దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
వర్ధన్నపేట: రైతులను దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య అన్నారు. సోమవారం మండలంలోని రాంథన్‌తండాలో ఽఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తుందని, ఎవరూ అధైర్య పడవద్దన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంటాలు పూర్తి చేసి వెంటనే ధాన్యం తరలించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దు సత్యనారాయణ, పోశాల వెంకన్న, ఏఓ శిరీష, గడ్డం సమ్మయ్య, గుగులోతు కిషన్‌నాయక్, గుగులోతు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సు కోసమే..
నల్లబెల్లి: రైతు శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని నాగరాజుపల్లి శివారు ఒల్లేనర్సయ్యపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు క్వింటాకు బోనస్ రూ.500 అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దామోదర్ రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ రేణుకాదేవి, తహసీల్దార్ ముప్పు కృష్ణ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


