నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ సెల్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ సెల్‌

Nov 10 2025 7:16 AM | Updated on Nov 10 2025 7:16 AM

నేడు

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ సెల్‌

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ కోరారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముగిసిన మోడల్‌

యునైటెడ్‌ నేషన్స్‌

హసన్‌పర్తి: అన్నాసాగరంలోని ఎస్సార్‌ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (ఎస్సార్‌యూ–ఎంయూఎన్‌) కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఇందులో 9 మంది అంతర్జాతీయ కౌన్సిల్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ దేశాల సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. ఎస్సార్‌ యూనివర్సిటీ విద్యార్థుల్లో ప్రపంచ దృక్పథం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతతో కూడిన నాయకత్వాన్ని పెంపొందించాలనే నిబద్ధత ప్రతిబింబించింది. ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్‌ ఎల్‌.గుణాకర్‌రావు, ఎన్‌.మహేందర్‌, డాక్టర్‌ రమేశ్‌, ఎస్సార్‌ యూ–ఎంయూఎన్‌ సెక్రటరీ మాస్టర్‌ శాంతం శ్రీవాస్తవ్‌ పాల్గొన్నారు.

‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ ఆవిష్కరణ

హన్మకొండ కల్చరల్‌: తెలంగాణ రచయితల సంఘం వరంగల్‌ శాఖ, మిత్రమండలి ఆధ్వర్యంలో ‘కవిత్వంతో కలుద్దాం’ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. హనుమకొండ భీమారంలోని చాణక్యపురిలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి, డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌ రచించిన ‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళోజీ పురస్కార గ్రహీత నెల్లుట్ల రమాదేవి ‘చావుకు కళ లేదు’ అనే కవితను వినిపించారు. కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపురం దేవేందర్‌, కవులు బాలబోయిన రమాదేవి, మాదారపు వాణిశ్రీ, అనితారాణి, నాగవెల్లి జితేందర్‌, రాములు, రామ బ్రహ్మచారి, గోవర్ధన్‌రెడ్డి, మైస ఎర్రన్న, బిటవరపు శ్రీమన్నారాయణ తదితర కవులు తమ కవితలను వినిపించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ సెల్‌1
1/1

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ సెల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement