అర్జీల వెల్లువ
‘ప్రజావాణి’కి 108 దరఖాస్తులు అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. తమ గోడు విన్నవించేందుకు బాధితులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ రాజర్షిషా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 108 అర్జీలు అందగా ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉపాధి కల్పన, భూభారతి వంటివి ఉన్నాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే..


