సమస్యలకు పరిష్కారం చూపాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫి ర్యాదుల విభాగం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 32 మంది వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ సంబంధిత స్టేషన్ల సీఐ, ఎస్సైలతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాత్ కవిత, వామన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యం సులువే
పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. డిసెంబర్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని సంఘ భవనంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. పరీక్షల్లో రాణించేలా పలు సూచనలు అందించారు. ఇందులో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగేష్, డీఎస్పీ శర్మ, పీపీలు రమణారెడ్డి, రహీం, డిఫెన్స్ కౌన్సిల్ ప్రధాన జడ్జి గంగారాం, న్యాయవాదులు తదిత రులు పాల్గొన్నారు.


