జనవరిలో అంతర్జాతీయ నాట్య సమ్మేళనం
మద్దిలపాలెం: వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు అంతర్జాతీయ నాట్య సమ్మేళనం–2026ను కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు విశాఖ నృత్య కళాకారుల సమాఖ్య అధ్యక్షులు కన్నం వి. రమణారావు తెలిపారు. నటరాజ్ మ్యూజిక్–డాన్స్ అకాడమీ, ద డ్యాన్స్ ఇండియా మ్యాగజైన్ సంయుక్త సౌజన్యంతో జరిగే ఈ ఉత్సవానికి చైర్మన్‌గా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు కళారత్న కేవీ సత్యనారాయణ వ్యవహరించనున్నారు. ఈ సమ్మేళనంలో దేశ విదేశాలకు చెందిన ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి నాట్య పోటీలు, క్విజ్ పోటీలు ఉంటాయి. ముఖ్యంగా 2,000 మంది నాట్య కళాకారులతో మహా బృంద నాట్యం ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నట్లు రమణారావు తెలిపారు.


