‘ఉపాధి’ ఈకేవైసీ @ 84.39శాతం | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఈకేవైసీ @ 84.39శాతం

Nov 10 2025 7:36 AM | Updated on Nov 10 2025 7:36 AM

‘ఉపాధి’ ఈకేవైసీ @ 84.39శాతం

‘ఉపాధి’ ఈకేవైసీ @ 84.39శాతం

కొనసాగుతున్న కూలీల నమోదు ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తిచేసేలా కసరత్తు పనుల్లో అక్రమాలకు అడ్డుకట్టే లక్ష్యం

కూలీలు పూర్తయింది

కై లాస్‌నగర్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్రం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే పనులకు హాజరయ్యే కూలీలకే పైకం దక్కేలా ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 84.39 శాతం పూర్తి చేశారు. ఈ నెలాఖరులోపు వంద శాతం పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు.

పారదర్శకత పెంచేలా..

ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీలకు భరోసానిస్తోంది. అయితే కొంతమంది ఈ పథకాన్ని తప్పుదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జాబ్‌కార్డు తీసుకుని పనులకు రాకున్నా హాజరైనట్లుగా వేతనాలు పొందుతున్నారు. పలువురు ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు అక్రమార్కులకు వంతపాడుతున్నారు. వచ్చిన వేతనాలను చెరిసగం పంచుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పనులు జరగకపోగా ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అక్రమాలకు చెక్‌ పెట్టేలా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. తద్వారా పనులకు హాజరైన కూలీలలకు మాత్రమే అటెండెన్స్‌ పడుతుంది. పనుల్లో పూర్తి పారదర్శకత ఏర్పడనుంది.

మండలం మొత్తం ఈకేవైసీ

ఆదిలాబాద్‌రూరల్‌ 13972 11474

బజార్‌హత్నూర్‌ 12621 10390

బేల 7809 6382

భీంపూర్‌ 9215 7593

భోరజ్‌ 4544 3996

బోథ్‌ 9996 8697

గాదిగూడ 10202 8387

గుడిహత్నూర్‌ 14533 12170

ఇచ్చోడ 12477 10986

ఇంద్రవెల్లి 18951 16408

జైనథ్‌ 5694 4801

మావల 1687 1378

నార్నూర్‌ 15081 12364

నేరడిగొండ 13478 11753

సాత్నాల 5625 4602

సిరికొండ 9140 7839

సోనాల 5779 4849

తలమడుగు 8117 6988

తాంసి 5941 5081

ఉట్నూర్‌ 21107 17448

పనుల్లో పారదర్శకత ..

ప్రతి ఉపాధి హామీ కూలీకి ఈకేవైసీ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ పరిధిలోని కూలీల ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటివరకు 84శాతం పూర్తి చేశాం. నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఈ ప్రక్రియ ద్వారా ఉపాధి పనుల్లో పారదర్శకత పెరుగుతుంది. కూలీ చెల్లింపులు సులభతరం కానున్నాయి.

– రాథోడ్‌ రవీందర్‌, డీఆర్డీవో

జిల్లాలో ఉపాధి హామీ పథకం వివరాలు..

నమోదు చేసుకున్న కూలీలు : 2,05,969

ఆధార్‌ సీడింగ్‌ చేసింది : 2,05,697

ఇప్పటి వరకు ఈకేవైసీ చేసింది: 1,73,586

ఇంకా నమోదు చేయాల్సింది: 32,383

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement