రాయగడ: స్థానిక గాయత్రీనగర్‌లోని సరస్వతీ శిశుమందిరం ప్రాంగణంలో సరస్వతి శిశు విద్యా ప్రజ్ఞాన్ ఆధ్వర్యంలో ఆదివారం గీతా పారాయణ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలని వివిధ పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు పోటీల్లొ పాల్గొన్నారు. పవిత్ర భగవద్గీత మంత్రాన్ని నాలుగు విభాలుగా పఠించారు. పోటీలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు కేవీ శర్మ, ప్రదీప్ కుమార్ పండ, గీతా ప్రవచకులు గంగాధర్ రథ్ , గంగా ప్రసాద్ బ్రహ్మ, నృసింహా నాథ్ పండ, అనంత వైష్ణవ శతపతి, రఘునాథ్ భొయ్ హాజరయ్యారు. ఆధ్యాత్మికతపై విద్యార్థులకు అవగాహన కలిగించే ఇటువంటి పోటీలు వారి మానసిక వికాసానికి తోడ్పడతాయని సత్యవాది పతి అన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Orissa
Suryapet
సూర్యాపేట జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కొనుగోళ్లలో వేగం పుంజుకోలేదు. ఇక ఆయా కేంద్రాల్లో 220 వరకు ప్యాడీ క్లీనర్లు పాతవి ఉండగా అవి ఏ మాత్రం పనిచేయడం లేదు. వాటి స్థానంలో ఇటీవల 100 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేశారు. ఒక్కో ప్యాడీ క్లీనర్‌కు రూ.40,000 చొప్పున వెచ్చించారు. రెండు లిఫ్టింగ్ కం ప్యాడీ క్లీనర్లను రూ.1.92 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. మరో రెండు ప్యాడీ డ్రయర్‌లను రూ.14 లక్షలతో కొనుగోలు చేశారు. ప్యాడీ క్లీనర్లు ఉన్నా చాలా చోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో రైతులే సొంతంగా విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం నిర్వాహకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. చాలా గ్రామాలో కొనుగోలు కేంద్రాలు దూర ప్రాంతంలో ఉండడంతో విద్యుత్ సదుపాయం లేక ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వాటిని మూలన పడేశారు. కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో.. మరికొన్ని చోట్ల విద్యుత్ సదుపాయం ఉన్నా నిర్వాహకులు ఇవ్వకపోవడంతో అవి రైతులుకు ఉపయోగపడడం లేదు. కొన్ని కేంద్రాల్లో నిర్వాహకులే ప్యాడీ క్లీనర్లతో పనేంటి? ఓ రెండు బస్తాలు తగ్గిస్తారు.. అంతేకదా.. అమ్ముకోండంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. మీ ధాన్యం తాలు ఉదంటూ మిల్లర్లు ఒకటీ రెండు బస్తాల వరకు కోత పెడుతున్నా గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తోంది.
ప్రభుత్వ సొమ్ము వృథా..
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు. కొన్ని చోట్ల రైతులు ప్యాడీ క్లీనర్లకు రైతులే విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో కొన్న యంత్రాలు రైతులకు ఉపయోగపడకపోగా, ప్రభుత్వ డబ్బు వృథా అవుతోంది. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తున్నామని చెబుతున్న అధికారులు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో అడ్డగోలు కోతలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో
మరో 107 యంత్రాలకు ఇండెంట్
ఈ వానాకాలం సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 356 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యంత్రాంగం ఇప్పటివరకు 250 కేంద్రాలను తెరిచి, కొనుగోళ్లు ప్రారంభించింది. ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి వంటివి లేకుండా, ధాన్యం తూర్పారా బట్టేందుకు ప్యాడీ క్లీనర్లను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలో 388 ప్యాడీక్లీనర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా 107 ఆటోమెటిక్ మిషన్ల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ప్రస్తుతం ఏర్పాటు చేసే కేంద్రాల కంటే ప్యాడీ క్లీనర్లు ఎక్కువగా ఉన్నా వాటిని రైతులకు ఉపయోగపడేలా చేయడంతో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరుపయోగంగా దర్శనం
ఫ కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేదు.. మరికొన్ని చోట్ల సిబ్బంది సహకరించడం లేదు
ఫ విద్యుత్ సౌకర్యం ఉన్నా.. బిల్లు ఎవరు చెల్లిస్తారంటున్న నిర్వాహకులు
ఫ ఒకటి రెండు బస్తాలు తరుగు తీస్తే ఏం కాదంటూ ఉచిత సలహా
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలు సరిపోవడం లేదని, పెరిగిన సరుకుల ధరల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంట ఏజేన్సీ మహిళలు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మెస్ చార్జీలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం లభించనుంది.
1435 ఏజెన్సీలకు లబ్ధి
జిల్లాలో 600 ప్రాథమిక, 76 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 858 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో చదివే పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టేందుకు మొత్తం 1435 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీ మహిళలు ప్రభుత్వం అందించే మెస్ బిల్లుల్లోనే బయటి నుంచి సరుకులు తీసుకు రావడంతో పాటు వంట చేసేందుకు అవసరమైన వంట సరుకు, తమ కూలి అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో విద్యార్థులకు వంటచేసి పెట్టడం తలకు మించిన భారంగా మారుతోందని వంట కార్మికులు వాపోతున్నారు. వంట చార్జీలు పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 74 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.1.12 పైసల చొప్పున వంట ధరలు పెంచింది. దాంతో వంట కార్మికులకు కొంత వరకు ఉపశమనం కలుగనుంది.
43,469 మంది విద్యార్థులకు భోజనం
జిల్లాలో ఉన్న 858 ప్రభుత్వ పాఠశాలల్లో 43,469 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి వంట ఏజెన్సీ వారు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దానికి తోడు వంట పాత్రలను కూడా సరఫరా చేసింది. మిగిలిన సరుకులను వంట ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేసి వంట చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును బట్టి ప్రభుత్వం ప్రతినెలా భోజన బిల్లులను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన మెస్ చార్జీల వల్ల అటు వంట ఏజెన్సీలకు ఇటు విద్యార్థులకూ ప్రయోజనం కలుగనుంది.
పెరిగిన వంట ధరలు
(ఒక్కో విద్యార్థికి రూపాయల్లో)
పాఠశాల పాత ధర కొత్త ధర
ప్రాథమిక 5.45 6.19
ప్రాథమికోన్నత 8.17 9.29
ఉన్నత పాఠశాల 10.67 11.79
ఫ మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు లబ్ధి
ఫ పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెంపు
ఫ విద్యార్థులకు అందనున్న నాణ్యమైన భోజనం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు
ప్రాథమిక పాఠశాలలు 600
ప్రాథమికోన్నత పాఠశాలలు 76
ఉన్నత పాఠశాలలు 182
మొత్తం విద్యార్థులు 43,469
వంట ఏజెన్సీలు 1435
సూర్యాపేట : ప్రయోగాలతోనే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించవచ్చని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్న పాఠశాలో సైన్స్ అకాడమీ బృందం ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 7 నుంచి 10వ తరగతి వరకు పాఠాలను సులభంగా బోధించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి 40 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కాగా వారికి పలు అవయవాల గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు ఎల్.దేవరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
సూర్యాపేట : ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.మోతీలాల్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భగ్గులాల్‌నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీజీయూఎస్ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లడారు. ప్రభుత్వం ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెలా విడుదల చేయాల్సిన రూ.700 కోట్లను కూడా సరైన సమయంలో విడుదల చేయడం లేదన్నారు. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు డి.వస్రాంనాయక్, నాయకులు రాములునాయక్, మోతీలాల్, లింగానాయక్, హనుమంత్, ఉప్పయ్య పాల్గొన్నారు.
దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం
సూర్యాపేట అర్బన్ : ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు, తీవ్ర అసమానతలు పెరిగి పోతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను శనివారం జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందని ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని, కార్పొరేట్ శక్తుల అభివృద్ధే దేశాభివృద్ధిగా చెబుతూ ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చండ్ర పుల్లారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని యువత పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, దేశోజు మధు, సామ నర్సిరెడ్డి, బొల్లె వెంకన్న పాల్గొన్నారు .
కోదాడ: మన ప్రాంతంలోని వివిధ పనులు నిర్వహిస్తున్న బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా వెళ్లడంతో వివిధ రంగాల్లో కూలీల కొరత ఏర్పడింది. రోడ్ల విస్తరణ, నిర్మాణ రంగంతో పాటు పార్‌బాయిల్డ్ మిల్లులు తీవ్ర కూలీల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆయా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు.
80శాతం మంది బిహారీలే
సాగర్ ఆయకట్టులో ఉన్న పార్‌బాయిల్డ్ మిల్లుల్లో హమాలీలుగా 80 శాతం మంది బిహార్‌కు చెందిన వారు ఉన్నారు. ధాన్యం లోడ్, అన్‌లోడ్ వంటి కష్టమైన పనులను మిల్లర్లు బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలతో చేయిస్తున్నారు. స్థానిక కూలీలకు ఇచ్చే కూలి రేట్లలో సగానికే వీరు పని చేస్తుండడంతో పాటు ఎక్కువ గంటలు అందుబాటులో ఉంటుండంతో వీరినే పనిలో పెట్టుకుంటున్నారు. ధాన్యం మిల్లులో అన్‌లోడ్ చేయడంతో పాటు నెట్‌కట్టడం వంటి పనులు కూడా వారే చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో వరి కోతలు ప్రారంభమవుతున్నాయి. వారం పది రోజుల్లో భారీ ఎత్తున ధాన్యం మిల్లులకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లడంతో ధాన్యం దిగమతిపై ప్రభావం పడే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు.
నిలిచిన ఫ్లై ఓవర్ల నిర్మాణం
65వ నంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటి నివారణకు అధికారులు బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. చిట్యాల నుంచి కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వరకు గుర్తించిన బ్లాక్‌స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనుల్లో కీలకంగా ఉన్న బిహార్ కూలీలు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దాంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను ఆపేశారు. వారు లేకుండా స్థానిక కూలీలతో పనులు చేయించలేమని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రైఓవర్ నిర్మాణంలో కీలకమైన రాడ్‌బెండింగ్‌తో పాటు భారీ యంత్రాలను నడపడం బిహార్ కూలీలు మాత్రమే చేస్తారని వారు చెబుతున్నారు.
నెల రోజులు ఇదే పరిస్థితి
బిహార్ రాష్ట్రంలో ఈ నెల 11తో ఎన్నికలు పూర్తి అవుతాయి. 14 వరకు ఫలితాలు వస్తాయి. ఐనప్పటికీ బిహార్‌కు వెళ్లిన కూలీలు రావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని జాతీయ రహదారుల విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అంటున్నారు. వలస కూలీలు సాధారణంగా స్వరాష్ట్రానికి వెళితే అంత త్వరగా వెనక్కి రారని చెబుతున్నారు. వారు వచ్చే వరకు ఇదే పరిస్ధితి ఉంటుందని, వారు వచ్చిన తరువాతే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. హమాలీలుగా పని చేసే వారిని ఆయా రాష్ట్రాలనుంచి త్వరగా వెనక్కి రప్పించడానికి ట్రైన్ టికెట్స్ కూడ బుక్ చేస్తున్నామని ఓ మిల్లర్ తెలిపారు.
ఫ ఎన్నికల కోసం స్వరాష్ట్రానికి
బిహార్ కూలీలు
ఫ రహదారి నిర్మాణ పనులపై
తీవ్ర ప్రభావం
ఫ పార్‌బాయిల్డ్ మిల్లుల్లో హమాలీల కొరత
ఫ మరో నెల రోజుల వరకు ఇదే పరిస్థితి
సూర్యాపేట : పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేయడంతో పాటు తాగునీటి సరఫరా పైపులకు ఉన్న లీకేజీలను సరి చేస్తున్నారు. ఈ నెల మూడవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగనుంది.
పలు కార్యక్రమాల నిర్వహణ
ప్రత్యేక వారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించడం, ట్రాక్టర్లతో దానిని డంపింగ్ యార్డుకు తరలించడం, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణను పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త, వ్యర్ధాలు, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. మురుగు కాల్వలు, పల్లె ప్రకృతి వనంలో స్వచ్ఛతా కార్యక్రమం, తాగునీటి పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. దాంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి.
నిధుల లేమితో ఇబ్బందులు
వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధుల లేమి సమస్యగా మారుతున్నది. పారిశుద్ధ్య మెరుగు పర్చే పనులను సిబ్బంది చేపడుతున్నా పైప్‌లైన్ల లీకేజీతో పాటు ఇతర పనులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వీలు లేకుండా పోతోంది. ప్రస్తుతం పాలవర్గం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే నిధులను సమకూర్చాల్సిన పరిస్థతి నెలకొంది. చాలాకాలంగా పంచాయతీల నిర్వహణకు కార్యదర్శులే చేతినుంచే డబ్బులు పెట్టాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఫ గ్రామాల్లో వారంరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
ఫ పారిశుద్ధ్యంతో పాటు నీటి పైప్‌లైన్ లీకేజీలపై ప్రత్యేక దృష్టి
ఫ పరిష్కారమవుతున్న సమస్యలు
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలక ముందడుగు అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సూర్యాపేటలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక తెలంగాణ– బీసీ రిజర్వేషన్లు– ప్రాతినిథ్యం ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించాల్సి ఉందన్నారు. బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై ముందడుగు వేయడం హర్షణీయమన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయసమీక్ష నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శాసనసభ చట్టం చేసి పంపితే తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదన్నారు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారబోయిన కిరణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నాయకులు కుంట్ల ధర్మార్జున్, నాగరాజుగౌడ్, నరసింహ, వీరేశ్‌నాయక్, వినయ్‌గౌడ్, నారాయణ, సుమన్‌నాయక్, మురళి పాల్గొన్నారు.
Kakinada
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్
● పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
● రిజిస్ట్రేషన్‌కు 14 తుది గడువు
రాయవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వంతో పాటు, పలు ఎన్‌జీవో సంస్థలు ఏటా వివిధ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్(ఈఈఎంటీ) స్వచ్ఛంధ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లోని 7, 10 తరగతుల విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభా పరీక్షను నిర్వహించనుంది. 12 ఏళ్లుగా ఎటువంటి రుసుమూ లేకుండా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అక్టోబరు 30న షెడ్యూల్‌ను విడుదల చేశారు.
నచ్చిన చోటే పరీక్ష
ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను విద్యార్థి అభీష్టం మేరకు ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి అటెండ్ అయ్యే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను శ్రీకోడ్ తంత్రశ్రీ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబరు 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. 40 శాతం పైబడి మార్కులు పొందడంతో పాటుగా, ఆన్‌లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మెయిన్ పరీక్షకు అర్హత పొందుతారు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్‌లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్ ఫోన్/ల్యాప్‌టాప్/ట్యాబ్/కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని నిబంధనలకు లోబడి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష రాసే వారికి డిసెంబరు 20న మాక్ టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్:ఎడ్యుకేషనల్‌ఎపిఫనీ.ఓఆర్‌జీ–ఈఈఎంటీ2026/రిజిస్ట్రేషన్.పీహెచ్‌పీ లింక్ ద్వారా అభ్యుర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
రెండు మాధ్యమాల్లో పరీక్షలు
విద్యార్థులకు రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2025–26 సిలబస్‌ను అనుసరించి, డిసెంబరులో పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్‌పై 20 శాతం ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్షలు ఉంటాయి. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి) మేధా సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థి పేరు, పరీక్ష రాసే మొబైల్ నంబరు, విద్యార్థి/తల్లిదండ్రుల ఈ మెయిల్, విద్యార్థి పుట్టిన తేదీ, విద్యార్థి ఫొటో (2ఎంబీ కన్నా తక్కువ సైజు), తరగతి, జిల్లా, మండలం, పాఠశాల పేరు, హెచ్‌ఎంల పేరు, హెచ్‌ఎం ఈ మెయిల్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష నిర్వహణ ఇలా
గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. విద్యార్థుల తరగతి స్థాయి ఆధారంగా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 60 ప్రశ్నలు 100 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 60 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు 60 నిమిషాల నిడివితో నిర్వహిస్తారు. 1 తేలిక మార్కు ప్రశ్నలకు ఒకటి, మధ్యస్థ రకం ప్రశ్నలకు 2, కఠినతరం ప్రశ్నలకు మూడు మార్కుల వంతున కేటాయిస్తారు.
బహుమతులు ఇచ్చేదిలా
ఈ పోటీల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈఈఎంటీ–2025 పరీక్షకు సంబంధించి మరింత సమాచారారం తెలుసుకునే వారు, సందేహాల నివృత్తికి 9951002400 నంబరుకు ఫోన్ చేయవచ్చని పూర్వపు స్టేట్ కోఆర్డినేటర్ దూదేకుల నబి తెలియజేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈఈఎంటీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అధిక శాతం హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఈఈఎంటీ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తవనం వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ద్వారా పూర్తిగా ఉచితంగా పోటీలు నిర్వహిస్తున్నాం.
– దూదేకుల నబి, ఈఈఎంటీ,
పూర్వపు రాష్ట్ర సమన్వయ కర్త
● బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు
● అప్పులపాలై అడ్డదారిలో వెళ్లి దురాగతం
● ఆత్మహత్యను హత్య కేసుగా నమోదు
● చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
రామచంద్రపురం: అత్యాసకు పోయి, దొంగతనం చేస్తూ అన్నెం పున్నెం ఎరుగని బాలికను హత్య చేసి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నంలో చివరకు హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. రామచంద్రపురం పట్టణంలో ఈ నెల 4న జరిగిన బాలిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు విస్మయం కలిగించాయి. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారానికి చెందిన పెయ్యల వీరవెంకట శ్రీనివాస్, అలియాస్ శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఒక యూట్యూబ్ చానల్‌కు రిపోర్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పట్టణంలోని త్యాగరాజు నగర్‌లో ఒక ఇంట్లో చిర్రా సునీత తన కూతురుతో కలిసి అద్దెకు ఉంటున్నారు. వీరి కుటుంబంతో శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే శ్రీనివాస్ బ్యాంకు అప్పులు, చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు వంటి వాటితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఈనెల 4వ తేదీన సునీత ఇంటికి వెళ్లాడు. అప్పటికే సునీత కుమార్తె (10) ఇంట్లో ఉంది. బంగారం, సొమ్ము అపహరించేందుకు వచ్చిన శ్రీనివాస్ ఇంట్లోకి రాగానే ఆ చిన్నారి ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. ఫ్యాన్ రిపేరు చేయటానికి వచ్చానని అబద్ధం చెప్పాడు. దీంతో ఫ్యాన్ బాగానే ఉంది కదా అమ్మకు ఫోన్ చేసి చెబుతాను అని ఫోన్ చేస్తుండగా తన బండారం ఎక్కడ తెలిసిపోతుందోనని ఇంట్లో మంచం మీద ఉన్న చున్నీని బాలిక మెడకు చుట్టి మంచంపైకి తోసి అమె ముఖాన్ని మంచంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలిక శవాన్ని చున్నీతో ఫ్యాన్‌కు ఉరితీయటం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తనకు ఉన్న అనుభవంతో తలుపులు లోపల గడియపెట్టి వెళ్లిపోయాడు. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సునీత తన కూతురు ఉరి వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఇంట్లోనే ఉంటూ తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించిన శ్రీనివాస్, ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు ఇస్తూ ఉండేవాడు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాలిక మృతిలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌పై పోలీసులకు అనుమానం వచ్చి అతని వేలిముద్రలు కూడా సేకరించారు. అయితే ఇంట్లో ఉన్న ఫ్యానుకు, తదితర చోట్ల ఉన్న వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎస్.నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయటంతో శ్రీనివాస్ బాలికను హత్య చేసినట్లు నిర్థారించినట్టు ఎస్పీ వెల్లడించారు. అప్పుల పాలైన శ్రీనివాస్ దొంగతనం చేసే ప్రయత్నంలో బాలికను హతమార్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోను దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
గండేపల్లి: బతుకుతెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు సైతం విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓనర్ కం డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న సింహాద్రికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సందీప్‌కు తల్లి, తండ్రి, ఇద్దరు అక్కలు ఉండగా మరో అక్కకు వివాహం కావాల్సి ఉందన్నారు.
సీతానగరానికి కోతలకు వెళ్తుండగా..
కలవచర్లలో శనివారం వరికోత ముగించుకున్న సింహాద్రి, సందీప్‌లు ఆదివారం సీతానగరం వెళ్లాల్సి ఉండగా ఇక్కడకు వచ్చి ఇలా మృతి చెందారని వరికోత యంత్రాన్ని పురమాయించిన వ్యక్తి పేర్కొన్నాడు. చాలా కాలంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎసై యు.వి.శివ నాగబాబు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెడ్.రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్‌శాఖ ఏఈ సంఘటన వద్ద ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయించారు.
గమనించి ఉంటే ప్రమాదం తప్పేది
సింహాద్రి వెళ్తున్న మార్గంలో కొద్ది నిమిషాల ముందు మరో వాహనం వరికోత యంత్రాన్ని తీసుకువెళ్లిందని ఆ వాహన డ్రైవర్ సమాచారం అందజేసేంతలో ఇలా జరిగిపోయిందని స్తానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామస్తులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు అందజేసే యత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకపోయిందన్నారు.
వరికోత యంత్రానికి
విద్యుత్ తీగలు తగిలి ఘటన
యజమానితో సహా సహాయకుడూ
క్షణాల్లో మృతి
మృతులిద్దరూ ‘పశ్చిమ’ వాసులే
అమలాపురం టౌన్: శెట్టిబలిజ సామాజక వర్గీయులంతా అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని, అందరూ చదువుకుని అక్షరాస్యత శాతాన్ని పెంచినప్పుడే సామాజిక అభివృద్ధి సాకారమవుతుందని రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ఽఆధ్వర్యంలో అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి బోస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో అక్షరాస్యత ప్రస్తుతం 67 శాతం మాత్రమే ఉందని, ఇది మరింత పెరిగినప్పుడే మనం అన్నింటా అభివృద్ధి చెందుతారని ఆయన ఆక్షాంక్షించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి తదితర ప్రముఖలు హాజరై ప్రసంగించారు. అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, అమలాపురం, అల్లవరం, అంబాజీపేట ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ప్రతినిధులు దొమ్మేటి మీరా సాహెబ్ శెట్టి, సంసాని బులినాని, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి బాబు, వాసంశెట్టి తాతాజీ, గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, గుత్తుల చిరంజీవిరావు, కుడుపూడి సత్య శైలజ, విత్తనాల శేఖర్, కుడుపూడి భరత్ భూషణ్, విత్తనాల మూర్తి, కముజు రమణ, దొమ్మేటి రాము, కేతా భాను, దంగేటి రుద్ర, వాసర్ల వెంకన్న, దొంగ నాగ సుధారాణి, చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు కార్తిక వన సమారాధనలో సేవలు అందించారు. కోనసీమ వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గీయులు దాదాపు 15 వేల మంది కుటుంబ సమేతంగా హజరై వేడుకల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. తొలుత శెట్టిబలిజ నేతలు ఉసిరి చెట్టు వద్ద కార్తిక వన పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం అంతా సహ పంక్తి భోజనాలు చేసి ఆత్మీయతను చాటారు.
విద్యావంతులై ప్రయోజకులు కావాలి కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధనలో ఎంపీ బోస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న
ఎమ్మెల్సీ శ్రీనివాస్, మాజీ మంత్రి వేణు
● రూ.15 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: స్థలం కొనుగోలు కోసం అప్పు చేసి మరి కొద్ది సమయంలో ఆ మొత్తాన్ని అందజేస్తామనుకుంటే కళ్ల ఎదుటే రూ.7 లక్షలు కాలిపోయాయని బాధితులు బావురుమన్నారు. కె.పెదపూడి తిరుమనాథంవారిపాలెం శివారులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం కాగా నాలుగు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, ఈతకోట సుబ్బారావు, ఈతకోట శ్రీనివాసరావు, ఈతకోట ఈశ్వరరావు, ఈతకోట మంగాయమ్మలకు చెందిన రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత సుబ్బారావు, శ్రీనివాసరావులు నివాసమున్న ఇంటికి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఈశ్వరరావు, మంగాయమ్మల ఇంటికి వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటిలో ఉన్న సిలిండర్ పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో స్థలం కొనుగోలు కోసం ఇంటిలో దాచుకున్న సుబ్బారావుకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 12 గ్రాముల బంగారం, అతని కుమారుల స్టడీ సర్టిఫికెట్లు, శ్రీనివాసరావుకు చెందిన రూ.2.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విదార్హత సర్టిఫికెట్లు, మంగాయమ్మకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈశ్వరరావుకు చెందిన రూ.2,7 లక్షల నగదు, 14 గ్రాముల బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, గృహోపకరణాలు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అమలాపురం అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనం లోపలకు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అంబాజీపేట భవాని సేవా సమితి ఆధ్వర్యంలో గురు భవానీలు దంగేటి సాయిబాబు, మల్లేశ్వరి దంపతులు, మట్టపర్తి ఏసు, మట్టపర్తి శ్రీనివాస్, పాటి శేఖర్, గుత్తుల పండు, పితాని శ్రీనులు బాధితులకు 50 కేజీల బియ్యం, చీరలను పంపిణీ చేశారు. సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం 10 కేజీల చొప్పున బియ్యం, కేజీ బంగాళదుంపలు, వంట నూనె, ఉల్లిపాయలను అంజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కె.ఏడుకొండలు, వీఆర్వో వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
తప్పిన పెనుముప్పు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం బంక్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంకుకు వచ్చిన వాహనం నుంచి ఒక వాల్వు తెరచి డీజిల్ అన్‌లోడ్ చేస్తుండగా అకస్మాత్తుగా స్పార్క్ వచ్చి నిప్పు అంటుకుంది. ఈ హఠాత్ పరిణామంతో పెట్రోలు కోసం వచ్చిన వినియోగదారులు, చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. ఇంతలో పక్కనే ఉన్న అగ్నిమాపక కార్యాలయం సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చి ఏ త్రిబుల్ ఎఫ్ ఫోమ్ (నురగ) ను చల్లి మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేలు ఆస్తినష్టం వాటిలినట్లు అగ్నిమాపకశాఖాధికారి పేరూరి శ్రీనివాస్ తెలిపారు.
శతాధిక వృద్ధుడి మృతి
కరప: మండలం కూరాడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధ పాస్టర్ మోర్త అండ్రేయ (104) ఆదివారం మృతి చెందారు. ఆండ్రేయ సొంత గ్రామం రామచంద్రపురం సమీపంలోని నరసాపురపేట. ఆ గ్రామం నుంచి 1975లో కరప మండలం కూరాడ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజుల ముందు వరకు ఆయన సువార్త చెప్పేవారు. ఇంతవరకు ఆయన తన పనులు తానే చేసుకునేవారని, వయసురీత్యా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పరలోకగతులయ్యారని బంధువులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రేయ మృతికి మండల అంబేడ్కర్ యువజనసేవా సంఘం ప్రతినిధి చిన్నం వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు.
కపిలేశ్వరపురం (మండపేట): అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ కథనం ప్రకారం బన్ను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని పర్యాటక కేంద్రం ధనమ్మమర్రికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో బన్ను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అబ్బులు ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అబ్బులుకు బన్ను పెద్ద కుమారుడు కాగా చిన్న కుమారుడు అభిషేక్ ఆరో తరగతి చదువుతున్నాడు.
పుల్లేటికుర్రులో విషాదఛాయలు
అంబాజీపేట: అప్పటివరకు స్నేహితులతో ఉల్లాసంగా గడిపిన బన్ను నీట మునిగి మృతి చెందడంతో చీకురుమెల్లివారిపేటలో విషాదం అలుముకుంది. బన్ను స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, అతని తండ్రి నామాడి అబ్రహం ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బన్ను మృతి వార్త తెలిసి గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్ వీరా రవి, ఎంపీటీసీలు కుసుమ వెంకటేష్, వడలి కృష్ణమూర్తి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
వివాహిత ఆత్మహత్య
కపిలేశ్వరపురం: భర్త వ్యవహార శైలితో మనస్తాపానికి గురై మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లికి చెందిన మట్టా రేఖ (24) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వి.కిశోర్ కథనం ప్రకారం రేఖకు అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన మట్టా వేణుతో వివాహమైంది. కొంతకాలం క్రితం రేఖ వేములపల్లిలోని తండ్రి నేదునూరి శ్రీను ఇంటికి ప్రసవానికి వచ్చింది. ఆ సమయంలో రేఖ, వేణుల మధ్య తరచుగా ఫోన్‌లో వాగ్వాదం జరిగేది. దీంతో మనస్తాపం చెందిన రేఖ ఆదివారం వేములపల్లిలోని కొబ్బరితోటలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిశోర్ తెలిపారు. రేఖకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 30,000
గటగట (వెయ్యి) 28,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 29,000
గటగట (వెయ్యి) 27,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,500
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250
కిలో 350
SPSR Nellore
ఖాళీగా ఉన్న ఇంట్లో పెరుగుతున్న పిచ్చి మొక్కలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది. టిడ్కో గృహాల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. నెల్లూరు అల్లీపురంలో ఉన్న టిడ్కో గృహాల్లోని డీ బ్లాక్‌లో స్వల్ప సంఖ్యలో కుటుంబాలున్నాయి. ఈ ప్రాంతమంతా పిచ్చిమొక్కలు
దర్శనమిస్తున్నాయి. మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. కొన్ని ఇళ్ల కిటికీలకు అద్దాలు పగిలిపోయాయి. నిర్వహణ గురించి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
● తర్వాత నగదు మాయం
● ఓ యువకుడి నిర్వాకం
ఆత్మకూరు: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో ఆదివారం స్వైపింగ్ మెషీన్ చోరీకి గురైంది. కొద్దిసేపటి అనంతరం అందులో నుంచి నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లు యజమాని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే సంగం, వింజమూరు, జలదంకి పెట్రోల్ బంకుల్లోనూ స్వైపింగ్ మెషీన్లు చోరీకి గురైనట్లు తెలిసింది. ఓ యువకుడు తన కార్డును స్వైప్ చేసి నగదు తీసుకున్నాడని, కొద్దిసేపటి అనంతరం మెషీన్ కనిపించలేదని బంకు సిబ్బంది తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు చోరీ గురైన నాలుగు మెషీన్ల ద్వారా సుమారు రూ.2 లక్షలు నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నగదు ఇవ్వాలంటూ..
సంగం: మండల కేంద్రమైన సంగంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో శనివారం స్వైపింగ్ మెషీన్ చోరీకి గురైంది. గుర్తుతెలియని యువకుడు వచ్చి కార్డు ఇస్తానని ద్వారా రూ.50 వేలు ఇవ్వాలని బంకు సిబ్బందిని అడిగాడు. వారు అలాగే చేశారు. కాసేపటి తర్వాత ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానంటూ లోపలికి వెళ్లాడు. అతను మెషీన్‌లోని రీఫండ్ ఆప్షన్ ద్వారా రూ.50 వేల నగదును తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు చెబుతున్నారు. బంకు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● నెల్లూరువాసుల ప్రతిభ
సాక్షి,పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న 79వ రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్ 14, 17, 19 విభాగాల బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. వీరిలో కొందరిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
విజేతలు వీరే..
ఇండియన్ రౌండ్‌కు సంబంధించి అండర్ 14 బాలికల విభాగంలో నెల్లూరుకు చెందిన మోక్షాయరెడ్డి, అండర్ 19 బాలుర విభాగం రికర్వ్‌లో నెల్లూరుకు చెందిన తరుణేష్ జత్యా పతకాలు సాధించారు. అన్ని విభాగాలకు సంబంధించి నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల బాలబాలికలు ప్రతిభ చూపారు. డిప్యూటీ డీఈఓ చెల్లయ్య, ఎంఈఓలు జాన్, సువర్ణరాజు, జిల్లా క్రీడల అధికారి జగన్‌మోహనరావు పతకాలు అందజేశారు.
● సీలింగ్ కూలి కార్పెంటర్ మృతి
కోవూరు: నిర్మాణంలో ఉన్న ఇంట్లో సీలింగ్ కూలిపోయి ఓ కార్పెంటర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కోవూరు లక్ష్మీనగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరుకు చెందిన పట్నం ప్రసాద్ (48) కార్పెంటర్. భార్య, పిల్లలున్నారు. లక్ష్మీనగర్‌లో ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లాడు. పనులు కొనసాగుతున్న సమయంలో సీలింగ్ ఒక్కసారిగా ఊడి కూలి ప్రసాద్‌పై పడింది. దీంతో తలకు తీవ్రగాయమై కుప్పకూలాడు. సహచర కార్మికులు అతడిని బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మతృదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీలింగ్ పనుల్లో లోపమా?, లేక భద్రతా చర్యలు పాటించకపోవడమేనా అనే అంశంపై పోలీసులు సాంకేతిక నిపుణులతో కలిసి విచారణ చేస్తున్నారు. ప్రసాద్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. రోజూ నవ్వుతూ పనిచేసే ప్రసాద్ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడంటూ సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.
Nizamabad
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులో ఆదివారం ఓ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన 12మంది ఒక శుభకార్యక్రమంలో పాల్గొనడానికి ఆటోలో సంతాయిపేట్ నుంచి తాడ్వాయికి బయలుదేరారు. తాడ్వాయి శివారులోకి రాగానే ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి చేయి విరుగగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బాల్కొండ: వనంలో ఉండాల్సిన కోతులకు ఆహరం లభించక జనంలోకి వచ్చి ఆహార ఆన్వేషణ చేస్తూ, కంటికి కనిపించిన పదార్థాలను తింటున్నాయి. ఈక్రమంలో ముప్కాల్ మండలం నల్లూర్ శివారులో జాతీయ రహదారి 44 పక్కన ఆదివారం ఓ రైతు ఆరబెట్టిన మక్కలను సైతం వానరాలు తిన్నాయి. ఈ చిత్రాన్ని సాక్షి ‘క్లిక్’మన్పించింది. ముప్కాల్ మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పండ్లను ఇచ్చే చెట్లు లేకపోవడంతో కోతులు గ్రామంలోకి వస్తున్నాయి. ఆకలి, దప్పికలను తట్టుకోలేక కనిపించిన వస్తువులను తింటూ ఆకలిని తీర్చుకుంటున్నాయి. ఆహరం లభించక కోతులు చేసే చేష్టలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోతుల బెడద నుంచి కాపాడలని ప్రజలు కోరుతున్నారు.
జక్రాన్‌పల్లి: క్రీడాపోటీల్లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల జాయింట్ సెక్రెటరీ తిరుపతి అన్నారు. మండలంలోని మునిపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం అండర్ 14, 19 జిల్లా స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటాలన్నారు. డీసీవో శ్రీకర్, ఆర్‌సీవో సత్యనాథ్, ప్రిన్సిపాల్ అనూష, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
బాన్సువాడ: బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని దుర్కి శివారులో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ దిలీప్ తెలిపారు. దుర్కి శివారులో శంభుకుమార్, కార్తీక్‌గౌడ్, నందు, ఫరూఖ్ అనే వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా, పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేశారు. గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని పట్టుకునే ప్రయత్నం చేయగా, ముగ్గురు పోలీసులకు పట్టుబడగా, ఫరూఖ్ పరారీ అయ్యారు. వారి నుంచి 225 గ్రాముల ఎండు గంజాయిని, మూడు సెల్‌పోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రావణ్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, షరుబోద్దీన్, రూపేష్, స్నేహా, సుదీప్, నాగరాజు ఉన్నారని ఆయన అన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలోగల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. ఎస్సై మహేష్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా..డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన తీట్ల ప్రభాకర్ (50) అనే వ్యక్తి ఆదివారం అర్గుల్ చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈక్రమంలో చెరువు నీటిలో గాలం తట్టుకోవడంతో దానిని తీయడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో కాళ్లకు గడ్డి చుట్టుకోవడంతో బయటకు రాలేక ఊపిరాడక ప్రభాకర్ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ధర్పల్లి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వ స్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడు కునేందుకు టార్పాలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు సరఫరా చేసేది. కానీ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం టార్పాలి న్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్లో టార్పాలిన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక టాపర్లను రైతులు అద్దెకు తెచ్చుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు.
2018 వరకు పంపిణీ..
వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేది. మార్కెట్లో రూ. 2500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీ తో రూ.1250కే ప్రభుత్వం రైతులకు అందించేది. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండేవి. ఈవిధంగా 2018 వరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లను పంపిణీ చేసింది. రైతులు కూడా వాటిని తీసుకోవడానికి పోటీపడేవారు. ప్రతి సారి ఆశించిన మేర టార్పాలిన్లు రాకపోవడంతో ఉన్నంత మేరలో అధికారులు రైతులకు అందించేవారు. కానీ 2018 తర్వాత సబ్సిడీ టార్పాలిన్ల జాడే లేదు. వాటికోసం రైతులు ఏడేళ్లుగా ఎదురుచూపులు చూస్తూనేఉన్నారు.
ప్రస్తుతం ధాన్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. పంట కోస్తే ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్లు లేకపోవడంతో అద్దెకు తీసుకుంటున్నాం. ఒక రైతు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు టార్పాలిన్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందించాలి.
–తిరుపతి, రైతు, కార్నల్ తండా
రోజుకు అద్దె రూ.25..
జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణ శివా రులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు టార్పాలిన్లను అద్దెకిచ్చి ఉపాధి పొందుతున్నారు.ఒక్క టార్పాలిన్‌కు రోజుకు రూ.15 నుంచి రూ.25 వరకు చెల్లించి అద్దె ప్రతిపాదికన రైతులు తీసుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సాధారణంగా ప్రతి రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతిరోజు సుమారు రూ.100నుంచి రూ. 250 వరకు భారం పడుతుంది.ఇలా రోజుల త రబడి టార్పాలిన్లను అద్దైపె తీసుకువస్తే రైతుల పై రూ.వెయ్యికి పైగా ఖర్చవుతోంది. దీంతో టా ర్పాలిన్ల అద్దె భారం మోయలేకపోతున్నట్లు రైతు లు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయాలని రైతులు కోరుతున్నారు.
ఏడేళ్లుగా రైతుల ఎదురుచూపులు
బహిరంగ మార్కెట్లో
అధిక ధరలు
కొనలేక అద్దెకు తెచ్చుకుంటున్న
అన్నదాతలు
● పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు
● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో
భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు
నందిపేట్/ఆర్మూర్‌టౌన్/బాన్సువాడ/దోమకొండ/లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నందిపేట మండలంలోని తల్వేద ప్రాథమికోన్నత పాఠశాలలో 1996–97లో 7వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే లింగంపేట మండలంలోని పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో 2006–07 నుంచి 2019–20 వరకు బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని నాలుగోటౌన్ ఎస్‌హెచ్‌వోగా సతీష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ పోలీస్ స్టేషన్‌కు ఎస్సైస్థాయి అధికారి కొనసాగారు. స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండడం, కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఇటీవల దీని పరిధిని ఎస్‌హెచ్‌వోగా విస్తరించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారిని నియమించగా, సతీష్ బాధ్యతలు స్వీకరించారు.
బాన్సువాడ రూరల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన మొక్కలు ఎదిగి చెట్లుగా మారా యి. కాగా రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగి బాటసారులకు నీడనిస్తున్న చెట్లను కొందరు నిరక్షరాస్యులైన రైతులు నరికి వేస్తున్నారు. పోచారం తండా శివారులో కొన్నేళ్లుగా ఉపాధి హామీలో భాగంగా పెంచిన సుమారు 10 చెట్లను నరికివేశారు. నరికివేతకు గురైన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాలభైరవం భజే..
● వైభవంగా సంతతధారాభిషేకం
● ప్రారంభమైన కాలభైరవ స్వామి
జన్మదినోత్సవాలు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదినోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ అనంతరం72 గంటలపాటు నిరంతరంగా కొనసాగే సంతతధారాభిషేకాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, మనీష్ శర్మ, ఆలయ ఈవో ప్రభు గుప్తా ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం బద్దిపోచమ్మకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, సిబ్బందితోపాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.
నేడు లక్ష దీపార్చన
ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం లక్షదీపార్చనను సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నిజామాబాద్‌నాగారం: క్రీడాకారులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికా రి కృష్ణవేణి అన్నారు. నగరంలోని నాగారంలోని రా జారాం స్టేడియంలో ఖైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ కారక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ మొదటి విద్యా శాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం పురస్కరించుకుని, మైనారిటీ ఎడ్యుకేషన్ డే సందర్బంగా అథ్లెటిక్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సయ్యద్ ఖైసర్ మాట్లాడుతూ... ప్రతి ఏడాది ఈటోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్–12, 16, 19 విభాగాల నుంచి బాలబాలికలకు పోటీలు జరిగాయి. 80మీటర్లు, 100మీ,150మీ, 200మీ, 300మీ, 400మీ, 600మీ, 800 మీటర్లలో పోటీల్లో పాల్గొన్న విన్నర్, రన్నర్‌లకు మెడల్స్ సర్టిఫికెట్లు, టీషర్టులు అందజేశారు. పోటీల్లో ఓవరల్ చాంపియన్‌గా నిలిచిన నాగారంమైనారిటీ బాలుర గురుకుల పాఠశాల క్రీడాకారుల కు క్యాష్‌అవార్డుతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. బాలికల్లో చాంపియన్‌గా నిలిచిన మైనారి టీ బాలికల–4 జట్టుకు సైతం అందజేశారు. గురుద్వార్ వైస్ ప్రెసిడెంట్ సోరన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షులు రేవతి, కరాటే రమేష్, సర్దార్ నరేందర్ సింగ్, షేక్ హుస్సేన్, ఉషు రాష్ట్ర కార్యదర్శి ఉమర్, నాయకులు ప్రవీణ్ పాల్గొన్నారు.
మీకు తెలుసా..రామారెడ్డి: సాధారణంగా సాగు చేయని లేదా బంజరు భూమి మాత్రమే మార్పిడికి అనుకూలంగా ఉంటుంది. సారవంతమైన వ్యవసాయ భూమి మార్పిడికి కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉండదు. లేదా నిబంధనలు కఠినంగా ఉంటాయి. కొన్ని నిబంధనలతో వ్యవసాయ భూమిని ప్లాట్‌గా మార్చుకోవచ్చు.
● నివాస (రెసిడెన్షియల్) లేదా వాణిజ్య (కమర్షియల్) ప్రయోజనాల కోసం సదరు భూమిని ఉపయోగించాలంటే, ముందుగా దానిని ప్రభుత్వ అనుమతితో వ్యవసాయేతర భూమి (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ )గా మార్చాలి. ఇందుకోసం చేయవల్సినవి ఇలా..
● నాలా చట్టం ప్రకారం వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి (కన్వెన్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ నాలా) ప్రక్రియను పూర్తి చేయాలి.
● మొదట దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో (మీసేవ లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా) చేసుకోవాలి.
● కావాల్సిన పత్రాలు: భూమి టైటిల్ డీడ్ కాపీ, పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ
● భూమి ప్రాథమిక విలువ ధ్రువీకరణ పత్రం
● దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రాలు (ఆధార్, ఇతర పత్రాలు మొదలైనవి) అవసరం.
● వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చినందుకు ప్రభుత్వానికి నిర్దిష్ట మొ త్తంలో నాలా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
● లేఅవుట్ అనుమతి లేఅవుట్ అప్రూవల్ నా లా మార్పిడి పూర్తయిన తర్వాత, మీరు ఆ భూ మిని చిన్న ప్లాట్లుగా విభజించడానికి రోడ్లు, డ్రె యినేజీ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లే–అవుట్ అనుమతి పొందాలి.
● రాష్ట్రంలో హెచ్‌ఎండీఏ/డీటీసీపీ సంస్థలు ఈ అనుమతులను ఇస్తాయి.
● ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ (రేరా): రియల్ ఎస్టేట్ డెవలపర్లయితే, ప్రాజెక్ట్‌ను తప్పనిసరిగా రేరా (రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ )లో నమోదు చేయాల్సి ఉంటుంది
రుద్రూర్: మండల కేంద్రంలో శనివారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అలాగే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.
ఆగని ఇసుక అక్రమ రవాణా
పోతంగల్ మండలంలోని మంజీరా నది నుంచి ని త్యం ఇసుక అక్రమ రవాణ కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులు ఇసుక రీచ్‌ల నుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాల్లో రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి నిబంధనలకు విరుద్దంగా రాత్రివేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినపుడు మాత్రమే ఒకటి, రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎల్లారెడ్డి: మండలంలోని బ్రాహ్మణపల్లి పరిసరప్రాంతంలోగల పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.12,510 నగదుతోపాటు నాలుగు ఫోన్లు, మూడు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
వృద్ధురాలి అదృశ్యం
మోపాల్: మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన కంజర్ల రాజవ్వ ఈనెల 6 నుంచి కనిపించడం లేదని ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. గురువారం మధ్యాహ్నం రాజవ్వ చందూరు గ్రామంలోని తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లింది. ఇప్పటికీ ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు కంజర్ల భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆదివారం తెలిపారు. రాజవ్వ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కి లేదా మోపాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
కామారెడ్డి క్రైం: లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల పెంటయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం సక్రమంగా ఉండటం లేదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం సామాజిక మా ధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఆదివారం పెంటయ్య కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట కూర్చుని ఉండటాన్ని గమనించిన అవుట్‌పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ అనుమానం వచ్చి ఆరా తీశారు. విషయం తెలుసుకుని అతని కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. వారు రాగానే పెంటయ్యను అప్పగించారు. పెంటయ్య కుటుంబ స భ్యులు హెడ్ కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పెర్కిట్(ఆర్మూర్): పొలంలోని వ్యవసాయ వ్య ర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం కోల్పో యి దిగుబడులు తగ్గుతాయి. కానీ చాలామంది రైతులు పంట చేతికొచ్చిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టి తర్వాత సాగుకు సిద్ధమవుతున్నారు. ఇలా వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటు భూమి వేడెక్కి భూసారం దెబ్బతింటుంది. అలాకాకుండా వ్యవసాయ వ్యర్థాలను దమ్ముచేయడంతో భూసారాన్ని పెంచుకోవచ్చని ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు నలిమెల చిన్నారెడ్డి తెలియజేస్తున్నారు. పొలం కోసిన తర్వాత కొంత నీరు పెట్టి ఎకరాకు రెండు 50 కేజీల సూపర్ పాస్పేట్ మందును చల్లి దమ్ము చేసుకోవడం వల్ల వ్యర్థాలు భూమిలో కలిసి పోతాయి. నెల రోజుల పాటు అలాగే ఆరబెట్టిన అనంతరం చిన్న నాగలితో దున్నుకుని భూమిని మరో పంటకు సిద్దం చేసుకోవచ్చు. పంట నిడివి కాలం తక్కువగా ఉంటే పొలంలో నీటిని అలాగే ఉంచడం వల్ల వ్యర్థాలు కుళ్లిపోయి భూమిలో కలిసి పోతాయి. ఇలా వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియబెట్టడం వల్ల భూసారం పెరుగుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
Telangana
హైదరాబాద్: భార్యపై అనుమానంతో భర్త ఆమెను బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా బీతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి అమీన్‌పూర్ కేఎస్‌ఆర్‌నగర్ కాలనీలోని విష్ణుప్రియ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. గుంటూరు నుంచి వచ్చాక తొలుత వీరు హైదరాబాద్‌లో నివాసం ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు.
కృష్ణవేణి డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కోహిర్ బ్రాంచ్‌లో పని చేస్తోంది. వెంకట బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా, భార్యపై బ్రహ్మయ్య కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వెంకట బ్రహ్మయ్య బ్యాట్‌తో భార్యను కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
∙
∙ సంగారెడ్డి జిల్లాలో ఘటన
Mulugu
సాక్షిప్రతినిధి, వరంగల్: కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్ సప్లయీస్ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.
ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే..
ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధి కారులు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల ధాన్యం 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తేల్చినప్పటికీ రాబ ట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవె న్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అ వకాశం ఉన్నా కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏసీకేల వారీగా వసూళ్లు..
31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం చర్చనీయాంశమవుతోంది.
పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్‌ఓల తీరు
సీఎంఆర్ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనుకేసుకొస్తూ భారీగా నజరానాలు
ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే..
మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ప్రభుత్వానికి చేరని కస్టమ్ మిల్లింగ్ రైస్.. నాలుగేళ్లుగా పెండింగ్
ఏసీబీ అడిషనల్ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్ పేషీకి సీఎంఆర్ దందా
రంగంలోకి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా
వెంకటాపురం(ఎం)/ఎస్‌ఎస్‌తాడ్వాయి/
మంగపేట/వాజేడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం వచ్చిందంటే కోలాహలంగా మారిపోతున్నాయి. ఆదివారం ఆటవిడుపు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు వ్యాపారులు పిల్లాపాపలతో తరలివచ్చి ఆనందంగా గడుపుతున్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, మేడారంలోని వనదేవతల దర్శనం, మంగపేటలోని మల్లూరులో గల హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. అలాగే వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో గల బొగత జలపాతానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొలనులో స్నానాలు చేస్తూ సందడిగా గడుపుతున్నారు.
రామప్పలో ట్రైనీ ఐఏఎస్‌లు
వెంకటాపురం(ఎం) మండల పరిధిలో గల రామప్ప దేవాలయాన్ని ఆదివారం 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు. అదే విధంగా అమెరికా దేశానికి చెందిన ప్రీస్టన్ రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
హేమాచలుడి దర్శనానికి నిరీక్షణ
మంగపేట మండల పరిధిలోని మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచలకొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. గంటల కొద్ది సమయాన్ని లెక్కచేయకుండా వేచి ఉండి మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూపదర్శనం చేసుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.
అమ్మవార్లకు మొక్కులు
తాడ్వాయి మండలంలోని మేడారంలో గల సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.
బొగతలో ఆనందంగా..
వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో గల బొగత జలపాతం వద్ద ఆదివారం సందర్శకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో పర్యాటకులు జలపాతానికి తరలివచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించి సందడి చేశారు. జిప్‌లైన్‌పై ఆటలాడుకుని సరదాగా గడిపారు. సమీప కొలనులో స్నానాలు చేసి కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు.
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ రోడ్డులోని డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. డ్రెయినేజీల నుంచి మురుగు బయటకు వెళ్లకపోవడంతో జ్వరాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేజీకేఎస్ జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో నిర్వహించిన సంఘం 2వ మహాసభలో నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుండబోయిన రవిగౌడ్, కార్యదర్శిగా బుర్ర శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, రమేష్, ఈశ్వర్, గౌరవ అధ్యక్షుడిగా పులి నర్సయ్య, సహాయ కార్యదర్శులు గా అశోక్, మల్లేశ్, మధూకర్, సంపత్, కమిటీ సభ్యులుగా సురేశ్, లచ్చులు, రాజమొగిలి, రత్నాకర్, గణేశ్, యాకయ్యను ఎన్నుకున్నారు.
ఒకే కాన్పులో
ముగ్గురు పిల్లలు
ములుగు రూరల్: ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం మండలంలోని గుండెవాయి చెందిన కుంజ రాధ పురిటి నొప్పులతో బాధపడుతూ ములుగు జనరల్ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ రజిత వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం కాన్పు చేయగా రాధ ముగ్గురు పండంటి మగ శిశువులకు జన్మినిచ్చింది. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యురాలు రజిత తెలిపారు.
బుస్సాపూర్‌లో చోరీ!
గోవిందరావుపేట: మండలంలోని బుస్సాపూర్‌లో ఆదివారం చోరీ కలకలం రేపింది. 12 తులాల బంగారం, రూ.2.10లక్షల నగదు దోచుకున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పస్రా ఎస్సై కమలాకర్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల్లోని ఫుటేజీల ఆధారంగా నాలుగు గంటల్లో దొంగలను పట్టుకుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు సోమవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
● మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: కమీషన్ల కోసమే జాతర అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి ఆరోపించారు. ఆదివారం మేడారం అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెయ్యికోట్లు ఇస్తామని రూ.117 కోట్లు కేటాయించినా నేటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. జాతర సమయానికి పనులు పూర్తవుతాయో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జాతర పనులు నత్తనడకన సాగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. మేడారంలో రోడ్డు విస్తరణ, డ్రెయినేజీల నిర్మాణ పనులకు ఇళ్ల ఎదుట రేకుల షెడ్లు, చిరు వ్యాపారుల షెడ్లను తొలగించి పది రోజులు దాటినా పనులు పూర్తి చేయలేదని తెలిపారు. పనుల్లో అలస్యం చేయడంతో చిరు వ్యాపారుల జీవనోపాధిపై దెబ్బపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు నిల్వ నీడ లేకుండా చెట్లను తొలగించారని వెల్లడించారు. గ్రామసభ ఏర్పాటు చేయకుండా చెట్లు కొట్టే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్లు, ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్ లను వాడకంలోకి తీసుకురాకుండా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గుడి వెనకాల ఉన్న 20ఎకరాల పంట పొలాలపై ప్రభుత్వ కన్ను పడటంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
● జిల్లా అటవీశాఖ అధికారి
రాహుల్ కిషన్ జాదవ్
ఏటూరునాగారం: సీతాకోక చిలుకలపై చేపట్టిన అధ్యయనం ముగిసిందని జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు కొనసాగిన సీతాకోకచిలుక, మాత్ సర్వే ముగింపు కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో మొట్టమొదటిసారిగా సీతాకోకచిలుక, మాత్ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 7 రాష్ట్రాలకు చెందిన పర్యావరణ వేత్తలు, విద్యార్థులతో పాటు సిబ్బంది 60 మంది, ప్రత్యేకమైన ఫొటోగ్రాఫర్లు కలిసి సర్వే చేశారని వివరించారు. ఐసీఏఆర్ నుంచి ఎంటమాలజీ ప్రిన్సిపాల్, సైంటిస్ట్ చిత్ర శంకర్ కీలకమైన రిసోర్స్ పర్సన్‌గా పనిచేశారన్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ప్రశంసపత్రాన్ని అందజేశామని పేర్కొన్నారు. ఈ అభయారణ్యంలో కొన్ని అసాధారణ, అరుదైన సీతాకోకచిలుకలు ఉన్నట్లు అధ్యయనంలో వెలుగుచూశాయన్నారు. సీతాకోకచిలుకల మనుగడను నిర్ధారించడానికి పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సర్వేలు నిర్వహించాలని డీఎఫ్‌ఓ కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ రమేశ్, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్‌రావు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: ఆటో, టాటామ్యాజిక్, గూడ్స్, లారీ, కారు తదితర వాహనాల డ్రైవర్ల అందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో కొప్పుల రఘుపతి అధ్యక్షతన ఆదివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత పేరుతో మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసి జరిమానాలు విపరీతంగా పెంచారని తెలిపారు. అదే విధంగా చిన్నచిన్న పొరపాట్లకు శిక్షకాలం కూడా పెంచారని వివరించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతీ ఆటో, టాటా మ్యాజిక్, కారు, టాటా ట్రాలీ అడ్డాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్‌ఐ సౌకర్యం కార్మికులందరికీ కల్పించాలన్నారు. అలాగే అడవిలో పెట్టిన టోల్‌గేట్ చార్జీల నుంచి స్థానిక వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్, జహీర్ అహ్మద్, రామ్మూర్తి, జలంధర్ రెడ్డి, ఓం ప్రకాశ్, గోపి, అష్రఫ్, రంజిత్, హరినాథ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని ఊరట్టం కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మహిళలు ఆదివారం తాగునీటి కోసం చేతిపంపు వద్దకు వెళ్లి బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో ఊరట్టం కాలనీలో ఇంటింటికీ మిషన్ భగీరథ పైపులైన్లు వేశారని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. పేరుకే మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారే తప్పా చుక్కనీరు కూడా రావడం లేదని ఆవేదర వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాగునీటి కోసం చేతి పంపులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Nandyala
శ్రీశైలంటెంపుల్: ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఏఈవో, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కర్నూలు(హాస్పిటల్): విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న డి. మంజులాదేవి ప్రతిభ చూపారు. విజయవాడలోని సర్ విజ్జి మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఆరవ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఇందులో మంజులదేవికి వంద మీటర్ల ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్‌లలో రెండు గోల్డ్‌మెడల్‌లు, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్‌లలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు.
రేపు పలు ప్రాజెక్టులకు
వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఏపీఐఐసీ, ఎయిర్‌పోర్టు, టూరిజం ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారన్నారు. ఆయా ప్రాజెక్టుల వద్ద లబ్ధిదారుడు, స్టేక్ హోల్డర్‌తో మాట్లాడుతారని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ నూరుల్ ఖమర్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.
● మద్దికెరలో కలియతిరిగిన ట్రైనీ కలెక్టర్లు
మద్దికెర: మండలకేంద్రమైన మద్దికెరకు ఆదివారం ట్రైనీ ఐఏఎస్ కలెక్టర్లు అంకిత్ రాజుపుత్, మోహిత్ మంగల్, భరత్ దత్ తివారి, తన్మయి మెగ్వాల్, అమర్ బాగిల్, అతుల్‌సోని వచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ప్రధాన కూడలిలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి ధరల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి, గ్రామంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి.. తదితర వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీపీ అనిత, సర్పంచ్ సుహాసిని, తహసీల్దార్ గుండాలనాయక్, ఎంపీడీఓ కొండయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ మయాంక్, ఎంఈఓ రంగస్వామి, ఏఓ రవి, ఏపీఓ నర్సిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ త్రివేణి ఉన్నారు.
● కుల సంఘాల ఆధ్వర్యంలో
వన భోజనాలు
● ఆటపాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో
పాల్గొన్న ప్రజలు
గంగపుత్రుల వన భోజన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ఎస్వీ మోహన్‌రెడ్డి
కాటసాని రాంభూపాల్‌రెడ్డిని సన్మానించిన దృశ్యం
కర్నూలు కల్చరల్: కార్తీక వన భోజన కార్యక్రమాలు ఆదివారం ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు కుల సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు, గోమాత పూజలను భక్తి శ్రద్ధలతో చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలకు ఆటల పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. కుల ప్రముఖుల సందేశాలిచ్చారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు అభినందనలు తెలుపుతూ సత్కారాలు చేశారు.
● కర్నూలు రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌లో రెడ్ల కార్తీక మాస వన భోజన మహోత్సవం జరిగింది. వేలాది మంది కుల సంఘీయులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పుల్లకుర్తి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాతల సహకారంతో రెండు వృద్ధాశ్రమాలు, పేద రెడ్డి విద్యార్థులకు విద్యానిధి ద్వారా విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడారు. సిని కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన మిమిక్రీతో సందడి చేశారు. సంఘం అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, ఉపాధ్యక్షులు దొనపాటి ఎల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, జి.పుల్లారెడ్డి ట్రస్ట్ సభ్యులు రాఘవ రెడ్డి, ఏకాంబర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేజే రెడ్డి కేవీ సుబ్బారెడ్డి, సరేష్ రెడ్డి, హనుమంత రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● ఎల్‌పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్
సుభాష్ చంద్రబోస్
కర్నూలు(అర్బన్): సమస్యలపై ప్రజల గొంతుకగా న్యాయవాదుల ప్రజాకూటమి ప్రశ్నిస్తుందని ఎల్‌పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. న్యాయవాదుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. నూతనంగా లాయర్స్, పబ్లిక్ ఫ్రంట్(ఎల్‌పీఎఫ్) న్యాయవాదుల ప్రజా కూటమి ఆవిర్భవించింది. ప్రతిష్టాత్మకంగా వెలసిన న్యాయవాదుల ఎల్‌పీఎఫ్‌కి రాష్ట్ర కన్వీనర్‌గా మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులు కూడా నియమితులయ్యారు. ఆదివారం కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, దేవపాల్, సుబ్బయ్య, ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాదులు రవీందర్‌చౌదరిలతో పాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరై ఏకగ్రీవంగా లాయర్స్, పబ్లిక్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు.
చట్టాలపై అవగాహన కల్పిస్తాం
సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించే కార్యాక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతామని ఎల్‌పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌పీఎఫ్ పని చేస్తుందని, ఎవ్వరికి అన్యాయం జరిగినా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి మారెప్ప మట్లాడుతూ.. ప్రజా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వారు ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రూ.కోట్లు కూడబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలను సవరించేందుకు ఎల్‌పీఎఫ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదుల ప్రజా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. న్యాయవాదులు గాలిరాజు, గౌతంశేఖర్, ఉపేంద్ర, సువర్ణకుమారి, సుమలత, జ్యోతి లావణ్య, శ్రావణ్‌కుమార్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
లాయర్స్, పబ్లిక్ ఫ్రంట్ కమిటీలో
సభ్యులు..
ఎల్‌పీఎఫ్ రాష్ట్ర కో–కన్వీనర్‌గా ముప్పసాని గాలిరాజు, కర్నూలు జిల్లా కన్వీనర్‌గా గౌతంశేఖర్, కో–కన్వీనర్‌లుగా న్యాయవాదులు కె.సుమతల, డి.లావణ్య, జీఎన్‌జ్యోతి, వై.ఉపేంద్ర, ఎం.శ్రావణ్‌కుమార్, మహేంద్రరెడ్డి, వినోద్‌కుమార్ ఎన్నికయ్యారు.
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూజలు చేశారు. అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధ్రువ, సైరా వంటి చిత్రాలకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.
పాల కోసం వస్తూ..
మహానంది: జీవనోపాధి నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్రంలోని అఫదిమడూరి గ్రామానికి చెందిన పవన్(26) గాజులపల్లె రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నవగ్రహాల ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆలయానికి దగ్గరలోని ఎంసీఫారం వద్ద ఆదివారం ఉదయం పాలు తెచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా బుక్కాపురం గ్రామానికి చెందిన షేక్ జమాల్ బాషా బొలొరో ఢీకొంది. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడటంతో కోలుకోలేక మృతి చెందాడు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అదృశ్యం
కోడుమూరు రూరల్: కొత్తూరు గ్రామానికి చెందిన 33 సంవత్సరాల వితంతువు మల్లెపూలు లక్ష్మి కన్పించకుండా పోయినట్లు ఆమె తల్లి బైరిపోగు తిరుపాలమ్మ కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మల్లెపూలు లక్ష్మీ అనే మహిళకు 11 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో కొత్తూరు గ్రామాన్ని వదిలి పుట్టినిల్లైన గూడూరు మండలం మునుగాల గ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆరు నెలల కిందట లక్ష్మి తిరిగి కొత్తూరు చేరుకుని అక్కడే కుమారిడితో పాటు నివాసముంటోంది. ఈ నేపథ్యంలో గత శనివారం కోడుమూరుకు సంతకు వచ్చిన లక్ష్మి తిరిగి ఇంటికి పోలేదు. అయితే కోడుమూరులోని కొత్తబస్టాండ్ పిండి గిర్ని వద్ద నుంచి ఆడబిడ్డ భర్తకు ఫోన్‌చేసి తనను ఇద్దరు వ్యక్తులు వెంటాడుతున్నారని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మి తల్లి బైరిపోగు తిరుపాలమ్మ తన కుమార్తె కన్పించకుండా పోయిన విషయాన్ని ఆదివారం కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
● అధ్యక్షులుగా నాగిరెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్
కర్నూలు (అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగంణంలోని విశ్వేశ్వరయ్య భవనంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళి కృష్ణనాయుడు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పాణ్యం పీఆర్‌ఐ డీఈఈ ఇ. నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కర్నూలు పీఐయూ ఎఈఈ ఆర్. సతీష్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరు పీఆర్‌ఐ డీఈఈ ఎస్. చంద్రశేఖర్, కోశాధికారిగా ఆదోని పీఆర్‌ఐ ఏఈఈ ఎం. మహదేవప్ప, అర్గనైజింగ్ సెక్రటరీగా కర్నూలు పీఆర్‌ఐ ఏఈఈ జ్యోత్స్నను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, పీఆర్ ఎస్‌ఈ వేణుగోపాల్, ఈఈ మహేశ్వరెడ్డితో పాటు జిల్లాలోని డివిజన్లు, సబ్ డివిజన్లకు చెందిన డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.
నంద్యాల(వ్యవసాయం): సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీశైల హైస్కూల్ సెమినార్ హాల్‌లో నిర్వహించిన జాతీయ కవిసమ్మేళనం సాహితీవేత్తలు, ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి, మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నం నేతృత్వంలో కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు, రచయిత డాక్టర్ కిశోర్ కుమార్, బేతంచర్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియాదాసు, కవులు నీలకంఠమాచారి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. కవిత్వమనేది కవి గుండెల్లో నుంచి ఉప్పొంగి అక్షర రూపం దాల్చి సమాజానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. ‘పసిడి నవ్వులు వెన్నెల దివ్వెలు’ అనే అంశంపై అనేక మంది కవులు వివిధ జిల్లాల నుంచి పాల్గొని తమ కవితలను చదివి వినిపించారు. సంస్థ నిర్వాహకులు కవుల సాహిత్య సేవకు గుర్తింపుగా జానపద మంజరి సేవా పురస్కారాలు, బాల చైతన్య సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కవులు వెంకటేశ్వర్లు, నరేంద్ర, మహమ్మద్ రఫి, శేషఫణి, మాబుబాష, కేశవమూర్తి పాల్గొన్నారు.
దొర్నిపాడు: స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో గత రెండు వారాల నుంచి ఓ బైక్ అనుమానాస్పదంగా ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు పని మీద వెళ్తూ అక్కడ ఉంచి వెళ్లినా 15 రోజులు గడిచినా ఎవరూ రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎదైనా అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు భయపడి అక్కడ వదిలేశారా? లేక ఎవరైనా చోరీ చేసి వదిలేశారా.. అనేకోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. కొంత మంది ఆ బైక్‌లో ఏముందో ఏమోనని భయాందోళన చెందుతున్నారు.
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
కర్నూలు (టౌన్): బీటెక్ విద్యార్థి కుమ్మరి భరత్ కుమార్ (20) ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లూరు విఠల్ నగర్‌కు చెందిన ఈ విద్యార్థి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఐదో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి కుమ్మరి శ్రీరాములు మెడికల్ ఏజెన్సీకి, తల్లి మాధవి పనిమీద ఆదివారం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమ్మరి భరత్ బెడ్‌రూమ్‌లో ఉన్న సిలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చి తల్లి ఉరి వేసుకున్న కుమారుడిని చూసి బోరున విలపిస్తూ భర్త శ్రీరాములుకు ఫోన్ ద్వారా తెలియజేసింది. వెంటనే ఇంటికి వచ్చిన తండ్రి కుమారుడిని ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. తమ కుమారుడు చనిపోవడానికి ఎవరూ కారణం కాదని తల్లిదండ్రులు తెలిపారు.
Peddapalli
గోదావరిఖని: రామగుండం నగరంలో దారిమైసమ్మ దే వాలయాలు కూల్చివేసిన నే పథ్యంలో ఈనెల 12న కేంద్ర మంత్రి బండి సంజయ్ గోదావరిఖనికి రానున్నట్లు బీజేపీ నాయకుడు కోమళ్ల మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రమంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, పలువురు నాయకులు ఖనికి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చైనా బృందంలో మనోడు
పాలకుర్తి(రామగుండం): వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ వ్యవస్థపై అవగాహన కోసం మనదేశ సాఫ్ట్‌వేర్ నిపుణులు చైనాలో పర్యటిస్తున్నారు. ఇందులో ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సంతోష్‌గౌడ్‌కు చోటు దక్కింది. సంతోష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత సేవలు, అంత ర్జాతీయ ఆర్థిక వ్యూహాలు తదితర అంశాలపై బృందం అవగాహన పెంచుకుంటుంది. మనదేశం తరఫున 15మంది బృందం శనివారం చైనాకు బయలుదేరి వెళ్లింది. ఇందులో సంతోష్‌గౌడ్ కూడా ఉన్నారు. ఆయనను పలువు ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
కోతుల పట్టివేత
పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని వివిధ ప్రాంతా లల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కో తులను ఆదివారం పట్టుకుని బోనులో బంధించారు. కోతులు ఇటీవల దాడి చేసి పలువురు పట్టణ ప్రజలు గాయాలపాలయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ సూచన మేరకు కోతులు పట్టే బృందాలను ఇక్కడకు రప్పించారు. వారు ఆదివారం వివిధ ప్రాంతాల్లో కోతులను పట్టి బోనులో బంధించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి: గోదావరిఖనిలో 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా మైసమ్మ ఆలయాలను ధ్వంసం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోదని ఆయన ఆరోపించారు. కూల్చివేసిన ప్రాంతాల్లో ఆలయాలు మళ్లీ నిర్మించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
15న సత్యనారాయణ వ్రతం
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈనెల 15న ఉదయం 10.30 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ చీకట్ల మొండ య్య తెలిపారు. ఈ మేరకు సామూహిక సత్యనారాయణ వ్రతం ప్రచార పోస్టర్‌ను ఆదివా రం స్థానిక ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 100 మందికిపైగా దంపతులు సామూహిక సత్యనారాయణ వత్రంలో పాల్గొంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఈవో సదయ్య, ఆలయ డైరెక్టర్ శ్రావణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేడు యోగా దినచర్య
గోదావరిఖని: సింగరేణి కార్మిక కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకోసం సోమవారం ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్జీ–1 అధికార ప్రతినిధి రవీందర్‌రెడ్డి తెలిపారు. యోగా సాధన ద్వారా కలిగే ఫలితాలు, ప్రయోజనాల గురించి హైదరాబాద్‌కు చెందిన యోగా గురువు షణ్ముక శివచంద్ర వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ఆర్‌సీవోఏ క్లబ్‌లో ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్మికులు, వారి కుటుంబాలు పాల్గొనాలని ఆయన కోరారు.
పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. సుమారు 18ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా కష్టాలు తీరడంలేదు. రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. పండుగలు, ఇంటి కిరాయి, పిల్లల ఫీజు చెల్లించేందుకు అప్పు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వం ప్రతీనెల ఐదోతేదీలోగా వేతనాలు చెల్లించేదని, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా పనులు చేయిస్తున్నా.. ఒకటో తేదీన వారికి చెల్లించినట్లు తమకు ఎందుకు చెల్లించడం లేదని రెండో ఏఎన్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. వారి దీనస్థితి గురించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారితోపాటు కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు.
రెండో ఏఎన్‌ఎంలే అధికం..
జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అత్యధిక మంది రెండో ఏఎన్‌ఎంలే ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విషజ్వరాలు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల సర్వేతోపాటు ఎన్‌సీడీ, టీబీ, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలు వీరే చేపడతారు. వారంలో రెండురోజులు గర్భిణుల రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు వీరి నే తృత్వంలోనే సాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. గ ర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించడం, బాలింతల సంరక్షణ, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలోనూ పాలుపంచుకుంటున్నారు.
రెండో ఏఎన్‌ఎంలకు అందని జీతాలు
ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు
హక్కుల సాధనకు పోరుబాట
17 నుంచి నిరవధిక సమ్మెకు సన్నద్ధం
ఇప్పటికే సమ్మె నోటీసు అందించిన వైనం
గోదావరిఖని: మూడు జిల్లాలకు కేంద్రంగా ఉన్న గోదావరిఖనిలో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఆదివారం ఆయన గోదావరిఖని ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా నిర్మించే క్వార్టర్ల ప్రాంతం, మెయిన్ చౌరస్తాలో చేపట్టే షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించారు. జీడీకే–5 ఓసీపీని సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంప్‌యార్డుపై మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, భూపాలపల్లి ప్రాంతాల కార్మి క కుటుంబాలకు ఉపయోగపడేలా మల్లీఫ్లెక్స్ నిర్మి స్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. వర్షాలతో ఆశించిన దానికన్నా ఆలస్యమైందని తెలిపారు. షాపింగ్ పనుల్లో వేగం పెంచేలా కాంట్రాక్టర్‌కు సూచించామని ఆయన తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రతీఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
● సింగరేణి సీఎండీ బలరాం
ఏడాది 2023 2024 2025
అవగాహన కార్యక్రమాలు 691 719 517
హాట్‌స్పాట్ విజిట్ 2,694 2,624 2,256
రెడ్‌హ్యాండెడ్ కేసులు 17 13 251
ఈవ్‌టీజర్ల రెడ్‌హ్యాండెడ్ అరెస్ట్ 40 31 279
స్వీకరించిన పిటిషన్లు 104 96 354
ఎఫ్‌ఐఆర్‌లు 11 16 37
ఈ పెటీ కేసులు 18 04 32
వేధిస్తే కఠిన చర్యలు
మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా మౌనంగా ఉండవద్దు. పోలీసులకు వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తాం. వాటిపై సత్వరమే స్పందిస్తున్నాం. ఈఏడాది ఇప్పటివరకు 37మందిపై కేసులు నమోదు చేశాం. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– అంబర్ కిశోర్ ఝా, పోలీస్‌కమినర్, రామగుండం
Rajanna
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025కరీంనగర్‌టౌన్: కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలతో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలో అడుగు పెట్టిన జూనియర్ విద్యార్థులకు సీనియర్లు పరిచయం అవుతారు. తొలి పరిచయానికి పర్యాయపదంగా నిలవాల్సిన ర్యాగ్ అన్న పదం వికృత క్రీడకు చిహ్నమవుతోంది. ఆ పేరు చెబితేనే జూని యర్ల వెన్నులో వణుకుపుడుతోంది. ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం పతాకస్థాయికి చేరుకుంటోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూలో శనివారం రాత్రి సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి.
స్నేహమా.. జాగ్రత్త సుమా
మంచి స్నేహం ప్రాణంతో సమానం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరికీ స్నేహం అవసరం. కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు స్నేహితుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల క్యాంటీన్లు, హాస్టళ్లకు పాకిన ఈ భూతానికి ఏటా ఎంతో మంది విద్యార్థులు బలవుతుండగా విద్యాశాఖ, పోలీసు విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
‘సుప్రీం’ మార్గదర్శకాలు
సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్‌కే రాఘవన్ కమిటీ వేసిన సిఫార్సులను 2007లో ఆమోదించింది. దీని ప్రకారం ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు అందితే వెంటనే విద్యా సంస్థలు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణుడిని నియమించాలి. విద్యార్థులు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాల యజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్ నిరోధించడంలో యజమాన్యాలు విఫలమైతే వారినే బాధ్యులను చేయాలి.
‘యూజీసీ’ మార్గదర్శకాలు
ర్యాగింగ్ సంఘటనల్లో దోషులుగా తేలిన వారికి రూ.2.5 లక్షల జరిమానాల విధించాలి. తీవ్రతను బట్టి వారిని కళాశాల ప్రవేశంపై జీవితకాల నిషేధం విధించాలి. కళాశాలలో చేరే సమయంలో వేధింపులకు పాల్పడబోమని విద్యార్థి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. వేధింపులను అరికట్టడంలో విఫలమైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ర్యాగింగ్ నిబంధనలను తెలుపుతూ ప్రతి కళాశాల పరిసరాల్లో పోస్టర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి.
సర్కారు ఏం చెబుతోందంటే..
ర్యాగింగ్ నిరోధకానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్యశాఖ 1800– 5522 ట్రోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ హెల్ప్‌లైన్ పని చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను 1090 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపవచ్చు. ర్యాగింగ్ జరిగే కళాశాలల వద్ద నిఘా పెంచాలి.
వైద్య నిపుణుల సూచనలు
ర్యాగింగ్ తప్పనే విషయాన్ని సీనియర్లకు తెలిపేందుకు కాలేజీల్లో నైతిక విలువల కమిటీ లేదా మానవ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్ చేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జూనియర్లకు అవగాహన కల్పించాలి. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తే మిగతా వారికి కనువిప్పు కలుగుతుంది. కళాశాల యజమాన్యాలు నిజాలను దాచకుండా వెలుగులోకి తేవాలి. జూనియర్లు స్వేచ్ఛగా మసలేలా చర్యలు తీసుకోవాలి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలు
డిగ్రీ
66
పీజీ
35
ఇంజినీరింగ్
16
ఎంబీఏ
8
ఎంసీఏ
1
ఫార్మసీ
2
పాలిటెక్నిక్
5
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం వందలాది వాహనాలతో బీజీగా ఉండే కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని బోయిన్‌పల్లి నుంచి గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వరకు 60 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. గుంతలతో ప్రమాదాలు జరుగుతుండగా, వాహనదారులే గుంతలవద్ద మట్టి నింపి చెట్ల కొమ్మలను ప్రమాదసూచికంగా పెడుతున్నారు.
రోడ్డు పొడవునా గుంతలే..
ఏడాదిన్నరగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ నుంచి తిమ్మాపూర్ వరకు కిలోమీటర్‌కు ఓ పెద్ద గుంత చొప్పున ఏర్పడి వాహనాదారులు ఇబ్బందిపడుతున్నారు. పదిర బ్రిడ్జిపై పెద్ద గుంత ఏర్పడగా.. దినపత్రికల్లో అనేక కథనాలు వచ్చినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సిమెంట్ కాంక్రీట్‌తో నింపారు. మళ్లీ అదే బ్రిడ్జిని ఆనుకుని ఓ సైడ్ మట్టికొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. అధికారులు తాత్కాలిక మరమ్మతు చేపట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి రోడ్డు మధ్యలో సిమెంట్, కాంక్రీటు లేచి లోపల స్టీలు రాడ్లు విరిగి పెద్ద రంధ్రం పడింది. వాహనదారులు అక్కడ చెట్ల కొమ్మలను ప్రమాదసూచికగా పెట్టగా, అధికారులు దాన్ని తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. పగటిపూట హెచ్చరిక సూచికలను వాహనదారులు అనుసరిస్తారు కానీ రాత్రిపూట గమనించకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకే వెంకటాపూర్– తిమ్మాపూర్ మధ్యలో జరిగిన ప్రమాదాల్లో కొందరు మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు.
పదిర వంతెనపై పెద్ద గుంత
రాగట్లపల్లి వద్ద చెట్టుకొమ్మలు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాతో పాటు.. మండల కేంద్రాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లోని లో లెవల్ కల్వర్టుల స్థానంలో హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. ఏటా వానాకాలంలో వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో లోలెవల్ వంతెనల మీదుగా ప్రయాణం ఇబ్బందిగా మారింది. వర్షాలు కురిసిన సమయంలో కల్వర్టులపై నీరు ఉధృతంగా ప్రవహించి బోయినపల్లి నుంచి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఆరేళ్లుగా ఏటా వానాకాలంలో బోయినపల్లి గ్రామ పరిసరాల్లోని మూడు కల్వర్టుల మీదుగా నీటి ఉధృతి పెరిగి ప్రయాణం ప్రమాదంగా మారింది. వర్షాలు కురిసి కల్వర్టులపై నీరు పారినపుడు గ్రామపంచాయతీ వారితో పాటు, పోలీసులు బారికేడ్లతో రక్షణ చర్యలు చేపడుతున్నారు.
పడకేసిన గంజివాగు బ్రిడ్జి పనులు
బోయినపల్లి నుంచి వేములవాడ వెళ్లే దారిలో స్తంభంపల్లి గంజివాగు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడ కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిగా స్లాబ్ పనులకు మోక్షం లభించడం లేదు. బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా వాగు పక్కనుంచి తాత్కాలికంగా వేసిన రోడ్డు చాలాసార్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
తాత్కాలిక పనులతో ప్రజాధనం వృథా
బోయినపల్లి నుంచి మర్లపేట, విలాసాగర్ గ్రామా ల మీదుగా కరీంనగర్ వెళ్లే బీటీ రహదారిలోని కల్వర్టు నాలుగేళ్లుగా ఏటా తెగుతోంది. ప్రతీసారి సుమారు రూ.5 లక్షల నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. గతేడాది సైతం సుమారు రూ.7 లక్షల అంచనాలతో మరమ్మతు చేశారు. తా త్కాలిక మరమ్మతులకు ఇప్పటికీ సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలకు నిలయంగా కల్వర్టు
కోనరావుపేట మండలం మల్కపేట లోలెవల్ కల్వర్టు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని కేసీఆర్‌నగర్ కాలనీలో పైప్‌లైన్ దెబ్బతినడంతో మూడురోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్‌నగర్‌ను ఇందిరమ్మకాలనీ గ్రామపంచాయతీకి తాత్కాలికంగా కేటాయించడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే కాలనీలో సుమారు 1,500 మంది జనాభా ఉండగా ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న నీరు సరిపోవడం లేదు. రెండవ, మూడవ అంతస్తుల్లో ఉండేవారు నీటిని పైకి మోయలేక పాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, మిషన్ భగీరథ, గ్రిడ్ అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టి నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.
రాష్ట్రస్థాయిలో కొత్తపల్లి విద్యార్థుల ప్రతిభ
గంభీరావుపేట(సిరిసిల్ల): మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్– 17 బాలుర, బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభచాటి తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల్లో క్రీడాకారులు హర్షిని, భావన, స్వాతి, రాము, లక్ష్మణ్ సత్తాచాటారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరామారావు, కోచ్ భార భాను, ఉపాధ్యాయులు అభినందించారు.
అమరవీరుల ఆశయాలు సాధిద్దాం
సిరిసిల్లటౌన్: అమరవీరుల ఆశయాలను సాధిద్దామని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న పిలుపునిచ్చారు. ఆదివారం చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తాలో జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి సభ ప్రాంగణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం అమరులైన చండ్రపుల్లారెడ్డి అతి చిన్న వయసులో విప్లవోద్యమానికి అంకితమయ్యారన్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుకొని కార్మిక, కూలీల కోసం, అణచివేయబడ్డ ప్రజల కోసం నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగించారని వివరించారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ న్యూ పార్టీ రాష్ట్ర నాయకుడు సోమిశెట్టి దశరథం, మోడం మల్లేశం, వొల్లాల కిషోర్, బామండ్ల రవీందర్, మచ్చ అనసూర్య, పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవదాసు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గౌస్, మత్స్య శాఖ జిల్లా అధికారి సౌజన్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లోని జక్కుల చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం రాయితీతో చేప పిల్లలను అందిస్తుందన్నారు. దీన్ని ఉపయోగించుకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. మత్స్యకారుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేపల సంపద పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ పని శివరామకృష్ణ, అధికారులు కిరణ్, సతీశ్, వెంకటేశ్, నాయకులు బండారి బాల్‌రెడ్డి, కొండాపురం శ్రీనివాస్‌రెడ్డి, కదిరే శ్రీనివాస్, ఎడ్ల రాజ్‌కుమార్, చింతల పోచయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల/వేములవాడఅర్బన్: వేములవాడ నంది కమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే)లో మంగళవారం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. వార్షికోత్సవ కరపత్రాలను ఆదివారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శిగా పని చేస్తూ.. రంగవల్లి అలియాస్ లలితక్క 1999 నవంబరు 11న ములుగు జిల్లా జగ్గన్నగూడెం వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆమె స్మారకార్థం వేములవాడ నంది కమాన్ వద్ద గతేడాది రంగవల్లి విజ్ఞాన కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఆమె పేరిట నెలకొల్పిన విజ్ఞాన కేంద్రానికి ఏడాది నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నా రు. సభా పరిచయం పోకల సాయికుమార్ చేయనుండగా.. అరుణోదయ విమలక్క (ఆర్‌వీకే అధ్యక్షురాలు) సభాధ్యక్షత జరుగుతుంది. ‘సంక్షోభ కాలం.. సామాజిక మార్పు’ అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల వక్తగా, రాజేశ్వరి (ఆర్‌వీకే సభ్యులు) అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ‘ప్రజాగ్రంథాలయం ఆవశ్యకత’ అంశంపై ప్రముఖ కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతారు. ఆర్‌వీకే సభ్యులు చెన్నమనేని పురుషోత్తమరావు వందన సమర్పన చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. రంగవల్లి విజ్ఞాన కేంద్రం సభ్యులు రాజేశ్వరి, చెన్నమనేని పురుషోత్తమరావు, పోకల సాయికుమార్, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మి, లత, అంజా గౌడ్, నందం, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతలతో రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్నాం. ఎక్కడ పెద్ద గుంతలు ఉన్నాయో తెలియక ఇబ్బందిపడుతున్నం. కొత్త వారు ఈ రోడ్డుపై ప్రయాణిస్తు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.
– గుర్రం దేవయ్య, దుమాల, ఎల్లారెడ్డిపేట
మరమ్మతు చేయాలి
రోడ్డుపై ఏర్పడిన గుంతల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. హెచ్చరిక బోర్డులు ఉంటే వాహనదారులు అప్రమత్తం అయ్యే అవకాశాలుంటాయి. గుంతలు ఏర్పడకుండా మరమ్మతు చేయాలి.
– డానియల్, ఆటోడ్రైవర్, ఎల్లారెడ్డిపేట
Sri Sathya Sai
● ఏడాదిన్నరగా పట్టించుకోని ప్రభుత్వం
పుట్టపర్తి అర్బన్: టిడ్కో ఇళ్ల నిర్మాణాల పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అరకొర సంపాదనతో కుటుంబ పోషణకే ఇబ్బంది పడుతున్న పేదలు.. ఇళ్ల అద్దెలు చెల్లించలేక సతమతమవుతున్నారు. తమ సొంతింటిలోకి ఎప్పుడు అడుగు పెడతామా అని ఏడెనిమిదేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినా ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. 2014 – 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు పక్కాగృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. టిడ్కో (ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా 2019 నాటికి అన్ని హంగులతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది.
మధ్యలోని ఆగిన నిర్మాణాలు
జిల్లాలోని కదిరి, పెనుకొండ, ధర్మవరం, హిందూపురం, మడకశిర, పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు భూములు కేటాయించారు. ఇందులో పుట్టపర్తి మున్సిపాలిటీలోని పేదల కోసం సమీపంలోని కర్ణాటకనాగేపల్లి వద్ద నల్లమాడ–పుట్టపర్తి ప్రధాన రోడ్డు పక్కన దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో భూమి చదును చేసి బ్లాకులుగా నిర్మాణం మొదలు పెట్టారు. 15 బ్లాకుల (జీ + 3, జీ+4)కు గాను 5 బ్లాకుల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత బిల్లులు అందలేదని కాంట్రాక్టర్ తక్కిన పనులు నిలిపివేశారు. ఇక్కడ నిర్మాణాలు పూర్తయితే 1,248 లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది.
డిపాజిట్లు ఇలా..
టిడ్కో ఇళ్ల నిర్మాణాను మూడు కేటగిరీలుగా విభజించారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటికి రూ.500 చొప్పున 467 మందితో, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటికి రూ.12,500 చొప్పున 93 మందితో, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటికి రూ.25వేల చొప్పున 112 మందితో మొత్తం 672 మంది నుంచి మున్సిపల్ అధికారులు డిపాజిట్లు సేకరించారు. అప్పట్లో ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.68.70 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే రూ.వంద కోట్లు దాటుతుందని అంచనా.
అసాంఘిక శక్తులకు అడ్డాగా..
పుట్టపర్తి సమీపంలోని టిడ్కో గృహ నిర్మాణ సముదాయాలు పూర్తి కాకపోవడంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయి. రోజూ సాయంత్రమైతే చాలు మందుబాబులు అక్కడకు చేరుకుని పూటుగా తాగుతున్నారు. మద్యం మత్తులో ఏమి అఘాయిత్యాలకు పాల్పడతారోనని అటువైపు పొలాలకు వెళ్లే మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు.
త్వరలోనే పూర్తి చేస్తాం
దీనిపై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్‌ను వివరణ కోరగా మూడు రోజుల క్రితం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో టెలీ కాన్ఫరెన్స్ జరిగిందని, త్వరలోనే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి తక్కిన పనులను పూర్తి చేసే విధంగా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం మొదటి విడతలో పెద్ద మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేస్తారని, ఆ తర్వాత చిన్న మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేస్తారని చెప్పినట్లు కమిషనర్ చెప్పారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణం ఇలా..
టిడ్కో ఇళ్లన్నీ మోనోలిథిక్ కాంక్రీట్ టెక్నాలజీ సహాయంతో ఇటుకలు లేకుండా నిర్మిస్తారు. ఒక హాలు, వంట గది, బెడ్‌రూం ఉంటాయి. ఈ ప్రాజెక్టులో ఇళ్లతో పాటు రహదారులు, డ్రెయినేజీ, పాఠశాల, వ్యాపార సంస్థలు, ఆరోగ్య కేంద్రం, సౌర విద్యుత వీధి దీపాలు, 24 గంటలూ విద్యుత్ సౌకర్యం ఉండేలా చూస్తారు. అప్పట్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన టిడ్కో ఇళ్లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడుస్తోంది. అయినా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదు. లబ్ధిదారులు మాత్రం తరచూ మున్సిపాలిటీలకు వెళ్లి అధికారులను కలుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
National
న్యూఢిల్లీ: ‘పొగమంచు నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి’.. ‘శ్వాస మమ్మల్ని చంపేస్తోంది’ అనే ప్లకార్డులు చూపిస్తూ, పిల్లాపెద్దా అనే బేధభావం లేకుండా వందలాదిమంది ఢిల్లీవాసులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలోని మాన్ సింగ్ రోడ్‌లో ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ‘చాలా పేలవమైన’ విభాగంలో 370ని తాకిన తరుణంలో, ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
‘ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడే క్లీన్ ఎయిర్ పాలసీని అందించాలి’ అని ఒక నిరసనకారుడు నినదించగా ‘ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేసుకుంటారు లేదా పచ్చని కొండ ప్రాంతాలకు పారిపోతారు. కానీ మా సంగతేంటి? ప్రతి శీతాకాలంలో శ్వాస తీసుకునేందుకు పోరాటం చేస్తున్నాం’ అని ఒక నిరసనకారుడు అన్నాడు. ‘గాలి ప్రభుత్వ ఆస్తి కాదు. అది అందరికీ చెందుతుంది’ అని నినదించాడు.

మరో నిరసనకారురాలు జ్యోత్స్న సింగ్ ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ‘పేదలు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ బస్సులు, ఆటోల నుంచి వచ్చే ఉద్గారాలతో జనం బాధపడుతున్నారు. ఇవి కాలుష్యానికి 80 శాతం దోహదం చేస్తాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు రావాలి’ అని అన్నారు. ‘ప్రతి శీతాకాలంలో నాకు రక్తం పడేలా దగ్గువస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. ప్రభుత్వం ఇలాంటివాటిని పట్టించుకోదు. పంజాబ్ రైతులను లేదా గత పాలనను నిందిస్తూనే ఉంటుంది’ అంటూ డీయూ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
అని మరో నిరసనకారిణి ప్రేరణ మెహ్రా ‘కాలుష్యం పెరిగిన తరుణంలో ఏక్యూఐ పర్యవేక్షణ కేంద్రాల దగ్గర నీటిని చల్లుతున్న వీడియోలను చూసిన తర్వాత నేను ఒక దానిని నమ్మలేకపోతున్నాను. ఎవరైనా సంఖ్యలను తప్పుదారి పట్టిస్తున్నారా? లేదా నీటిని వ్యర్థం చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. వసంత్ కుంజ్‌కు చెందిన 76 వృద్ధుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజలు అవే బాధలను ఎదుర్కొంటున్నారు. నా మనవళ్ల కోసం నేను ఆందోళన చెందుతున్నాను. ప్రతిచోటా నిర్మాణాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది’ అని అన్నారు.

నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ కార్యకర్త విమ్లేందు ఝా ఈ అణిచివేతను ఖండించారు. 15 రోజులుగా లాక్‌డౌన్ లేదు, షట్‌డౌన్ లేదు కేవలం క్లౌడ్ సీడింగ్ లాంటి పనులు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీ మహలా మాట్లాడుతూ తాము భద్రతను కాపాడేందుకు కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి
NTR
- ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 20257
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీ ఆర్‌ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం ట్రైనీ ఐఏఎస్‌లు ఏడుగురు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వారితో పలువురు అధికారులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యభగవానుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమ స్కారాలు, సూర్యోపాసన సేవ జరిపించారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఎంఈవోల ఇష్టారాజ్యంవన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యారంగంలో విద్యార్థులకు మేలు చేసేందుకు అవసరమైన పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాశాఖాధికారులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి మరోవైపు తమకిష్టమైన రీతిలో లంచాలకు అలవాటుపడి మామూళ్ల మత్తులో ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిపై పదేపదే ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలకు ఎంఈవో–1లు తొమ్మిది మంది, ఎంఈవో–2లు 20 మంది కొనసాగుతున్నారు. 20 మండలాలకు కేవలం తొమ్మిది మంది మాత్రమే మండల విద్యాశాఖాధికారులు పని చేయటం సైతం వారి ఆదాయానికి అండగా నిలుస్తోంది. ఒక్కొక్క ఎంఈవో–1కు నాలుగైదు మండలాలు కేటాయించటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. అందులోనూ ఎంఈవో–1లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలాలు చాలా సుదూర ప్రాంతాలు కావటంతో వారి పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉంటుందనే వాదనలు ఉన్నాయి.
ఉపాధ్యాయుల నుంచీ వసూళ్లు..
జిల్లాలో సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి పనికి ఎంఈవోలు రేటు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీస్ విషయాలు, బిల్లు తయారీ తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోల వసూళ్లు మాములుగా ఉండదని పలువురు గురువులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల విషయంలోనూ ఎంఈవోలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయా టీచర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోరు..
జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులపై ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలోని ఒక ఎంఈవో ప్రైవేట్ విద్యాసంస్థకు వెళ్లి తనకు భారీగా ముడుపులు కావాలని బేరం పెట్టి విసిగించాడు. దాంతో ఆ విద్యాసంస్థ యాజమాన్యం నేరుగా అక్కడి నుంచే జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా చర్యలు చేపట్టడం లేదు. అంతేకాకుండా సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు సైతం బిల్లులు తయారు చేశారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఆ ఆరోపణలపై విచారణకు అధికారులు ఆదేశించారు. అయితే ఆ తరువాత దానిని బుట్టదాఖలు చేశారని తెలిసింది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో వాస్క్యూలర్ వాక్‌థాన్ నిర్వహించారు. గవర్నర్ పేటలోని ఐఎంఏ హాలు వద్ద ఈ వాక్‌థాన్‌ను కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు వరకూ వెళ్లి, తిరిగి ఐఎంఏ హాలుకు చేరుకుంది.
నిర్లక్ష్యం వద్దు..
కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ వాస్క్యూలర్ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్ థాన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రముఖ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కిరణ్ మాకినేని మాట్లాడుతూ వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో 800 మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో అంప్యూటేషన్ ఫ్రీ ఇండియా నినాదంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్‌థాన్ నిర్వహించినట్లు తెలిపారు. అంప్యూటేషన్‌లు 80 శాతం మందిలో మందులు వాడటం, జాగ్రత్తలు పాటించడం, రక్తనాళాలకు చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చన్నారు.. న్యూరోపతి, వాస్క్యూలోపతి, డయాబెటిస్ ఉంటే కాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, వాస్క్యూలర్ సర్జన్స్ పాల్గొన్నారు.
విజయవాడలో ఉత్సాహంగా
వాస్క్యూలర్ వాక్‌థాన్
మార్గనిర్దేశం చేసిన కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఈ అవగాహన మున్ముందు విధి నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు మూడు బృందాలుగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సమావేశం నిర్వహించారు.
అధికారులు సహకరించండి..
ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ఎస్‌ఆర్పీ) కింద ఆరు రోజుల క్షేత్ర పర్యటనను విజయవంతంగా పూర్తిచేసేందుకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు, మండలాలు, గ్రామాల వివరాలతో పాటు సాంస్కృతికంగా, పర్యాటకంగా కీలక ప్రాంతాల గురించి వివరించారు. టూర్ షెడ్యూల్‌కు అనుగుణంగా జరిగే క్షేత్ర పర్యటనలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్యం.. ఇలా వివిధ శాఖల అధికారులతో సమావేశాలతో పాటు స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన పెంపొందించేలా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఏ పీడీ ఏఎన్‌ఏవీ నాంచారరావు, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కరవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ అన్నారు. స్థానిక ముత్యాలంపాడులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.ప్రభుదాస్‌తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కరవటం వల్ల ఆరుగురు విద్యార్థులు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్య విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పరిపాలన, ప్రజా సంక్షేమంపై కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని.. రాజకీయాలకు కాదని హితవు పలికారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి విజయవాడ నుంచి కన్యాకుమారి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. ఆ సమయంలో రైల్వేస్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం, పార్శిల్ కార్యాలయం గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తపు గాయాలతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై వచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, బ్లాక్ కలర్ జీన్స్, వైట్ కలర్ ఫుల్‌హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
చల్లపల్లి: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని అందిపుచ్చుకుని స్వచ్ఛ చల్లపల్లిని ప్రారంభించి ఉద్యమంగా ముందుగు తీసుకువెళుతూ అందరికీ ఆదర్శంగా నిలవటం అభిందనీయమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం స్వచ్ఛ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణయ్య, కలెక్టర్ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి(హైదరాబాద్) వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీ గురవారెడ్డి, విజయవాడకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కాలేషావలి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా 216 జాతీయ రహదారిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నూతనంగా జంక్షన్ పాయింట్‌లో ఫ్లడ్‌లైట్ల స్థంభాన్ని అతిథులచే ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శ్మశానవాటిక, వర్మీ కంపోస్టును, డంపింగ్ యార్డును తిలకించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డు వద్ద అందరూ గ్రూప్ ఫొటో దిగారు. గతంలో స్వచ్ఛ కార్యక్రమానికి ముందు తరువాత చల్లపల్లి పరిసరాల ఫొటోలను వైద్యులు డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు చూపించారు.
యువతను ప్రోత్సహించాలి..
అనంతరం స్వగృహ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులను, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలలో యువతను ప్రోత్సహించాలని తద్వారా భవిష్యత్తులో కూడా ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగటానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కాలేషావలి మాట్లాడుతూ.. సమాజంలో పేరుకుపోయిన చెత్తను తొలగించటం వల్ల దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త తన ప్రవచనాల్లో పేర్కొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలె నాగమణి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలుష్య నియంత్రణ
బోర్డు చైర్మన్ కృష్ణయ్య
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్ర హాస్పిటల్స్‌లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 2 నుంచి 8 వరకూ నిర్వహించిన శిబిరంలో 9 మందికి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో స్పెయిన్‌కు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బోస్కో మోస్కోసోతో పాటు పిడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్‌లు, డాక్టర్ ఫిలిప్, డాక్టర్ ఐతోర్ లోపెజ్, నటాలియా సొరొళ్ల, లారా పాల్గొని చిన్నారులకు సర్జరీలు చేశారని తెలిపారు. రిప్లేస్ మెంట్ ఆఫ్ మైట్రల్ వాల్వ్, సూడో ఎన్యూరిసం, డీఓఆర్వీ + టెట్రాలజి ఆఫ్ ఫాలో వంటి అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న తొమ్మిది మందికి విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు డాక్టర్ రామారావు తెలిపారు. సమావేశంలో పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్, డాక్టర్ నాగేశ్వరరావులతో పాటు కార్డియాక్ ఎనస్థిస్ట్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.
మంత్రి పార్థసారథి ఎస్కార్ట్ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి
గుడివాడరూరల్/కోనేరుసెంటర్: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఎస్కార్ట్ ఎస్‌ఐ ఆర్.ఎస్.రంగనాథరావు(60) ఆదివారం గుడివాడలో గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి పార్థసారథి మచిలీపట్నం నుంచి నూజివీడు వెళ్తుండగా ఎస్కార్ట్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రంగనాథరావు ప్రయాణంలో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఆయనను సిబ్బంది తరలించగా వైద్యులు వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. ఆయన స్వగ్రామం అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం. ఎస్‌ఐ రంగనాథరావుకు గతంలో ఓ సారి హార్ట్‌సర్జరీ జరిగిందని సిబ్బంది తెలిపారు. రంగనాథరావు మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి ఎస్‌ఐగా పని చేస్తూ మంత్రి ఎస్కార్ట్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ఐ మృతి చెందారన్న సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎస్‌ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, డీఎస్పీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
గుడివాడరూరల్: ఆస్తి తగదాల నేపథ్యంలో అన్నను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్ చేశామని గుడివాడ రైల్వే సీఐ ఎంవీ దుర్గారావు ఆదివారం తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఈ నెల 3న గుడివాడ రైల్వేస్టేషన్ సమీపంలోని ధనియాలపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని సమాచారం వచ్చిందన్నారు. రైల్వే ఎస్‌ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో మచిలీపట్నం, గుడివాడ రైల్వే ఎస్‌ఐలు మహబూబ్ షరీఫ్, శివనారాయణలను తమ సిబ్బందితో విచారణ ప్రారంభించామన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాలు, సెల్ టవర్ డంప్, సీడీఆర్, ఫోన్‌పేల ఆధారాలను సేకరించామన్నారు. బిహార్‌కు చెందిన సోనూకుమార్ సహనీ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి మందపాడు ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
రైల్వే సిబ్బందికి అభినందన..
నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌లో తన అన్న పప్పుసహానీ(28)తో ఆస్తి విషయంలో మనస్పర్థలు ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో ఇటీవల గుడివాడ మండలం చిన ఎరుకపాడు వద్ద సీడ్ కంపెనీలో పనికి చేరానని, తన అన్న పనుల నిమిత్తం మైసూర్ వెళ్లాడన్నారు. ఈక్రమంలో తన అన్న మైసూర్‌లో పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారని తెలపగా తాను గుడివాడలో కూలీలు ఉన్నారని తీసుకువెళ్లేందుకు తన అన్నను రావాలని కోరానన్నారు. ఈక్రమంలో ముందుగానే తాను వేసుకున్న పథకం ప్రకారం తన అన్న ఈ నెల 3న తెల్లవారు జామున గుడివాడ రాగానే ధనియాలపేట వద్దకు తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. వారం రోజుల్లోనే హత్య కేసును చేధించిన రైల్వే ఎస్‌ఐలు మహబూబ్ షరీఫ్, శివనారాయణ, ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ షేక్ అక్బర్, సిబ్బందిని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
జి.కొండూరు: జి.కొండూరు మండల పరిధి కవులూరు గ్రామ శివారులో ఉన్న ఎన్‌సీఎల్ బ్రిక్స్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో ప్రధాన భాగమైన 250 టన్నుల బరువుతో ఉండే భారీ ఫ్లైయాష్ ట్యాంకు ఆదివారం మధ్యాహ్న సమయంలో కూలిపోయింది. భోజన విరామంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ కంపెనీలో షిఫ్ట్‌కు 40 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లలో రోజుకు 120 మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు. ప్రమాద సమయంలో కూడా 40 మంది కార్మికులు విధులలో ఉన్నప్పటికీ భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గత ఆరేళ్లుగా ఇప్పటి వరకు ఇది మూడో ప్రమాదంగా తెలుస్తోంది. గతంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. యాజమాన్య నిర్లక్ష్యంతో నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. యంత్రాలను మెయింటెనెన్స్ చేయాలని సిబ్బంది చెప్పినప్పటికీ యాజమాన్యం వారి మాటలను పెడచెవిన పెట్టి ఉత్పత్తిపైనే దృష్టి సారించడం వల్లన ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసి ఉత్పత్తిపైనే దృష్టి సారించిన ఎన్‌సీఎల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఇదే తీరు కొనసాగిస్తే కార్మికులతో కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగుతామని నాయకులు హెచ్చరించారు.
ఎన్‌సీఎల్ బ్రిక్స్ కంపెనీలో కూలిన భారీ ఫ్లైయాష్ ట్యాంకు
పటమట(విజయవాడతూర్పు): అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్రస్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఏపీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. టౌన్‌ప్లానింగ్‌కు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కావడం లేదని, పట్టణాల్లో ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు కలిపిస్తే క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని సూచించారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులకు నూతనంగా సర్వీస్ రూల్స్ ఏర్పాటుపై ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. అసోసియేషన్ కార్యదర్శి మోహన్‌బాబు మాట్లాడుతూ.. అసోసియేషన్‌ను మరింత సమర్థంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డైరీ రూపకల్పనపై సూచనలు చేశారు. జోనల్ అధ్యక్షుడు వసీంబేగ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
పామర్రు: 104 వాహనాల ఉద్యోగులకు గత కాంట్రాక్ట్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాట్యూటీ, ఈఎల్ బకాయిలను ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీఆర్ ఫణికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూనియన్ కృష్ణా జిల్లా బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఫణికుమార్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత యాజమాన్యం భవ్య హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇప్పటి వరకు నియామక పత్రాలు, పే స్లిప్పులు ఇవ్వకుండా ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తూ పని చేయించుకుంటోందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 104 సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు అదనపు పని భారం తగ్గించాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు, జీవో 7 ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐలను సక్రమంగా చెల్లించాలని కోరారు. వాహనాలకు ఇన్సూరెన్సు, ఫిట్‌నెస్‌లు వెంటనే చేయించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఓ గంగాధర్ మాట్లాడుతూ.. కార్మికుల పోరాటాలకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ జనరల్ సెక్రటరీ డి.విజయ్, యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, 104 సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో మన జట్టు దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించిందని, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం అని వక్తలు పిలుపునిచ్చారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము అధ్యక్షతన ఆదివారం మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలను అభినందిద్దాం–క్రీడా అభివృద్ధిపై చర్చిద్దాం అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ ప్రపంచకప్‌లో ఒక్కో మహిళా అగ్గిపిడుగులై గర్జించారని కొనియాడారు. భవిష్యత్తులో మహిళా క్రీడాకారులకు ఇది ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. యువతను డ్రగ్స్, గంజాయి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, తగినంత కోచ్‌లు లేరని చెప్పారు. హర్యానా లాంటి రాష్ట్రంలో 400మంది కోచ్‌లు ఉంటే మన రాష్ట్రంలో నలుగురు మాత్రమే ఉన్నారన్నారు. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు స్పోర్ట్స్ పాఠశాల, స్పోర్ట్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించడంతో పాటు జీవో నంబర్ 74ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కోచ్ ప్రసాద్, లెక్చరర్ ఎస్.లెనిన్‌బాబు, జేవీవీ, డీవైఎఫ్‌ఐ నాయకులు శ్రీను, శోభన్, రవి, రమణ, శివ, పి.కృష్ణ, నరసింహ, ప్రసాద్, కృష్ణకాంత్ పాల్గొన్నారు.
West Godavari
● 12న భారీ ర్యాలీలు
● మాజీ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి 5 కళాశాలలు పూర్తి చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనిని అడ్డుకుంటామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. పులివెందులలో 150 మెడికల్ సీట్లు వచ్చి నా వెనక్కి పంపారని, నేడు అదే వైద్య కళాశాల నుంచి వైద్య సామగ్రి, పరికరాలను గుంటూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారని విమర్శించారు. మెడికల్ కాలేజీలను పెత్తందారులకు దారాదత్తం చేస్తున్నారని, దీనిని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో ఈనెల 12న భారీ ర్యా లీలు నిర్వహించి తహసీల్దార్‌కు వినితపత్రం అందించనున్నామన్నారు. అసలు వైద్య కళాశాలలే లేవ ని నమ్మించాలని చూసిన కూటమి నేతలను నేడు మెడికల్ సీట్లు ఎందుకు వచ్చాయని నిలదీశారు. పాలకొల్లులో మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. 12న జరిగే ర్యాలీలో సీపీఐ, సీపీఎం పార్టీలు, ప్రజలు పాల్గొంటున్నారన్నారు.
చోద్యం చూస్తున్న ఎమ్మెల్యేలు
తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతే ప్ర భుత్వం చోద్యం చూస్తోందని, ఎమ్మెల్యేలు దోచు కున్న డబ్బును దాచుకునేందుకు విదేశాలకు వెళుతున్నారని కారుమూరి విమర్శించారు. తణుకు ఎమ్మెల్యే ఇంతవరకూ వరిచేల గట్టు తొక్కలేదని, రైతులు ఎలా ఉన్నారని అడిగిన పాపానపోలేదని మండిపడ్డారు.
పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జి ల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ముళ్లపూడి బాబూరావు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వ అరాచకాలను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. పట్టణంలోని కొట్టు క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ పేదలకు వైద్యం వేగవంతంగా అందించాలనే ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చి ఐదు నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధంగా, 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు బేరసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దోచుకోవడానికి అన్నట్లు అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో 85 వేల బెల్టుషాపులు నిర్వహిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నోరు మెదపడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే పారితోషకాలతో కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడానికి ధైర్యం సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఈనెల 12న వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పథకాలకు తూట్లు
పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే భయంతో జగన్ పేరును జపం చేయడం కూటమి శ్రేణులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముప్పడి సంపత్‌కుమార్, మోషే, సిర్రాపు శాంతకుమార్, కనుపూరి భాస్కర్, కట్టా నాగరాజు, అరిగెల అభిషేక్, గుండుమోగుల సాంబయ్య, తగరంపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఏలూరు టౌన్: స్థానిక ఎంసీహెచ్ భవనంపై అంతస్తులోని హాస్టల్‌ను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రి ఆదివారం పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థినులు ఆరా తీశా రు. ఎలుకలు కరిచిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎలుకల కోసం సిబ్బందితో బోనులు ఏర్పాటు చేయించారు. కొన్నిచోట్ల కిటికీలు, తలుపులకు రంధ్రాలు ఉండటంతో వాటిని మూయించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామనీ, ఆందోళనకు గురికావద్దని భరోసా కల్పించారు. కాంట్రాక్టర్‌తో గతంలో ర్యాట్‌మ్యాట్‌లు పెట్టించటంతోపాటు, స్ప్రే చేయించామనీ, ఎలుకల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టేలా కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చే శారు. హాస్టల్‌లో పరిస్థితులపై వైద్య విద్యా ర్థు లు, వార్డెన్స్‌తోనూ మాట్లాడతామనీ, విచార ణ అనంతరం చర్యలు చేపడతామని చెప్పారు.
Visakhapatnam
వైజాగ్ మాల్యాబ్యాంకులపైనా
బెదిరింపుల అస్త్రాలు..!
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలే కాదు... కొంత మంది వ్యక్తుల దగ్గరా చేబదులుగా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 సార్లకు పైగా డిఫాల్టర్‌గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్ మాల్యా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫైనాన్స్ సంస్థల్ని బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇటీవల డిఫాల్టర్‌గా మారారంటూ.. జప్తుకు ముందు ఇచ్చే నోటీసులు సదరు ఎమ్మెల్యే మాల్యాకు కొన్ని బ్యాంకులు ఇచ్చాయి. వెంటనే బ్యాంకు ప్రతినిధుల్ని తన కార్యాలయానికి రప్పించుకొని.. వారిపైనా బెదిరింపుల అస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురిస్తే.. తన ఇమేజీ డ్యామేజీ అవుతుందని, చిన్న చిన్న పత్రికల్లో నోటీసులిచ్చి వదిలెయ్యాలని చెప్పినట్లుగా బ్యాంకింగ్ వర్గాలు వాపోతున్నాయి. నోటీసులు ప్రచురించబోమని, డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరుతున్న బ్యాంకులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో బ్యాంకు స్థానిక అధికారులు.. సదరు వైజాగ్ మాల్యా ఎమ్మెల్యే పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ నోటీసుల వ్యవహారం తమకు సంబంధం లేదని, రీజినల్ కార్యాలయం నుంచే పరిష్కరించుకోవాలంటూ కొన్ని బ్యాంకుల అధికారులు హెడ్ ఆఫీస్‌కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రుణాలు ఎగ్గొట్టడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సదరు ఎమ్మెల్యే తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ రుణాలిచ్చిన సంస్థలకే కన్నం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైజాగ్ అంతా కోడై కూస్తోంది.
మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశాడు. అలాంటి మాల్యానే.. మన వైజాగ్‌లోనూ ఉన్నాడు. ఈ మాల్యా మాత్రం పారిపోలేదు. అపరిచితుడిలా భిన్న పార్శ్వాలు ప్రదర్శిస్తున్నాడు.
కానీ..మన వైజాగ్ మాల్యాలో మాత్రం రెండు కోణాలున్నాయి...
ఎన్నికల ముందు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు.
ఇప్పుడు.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అప్పులిచ్చిన బ్యాంకుల్నే బెదిరిస్తున్నకై ంకర్యుడు.
సాక్షి, విశాఖపట్నం :
ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. డబ్బు తిరిగి చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ.. నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది ఓ కూటమి ఎమ్మెల్యేకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్ కంపెనీల దగ్గర సదరు ఎమ్మెల్యే.. ఓ డిఫాల్టర్ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ డిఫాల్టర్ అనే ముద్ర వేసుకుంటూ.. ఈవీఎంల గాలిలో గెలిచిన మాల్యా.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలకు ఆద్యుడిగా మారుతున్నారు.
ఆది నుంచీ అవే మోసాలు..!
ఏ బ్యాంకు కనిపించినా.. ఏ ఫైనాన్స్ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తిరగడమే సదరు ఎమ్మెల్యే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. చిట్‌ఫండ్ కంపెనీల్లో డబ్బులు పాడుకొని వాటిని ఎగ్గొట్టేందుకు యత్నించగా కోర్టు మొట్టికాయలు వెయ్యడంతో వాటిని చెల్లించారు. చిట్‌ఫండ్ సంస్థలకు ఎగనామం పెట్టిన వైజాగ్ మాల్యా... 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ప్రతి ఫైనాన్స్ సంస్థ దగ్గర కోట్ల రూపాయల రుణాలు తీసుకొని వాటికి శఠగోపం పెట్టేశారు. చివరికి కోర్టులని ఆశ్రయించిన కొన్ని సంస్థలు.. ఈయన దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో.. ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి.
వైజాగ్ పోర్టులో కింగ్ అవుతా..!
షిప్పింగ్ కంపెనీని నడుపుతున్న కూటమి ఎమ్మెల్యే దాన్ని కొనసాగించేందుకే పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని అటు బ్యాంకుల్ని.. ఇటు పోర్టుని శాసించాలని యత్నిస్తున్నారు. వైజాగ్ పోర్టులో షిప్పింగ్ కాంట్రాక్టులు పొందేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. షిప్పింగ్ కాంట్రాక్టులు తన సంస్థకే ఇవ్వాలనీ.. లేదంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పి.. బదిలీ చేస్తానంటూ కొందరు పోర్టు అధికారులతో వాగ్వాదం పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోర్టులో తానే కింగ్ అవుతానంటూ విర్రవీగుతున్నారని సమాచారం.
అప్పులిచ్చిన బ్యాంకుల్ని బెదిరిస్తున్న కూటమి ఎమ్మెల్యే పోర్టులో కాంట్రాక్టుల కోసం బ్యాంకుల్లో రుణాలు నిర్ణీత సమయాల్లో చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ఎమ్మెల్యే బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురించొద్దంటూ ఆదేశాలు
రుణం చెల్లించే సమయం చెప్పకుండా బ్యాంకులపై పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే మాల్యా
భీమునిపట్నం: భీమిలి తీరంలో మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరు బాలురను రక్షించారు. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జశ్వంత్, కర్రి అజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భీమిలి బీచ్‌కు వచ్చారు. వీరు సరదాగా సముద్రంలో స్నానానికి దిగగా.. ఒక్కసారిగా అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు వెంటనే స్పందించారు. వేగంగా నీటిలోకి వెళ్లి ఆ బాలురిద్దరినీ క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. మైరెన్ సీఐ శ్రీనివాసరావు ఆ బాలురను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రమాదకరమైన తీర ప్రాంతాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
మహారాణిపేట: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ వారం రద్దు అయినట్టు కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున 10వ తేదీన జరగాల్సిన పీజీఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం 17వ తేదిన యథావిధిగా పీజీఆర్‌ఎస్ ఉంటుందని కలెక్టర్ ప్రకటనలో స్పష్టం చేశారు.
జీవీఎంసీలో కూడా..
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్టు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
పోలీసు కమిషనరేట్‌లో..
అల్లిపురం: సోమవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
మహారాణిపేట: ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌తో కలిసి ఆదివారం ఈ పనులను పరిశీలించిన ఆయన, వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున, అధికారులు సమన్వయం వహించుకుని, నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రధాన వేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్ వసతి వంటి అంశాలపై ఆయన సూక్ష్మ స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చేయాల్సిన పనులపై ఆయన అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడా గ్యాప్ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే జీవీఎంసీ సీఈకి పలు అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై, మార్పులు చేర్పులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీసీపీ మణికంఠ చందోలు, జీవీఎంసీ సీఈ సత్యనారాయణరాజు, సీఎంవో డాక్టర్ నరేష్ కుమార్, సీఐఐ ప్రతినిధి మౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మురళీనగర్: ప్రతి రోజూ భగవద్గీత పఠనం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఎన్‌జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చిన్న పిల్లలు భగవద్గీత చదివితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. జ్యోతిష్యం, ఆగమ శాస్త్రాలను తప్పక గౌరవించాలని సూచించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వల్ల పుణ్యం కలుగుతుందని పిలుపునిచ్చారు. మనసును నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేయాలని తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు, ఈవో బి.ప్రసాద్ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ వైభవుడిని దర్శించుకుని పూజలు చేసి, అంతరాలయంలో కాసేపు ధ్యానం చేశారు. బీజేపీ నేత శ్యామలాదీపిక, అర్చకులు శేషాచార్యులు, వాసుదేవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
మరో ఐదు రోజుల్లో భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో, ఏర్పాట్లు ‘ఆహా.. ఓహో’ అన్నట్టు ప్రచారం పీక్స్‌కి చేరుకుంది. అయితే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దే రోడ్ల దుస్థితి అధికారులను వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే రోడ్లు అత్యంత ప్రమాదకరంగా మారినా, ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. రామ్‌నగర్ ప్రాంతంలో యూజీడీ పనుల కోసం రెండు నెలల క్రితం రోడ్లను తవ్విన కాంట్రాక్టర్, పనులు పూర్తయినా రోడ్లను మాత్రం తిరిగి మరమ్మతులు చేయలేదు. కేవలం పిక్క వేసి వదిలేశారు. దీని ఫలితంగా నెల రోజులుగా రామ్‌నగర్ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహన చోదకులకు ఇది ప్రమాదకరంగా మారింది. పిక్క వేసి వదిలివేయడం వలన, రోడ్డుపై వాహనాలు జారిపడిపోతున్నాయి. దీని వలన ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నగరంలో అతి ముఖ్యమైన భాగస్వామ్య సదస్సుకు అతిథులు వస్తున్న తరుణంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రామ్‌నగర్ ప్రాంతంలోని రహదారులను మెరుగుపరచాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. - బీచ్‌రోడ్డు
పీఎం పాలెం : వారాంతపు వినోద కార్యక్రమాల్లో భాగంగా శిల్పారామం (జాతర)లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. నగరంలోని నృత్య కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వినాయక స్తుతి గీతానికి కూచిపూడి నృత్యంతో ప్రారంభించి... శ్లోకాంజలి, నటరాజ స్తోత్రం, కృష్ణా పాట, అర్ధ నారీశ్వర, కనక దుర్గమ్మ నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. కళాకారులు దేవిజ్ఞ, బాశివకా, రాధ, రాధిక, శిరీష, ధ్రుతి, సహస్ర, శిరీష సౌమ్య తదితర కళాకారులు పాల్గొనగా పి.రమ్య నృత్య దర్శకత్వ వహించారు. స్థానిక పరిపాలన అధికారి రమేష్ రెడ్డి పర్యవేక్షించారు.
సీతంపేట: బాల్యం కేంద్రాలకు వచ్చే పిల్లలను ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం అన్నారు. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలోని జీవీఎంసీ ప్రైమరీ పాఠశాలలో జీవీఎంసీ బాల్యం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, సూపర్‌వైజర్లకు రెండు రోజుల పాటు జరిగిన అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలన్న సంకల్పంతో పెద్ద బాలశిక్షలోని 8 పర్వాలను ప్రామాణికంగా తీసుకుని పుస్తకాన్ని రూపొందించడం హర్షణీయమన్నారు. దీనిపై రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు, సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం చాలా ఉపయుక్తమని, దీనివల్ల ఉపాధ్యాయులకు సబ్జెక్టుపై మరింత అవగాహన పెంచినవారమవుతామని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన ఉపాధ్యాయులకు సీతారాం, బాల్యం ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆవుపాటి మోహన్‌కుమార్, తెలుగు పండిట్ హైమావతి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఆరిలోవ: పవిత్ర కార్తీక మాసం మూడవ ఆదివారం నగరంలోని పర్యాటక కేంద్రాలు జనసంద్రంగా మారాయి. కై లాసగిరి, ఇందిరా గాంధీ జూ పార్క్, ముడసర్లోవ వంటి ప్రాంతాలు వేలాది మంది సందర్శకులతో కోలాహలంగా కనిపించాయి. అయితే కంబాలకొండ మాత్రం వెలవెలబోయింది. కార్తీక మాసం కావడంతో, కుటుంబ సమేతంగా వనభోజనాలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో జూ పార్కుకు తరలివచ్చారు. పచ్చని చెట్ల నీడన భోజనాలు చేస్తూ, వన్యప్రాణులను చూస్తూ ఆనందంగా గడిపారు. అడవి దున్నలు, పులులు, ఏనుగులు, కోతులు వంటి జంతువులు ఎన్‌క్లోజర్‌లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను ఆకట్టుకున్నాయి. లవ్‌బర్డ్స్, ఆఫ్రికన్ పేరెట్స్, నెమళ్ల జోన్ల వద్ద పక్షుల కిలకిలరావాలు పిల్లలను, పెద్దలను అలరించాయి. ఆదివారం ఒక్కరోజే 7,865 మంది జూ పార్కును సందర్శించారు. వీరి ద్వారా రికార్డు స్థాయిలో రూ. 6,07,640 ఆదాయం లభించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. అయితే ఈ పార్కుకు సమీపంలోనే ఉన్న కంబాలకొండ ఎకో టూరిజం పార్కు మాత్రం సందర్శకులు లేక వెలవెలబోయింది. కార్తీక మాసం వనభోజనాలకు పేరొందిన ఈ ప్రాంతంలో ఈ వారం ఆ సందడి కనిపించలేదు. కేవలం 500 మంది సందర్శకులు మాత్రమే పార్కుకు వచ్చారని సిబ్బంది తెలిపారు. వారి ద్వారా కేవలం రూ. 42,000 ఆదాయం లభించిందన్నారు. అటవీశాఖ అధికారులు కంబాలకొండ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, సందర్శకులను ఆకట్టుకునే వినోద కార్యక్రమాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడమే ఈ నిరాదరణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
కై లాసగిరి కిటకిట
కై లాసగిరికి వేలాది మంది ప్రజలు కుటుంబాలతో తరలివచ్చి వనభోజనాలు చేశారు. కార్లు, ఆటోలు వంటి వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పిల్లలు ఆట పరికరాల వద్ద, పెద్దలు కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు ఆడుతూ సరదాగా గడిపారు. వ్యూ పాయింట్, శివ పార్వతుల విగ్రహాల వద్ద ఎక్కువ మంది ఫొటోలు తీసుకున్నారు.
ఆటలాడుతున్న పిల్లలు
మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు.
అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం
వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్‌తో ముందుకెళ్తున్నారు.
ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం
టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్
పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్ బి.లూసీ సూచించారు.
జిల్లాలో అందుబాటులో
ఉన్న టీకాలు
ప్రస్తుతం జిల్లాలో పలు రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ బి.లూసీ తెలిపారు. డీపీటీ, ఎఫ్‌ఐపీవీ, ఓపీవీ, హెపటైటిస్ బి, ఎంఆర్, బీసీజీ, పీసీవీ, టీడీ, రోటవైరస్ వ్యాక్సిన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూనివర్సిల్ ఇమ్యూనైజేషన్ ప్రొగ్రామ్‌లో భాగంగా వీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
107 పరుగుల ఆధిక్యంలో తమిళనాడు
విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్–ఏ గ్రూప్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆదివారం ఓవర్ నైట్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 20 పరుగులతో ఆటను ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తమిళనాడు బౌలర్ల ధాటికి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బ్యాటర్లు భరత్ (12), విజయ్ (3), కెప్టెన్ రికీ భుయ్ (4), కరణ్ షిండే (9), అశ్విన్ హెబ్బర్ (13), రాజు (1) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రషీద్ (87 నాటౌట్) ఒక్కడే అద్భుత పోరాటం కనబరిచాడు. సౌరభ్ (30) తో కలిసి కాసేపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డా, మిగిలిన బ్యాటర్లు పృథ్వీ (డకౌట్), సాయితేజ (2) సహకారం అందించకపోవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమిళనాడు జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆల్‌రౌండర్ సందీప్ 4 వికెట్లు, త్రిలోక్, సోను, సాయి కిశోర్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ (డకౌట్) నిరాశపరిచినా, మరో ఓపెనర్ విమల్ (20) కొంత సేపు ఆడాడు. బాలసుబ్రమణ్యం (51) అర్ధ సెంచరీతో రాణించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రదోష్ (26), కెప్టెన్ సాయికిశోర్(0 ) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీ, రాజు చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉంది.
ఏయూ క్యాంపస్: నిత్యం కుటుంబ బాధ్యతలు, ఆఫీస్ పనుల ఒత్తిడితో గడిపే నగర మహిళలు... ఒక్కరోజు ఆ పనులన్నింటికీ బ్రేక్ ఇచ్చి, పూర్తి ఉత్సాహంతో ఆనందంగా గడిపారు. బీచ్‌రోడ్డులోని వీఎంఆర్డీఏ పార్కు వేదికగా ఆదివారం జరిగిన లేడీస్ పిక్నిక్‌లో నగరంలోని వివిధ రంగాలకు చెందిన మహిళలు, యువతులు ఒక్కచోట చేరి సందడి చేశారు. రెట్రో థీమ్‌తో నిర్వహించిన ఈ పిక్నిక్‌లో.. పాత తరం నటీమణులను గుర్తుచేస్తూ మహిళలు ధరించిన వస్త్రధారణ, ఆ హావభావాలతో నిర్వహించిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనాటి ఫ్యాషన్‌కు నేటి తరం హంగులు అద్ది, మహిళలు చేసిన ఫ్యాషన్ వాక్ ఆహూతులను కట్టిపడేసింది. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వింటేజ్ రోల్స్ రాయిస్ కారు వద్ద ఫొటోలు దిగేందుకు మహిళలు ఉత్సాహం చూపించారు. బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన, ప్రత్యేకమైన సెల్ఫీ బూత్ వంటివి కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచాయి. మహిళలందరూ కలిసికట్టుగా ఆటపాటలతో అల్లరి చేస్తూ, తమ దైనందిన జీవితంలోని ఒత్తిడిని మరిచిపోయారు. ఈ సందడి నడుమ.. ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ క్రీడాకారుల విజయాన్ని గుర్తు చేసుకుని, వారిని అభినందించడం విశేషం. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకుడు వీరూ మామ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విందు, వినోదాలతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.
పంచారామ దర్శినికి
బయలుదేరిన ఆర్టీసీ బస్సులు
డాబాగార్డెన్స్: పవిత్ర కార్తీకమాసంలో ఒకే రోజున పంచారామాలు దర్శనం చేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు ఆదివారం ద్వారకా బస్టేషన్ నుంచి బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ద్వారకా బస్టేషన్ డిపో మేనేజర్, సూపర్‌వైజర్ ఈ బస్సులను దగ్గరుండి పంపించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ పంచారామ దర్శినికి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 15, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో అమరావతి(అమరేశ్వరస్వామి), భీమవరం(సోమేశ్వరస్వామి), పాలకొల్లు(క్షీర రామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం(భీమేశ్వరస్వామి), సామర్లకోట(కుమార రామలింగేశ్వరస్వామి)లో దర్శనాలు చేసుకునేందుకు వీలుగా యాత్ర సాగుతుందన్నారు. ప్రయాణ చార్జీలను సూపర్ లగ్జరీకి రూ.2,150గా, అల్ట్రా డీలక్స్‌కు రూ.2,100గా నిర్ణయించారు. www.apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, అలాగే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం భక్తులు 99592 25602 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఇదే నంబరులో శబరిమల యాత్రకు సంబంధించిన టూర్లు, ఆన్‌లైన్ రిజర్వేషన్ల గురించి కూడా తెలుసుకోవచ్చని ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు వివరించారు.
గాజువాక : షీలానగర్ జంక్షన్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపురంలోని మిర్చి వీధికి చెందిన కరుమంచి చిన్న సూర్య ప్రకాష్ (44) హిందూజా పవర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరిన అతడు షీలానగర్ జంక్షన్‌వద్ద పోర్టు రోడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గాజువాక నుంచి ఎయిర్ పోర్టువైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడి తలపైకి లారీ ఎక్కిపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడ్నుంచి లారీతో సహా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానికులతో కలిసి లారీని పట్టుకొన్నారు. అయితే డ్రైవర్ మాత్రం పోలీసుల బారినుంచి తప్పించుకున్నాడు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసును గాజువాక ట్రాఫిక్ సీఐ హుస్సేన్ దర్యాప్తు చేస్తున్నారు.
Warangal
● టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
కాళోజీ సెంటర్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో సంఘం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ భత్యాలు త్వరగా అందించాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను సత్వరమే పరిష్కరించి మండల విద్యాధికారి, జిల్లా ఉప విద్యాధికారి, జిల్లా విద్యాధికారి పోస్టులను రెగ్యులర్‌గా భర్తి చేసి పాఠశాల విద్యను మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనకంటి బా బును సంఘం ముఖ్య సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దార గణేశ్, లచ్చిమల్ల వెంకన్న, యర్రంశెట్టి స్నేహ, చెడుపాక కృష్ణమూర్తి, కందకట్ల సత్యనారాయణ, శ్రీవిద్య, తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్
జెజెబెల్
బారోనెట్
కెమెరాలో సీతాకోక చిలుకలను బంధిస్తున్న అధ్యయన బృందం
టానీ రాజు రకం
రెక్కలు విప్పిన
80 రకాల జాతులు గుర్తించాం..
ములుగు జిల్లా అడవుల్లో జరిగిన సర్వేలో 80 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. అత్యాధునిక కెమెరాల సాయంతో వాటి సంఖ్య, అరుదైన జాతులను గుర్తించాం. వీటితోపాటు రాత్రి పూట సంచరించే చిమ్మటలు (మాత్) గుర్తించడం, వాటికి కావాల్సిన నివాసం, రక్షణ చర్యలపై అటవీశాఖ అధికారులకు వివరించాం.
రంగుల సొబగులు
ములుగు జిల్లాలో 80 నూతన జాతుల గుర్తింపు
● లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో మూడు రోజులు సర్వే
● సెలయేర్ల చాటున దాగి ఉన్న సీతాకోక చిలుకలు
● తెలంగాణలో మొట్టమొదటి అధ్యయనం
భవిష్యత్ తరాల కోసమే..
భవిష్యత్ తరాలకు జీవరాశులు, కీటకాల గురించి తెలియజేసేందుకే తెలంగాణలో మొదటిసారి అధ్యయనం చేశాం. ప్రకృతితో మమేకమై మా పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.
– చిత్రశంకర్,
సైంటిస్ట్, ఎంటమాలజిస్ట్
ఏటూరునాగారం: పూల గనిపై మధుబనిని పీల్చుకునే సప్తవర్ణాల సొగసులు. పట్టుకునేలోపే జారిపోయే పగడాల జీవులు.. ఇంద్రధనస్సు ఇలపై విహరిస్తోందా అన్నట్లుండే సీతాకోక చిలుకలు. పచ్చని వనాల నడుమ మకరందాలు ఆరగిస్తుండగా.. ప్రకృతితో మమేకమైన పరిశోధకులు కెమెరాల్లో క్లిక్‌మనిపించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ములుగు జిల్లా లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో చేసిన అధ్యయనం ఆదివారంతో ముగిసింది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్‌తోపాటు మరికొంత మంది అధ్యయన బృంద సభ్యులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వే చేశారు. 80 రకాల నూతన జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌కు నివేదిక అందజేశారు. సీతాకోక చిలుకలు మనుగడ కొనసాగించేందుకు అడవుల్లో పూల మొక్కలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
– ఇందారం నాగేశ్వర్‌రావు,
ఓరుగల్లు వైల్డ్ లైఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు
సాక్షిప్రతినిధి, వరంగల్:
కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్ సప్లయీస్ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.
ఏసీకేల వారీగా వసూళ్లు..
31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం ఆ శాఖ అధికారుల్లో చర్చనీయాంశమవుతోంది.
ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
సీఎంఆర్ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు
ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే.. మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ప్రభుత్వానికి చేరని కస్టమ్ మిల్లింగ్ రైస్.. నాలుగేళ్లుగా పెండింగ్
ఏసీబీ అడిషనల్ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్ పేషీకి సీఎంఆర్ దందా
రంగంలోకి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముగిసిన మోడల్
యునైటెడ్ నేషన్స్
హసన్‌పర్తి: అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్స్ (ఎస్సార్‌యూ–ఎంయూఎన్) కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఇందులో 9 మంది అంతర్జాతీయ కౌన్సిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ దేశాల సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. ఎస్సార్ యూనివర్సిటీ విద్యార్థుల్లో ప్రపంచ దృక్పథం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతతో కూడిన నాయకత్వాన్ని పెంపొందించాలనే నిబద్ధత ప్రతిబింబించింది. ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ ఎల్.గుణాకర్‌రావు, ఎన్.మహేందర్, డాక్టర్ రమేశ్, ఎస్సార్ యూ–ఎంయూఎన్ సెక్రటరీ మాస్టర్ శాంతం శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.
‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: తెలంగాణ రచయితల సంఘం వరంగల్ శాఖ, మిత్రమండలి ఆధ్వర్యంలో ‘కవిత్వంతో కలుద్దాం’ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. హనుమకొండ భీమారంలోని చాణక్యపురిలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి, డాక్టర్ లంకా శివరామప్రసాద్ రచించిన ‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళోజీ పురస్కార గ్రహీత నెల్లుట్ల రమాదేవి ‘చావుకు కళ లేదు’ అనే కవితను వినిపించారు. కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపురం దేవేందర్, కవులు బాలబోయిన రమాదేవి, మాదారపు వాణిశ్రీ, అనితారాణి, నాగవెల్లి జితేందర్, రాములు, రామ బ్రహ్మచారి, గోవర్ధన్‌రెడ్డి, మైస ఎర్రన్న, బిటవరపు శ్రీమన్నారాయణ తదితర కవులు తమ కవితలను వినిపించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.
హన్మకొండ: పెన్షనర్ల సంక్షేమం, వారి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనత వీడాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో తెలంగాణలో మినహా ఏ రాష్ట్రం కూడా ఐదు డీఏలు ఇవ్వకుండా లేదని విమర్శించారు. పీఆర్‌సీ ప్రకటించకుండా తీవ్ర కాలయాపన చేస్తోందని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు అనుమతించాలని, ఐదు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో అసోసియేషన్‌కు సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అసోసియేషన్ వరంగల్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కె.గోపాల్‌రెడ్డి, పరిశీలకుడిగా తిరువరంగం ప్రభాకర్ వ్యవహరించారు. వరంగల్ అధ్యక్షుడిగా శ్రీపాద సోమయ్య, సహ అధ్యక్షుడిగా కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా వరయోగుల సురేశ్, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, మధుసూదన్, జి.బాల, కార్యదర్శులుగా పి.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటరాములు, కోశాధికారిగా రమేశ్, సంయుక్త కార్యదర్శులుగా కేదారి, రామ్మోహనాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కుమారస్వామి, రాంభద్రయ్య, లలిత, పబ్లిసిటీ సెక్రటరీగా యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్లుగా లక్ష్మారెడ్డి, ఈశ్వరమూర్తి ఎన్నికయ్యారు.
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్
అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని మైసూర్ ఆర్‌ఐఈ విద్యావిభాగం ప్రొఫెసర్ బుర్ర రమేశ్ సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ ఎ. సంజీవయ్య విధులు నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని అధ్యాపకులు హనుమకొండలోని డైమండ్‌హిల్స్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సు, సంజీవయ్య అభినందన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. విద్యార్థులను విజ్ఞానం వైపు మరలించేందుకు తరగతి గది ఉపయోగపడాలని పేర్కొన్నారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, రాష్ట్ర మాజీ కార్యదర్శి కడారి భోగేశ్వర్, అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, బైరి సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, సోమయ్య, అధ్యాపకుల జ్వాల సంపాదకుడు డాక్టర్ గంగాధర్‌రెడ్డి, డాక్టర్ ఎం.శంకర్‌నారాయణ, ఆసనాల శ్రీనివాస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సంజీవయ్య అధ్యాపకుడిగా అందించిన సేవలు కొనియాడారు.
విద్యాసదస్సులో మైసూర్ ఆర్‌ఐఈ
ప్రొఫెసర్ బుర్ర రమేశ్
విద్యారణ్యపురి: నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకట్‌రెడ్డి అన్నారు. వృత్తివిద్యలో శిక్షణ పొందిన యువతకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2015 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన వృత్తి విద్యాకోర్సులను 2030 వరకు అన్ని పాఠశాలలకు విస్తరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వృత్తివిద్యా కో–ఆర్డినేటర్ బి.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. వృత్తివిద్యతో యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. అధ్యక్షత వహించిన మర్కజీ హైస్కూల్ హెచ్‌ఎం రామారావు మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు ఆన్‌లైన్‌లో 1,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 682 మంది హాజరైనట్లు తెలిపారు. 24 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 214 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. కాస్మోటిక్ కంపెనీలు, అపోలో ఫార్మసీ, రిటైల్ షాపుల్లో వీరు పనిచేయనున్నారు. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బి.మన్మోహన్, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, ప్రాక్టీసింగ్ హై స్కూల్ ఇంచార్జ్ ఎంఈఓ జగన్నాథం పాల్గొన్నారు.
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి
