్శించి పలు యాగ పూజలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. వివిధ పీఠాల పీఠాధిపతులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Ananthapur
రాప్తాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో రాప్తాడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ డీలర్ అంకే శివయ్య (44) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... వివరాలు.. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో అనంతపురానికి వెళ్లిన శివయ్య.. అక్కడ 30 కిలోల అలసందల బస్తా తీసుకుని ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రసన్నాయపల్లి పంచాయతీలోని జన్మభూమినగర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను 108 అంబులెన్స్ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
కేసు నమోదుకు కొర్రీలు..
ప్రమాదం జరిగిన ప్రాంతం రాప్తాడు పీఎస్, అనంతపురం 4వ పట్టణ పీఎస్ సరిహద్దున చోటు చేసుకోవడంతో కేసు నమోదుకు పోలీసులు కొర్రీలు వేస్తూ వచ్చారు. ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదని పోలీసులు తెలుపుతూ బాధిత కుటుంబ సభ్యులను రెండు పోలీస్ స్టేషన్ల మధ్య పోలీసులు ఆడుకున్నారు. చివరకు రాత్రి 9 గంటలకు రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Bhadradri
పాల్వంచరూల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ వడ్లు కొనేందుకు పౌరసరఫరాల శాఖ ఈసారి ముందస్తుగానే మేల్కొంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే వరి కోతలు ఇంకా ముమ్మరం కాలేదు. అక్కడక్కడా వరి కోతలు ప్రారంభించిన రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. రైతులు సన్నరకాల వడ్లను వ్యాపారులకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ లభించనుంది. జిల్లాలో వానాకాలంలో 1,74,250 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల చొప్పున 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
కొనుగోలు లక్ష్యం 2,38,177 మెట్రిక్ టన్నులు
గతేడాది జిల్లాలో 163 కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు కేవలం లక్షా 15వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో సన్నరకం ధాన్యం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 35,315 మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఎస్.త్రినాఽథ్‌బాబు తెలిపారు.
మద్దతు ధరలు ఇలా..
ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,369 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. గతేడాది ఏ గ్రేడ్ వడ్లకు రూ.2,320 చెల్లించగా, దొడ్డు రకం ధాన్యానికి రూ.2,300 చెల్లించింది. ఈసారి అదనంగా రూ.69 ధర పెంచింది.
గత వానాకాలం ఎంత సేకరించారంటే
గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన 160 కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి 17,782 మంది రైతుల ద్వారా రూ.262.07 కోట్ల వ్యయంతో లక్షా 13 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లా నాలుగు శాఖల ద్వారా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. మొత్తం 187 కొనుగోలు కేంద్రాల్లో పీఏసీఎస్‌లకు 111, జీసీసీకి 35, డీసీఎంఎస్‌కు 28, ఐకేపీలకు 13 కేంద్రాలను కేటాయించారు.
జిల్లాలో 187 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 153 కేంద్రాలను ప్రారంభించాం. కొనుగోలు కేంద్రంలో సన్న, దొడ్డు రకాల వడ్లను వేర్వేరుగా కొంటాం. సన్న రకాలను గుర్తించే యంత్ర పరికరాలను కూడా అందుబాటులో ఉంచాం. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. –ఎస్.త్రినాఽథ్‌బాబు,
జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్
సన్నరకాల ధాన్యాన్ని విక్రయించిన రైతులకు మార్కెటింగ్ శాఖ ద్వారా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించనున్నారు. సన్న, దొడ్డు రకాల వడ్ల కొనుగోళ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతీ కేంద్రానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌తోపాటు ధాన్యం కొనుగోలు చేసి తరలించే గన్నీ బ్యాగులపైనా సీరియల్ నంబర్లను కేటాయిస్తారు.
జిల్లాలో ధాన్యం కొనేందుకు 187 కేంద్రాల ఏర్పాటు..
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం వెంకటాపురం, నారాయణపురం ఐకేపీ సంఘాల ద్వారా త్వరలోనే సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోంది. ఈ క్రమంలోనే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్రంలోనే తొలిసారి పైలట్ ప్రాజెక్టుగా వెంకటాపురం, నారాయణపురం సంఘాలను ఎంపిక చేశారు. ఇప్పటికే మండల ఐకేపీ(చైతన్య) సమాఖ్య ద్వారా రూ.36లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఇల్లెందు ఆర్టీసీ డిపోకు అద్దె ప్రాతిపదికన ఇచ్చారు. తద్వారా ప్రతీ నెల సమాఖ్యకు రూ.69,468 అద్దె రూపంలో లభిస్తోంది. ఇందులో రుణం పోగా కొంత ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ఈ మండలంలోని సమాఖ్యలను ఎంపిక చేయడం విశేషం.
రోజుకు 4వేల యూనిట్లు
ఎర్రుపాలెం మండలం రాజుపాలెం రెవెన్యూ పరిధి వెంకటాపురంలోని సర్వే నంబర్ 102లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.3 కోట్లు బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించింది. అలాగే, నిర్మాణ పనులను సాయి బాపూజీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకోగా.. నిర్మాణం పూర్తయ్యాక ఏడాది పాటు ఈ సంస్థే నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇక 25 ఏళ్ల పాటు వారంటీతో కూడిన సోలార్ పలకలు ఏర్పాటుచేస్తారు. ప్లాంట్ ద్వారా రోజుకు 4వేల యూనిట్ల చొప్పున నెలకు 1.20లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది. కాగా, ప్లాంట్ నుంచి వెంకటాపురం సబ్‌స్టేషన్ వరకు లైన్ వేసి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌నుగ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఈ ప్లాంట్ పనులకు త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు.
ముమ్మరంగా పనులు
వెంకటాపురంలో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నాలుగెకరాల భూమిలో ఏర్పా ట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే భూమిని చదును చేయించి చుట్టూ పిల్లర్లు వేసేందుకు కందకాలు తవ్విస్తున్నారు. అంతేకాక వెంకటాపురం నుంచి ప్లాంట్ వరకు రూ.46 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే శంకుస్థాపన జరిగితే, డిసెంబర్ నెలాఖరు నాటికి ప్లాంట్ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
సోలార్ ప్లాంట్ ద్వారా వెంకటాపురం, నారాయణపురం గ్రామాల్లోని శ్రీకృష్ణ, ఉషోదయ సమాఖ్యల్లో సభ్యులుగా ఉన్న 400 మంది మహిళలకు ఆర్థికంగా చేయూత దక్కనుంది. ప్లాంట్ ద్వారా నెలకు ఉత్పత్తి అయ్యే 1.20లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేస్తుంది. తద్వారా నెలకు రూ.3.75 లక్షలు, ఏడాదికి రూ.45.07లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో కొంత రుణం చెల్లిస్తే 6 – 7 ఏళ్లలో బకాయి తీరుతుంది.
ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ తల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒడి బియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం జరిపారు. ఈఓ ఎన్ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని పేర్కొన్నారు. వారి సౌకర్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై దరఖాస్తు చేసుకునేవారు కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో అర్జీలు అందజేసి రశీదులు పొందాలని సూచించారు. పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
అదనపు జీఎంలకు ఉద్యోగోన్నతి
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో పని చేస్తున్న ఇద్దరు అదనపు జీఎంలకు జీఎంలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ శనివారం రాత్రి ఈఈ సెల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో ఎస్.వెంకటాచారి, సీహెచ్.వెంకటరమణ ఉన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
దుమ్ముగూడెం : మండలంలోని పెదపాడు లక్ష్మీనగరం ఎంపీపీఎస్‌ల ఉపాధ్యాయులు మోహన్‌కుమార్, బొడ్డు నాగేశ్వరరావులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్, శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేశారు. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మల్కాజిగిరి డీసీపీ వెంకటరమణ ముఖ్యఅతిథులుగా హాజరైన అవార్డులను అందించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఓపెన్ కోర్సులు
రెగ్యులర్‌తో సమానం
టీఓఎస్‌ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు జ్యోతి
బూర్గంపాడు: రెగ్యులర్ టెన్త్, ఇంటర్, డిగ్రీ కోర్సులతో సమానంగా ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ కోర్సులు ఉంటాయని తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ రాష్ట్ర పరిశీలకురాలు జ్యోతి అన్నారు. బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ క్లాసులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓపెన్ టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్థులు రెగ్యులర్ కోర్సులు చదివిన విద్యార్థులతో సమానంగా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చన్నారు. అనివార్య కారణాలతో చదువులు మధ్యలో ఆపేసినవారు ఓపెన్ విధానంలో ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో అంతర్గత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీఎం(పర్సనల్)ఈఈ అండ్ ఆర్‌సీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్(ఈఅండ్‌ఎం) ఈ–2గ్రేడ్‌లో 23, అసిస్టెంట్( సివిల్ ) ఈ–2 గ్రేడ్‌లో 4, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈఅండ్‌ఎం) ఈ–1 గ్రేడ్‌లో 33, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్)లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఈ–1 గ్రేడ్‌లో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులు ఈ నెల 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి కొలువై ఉన్న భద్రగిరి ఆదివారం రద్దీగా మారింది. కార్తీక మాసంలో వారాంతపు రోజులు కావడంతో రామయ్య దర్శనానికి భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం క్యూలైన్ల ద్వారా అంతరాలయంలో స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. క్యూలైన్లు కిటకిటలాడటంతో స్వామివారి ఆర్జిత సేవలను సైతం కొద్ది సేపు నిలిపివేసి ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పించారు. ఆదివారం సందర్భంగా అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
చిత్రకూట మండపంలో
సత్యనారాయణస్వామి వ్రతం
చిత్రకూట మండపంలో కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. అర్చకులు, వ్రత మహత్యాన్ని, భద్రగిరిలో వ్రత కల్పన విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులు స్వామివారిని అంతరాలయంలో దర్శించుకున్నారు.
పినపాక: రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కూడా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి క్రీడాకారుల వసతి, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. క్రీడాకారులకు భోజనం వడ్డించారు. భోజనం అందిస్తున్న కంది చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. మెదక్ జట్టుకు చెందిన బాలిక మ్యాచ్‌లో దెబ్బ తగలగా, అధికారులు 108 ద్వారా పినపాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
రెండోరోజు పోటీలు ఎలా జరిగాయంటే..
బాలుర విభాగంలో కరీంనగర్ జట్టుపై నల్లగొండ, నిజామాబాద్‌పై ఖమ్మం విజయం సాధించాయి. మరికొన్ని మ్యాచ్‌ల్లో కరీంనగర్‌పై వరంగల్, నిజామాబాద్‌పై నల్లగొండ, వరంగల్‌పై ఖమ్మం, మెదక్‌పై ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌పై హైదరాబాద్, ఆదిలాబాద్‌పై హైదరాబాద్, మెదక్‌పై రంగారెడ్డి , మెదక్‌పై మహబూబ్‌నగర్ జట్లు గెలుపొందాయి.
బాలికల విభాగంలో..
కరీంనగర్‌పై నిజామాబాద్, మెదక్‌పై మహబూబ్‌నగర్, నిజామబాద్‌పై ఆదిలాబాద్, ఖమ్మంపై నల్లగొండ, మెదక్‌పై కరీంనగర్, రంగారెడ్డిపై ఖమ్మం, మెదక్‌పై ఆదిలాబాద్, హైదరాబాద్‌పై వరంగల్, రంగారెడ్డిపై నల్లగొండ, వరంగల్‌పై ఖమ్మం, హైదరాబాద్‌పై రంగారెడ్డి, ఖమ్మంపై నల్లగొండ జట్లు విజయం సాధించాయి.
● ఎల్‌ఐసీ ఏఓఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్ ● ముగిసిన మహాసభలుఖమ్మంమయూరిసెంటర్ : ఎల్‌ఐసీని కార్పొరేట్ల పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా ఏజెంట్లు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, దీంతో ఏజెంట్లను నష్టపరచడమే లక్ష్యంగా కేంద్రం కుట్ర పన్నుతోందని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్ విమర్శించారు. ఖమ్మంలో రెండు రోజుల పాటు జరిగిన ఏఓఐ సౌత్ సెంట్రల్ జోనల్ 6వ మహాసభలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల పొదుపు విధానానికి ఎల్‌ఐసీ ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. అలాంటి సంస్థను కొందరు కార్పొరేట్ సంస్థల కోసం ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐఆర్‌డీఏఐని అడ్డుపెట్టుకుని ఏజెంట్లకు నష్టం కలిగించే పనులు చేస్తోందన్నారు. ఏజెంట్ల కమీషన్ తగ్గింపు, బీమా సుగం పోర్టల్ ప్రతిపాదన, పాలసీ పోర్టబిలిటీ, మ్యూచువల్ ఫండ్ కంపెనీల వలె కమీషన్ విధానం ఉండాలనే ప్రతిపాదన వంటివి ఇందులో భాగమేనని విమర్శించారు. ఇలాంటి పరీక్షా సమయంలో ఏజెంట్లు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. సభలో యూనియన్ ఆలిండియా అధ్యక్షుడు సురజిత్ కుమార్ బోస్, జోనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.మంజునాథ్, పీఎల్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి శ్రీనివాసరావు, టి.కుమార్ పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభల ముగింపు సందర్భంగా ఎల్‌ఐసీ ఏఓఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.జయరామ, ప్రధాన కార్యదర్శిగా పి.ఎల్.నరసింహరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు రాష్ట్రాల నుంచి 141 మందితో నూతన కౌన్సిల్‌ను, 69 మందితో కమిటీని, 27 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. కోశాధికారిగా వలీ మొహిద్దీన్, ఉపాధ్యక్షులుగా టి.కోటేశ్వరరావు, డి.సి.శివమూర్తి, తాళ్లూరి శ్రీనివాసరావు, టి.నాగరత్నమ్మ, జి.శ్రీనివాస్, కె.రామనర్సయ్య, ఎం.నాగరాజు, ఆర్.శివ రుద్రమ్మ, ఎస్.లింగ వాడియా, ఎ.ఎస్.లోకేష్ షెట్టర్, కార్యదర్శులుగా కె.కృష్ణారెడ్డి, జి.రవి కిషోర్, సి.ప్రదీప్ తదితరులు ఎన్నికయ్యారు.
పాల్వంచ: పట్టణంలోని కేటీపీఎస్ ఎ కాలనీలో ఉన్న సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన భద్రశైల డ్యాన్స్ పోటీలు అలరించాయి. కూచిపూడి నాట్యనిలయం వ్యవస్థాపకులు రమాదేవి రామ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించగా, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తరలివచ్చి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముగింపు వేడుకల్లో నవలిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు, ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ నరసింహాకుమార్, చండ్ర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట: మండల పరిధిలోని అంకంపాలెం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో వసతులు, మౌలిక సదుపాయాల కల్పన లేమితో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంకంపాలెంలోని ఓ తాత్కాలిక భవన సముదాయంలో 2017లో ప్రారంభమైన ఈ కళాశాల కొన్నాళ్లకే సరిపడా వసతులు, భవనాలు లేక ఖమ్మం జిల్లా పరిధి తనికెళ్లలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకు బదిలీ చేసి అక్కడే తరగతులు నిర్వహించారు. తదుపరి ఏ జిల్లాకు సంబంధించిన కళాశాలను అదే జిల్లాలోనే నిర్వహించాలనే నిబంధన కారణంగా అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్టులో ఉన్న గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించారు. కాగా, ఈ పాఠశాలకు రావడానికి సరియైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కళాశాలలో ప్రవేశానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి తిరిగి అంకంపాలెం గ్రామానికి తరలించారు. ఇలా పలుమార్లు కళాశాల పలు ప్రాంతాలకు తిరుగాడుతూ ఉండటం వలన కళాశాలలో ప్రవేశానికి విద్యార్థులు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు.
తరగతి గదులే డార్మెటరీ గదులు..
అంకంపాలెంలోని ఓ తాత్కాలిక భవనంలో నిర్వహించబడుతున్న ఈ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో బీఏ, బీకామ్, బీజెడ్సీ, బీఎస్సీ విభాగాలకుగాను మూడేళ్లకు కలిపి మొత్తం 208 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరికి బోధన నిమిత్తం మొత్తం 12 తరగతి గదులు ఉన్నా.. వసతుల కోసం ప్రత్యేకమైన డార్మెటరీ గదులు లేవు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధన పూర్తయిన తర్వాత, ఆ తరగతి గదులనే వసతి గదులుగా వినియోగించుకోవాల్సి వస్తోంది. దీంతో ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేక అరకొర వసతులతోనే విద్యార్థులు తమ చదువులను కొనసాగిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదివాసీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
భవిష్యత్‌లో మరింత భారం..
గిరిజన బాలికల డిగ్రీ గురుకులంలో మూడేళ్ల కోర్సులకు గాను గరిష్టంగా 800 మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కళాశాలలో ఉన్న 208 మంది విద్యార్థులకే సరిపడా వసతులు లేక నానా అవస్థలు పడుతుండగా.. రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరిగితే గురుకులంలో వసతుల కల్పన సాధ్యతరం కాక కళాశాల నిర్వహణ మరింత కష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న వసతులను మెరుగుపరిచి శాశ్వత ప్రాతిపాదికన కళాశాల సామర్థ్యానికి సరిపడా తరగతి, వసతి గదులకు అవసరమైన భవనాలను తప్పనిసరిగా నిర్మించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సరియైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించని పరిస్థితిలో కళాశాలలో ప్రవేశానికి గిరిజన విద్యార్థులు ముందుకొచ్చే పరిస్థితి కనపడటం లేదు.
లైబ్రరీ, ల్యాబ్ బహుదూరం
ఒకపక్క తరగతులు, డార్మెటరీని ఒకే గదిలో నిర్వహిస్తుండగా.. లైబ్రరీ, ల్యాబ్ తరగతి గదులు కళాశాలకు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఉన్నాయి. లైబ్రరీకి వెళ్లి తమకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవాలన్నా, ప్రాక్టికల్ తరగతుల కోసం ల్యాబ్‌లకు వెళ్లాలంటే రానుపోను సుమారుగా ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తోంది. ఈ రాకపోకల సమయంలో మహిళ విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
అంకంపాలెంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి, డార్మెటరీ (వసతి) గదులు లేవు. ఈ కారణంగా తరగతి గదులనే బోధన అనంతరం వసతి గదుల మాదిరిగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక లైబ్రరీ, ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించే ల్యాబ్ కళాశాల కాంపౌండ్‌లో లేకపోవడంతో సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం వరకు విద్యార్థినులు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఈ అరకొర వసతులతోనే సరిపెట్టుకుంటున్న విద్యార్థినుల సంఖ్య రాబోయే విద్యా సంవత్సరానికి పెరిగితే భవిష్యత్‌లో కాలేజీ నిర్వహణ చాలా కష్టంగా మారే అవకాశం ఉంది.
అంకంపాలెం బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంతేకాక విద్యార్థుల గరిష్ట సంఖ్యకు సరిపడా భవనాలను నిర్మించే దిశగా ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టాలి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జోక్యం చేసుకొని ప్రస్తుతం విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేలా కృషి చేయాలి. – పాశం వెంకటేశ్వరరావు,
ఆదివాసీ నాయకుడు, దమ్మపేట
అంకంపాలెం గ్రామంలో ఇప్పటికే కళాశాల భనవ సముదాయం కోసం ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అదనపు తరగతి గదుల నిమిత్తం రూ.45 లక్షలు మంజూరయ్యాయి. విద్యార్థుల గరిష్ట సంఖ్యకు సరిపడా త్వరలోనే అన్ని రకాల మౌలిక సదుపాయాలతో నూతన భవనాలను నిర్మించే దిశగా ఉన్నతాధికారులు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
– బి.అరుణ కుమారి, ఐటీడీఏ, ఆర్‌సీఓ
అంకంపాలెం గురుకులంలో వసతులు కరువు
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు మీ సేవ యాప్, జీవన ప్రమాణ, పెన్షనర్లు ఐఎఫ్‌ఎంఐఎస్ యాప్ ద్వారా నేరుగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే, 75 ఏళ్లు దాటిన వారు మాత్రమే నేరుగా ఎస్‌టీఓ, డీటీఓలకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. –వెంటపల్లి సత్యనారాయణ,
ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు గతంలో నానా తంటాలు పడాల్సి వచ్చేది. అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశాన్ని కల్పించింది. జిల్లా ట్రెజరీ కార్యాలయం (ఖమ్మం డీటీఓ)తో పాటు ఒక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్(ఏటీఓ), నాలుగు సబ్ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్‌టీఓ)ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 12,984 మంది పెన్షనర్లు ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఏటా ఒకసారి జీవన ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. ఈ పత్రం సమర్పిస్తేనే ఆ తర్వాత పెన్షన్‌ను ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే, రిటైర్డ్ అయిన వారిలో 61 ఏళ్లు దాటిన వారు, వయోవృద్ధులు ఉంటారు. వీరంతా శ్రమకోర్చి ఎస్‌టీఓ, మీ సేవ కేంద్రాలకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. కొందరు నడిచే పరిస్థితిలో కూడా ఉండరు. దీంతో వీరు జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించాలంటే ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిన పరిస్థితుతులు నెలకొన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ (జీవన ధ్రువీకరణ పత్రం) సమర్పించేందుకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా సెల్‌ఫోన్‌లోనే మీ సేవ యాప్, జీవన ప్రమాణ్ ద్వారా, ఐఎఫ్‌ఎంఐఎస్ యాప్ ద్వారా సమర్పించే వీలు కల్పించింది.
జీవన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి..
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ పొందాలంటే ఏటా నవంబర్ ఒకటి నుంచి మార్చి 31లోపు జీవన ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి బతికే ఉన్నాడని గెజిటెడ్ ఉద్యోగి సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను ఎస్‌టీఓల్లో సమర్పించాలి. ఇలాంటి సమయాల్లో పలు సాంకేతిక సమస్యలు వస్తున్న క్రమంలో అలాంటి వాటిని అధిగమిస్తూ మొబైల్ యాప్‌లోనే లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే అవకాశం ఉంది.
ఇలా చేయాలి
ఆండ్రాయిడ్ మొబైల్‌లో తొలుత మీ సేవ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో ప్రధానంగా వివిధ రకాల ఆప్షన్లు వస్తాయి. అందులో పెన్షన్‌దారు జీవన ధ్రువీకరణ అనే దగ్గర ప్రెస్ చేయాలి. అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌ను ప్రెస్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ (నమోదు), రిజిస్ట్రేషన్ స్థితి తనిఖీ, జీవన ధ్రువీకరణపత్రం సమర్పణ, రశీదులు అనే అంశాలు చూపిస్తాయి. ఇందులో రిజిస్ట్రేషన్ నమోదు అనే ఆప్షన్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ ఖాతా నంబర్ లేదంటే పీపీఓ ఐడీ (8 అంకెలు), మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి కొనసాగించండి అనే నెంబర్‌ను ప్రెస్ చేయాలి. ఆ తర్వాత లైవ్ ఫొటో.. ఫొటోను క్లిక్ చేయండి అనే ఆప్షన్లు వస్తాయి. ఫొటోను క్లిక్ చేయండి అనే ఆప్షన్ నొక్కాలి. ఆ తర్వాత ఫొటో దిగి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న వివరాలను సరిచూసిన తర్వాత అక్కడ సిబ్బంది ఓకే చేస్తారు. వెంటనే పెన్షన్‌దారుడి ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ రావటానికి ఆలస్యమైతే ట్రెజరీ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవచ్చు. మెసెజ్ వచ్చిన వారు ఆ మెసేజ్ ఆధారంగా తిరిగి జీవన ధ్రువీకరణపత్రం సమర్పణ అని వస్తుంది. అందులో యథావిధిగా పెన్షన్‌దారుల వివరాలు సమర్పించి సెల్ఫీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత పెన్షన్‌దారుల వివరాలు సబ్‌మిట్ చేసినట్లు రశీదు సైతం తీసుకోవచ్చు. ఒక ఫోన్‌లో యాప్ నుంచి ఎంతమంది పెన్షన్‌దారుల వివరాలైనా నమోదు చేయొచ్చు.
75 ఏళ్లు దాటితే రావాల్సిందే..
పెన్షనర్లలో 75 సంవత్సరాలు దాటిన వారంతా తప్పకుండా నేరుగా ఎస్‌టీఓ, డీటీఓల కార్యాలయాలకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా మెంటల్లీ డిజార్డర్స్, డైవర్స్ పెన్షనర్లు, విడో పెన్షనర్లు, అవివాహితులు పెన్షన్ పొందుతున్నట్లయితే నేరుగా ఎస్‌టీఓ, డీటీఓల్లో గెజిటెడ్ ఆఫీసర్‌చే ధ్రువీకరించిన లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
అశ్వారావుపేటరూరల్: రిజర్వ్ ఫారెస్టులో రాత్రికి రాత్రే జేసీబీతో తవ్వకాలు చేసి విలువైన ఎర్రమట్టిను టిప్పర్లలో అక్రమంగా తరలించారు. కొంతమంది అటవీ శాఖ ఉద్యోగుల సహకారంతోనే మట్టి తవ్వకాలు యఽథేచ్ఛగా జరగ్గా, దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్‌లోని అశ్వారావుపేట సెక్షన్ పాపిడిగూడెం బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబరు 292(పాపిడిగూడెం మార్గం)లో ‘కంపా’పథకం కింద అటవీశాఖ వివిధ రకాల మారుజాత మొక్కలను 25 హెక్టర్లలో పెంచుతున్నారు. ఈ ప్లాంటేషన్ ప్రధాన రహదారికి పక్కనే ఉండగా.. రహదారి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల లోపల అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు నీటి కుంటను ఏర్పాటు చేశారు. కాగా, ఈ నీటి కుంటే తాజాగా ఎర్రమట్టి దందాకు కేంద్రంగా మారింది.
అటవీ అధికారుల అండతో..
దట్టమైన రిజర్వ్ ఫారెస్టులో ఉన్న ఈ నీటికుంటలో గురు, శుక్రవారం రాత్రుల్లో అశ్వారావుపేట రహదారి విస్తరణ పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేసి ఎర్రమట్టిని తరలించారు. నాలుగు టిప్పర్ల సాయంతో రాత్రంతా తరలించారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు టిప్పర్లతో తరలించి ఎర్రమట్టి విలువ మార్కెట్ ధర ప్రకారం చేస్తే లక్షలాది రూపాయలు ఉంటుందని, ఈ అక్రమ మట్టి రవాణా అంతా కొంతమంది అటవీ ఉద్యోగుల సహకారం లేకుండా సాధ్యం కాదని స్థానికులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో సామాన్యులు వంట చెరుకు, అవసరాలకు చిన్నపాటి చెట్టును నరికితే కేసులు, జరిమానాలు విధించే అటవీ అధికారులకు రెండు రోజులపాటు రిజర్వ్ ఫారెస్టులో జరిగిన ఈ మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా కనిపించలేదా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, రిజర్వ్ ఫారెస్టులో ఇష్టారాజ్యంగా సాగిన మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా వ్యవహారంపై కొంతమంది స్థానికులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిజర్వ్ ఫారెస్టులో ఎర్ర మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాకు ఎంతమేర నగదు చేతులు మారిందనే విషయాలు విచారణలోనే తెలాల్సి ఉంది. కాగా, ఈ దందాకు సహకరించిన ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
కప్పిపుచ్చుకునేందుకు యత్నం..
కాగా, ఎర్రమట్టి కోసం జేసీబీలతో రిజర్వ్ ఫారెస్టు మధ్యలో ఉన్న నీటి కుంటలో భారీగా తవ్వకాలకు పాల్పడిన అక్రమార్కులు వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. నీటికుంటలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు ఖాళీగా ఉంటే దందా వెలుగులోకి రాకుండా ఉండేందుకు, ఆయా ఖాళీ గుంతలు కనిపించకుండా కుంట ఎగువ భాగంలో నిల్వ ఉన్న నీళ్లను కాలువ తీసి తాజాగా తవ్వకాలు చేసిన ఆయా గుంతల్లోకి వదిలారు. దీంతో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు నీళ్లతో నిండిపోయాయి. కాగా, ఈ అక్రమ మట్టి తవ్వకాల విషయం వెలుగులోకి వస్తే నీటి కుంటలో చేసిన తవ్వకాలు, గుంతలు కనిపించకుండా ఉండేలా అక్రమార్కులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక ఫారెస్టు రేంజర్ మురళిని వివరణ కోసం ‘సాక్షి’పలుమార్లు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
రిజర్వ్ ఫారెస్టులో వెలుగుచూసిన అక్రమ మట్టి దందా
మణుగూరు రూరల్: ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మణుగూరు ఎంజేపీటీబీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రజిని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో అండర్–14 విభాగంలో ఆత్మకూరి సాత్విక్, కొత్తపల్లి కౌశిక్, పయలి శివకుమార్, జి.తరుణ్, ఎ.భరత్, వల్లెపు వంశీ, అండర్–17విభాగంలో ఎ.సాకేత్, ఎ.భవన్, జి.శ్రీరామ్, బి.రాంచరణ్‌లు అత్యుత్తమ ప్రతి భ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తెలి పారు. అనంతరం విద్యార్థులకు ప్రిన్సిపాల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మంజిల్లా ఆర్‌సీఓ సీహెచ్. రాంబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు ముంజాల సురేష్, పీ.డీ. వెంకట్రావు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహల నడుమ గడిపారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.25,270 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,050 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సైక్లింగ్ పోటీల్లో కొత్తగూడెం ఎఫ్‌డీఓకు ద్వితీయస్థానం
పాల్వంచరూరల్:అంతర్జాతీయస్థాయిలో హైద రాబాద్‌లో నిర్వహించిన హెచ్‌సీఎల్ సైక్లింగ్–2025 పోటీల్లో కొత్తగూడెం ఎఫ్‌డీఓకు ద్వితీ యస్థానం లభించింది. కాగా, ఈ పోటీల్లో దేశ నలుమూలలనుంచి సుమారు 14వేల మంది పోటీదారులు పాల్గొనగా.. ఖమ్మం సైక్లింగ్ క్లబ్(కేసీసీ) నుంచి 8 మందిలో ఒకడైన కొత్తగూడెం డివిజన్ ఎఫ్‌డీఓ యు.కోటేశ్వరరావు 48 కిలోమీటర్ల సైక్లింగ్ పందెంలో ద్వితీయస్థానం(40 ఏళ్ల విభాగం)లో నిలిచి రూ.15వేల నగదు బహుమతి అందుకున్నారు. ఈమేరకు ఖమ్మం సైక్లింగ్ క్లబ్ ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ప్రతిభ కనబర్చడంతో కోటేశ్వరరావును క్లబ్ మెంబర్స్ అధ్యక్షుడు మహేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శ్రీనివాస్‌లు అభినంధించారు.
గుండాల: ప్రమాదవశాత్తు ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బాఽధితుడి కథనంప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగేల్లి వెంకన్న తండా సమీ పాన ఓ పూరింట్లో నివాసం ఉంటూ కార్పెంటర్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం ఎప్పటిలాగే చర్చికి వెళ్లగా.. మధ్యాహ్నం 4గంటల సమయాన ఇంట్లో నుంచి మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు ఆయనకు సమాచారం అందించారు. వెంటనే అతడు అక్కడికి చేరుకుని స్థానికుల సా యంతో మంటలు ఆర్పివేయగా.. అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. కాగా, ఇందులో మూడు కర్ర మిషన్లు, సుమారు రూ.లక్షన్నర విలువ చేసే మంచాలు, ఇంటి సామగ్రితో పాటు రూ.50వేలు నగదు కాలిపోయాయని సుమారు రూ.5లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబం పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. బాధితుడు ఇటీవలే ఓ నూతన ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
కారును ఢీకొట్టిన
ఆర్టీసీ బస్సు..
టేకులపల్లి: కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం ఫారెస్టు శాఖ డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పాకాల వద్ద గల గుంజేడు ముసలమ్మ ఆలయంలో దర్శనం కోసం ఇల్లెందు వైపు బయలుదేరారు. ఈక్రమంలో వెంకట్యాతండా వద్దకు రాగానే కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలిసిన ఎస్‌ఐ అలకుంట రాజేందర్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు.
ఖమ్మంస్పోర్ట్స్: వేంసూరు మండలం కుంచపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు 72 మంది అయితే, అందులో 21 మంది రాష్ట్రస్థాయి పోటీ లకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు జి.శివ ఆదివారం వెల్లడించారు. ఇంకా రెండు క్రీడాంశాల్లో దాదాపు ఐదుగురు క్రీడాకారులు ఎంపిక కావొ చ్చన్నారు. రాష్ట్రపోటీలకు అండర్–14 కబడ్డీలో కె.భ వాని, కె.వెంకటేశ్వర్లు(ఫుట్‌బాల్), హాకీలో వై.దీపిక, వై.దుర్గాంజలి, పి.సుస్మిత, రాధ, గోపిచంద్, నవదీప్, అరవింద్, అండర్–14 సాఫ్ట్‌బాల్‌లో కె.నగేశ్, బి.అవినాష్,పి.గోపిచంద్,ఎ.లక్ష్మీనారాయణ,గౌతశ్రీ, ఈ.య శ్విత, బెస్‌బాల్‌లో భరత్‌జగదీశ్, కె.యశ్వంత్,మురళీకృష్ణ,ఈ.ధనుష్,ఈ.లోకేశ్,ఈ.గణేశ్ ఉన్నా రు. విద్యా ర్థులను హెచ్‌ఎం లాల్‌మహ్మద్ అభినందించారు.
అండర్–14, 17 యోగా జట్ల ఎంపిక
జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎన్‌ఎస్ కెనాల్ పాఠశాలలో ఉమ్మ డి జిల్లాస్థాయి యోగా జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్– 14, 17జట్లకు ఎంపికై న బాలబాలికల వివ రాలను ఆయన ప్రటించారు. అండర్–14 బాలుర జట్టులో ఎ.సాత్విక్, కె.కౌషిక్, పి.శివకుమార్, జి.తరుణ్, ఎ.భరత్‌కుమార్, వి.వంశీ, బాలికల జట్టులో ఎస్.కె.ఖుర్షి దా, బి.కనకమహాలక్ష్మి, పి.వర్షిత, టి. నాపీసితార్, అండర్–17 బాలురజట్టులో ఎ.సాకేత్, జి.శ్రీరాం, ఎ.భవన్‌కుమార్,యు.పార్థు, ఎం.దీపక్, బి.రాంచరణ్, బాలికల జట్టులో ఎ.వైష్ణవి,ఎం. రమ్య, బి.సహస్ర, వై.ప్రణ తి, జి.పావని, కె.స్ఫూర్తి, జశ్విత ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కొత్తగూడెంఅర్బన్: ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ ఎమ్మెల్టీ విద్యార్హత కలిగినవారు మెడికల్ ల్యాబ్‌లు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెంలోని మంచికంటి భవన్‌లో నిర్వహించిన సీఐటీయూ అనుబంధ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్‌లో ఆయన మాట్లాడారు. 2010 క్లినికల్ చట్టం ప్రకారం వీరంతా ప్రైవేటు ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, 2018లో ఎంబీబీఎస్ చదువుకున్నవారు మాత్రమే మెడికల్ ల్యాబ్‌లు నడిపించాల ని చట్టాన్ని సవరించారని అన్నారు. దీనివల్ల ల్యాబ్ టెక్నీషియన్లకు అన్యాయం జరుగుతోందని అన్నా రు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేవరకు పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం ప్రైవేటు మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ టీ యూ కొత్తగూడెం పట్టణ కన్వీనర్ భూక్య రమేష్, నాయకులు లిక్కి బాలరాజు, మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరభద్రం, కార్యదర్శి సలీం, ఆర్ రమేష్, నరేందర్, రాము, ప్రకాష్, సత్యనారాయణ, సుబ్బారావు, చంద్రమోహన్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సీయూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏజే రమేష్
ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 23న మహబూబాబాద్ జిల్లా గుంజేడులో, 30న ఇల్లెందులో, డిసెంబర్ 4న చిరుమళ్లలో సన్నాహక సభలు, డిసెంబర్ 9న ఆసిఫాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అనంతరం చలో అచ్చంపేట, బొగ్గుట్ట, చిరుమళ్ల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్, పలు సంఘాల అధ్యక్షులు, నాయకులు కల్తీ వీరమల్లు, కొట్నాక విజయ్, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పూసం వెంకటలక్ష్మి, కురసం పద్మజ, వెంకటేశ్వర్లు, శ్రీను, సీతారాములు, భాస్కరరావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Alluri Sitarama Raju
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన 79వ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్ 14,17,19 విభాగాల బాలబాలికలు ఉత్సాహంగా ప్రతిభ కనబరిచారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
విజేతలు వీరే..
ఇండియన్ రౌండ్‌కు సంబంధించి అండర్ 14 బాలుర విభాగంలో చిత్తూరుకు చెందిన ఏఎస్‌వీఎంఎన్‌ఎస్ వైభవ్‌రామ్ ప్రతిభ కనబరిచాడు. బంగారుపతకంతో పాటు రెండు వెండిపతకాలు సాధించాడు. ద్వితీయ స్థానంలో విశాఖపట్నానికి చెందిన లలిత్‌సాయితేజ్, ప్రకాశం జిల్లాకు చెందిన కె.గోవర్దన్‌నాయుడు తృతీయ స్థానం, విశాఖపట్నానికి చెందిన జ్ఞానేష్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో చిత్తూరుకు చెందిన లోహతారెడ్డి ప్రథమ, తరువాత స్థానాల్లో చిత్తూరుకు చెందిన యోగాప్రియ, నెల్లూరుకు చెందిన మోక్షాయరెడ్డి, చిత్తూరుకు చెందిన సంఘన నిలిచారు.
● అండర్ 14 కాంపౌండ్ రౌండ్ బాలుర విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎస్‌కే ముజమిల్ అహ్మద్, బాలికల విభాగంలో కృష్ణాజిల్లాకు చెందిన కేఏఎస్ లేహ్యారెడ్డి నిలిచారు. రికర్వ్ బాలుర విభాగంలో వైఎస్సార్ కడపకు చెందిన ఏ.యశ్వంత్‌రెడ్డి, బాలికల విభాగంలో కృష్ణాజిల్లాకు చెందిన టి.వైష్ణవి ప్రథమస్థానం సాధించారు.
● అండర్ 17 ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో విశాఖపట్నానికి చెందిన మోహిత్‌సాయి, సాయి మనష్వి మొదటి స్థానంలో నిలిచారు. కాంపౌండ్ బాలుర విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సుహస్ ,బాలికల విభాగంలో ఎం.సూర్యహంసిని ప్రథమ స్థానం సాధించారు.
● అండర్ 19లో ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్.సాయిప్రసాద్, చిత్తూరుకు చెందిన కె.సాయిసృజన, కాంపౌండ్‌లో కృష్ణాకు చెందిన పి.చరణ్‌శ్రీకర్, శ్రీకాకుళంకు చెందిన జి.తనీషాచౌదరి, రికర్వ్‌లో నెల్లూరుకు చెందిన తరుణేష్ జత్యా, శ్రీకాకుళంకు చెందిన పి.త్రివేణి ప్రథమస్థానంలో నిలిచి బంగారుపతకాలు సాఽధించారు. అన్ని విభాగాలకు సంబంధించి నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల బాలబాలికలు ప్రతిభ చూపారు.మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు పతకాలతో పాటు కప్‌లు డిప్యూటీ డీఈవో చెల్లయ్య, ఎంఈవోలు జాన్, సువర్ణరాజు, జిల్లా క్రీడల అధికారి జగన్మోహనరావు అందజేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన న్యాయనిర్ణేతలు, అకాడమీ ప్రతినిధులు శ్రావణ్‌కుమార్, సత్యనారాయణతో పాటు విలువిద్య క్రీడాకారుడు బైరాగినాయుడులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కన్వీనర్ పి.సూరిబాబు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు
జాతీయస్థాయికి ఎంపిక
● పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
● మహిళల ఉచిత ప్రయాణంతో
మరింత రద్దీ
● పాడేరు డిపోలో 47 బస్సులే దిక్కు
సాక్షి,పాడేరు: జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతోపాటు సీ్త్రశక్తి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఎక్కువైంది. జిల్లాలోని 22 మండలాలకు సంబంధించి పాడేరులో మాత్రమే ఆర్టీసీ డిపో ఉంది. దీని పరిధిలో 47 బస్సులు ఉన్నప్పటికీ లివి సరిపోవడం లేదు. ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, రంపచోడవరం, భద్రాచలం, డొంకరాయి, మంప రూట్లలో వెళ్లే సర్వీసులు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. చింతపల్లి, జోలాపుట్టు, అరకులోయ మార్గాల్లో అన్ని వర్గాల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వారపుసంతల రోజున గిరిజనులంతా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా పాడేరు డిపోలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిలబడి ప్రయాణం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తరువాత ఏజెన్సీలోని ఘాట్ మార్గాల్లో కేవలం సిటింగ్‌తోనే బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఘాట్ మార్గాల్లో నిల్చోకూడదన్న నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెరగకపోవడంతో అన్ని రూట్లలో ప్రయాణికులు అత్యవసర పరిస్థితిలో నిల్చుని ప్రయాణించాల్సి వస్తోంది. జిల్లాలోని అరకు, జోలాపుట్ మినహా, అన్ని మార్గాల్లో ఘాట్‌రోడ్లు ఉన్నాయి. ప్రయాణికుల అవసరం దృష్ట్యా ఆర్టీసీ సిబ్బంది కూడా నిలబడి ప్రయాణించేందుకు అనుమతించాల్సి వస్తోంది. ఇలా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా బస్సుల సంఖ్య పెంచాల్సిన అంశాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
పదింటికి ప్రతిపాదన
పాడేరు డిపోలో బస్సుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న రూట్లలో ఇబ్బందులు లేకుండా సర్వీసులు నడుపుతున్నాం. పాడేరు డిపోకు కొత్తగా పది బస్సులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
– శ్రీనివాసరావు,
మేనేజర్, ఆర్టీసీ డిపో, పాడేరు
సర్వీసుల సంఖ్య పెంచాలి
విశాఖపట్నం వెళ్లే బస్సు కోసం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గంటన్నర నిరీక్షించా. బస్సులు కూడా ఖాళీ ఉండకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.
– మజ్జి రామలింగం, ప్రయాణికుడు, పాడేరు
అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునితీరుతామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు. ఆదివారం అరకులోయలో ప్రజా ఉద్యమం పోస్టర్లను పార్టీ శ్రేణుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం భావితరాలకు వైద్యవిద్య అందకుండా కుట్రకు పాల్పడుతోందన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వైద్యకళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నిర్వహించే ర్యాలీలో పార్టీ శ్రేణులు, అన్నవర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ శెట్టి రోషిణి, యువజన నాయకుడు రేగం చాణిక్య, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, సర్పంచ్‌లు రాధిక, నాగేశ్వరరావు, సుబ్బారావు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగ్ విజయ్ కుమార్, బీసీ సెల్ జిల్లా ఆధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, అరకు బూత్ ఇన్‌చార్జి పాంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులో ప్రజా ఉద్యమం పోస్టర్ల
ఆవిష్కరణ
12న నిర్వహించే ర్యాలీని
విజయవంతం చేయాలని పిలుపు
● లొకేషన్ యాప్‌తో పరిశీలన
సీలేరు: సీ ప్లేన్ సర్వే నిమిత్తం ఆదివారం గుంటవాడ జలాశయాన్ని ఆపరేషన్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ బృందం పరిశీలించింది. ఎక్కడ ఎంత లోతు ఉందనే అంశంపై లొకేషన్ యాప్‌తో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఫీడ్ బ్యాక్ హైవేస్ ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధి తన్నీ మాట్లాడుతూ ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజి, గండిపేట, శ్రీశైలం, కాకినాడ, విశాఖపట్నం, అరకు, జోలాపుట్, గుంటవాడ జలాశయాన్ని ఎంపిక చేశారన్నారు. ఆయా ప్రాంతాల్లో సీ ప్లేన్‌కు అవసరమైన రన్‌వేకు సంబంధించి ఇప్పటికే ఏపీఏడీసీకీ నివేదించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే సర్వే పూర్తి చేశామని, గుంటవాడ జలాశయంలో చివరిగా సర్వే చేస్తున్నామని చెప్పారు. జి ఫస్ట్ వన్ భవన నిర్మాణానికి రెండు ఎకరాల భూమి అవసరమని కలెక్టర్లకు తెలియజేశామన్నారు. దీనిపై డీపీఆర్ కూడా అందజేశామని ఆయన పేర్కొన్నారు.
● తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం జి.మాడుగులలో 11.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ డుంబ్రిగుడలో 13.7 డిగ్రీలు, పెదబయలులో 13.9, అరకువ్యాలీలో 14.1, పాడేరులో 14.6, హుకుంపేటలో 14.7, చింతపల్లిలో 15.5, కొయ్యూరులో 18.0 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన వివరించారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 15.9, , మారేడుమిల్లిలో 16.1, అడ్డతీగలలో 19.2, రంపచోడవరంలో 19.6, రాజవొమ్మంగిలో 19.8, చింతూరు డివిజన్‌లో చింతూరులో 20.3, ఎటపాకలో 20.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది.
రంపచోడవరం: ఐసీడీఎస్ ద్వారా తయారుచేసి ఆహార పదార్థాలపై ప్రజల్లో కల్పించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. రంపచోడవరంలో ఆదివారం శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వివిధ రకాలైన ఆహార పదార్థాల స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఎంతో పోషక విలువలు ఉన్న రాగులు, సజ్జలతో పాటు వివిధ ఆహార పదార్దాలు తయారు చేసుకొని తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. వందన్ వికాస కేంద్రాల ద్వారా ప్రొసెసింగ్ చేసిన జీడిపప్పును విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాలను ప్రోత్సహించాలన్నారు. జీసీసీ విక్రయించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా జీసీసీ అభివృద్ది సహకారాన్ని అందించాలన్నారు. జీసీసీ డీఎం జయశ్రీ, ఏపీడీ డేగలయ్య, తహసీల్దార్ బాలాజీ, ఎంపీడీవో రాజు, సీడీపీవో ఉమా, క్రాంతి, సుచరిత, ఝూన్సీ, సుజాత, రవళి తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్
పాడేరు రూరల్: ఏపీఎండీసీలో కార్మికుల రోజు వారి కూలీ రేట్లు పెంచి, నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కుటుంబ సమేతంగా ఖాళీ కంచాలు పట్టుకుని మండలంలో మినుములూరు కాఫీ ఎస్టేట్ ముందు ఆదివారం నిరసన తెలిపారు. అనంతరం కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎల్.సుందర్‌రావు మాట్లాడుతు కాఫీ కార్మికుల పట్ల సంబంధిత అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. అరకొర వేతనాలతో గిట్టుబాటులేని కూలీలతో కుటుంబాలు నెట్టుకొని వస్తున్నారన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారి కూలీ రేట్లు పెంచాలన్నారు. 2024లో కార్మికులతో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలన్నారు. వీడీఏ పాయింట్లు ప్రకారం రోజువారి కూలీ రేట్లు తక్షణమే పెంచాలని, ఏపీసీలుగా ఉన్న కార్మికులందరికి ప్లాంటేషన్ కండక్టర్లుగా గుర్తించాలన్నారు, పిఎఫ్, ఈఎస్‌ఐలు అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కాంతమ్మ, సత్యనారాయణ, మంగమ్మ,లక్ష్మి, చిన్నలమ్మ తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం: భీమిలి తీరంలో మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరు బాలురను రక్షించారు. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జశ్వంత్, కర్రి అజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భీమిలి బీచ్‌కు వచ్చారు. వీరు సరదాగా సముద్రంలో స్నానానికి దిగగా.. ఒక్కసారిగా అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు వెంటనే స్పందించారు. వేగంగా నీటిలోకి వెళ్లి ఆ బాలురిద్దరినీ క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. మైరెన్ సీఐ శ్రీనివాసరావు ఆ బాలురను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రమాదకరమైన తీర ప్రాంతాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసిసంహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు.
విశేషంగా నిత్యకల్యాణం : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు.
నూతిబందలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు, గ్రామస్తులు
రూడకోటలో సంతకాలు సేకరిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
గలగండలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, గ్రామస్తులు
ముంచంగిపుట్టు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని పెదగూడ పంచాయతీ గలగండ, సారధి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోని ఎంపీటీసీ సభ్యుడు టి.గణపతి సారథ్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు గణపతి మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో సామాన్యులకు సర్కారు వైద్యం, విద్య దూరమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ యోచనను విరమించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ పంచాయతీ అధ్యక్షుడు కూడా దాసు, నాయకులు కృష్ణారావు, రవి, చిరంజీవి, అప్పలరాజు, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు ఆధ్వర్యంలో మండలంలోని రూడకోట పంచాయతీలో పలు గ్రామాల్లో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వివరించి, సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా మజ్జి చంద్రుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేయడం వలన వైద్యం పేదలకు దూరం చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరకు అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షుడు సందడి కొండబాబు, మాజీ సర్పంచులు సుబ్రహ్మణ్యం, బొంజుబాబు, నాయకులు కొండపడాల్, కన్నయ్య, నాగరాజు, సూర్యారావు, గణేష్, రామ్మూర్తి, మోహనరావు, భూప్పన్న, భీమన్న, జగ్గరావు, హరిబాబు, సత్యనారాయణ, సుబ్బరావు, వెంకటరావు పాల్గొన్నారు.
జి.మాడుగుల: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలో లువ్వాసింగి పంచాయతీ బొండపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర సారథ్యంలో ఆదివారం కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం జరిగింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన జరగనున్న నష్టాలను గ్రామస్తులకు వివరించారు.ఈ సందర్భంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో మంజూరైన వైద్య కళాశాల చిత్రాలతో రూపొందించి కరపత్రాలను ఆవిష్కరించారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చింతపల్లి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ లంబసింగి మాజీ సర్పంచ్, జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు కొర్రా రఘురాం ఆధ్వర్యంలో లంబసింగి పంచాయతీ పరిధి నూతిబంద గ్రామంలో కోటి సంతకాలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు అన్ని విధాలుగా వైద్య సౌకర్యం అందుబాటులలో ఉంచడంతో పాటు నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేశారన్నారు. జగన్‌కు మంచి పేరును తుడిచి పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో ఆయా కళాశాలలను ప్రైవేట్ పరంగా చేయాలని ఆలోచన చేయడం దారుణం అన్నారు. ఈ ప్రయివేటీకరణ ఉత్తర్వులు రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ కొర్రా శాంతి కుమారి, ఎంపీటీసీ సభ్యులు రావులు నాగమణి, నాయకులు నూకరాజు, లోవరాజు పాల్గొన్నారు.
గంగవరం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీసీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని ఆర్.డి.పురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశ్ , మండల పార్టీ అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, మొల్లేరు గ్రామ సర్పంచ్ కుంజం లక్ష్మి తదితరులు ప్రసంగించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ఆదేశాల మేరకు మండలంలో ప్రతీ గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ప్రజలంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాయకులు జగదీష్, ఆకుల అప్పారావు, మేడిశెట్టి శ్రీను, చంటి, ఎం.శ్రీను, వీరబాబు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, రచ్చబండ
గిరిజనుల అనూహ్య స్పందన
తరలివచ్చిన పార్టీ శ్రేణులు
వై.రామవరం: మండలంలోని చవిటిదిబ్బలు , దేవరమడుగుల గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలు పాలయ్యారు. మండలంలోని పి.యర్రగొండ గ్రామానికి చెందిన జల్లు బుజ్జిబాబు(19) దేవరమడుగులు గ్రామం వైపు నుంచి ఒక బైక్‌పై వస్తుండగా, గొడుగు రాయి గ్రామానికి చెందిన కురసం విశ్వతేజ , అదే గ్రామానికి చెందిన ఈక ఈశ్వరదొరలు ఇద్దరు మరోబైక్‌పై చవిటిదిబ్బలు గ్రామం నుంచి వెళ్తుండగా, మార్గమధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢీకొన్నాయి. దీంతో పి.యర్రగొండ గ్రామానికి చెందిన జల్లు బుజ్జిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోబైక్‌పై వస్తున్న ఇద్దరు తీవ్రగాయాలు కాగా, వారిని 108లో స్థానిక సీహెచ్‌సీకు తరలించారు. అక్కడ వైద్యాధికారి జీవన్ తదితరులు వైద్య సేవలు అందించి, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. ప్రమాద సంఘటన స్థలానికి ఎస్‌ఐ బి.రామకృష్ణ, సిబ్బంది వెళ్లారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపారు. మోటారు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
● ఎలుకల బారిన పడి పాడవుతున్న నిత్యావసర సరకులు
● నిర్వాహకుల అవస్థలు
● పట్టించుకోని అధికారులు
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ఉన్న జీసీసీ గోదాములు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.గోడలు బీటలు వారి, పైకప్పు, గచ్చులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గచ్చుకు ఎలుకలు రంథ్రాలు ఎక్కువై జీసీసీ గోదాము ఎలుకుల నివాసం గృహాలుగా మారిపోయింది. 23 పంచాయతీలకు సరఫరా చేసే నిత్యవసర సరకులు నిల్వ చేసే జీసీసీ గోదాములు ఆధ్వానంగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. గత కొన్ని రోజులుగా ఎలుకలు గోదాములో ఉన్న పప్పులు, కారం, పసుపు, సబ్బులు వంటి సరకుల ప్యాకెట్లను, బస్తాలను కొరికి పాడుచేసి, నేలపాలు చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి రోజు ఇదే జరుగుతుండడంతో సరకులు నిల్వ చేసేందుకు, ఎలుకుల నుంచి రక్షణ జీసీసీ నిర్వాహకులు నానా పాట్లు పడుతున్నారు. స్థానిక జీసీసీ గోదాములు నిర్మించి 50ఏళ్లుకు పైగా అవుతుంది. నిత్యం భయపడుతూ జీసీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి జీసీసీ గోదాముల నూతన భవనాలకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
గాజువాక : ప్రేమించిన వ్యక్తితో పోలీసులు పెళ్లి చేయలేదనే బాధతో ఓ యువతి గాజువాక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి ప్రాంతానికి చెందిన సీహెచ్ దుర్గాభవాని, అనకాపల్లి ప్రాంతానికి చెందిన వీరయ్యస్వామి అచ్యుతాపురం ప్రాంతంలోని ఒక సంస్థలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత దుర్గాభవాని అచ్యుతాపురంలో పని మానేసి గాజువాకలోని ఒక షాపింగ్ మాల్‌లో పని చేస్తూ శ్రీనగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని వీరయ్య స్వామిపై ఒత్తిడి తెచ్చింది. ఏడేళ్లపాటు కలిసి తిరిగిన తరువాత అతడు వివాహానికి నిరాకరించడంతో పాటు ముఖం చాటేశాడు. దీంతో దుర్గాభవాని పది రోజుల క్రితం గాజువాక పోలీసులను ఆశ్రయించి తన ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. అయితే పోలీసులు పెళ్లి చేయడం లేదని బాధతో ఆదివారం తనతోపాటు తెచ్చుకున్న నెయిల్‌పాలిష్‌ను తాగింది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాజువాక సీఐ పార్థసారధి ఆస్పత్రికి వెళ్లి దుర్గాభవానిని విచారించారు. ప్రియుడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపగా.. ఫిర్యాదు చేయడానికి ఆమె ఇష్టపడలేదు. ప్రియుడితో వివాహం మాత్రమే జరిపించాలని కోరింది. ఈ విషయంపై ప్రియుడు వీరయ్యస్వామితో పోలీసులు మాట్లాడుతున్నారు.
డాబాగార్డెన్స్: పవిత్ర కార్తీకమాసంలో ఒకే రోజున పంచారామాలు దర్శనం చేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు ఆదివారం ద్వారకా బస్టేషన్ నుంచి బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ద్వారకా బస్టేషన్ డిపో మేనేజర్, సూపర్‌వైజర్ ఈ బస్సులను దగ్గరుండి పంపించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ పంచారామ దర్శినికి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 15, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో అమరావతి(అమరేశ్వరస్వామి), భీమవరం(సోమేశ్వరస్వామి), పాలకొల్లు(క్షీర రామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం(భీమేశ్వరస్వామి), సామర్లకోట(కుమార రామలింగేశ్వరస్వామి)లో దర్శనాలు చేసుకునేందుకు వీలుగా యాత్ర సాగుతుందన్నారు. ప్రయాణ చార్జీలను సూపర్ లగ్జరీకి రూ.2,150గా, అల్ట్రా డీలక్స్‌కు రూ.2,100గా నిర్ణయించారు. www. apsrtconline. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, అలాగే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం భక్తులు 9959225602 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఇదే నంబరులో శబరిమల యాత్రకు సంబంధించిన టూర్లు, ఆన్‌లైన్ రిజర్వేషన్ల గురించి కూడా తెలుసుకోవచ్చని ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు వివరించారు.
పంచారామ దర్శినికి
బయలుదేరిన ఆర్టీసీ బస్సులు
రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంకాలం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు గాయాలపాలయ్యారు. అడ్డతీగల మండలం సోమన్నపాలెంలో జరిగిన ఓ శుభకార్యాయానికి వెళ్లి తిరిగి మండలంలోని అమీనాబాద్ పంచాయతీ వణకరాయి వస్తున్న క్రమంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గ్లోరీ, రామలక్ష్మి, విజయకుమారి, కుమారస్వామిలకు గాయాలయ్యాయి. ఈ మార్గంలోని దొరమామిడి నుంచి ఆటోలో గొర్రెలను తీసుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు గాయాలపాలయ్యాడు. వీరిని జడ్డంగి పీహెచ్‌సీకు తరలించగా చికిత్స పొందుతున్నారు.
Mancherial
జన్నారం: గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన గుండ శ్రావణ్‌కుమార్ (33) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం పొనకల్‌కు చెందిన గుండ లచ్చన్న రెండో కుమారుడు శ్రావణ్ శనివారం బాదంపల్లి శివారు నదీ తీరంలో స్నానానికి వెళ్లి, ఫొటో దిగేందుకు బండరాయి పైకి ఎక్కాడు. ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరిలో గల్లంతు కాగా ఆదివారం బాదంపల్లి నదీతీరంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒత్తిడి మనసుకు సహజం. కానీ దాన్ని సరైన పద్ధతిలో బయటపెట్టకపోతే ప్రమాదకరంగా మారుతుంది. కౌన్సెలింగ్, స్నేహపూర్వక సంభాషణ, ధ్యానం, క్రమమైన నిద్ర, వ్యాయామం వంటి అలవాట్లు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. కుటుంబసభ్యులు, సహచరమిత్రులు, తోటివారు కూడా గమనిస్తూ వారికి అండగా ఉండే ప్రయత్నం చేయాలి. బలవన్మరణ ఆలోచనల నుంచి వారిని దూరం చేయాలి. అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్ అందించాలి.
– డాక్టర్ అల్లాడి సురేశ్,
మానసిక వైద్యనిపుణులు, నిర్మల్
కాసిపేట: మండలంలోని సోమగూడెం సింగరేణి మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ వాలీబాల్ పురుషులు, మహిళల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికై న ఉమ్మడి జిల్లా జట్లు ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్ జిల్లా వీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్‌లో పాల్గొననున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, ఎంపిక పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి భైరగోని సిద్దయ్య, సంయుక్త కార్యదర్శి రావుల రాంమోహన్, స్థానిక నాయకులు ముత్తె భూమయ్య, డైకిన్ ఏసీ డీలర్ రమేశ్, దుర్గం గోపాల్, జిల్లా విద్య,ఉపాధ్యాయ సంఘం నాయకులు గాజుల శ్రీనివాస్, పీఈటీలు విఠల్, సుదీప్ కుమార్, శ్రీనివాస్, రెఫరీ రమేశ్, క్రీడాకారులు ఆజ్మీర శ్రీనివాస్, ప్రేంకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న ఉమ్మడి జిల్లా మహిళ జట్టు
డి.శివాని(భీమారం), జి. ప్రీతి (ఆస్నాద్), ఈ.అ నూష(ఆస్నాద్), కె.శ్రీవైష్ణవి(కోటపల్లి), బి.హరి ప్రియ(జన్నారం), టి.అనూష (తిర్యాణి), ఏం.అమూల్య (అచులపూర్), బి.దీపిక (ఆదిలాబాద్), ఏ. లావణ్య(ఆదిలాబాద్), బి.లావణ్య(ఆసిఫాబా ద్), జె. వైష్ణవి (జైపూర్), మౌనిక (కోటపల్లి) 12 మందిని, నిఖిత, రుచిత, నక్షత్ర, చందన నలుగురిని స్టాండ్ బైగా మొత్తం 16మందిని ఎంపిక చేశారు.
పురుషుల జట్టు
ఏ. అనుదీప్(మంచిర్యాల), రాహుల్ (నిర్మల్), షారూఖ్ (సోమగూడెం), గురునాథ్ (ఉట్నూర్), విష్ణు(ఆదిలాబాద్), రాజేశ్ (సోమగూడెం), అర్జున్(ఖానాపూర్), బహదూర్‌షా(తిర్యాణి), అంజి (చిత్తపూర్), డి.మనోహర్ (ఆస్నాద్), రాజు (బోథ్), ఎస్‌కే. మోహిత్‌షేక్ (ఆదిలాబాద్)లను స్టాండ్ బైగా కార్తిక్‌నాయక్, కల్యాణ్, ప్రవీణ్, రమేశ్ నలుగురు మొత్తం 16మందిని ఎంపిక చేశారు.
పెద్దపల్లి: రాష్ట్రస్థాయి ఖోఖో ముగింపు పోటీలు ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్‌గా, హైదరాబాద్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విన్నర్‌గా, రంగారెడ్డి రన్నర్‌గా నిలిచాయి. ఖోఖో అసోసియేషన్ రాష్ట్రకార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్‌వో సురేశ్, టీఎన్జీవో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
టీజీపీఈఈవోఏ
అధ్యక్షుడిగా గురువయ్య
మంచిర్యాలక్రైం: తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎకై ్సజ్ సీఐ గురువయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మంచిర్యాల ఎకై ్సజ్ సీఐ గురువయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా చెన్నూర్ సీఐ ఎం. హరి, ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ నుంచి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వైద్య వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బీ. వెంకటరమణ, జాయింట్ సెక్రటరీగా జుల్ఫికర్ హై మద్, ట్రెజరర్‌గా కే. అభిషేక్‌లను ఎన్నుకున్నారు.
ఉద్యోగాల పేరిట మోసం.. నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్‌రూరల్ : ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మావల సీఐ కర్రె స్వామి ఆదివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం మావల పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిట్టలవాడలో నివాసముంటున్న పి.ఈశ్వర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని సిరికొండ మండలం సొన్‌పల్లి గ్రామానికి చెందిన గొర్ల శంకర్ నమ్మించాడు. రిమ్స్‌లో ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని విడతల వారీగా రూ.1.90 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించకుండా రేపు,మాపు అంటూ ఇబ్బందులకు గురిచేశాడు. ఇచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. దీంతో బాధితుడు మావల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. నిందితుడు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పేరిట కూడా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.
చెన్నూర్‌రూరల్: మామిడిలో పూతకు ముందు, కాయదశలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి పాటించడంతోనే దిగుబడి సాధించవచ్చునని హెచ్‌వో కళ్యాణి పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా రైతులు సుమారు 18 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగు చేస్తున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పాటించిన సమగ్ర పద్ధతులను బట్టి నవంబర్‌లో ముదిరిన రెమ్మల్లో పూత మొగ్గ ఏర్పడుతుంది. వాతావరణ పరిస్థితి దృష్ట్యా డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి మొదటి వారం వరకు పూత మొగ్గలు రావడం మొదలవుతుంది. ఒక్కోసారి చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యంగా కనిపిస్తాయి. పూత మొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి ఈ పద్ధతులు పాటిస్తే పూత బయటకు వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీటి వసతి ఉన్న మామిడి తోటల్లో చెట్ల పొదల్లో నీటితడి అందించాలి. ఒక లీటర్ నీటికి వెట్టబుల్ సల్ఫర్ 5 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే పూత మొగ్గలు ఒకేసారి చిగురిస్తాయి. లేదా ఒక లీటరు నీటికి పొటాషియం నైట్రేట్(మల్టికే) 10 గ్రాములతోపా టు యూరియా 10 గ్రాములు కలిపి పిచికారీ చేయా లి. ఈ పద్ధతులను ముందస్తు పాటిస్తే పూత బాగా రావడమే కాకుండా, కాయలు రాలిపోకుండా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడంతోనే రైతులు మామిడిలో అధిక దిగుబడి సాధించవచ్చు.
బాసర: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మ హారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. కార్తికమాసం సందర్భంగా ఆదివారం వేకువ జామున శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం అభిషేకం, అర్చన, హారతి, సరస్వతీ పూజ, గణపతి పూజ, కలశ పూజలు చేశారు. పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆదివారం మొత్తం ఆదాయం రూ. 9లక్షలు సమకూరిందని ఆలయ ఈవో అంజనదేవి వెల్లడించారు.
సైబర్ వలలో
క్రేన్ ఆపరేటర్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన జల్వే సతీశ్ అనే క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఎల్‌అండ్‌టీ కంపెనీలో పనిచేస్తానని, సగం ధరకే డీజిల్ ఇస్తానని నమ్మించాడు. 3150 లీటర్ల డీజిల్‌కు రూ.1,57,500 అవుతుందని పేర్కొన్నాడు. పలుసార్లు ఫోన్ చేయడంతో బాధితుడు నమ్మి మొదట ఫోన్‌పే ద్వారా రూ.13వేలు పంపించాడు. తన స్నేహితుడి ఫోన్ నుంచి రూ.50వేలు, క్రేన్ యజమాని ద్వారా రూ.73,500 పంపించాడు. సైబర్ నేరగాడు పట్టణంలోని జై జల్‌రాం పెట్రోల్ బంక్‌కు వెళ్లి డీజిల్ తీసుకోవాలని సూచించాడు. బాధితుడు అక్కడికి వెళ్లి అడగ్గా పెట్రోల్ బంక్ యజమాని అలాంటిదేమి లేదని పేర్కొనడంతో సైబర్ నేరగాడికి ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ వచ్చింది. మోసపోయినట్లుగా గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు అథ్లెటిక్స్ జోనల్ స్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 8వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ –14, 17 బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. అండర్ 14 బాలికల విభాగంలో 100 మీటర్ల పరుగు, హై జంప్‌లో వి.సంజన స్వర్ణ పతకాలు సాధించగా, 200 మీటర్ల ఈవెంట్‌లో రజత పతకంతో మెరిసింది. షాట్‌ఫుట్ ఈవెంట్‌లో నర్మద రజత పతకంతో సత్తా చాటగా, మల్లీశ్వరి 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగులో కాంస్య పతకాలతో విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో షాట్‌ఫుట్ ఈవెంట్‌లో అర్జున్ నాయక్ రజతంతో మెరిశాడు. అండర్ –17 బాలికల విభాగంలో టి.స్వాతి 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, 100 మీటర్ల హార్దిల్స్, హైజంప్ ఈవెంట్‌లో రజత పతకాలతో మెరిసింది. ఎం. శివాని 3 వేల మీటర్ల రేస్‌వాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. పి. కావ్య 100 మీటర్ల పరుగులో రజత పతకంతో మెరిసింది. బాలుర విభాగంలో వి. మహేశ్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో రజత పతకంతో సత్తా చాటగా, డీ.యువరాజ్ 110 మీటర్ల హార్దిల్స్, 400 మీటర్ల పరుగులో రజత పతకాలతో మెరిసినట్లు అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ తెలిపారు. జోనల్ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, తదితరులు అభినందనలు తెలిపారు.
మంచిర్యాలక్రైం/దండేపల్లి: సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భారతదేశంలో గంటకు సుమారు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. మంచిర్యాల జిల్లాలో వివిధ కారణాలతో 2024 –2025 అక్టోబర్ వరకు 836 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలు వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మానసిక కారకాలు కలిపి ఉంటాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ బానవత్ ప్రకాశ్ పేర్కొంటున్నారు.
ప్రధాన కారణాలు..
మానసిక, ఆర్థిక సమస్యలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సామాజిక, విద్య, కెరీర్ ఒత్తిళ్లు, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, విడాకులు లేదా సంబంధ విభేదాలు, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలం కావడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆత్మన్యూనత, సామాజిక మీడియా ప్రభావం కూడా బలవన్మరణాలకు దోహదపడుతున్నాయి.
నివారించే చర్యలు..
● మానసిక సమస్యలపై అవగాహన కల్పించడం వల్ల ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించవచ్చు.
● సైకాలజిస్టు, కౌన్సిలర్‌తో తక్షణ మానసిక సలహా అందించాలి.
● విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా చూడాలి.
● ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేవారికి సాయం చేయడంతో పాటు ప్రణాళికతో ముందుకెళ్లేలా ప్రోత్సహించాలి.
● మద్యపానం, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా చూడాలి.
● వ్యక్తులను ఒంటరిగా ఉండనివ్వకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
బానవత్ ప్రకాశ్
కట్ల సకేత
కొలిమికుంట వర్షిత
కొత్తపల్లి త్రివేద
సేపూరి అరవిందరాణి
జన్నారం: రాష్ట్ర విద్యాశాఖ, వారధి ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన, డిబేట్ పోటీల్లో జన్నారం మండలం కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థులు సత్తాచాటారు.. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు కట్ల సాకేత, ఈర్ల రిషిక, దుంప టి అక్షితలు పోటీల్లో పాల్గొని హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2025 అనే అంశంపై రా సిన వ్యాస రచన పోటీల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి బహుమతిగా రూ.36 వేల నగదు, ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న, విద్యార్థుల గైడ్ టీచర్ దాముక కమలాకర్ తెలిపారు. డిబేట్ రా ష్ట్రస్థాయి పోటీల్లో సేపూరి అరవింద రాణి, కొలిమి కుంట వర్షిత, 9వ తరగతి విద్యార్థి కొత్తపల్లి త్రివేద మూడో స్థానం సాధించి రూ. 27 వేలు నగదు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. విద్యార్థులు ప్ర తిభ చాటడంపై జిల్లా విద్యాధికారి యాదయ్య, మండల విద్యాధికారి విజయకుమార్, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్ మంగ అభినందించారు.
Nandyala
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 10న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి తెలుసుకో వచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
రేషన్ బియ్యం స్వాధీనం
మహానంది: నంద్యాల–గిద్దలూరు రహదారిలోని బోయలకుంట్ల మెట్ట వద్ద నంద్యా ల సివిల్ సప్లై అధికారులు ఆదివారం రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. రేషన్ బియ్యం మార్కాపురం నుంచి నంద్యాల వైపు వస్తుండగా జేసీకి సమాచారం అందింది. ఈ మేరకు జేసీ ఆదేశాలతో సివిల్ సప్లై ఏఎస్‌ఓ రవిబాబు, సిబ్బంది దాడి చేసి లారీని పట్టుకున్నారు. లారీని తనిఖీ చేయగా 130 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండటంతో అధికారులు నంద్యాల తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి సివిల్ సప్లయ్ గోడౌన్‌కు తరలించారు.
నంద్యాల(న్యూటౌన్): 2011 కంటే ముందు నియమించిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణా నిధి మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పీఆర్‌టీయూ కార్యాలయంలో అధ్యక్షుడు రామపక్కీర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయించి పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు పర్యవేక్షణ పోస్టులు అయిన ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులలో పదోన్నతి పొందడానికి అవకాశం కల్పించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరిని కేటాయించాలన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరరెడ్డి, రాష్ట్ర నాయకులు కృష్ణారావు, విజయరావు, నూర్‌మహమ్మద్, రమణయ్య పాల్గొన్నారు.
● ప్రభుత్వ మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణను అడ్డుకుందాం
● 12న నంద్యాలలో నిరసన ర్యాలీ
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభు త్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని ఈనెల 12వ తేదీన చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజా ఉద్యమం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను దిగ్విజయంగా ప్రారంభించారన్నారు. మిగతా కళాశాలలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన సీఎం చంద్రబాబు దురాలోచనలతో వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నా రన్నారు. పీపీపీ విధానం వెనుక బాబు బినామీలు ఉన్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక రద్దీ నెలకొంది. కార్తీకమాస మూడవ ఆదివారం శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. ఉచి త, శీఘ్ర, అతిశీఘ్రదర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు భ్రమరాంబా స మేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నా రు. ఉభయ సంధ్యావేళలలో గంగాధర మండపం వద్ద, ఉత్తరమాఢవీధిలో ఉసిరిచెట్ల వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, ప్రత్యేక నోములు నోచుకున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగించారు.
14న కోటి దీపోత్సవం..
కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాల్గవ శుక్ర వారం ఈ నెల 14వ తేదీన శ్రీశైల దేవస్థానం కోటీదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందు కోసం ప్రత్యేకంగా వేదికను కూడా సిద్ధం చేశారు. కోటి దీపోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు ఈ నెల 12న సాయంత్రం 5గంటలలోపు దేవస్థానం పరిపాలన భవనంలోని ప్రజాసంబంధాల విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు చెప్పా రు. కోటిదీపోత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం–కోటిదీపోత్సవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.
● పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. నవంబరు మొదటి పక్షంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా రాత్రి 8 గంటల నుంచే చలి ప్రభావం మొదలై తెల్లవారుజాముకు తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా జిల్లాను ఆవరిస్తోంది. ఈ సారి చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టు నుంచి వరుసగా అధిక వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండుకుండలా ఉన్నాయి. వాగులు, వంకలు, కాలువలు నీటితో నిండి ఉన్నాయి. గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో పగటిపూట ఎండతో పొడి వాతావరణం ఉంటున్నప్పటికీ రాత్రి చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 21 డిగ్రీల వరకు ఉంటున్నా..పలు ప్రాంతాల్లో 18 నుంచి 19 డిగ్రీల వరకు పడిపోయాయి. వెల్దుర్తి, కోసిగి, మంత్రాలయం, బండిత్మకూరు, అవుకు, వెలుగోడు తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకే నమోదు అవుతున్నాయి. ఈ సారి రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలోపునకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణి కారణంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. పగలు ఎండ, రాత్రి చలి. మరోవైపు వానలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నంద్యాల అర్బన్: పగలు, రాత్రి తేడా లేకుండా నంద్యాల పట్టణంలో ఇసుక దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఇసుక దోపిడీ కోసమే కూటమి ప్రభు త్వం ఏర్పడిందన్న చందంగా అధికార పార్టీకి చెందిన నాయకులు కుందూలో ఇసుకను కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో సహజ సంపదైన ఇసుక అక్రమంగా తరులుతోంది. పట్టణంలో నందమూరినగర్ వైపు వెళ్లే పాత వంతెన సమీపం నుంచి ప్రథమనంది ఆలయం వరకు అక్కడక్కడ ప్రొక్లెయిన్ల ఏర్పాటు చేసి ఇసుకను తోడేస్తు న్నారు. కుందూలో ఇసుక పెద్ద ఎత్తున ఉండటంతో కూటమి నేతల కన్ను పడింది. రాత్రి వేళ నదిలో తవ్వి సమీపంలో డంప్ చేసి పగలు దర్జాగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్రిప్పు రూ.1000 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను యథేచ్చగా విక్రయిస్తున్నారని స్థానికులు అధికారుల కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి అనుచరులే పట్టణంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని స్థానికు లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
Adilabad
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని పలు ప్ర భుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేసింది. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గాను రూ.లక్షల నిధులు విడుదల చేస్తోంది. మొ దటి విడత జిల్లాలో ప్రయోగాత్మకంగా 24 పాఠశాలలను ఎంపిక చేయగా చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులు ఆ నిధులను గోల్‌మాల్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే అక్రమాలకు పాల్పడిన గురువుల బాగోతం బయటపడనుంది. జీఎస్టీ బిల్లులు సమర్పించి కాగితాల మీద అన్ని పనులు చేసినట్లు రికార్డులు సమర్పించి నిధులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఆడిట్ అధికారులు కేవలం జీఎస్టీ బిల్లులు చూసి అంతా ఒకే అన్నట్లుగా క్లియరెన్స్ ఇచ్చారు. వారిని సైతం ప్రభావితం చేసి డబ్బులు కాజేసినట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వం జిల్లాలో తాజాగా 24 పా ఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఇటీవల మెమోలను జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, హెచ్‌ఎంకు పడనిచోట ఈ వ్యవహారం బ యటకు రాగా మిగతా చోట్ల రాజీమార్గంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా స్పష్టమవుతుంది.
నిధుల దుర్వినియోగం ఇలా..
జిల్లాలో పీఎంశ్రీ కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 24 ఎంపిక చేశా రు. ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు ఏటా నిధులు విడుదలవుతున్నా యి. అయితే ఈ నిధులను నేరుగా ప్రధానోపాధ్యాయుల అకౌంట్లలో జమ చేయడంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తీర్మానం చేసి పనులు చేపట్టాల్సి ఉండగా సంబంధిత హెచ్‌ఎంలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి వివరాలు సమర్పించారు. కొంత మంది విద్యార్థులను మాత్రమే టూర్ కు తీసుకెళ్లి అందరినీ తీసుకెళ్లినట్లు బిల్లులు లేపా రు. ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున మంజూరయ్యాయి. పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇవ్వకున్నా ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేశారు. నామమాత్రంగా స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలు, పదో తరగతి విద్యార్థుల స్నాక్స్, ఆర్థిక అక్షరాస్యత పేరిట కూడా డబ్బులు కాజేశారు. కెరీర్ గైడెన్స్ పేరిట విడుదలైన నిధులను కూడా కొంతమంది నొక్కేశారు. అంతేకాకుండా యూత్ ఎకో క్లబ్, సెల్ఫ్ డిఫెన్స్, మ్యాథ్స్, సైన్స్ సర్కిల్, జీసీసీ క్లబ్‌లు, సెల్ఫీ పాయింట్ పేరిట వేలాది రూపాయలను దుర్వినియోగం చేశారు. స్పోర్ట్స్ గ్రాంట్స్, పీటీఎం, టీఎల్‌ఎం, సెఫ్టీ సెక్యూరిటీ స్టూడెంట్స్ ఇంటరాక్షన్, గ్రీన్ స్కూల్, ఫొటో కాపీ, దినపత్రికలను వేయించకుండానే బిల్లులు లేపారు. వార్షికో త్సవం వంటివి.. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతీ కా ర్యక్రమంలోనూ వేలాది రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే విద్యా సంవత్సరం చివరలో రూ.9.50లక్షల వరకు నిధులు వి డుదల కావడం, ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వాటిని వెచ్చించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇదే అదునుగా కొంతమంది అకౌంట్లను జీరో చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 24 పాఠశాలలకు సంబంధించి రూ.3 కోట్ల12లక్షల 86వేల 391 నిధులు వచ్చాయి. ఇందులో నుంచి రూ.3కోట్ల 11లక్షల 40వేల 148లను ఖర్చు చేశా రు. కేవలం మూడు స్కూళ్ల హెచ్‌ఎంలు రూ.లక్ష 46వేల 243 బ్యాలెన్స్‌గా ఉన్నట్లు చూపించారు.
హెచ్‌ఎంలకు మెమోలు ..
పీఎంశ్రీ కింద 24 పాఠశాలలకు విడుదలైన నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇటీవల మె మో జారీ చేశారు. అందరికీ కలిపి విడుదల చేసిన ఈ మెమో ఇటీవల జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందింది. విడుదలైన నిధులు.. ఏ విధంగా ఖ ర్చు చేశారు.. బిల్లుల స్టేట్‌మెంట్.. బ్యాంక్ స్టేట్‌మెంట్.. ఫొటోలు తదితర వివరాలు పంపించాలని అందులో స్పష్టం చేశారు. అయితే 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరాలు సమర్పించగా కే స్లాపూర్ హెచ్‌ఎం వివరాలు సమర్పించలేద ని విద్యాశాఖాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయికి వె ళ్లి విచారణ జరిపితే అక్రమాల గుట్టు రట్టవుతుంద ని భావించిన పలువురు హెచ్‌ఎంలు ఎస్పీడీ నుంచి ఆ దేశాలు రావడంతో ఆగమేఘాల మీద జీఎస్టీ బి ల్లులు సమర్పించారని పలువురు ఉపాధ్యాయ సంఘా ల నాయకులు, టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
అక్రమాలకు చెక్‌పెట్టేలా ..
పీఎంశ్రీ నిధుల అక్రమాలకు చెక్‌పెట్టేలా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నిధుల చెల్లింపులో మార్పులు తీసుకొచ్చింది.ఇక నుంచి ట్రెజరీ ద్వా రానే బిల్లులు చెల్లించనుంది. అయితే హెచ్‌ఎం ఖా తాలకు కాకుండా కాంట్రాక్టర్ లేదా షాపు యజమానుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలు
24
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు
జిల్లాలో పీఎంశ్రీ కింద 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా అభివృద్ధి కార్యక్రమాల కో సం ప్రభుత్వం హెచ్‌ఎం అకౌంట్లలో నిధులు వి డుదల చేసింది. ఖర్చులకు సంబంధించిన వివరాలను వారి నుంచి తీసుకుని ఉన్నతాధికారుల కు సమర్పించాం. ఇంద్రవెల్లి ప్రధానో పాధ్యాయుడిపై ఫిర్యాదు రావడంతో అధికారులు వి చారణ జరిపి ఆర్జేడీకి సరెండర్ చేశారు. మిగతా పాఠశాలలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. – రఘురమణ,
జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్
మిగిలిన నిధులు రూ.1.46లక్షలు (మూడు
పాఠశాలలకు సంబంధించి)
2024–25 సంవత్సరానికి..
మంజూరైన నిధులు రూ.3.12కోట్ల
ఖర్చు చేసిన నిధులు రూ.3.11కోట్లు
కై లాస్‌నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే పనులకు హాజరయ్యే కూలీలకే పైకం దక్కేలా ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 84.39 శాతం పూర్తి చేశారు. ఈ నెలాఖరులోపు వంద శాతం పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు.
పారదర్శకత పెంచేలా..
ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీలకు భరోసానిస్తోంది. అయితే కొంతమంది ఈ పథకాన్ని తప్పుదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జాబ్‌కార్డు తీసుకుని పనులకు రాకున్నా హాజరైనట్లుగా వేతనాలు పొందుతున్నారు. పలువురు ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమార్కులకు వంతపాడుతున్నారు. వచ్చిన వేతనాలను చెరిసగం పంచుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పనులు జరగకపోగా ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టేలా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. తద్వారా పనులకు హాజరైన కూలీలలకు మాత్రమే అటెండెన్స్ పడుతుంది. పనుల్లో పూర్తి పారదర్శకత ఏర్పడనుంది.
మండలం మొత్తం ఈకేవైసీ
ఆదిలాబాద్‌రూరల్ 13972 11474
బజార్‌హత్నూర్ 12621 10390
బేల 7809 6382
భీంపూర్ 9215 7593
భోరజ్ 4544 3996
బోథ్ 9996 8697
గాదిగూడ 10202 8387
గుడిహత్నూర్ 14533 12170
ఇచ్చోడ 12477 10986
ఇంద్రవెల్లి 18951 16408
జైనథ్ 5694 4801
మావల 1687 1378
నార్నూర్ 15081 12364
నేరడిగొండ 13478 11753
సాత్నాల 5625 4602
సిరికొండ 9140 7839
సోనాల 5779 4849
తలమడుగు 8117 6988
తాంసి 5941 5081
ఉట్నూర్ 21107 17448
పనుల్లో పారదర్శకత ..
ప్రతి ఉపాధి హామీ కూలీకి ఈకేవైసీ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పరిధిలోని కూలీల ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటివరకు 84శాతం పూర్తి చేశాం. నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఈ ప్రక్రియ ద్వారా ఉపాధి పనుల్లో పారదర్శకత పెరుగుతుంది. కూలీ చెల్లింపులు సులభతరం కానున్నాయి.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
జిల్లాలో ఉపాధి హామీ పథకం వివరాలు..
నమోదు చేసుకున్న కూలీలు : 2,05,969
ఆధార్ సీడింగ్ చేసింది : 2,05,697
ఇప్పటి వరకు ఈకేవైసీ చేసింది: 1,73,586
ఇంకా నమోదు చేయాల్సింది: 32,383
లక్ష్మణచాంద: రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటల సాగును కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్ సాగవుతోంది. ఒకసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం వచ్చే ఈ పంట పై రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఇంకా సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.వ్యవసా య, ఉద్యాన, సహకారశాఖలు ఈ సమస్యను పరి ష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీ ఎస్) భాగస్వామ్యంతో సాగువిస్తీర్ణం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల పీఏసీఎస్ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు.
ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు..
ఒక్కో పీఏసీఎస్ పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల్ జిల్లా సహకార అధికారి నర్సయ్య తెలిపారు. సొసైటీలో సభ్యులైన రైతులతో సమావేశాలు నిర్వహించి పంట లాభాలపై అవగాహన క ల్పిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 40 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సంఘం తమ పరిధిలో లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 8,786 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 3,092 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 2,505 ఎకరాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 1,187 ఎకరాలు కలిపి మొత్తంగా 15,570 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఈ రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ధర రూ.193 ఉండగా, సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుంది. ఎకరంలో సగటున 50–55 మొక్కలు నాటేందుకు అవసరం అవుతాయి. ఈ మేరకు రూ.10,615 విలువైన మొక్కలను కేవలం రూ. 1,100లకే రైతులకు అందిస్తోంది. అలాగే బిందు సేద్యం పరికరాలను రాయితీతో అందిస్తూ, ఎకరా నికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అదనంగా పవర్ టిల్లర్లు, బ్రష్ కట్టర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, బీసీ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు.
లక్ష్యం పూర్తికి చర్యలు
ప్రభుత్వం ఆదేశాలు, ఉన్నతాధికారుల సూ చన మేరకు ఒక్కో పీఏసీఎస్‌కు 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం నిర్ణయించారు. ఈమేరకు త్వరలోనే రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. సాగుపై అవగాహన కల్పించి, లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం.
– నర్సయ్య, జిల్లా సహకార అధికారి, నిర్మల్
సాగు విస్తీర్ణం పెంపునకు కృషి
ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రాథమిక సహకార సంఘాల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. ఈ మేరకు రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తాం.
– బీవీ రమణ,
జిల్లా హార్టికల్చర్ అధికారి, నిర్మల్
కై లాస్‌నగర్: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచి త చేప పిల్లల పంపిణీ చేపడుతోంది. అయితే వీటి ద్వారా మత్స్యకారుల అభివృద్ధి ఏమో కానీ కాంట్రాక్టర్లు, సహకార సంఘాల సభ్యులు మా త్రం భారీగా వెనుకేసుకుంటున్నారనే ఆరోపణ లున్నాయి. నిబంధనలు పాటించకపోవడంతో పాటు నాసిరకం సీడ్ విడుదల చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
చేపపిల్లలను వదిలే ముందు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చెరువుల్లో అయితే 30 నుంచి 40 ఎంఎం సైజ్‌తో కూడిన సీడ్‌ను వదలాలి. ఎంత మొత్తం వదులుతున్నారో ఆయా మ త్స్యకార సంఘాలకు ముందస్తుగా తెలపాలి. ఆ ప్రకారం నాణ్యతతో కూడిన సీడ్‌ను కమిటీ సమక్షంలో లెక్కించి విడుదల చేయాలి. ఇందులో ఏమైనా తేడాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని తిరస్కరించే అధికారం జిల్లా మత్స్యశాఖ అధికారికి ఉంటుంది. ఇక రిజర్వాయర్లలో 80–100 ఎంఎం సైజ్ ఉన్న చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. ఈ సైజు పిల్లలను కిలోల లెక్కన తూకం వేసి వదలాలి. కిలోకు 300 నుంచి 350 పిల్లలు రావా లి. అంత కంటే ఎక్కువగా వస్తే వాటి సైజు తక్కువగా ఉన్నట్లుగా గుర్తించి తిరస్కరించవచ్చు. అయితే ఈ నిబంధనలేవీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. చాలాచోట్ల కమి టీ సభ్యులు కనిపించని పరిస్థితి. కాంట్రాక్టర్‌కు సంబంధించిన వారు కేవలం చాయ్ జాలిలో కొన్నింటిని తీసుకుని నామ్‌కే వస్తేగా లెక్కిస్తున్నారు. అదే చొప్పున మిగతావి వదులుతున్నారు. దీంతో అధికారులు చెప్పే లెక్కకు, కాంట్రాక్టర్ వదిలే సీడ్‌కు పొంతన లేకుండా ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతుంది. కాగా, ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని జందాపూర్, అంకోలి, తంతోలి, బుర్నూర్, గుడిహత్నూర్ మండలంలోని, సీతాగొంది, మల్కాపూర్, దామన్‌గూడ చెరువుల్లో సుమారు 6లక్షల సీడ్‌ను ఆదివారం వదిలి నట్లు అధికారులు వెల్లడించారు.
కమిటీ సమక్షంలోనే పంపిణీ
ప్రభుత్వ నిబంధనల మేరకే చేప పిల్లల సీడ్‌ను వదలుతున్నాం. మత్స్య సహకార సంఘాల సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి, మండల వ్యవసాయాధికారితో కూడిన కమిటీ సమక్షంలోనే కాంట్రాక్టర్ తెచ్చిన చేప సీడ్‌ను పరిశీలించి వదులుతున్నాం. నాణ్యమైన, నిబంధనలకు అనుగుణంగా ఉండే సైజ్‌తో కూడిన చేపలనే వదిలేలా తగు చర్యలు తీసుకుంటున్నాం.
– భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి
చంద్రగిరి YSRCP లో భారీ చేరికలు
Karimnagar
వేములవాడ: రాజన్న క్షేత్రంలోని ఆలయాలు ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కార్తీకమాసం కొనసాగుతుండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. చలిని సైతం లెక్కచేయకుండా ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో కార్తీకదీపాలు వెలిగించారు. అనంతరం భీమన్న గుడిలో అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు, కుంకుమపూజ తదితర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
మెట్‌పల్లి: పట్టణంలోని బోయవాడకు చెందిన ఎల్ల గంగనర్సయ్య (75)పై అతని కుమారుడు అన్వేష్ దాడికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గంగనర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అన్వేష్ ఉన్నారు. కుమారుడు కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. గత ఫిబ్రవరిలో తల్లిపై దాడికి పాల్పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. కొన్నిరోజులకు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటినుంచి ఇంటి వద్దనే ఉంటున్న అతను.. ఆదివారం తండ్రిపై ఒక్కసారిగా కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో గంగనర్సయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
సిరిసిల్ల అర్బన్: పట్టణ పరిధిలోని చంద్రంపేట చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను డీకొట్టడంతో డివైడర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికై నా గాయాలయ్యాయా అనేది తెలియరాలేదు. చంద్రపేంట చౌరస్తా వద్ద తారురోడ్డుపై భారీ గుంతలు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అనారోగ్య సమస్యలు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెలో ఆదివారం జరిగింది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటేశ్ (23) కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడతున్నాడు. మనస్తాపానికి గురై ఆదివారం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి తల్లి వసంత, సోదరుడు అనిల్ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పెద్దపల్లి: రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు.. జాతీయస్థాయిలోనూ రాణించి మంచిపేరు తీసుకురావాలని ఖోఖో అసోసియేషన్ రాష్ట్రకార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్‌వో సురేశ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శంకర్ సూచించారు. రాష్ట్రస్థాయి ఖోఖో ముగింపు పోటీలు ఆదివారం రాత్రి జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకల్లో అతిథులు మాట్లాడారు. మెలుకువలు నేర్చుకుని నైపుణ్యం సాధిస్తే విజయం సులభమవుతుందన్నారు. క్రీడలతో శారీరక, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నాయమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి వ్యక్తిగత నగదు ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పారు. విద్యార్థిదశ నుంచే క్రీడపై పట్టు సాధించాలని కోరారు. పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్‌గా, హైదరాబాద్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విన్నర్‌గా, రంగారెడ్డి రన్నర్‌గా నిలిచాయి. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ఆసంపల్లి వాసు, తిరుపతి, ఖోఖో ప్రతినిధులు మహేందర్, వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, టీఎన్జీవో నాయకులు శ్రీకాంత్, రాజు భాస్కర్, లక్ష్మయ్య, నరేశ్, కిష్టయ్య, రవీందర్, గెల్లు మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి
ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
కరీంనగర్‌రూరల్: ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికగానే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. ఓ పురోహితుడు వీడియోకాల్ ద్వారా అమెరికాలోని దంపతులతో సత్యనారాయణస్వామి వ్రతం చేయించారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన వాల విజయ్‌కుమార్– వినీల దంపతులు ఉద్యోగరీత్యా అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసం ఉంటున్నారు. కార్తీకమాసం పురస్కరించుకుని శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలో బ్రాహ్మణులు అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్ జిల్లా దుర్శేడ్‌లోని శ్రీమరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకుడు దేవరాజు ప్రశాంత్‌శర్మను ఫోన్‌లో సంప్రదించారు. ఆన్‌లైన్‌లో వ్రతం చేసే అవకాశముందని, అందుకు అవసరమైన వస్తువుల వివరాలను దంపతులకు వివరించారు. శనివారం రాత్రి 9.45గంటల నుంచి అర్ధరాత్రి 12.15గంటలవరకు వీడియోకాల్ ద్వారా వ్రతం చేయించారు. సత్యనారాయణస్వామి వ్రతానికి హాజరైన తెలుగువాళ్లకు వినీల దంపతులు తీర్థప్రసాదాలను అందించారు. కరోనా సమయం నుంచి ఆన్‌లైన్ ద్వారా పూజకార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, వీడియోకాల్ ద్వారా విదేశాల్లో నివాసముంటున్న తెలుగువాళ్లకు శాంతి పూజలు, హోమాలు, ఇతరత్రా చేస్తున్నానని ప్రశాంత్ శర్మ తెలిపారు.
ఆన్‌లైన్ వేదికగా సత్యనారాయణస్వామి వ్రతం
జ్యోతినగర్(రామగుండం): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది పురుడుపోశారు. బస్సు ప్రయాణంలో ఉండగానే సమాచారం అందించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇరాని జాస్ని అనే గర్భిణి తన భర్త రాజు, బంధువులతో కలిసి హైదరాబాద్ నుంచి బిలాస్‌పూర్ ప్రాంతానికి ఓ ప్రైవేటు బస్సులో బయలు దేరారు. బస్సు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాంతానికి చేరుకోగానే పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో బంధువులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోనే పురుడపోశారు. ఇరాని జాస్నిని మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అయితే, భర్త, బంధువుల విజ్ఞప్తి మేరకు బస్సును గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్సతికి 108 సిబ్బంది షబ్బీర్, అభిరామ్ తరలించారు. వైద్యులు మేథన, రాణి, నర్సింగ్ అధికారి రజిత కలిసి తల్లిబిడ్డలకు వైద్యం అందిస్తున్నారు.
పురుడుపోసిన సిబ్బంది
తల్లీబిడ్డలు క్షేమం
హుజూరాబాద్: హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రతాపవాడకు చెందిన పంపిరి పద్మ(70) భర్త ఎకై ్సజ్‌శాఖలో ఉద్యోగంచేసి మరణించాడు. కొడుకు, కూతురు ఉన్నారు. స్థానికంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సాయంత్రం కరెంట్ బిల్లు కొట్టేందుకు వచ్చిన ట్రాన్స్‌కో ఉద్యోగికి ఇంట్లోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. స్థానికులు తలుపులు తెరిచి చూడగా పద్మ మృతదేహం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు రోజుల క్రితమే మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పద్మ కొడుకు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పద్మ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
బనశంకరి: దక్షిణ భారతదేశంలో ఖ్యాతి గడించిన పశ్చిమ కనుమల సౌందర్యం, అక్కడి వన్యజీవులను కాపాడుకుందామంటూ రంగురంగుల చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. సిలికాన్ సిటీలోని చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటుచేసిన ఈ పెయింటింగ్స్ ప్రదర్శన అందరికీ కనువిందు చేస్తోంది. హిడెన్ జెమ్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ పేరుతో కొలువైన ప్రదర్శనలో అనేకమంది వర్ధమాన చిత్రకారులు, చిత్రకారిణులు గీసిన పెయింటింగ్స్ అబ్బురపరుస్తున్నాయి. పశ్చిమ కనుమలలోని అడవులు, జలపాతాలు, లోయలు, నదులు, పర్వతాలు, అక్కడ పేరుపొందిన పులులు, దున్నలు వంటి వన్యమృగాల చిత్రలేఖనాలను ఆకట్టుకునేలా గీశారు. అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేయరాదంటూ చెట్టు కాండం మీద గొడ్డళ్లు అమర్చిన నేచురల్ పెయింటింగ్ ఆలోచింపజేస్తుంది. ప్రకృతి వినాశనం వల్ల మానవాళి మనుగడకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందనే సందేశాన్ని తమ పెయింటింగ్స్ ద్వారా కల్పించారు. పశ్చిమ కనుమల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కుద్రేముఖ్, ముళ్లయ్యనగిరి, నీల కురింజి, జోగ్ ఫాల్స్‌ను తమ చిత్రలేఖనాలలో బంధించారు. క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా ఉపయోగించి ప్రకృతిని నాశనం చేయరాదనే పెయింటింగ్ కూడా ఉంది. పర్యాటకులు సఫారీ వాహనాల వల్ల వన్యజీవులకు ఇబ్బంది కలుగుతోందని మరో పెయింటింగ్ కనిపిస్తుంది. టీ, కాఫీ తోటలు, పర్వత ప్రాంతాల చిత్రాలు కనువిందు చేస్తాయి. ఈ ప్రదర్శన సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది.
చిత్రలేఖనాల వీక్షణం
పెయింటింగ్‌లో ఒదిగిన ప్రకృతి అందం
తిలకిస్తున్న విదేశీయులు
కొందరు చిత్రకారిణులు
చిత్రకళా పరిషత్‌లో
పెయింటింగ్స్ ప్రదర్శన
కాపాడాలని కుంచెతో విన్యాసం
మైసూరు: మైసూరు నగరంలోని నంజనరాజ బహద్దూర్ హాల్‌లో రెండు రోజుల అరటి మేళా నోరూరిస్తోంది. వందలాది రకాల అరటి కాయలు, పండ్లు కొలువుతీరాయి. సహజ సమృద్ధి సంస్థ, కీ స్టోన్ ఫౌండేషన్, యూసింగ్ డైవర్సిటి సహకారంతో మేళా సాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అరటి పండ్లను రైతులు, వ్యాపారులు తీసుకువచ్చారు. వాటిని ప్రజలు కొనుగోలు కూడా చేయవచ్చు. మదరంగి, చంద్ర, సహస్ర, మట్టి, బ్లూ జావా, పూజె, కమలాపుర, ఎరుపు, చంగదళి, నల్ల, రసబాలె, చిరుళు, చింగమ్ వంటి పేర్ల కదళీ ఫలాలు అబ్బురపరుస్తాయి. మరో పక్క నంజనగూడు రస అరటి, యాలక్కి, నేంద్ర, పచ్చ అరటి, కర్పూరవళ్లి, పూవన్ అరటి పండ్లు, మొక్కలు లభిస్తున్నాయి. పెద్దసంఖ్యలో నగరవాసులు సందర్శించారు.
భోజనం చేసి వచ్చేలోగా రూ.48 లక్షల నగల లూటీ
మైసూరు: రోడ్డు పక్కన హోటల్ ముందు నిలిపిన కారు అద్దాలను పగలగొట్టి సుమారు 48 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను దోచుకున్నారు. ఈ దోపిడీ మైసూరులోని హుణసూరు హైవేలో ఇలవాళ వద్ద జరిగింది. వివరాలు.. బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్, భార్య, పిల్లలతో కలిసి విరాజపేటలో ఉన్న బంధువుల పెళ్ళికి బయల్దేరారు. ఆ సమయంలో శనివారం రాత్రి భోజనం చేయడానికని హైవేలో ఇలవాళ వద్ద ఓ హోటల్‌కు వచ్చారు. కారును నిలిపి భోజనం చేసుకుని వచ్చారు. కారు అద్దాలు పగలగొట్టి ఉండడం చూసి గాభరాపడ్డారు. లోపల బ్యాగులో దాచిన బంగారం ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఇలవాళ ఠాణాకు వచ్చి బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. రాత్రి సమయం కావడంతో ఎలాంటి చిత్రాలు లభించలేదు.
నది బురదలో
రెండు ఏనుగులు బలి
దొడ్డబళ్లాపురం: ఆర్కావతి నదీ జలాల బురదమట్టిలో ఇరుక్కుని రెండు అడవి ఏనుగులు మృత్యువాత పడ్డాయి, ఈ విషాద సంఘటన కనకపుర తాలూకా సాతనూరు అటవీ ప్రదేశంలో జరిగింది. అడవి ఏనుగులు నదిని దాటుకుని అవతలి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాయి, ఈ క్రమంలో నీటిలోని దట్టమైన గడ్డి– తీగలు, బురద లో చిక్కుకుని బయటకు రాలేక నీటమునిగి మరణించాయి, ఏనుగుల కళేబరాల్ని చూసిన కొందరు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని ఏనుగుల కళేబరాలను వెలికి తీయించారు. పోస్టుమార్టం జరిపి పూడ్చిపెట్టారు.
ఆశా, నర్సు నిర్లక్ష్యం.. తల్లిదండ్రులకు కడుపుకోత
కోలారు: ఇంట్లో శిశువు కేరింతలతో కొత్త కళ వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు, బంధువుల ఆశలు అడియాసలయ్యాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తమ శిశువును బలిగొందని ఆస్పత్రి ముందు బైఠాయించారు. బేతమంగల ఫిర్కా గుట్టహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగింది. వివరాలు.. బాబు, రూప దంపతులు కాగా, రూపకు నెలలు నిండాయి, కాన్పు కోసం గుట్టహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లారు. ఆశా కార్యకర్త, నర్సు వారిని డబ్బులు డిమాండు చేశారు. ముందుగానే హడావుడిగా ప్రసవం చేయడానికి ప్రయత్నించారు, దీనివల్ల మృత శిశువు జన్మించిందని తండ్రి విలపించాడు. ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. శిశువు మరణానికి కారకులై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రైతన్న ఆత్మహత్య
మండ్య: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ సంఘటన మండ్య జిల్లాలోని కేఆర్ పేటె తాలూకాలోని అక్కిహెబ్బాలు హోబ్లి పరిధిలో ఉన్న బెళతూరు గ్రామంలో జరిగింది. కృష్ణే గౌడ (47), 2 ఎకరాలలో సేద్యం చేసుకునేవాడు, రూ.4 లక్షల పైగా అప్పులు ఉన్నాయి. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదనకు లోనయ్యాడు. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
బొమ్మనహళ్లి: చెరువులో ఉన్న నీటిలో మునిగి ఇద్దరు బాలురు చనిపోయిన ఘటన బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలి దగ్గర బల్లూరులో జరిగింది. బిహార్‌కు చెందిన అనికేతన్ కుమార్ (12), ఏపీలో సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రెహమత్ బాబా (11) మృతులు. ఉపాధి కోసం వీరు ఇక్కడకు వచ్చారు. శనివారం సాయంత్రం సమీపంలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు, వారికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. మిగతా పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు చెరువు వద్దకు వెళ్లి చూడగా బాలల జాడ లేదు. ఆదివారం ఉదయం పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులో వెతకగా ఇద్దరు బాలల శవాలు బయటపడ్డాయి. బాలల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అతి వేగానికి ఇద్దరు బలి
యశవంతపుర: బైకులో అతి వేగంగా వెళ్తూ రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు, రామనగర జిల్లా మాగడి తాలూకా కుదూరు సమీపంలోని గాంధీ ఫారం వద్ద జరిగింది. మాగడికి చెందిన కేశవ ప్రసాద్ (21), మయూర్ (20) బెంగళూరు నుంచి హాసన్‌కు వెళుతుండగా దారిలో గాంధీ ఫారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కింద పడి తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు.
రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి..
చిక్కమగళూరు సమీపంలో హిరేగౌడ గ్రామం వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చన్నగిరికి చెందిన కుమారప్ప (60), సతీశ్ (35) మరణించగా, మరో డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు.
హేళన పోస్టింగులపై కేసులు
శివాజీనగర: సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న పోరు మీద కొందరు హేళన చేసేలా గ్రాఫిక్స్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్యల మీద ఏఐ ద్వారా పోస్టులను పెట్టారు. ఓ సభలో సీఎం సిద్దరామయ్యను కుర్చీ నుంచి డీకే కిందకు పడదోసినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. కన్నడ సినీ రంగం అనే పేరు గల ఇన్‌స్టా ఖాతా ద్వారా పోస్టు చేయగా, సదాశివనగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో ద్వారా అశాంతిని పుట్టించేలా కుట్ర జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు నవంబరు వచ్చినా సీఎం పదవి రాలేదేమిటా అని శివకుమార్ ఆతృతగా మొబైల్‌లో చూడడం, అది చూసి రాహుల్‌గాంధీ, సిద్దరామయ్య పగలబడి నవ్వుతున్నట్లు మరో మెమె విడుదలైంది.
15న సీఎం ఢిల్లీలో విందు భేటీ
శివాజీనగర: కాంగ్రెస్‌లో మంత్రిమండలి పునర్విభజన, సీఎం మార్పు చర్చల మధ్య సీఎం సిద్దరామయ్య వర్గం విందు ఎంపీ రాజశేఖర్ హిట్నాళ్ ఢిల్లీ నివాసానికి మారింది. మొదట మాజీ మంత్రి రాజన్న ఇంటిలో జరపాలని అనుకున్నారు. సీఎం సిద్దరామయ్య బిహార్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజునే అంటే 15వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ సీఎం, సన్నిహితులు హిట్నాళ్ ఇంటిలో భారీ విందు ఇవ్వబోతున్నారు. సిద్దరామయ్య తన బల ప్రదర్శనకు దీనిని వాడుకోబోతున్నట్లు సమాచారం. గత శుక్రవారం మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ తుమకూరులోని తన ఇంట్లో సీఎం, సన్నిహితులకు భోజన విందు ఏర్పాటు చేసినా సీఎం బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయారు. సీఎం వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరికీ ఢిల్లీ విందుకు పిలుపు వెళ్లింది. సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగించాలని ఇందులో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం.
బొమ్మనహళ్లి: సిలికాన్ సిటీలో తూటా పేలింది. వ్యాపారవేత్త బాలప్ప రెడ్డి, మాదేశ అనే ఇద్దరి హత్య కేసులో ప్రముఖ నిందితుడు, మూలతః ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవిప్రసాద్‌రెడ్డిని బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకాలో ఉన్న బొమ్మసంద్ర శ్మశానం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు అక్కడ తలదాచుకున్నట్లు తెలిసి పోలీసులు పట్టుకోవడానికి వెళ్లారు. పోలీసులను చూసిన నిందితుడు వారి పైన దాడి చేసి తప్పించుకుపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినా కూడా లొంగిపోలేదు, దీంతో తుపాకులతో కాల్పులు జరిపారు. హెబ్బగోడి ఇన్స్‌పెక్టర్ సోమశేఖర్ తన పిస్టల్‌తో కాల్పులు జరిపారు. కాళ్లకు గాయాలైన నిందితుడు పడిపోగా వెంటనే పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
ఆ రోజు ఏం జరిగింది..
రవిప్రసాద్ రెడ్డి హెబ్బగోడి పరిధిలో హోల్‌సేల్ కిరాణా వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. ఇతని స్నేహితులు బాలప్ప రెడ్డికి ఓ స్టీల్ ఫ్యాక్టరీ ఉండగా, మాదేశ టీ హోటల్, కిరాణా స్టోర్ నడుపుతున్నాడు. బాలప్ప వద్ద పెద్దమొత్తంలో అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. 4వ తేదీన బాలప్ప ఇంటికి వెళ్లి అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు దోచుకోవాలని పథకం వేశాడు, బాలప్పను కిడ్నాప్ చేసే సమయంలో మాదేశ వచ్చాడు, దీంతో తన పథకం విఫలమైందనే కోపంతో ఇద్దరినీ గొంతు కోసి హతమార్చాడు, ఈ అలికిడి పక్కింటి మల్లికార్జున అనే వ్యక్తి వచ్చి హంతకున్ని అడ్డుకోబోగా తనతో తెచ్చుకున్న బ్యాగును వదిలేసి పారిపోయాడు. బ్యాగులో కత్తులు, కటార్లు, మెటల్ డిటెక్టర్ వంటివి లభించాయి. ఆ రోజు నుంచి పోలీసులు గాలింపు జరుపుతున్నారు. నిందితుడు కర్ణాటక, ఏపీలో అనేక నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు.
డబుల్ మర్డర్ నిందితునిపై
పోలీసులు కాల్పులు, అరెస్టు
మేలుకోటె దేవస్థానంలో ఉపరాష్ట్రపతి
మైసూరు చాముండేశ్వరి ఆలయంలో..
శివాజీనగర: కన్నడిగులు సంస్కృతి, పరంపర, ఆధ్యాత్మికతను కాపాడుతున్నారు. కర్ణాటకే ఒక పుణ్యక్షేత్రమని ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ కొనియాడారు. ఆయన ఆదివారం కన్నడనాట విస్తృతంగా పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ గెహ్లాట్, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తరువాత పలు ప్రాంతాల పర్యటన గావించారు. హాసన్ జిల్లా శ్రవణ బెళగోళలో శాంతిసాగర మహారాజు 10 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ క్షేత్రం భక్తి, శాంతి, త్యాగానికి సంకేతంగా నిలుస్తోందన్నారు. భారతీయ సంస్కృతీ పరంపరకు జైన మతం సేవలు అపారమని అన్నారు.
చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో..
మైసూరు: చాముండి కొండపై నాడిన శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారిని ఉప రాష్ట్రపతి దర్శించుకున్నారు. మొదట హెలికాప్టర్‌లో మైసూరు మండకళ్ళి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, మంత్రి హెచ్.సి.మహదేవప్ప స్వాగతం పలికారు. చాముండి కొండకు చేరుకుని అమ్మవారికి విశేష పూజలు చేశారు.
మేలుకోటెలో
మండ్య: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మండ్య జిల్లా మేలుకోటెలో ప్రఖ్యాత చెలువనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. రామానుజుల తపోభూమి అయిన మేలుకోటె అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తామని చెప్పారు. ఆలయ స్వామీజీలు, పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రాశస్త్యాన్ని వివరించారు. కేంద్రమంత్రి హెచ్.డి.కుమార స్వామి, రాష్ట్ర మంత్రి ఎన్.చలువరాయస్వామి ఉన్నారు.
సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు పరిరక్షణ
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రశంస
పలు చారిత్రక ప్రదేశాలలో పర్యటన
National
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నెల 11న జరిగే రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలి దశలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించినట్లు తెలిసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 14 ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని(సీఏపీఎఫ్) రప్పించారు. పోలింగ్ రోజున బూత్‌ల వద్ద మూడు అంచెల భద్రత ఉంటుంది. ఆధునిక ఆయుధాలతో కూడిన సీఏపీఎఫ్ సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వహిస్తారు.
డేగ కళ్లతో పకడ్బందీ నిఘా
బిహార్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మొత్తం 1,650 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు. ఇందులో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ నుంచి 1,332 కంపెనీలు ఉన్నాయి. మిగిలిన 273 కంపెనీలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాయుధ పోలీసు దళాలకు చెందినవి. వీటిలో 208 కంపెనీలను 14 బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలించారు. ఇందులో 14,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ దళాలు సీఏపీఎఫ్ కమాండ్ కింద పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతకు నాయకత్వం వహిస్తాయి. అలాగే.. పోలింగ్ బూత్‌లతో పాటు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రతి జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులపై డేగకళ్లతో నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.పోలింగ్ బూత్‌ల వద్ద పటిష్ట భద్రత
బిహార్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. పోలింగ్ బూత్‌ల వద్ద రెండు రకాల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. సీఏపీఎఫ్ సిబ్బందిని రెండు విభాగాలుగా మోహరిస్తారు. పెద్ద బూత్‌లలో పూర్తిస్థాయి విభాగం అంటే.. ఎనిమిది మంది సాయుధ సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. ఇక తక్కువ మంది ఓటర్లు ఉన్న చిన్న బూత్‌లలో సగం విభాగం అంటే.. నలుగురు సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. అదనంగా బిహార్ హోంగార్డ్‌లు, దాదాపు 19వేల మంది ట్రైనీ పోలీసు సిబ్బంది, స్థానిక వాచ్‌మెన్‌లను కూడా పోలింగ్ స్టేషన్‌ల వద్ద మోహరించారు. వారిలో ఎవరినీ కూడా వారి సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియమించలేదు.సీఐఎస్‌ఎఫ్‌కు స్ట్రాంగ్ రూమ్‌ల బాధ్యత
మొదటి దశ పోలింగ్ తర్వాత జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంను భద్రపరిచారు. రెండో దశ పోలింగ్ తర్వాత కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో కూడా సీఐఎస్‌ఎఫ్ బలగాలే భద్రతను పర్యవేక్షిస్తాయి. బిహార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని డీజీపీ కంట్రోల్ రూమ్ ఎన్నికలకు ప్రధాన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఇక్కడ పర్యవేక్షణ కోసం ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలను నియమించారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్ సమయంలో మొత్తం 121 స్థానాల్లో ఓటింగ్‌ను ఇక్కడి నుండే నిశితంగా పరిశీలించారు. నవంబర్ 11న జరిగే రెండో దశకు కూడా ఇదే విధానం కొనసాగుతుంది. మొదటి దశ పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించగా, అత్యవసర వినియోగం కోసం ఐదు అదనపు కంపెనీలను రిజర్వ్‌లో ఉంచారు.
Telangana
జనగామ జిల్లా: హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి (ప్రైవేట్ ఉద్యోగి) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్సై చెన్నకేశవులు, స్థానికుల వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన వి.మౌనిక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ షోరూంలో పని చేస్తోంది. రాత్రి హాస్టల్‌కు వచ్చిన ఆమె తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రెండు కాళ్లు విరిగి, తీవ్రగాయాల పాలైన మౌనికను సహచరులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
డాడీ ఇది నా చివరి కోరిక..
ఘటనా స్థలంలో మౌనిక వద్ద ఉన్న సూసైడ్ నోట్‌ను ఎస్సై చెన్నకేశవులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మౌనిక.. ‘డాడీ నా గురించి తప్పుగా అనుకోకు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎవరినీ ఏమనొద్దు. నా మరణం వల్ల ఎవరూ ఇబ్బంది పడవద్దు.. ఇదే నా చివరి కోరిక’అంటూ అందులో పేర్కొంది. అమ్మ, డాడీ, గణేశ్ గుడ్ బాయ్, టేక్ కేర్ ఆల్, ఐ లవ్ యూ నాన్న అని రాసి హాస్టల్ భవనంపై నుంచి దూకగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఘటనపై ప్రాథమిక వివరాలు తీసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు వచి్చన వెంటనే దర్యాప్తు చేస్తామని ఎస్సై చెన్నకేశవులు తెలిపారు.
Dr B R Ambedkar Konaseema
● కల్లలవుతున్న సొంతింటి కల
● పీఎంఏవై వాటా చెల్లింపులో
కూటమి ప్రభుత్వం మొండిచేయి
● నిర్మాణ వ్యయం పెరిగిందన్న నెపంతో
రూ.2.5 లక్షల నుంచి 1.8 లక్షలకు కుదింపు
● గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు తీవ్ర నిరాశ
ఆలమూరు: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇళ్లు లేని నిరుపేదలకు మూడు సెంట్ల స్థలం కేటాయిస్తామని, రూ.ఐదు లక్షల రుణం ఉచితంగా అందిస్తామని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నేతలు అమలుకు సాధ్యం కాని హామీలతో ఊదరగొట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కావస్తున్నా పాలకులు ఆ ఊసే ఎత్తడంలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్య వైఖరి వల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకమయ్యాయి. పీఎంఏవై పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.70 వేలు, ఎన్‌ఆర్జీఈఎస్ పథకం కింద రూ.30 వేలు వాటాగా లబ్ధిదారునికి ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని ప్రకటనను కూడా జారీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 22 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో 14,487 మంది ధరఖాస్తు చేసుకున్నారు. పీఎంఏవై పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు కేత్రస్థాయిలో పట్టణాలు, పల్లెల్లో పీఎంఏవై యాప్ ద్వారా సర్వే చేపట్టి సుమారు 60 శాతం మేర పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా పరిధిలో ఉన్న పలు గ్రామాలు అమలాపురం కేంద్రంగా ఔడా పరిధిలోను, మరికొన్ని గ్రామాలు రాజమహేంద్రవరం కేంద్రంగా రుడా పరిధిలోనూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అన్ని పట్టణాభివృద్ధి కేంద్రాల పరిధిలోకి వెళ్లి పోవడంతో ఆ మేరకు పీఎంఏవై పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత జిల్లా అంతటినీ ఒక యూనిట్‌గా తీసుకుంది. పీఎంఏవై పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖాధికారులు సర్వే సమయంలో కూడా తెలిపారు.
మొదటికి వచ్చిన
లబ్ధిదారుల సర్వే
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఇప్పటి వరకూ చేసిన సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. ఇక నుంచి పట్టణాల్లో పీఎంఏవై (అర్బన్) యాప్ లోను, గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై (రూరల్) యాప్‌లోను విడివిడిగా సర్వే చేసి అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా యాప్‌లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. దీంతో గృహ నిర్మాణ శాఖాధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
గృహ రుణాల మంజూరు రీసర్వే పేరుతో రుణ పరిమితిని తగ్గించామని చెప్పేందుకు ప్రజల్లోకి ఏముఖం పెట్టుకుని మళ్లీ వెళతామనని వారు సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. అనుమతులు వచ్చేటప్పటికి పట్టణాభివృద్ధి పరిధిలోకి, రుణాల మంజూరులో గ్రామీణ స్థాయిలోకి నెట్టడం సరికాదనే సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత వైఎస్సార్ సీపీ హయాంలో
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం, నిరుపేదలకు సరైన గూడు కల్పించడం కోసం జిల్లాలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, వేలాది మంది నివసించేందుకు కాలనీలు నిర్మించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారు. జిల్లాలో ఏ మండలానికి వెళ్లినా వైఎస్సార్ సీపీ హయాంలో సర్వ హంగులతో ప్రైవేట్ కాలనీల మాదిరిగా సర్వాంగ సుందరంగా నిర్మించిన జగనన్న కాలనీలు ప్రస్తుతం దర్శనమివ్వడం నాటి పరిస్థితికి అద్దం పడుతోంది. పేదలందరికీ సరైన గూడు కల్పించాలన్న సృహ కూటమి ప్రభుత్వానికి లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది.
దరఖాస్తులిలా..
నియోజకవర్గం దరఖాస్తులు
అమలాపురం 2812
ముమ్మిడివరం 2805
రాజోలు 1493
కొత్తపేట 2442
పి.గన్నవరం 2868
మండపేట 735
రామచంద్రపురం 1332
మేడంటే మేడా కాదూ.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లూకున్నా పొదరిల్లూ మాదీ.. అనే సినీ గీతానికి సరిపోయేలా సాగింది నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల కలలకు ‘వరం’లా. పేద్ద ఇంద్రభవనమా అంటే కాదు.. అలా అని పూరి గుడిసె కూడా కాదు.. ఓ చిన్న కుటుంబం సంతృప్తిగా జీవించడానికి అవసరమైన వసతులతో నీడనిచ్చిన జగనన్న ప్రభుత్వాన్ని ఆ పేదలు ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఓ సొంతిల్లు కట్టుకోవాలని కలగనని కుటుంబం ఉండదు. ఆ కల సాకారానికి పేదలు నిత్యం ప్రభుత్వాలకు అర్జీలు పెడుతూనే ఉంటారు. దేవుడు వరమిచ్చినా పూజారి ఒప్పుకోని చందంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టి తన భాగస్వామ్య నిధులు మంజూరు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ నిధులు విడుదల చేయడంలో ఎన్నో కొర్రీలు పెడుతుండడంతో సమస్య ఎడతెగక సందిగ్ధంలో పడిపోతుంటాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తున్న సాకులు.. పెడుతున్న గొళ్లాలు అలానే అనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపునకు నిరాకరణ
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంఏవై పథకంలో ఒక్కొక్క లబ్ధిదారునికి రూ 2.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.70 వేలను గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు చెల్లించలేమంటూ కూటమి సర్కార్ చేతులెత్తేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పీఎంఏవై యాప్‌ను అర్బన్, రూరల్‌గా విభజించింది. ఇప్పటివరకూ లబ్ధిదారునికి రూ.2.5 లక్షలు మంజూరు చేస్తామంటూ క్షేత్రస్థాయిలో చేసిన సర్వేను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి ఈ లబ్ధిదారులకు రూ 1.80 లక్షలు రుణ వసతి మాత్రమే మిగిలింది. అసలే పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలతో పాటు కార్మికుల వేతనాలు విపరీతంగా పెరిగి పోయిన తరుణంలో రుణ పరిమితిలో కోత విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహ రుణాలను మంజూరు చేయకపోగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఏవై పథకంలోను కొర్రీలు పెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
● టీడీపీ నేత ఆగడాలతో వివాదం
● ఆందోళన చేసిన స్థానిక మహిళలు
● వారిని వైఎస్సార్ సీపీ వర్గీయులుగా చూపే ప్రయత్నం
● ఇరు వర్గాలపై కేసులు నమోదు
కొత్తపేట: కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఆత్రేయపురం మండలంలో టీడీపీ నాయకుడు, ప్రస్తుతం ప్రముఖ దేవస్థానం చైర్మన్‌గా చలామణి అవుతున్న వ్యక్తి ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తాజాగా రహదారిని సైతం కబ్జా చేశారంటూ తలెత్తిన అంశంపై వివాదం తలెత్తింది. ఆ రహదారి కోసం పలు కుటుంబాల మహిళలు తీవ్ర నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల తరఫున అల్లూరి ప్రసాదరాజు అనే టీడీపీ నాయకుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురంలో పెద్ద రామాలయం వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఎప్పటి నుంచో ఉమ్మడి స్థలాలతో ఏర్పాటుచేసుకున్న రోడ్డు రాజమార్గంగా ఉండేది. పూర్వపు తాగునీటి చెరువును కలుపుతూ ఉండే ఈ రోడ్డుపై మహిళలు నీటిని తెచ్చుకునేవారు. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి పంచాయతీలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా 2018లో మండల టీడీపీ నాయకుడు మార్గానికి స్థలం వదిలిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి తన పేరున, తన తమ్ముడు పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని పత్రాలు సృష్టించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు 10 సెంట్ల రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుని జేసీబీలతో భారీ స్థాయిలో మట్టిని తవ్వి పొలాలకు తరలించి రోడ్డు ఆనవాళ్లు లేకుండా ఇసుకతో నింపారు. అనంతరం ఆ స్థలానికి చుట్టూ కంచె వేశారు. దానితో సుమారు 12 కుటుంబాల వారికి రాకపోకలకు మార్గం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆ చర్యను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా స్థానికులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఆ రోడ్డును ఆనుకుని నివసిస్తున్న వేగేశ్న చంద్రావతి అనే మహిళ తన అల్లుడు, తెలుగుదేశం నాయకుడు అయిన అల్లూరి ప్రసాదరాజు సహకారంతో హైకోర్టును ఆశ్రయించగా తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. ఇక్కడ గల ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న కంచెను తొలగించి రోడ్డును పునరుద్ధరించాలని గ్రామ కార్యదర్శికి గత నెల 5న కోర్టు ఆదేశించింది. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక మహిళలు రహదారిని పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం పెద్ద రామాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో స్థానిక టీడీపీ నేత ఆ మహిళలపై దౌర్జన్యానికి పాల్పడి పోలీసుల సాయంతో బెదిరించారు. నిరసన తెలియజేస్తున్న ప్రజలను వైఎస్సార్ సీపీ వర్గీయులుగా ముద్ర వేసి లబ్ధి పొందేందుకు యత్నించారు.
పోలీసుల తీరుపై ఆందోళన
న్యాయం కోసం రోడ్డెక్కిన తమపై పోలీసుల తీరు ఏకపక్షంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులకు ఫిర్యాదు చేసి స్థానికులపైకి ఉసిగొలిపారని, మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా చిత్రీకరించి నిరసనను అణిచివేయడానికి ప్రయత్నించారని, నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు వేసిన టెంట్‌ను సైతం తొలగించి వారిపై అక్రమ కేసులు పెడతామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఐ వివరణ
ఈ సమస్యపై రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్‌ను సాక్షి వివరణ కోరగా ఆత్రేయపురంలో రోడ్డు బ్లాక్ చేసి ఆందోళన చేస్తున్నారని వీఆర్‌ఓ ఇచ్చిన సమాచారం మేరకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి వెళ్లామన్నారు. వీఆర్‌ఓ ఫిర్యాదు, తన స్థలం ఫెన్సింగ్ తొలగించి ధ్వంసం చేశారని ముదునూరి వెంకట్రాజు అలియాస్ గబ్బర్‌సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
● ఎస్పీ రాహుల్ మీనా
● సైక్లోథాన్ 5కె రన్ ప్రారంభం
అమలాపురం టౌన్: నిత్యం కొన్ని కిలోమీటర్‌లైనా సైక్లింగ్ చేస్తే ఆరోగ్యకరమైన జీవన శైలి అలవడుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద సైక్లోథాన్ 5కె సైకిల్ ర్యాలీని ఆదివారం ఉదయం ఎస్పీ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో ఎంతో కొంత సమయం సైకిల్‌ను తొక్కి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని మెయిన్ రోడ్ల మీదుగా 216 జాతీయ రహదారిపై గడియారం స్తంభం సెంటర్, హైస్కూలు రోడ్డు, కాలేజీ రోడ్డు, ఎత్తు రోడ్డు, వై.జంక్షన్ వరకూ ఐదు కిలో మీటర్ల మేర సాగింది. ఆరోగ్య ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఐదు కిలో మీటర్ల మేర సైకిల్ తొక్కి నేను సైతం ఆరోగ్య పరిరక్షణలో ఉన్నానని ఎస్పీ మీనా తెలిపారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, జిల్లా ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్‌ఐలు బ్రహ్మానందం, కోటేశ్వరరావు తదితర అధికారులు, పోలీస్ సిబ్బంది స్వయంగా సైకిళ్లు తొక్కుతూ ముందుకు సాగారు.
కపిలేశ్వరపురం (మండపేట): పంచాయతీ, పోలీసు అధికారుల తీరును నిరసిస్తూ మండపేట మండలం కేశవరంలో ఆదివారం అయ్యప్ప మాలధారులు ధర్నాకు దిగారు. పీఠం సమీపంలో తాము ఏర్పాటు చేసుకున్న వంటశాలను తొలగించే ప్రయత్నం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో ఏటా పీఠం ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. ఆలయాన్ని ఆనుకుని సుమారు సెంటు స్థలంలో ఇటీవల స్వాములు రేకులతో వంటశాలను ఏర్పాటు చేసుకుని భిక్ష చేస్తున్నారు. దీనిపై పంచాయతీ అధికారి సుబ్బారావు అనుమతులు లేకుండా షెడ్డు నిర్మించడం సరికాదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన పోలీసు, పంచాయతీ సిబ్బంది శనివారం రాత్రి ఆ షెడ్డు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ చర్యను ప్రతిఘటించిన స్వాములు ఆదివారం ఉదయం ఘటనా స్థలం వద్ద ధర్నాకు దిగి నినాదాలు చేసి, వంటశాల వద్దనే భక్ష చేసి నిరసన తెలిపారు.
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం అత్యధికంగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. కార్తికమాసం ఆదివారం కావడంలో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. వారిలో ఏడు వారాల భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు చేశారు.
తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. నిత్య కార్యక్రమాల్లో భాగంగా అష్టోత్తర పూజలు, నిత్య కళ్యాణం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ.11,46,533 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఽ
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్
● పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
● రిజిస్ట్రేషన్‌కు 14 తుది గడువు
రాయవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వంతో పాటు, పలు ఎన్‌జీవో సంస్థలు ఏటా వివిధ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్(ఈఈఎంటీ) స్వచ్ఛంధ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లోని 7, 10 తరగతుల విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభా పరీక్షను నిర్వహించనుంది. 12 ఏళ్లుగా ఎటువంటి రుసుమూ లేకుండా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అక్టోబరు 30న షెడ్యూల్‌ను విడుదల చేశారు.
నచ్చిన చోటే పరీక్ష
ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను విద్యార్థి అభీష్టం మేరకు ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి అటెండ్ అయ్యే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను శ్రీకోడ్ తంత్రశ్రీ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబరు 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. 40 శాతం పైబడి మార్కులు పొందడంతో పాటుగా, ఆన్‌లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మెయిన్ పరీక్షకు అర్హత పొందుతారు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్‌లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్ ఫోన్/ల్యాప్‌టాప్/ట్యాబ్/కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని నిబంధనలకు లోబడి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష రాసే వారికి డిసెంబరు 20న మాక్ టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్:ఎడ్యుకేషనల్‌ఎపిఫనీ.ఓఆర్‌జీ–ఈఈఎంటీ2026/రిజిస్ట్రేషన్.పీహెచ్‌పీ లింక్ ద్వారా అభ్యుర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
రెండు మాధ్యమాల్లో పరీక్షలు
విద్యార్థులకు రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2025–26 సిలబస్‌ను అనుసరించి, డిసెంబరులో పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్‌పై 20 శాతం ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్షలు ఉంటాయి. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి) మేధా సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థి పేరు, పరీక్ష రాసే మొబైల్ నంబరు, విద్యార్థి/తల్లిదండ్రుల ఈ మెయిల్, విద్యార్థి పుట్టిన తేదీ, విద్యార్థి ఫొటో (2ఎంబీ కన్నా తక్కువ సైజు), తరగతి, జిల్లా, మండలం, పాఠశాల పేరు, హెచ్‌ఎంల పేరు, హెచ్‌ఎం ఈ మెయిల్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష నిర్వహణ ఇలా
గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. విద్యార్థుల తరగతి స్థాయి ఆధారంగా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 60 ప్రశ్నలు 100 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 60 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు 60 నిమిషాల నిడివితో నిర్వహిస్తారు. 1 తేలిక మార్కు ప్రశ్నలకు ఒకటి, మధ్యస్థ రకం ప్రశ్నలకు 2, కఠినతరం ప్రశ్నలకు మూడు మార్కుల వంతున కేటాయిస్తారు.
బహుమతులు ఇచ్చేదిలా
ఈ పోటీల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈఈఎంటీ–2025 పరీక్షకు సంబంధించి మరింత సమాచారారం తెలుసుకునే వారు, సందేహాల నివృత్తికి 9951002400 నంబరుకు ఫోన్ చేయవచ్చని పూర్వపు స్టేట్ కోఆర్డినేటర్ దూదేకుల నబి తెలియజేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈఈఎంటీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అధిక శాతం హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఈఈఎంటీ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తవనం వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ద్వారా పూర్తిగా ఉచితంగా పోటీలు నిర్వహిస్తున్నాం.
– దూదేకుల నబి, ఈఈఎంటీ,
పూర్వపు రాష్ట్ర సమన్వయ కర్త
● బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు
● అప్పులపాలై అడ్డదారిలో వెళ్లి దురాగతం
● ఆత్మహత్యను హత్య కేసుగా నమోదు
● చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
రామచంద్రపురం: అత్యాసకు పోయి, దొంగతనం చేస్తూ అన్నెం పున్నెం ఎరుగని బాలికను హత్య చేసి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నంలో చివరకు హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. రామచంద్రపురం పట్టణంలో ఈ నెల 4న జరిగిన బాలిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు విస్మయం కలిగించాయి. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారానికి చెందిన పెయ్యల వీరవెంకట శ్రీనివాస్, అలియాస్ శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఒక యూట్యూబ్ చానల్‌కు రిపోర్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పట్టణంలోని త్యాగరాజు నగర్‌లో ఒక ఇంట్లో చిర్రా సునీత తన కూతురుతో కలిసి అద్దెకు ఉంటున్నారు. వీరి కుటుంబంతో శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే శ్రీనివాస్ బ్యాంకు అప్పులు, చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు వంటి వాటితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఈనెల 4వ తేదీన సునీత ఇంటికి వెళ్లాడు. అప్పటికే సునీత కుమార్తె (10) ఇంట్లో ఉంది. బంగారం, సొమ్ము అపహరించేందుకు వచ్చిన శ్రీనివాస్ ఇంట్లోకి రాగానే ఆ చిన్నారి ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. ఫ్యాన్ రిపేరు చేయటానికి వచ్చానని అబద్ధం చెప్పాడు. దీంతో ఫ్యాన్ బాగానే ఉంది కదా అమ్మకు ఫోన్ చేసి చెబుతాను అని ఫోన్ చేస్తుండగా తన బండారం ఎక్కడ తెలిసిపోతుందోనని ఇంట్లో మంచం మీద ఉన్న చున్నీని బాలిక మెడకు చుట్టి మంచంపైకి తోసి అమె ముఖాన్ని మంచంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలిక శవాన్ని చున్నీతో ఫ్యాన్‌కు ఉరితీయటం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తనకు ఉన్న అనుభవంతో తలుపులు లోపల గడియపెట్టి వెళ్లిపోయాడు. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సునీత తన కూతురు ఉరి వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఇంట్లోనే ఉంటూ తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించిన శ్రీనివాస్, ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు ఇస్తూ ఉండేవాడు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాలిక మృతిలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌పై పోలీసులకు అనుమానం వచ్చి అతని వేలిముద్రలు కూడా సేకరించారు. అయితే ఇంట్లో ఉన్న ఫ్యానుకు, తదితర చోట్ల ఉన్న వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎస్.నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయటంతో శ్రీనివాస్ బాలికను హత్య చేసినట్లు నిర్థారించినట్టు ఎస్పీ వెల్లడించారు. అప్పుల పాలైన శ్రీనివాస్ దొంగతనం చేసే ప్రయత్నంలో బాలికను హతమార్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోను దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
గండేపల్లి: బతుకుతెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు సైతం విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓనర్ కం డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న సింహాద్రికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సందీప్‌కు తల్లి, తండ్రి, ఇద్దరు అక్కలు ఉండగా మరో అక్కకు వివాహం కావాల్సి ఉందన్నారు.
సీతానగరానికి కోతలకు వెళ్తుండగా..
కలవచర్లలో శనివారం వరికోత ముగించుకున్న సింహాద్రి, సందీప్‌లు ఆదివారం సీతానగరం వెళ్లాల్సి ఉండగా ఇక్కడకు వచ్చి ఇలా మృతి చెందారని వరికోత యంత్రాన్ని పురమాయించిన వ్యక్తి పేర్కొన్నాడు. చాలా కాలంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎసై యు.వి.శివ నాగబాబు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెడ్.రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్‌శాఖ ఏఈ సంఘటన వద్ద ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయించారు.
గమనించి ఉంటే ప్రమాదం తప్పేది
సింహాద్రి వెళ్తున్న మార్గంలో కొద్ది నిమిషాల ముందు మరో వాహనం వరికోత యంత్రాన్ని తీసుకువెళ్లిందని ఆ వాహన డ్రైవర్ సమాచారం అందజేసేంతలో ఇలా జరిగిపోయిందని స్తానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామస్తులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు అందజేసే యత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకపోయిందన్నారు.
వరికోత యంత్రానికి
విద్యుత్ తీగలు తగిలి ఘటన
యజమానితో సహా సహాయకుడూ
క్షణాల్లో మృతి
మృతులిద్దరూ ‘పశ్చిమ’ వాసులే
అమలాపురం టౌన్: శెట్టిబలిజ సామాజక వర్గీయులంతా అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని, అందరూ చదువుకుని అక్షరాస్యత శాతాన్ని పెంచినప్పుడే సామాజిక అభివృద్ధి సాకారమవుతుందని రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ఽఆధ్వర్యంలో అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి బోస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో అక్షరాస్యత ప్రస్తుతం 67 శాతం మాత్రమే ఉందని, ఇది మరింత పెరిగినప్పుడే మనం అన్నింటా అభివృద్ధి చెందుతారని ఆయన ఆక్షాంక్షించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి తదితర ప్రముఖలు హాజరై ప్రసంగించారు. అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, అమలాపురం, అల్లవరం, అంబాజీపేట ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ప్రతినిధులు దొమ్మేటి మీరా సాహెబ్ శెట్టి, సంసాని బులినాని, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి బాబు, వాసంశెట్టి తాతాజీ, గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, గుత్తుల చిరంజీవిరావు, కుడుపూడి సత్య శైలజ, విత్తనాల శేఖర్, కుడుపూడి భరత్ భూషణ్, విత్తనాల మూర్తి, కముజు రమణ, దొమ్మేటి రాము, కేతా భాను, దంగేటి రుద్ర, వాసర్ల వెంకన్న, దొంగ నాగ సుధారాణి, చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు కార్తిక వన సమారాధనలో సేవలు అందించారు. కోనసీమ వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గీయులు దాదాపు 15 వేల మంది కుటుంబ సమేతంగా హజరై వేడుకల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. తొలుత శెట్టిబలిజ నేతలు ఉసిరి చెట్టు వద్ద కార్తిక వన పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం అంతా సహ పంక్తి భోజనాలు చేసి ఆత్మీయతను చాటారు.
విద్యావంతులై ప్రయోజకులు కావాలి కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధనలో ఎంపీ బోస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న
ఎమ్మెల్సీ శ్రీనివాస్, మాజీ మంత్రి వేణు
● రూ.15 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: స్థలం కొనుగోలు కోసం అప్పు చేసి మరి కొద్ది సమయంలో ఆ మొత్తాన్ని అందజేస్తామనుకుంటే కళ్ల ఎదుటే రూ.7 లక్షలు కాలిపోయాయని బాధితులు బావురుమన్నారు. కె.పెదపూడి తిరుమనాథంవారిపాలెం శివారులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం కాగా నాలుగు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, ఈతకోట సుబ్బారావు, ఈతకోట శ్రీనివాసరావు, ఈతకోట ఈశ్వరరావు, ఈతకోట మంగాయమ్మలకు చెందిన రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత సుబ్బారావు, శ్రీనివాసరావులు నివాసమున్న ఇంటికి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఈశ్వరరావు, మంగాయమ్మల ఇంటికి వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటిలో ఉన్న సిలిండర్ పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో స్థలం కొనుగోలు కోసం ఇంటిలో దాచుకున్న సుబ్బారావుకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 12 గ్రాముల బంగారం, అతని కుమారుల స్టడీ సర్టిఫికెట్లు, శ్రీనివాసరావుకు చెందిన రూ.2.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విదార్హత సర్టిఫికెట్లు, మంగాయమ్మకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈశ్వరరావుకు చెందిన రూ.2,7 లక్షల నగదు, 14 గ్రాముల బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, గృహోపకరణాలు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అమలాపురం అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనం లోపలకు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అంబాజీపేట భవాని సేవా సమితి ఆధ్వర్యంలో గురు భవానీలు దంగేటి సాయిబాబు, మల్లేశ్వరి దంపతులు, మట్టపర్తి ఏసు, మట్టపర్తి శ్రీనివాస్, పాటి శేఖర్, గుత్తుల పండు, పితాని శ్రీనులు బాధితులకు 50 కేజీల బియ్యం, చీరలను పంపిణీ చేశారు. సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం 10 కేజీల చొప్పున బియ్యం, కేజీ బంగాళదుంపలు, వంట నూనె, ఉల్లిపాయలను అంజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కె.ఏడుకొండలు, వీఆర్వో వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కాజులూరు: మహా భారత రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదికవి నన్నయ కాలాలకు అతీతుడైన మహాకవి అని, ఎన్ని వేల ఏళ్లైనా ఆయన రచనలు నిత్య నూతనమైనవని చీరాల అజోవిభో ఫౌండేషన్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ అబిప్రాయపడ్డారు. పల్లిపాలెంలోని కామరాజు సాంస్కృతిక ప్రాంగణంలో గల మధుశ్రీ హాల్‌లో ఆదివారం ఉదయం ఆంధ్రీ కుటీరం నిర్వాహకుడు, ప్రముఖ కవి మధునాపంతుల సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ జయంతి సభ నిర్వహించారు. అనంతరం జరిగిన కళా ప్రపూర్ణ, ఆంధ్ర పురాణకర్త మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 33వ వర్ధంతి సభలో ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రీ కుటీరానికి అంకితం చేసిన తెలుగదేలయన్న గ్రంథాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖ రచయితలు, కవులను ఆంధ్రీకుటీరం నిర్వాహకులు జ్ఞాపికలు ఇచ్చి సాలువాలతో ఘనంగా సత్కరించారు.
శతాధిక వృద్ధుడి మృతి
కరప: మండలం కూరాడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధ పాస్టర్ మోర్త అండ్రేయ (104) ఆదివారం మృతి చెందారు. ఆండ్రేయ సొంత గ్రామం రామచంద్రపురం సమీపంలోని నరసాపురపేట. ఆ గ్రామం నుంచి 1975లో కరప మండలం కూరాడ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజుల ముందు వరకు ఆయన సువార్త చెప్పేవారు. ఇంతవరకు ఆయన తన పనులు తానే చేసుకునేవారని, వయసురీత్యా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పరలోకగతులయ్యారని బంధువులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రేయ మృతికి మండల అంబేడ్కర్ యువజనసేవా సంఘం ప్రతినిధి చిన్నం వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు.
కపిలేశ్వరపురం (మండపేట): అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ కథనం ప్రకారం బన్ను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని పర్యాటక కేంద్రం ధనమ్మమర్రికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో బన్ను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అబ్బులు ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అబ్బులుకు బన్ను పెద్ద కుమారుడు కాగా చిన్న కుమారుడు అభిషేక్ ఆరో తరగతి చదువుతున్నాడు.
పుల్లేటికుర్రులో విషాదఛాయలు
అంబాజీపేట: అప్పటివరకు స్నేహితులతో ఉల్లాసంగా గడిపిన బన్ను నీట మునిగి మృతి చెందడంతో చీకురుమెల్లివారిపేటలో విషాదం అలుముకుంది. బన్ను స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, అతని తండ్రి నామాడి అబ్రహం ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బన్ను మృతి వార్త తెలిసి గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్ వీరా రవి, ఎంపీటీసీలు కుసుమ వెంకటేష్, వడలి కృష్ణమూర్తి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
వివాహిత ఆత్మహత్య
కపిలేశ్వరపురం: భర్త వ్యవహార శైలితో మనస్తాపానికి గురై మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లికి చెందిన మట్టా రేఖ (24) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వి.కిశోర్ కథనం ప్రకారం రేఖకు అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన మట్టా వేణుతో వివాహమైంది. కొంతకాలం క్రితం రేఖ వేములపల్లిలోని తండ్రి నేదునూరి శ్రీను ఇంటికి ప్రసవానికి వచ్చింది. ఆ సమయంలో రేఖ, వేణుల మధ్య తరచుగా ఫోన్‌లో వాగ్వాదం జరిగేది. దీంతో మనస్తాపం చెందిన రేఖ ఆదివారం వేములపల్లిలోని కొబ్బరితోటలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిశోర్ తెలిపారు. రేఖకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 30,000
గటగట (వెయ్యి) 28,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 29,000
గటగట (వెయ్యి) 27,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,500
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250
కిలో 350
Khammam
● ఎస్సీ సంక్షేమశాఖలో 20 మంది భవితవ్యం ప్రశ్నార్థకం ● తొలగింపు ప్రచారంతో భయం.. భయం ● అదే జరిగితే ఎస్సీ హాస్టళ్లలో సిబ్బంది కొరతఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖలో నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో 20మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఐఎఫ్‌ఎంఐఎస్‌లో వివరాల నమోదు సందర్భంగా.. రాష్ట్ర అధికారులు కేటాయించిన పోస్టుల సంఖ్య తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లా అధికారుల అభ్యర్థన మేరకు పోస్టుల సంఖ్య పెంచకపోతే, ఈ సిబ్బందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదేజరిగితే వసతిగృహాల నిర్వహణపై తీవ్ర ప్రభా వం చూపనుంది.
ఉద్యోగ భద్రతపై నీలినీడలు
ప్రభుత్వం అన్నిశాఖల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖలో పనిచేస్తున్న మొత్తం 82 మంది నాలుగో తరగతి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివరాలను జిల్లా అధికారులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఊహించని విధంగా రాష్ట్ర అధికారులు జిల్లాకు కేవలం 62 పోస్టులను మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. దీంతో మిగిలిన 20 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది భవితవ్యం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని ఎస్సీ సంక్షేమశాఖలో వివిధ వసతిగృహాలు, కార్యాలయాల్లో మొత్తం 131 మంది నాలు గో తరగతి సిబ్బంది అవసరం ఉంది. ప్రస్తుతం రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కలిపినా ఆ సంఖ్య తక్కువగానే ఉంది. ఈ 82 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కలుపుకుని పనులను నెట్టుకొస్తున్నారు.
జిల్లా అధికారుల లేఖ
ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే ఎస్సీ వసతిగృహాల్లో సిబ్బంది కొరత తీవ్రమై నిర్వహణ సమస్యలు తలెత్తుతాయని జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. అనుమతులు, అవసరం మేర సిబ్బందిని నియమించుకున్నామని, వారితో నాలుగేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయించుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు వారిని తొలగిస్తే సిబ్బంది లేక వసతిగృహాల నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఆ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. జిల్లాకు కేటాయించిన పోస్టుల సంఖ్యను పెంచి, ప్రస్తుతం పనిచేస్తున్న 82మంది సిబ్బందిని విధుల్లో కొనసాగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో స్పష్టంగా కోరినట్లు సమాచారం. రాష్ట్ర అధికారులు ఈ లేఖపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో త్వరగా స్పందించి న్యాయం చేయాలని బాధిత సిబ్బంది వేడుకుంటున్నారు. దీనిపై ఎస్సీ సంక్షేమశాఖ అధికారులను వివరణ కోరగా.. 82 మంది సిబ్బందిని కొనసాగించాలని రాష్ట్ర అధికారులను కోరామని, 10 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారని, సిబ్బందికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర అధికారులు 62 మందిని మాత్రమే నియమించుకునేందుకు అనుమతులు ఉన్నాయని, ఆ ప్రకా రమే ఐఎఫ్‌ఎంఐఎస్‌లో వివరాలు నమోదు చేయా లని స్పష్టం చేయడంతో జిల్లా అధికారులు ఆందో ళనకు గురయ్యారు. నాలుగేళ్లకు పైగా కష్టపడి ఇదే శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని ఒక్కసారిగా తొలగిస్తే వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఉద్యోగాలు కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అధికారుల చర్యలతో సిబ్బంది భవితవ్యం అయోమయ స్థితిలో ఉంది.
అశ్వారావుపేటరూరల్: రిజర్వ్ ఫారెస్టులో రాత్రికి రాత్రే జేసీబీతో తవ్వకాలు చేసి విలువైన ఎర్రమట్టిను టిప్పర్లలో అక్రమంగా తరలించారు. కొంతమంది అటవీ శాఖ ఉద్యోగుల సహకారంతోనే మట్టి తవ్వకాలు యఽథేచ్ఛగా జరగ్గా, దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్‌లోని అశ్వారావుపేట సెక్షన్ పాపిడిగూడెం బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబరు 292(పాపిడిగూడెం మార్గం)లో ‘కంపా’పథకం కింద అటవీశాఖ వివిధ రకాల మారుజాత మొక్కలను 25 హెక్టర్లలో పెంచుతున్నారు. ఈ ప్లాంటేషన్ ప్రధాన రహదారికి పక్కనే ఉండగా.. రహదారి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల లోపల అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు నీటి కుంటను ఏర్పాటు చేశారు. కాగా, ఈ నీటి కుంటే తాజాగా ఎర్రమట్టి దందాకు కేంద్రంగా మారింది.
అటవీ అధికారుల అండతో..
దట్టమైన రిజర్వ్ ఫారెస్టులో ఉన్న ఈ నీటికుంటలో గురు, శుక్రవారం రాత్రుల్లో అశ్వారావుపేట రహదారి విస్తరణ పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేసి ఎర్రమట్టిని తరలించారు. నాలుగు టిప్పర్ల సాయంతో రాత్రంతా తరలించారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు టిప్పర్లతో తరలించి ఎర్రమట్టి విలువ మార్కెట్ ధర ప్రకారం చేస్తే లక్షలాది రూపాయలు ఉంటుందని, ఈ అక్రమ మట్టి రవాణా అంతా కొంతమంది అటవీ ఉద్యోగుల సహకారం లేకుండా సాధ్యం కాదని స్థానికులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో సామాన్యులు వంట చెరుకు, అవసరాలకు చిన్నపాటి చెట్టును నరికితే కేసులు, జరిమానాలు విధించే అటవీ అధికారులకు రెండు రోజులపాటు రిజర్వ్ ఫారెస్టులో జరిగిన ఈ మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా కనిపించలేదా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, రిజర్వ్ ఫారెస్టులో ఇష్టారాజ్యంగా సాగిన మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా వ్యవహారంపై కొంతమంది స్థానికులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిజర్వ్ ఫారెస్టులో ఎర్ర మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాకు ఎంతమేర నగదు చేతులు మారిందనే విషయాలు విచారణలోనే తెలాల్సి ఉంది. కాగా, ఈ దందాకు సహకరించిన ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
కప్పిపుచ్చుకునేందుకు యత్నం..
కాగా, ఎర్రమట్టి కోసం జేసీబీలతో రిజర్వ్ ఫారెస్టు మధ్యలో ఉన్న నీటి కుంటలో భారీగా తవ్వకాలకు పాల్పడిన అక్రమార్కులు వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. నీటికుంటలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు ఖాళీగా ఉంటే దందా వెలుగులోకి రాకుండా ఉండేందుకు, ఆయా ఖాళీ గుంతలు కనిపించకుండా కుంట ఎగువ భాగంలో నిల్వ ఉన్న నీళ్లను కాలువ తీసి తాజాగా తవ్వకాలు చేసిన ఆయా గుంతల్లోకి వదిలారు. దీంతో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు నీళ్లతో నిండిపోయాయి. కాగా, ఈ అక్రమ మట్టి తవ్వకాల విషయం వెలుగులోకి వస్తే నీటి కుంటలో చేసిన తవ్వకాలు, గుంతలు కనిపించకుండా ఉండేలా అక్రమార్కులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక ఫారెస్టు రేంజర్ మురళిని వివరణ కోసం ‘సాక్షి’పలుమార్లు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
రిజర్వ్ ఫారెస్టులో
వెలుగుచూసిన మట్టి దందా
కొణిజర్ల: ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు ఉన్న జాతీయ రహదారిలో కొణిజర్ల మండలం తనికెళ్ల నుంచి శాంతినగర్ మీదుగా వైరా మండ లం తల్లాడ మండల కేంద్రం వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో అధికారులు రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించారు. కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడులో భారీ గుంతలను ఆదివారం తారు మిక్సర్‌తో పూడ్చారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహల నడుమ గడిపారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.25,270 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,050 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సైక్లింగ్ పోటీల్లో కొత్తగూడెం ఎఫ్‌డీఓకు ద్వితీయస్థానం
పాల్వంచరూరల్:అంతర్జాతీయస్థాయిలో హైద రాబాద్‌లో నిర్వహించిన హెచ్‌సీఎల్ సైక్లింగ్–2025 పోటీల్లో కొత్తగూడెం ఎఫ్‌డీఓకు ద్వితీ యస్థానం లభించింది. కాగా, ఈ పోటీల్లో దేశ నలుమూలలనుంచి సుమారు 14వేల మంది పోటీదారులు పాల్గొనగా.. ఖమ్మం సైక్లింగ్ క్లబ్(కేసీసీ) నుంచి 8 మందిలో ఒకడైన కొత్తగూడెం డివిజన్ ఎఫ్‌డీఓ యు.కోటేశ్వరరావు 48 కిలోమీటర్ల సైక్లింగ్ పందెంలో ద్వితీయస్థానం(40 ఏళ్ల విభాగం)లో నిలిచి రూ.15వేల నగదు బహుమతి అందుకున్నారు. ఈమేరకు ఖమ్మం సైక్లింగ్ క్లబ్ ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ప్రతిభ కనబర్చడంతో కోటేశ్వరరావును క్లబ్ మెంబర్స్ అధ్యక్షుడు మహేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శ్రీనివాస్‌లు అభినంధించారు.
ఖమ్మంస్పోర్ట్స్: వేంసూరు మండలం కుంచపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు 72మంది అయితే, అందులో 21 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు జి.శివ ఆదివారం వెల్లడించారు. ఇంకా రెండు క్రీడాంశాల్లో దాదాపు ఐదుగురు క్రీడాకారులు ఎంపిక కావొచ్చని ఆయన చెప్పారు. రాష్ట్రపోటీలకు ఎంపికై న వారిలో అండర్–14 కబడ్డీలో కె.భవాని, కె.వెంకటేశ్వర్లు(ఫుట్‌బాల్), హాకీలో వై.దీపిక, వై.దుర్గాంజలి, పి.సుస్మిత, రాధ, గోపిచంద్, నవదీప్, అరవింద్, అండర్–14 సాఫ్ట్‌బాల్‌లో కె.నగేశ్, బి.అవినాష్, పి.గోపిచంద్, ఎ. లక్ష్మీనారాయణ, గౌతశ్రీ, ఈ.యశ్వి త, బెస్‌బాల్‌లో భరత్‌జగదీశ్, కె.యశ్వంత్, మురళీకృష్ణ, ఈ.ధనుష్, ఈ.లోకేశ్, ఈ.గణేశ్ ఉన్నారు. విద్యా ర్థులను హెచ్‌ఎం లాల్‌మహ్మద్ అభినందించారు.
అండర్–14, 17 యోగా జట్ల ఎంపిక
జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎన్‌ఎస్ కెనాల్ పాఠశాలలో ఉమ్మడిి జిల్లాస్థాయి యోగా జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 17జట్లకు ఎంపికై న బాలబాలికల వివ రాలను ఆయన ప్రటించారు. అండర్–14 బాలుర జట్టులో ఎ.సాత్విక్, కె.కౌషిక్, పి.శివకుమార్, జి.తరుణ్, ఎ.భరత్‌కుమార్, వి.వంశీ, బాలి కల జట్టులో ఎస్.కె.ఖుర్షిదా, బి.కనకమహాలక్ష్మి, పి.వర్షిత, టి. నాపీసితార్, అండర్–17 బాలురజట్టులో ఎ.సాకేత్, జి.శ్రీరాం, ఎ.భవన్‌కుమార్, యు.పార్థు, ఎం.దీపక్, బి.రాంచరణ్, బాలికలజట్టులో ఎ.వైష్ణవి,ఎం. రమ్య, బి.సహస్ర, వై.ప్రణతి, జి.పావని, కె.స్ఫూర్తి, జశ్విత ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
● ప్రభుత్వ ఉపాధ్యాయుడి బైక్ యాత్ర ● ఇప్పటివరకు 500 ప్రాంతాల్లో ప్రదర్శనలునేలకొండపల్లి: డగ్ర్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘నో డ్రగ్స్.. సేఫ్ లైఫ్’పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బైక్ యాత్ర చేపట్టాడు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ ఫిబ్రవరి 16న సూర్యాపేటలో యాత్ర ప్రారంభించారు. సెలవు రోజుల్లో బైక్‌పై ఇప్పటివరకు సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన ఆదివారం నేలకొండపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన బాల్య మిత్రుడు డ్రగ్స్‌కు బాని సై కేన్సర్ వ్యాధితో మరణించాడని, మత్తు పదార్థాలతో నిత్యం పలు ప్రాంతాల్లో ప్రమాదాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండేందుకే తాను ఇప్పటివరకు 3 వేల కిలోమీటర్ల మేర బైక్ యాత్ర నిర్వహించి, 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చానని, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా నని వివరించారు. తన సెలవులను సొంత అవసరాలకు వినియోగించకుండా ఈ యాత్రకే ఉపయోగిస్తున్నానని చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాను చేస్తున్న ప్రచారాన్ని పలువురు హేళన చేస్తున్నారని, అయినా పట్టించుకోకుండా యువతలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
‘ఎస్టీ’ నుంచి లంబాడాలను తొలగించాల్సిందే..
ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంతవరకు జేఏసీ జెండా, ఎజెండా ఒకటేనన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చెంచు తెగల సహకారంతో ర్యాలీ, సభ నిర్వహిస్తామని, ఈ నెల 23న మహబూబాబాద్ జిల్లా గుంజేడులో, 30న ఇల్లెందులో, డిసెంబర్ 4న చిరుమళ్లలో సన్నాహక సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 9న ఆసిఫాబాద్‌లో జరిగే బహిరంగ సభకు రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ మాట్లాడారు. లంబాడాల కుట్రలను తిప్పికొడతామన్నారు. అనంతరం చలో అచ్చంపేట, బొగ్గుట్ట, చిరుమళ్ల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో పలు సంఘాల అధ్యక్షులు, నాయకులు కల్తీ వీరమల్లు, కొట్నాక విజయ్, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పూసం వెంకటలక్ష్మి, కురసం పద్మజ, బట్టు వెంకటేశ్వర్లు, కాట్రాజు శ్రీను, కుర్సం సీతారాములు, ముక్తి భాస్కరరావు, చిగుర్ల మల్లికార్జున్ పాల్గొన్నారు.
వేంసూరు: కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతిచెందాడు. ఏపీలోని ఏలూ రు జిల్లా జంక్షన్‌కు చెందిన బెజవాడ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో భద్రాచలం దైవ దర్శనానికి వచ్చాడు. శనివారం అర్ధరాత్రి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వేంసూరు మండలం లింగపాలెం రోడ్డు పక్కన కొంత దూరంలో నిలిపి ఉన్న ట్రాక్టర్ టక్క్రును డ్రైవింగ్ చేస్తున్న వెంకటేశ్వరరావు కుమారుడు అజయ్ నిద్ర మత్తులో ఢీకొట్టాడు. దీంతో బెడవాడ వెంకటేశ్వరరావు (60) అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ కవిత తెలిపారు.
ప్రమాదంలో ఏపీ వాసి మృతి
Kamareddy
సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతో వృథాగా వెళ్తున్న జలాలు
జిల్లాలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలు, వరదధాటికి చెరువులు, కుంటలతోపాటు రిజర్వాయర్లు, ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయి. వరద తాకిడికి మట్టికట్టలు కొట్టుకుపోయి, గండ్లు పడటంతో సాగు నీరు వృథా అవుతోంది.
శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు
నీటి పారుదల శాఖ అధికారులు జిల్లాలోని పోచారం ప్రాజెక్టు రూ.5 కోట్లు, సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ సిమెంట్ లైనింగ్‌కు రూ. 1.85 కోట్లు, కళ్యాణి ప్రాజెక్టు రూ. కోటి, మిగితా చెరువులు, కుంటలు, పంట కాలువల శాశ్వత పనుల కోసం రూ. 42.01 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు.
తాత్కాలిక మరమ్మతులకూ
నోచుకోని సింగితం, కళ్యాణి
నిజాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న సింగి తం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ గతేడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఇసుక బస్తాలను అడ్డుగా వేసి మొరం, మట్టితో అడ్డుకట్ట వేశారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలు, వరదకు ఇసుక బస్తాలు, మట్టికట్ట కొట్టుకుపోవడంతో సింగితం రిజర్వాయర్ నీరు వృథాగా పోతోంది. కళ్యాణి ప్రాజెక్టు మరమ్మతులకు రూ.16 లక్షలు మంజూరయ్యాయి. ఆగస్టు 28న వరద పో టెత్తడంతో ప్రాజెక్టుకు రెండు వైపులా ఉన్న మట్టికట్ట తెగిపోయింది. దీంతో కళ్యాణి ప్రాజెక్టు ఖాళీ అయ్యింది.
పాత చెరువు కింద పంట కాలువ కొట్టుకుపోవడంతో యాసంగి పంటకు నీళ్లు రాకుండా పోయాయి. పంట కాలువ కొట్టుకపోయి గండిపడటంతో అలుగు, తూము నీళ్లు వాగులోకి పోతున్నాయి. పంట కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలి. ఆయకట్టు కింద పంటల సాగుకు సార్లు సహకరించాలి.
– శిరిగిరి గంగారాం, గ్రామస్తుడు, నర్వ
సింగితం రిజర్వాయర్ గోడ కొట్టుకుపోవడంతో నీళ్లు ఎళ్లిపోతున్నాయ్. ఇసుక బస్తాలు, మట్టి, మొరం పోసినా వరద పాలయ్యాయి. గోడ కూలడంతో నీళ్లు వాగు పాలవుతున్నాయి. యాసంగి పంటల సాగుకు నీళ్లు లేకుండా పోతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేపట్టాలి.
– మల్లేశ్ యాదవ్, ఆయకట్టు రైతు, నర్వ
వర్షాలు, వరదలతో దెబ్బతిన్న 184 చెరువులు, కుంటల తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా, 88 చెరువులు, కుంటలు, పంట కాలువలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రూ. 1.18 కోట్లు మంజూరు చేశారు. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు ఇటీవల తాత్కాలిక పనులకు అనుమతించారు. ఇప్పటి వరకు 28 చెరువులు, కుంటలు, పంట కాలువలకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. 6 చోట్ల పనులు పురోగతిలో ఉండగా, 54 చెరువులు, కుంట కట్టల మరమ్మతు పనులు ఇంకా మొదలుకాలేదు.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రికార్డుల స్థాయిలో కురిసిన వర్షాలకు జిల్లాలోని 241 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, పంట కాలువలకు గండ్లుపడ్డాయి. సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతోపాటు కళ్యాణి ప్రాజెక్టుకు రెండువైపులా మట్టి కట్టలు తెగిపోయాయి. వరద ప్రవాహానికి పోచారం ప్రాజెక్టు అలుగు వద్ద మట్టికొట్టుకుపోయి గోతిపడింది. పోచారం ప్రధాన కాలువకూ అక్కడక్కడ గండ్లుపడ్డాయి. అంతేకాకుండా సాగు నీరందించే పంట కాలువలు కొట్టుకుపోవడం, తూములు దెబ్బతినడంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితులు నెలకొన్నాయి.
కొట్టుకుపోయిన చెరువు కట్టలు, గండ్లు పడిన కాలువలు ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు 241 చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరద ప్రవాహానికి దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. – నిజాంసాగర్(జుక్కల్)
వర్షాలకు దెబ్బతిన్న
241 చెరువులు, రిజర్వాయర్లు
సాగునీటి వనరులపై
ప్రభుత్వం చిన్నచూపు
తాత్కాలిక మరమ్మతులకు
నోచుకోని వైనం
ఆందోళన చెందుతున్న
ఆయకట్టు రైతులు
● ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్
● కామారెడ్డిలో శతాబ్ది పథ సంచలన్
కామారెడ్డి అర్బన్: ప్రతి హిందువు జాగృతం కావాలని, జీవన విధానం స్వదేశం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ సహప్రాంత ప్ర చారక్ కల్పగురి ప్రభుకుమార్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కా మారెడ్డి పట్టణంలో నిర్వహించిన పథ సంచలన్ కా ర్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. స్వదేశీ, కుటుంబం, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు.
మారుమోగిన దేశభక్తి నినాదాలు
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది పథ సంచలన్ దేశభక్తి నినాదాల తో మారుమోగింది. పట్టణంలోని బస్తీల వారీగా మ ధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సరస్వతి విద్యా మందిర్ మైదానానికి సాయంత్రానికి చేరుకున్నారు. దేవునిపల్లి జడ్పీహైస్కూల్ నుంచి దత్తబస్తీ, కల్కినగర్, విద్యానగర్, దేవునిపల్లి, లింగాపూర్, హౌసింగ్ బోర్డు కాలనీ సేవకులు పథసంచలన్‌లో పాల్గొన్నారు. అశోక్‌నగర్ వాసవీ హైసూల్ మైదానం నుంచి అశోక్‌నగర్, కాకతీయ, శ్రీనివాస బస్తీలు, టేక్రియాల్, శ్రీరాం బస్తీలు పాల్గొనగా, వీక్లీమార్కెట్ నుంచి భైరవ, పంచముఖి, ఇంద్రానగర్, గాంధీగంజ్, అంబేద్కర్, ఈశ్వరపుర బస్తీలకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు సరస్వతి విద్యామందిర్ మైదానానికి చేరుకున్నారు. విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకటరావు, జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, జిల్లా సహ సంఘచాలక్ కొమిరెడ్డి స్వామి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు పాల్గొన్నారు.
● తరుగు పేరిట దోచుకుంటున్న రైస్‌మిల్లర్లు
● నష్టపోతున్న అన్నదాతలు
బాన్సువాడ రూరల్: అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చిన దశలో అకాల వర్షాలు ఆగం చేశాయి. చైన్‌మిషన్లతో వరి కోయడంతో ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ధాన్యం కాంటా పూర్తయ్యిందని ఊపిరిపీల్చుకునేలోపే తరుగు పేరిట కోతలు పెడుతూ రైస్‌మిల్లర్లు రైతులకు పిడుగులాంటి వర్తమానాలు పంపుతున్నారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు మనోవేదనకు గురువుతున్నారు.
అదనంగా కోత!
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కాంటా సమయంలో 40 కేజీల బస్తాకు బదులు కేజీన్నర అధికంగా 41.500 కి.గ్రా తూకం వేస్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ అధికంగా ఉందని, సంచి బరువు తక్కువ వచ్చిందని, రంగు మారిందని తదితర సాకులు చెబుతూ కొర్రీలు పెడుతున్నారు. ఇలా ఒక్కో బస్తాకు 500 గ్రాముల నుంచి 1 కేజీ వరకు తరుగు తీస్తున్నారు.
ఇటీవల నాగారం గ్రామంలో జరిగిన అధికారిక బహిరంగ సభలో ఓ రైతు బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రముఖ రైస్‌మిల్లు యజమాని తరుగు పేరిట దగా చేశాడని అధికారులు, ప్రజాప్రతినిధుల ముందే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తరుగు పేరిట జరుగుతు న్న దోపిడీని అరికట్టాలి. అధికారుల పర్యవేక్షణ లేకనష్టపో వాల్సి వస్తోంది. సెంటర్ నిర్వాహకులు తేమ శాతం చూశాకే కాంటా చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. – చాకలి శ్రీనివాస్, ఇబ్రాహింపేట్
మా గ్రామంలోని ముగ్గు రు రైతులకు చెందిన 700 బ స్తాల ధాన్యాన్ని మిల్లుకు పంపించాం. మాకు సమాచారం ఇవ్వకుండానే బస్తాకు 600 గ్రాముల చొప్పున తరుగు కట్ చేశారు. తీవ్రంగా నష్టపోయాం.
– ఖాదర్, రైతు, ఇబ్రాహింపేట్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆయన వారం రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. లండన్ పర్యటనను ముగించుకుని వచ్చిన సంగ్వాన్.. సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆయన ప్రజావాణిలో పాల్గొంటారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి
మాచారెడ్డి: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా రైతు వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయసలహా సదస్సుకు ఆమె హాజరై ప్రసంగించారు. పౌరులందరికీ సమాన న్యా యం అందించేందుకు లీగల్ ఎయిడ్ క్యాంపులు, లోకల్ అదాలత్‌లు చట్టాలపై అవగాహన కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో కా మారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, ఐసీఎఫ్‌ఏఐ న్యాయ కళాశాల ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.
● రెండ్రోజులపాటు నిలిపివేత
నిజాంసాగర్(జుక్కల్): సింగూరు ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ పంపుహౌస్‌ల మరమ్మతు నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్‌గ్రిడ్ పంపుల మరమ్మతుల కారణంగా 740 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారులు బోరుమోటార్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈఈ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
మోపాల్: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీసీ గురుకులాల డిప్యూటీ సెక్రెటరీ తిరుపతి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్ శివారులో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో అండర్–14, 19 ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం మెరుగుపడుతోందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మురళి, శంకర్ పాల్గొన్నారు.
● మద్యం వ్యాపారుల బేరసారాలు
● రూ.లక్షలు పలుకుతున్న
మద్యం దుకాణాలు
బాన్సువాడ : లక్కీడ్రాలో దుకాణాలు దక్కని లిక్కర్ వ్యాపారులు మరో ప్రయత్నానికి తెరలేపారు. నూతనంగా వైన్ షాపులను దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్‌విల్ ఇస్తామని, దుకాణాలను అప్పగించాలని బేరాలు చేస్తున్నారు. దుకాణాల విక్రయాల మేరకు రూ.80 లక్షల వరకు ఇచ్చేందుకు వ్యాపారులు సిద్ధపడుతున్నారు.
బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని బాన్సువాడ పట్టణంలో 5, బీర్కూర్–1, నస్రుల్లాబాద్–2 నిజాంసాగర్–1 మద్యం దుకాణాలకు 239 దరఖాస్తులు రాగా లక్కీ డ్రా ప్రక్రియ ముగిసింది. అయితే, లక్కీ డ్రాలో కొత్తవారికి 5 మద్యం దుకాణాలు వచ్చాయి. దీంతో మద్యం వ్యాపారులకు నిరాశకు గురయ్యారు. డిమాండ్ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు రాయబేరాలు మొదలుపెట్టారు. రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇచ్చి వైన్సులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 140 దరఖాస్తులు వేసిన ఓ సిండికేట్‌కు నామమాత్రంగా 9 దుకాణాలే రావడంతో మరింత పెట్టుబడి పెట్టి మరో నాలుగైదు వైన్స్‌లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ పట్టణంలోని ఓ మద్యం దుకాణం కొత్త వారికి వచ్చింది. దీంతో ఆ వైన్స్‌కు లిక్కర్ వ్యాపారులు రూ.60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు గుడ్‌విల్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే, సదరు లక్కీడ్రా అదృష్టవంతుడు ఎవరు ఎక్కువ గుడ్‌విల్ ఇస్తే వారికే మద్యం దుకాణం అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో లక్కీడ్రాలో ఎక్కువగా కొత్తవారికే వైన్స్‌లు వచ్చాయి. పాత వారికి తక్కువగా దుకాణాలు వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి.
– దిలీప్, ఎకై ్సజ్ సీఐ బాన్సువాడ
● 15న కామారెడ్డిలో బీసీ ఆక్రోశసభ
● పార్టీలకతీతంగా బీసీలు తరలిరావాలి
● బీసీ రిజర్వేషన్ల సాధన సమితి
గౌరవ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
కామారెడ్డి అర్బన్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రి జర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని, బీసీలంతా ఏకమై ఉద్యమించాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి గౌరవ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కామారెడ్డి బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఈశ్వ రయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీ రిజరేషన్ల కోసం తాను ఇచ్చిన తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్ల ముసాయిదాను పక్కన పెట్టి సొంత ఆలోచనతో ముందుకు వెళ్లి రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేదని రుజువు చేసిందని ఆరోపించారు. ఏం చేసినా సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లను అంగీకరించదని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. 1990లో తమిళనాడు పాటించిన విధానంతో పార్లమెంట్ ఆ మోదం ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు తీసుకురావడమే ఏకై క మార్గం కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తప్పు డు విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో బీఆర్‌ఎస్ తొలి నుంచి వ్యతిరేకంగానే ఉందని, బీజేపీ బీసీల పార్టీకాదన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతున్నందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 15న కామారెడ్డి సత్యగార్డెన్‌లో నిర్వహించే బీసీ ఆక్రోశసభను విజయవంతం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బీసీలకు మద్దతు ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ ప్రజా, బహుజన సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి బీసీ ఆక్రోశ సభతో బీసీ ఉద్యమం జాతీయ ఉద్యమం అవుతుందన్నారు. బీసీ సాధన సమితి, వివిధ సంఘాల నా యకులు డాక్టర్ విజయభాస్కర్, గంగాధర్‌యాదవ్, క్యాతం సిద్ధిరాములు, మర్కంటి భూమన్న, విఠల్ ముదిరాజ్, బాలార్జున్‌గౌడ్, హరికిషన్‌గౌడ్, సునీల్‌గౌడ్, దేవరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
● వైభవంగా సంతతధారాభిషేకం
● ప్రారంభమైన కాలభైరవ స్వామి
జన్మదినోత్సవాలు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదినోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ అనంతరం72 గంటలపాటు నిరంతరంగా కొనసాగే సంతతధారాభిషేకాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, మనీష్ శర్మ, ఆలయ ఈవో ప్రభు గుప్తా ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం బద్దిపోచమ్మకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, సిబ్బందితోపాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.
నేడు లక్ష దీపార్చన
ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం లక్షదీపార్చనను సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నిజాంసాగర్(జుక్కల్): ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క బస్తాకు రూ. 2 చొప్పున చెల్లిస్తేనే మిల్లుకు తీసుకెళ్తామని ఖరాఖండీగా చెప్తున్నారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండలం ముగ్ధంపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను తరలించేందుకు ఓ లారీ చేరుకుంది. అయితే, ముందస్తుగా రూ. 800 చెలిస్తేనే బస్తాలను తీసుకువెళ్తానని లారీ డ్రైవర్ డిమాండ్ చేసినట్లు సొసైటీ డైరెక్టర్, కేంద్రం ఇన్‌చార్జి బషీర్ విలేకరులతో తెలిపారు. డబ్బులు ఇవ్వబోమని చెప్పడంతో సదరు డ్రైవర్ లారీని వెనక్కి తీసుకుపోయాడు. దీంతో కేంద్రంలో తూకం చేసిన ధాన్యం బస్తాలు అలాగే నిల్వ ఉన్నాయి.
గాలీపూర్ గ్రామంలోని ఐకేపీ కేంద్రానికి వచ్చే లారీ డ్రైవర్లు సైతం బస్తాకు రూపాయి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Orissa
పర్లాకిమిడి: జాతీయన్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గుసాని సమితి బాగుసల గ్రామంలో జిల్లా న్యాయ సేవాప్రాధికరణ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి బిమల్ రవుళో ప్రారంభించగా.. ఆర్‌సీడీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు, అసిస్టెంటు బ్లాక్ విద్యాశాఖ అధికారి సోమేశ్వర్‌ర్రావు, బీఎస్‌ఎస్‌వో సుభ్రత్ దాస్, అంగన్‌వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం బాగుసల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బిమల్ రవుళో పాల్గొని దివ్యాంగులకు వైట్ కేన్స్ అందజేశారు. ప్రజలకు లీగల్ ఎయిడ్ ద్వారా ఎటువంటి సహాకారం అందించగలమో బిమల్ రవులో వివరించారు.
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీనీ పతిని పలువురు పార్టీ ప్రముఖులు పరమర్శించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని అతని స్వగృహాన్ని సందర్శించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి భాహీనిపతి వెళ్లారు. అక్కడ వైద్య నిపుణులు పరీక్షించి అతని ఊపిరితిత్తులలో తీవ్ర సమస్య ఉందని గుర్తించారు. వెంటనే అత్యున్నత చికిత్స చేశారు. కొద్ది రోజులుగా భాహీని పతి కొరాపుట్‌లో ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కొరాపుట్ ఎంసీ సప్తగిరి ఉల్క, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రాం చంద్ర ఖడం, ఇతరు సీనియర్ నాయకులు ఉన్నారు. వీరంతా నువాపడా ఉప ఎన్నికల ప్రచారం ముగించరుకొని వస్తూ ఎమ్మెల్యేను పరామర్శించాు. నువాపడలో పార్టీ పరిస్థితిని ఎంఎల్‌ఎ బాహీని పతికి వివరించారు.
రాయగడ: జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆద్వర్యంలో న్యాయ సేవా సలహాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి సత్యనారాయణ షడంగి ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
పులి కాదు పిల్లి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా వాసులను వణికించినది పులి కాదని పిల్లి అని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా కొరాపుట్ జిల్లా సునాబెడా ప్రాంతంలో పులి తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే విషయం టీవీలలో ప్రసారం కావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలుచోట్ల సీసీ కెమెరాలు పెట్టి, అడుగులు పరిశీలించారు. చివరకు అది అడవి పిల్లిగా ధ్రువీకరించారు. ఆదివారం అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ప్రజలు భయపడవద్దన్నారు. ఆ జంతువు పులి కాదని అడవి పిల్లి అని తెలిపారు.
