వింత షరతులు | - | Sakshi
Sakshi News home page

వింత షరతులు

Nov 10 2025 7:18 AM | Updated on Nov 10 2025 7:18 AM

వింత షరతులు

వింత షరతులు

వైజాగ్‌ మాల్యా

బ్యాంకులపైనా

బెదిరింపుల అస్త్రాలు..!

బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలే కాదు... కొంత మంది వ్యక్తుల దగ్గరా చేబదులుగా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 సార్లకు పైగా డిఫాల్టర్‌గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్‌ మాల్యా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫైనాన్స్‌ సంస్థల్ని బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇటీవల డిఫాల్టర్‌గా మారారంటూ.. జప్తుకు ముందు ఇచ్చే నోటీసులు సదరు ఎమ్మెల్యే మాల్యాకు కొన్ని బ్యాంకులు ఇచ్చాయి. వెంటనే బ్యాంకు ప్రతినిధుల్ని తన కార్యాలయానికి రప్పించుకొని.. వారిపైనా బెదిరింపుల అస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురిస్తే.. తన ఇమేజీ డ్యామేజీ అవుతుందని, చిన్న చిన్న పత్రికల్లో నోటీసులిచ్చి వదిలెయ్యాలని చెప్పినట్లుగా బ్యాంకింగ్‌ వర్గాలు వాపోతున్నాయి. నోటీసులు ప్రచురించబోమని, డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరుతున్న బ్యాంకులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో బ్యాంకు స్థానిక అధికారులు.. సదరు వైజాగ్‌ మాల్యా ఎమ్మెల్యే పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ నోటీసుల వ్యవహారం తమకు సంబంధం లేదని, రీజినల్‌ కార్యాలయం నుంచే పరిష్కరించుకోవాలంటూ కొన్ని బ్యాంకుల అధికారులు హెడ్‌ ఆఫీస్‌కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రుణాలు ఎగ్గొట్టడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సదరు ఎమ్మెల్యే తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ రుణాలిచ్చిన సంస్థలకే కన్నం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైజాగ్‌ అంతా కోడై కూస్తోంది.

మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశాడు. అలాంటి మాల్యానే.. మన వైజాగ్‌లోనూ ఉన్నాడు. ఈ మాల్యా మాత్రం పారిపోలేదు. అపరిచితుడిలా భిన్న పార్శ్వాలు ప్రదర్శిస్తున్నాడు.

కానీ..మన వైజాగ్‌ మాల్యాలో మాత్రం రెండు కోణాలున్నాయి...

ఎన్నికల ముందు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు.

ఇప్పుడు.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అప్పులిచ్చిన బ్యాంకుల్నే బెదిరిస్తున్నకై ంకర్యుడు.

సాక్షి, విశాఖపట్నం :

ఫైనాన్స్‌ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. డబ్బు తిరిగి చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ.. నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది ఓ కూటమి ఎమ్మెల్యేకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్‌ కంపెనీల దగ్గర సదరు ఎమ్మెల్యే.. ఓ డిఫాల్టర్‌ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ డిఫాల్టర్‌ అనే ముద్ర వేసుకుంటూ.. ఈవీఎంల గాలిలో గెలిచిన మాల్యా.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలకు ఆద్యుడిగా మారుతున్నారు.

ఆది నుంచీ అవే మోసాలు..!

ఏ బ్యాంకు కనిపించినా.. ఏ ఫైనాన్స్‌ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తిరగడమే సదరు ఎమ్మెల్యే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. చిట్‌ఫండ్‌ కంపెనీల్లో డబ్బులు పాడుకొని వాటిని ఎగ్గొట్టేందుకు యత్నించగా కోర్టు మొట్టికాయలు వెయ్యడంతో వాటిని చెల్లించారు. చిట్‌ఫండ్‌ సంస్థలకు ఎగనామం పెట్టిన వైజాగ్‌ మాల్యా... 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్‌ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ప్రతి ఫైనాన్స్‌ సంస్థ దగ్గర కోట్ల రూపాయల రుణాలు తీసుకొని వాటికి శఠగోపం పెట్టేశారు. చివరికి కోర్టులని ఆశ్రయించిన కొన్ని సంస్థలు.. ఈయన దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో.. ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి.

వైజాగ్‌ పోర్టులో కింగ్‌ అవుతా..!

షిప్పింగ్‌ కంపెనీని నడుపుతున్న కూటమి ఎమ్మెల్యే దాన్ని కొనసాగించేందుకే పలు ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని అటు బ్యాంకుల్ని.. ఇటు పోర్టుని శాసించాలని యత్నిస్తున్నారు. వైజాగ్‌ పోర్టులో షిప్పింగ్‌ కాంట్రాక్టులు పొందేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. షిప్పింగ్‌ కాంట్రాక్టులు తన సంస్థకే ఇవ్వాలనీ.. లేదంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పి.. బదిలీ చేస్తానంటూ కొందరు పోర్టు అధికారులతో వాగ్వాదం పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోర్టులో తానే కింగ్‌ అవుతానంటూ విర్రవీగుతున్నారని సమాచారం.

అప్పులిచ్చిన బ్యాంకుల్ని బెదిరిస్తున్న కూటమి ఎమ్మెల్యే పోర్టులో కాంట్రాక్టుల కోసం బ్యాంకుల్లో రుణాలు నిర్ణీత సమయాల్లో చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ఎమ్మెల్యే బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురించొద్దంటూ ఆదేశాలు

రుణం చెల్లించే సమయం చెప్పకుండా బ్యాంకులపై పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే మాల్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement