సహాయం అందించడం అభినందనీయం
న్యూశాయంపేట: వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం భారత సేవాశ్రమ సంఘ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ద్వారా వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ.శ్రీనివాస్‌రావు, ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.
మత్స్య సంఘాల
అభివృద్ధికి కృషి
రాయపర్తి: జిల్లాలో మత్స్య సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో జిల్లా అధికారి శ్రీపతిని రాయపర్తి మత్స్యసంఘం అధ్యక్ష, కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ మత్స్య పారిశ్రామిక సంఘం అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. అంతకుముందు సంఘం సభ్యులు మత్స్యశాఖాధికారిని శాలువాతో స త్కరించారు. కార్యక్రమంలో రాయపర్తి మత్స్యసంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పిల్లి కొంరయ్య, చెవ్వు యాకయ్య, పూజారి సంతోష్, ముద్రబోయిన వెంకన్న, పూజారి రాజసాగర్, పిల్లి మహేందర్, పూస ప్రభాకర్, గాలీబ్ రాజు, సోడెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జీఎంపీఎస్ జిల్లా
అధ్యక్షుడిగా మల్లయ్య
గీసుకొండ: మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చల్ల మలయ్య గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీ ఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సోమవారం సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందార్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా నిరంతరం పోరాటం చేస్తానన్నారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థల (టెమ్రిస్) ఆధ్వర్యంలో వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న పలువురికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులకు ఎంపిక చేశారు. డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేడు (మంగళవారం) హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో అతిథుల చేతుల మీదుగా అందించనున్నారు. ఈ ఉత్తమ అవార్డుకు ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జంగా సతీశ్, ప్రిన్సిఆల్ తాళ్ల నీలిమాదేవి ఎంపికయ్యారు. ఈ మేరకు గురుకులాల విజిలెన్స్ అధికారులు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ
వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు విచారణ చేపట్టారు. ఈనెల 7న కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో అస్తవ్యస్త నిర్వహణను గుర్తించి విచారణకు ఆదేశించారు. దీంతో సోమవారం కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ విజయసాగర్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీసీహెచ్‌ఓ రామ్మూర్తి ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కొంత మంది వైద్యులు సమయపాలన పాటించడం లేద ని, విధుల్లో ఉన్న వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. లీవు పెట్టకుండా గైర్హాజరు కావడంపై వి చారణ అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
సహాయం అందించడం అభినందనీయం


