కైలాస్‌నగర్: కవి అందెశ్రీ మృతికి జిల్లా అధికా రులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ప్రజావాణి అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులున్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో..
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా కవి అందెశ్రీ మరణం సాహిత్య, సాంస్కృతిక, ప్రజా ఉద్యమరంగాల కు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. ఆయన మృతిపై జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవా రం సంతాప సభ నిర్వహించారు. నాయకులు బండి దత్తాత్రి, లోకారి పోశెట్టి, ఆర్.మంజుల, జమున, శకుంతల తదితరులు పాల్గొన్నారు.


