ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి
● వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు
న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. వీసీలో కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ సాఫీగా సాగుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో 21వేల ఎకరాల్లో 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నష్టం జరిగిందన్నారు. జిల్లాలో 263 కేంద్రాలకు గాను 203 కేంద్రాలు ప్రారంభించామన్నారు. మొక్కజొన్నకు 6, పత్తికి 14 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు సురేఖ, కిష్టయ్య, సంధ్యారాణి, అనురాధ, మనోహర్, శోభన్‌బాబులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా డీఆర్‌డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు.


