కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులు ముందస్తుగా గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. పరిపాలనా భవనంలో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ మహ్మద్‌అబీబుద్దీన్‌కు మహిళా ఉద్యోగులు డాక్టర్ ఎస్.సుజాత, బి.కృష్ణవేణి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ప్రతిఒక్కరి తోడ్పాటు అవసరమన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలతాదేవి, సూపరింటెండెంట్లు హేమారాణి, పి.నర్మద, ఎస్.పద్మావతి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
Warangal
Yadadri
నల్లగొండ టూటౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంజీయూ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు 20 అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ యూనివర్సిటీ సూచన ప్రకారం విద్యార్థుల జాబితా సిద్ధం చేసి ఈ నెల 15 లోగా usbmguict 2025@gmail.com మెయిల్ కు పంపాలని సూచించారు.
వాగులో పడి మహిళ మృతి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): వాగులో పడి మహిళ మృతిచెందిన ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరులో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన పచ్చిపాల నాగమ్మ(45) మూడ్రోజుల క్రితం మోతె మండలం సర్వారంలో బంధువుల దశదినకర్మకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ.. ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామ పరిధిలోని వాగులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు దిగి కాలు జారి వాగులో పడింది. గురువారం ఉదయం స్థానికులు వాగు వద్దకు వెళ్లగా మహిళ మృతదేహం నీటిపై తేలుతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భూదాన్‌పోచంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుతో కలిసి భూదాన్‌పోచంపల్లిని ఆయన సందర్శించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత సహకార సంఘం, చేనేత గృహాలను సందర్శించారు. చేనేత వస్త్రాలు, మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నది చేనేత పరిశ్రమనే అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే చేనేత కార్మికుల వస్త్రోత్పత్తులకు మార్కెటింగ్ పెరుగుతుందన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని, సబ్సిడీపై నూలు, ముడిసరుకును అందించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి పోచంపల్లికి మెగా చేనేత క్లస్టర్ మంజూరుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించారని వివరించారు. చేనేత సహకార సంఘాలకు ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. చేనేత పరిశ్రమలో 70శాతం మహిళలు పనిచేడం గొప్పవిషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు. దేశంలో తెలంగాణ నుంచే రూ.3లక్షల కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయంటే మన చేనేత వస్త్రాలకు ఉన్న డిమాండ్ అర్థమవుతుందని అన్నారు. అనంతరం పలువురు చేనేత నాయకులు, కార్మికులు బండారు దత్తాత్రేయను సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో చేనేత రాష్ట్ర నాయకులు కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, భారత లవకుమార్, సతీష్, నోముల గణేశ్, భారత వాసుదేవ్, చిక్క కృష్ణ, అంకం పాండు, సీత శ్రీరాములు, సీత సత్యనారాయణ, కర్నాటి బాలరాజు, రుద్ర అంజనేయులు, మెరుగు శశికళ, కర్నాటి అంజమ్మ, గంజి బస్వలింగం, ఏలే శ్రీనివాస్, కేసారం కృష్ణారెడ్డి, బడుగు శ్రీకాంత్, కడవేరు శేఖర్, ఇంజమూరి యాదగిరి, భారత అంజనేయులు పాల్గొన్నారు.
ఫ హరియాణా మాజీ గవర్నర్
బండారు దత్తాత్రేయ
యాదగిరిగుట్ట: చేనేత కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకొని, అనంతరం పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం విదేశీ మోజులో చేనేత దుస్తులను ఎవరూ ధరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు చేనేత కార్మికులు వెళ్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణాలు అందించి ఆదుకుంటుందన్నారు. చేనేత వస్త్రాలను విదేశాలకు పంపించే అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ కల్పించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు ధరించాలనే సంకల్పం ప్రతి వ్యక్తిలో రావాలన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన పథకాలు అమలు చేయడంలేదన్నారు. పవర్‌లూమ్స్ కార్మికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. మొదటిసారి యాదగిరిగుట్టకు ఆయనకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, చేనేత విభాగం మాజీ కన్వీనర్ కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, మచ్చ సుధాకర్, రచ్చ శ్రీనివాస్, గంజి బసవలింగం, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
● మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్‌లో ఏ గ్రేడ్ సాధించేలా అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం యూనివర్సిటీలో వివిధ విభాగాల ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాక్‌కు అందించే సెల్ఫ్ స్టడీ నివేదికలోని అంశాలపై అధ్యాపకులు అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రతి విభాగం వారు విధిగా వర్క్‌షాపులు, సెమినార్ల నిర్వహణతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్‌డీ విద్యార్థులు తమ పరిశోధనా కాలంలో కనీసం 2 పరిశోధనా పత్రాలు పరిశీలించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విభాగాల వారీగా ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేస్తామన్నారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలన్నారు.ఽ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రేమ్‌సాగర్, డాక్టర్ కె. అరుణప్రియ, సీహెచ్. సుధారాణి, శ్రీదేవి, రేఖ, అంజిరెడ్డి, ఆకుల రవి, హరీష్‌కుమార్, డాక్టర్ వై. ప్రశాంతి, మిర్యాల రమేష్, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నియామకం
నల్లగొండ టూటౌన్: ఎంజీయూలో వివిధ విభాగాల్లో సిలబస్ కూర్పు, పాఠ్యాంశాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ విధానం, వివిధ విద్యాంశాల ప్రణాళిక రూపకల్పనకు గాను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బిజినెస్ మేనేజిమెంట్ విభాగం చైర్మన్‌గా మారం వెంకటరమణారెడ్డి, సోషల్ వర్క్ చైర్మన్‌గా డాక్టర్ శ్రీధర్(ఓయూ), హిస్టరీ అండ్ టూరిజం విభాగం చైర్మన్‌గా కె. విజయ్‌బాబు(కాకతీయ యూనివర్సిటీ), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్‌గా ఏవీఎన్.రెడ్డి(అంబేద్కర్ యూనివర్సిటీ)ని నియమించారు.
భూదాన్‌పోచంపల్లి: చేనేత సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసినందుకు గాను హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్‌కుమార్ స్కీమాటిక్ ఇంప్లిమెంటేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, సహాయ మంత్రి పబిత్ర మార్గరేటా తదితరుల చేతులమీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.
పుట్టపాక కళాకారులు..
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ యువ చేనేత విభాగంలో, జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. వారికి ప్రశంసాపత్రం పత్రం, మెమొంటోతో పాటు నగదు పురస్కారం అందజేశారు.
మిర్యాలగూడ: ఇసుక అక్రమ దందాను అరికట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఇసుక అందించడానికే సాండ్ బజార్‌ను ఏర్పాటు చేసినట్లు అన్నారు. రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో రాష్ట్ర మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌ను నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాండ్ బజార్‌లో టన్ను ఇసుక రూ.1250కు అందుబాటులో ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకా తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తక్కువ ధరకు ఇసుకతో పాటు స్థానిక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలతో మాట్లాడి సిమెంట్ బస్తాకు రూ.50 చొప్పున తగ్గింపు ధరలో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటుకలు కూడా మార్కెట్ ధర కంటే ఒక రూపాయి తక్కువకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏడీ జాకోబ్, తహసీల్దార్ సురేష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా
భూదాన్‌పోచంపల్లి: గత ప్రభుత్వాలన్నీ చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ టి.చిరంజీవులు అన్నారు. గత పదేళ్ల కాలంలో రూ.18లక్షల 12వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు ఖర్చు చేసింది కేవలం రూ.229 కోట్లు మాత్రమేనని అన్నారు. అలాగే ఈ సంవత్సరం 50లక్షల 512 వేల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా చేనేతకు రూ.2400 కోట్లు కేటాయించడం దయనీయ పరిస్థితికి అద్దంపడుతోందని అన్నారు. గురువారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవులు పాల్గొని మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వాలకు చేతులు రావడం లేదన్నారు. అదే గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం బడాపారిశ్రామిక వేత్తలకు రూ.16లక్షల 24వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. 1950 నుంచి ఇప్పటి వరకు 23 మంది మాత్రమే పద్మశాలీలు ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. వాస్తవానికి 69 మంది ఎమ్మెల్యే కావాలన్నారు. అందరూ ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పద్మశాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది చేనేత కార్మికులను సన్మానించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, చేనేత నాయకులు భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, సీత శ్రీరాములు, భోగ భానుమతి, కర్నాటి అంజమ్మ, మెరుగు శశికళ, కార్మిక సంఘం నాయకులు హరిశంకర్, భూషణ్, బిట్ల గణేశ్, రుద్ర సూర్యప్రకాశ్, వేణుకుమార్, శ్యామ్‌సుందర్, కూరపాటి భాస్కర్, శివరాజు, రాజేశ్వరీ, హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు
కోదాడరూరల్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం కోదాడ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణ పరిధిలోని చేపల మార్కెట్ వెనుక కట్టబజార్‌కు చెందిన ఉప్పతల శ్రీను, లక్ష్మి(40) దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. శ్రీను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మిని శ్రీను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. మూడు రోజుల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకోవడం లేదు. బుధవారం రాత్రి వారి కుమార్తె హాసిని, బంధువుల పాప కలిసి ఓ గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన లక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుమార్తె హాసిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. శ్రీను మరో మహిళతో వివాహేత సంబంధం పెట్టుకొని లక్ష్మిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.
పెళ్లి కుదరడం లేదని బలవన్మరణం
డిండి: పెళ్లి కుదరడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం డిండి మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రంలోని డీఎన్‌టీ కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మయ్య, జంగమ్మ దంపతుల కుమార్తె రూప(26) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టుమిషన్ నడుపుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు రూపకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రూప బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం పోలీసులు ఘుటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రామన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. బీసీలను మభ్యపెట్టడానికే రేవంత్‌రెడ్డి 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని, మేధావులను, ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఆర్డినెన్స్‌ను రూపొందించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై నమ్మకం లేకనే ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 42శాతం నామినేటెడ్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు బద్దుల రమేష్, సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్‌బాబు తదితరులు ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య
Hanamkonda
ఖిలా వరంగల్: భారతీయ రైల్వే ప్రయాణికులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగా ట్రైన్‌లో ప్రయాణించాల్సిన వ్యక్తి ఇక నుంచి రైల్వే సేవలకు అటు ఇటు వెళ్లాల్సిన పనిలేదు. కావాల్సిన సమాచారమంతా కూర్చున్న చోటు నుంచే తెలుసుకునేలా అనేక యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో యూటీఎస్, రైల్ వన్ యాప్‌ల ద్వారా ప్రయాణికులకు క్షణాల్లో మెరుగైన సేవలు అందుతాయి. దీనికి కావాల్సింది చేతితో స్మోర్ట్ ఫోన్ మాత్రమే. ఈ క్రమంలో ఈ రైలు యాప్‌లు ఎలాంటి సేవలు అందిస్తాయి.. ఎలా పొందాలనే అంశాలపై‘సాక్షి’ప్రత్యేక కథనం
టికెట్‌కు ఇబ్బంది లేదు..
యూటీఎస్, రైల్ వన్ యాప్‌ల నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.అంతేకాదు అత్యవసరంగా అన్ రిజర్వుడ్ టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందొచ్చు. అలాగే, యాప్‌ల ద్వారా సాధారణ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, నెలవారీ టికెట్, క్యాన్సలేషన్, టికెట్ హిస్టరీ, బుకింగ్ టికెట్ సమాచారం, ఆర్.వాలెట్, టికెట్ ప్రొఫైల్, టికెట్ ట్రాన్జాక్షన్, రైల్ లైవ్ లోకేషన్ మొత్తం యాప్‌ల ద్వారా సులభంగా తెలుసుకునేలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
రైళ్ల కోసం..
ఈ యాప్‌ల సేవలు అనేకం ఉన్నాయి. రైలు ప్రయాణం చేయాలనుకునే వారు రైల్ వన్, యూటీఎస్ యాప్‌ల ద్వారా వెళ్లాల్సిన ప్రాంతం, ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రైన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్‌పైకి రైలు వస్తుంది, కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది.. ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
రిజర్వేషన్ స్థితి..
ఈయాప్‌ల్లో టికెట్ రిజర్వేషన్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్ స్థితి, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలు, రిజర్వేషన్ రద్దు, తదితర అంశాలనూ తెలుసుకోవచ్చు.
సీటు వద్దకే ఆహారం..
రైలు ఎక్కగానే ప్రయాణికులకు ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ముందే నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే రైలులో సీటు వద్దకే తీసుకొచ్చి ఇస్తారు.
సూచనలు, ఫిర్యాదులు..
ఏమైనా సూచనలు ఇవ్వాలనుకున్నా.. రైళ్లలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదులు చేయడానికి రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఇందులో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కాగా, వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 8వేలకు పైగా మంది ప్రయాణిస్తుంటారు. ఫలితంగా ప్రతీ రోజు రైల్వేశాఖకు రూ.6లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది.
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కూర్చున్న చోటే క్షణాల్లో వివరాలు
అందుబాటులో రైల్‌వన్,
యూటీఎస్ యాప్‌లు
రైల్వే సమాచారం కోసం ఇక నుంచి ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు
డౌన్ లోడ్ ఇలా చేసుకోవాలి..
ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజస్ట్రేషన్ చేసుకుని పాస్‌వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది.
● ఈ నెల 13న హైదరాబాద్‌లో మహాగర్జన
● పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ
హసన్‌పర్తి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంప్ సమీపంలోని ఎంటీఆర్ గార్డెన్‌లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్‌దారుల సన్నాహాక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈసమావేశానికి మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారంలోగా 15 డిమండ్లు నెరవేర్చాలన్నారు.
13న మహాగర్జన
ఎన్నికల్లో ఇచ్చిన మేరకు హామీలు పరిష్కరించకపోతే ఈనెల 13న హైదరాబాద్‌లో లక్షలాది మందితో ఎల్‌బీ స్టేడియంలో మహాగర్జన సభ నిర్వహిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుమార్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఎంపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ సోమన్న, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు పుట్ట రవి, ఆరెపల్లి పవన్, రాజారపు భిక్షపతి, వికలాంగుల సంఘం నేతలు పాల్గొన్నారు.
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన గుండల కృష్ణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో పనికి వెళ్లి తిరిగి రాత్రి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ముస్కులపల్లి బొడ్రాయి సమీపంలో వరంగల్ –ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక ఉన్న బైక్.. లారీని ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి రోడ్డు మీద పడిన కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి గుండల అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాగా, ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్‌డీసీపీ అంకిత్ కుమార్ పరిశీలించారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో గురువారం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలిన్, కిడ్స్) పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌త్రోలో బంగారు పథకం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏటా ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జనగామలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బైరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కిరణ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సుగుణాకర్, హనుమంతరావు, గజ్జెల్లి రాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
33 జిల్లాలు.. 6వందల మంది క్రీడాకారులు
జనగామ జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లె టిక్స్ పోటీలకు 33 జిల్లాల నుంచి 6 వందల మంది క్రీడాకారులు హాజరయ్యా రు. జావెలిన్ క్రీడతోపాట అండర్–8,10,12 విభాగాల్లో బాల, బాలికలకు పరుగు పందెం, అప్రోచ్ లాంగ్ జంప్ క్రీడలు నిర్వహించారు. అండర్–8 విభాగంలో బాల, బాలికలకు 1.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 2.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–12 విభాగంలో బాల, బాలికలకు 3.60 మీటర్లు ఫైవ్ మీటర్స్ అప్రోచ్డ్ లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–14 విభాగంలో బాల, బాలికలకు కిడ్స్ జావెలిన్‌త్రో, అండర్–16,18, 20 విభాగాల్లో యువతీ, యువకులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించారు.
చదువుతోపాటు ఆటల్లో రాణించాలి
జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
అట్టహాసంగా రాష్ట్ర స్థాయి
అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
33 జిల్లాల నుంచి హాజరైన
క్రీడాకారులు
జనగామ: ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే కారణం లేకుండా రిజెక్ట్ చేయొద్దని.. ఒక వేళ చేసినా కారణం చెప్పాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహిసినపర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా.. డీసీపీ రాజమహేంద్రనాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఘనస్వాగతం పలికింది. అనంతరం కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల కోరిన మేరకు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ఆర్టీఐకి ఎప్పుడూ భయపడొద్దన్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం కోరిన 30 రోజుల వరకు సమయం ఉంటుందని, కారణం చూపకుండా గడువు దాటితే సంబంధిత అధికారి నుంచి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే అప్పీల్‌కు వెళ్లొచ్చన్నారు. గడువు లోగా సమాచారం ఇవ్వకపోతే స్టేట్ కమిషన్‌కు ఫిర్యాదు వెళ్తుందని, మొదటి అప్పీల్ జిల్లా అప్పీలేట్, రెండో అప్పీల్ స్టేట్ కమిషన్ వద్దకు వస్తుందన్నారు. సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుడు నష్టపోతే ఆ పరిహారాన్ని పీఐఓలు భరించాల్సి ఉంటుందన్నారు. జనగామ జిల్లాలో సహచట్టం ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతో తీసుకొచ్చారో, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని చెప్పారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ కార్యాలయంలో సమాచార హక్కుచట్టం రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మూడు, ఆరు నెలలకు ఇచ్చే నివేదికలను నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకుని వాటికి సలహాలు, సూచనలు అందించారు.
అధికారులు ఆర్టీఐకి భయపడొద్దు
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి
పూర్తిస్థాయి అధికారులతోనే..
ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 చిట్‌ఫండ్‌ల పర్యవేక్షణకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తే తప్ప పాలన గాడిలో పడేలా లేదు. ప్రజలకు బాధలు తీరేలా లేవు. పదోన్నతుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో అధికారులను నియమించే అవకాశం ఉంటుంది.
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అండ్ చిట్స్ శాఖలోని ఉన్నతాధికారుల పాలన ఇన్‌చార్జ్‌ల చేతుల్లో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే శాఖలో ఇన్‌చార్జ్ పాలనతో నిర్వహణ గాడి తప్పుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 బ్రాంచ్‌లతో కూడిన చిట్‌ఫండ్ కార్యాలయాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేక కింది స్థాయి అధికారుల విధుల్లో అలసత్వం వహిస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఆడిందే ఆటగా కొలువులు సాగిస్తున్నారు.
ప్రజల బారులు..
ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు చిట్స్, ఆడిటింగ్, కోర్టు కేసులు, ప్రొహిబిటెడ్, ల్యాండ్ కేసులు, డాక్యుమెంట్లలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి నిత్యం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు బారులు దీరుతుంటారు. ఇక్కడ పని చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్‌ను జూలైలో హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జ్ నియమించారు. ఏడాది క్రితం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వచ్చిన యామిని రెండు నెలల కాలవ్యవధిలో విధులు చేపట్టి నాటినుంచి నేటి వరకు లాంగ్ లీవ్‌లో వెళ్లిపోవడంతో ఇన్‌చార్జ్ చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పాలనే కొనసాగుతోంది. దీంతో చిట్స్‌లో పేరుకుపోయిన చిట్‌ఫండ్స్ లావాదేవీలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారింది.
ఇన్‌చార్జ్‌ల చేతుల్లో రిజిస్ట్రేషన్ శాఖ
ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్
కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన
కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యం
పూర్తి స్థాయిలో అధికారులను
నియమిస్తే సమస్యలు పరిష్కారం
● భర్తకు ఏడాది జైలు
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేలు జరిమానా విధిస్తూ హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిసోని గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దొనికల అనూషకు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన గుడ్డేటి దిలీప్‌కుమార్‌తో 2020, నవంబర్ 11న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.40 లక్షలు, 30 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహ అనంతరం కొద్ది రోజులు బాగానే చూసుకున్న దిలీప్‌కుమార్ కుటుంబీకులు తక్కువ కట్నం తెచ్చావంటూ అనూషను వేధించసాగారు. ఈ క్రమంలో ఉద్యోగ రీత్యా దిలీప్‌కుమార్.. భార్య అనుషాతో కలిసి 2021, జూలై 27న అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా రూ. కోటి అదనపు కట్నం తీసుకురావాలని, లేనిపక్షంలో విడాకులు ఇస్తానని బెదించాడు. దీంతో అనూష.. దిలీప్‌కుమార్‌పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మందలించి వదిలేశారు. అనంతరం 2022, జూలై 30న అనూష, దిలీప్‌కుమార్ ఇండియాకు తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన దిలీప్‌కుమార్ తల్లిదండ్రులు అనూషను తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో అనూష తల్లిదండ్రులు తాత్కాలికంగా ఉంటున్న ఘట్‌కేసర్ వద్ద ఆమెను వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అనూష ప్రశ్నించడంతో ఆమె తల్లిదండ్రుల ఎదుటే ‘నీకు విడాకులు ఇస్తా’ అని చెప్పి దిలీప్‌కుమార్‌తోపాటు కుటుంబీకులు స్వగ్రామం వచ్చారు. ఈ విషయంపై అనూష తల్లిదండ్రులు పంచాయితీ నిర్వహించగా విడాకులు తీసుకుంటానని దిలీప్‌కుమార్ పెద్దల సమక్షంలో చెప్పాడు. దీంతో చేసిదేమీ లేక అనూష మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శాంతిసోని.. నేరస్తుడు దిలీప్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేల విధిస్తూ తీర్పు వెలువరించారు.
● మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్
హన్మకొండ: తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ అని అన్నారు. 9 రోజులపాటు ఆటపాటలతో అలసట నుంచి విముక్తి కావాలని, అందరు బాగుండాలని జరుపుకుంటారన్నారు. పెళ్లికాని ఆడ బిడ్డలు ఎంతో భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్‌లో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గోర్ బంజార తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బంజారాలు అందరు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తీజ్ ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినోద్ లోక్‌నాయక్, బాదావత్ బాలాజీనాయక్, ధరావత్ కిషన్ నాయక్, భూక్యా రాజునాయక్, డాక్టర్ చందునాయక్, మాలోత్ రమేశ్, భిక్షపతినాయక్, కిశోర్ నాయక్, నర్సింహానాయక్ పాల్గొన్నారు.
నెల్లికుదురు: నిత్యం పరిసరాలను గమనిస్తూ ఒక్కసారిగా వచ్చే మెరుపు వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదం లాంటి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) కమాండర్ భూపేంద్ర కుమార్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు, మదనతుర్తి, మునిగలవీడు, రావిరాల, రాజులకొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి గురువారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విపత్తులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బృందం వివరించింది. కాగా, గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు రావిరాలలో కొట్టుకుపోయిన రోడ్డును విపత్తు బృందం, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో విపత్తు బృంద సభ్యులు మురళీరాథోడ్, మోహన్‌రావు, మండల ప్రత్యేకాధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందానరేశ్, ఎంపీఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండర్
భూపేంద్ర కుమార్
హైదరాబాద్ లో వర్ష భీభత్సం
National
సూళ్లూరుపేట: బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఇస్రో వారి ఎల్‌వీఎం3 మార్క్–5 రాకెట్ ద్వారా 6,500 కేజీల అత్యంత బరువైన బ్లూ బర్డ్ వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. బ్లూబర్డ్ త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. షార్ చరిత్రలో ఇది భారీ ప్రయోగమనే చెప్పాలి.
బ్లూబర్డ్ ప్రత్యేకతలివీ..
ఇది అమెరికన్ కమ్యూనికేషన్ ఉప గ్రహం. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడేలా రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పని చేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వినూత్నమైన యాంటెన్నా ఉంటుంది. ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఇది ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపైని టవర్లపై ఆధారఫడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్‌జడ్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది 120 ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్‌మిషన్ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యూలార్ బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు.
న్యూఢిల్లీ: అక్రమంగా సంపాదించిన రూ.23 వేల కోట్ల డబ్బును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుని ఆయా నేరాల బాధితులకు అందజేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్(బీపీఎస్‌ఎల్) ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ మేలో జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఓ న్యాయవాది బీపీఎస్‌ఎల్‌పై ఈడీ కేసు గురించి ప్రస్తావించగా సీజేఐ గవాయ్..ఇక్కడ కూడా ఈడీ ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..‘ఇక్కడో వాస్తవ చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. దీని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించింది’అని అన్నారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతాల్లో గురువారం మూడో రోజు సహాయక చర్యలు కొనసాగాయి. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 70 మందిని కాపాడామని, మరో 50 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఆర్మీ తెలిపింది. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి, 8 మంది జవాన్లు ఉన్నారంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుబడి పోయిన 65 మందిని హెలికాప్టర్ల ద్వారా మాట్లి పట్టణానికి తరలించామని వివరించింది.
తీవ్రంగా ప్రభావితమైన ధరాలి గ్రామంలో బురద మట్టి, రాళ్ల కింద ఇరుక్కుపోయిన వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాధన సంపత్తిని విమానం ద్వారా తరలించినట్లు తెలిపింది. సహాయక చర్యల్లో ఇంజినీర్లు, వైద్య బృందాలు, నిపుణులతో కూడిన 225 బలగాలతోపాటు రెస్క్యూడాగ్స్ పాల్గొంటున్నాయన్నారు. వాతావరణం మెరుగుపడినట్లయితే పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యాధునిక చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను డెహ్రాడూన్‌లో సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్‌లో రగడ ఆగడం లేదు. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.
నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకు న్నాయి. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. మణిపూర్‌కు నిధులు కేటాయించేందుకు ఉద్దేశించిన మణిపూర్ అప్రొప్రియేషన్ బిల్లు–2025లో లోక్‌సభలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
దేశ ప్రయోజనాల కోసమే మా పోరాటం: ఖర్గే
రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనలు కొనసాగాయి. సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నినాదాలు ఆపలేదు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండానే మరోవైపు కోస్టల్ షిప్పింగ్ బిల్లు–2025ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కొందరు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్‌పై సభాపతి స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌పై చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు.
పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన
ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఎస్‌ఐఆర్ అంటే కంటికి కనిపించని రహస్య రిగ్గింగ్ అని ఆరోపించారు.సాక్షి, న్యూఢిల్లీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు.. మాస్టర్ ప్లాన్ ఆధారంగా లింక్ రోడ్ల నిర్మాణం అవసరమవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో నివాసితులు.. మున్సిపల్ కార్పొరేషన్లను లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలంటూ కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అయితే పట్టణ ప్రణాళిక బాధ్యత రాష్ట్రాలకే ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు గురువారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
రాష్ట్రాల సహాయార్థంగా కేంద్రం అమృత్ పథకం ద్వారా పలు పట్టణాల్లో ఏఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీకి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 461 పట్టణాల్లో ఈ పనులు చేపట్టగా, తెలంగాణలో 12 నగరాల్లో ఏఐ డేటాబేస్ సిద్ధమవగా.. వాటిలో 10 మాస్టర్ ప్లాన్‌లు రూపుదిద్దుకున్నాయి. కాగా, ఇప్పటి వరకు కేవలం మూడు మాస్టర్ ప్లాన్‌లకే అధికారిక అనుమతి లభించిందని వెల్లడించారు. అమృత్ 2.0 లో రెండో స్థాయి పట్టణాలు (జనాభా 50,000 నుంచి 99,999 మధ్య) కూడా మాస్టర్ ప్లాన్‌ల పరిధిలోకి వచ్చాయి.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పట్టణం కోసం కూడా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదని కేంద్ర మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా లింక్ రోడ్ల నిర్మాణం కీలకమవుతుందని, అందుకు ప్రణాళికల దశ నుంచే సమగ్రంగా ముందుకు సాగాలని సూచించారు. ‘వికసిత భారత్ – 2047‘ లక్ష్యంతో పట్టణాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్టు మంత్రి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్ గురువారం తెలిపారు. పుతిన్ ఆగస్ట్ ఆఖర్లో పర్యటించే అవకాశముందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. పర్యటన తేదీలు, సమయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు.
పర్యటన ఈ ఏడాది చివర్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్ పర్యటన అంశం తెరపైకి రావడం గమనార్హం. పుతిన్ పర్యటన భారత్ ప్రపంచ దేశాలతో నెరుపుతున్న రాజకీయ వ్యూహంలో కీలక పరిణామం కానుంది. సరిగ్గా, ట్రంప్ బెదిరింపుల వేళ పుతిన్ పర్యటన వార్త భారత్–రష్యాల మైత్రీ బంధం ఎంత బలమైందో చెప్పకనే చెబుతోంది.
రష్యా నుంచి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిందించడం, టారిఫ్ పెంచుతూ బుధవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌ఏ ధోవల్ మాస్కో వెళ్లడం గమనార్హం. క్రెమ్లిన్‌లో గురువారం ఆయన అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాస్కోలో ధోవల్ స్పుతి్నక్ న్యూస్‌తో మాట్లాడారు.
భారత్–రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘భారత్–రష్యాలది చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేం ఎంతో విలువైందిగా భావిస్తున్నాం. మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు, బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయి’అని ధోవల్ పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో చేపట్టే పర్యటనపై మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
పర్యటన తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రం ఎంతో కీలకం కానుంది’ అని ధోవల్ వివరించారు. ‘ఈ శిఖరాగ్రం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. వీరి మధ్య జరిగే చర్చలు స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందివ్వనున్నాయి’ అని దోవల్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా ఉండగా, ముడి చమురు దిగుమతులపై పశి్చమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంపైనా ధోవల్ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు.
న్యూఢిల్లీ: ట్రంప్ దురహంకారాగ్రహానికి గురై 50 శాతం టారిఫ్ భారాన్ని మోస్తున్న భారత్, బ్రెజిల్ దేశాల అగ్రనేతలు గురువారం ఫోన్‌లో సంభాíÙంచుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌చేసి పలుఅంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చిన గురువారం రోజే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం.
వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మీదనే ప్రధానంగా ఇరునేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకు వచ్చాయి.
సాక్షి, స్పెషల్ డెస్క్: హోమ్‌వర్క్‌లో సాయం చేసే ఓ స్నేహితుడు.. పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో మార్గదర్శనం చేసే టీచర్.. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ గురించే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ స్టడీ మోడ్‌ను, గూగుల్ జెమినై గైడెడ్ లెర్నింగ్ టూల్‌ను ప్రారంభించి చాట్‌బాట్‌ను వ్యక్తిగత ట్యూటర్‌గా మార్చేశాయి.
ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు, అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ వంటి భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వి ద్యార్థులకు కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్స్ మంచి అధ్యయన సహాయకులుగా అవతరిస్తున్నాయి. దీంతో భారత్‌లోని ఎడ్‌టెక్ సంస్థలు, సంప్రదాయ కోచింగ్ కేంద్రాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయని నిపుణులుఅంటున్నారు.
గైడెడ్ లెర్నింగ్ ఇలా..
అర్థవంతమైన అభ్యాసానికి కేవలం ప్రాంప్టింగ్‌ను (ఆదేశాలు) మెరుగుపరచడం సరిపోదని గూగుల్ అంటోంది. విద్యార్థుల ముందున్న సందేహాలు, సమస్యలను దశలవారీగా గైడెడ్ లెర్నింగ్ విభజిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వివరణలను మారుస్తుంది. చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ క్విజ్‌లను ఉపయోగించి స్పందిస్తుంది.సమాధానం ఇవ్వడం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి యూజర్లకు సహాయపడుతుంది. చురుకైన, నిర్మాణాత్మక ప్రక్రియ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి బోధనలో భాగస్వామిగా ఉండేలా విద్యావేత్తలతో కలిసి గైడెడ్ లెర్నింగ్‌ను రూపొందించినట్టు గూగుల్ తెలిపింది.
» ‘హోమ్‌వర్క్ హెల్ప్’ ద్వారా విద్యార్థుల హోమ్‌వర్క్‌లను.. స్టెప్ బై స్టెప్ మార్గదర్శనం ద్వారా చేసి పెడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన చిత్రాలు లేదా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడమే.
» అలాగే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా ఎలా చదవాలా అనిఆలోచించాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న నోట్స్, ఇతర డాక్యుమెంట్లుఅప్‌లోడ్ చేస్తే చాలు, వాటిని ఒక స్టడీ గైడ్‌గా, ఒక ప్రాక్టీస్ టెస్ట్‌గా,పాడ్‌కాస్ట్‌గా కూడా చేసి మన ముందు పెడుతుంది.
» విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలతో విద్యార్థులకుమార్గనిర్దేశం చేయడం ద్వారా వారి సొంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవడానికి, మెదడుకు పదును పెట్టడానికి ప్రోత్సహిస్తుందని గూగుల్ వివరించింది.
» ఈ విధానాన్ని చేరువ చేయడానికి విద్యావేత్తలు నేరుగా గూగుల్‌క్లాస్‌రూమ్‌లో పోస్ట్ చేయగల, విద్యార్థులతో పంచుకోగల ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.
ఇంటర్నెట్ వచ్చాక సంప్రదాయ గైడ్స్‌కు కాలం చెల్లింది. సాంకేతికతను ఉపయోగించి ఎడ్‌టెక్ కంపెనీలు విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడానికి అభ్యాస విధానంలో కొత్తదనం తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ రాకతో తరగతి గదికి మించి నేర్చుకోవడంలో గూగుల్ గైడెడ్ లెర్నింగ్, ఓపెన్ ఏఐ స్టడీ మోడ్ కొత్త రకం అనుభవం అందిస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
‘విద్యార్థులకు లాభదాయకమే’
నిజానికి ఏఐ చాట్‌బాట్‌లు విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష సమాధానాలను ఇచ్చేస్తాయని.. దానివల్ల వారి మెదడుకు పని ఉండదని, దాంతో అభ్యాస ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది విద్యావేత్తలు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదంటున్నాయి గూగుల్, ఓపెన్ ఏఐ సంస్థలు. ఈ సంస్థలు స్టడీ మోడ్, గైడెడ్ లెర్నింగ్ పేరుతో వ్యక్తిగత ట్యూటర్లను ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త సాధనాలు చాట్‌బాట్‌లను సాధారణ సమాధాన వేదికలుగా కాకుండా.. అభ్యాస సాధనాలుగా మలచడం ద్వారా విద్యా విధానం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనపడుతోంది.ఇదీ ‘స్టడీ మోడ్’
దీన్ని కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఇది కూడా హోమ్‌వర్క్, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులకు సాయం చేస్తుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు స్టడీ మోడ్‌లో చాట్ జీపీటీ ప్రత్యక్ష సమాధానాలను అందించదు. విద్యార్థులు వారి లక్ష్యం, జ్ఞాన స్థాయిని బాట్‌కు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమంత తాముగా, చురుకుగా నేర్చుకునేలా, పాఠ్యాంశాలపట్ల లోతైన అవగాహన కలిగేలా హింట్స్, క్విజ్ ద్వారా ప్రోత్సహించడం ఇందులోని ప్రత్యేకత.ఏదైనా టాపిక్ కొత్తదైతే లేదా ఇప్పటికే మెటీరియల్‌పై పట్టు ఉండి తాజా సమాచారం కోరితే.. చాట్‌బాట్ వ్యక్తిగతీకరించిన పాఠాన్ని అందిస్తుంది. – విద్యార్థుల కోసం స్టడీ మోడ్ సిద్ధం చేయడంలో భాగంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీ) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలను కంపెనీ ఉపయోగించింది.
» ఐఐటీల వంటి ముఖ్య పరీక్షలతో పాటు భారత్‌లో జరుగుతున్న ఇతర పరీక్షల్లో కూడా పనితీరునుఅంచనా వేయడానికి స్టడీ మోడ్ పరీక్షించినట్టు ఓపెన్ ఏఐ తెలిపింది.
» వాయిస్, ఇమేజ్, టెక్స్›్టను సపోర్ట్ చేస్తూ 11 భారతీయ భాషల్లో స్టడీ మోడ్ అందుబాటులో ఉంది.
కొన్ని సందేహాలు
తమ ఏఐ సేవలను పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు మరింత అందుబాటులో, చవకైన మార్గాల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నామని గూగుల్, ఓపెన్ ఏఐ చెబుతున్నాయి. అయితే వీటిపై విద్యా, వైద్య రంగ నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.» విద్యార్థులు చాట్‌బాట్‌లపై ఎక్కువగా ఆధారపడినప్పుడు వారి విద్యా పరిశోధన నైపుణ్యాలు, పఠన గ్రహణశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
» ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను గంటల తరబడి చూడటం.. కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే చూసే విధానం వల్ల మెడ, వెన్ను వంటి వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరలీ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. పర్వతం నుంచి కిందికి వచ్చిన వినాశకర వరద నీరు, బురద, రాళ్లు.. ఆ గ్రామం నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా జాడ కానరావడం లేదు. దీనంతటికీ కారణం.. మేఘ విస్ఫోటం. ఆకాశంలో అపార జలరాశిని నింపుకొన్న మేఘాలు.. కేవలం స్వల్ప వ్యవధిలో కుంభవృష్టిగా విజృంభించడం. ఆ విస్ఫోటంతో విలయం సంభవించింది. దీన్నే క్లౌడ్ బరస్ట్.. మేఘ విస్ఫోటం అంటారు. ఉత్తరాఖండ్ వీటికి ప్రసిద్ధి. – సాక్షి, స్పెషల్ డెస్క్
మేఘ విస్ఫోటం.. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. గాలి పయనించే తీరు, ఎతై ్తన పర్వతాలు, గాలిలోని తేమ ఇందుకు ప్రధాన కారణాలు. వేడిగాలి పర్వత ప్రాంతాలపైకి వెళ్లి అక్కడ అల్పపీడనం వల్ల చల్లబడి తేమను విడుదల చేస్తుంది. వేడిగాలి ఎంత ఎక్కువగా పైకి వెళితే తేమ అంత అధికమై.. అదే ఒక్కసారిగా క్లౌడ్‌బరస్ట్ రూపంలో వర్షిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షం నమోదు కావడంతో ఆకస్మిక వరదలకు దారితీస్తుంది. క్లౌడ్ బరస్ట్ కాకున్నా దాదాపు అలాంటి పరిస్థితిని ఇటీవల హైదరాబాద్‌లోనూ చూశాం.
ముందే చెప్పలేరా?
వాతావరణ శాఖ.. వర్షం పడుతుందని చెప్పగలదు. సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పగలదు. కానీ ఎంత మొత్తంలో వర్షపాతం నమోదవుతుందనేది మాత్రం చెప్పలేదు.10 సెం.మీ. వర్షపాతం
ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక గంట సమయంలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తామని ఐఎండీ చెబుతోంది. దీన్ని ముందే పసిగట్టాలంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో పటిష్ట రాడార్ నెట్‌వర్క్ లేదా వాతావరణాన్ని అంచనావేసే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది.కేదార్‌నాథ్ విలయం
క్లౌడ్‌బరస్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంఘటన 2013లో ఉత్తరాఖండ్ విలయం. ఈ ఘటనలో 6,074 మంది చనిపోగా 70 వేలకుపైగా చార్‌ధామ్ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. 2004 సునామీ తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు.అక్రమ, అశాస్త్రీయ నిర్మాణాలు..: హిమాలయాలలో అక్రమంగా, అశాస్త్రీయంగా చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి విపత్తుల సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ భూభాగంలో లోయ వైపున ఉన్న చాలా కాలువలు బలహీన ప్రాంతం, విరిగిన రాతిపై ఏర్పాటై ఉన్నాయి. అందుకే ఏదైనా షెల్టర్, హోటళ్ళు, భవనాలు, తాత్కాలిక దుకాణాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
హిమాలయాల పెరుగుదల స్వభావానికి తోడు, అధికం అవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు రుతుపవనాల నమూనాలను మార్చాయి. దీని వలన వాటి ఆగమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. అటవీ నిర్మూలన, భూ వినియోగ విధానాలలో మార్పు నేల స్థిరత్వాన్ని క్షీణింపజేసి, వర్షపు నీటిని పీల్చుకునే ప్రకృతి సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
‘చార్‌ధామ్’లోనూ..: హోటళ్ళు, హోమ్‌స్టేస్, ఇతర పౌర నిర్మాణాలు.. నదులు, వాగుల మార్గాన్ని ఆక్రమించకుండా చూసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేదన్నది నిపుణుల మాట. 2023లో 56 లక్షలకు పైగా ప్రజలు చార్ ధామ్‌ను సందర్శించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
పెరుగుతున్న యాత్రికులు, పర్యాటకులకు వసతి కల్పించడానికి హోటళ్ళు, లాడ్జీలు, రోడ్లు, దుకాణాలను అస్థిరమైన వాలులు, వరదలకు గురయ్యే నదీ తీరాలలో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ హైవే ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణ సున్నితమైన భూభాగాన్ని మరింత అస్థిరపరిచిందని, ఈ మార్గాల్లో తరచుగా కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
ఎన్నో ‘మేఘ విస్ఫోటనాలు’
» 2025 జూలై 26న రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వత ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. వరదల్లో చిక్కుకున్న 1,600 మంది చార్‌దామ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
» 2025 జూన్ 29న ఉత్తరాఖండ్‌లోని బార్‌కోట్–యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న భవనం దెబ్బతిని 9 మంది కార్మికులు గల్లంతయ్యారు.
» పర్వత ప్రాంతాల్లో ఏర్పడిన ఓ సరస్సు.. 2023 అక్టోబర్‌లో కుండపోత వర్షం కారణంగా సిక్కింలో వినాశకర వరదలకు దారితీసింది. ఫలితంగా కనీసం 179 మంది మరణించారు.
» 2021 అక్టోబర్‌లో అకాల భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్‌లో రోడ్లు మునిగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కనీసం 46 మంది మరణించారు.
» 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ధౌలిగంగా నది లోయలో నీరు, రాళ్ళు, శిథిలాలు ఉప్పొంగడంతో 200 మందికి పైగా మరణించారు.
» భారత్–పాకిస్తాన్ మధ్య ప్రవహించే జీలం నది 2014 సెప్టెంబర్‌లో అసాధారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో కాశ్మీర్.. గత 50 సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలను చవిచూసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది భారతీయులు, 264 మంది పాకిస్తానీయులు మరణించారు.‘నదులకు వాటి సొంతదైన, సహజ మార్గం ఉంది. కానీ మనం దాని మార్గంలో భవనాలను నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాం, మార్చేస్తున్నాం. మేఘ విస్ఫోటం అంచనా వేయలేం. ప్రభుత్వం ప్రమాదకర మండలాలను గుర్తించాలి’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు అప్పగిస్తూ ఎన్‌డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. గురువారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన బీజేపీ, మిత్ర పక్షాల నేతల భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు జేడీయూ నుంచి లలన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, టీడీపీ నుంచి ఎల్. దేవరాయలు, ఎల్‌జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, ఇంకా అనుప్రియా పటేల్, ఉపేంద్ర కుష్వాహా, ఏఐఏడీఎంకే తదితర ఇతర చిన్న పార్టీల నేతలు సైతం పాల్గొన్నారన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బలపర్చాలనే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ నెల 12వ తేదీన స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్‌ఏడీ పక్షాల మధ్య సమన్వయం కొనసాగింపుపై ఈ సమావేశం చర్చించిందన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. తమ రైతన్నల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మత్స్య, పాడి పరిశ్రమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. దేశీయంగా వ్యవసాయ, పాడి రంగాలకు నష్టం చేకూర్చే నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని స్పష్టంచేశారు.
ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గబోమని, తమపై టారిఫ్ బెదిరింపులు పనిచేయబోవని పరోక్షంగా వెల్లడించారు. అవసరమైతే వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
అన్నదాతలతోపాటు మత్స్యకారులు, పాడి రైతులు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వారికి మేలు చేసే విషయంలో వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తనకు తెలుసని, అందుకు సిద్ధంగానే ఉన్నానని వివరించారు. మన వాళ్ల బాగుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ స్మారక నాణెం, తపాలా బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
పౌష్టికాహార భద్రత సాధించాలి
‘‘దేశంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పౌష్టికాహార భద్రత సాధించడం అత్యవవసరం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులను తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేయాలి. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచాలి. కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వరదలను తట్టుకొని అధిక ఉత్పాదకత ఇచ్చే వంగడాలను కృత్రిమ మేధ(ఏఐ), మెíషీన్ లెర్నింగ్‌తో రూపొందించాలి.పంటల ఉత్పత్తిని ముందుగానే అంచనా వేయడానికి, తెగుళ్లను గుర్తించడానికి, రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రియల్–టైమ్ వ్యవస్థలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలి. పంటల మారి్పడిపై పరిశోధనలు మరింత ఊపందుకోవాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు సాగు చేయాలో గుర్తించాలి. మట్టి పరీక్షల కోసం చౌక ధరల్లో దొరికే పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని మోదీ అన్నారు.
పథకాలతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం
‘‘దేశ ప్రగతికి పునాది రైతుల ప్రగతే. రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం–కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కృషి సించాయ్ యోజన, పీఎం కిసాన్ సంపద యోజన, పీఎం ధన్ ధాన్య యోజన వంటివాటిని వ్యవసాయం, అనుబంధాల రంగాల సమగ్రాభివృద్ధి కోసమే తీసుకొచ్చాం. 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేశాం.ఆయా పథకాలతో కేవలం ఆర్థిక తోడ్పాటే కాకుండా, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పంటల ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి, రైతుల ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారి కోసం నూతన ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నాం. సహకార సంఘాలకు, స్వయం సహాయక గ్రూప్‌లకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది.
పంటల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు అదే సమయంలో పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎం.ఎస్. స్వామినాథన్ పదేపదే సూచించారు. ఆయన నిర్దేశించిన బాటలో మనం నడవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సౌమ్య స్వామినాథన్ పాల్గొన్నారు.
మోదీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో చేనేత రంగం ప్రగతి పథంలో సాగుతోందని పేర్కొన్నారు. 2,600 ఎగ్జిబిషన్ల ద్వారా 43 లక్షల మంది చేనేత కారి్మకులు, అనుబంధ కార్మికులకు నేరుగా మార్కెట్ సౌలభ్యం లభించిందని, రూ.1,700 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. 20కిపైగా దేశాలకు మన చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, వాటి విలువ రూ.21,000 కోట్లకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. మన సంప్రదాయ చేనేత కళ, వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు.సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..
‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్‌మెంట్ కోరాక మోదీ, అమిత్‌షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్‌మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్‌మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీ ద్రోహులు..
‘బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్‌ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
గల్లీ లీడర్‌లా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టుకింద ప్లీడర్‌లా, గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు.మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు.అందుకే రాహుల్ రాలేదు..
‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్‌లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు.ఓడిపోవడమే కేసీఆర్‌కు పెద్ద శిక్ష
విలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్‌కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్‌లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..
ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్‌లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్‌చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
International
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్‌తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్..ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు.
అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్‌స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.
యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు
2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు.వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న దేశాలపై టారిఫ్ క్షిపణుల్ని ప్రయోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమ్ముల పొదిని మరింతగా వాడబోతున్నారా?. గురువారం అధ్యక్షభవనం శ్వేతసౌధంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానాలను చూస్తే అమెరికా టారిఫ్‌ల మోత ఇప్పట్లో ఆగేలా లేదని స్పష్టమవుతోంది. మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌ను విలేఖరులు భారత్ సంబంధిత ప్రశ్న సంధించారు.
‘‘ రష్యాతో ఎన్నో దేశాలు ముడిచమురు వాణిజ్యం చేస్తోంటే కేవలం భారత్‌ను మీరు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ మోపారు. రష్యాతో చైనా సైతం ఇదే తరహా వాణిజ్యంచేస్తోంది. మరి చైనాపైనా టారిఫ్ మరోసారి పెంచుతారా?’’ అని ప్రశ్నించగా ట్రంప్ సంచలన విషయం చెప్పారు. ‘‘ భారత్‌పై రెండో దఫా టారిఫ్‌లు పెంచి కేవలం 8 గంటలే గడిచాయి. అప్పుడే ఏం అయిపోయింది? మున్ముందు ఏం జరగబోతోందో మీరే చూస్తారుగా.
పరోక్ష ఆంక్షలపర్వంలో భాగంగా రెండో దఫాలో మరింతగా టారిఫ్‌ను పెంచబోతున్నాం’’ అంటూ చైనాకు టారి‹ఫ్ వేడి తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పారు. గత కొన్నేళ్లుగా చైనాతో వైరం ముదరడంతో భారత్‌తో అమెరికా సత్సంబంధాలను పటిష్టంచేసుకోగా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ మైత్రీబంధం కీలకమలుపు తీసుకుంది. రష్యాకు భారత్ వంటి దేశాలు కీలక వాణిజ్యభాగస్వాములుగా కొనసాగుతున్న తరుణంలో ఈ దేశాలపై సుంకాల కత్తి వేలాడదీసి రష్యాను ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి బలవంతంగా ఒప్పించాలని అమెరికా యతి్నస్తోంది. ఇందులోభాగంగా భారత్‌పై మరో పాతిక శాతం టారిఫ్‌ను విధించడం తెల్సిందే.
అమల్లోకి నూతన టారిఫ్
60కిపైగా దేశాలపై ట్రంప్ మోపిన కొత్త టారిఫ్‌లు గురువారం అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా బ్రెజిల్, భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. సిరియా(41 శాతం), లావోస్(40), మయన్మార్ (40), స్విట్జర్లాండ్(39), ఇరాక్(35), కెనడా(35), సెర్బియా(35), బోస్నియా హెర్జ్‌గోవినా(30), లిబియా(30), దక్షిణాఫ్రికా(30), మెక్సికో(25), బంగ్లాదేశ్(20), శ్రీలంక(20), తైవాన్(20), వియత్నాం(20), కాంబోడియా(19), పాకిస్తాన్(19శాతం)పై విధించిన అదనపు సుంకాలు గురువారం అమల్లోకి వచ్చాయి. తమకు మిత్రులుగా ఉన్న జపాన్, దక్షిణకొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కేవలం 15 శాతం సుంకాలు ట్రంప్ విధించారు. బ్రిటన్‌పై కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించారు.
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి.
చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్‌ఎస్‌ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి.
మారుతున్న భారత్ వ్యూహం
చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది.ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం.
షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా..
త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది.
కలిసి నడుస్తానన్న బ్రెజిల్
తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్‌చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్
Telangana
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి.. కేంద్రం అమలు చేస్తున్న విధానాల ఫలితంగా ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ ప్రారంభమైన 2020 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు.. తెలంగాణలో నమోదైన ఎంటర్‌ప్రైజ్‌ల ద్వారా 1.59 కోట్ల మందికి ఉపాధి లభించిందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ వెల్లడించింది.
గురు వారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఈ ఐదేళ్ల కాలంలో నల్లగొండ జిల్లాలో 5.92 లక్షల మందికి, సూర్యాపేట జిల్లాలో 5.44 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. పశుపోషణ, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, తేనె పరిశ్రమలు వంటి సంప్రదాయ రంగాలు కూడా పీఎంఈజీపీ పథకంలో భాగంగా అంగీకరించామని, అన్ని రాష్ట్రాల్లోనూ, వెనుకబడిన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు, తాగునీటిని సరఫరా చేసే సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగనుందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్‌పీ) హెచ్చరించింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ సభ్యులు, డిజైన్స్ విభాగం నిపుణుడు అశోక్‌కుమార్ గంజు నేతృత్వంలో సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు యోగిందర్‌కుమార్ శర్మ, హైడ్రాలజిస్ట్/నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ పి.రామరాజు, జీఎస్‌ఐ మాజీ డీజీ ఎం.రాజు, డ్యామ్ గేట్ల నిపుణుడు ఎన్.కన్హయ్య నాయుడుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎస్‌ఆర్‌పీ మార్చి 23న సింగూరు జలాశయాన్ని సందర్శించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
సామర్థ్యానికి మించి నీటి నిల్వలతో..
‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్‌స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తోపాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల అప్‌స్ట్రీమ్ వంపునకు రక్షణగా ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్ దెబ్బతింది.
వాస్తవ డిజైన్ల ప్రకారం జలాశయంలో నీటినిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది.
కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది. అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించకపోవడం వల్ల జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.
అత్యవసరంగా రివిట్‌మెంట్‌కి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించకపోతే ఏ క్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. సింగూరుకు దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్‌డ్యామ్‌లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరగొచ్చు’అని నిపుణుల ప్యానెల్ నివేదికలో హెచ్చరించింది.
మరమ్మతులకు అనుమతించండి..
వర్షాకాలం ముగిశాక జలాశయంలో నీటి నిల్వను తగ్గించి అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ సూచించింది.
మట్టికట్టల రక్షణ కోసం కట్టిన పారాపెట్ వాల్ ఒకచోట కుంగిపోయి నిలువనా చీలినందున గ్రౌటింగ్‌తో చీలికలను పూడ్చాలని సూచించింది. జలాశయంలో 97 శాతం నిల్వలు పూర్తిగా గేట్లపై ఆధారపడినందున గేట్ల నిర్వహణకు నిరంతరం పూర్తి సంసిద్ధతతో ఉండాలని సూచించింది.
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం..
మంజీరా నదీపై 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1989లో నిర్మించిన సింగూరు జలాశయం ఏటా హైదరాబాద్‌కు 6.96 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తోంది. మంజీరా, మహబూబ్‌నగర్, ఫతేహ్ నహర్, నిజాంసాగర్‌లకు అవసరమైన నీటిని నిల్వ చేసి వాటికి అవసరమైనప్పుడు విడుదల చేస్తోందని ప్యానెల్ తెలిపింది.
ఈ క్రమంలో మార్గమధ్యంలోని ఎన్నో చెక్‌డ్యామ్‌లను నింపుతూ కనీసం 7 కరువుపీడిత జిల్లాలకు జీవనాడిగా సేవలందిస్తోందని పేర్కొంది. గోదావరి నదీ సబ్ బేసిన్–4 పరిధిలోని తీవ్ర కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని సరఫరా చేసే మేజర్ ప్రాజెక్టు సింగూరుకు విపత్తు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. 2016, 2019, 2024లలో జలాశయానికి తనిఖీలు చేసి స్పిల్‌వే, ఎర్త్ డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని నివేదికలు ఇవ్వగా ఇప్పటివరకు చేయలేదని ప్యానెల్ తేలి్చంది.గోదావరిఖని(రామగుండం): మహిళా బైక్‌రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు శ్రావణం చీర కానుక ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన మహిళలకు చీర, జాకెట్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. హెల్మెట్ ధరించి.. నిబంధనలకు అనుగుణంగా బైక్ డ్రైవ్ చేస్తున్న మహిళలను గుర్తించి చీరలు అందజేసి సత్కరించారు.
ట్రాఫిక్ చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ పార్కింగ్ ఫైన్‌లే కాదు.. నిబంధనలు పాటించే వారిని గుర్తించి గౌరవిస్తామని రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మొదటి దఫాగా పదిమంది మహిళలను గుర్తించి చీరలు అందజేసినట్లు తెలిపారు. భర్త హెల్మెట్‌తో బైక్ నడుపుతుంటే.. వెనకాల కూర్చున్న భార్యకు కూడా చీర, జాకెట్ అందజేసి.. హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించాలని ఏసీపీ కోరారు.
బట్టల దుకాణాల యజమానుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వివరించారు. గతంలో పూలు అందజేసి అభినందిస్తే చాలామంది బాధపడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు చీర, జాకెట్, బైక్ నడిపే పురుషులకు ప్యాంట్, షర్ట్ దాతల సహకారంతో అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐ హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
కే.నవీన్ కుమార్ అనే ఎస్సీ కేటగిరీ విద్యార్థి టీజీఈఏపీసెట్–2025లో ర్యాంకు సాధించి మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించాడు. మూడు రోజుల క్రితం కాలేజీలో రిపోర్టు చేసేందుకు వెళ్లాడు. నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందన్న ధీమాతో వెళ్లిన అతడికి కాలేజీ యాజమాన్యం మాటలతో దిమ్మ తిరిగి పోయింది. ట్యూషన్ ఫీజు, ఇతర నిర్వహణ ఫీజులు కలిపి రూ.1.25 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని చెప్పినప్పటికీ..ఆ డబ్బు విద్యార్థి వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తారని, ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. సీటును కాపాడుకొనేందుకు అప్పుచేసి ఎలాగోలా ట్యూషన్ ఫీజు చెల్లించాడు.
మాసాబ్‌ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ – సైఫాబాద్‌లో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతన్న ఎస్సీ విద్యారి్థకి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ.. మూడు సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రూ.75వేలు (ఏటా రూ.25 వేల చొప్పున) చెల్లించాలని కాలేజీలో ఆదేశించింది. ఫీజు చెల్లించకపోతే క్లాసులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షల హాల్ టిక్కెట్లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు విద్యారి్థ.. ఫీజు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఫీజుల చెల్లింపుల విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మార్పులు వారి నెత్తిన పిడుగుపాటుగా మారాయి. ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించినప్పటికీ.. వారు పూర్తి ఫీజును ముందుగా చెల్లిస్తేనే కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజులను సైతం విద్యా సంవత్సరం మొదట్లోనే వసూలు చేస్తున్నాయి. లేదంటే తరగతులకు అనుమతించటం లేదు. ప్రైవేటు కాలేజీలతోపాటు ప్రభుత్వ కాలేజీలు కూడా ఇదే కండిషన్లు పెడుతుండటంతో విద్యార్థులు వేలు.. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.
ఫీజుల కోసం అప్పులపాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో ఎస్సీ విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉంటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు 1,22,205 (రెన్యూవల్స్), 77,722 (ఫ్రెషర్స్) దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులు 45 వేల మంది ఉన్నారు. జనరల్ కోర్సుల ఫీజులు రూ.వేలల్లో ఉండగా.. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు రూ.లక్షలకు చేరాయి.ఇంత పెద్దమొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర భారంగా మారుతోంది. చదువును కొనసాగించాలంటే తప్పనిసరిగా అప్పులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా.. కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
నిబంధనల మార్పుతో మొదటికే మోసం..
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వాలు మార్పులు తీసుకొచ్చాయి. ఎస్సీ విద్యార్థుల ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటా ఫీజు నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి కాలేజీలకు నేరుగా చెల్లించేది. ఈ విధానాన్ని మార్చి ఫీజులో తన వాటాను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఆ మేరకు విద్యార్థి వివరాలను ఈపాస్ ద్వారా లింక్ చేసుకుని నిధులు విడుదల చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఫీజును విద్యార్థి ఖాతాలోనే జమ చేస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను లబి్ధదారులకు నేరుగా అందించేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ ఫీజు విద్యార్థి ఖాతాలో జమ కావటానికి కొంత సమయం పడుతుంది. ఫీజు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత దానిని విద్యార్థి నుంచి కాలేజీలు తీసుకోవాలి. కానీ, అప్పటివరకు ఆగకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు మొత్తం వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్‌నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్‌షెడ్‌కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
సాక్షి, మహబూబాబాద్: ఆ ఊరు ఉపాధ్యాయులకు కేరాఫ్‌గా మారింది. ఎన్ని ఎకరాల భూములున్నా.. ఎంత పెద్ద కొలువు వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ఊరి యువత మాత్రం బడి పంతులు ఉద్యోగానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. అందుకే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటను ఉపాధ్యాయుల ఊరుగా చెప్పుకుంటారు.
గ్రామ సర్పంచ్ చొరవతో..
స్వాతంత్య్రానికి ముందు నుంచే నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది. అప్పుడు ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. ఆ రోజుల్లో ఖాజాం అలీ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు. ఆ తర్వాత షేక్ హుస్సేన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఊరి పాఠశాలలో తెలుగు మీడియం బోధించడం మొదలు పెట్టారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండో సర్పంచ్‌గా ఎన్నికైన నాయిని మనోహర్ రెడ్డి.. బడిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎస్సెస్సీ తర్వాత హెచ్‌ఎస్‌సీ కోర్సును ప్రవేశపెట్టారు.అది చదివిన వారు ఇంటర్ చేయకుండానే ఎస్జీబీటీ శిక్షణకు అర్హులు. అలా ఆ ఊరిలో హెచ్‌ఎస్‌సీ చదివిన వారు.. సర్పంచ్ వద్దకు వెళ్లి చెప్పడంతో అప్పుడు సమితి అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపితే చాలు మరుసటి రోజు నుంచే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరే వారు. ఇలా ఒక్కొక్కరుగా సమితిలో ఉద్యోగం చేరడం.. వారి తర్వాత తరం కూడా కాలానుగుణంగా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని చదవడం, ఉద్యోగాలు పొందడం పరిపాటిగా మారింది. ఇలా గ్రామంలోని కుటుంబాలకు కుటుంబాలే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. గ్రామంలో పుట్టి చదువుకున్నవారే కాకుండా గ్రామం, పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం గమనార్హం.
ప్రతీ డీఎస్సీలో ఉద్యోగం..
స్వాతంత్య్రానికి ముందు ఉర్దూ మీడియం, తర్వాత తెలుగు మీడియంలో సమితి పరిధిలో నియామకాల నుంచి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే డీఎస్సీ వరకు ప్రతిసారి ఈ గ్రామానికి ఉపాధ్యాయ ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం. 2024 డీఎస్సీలో కూడా నర్సింహులపేట గ్రామం నుంచి టీచర్లు, 15 మందికి గురుకుల టీచర్ ఉద్యోగం వచి్చంది. ఇప్పటికీ బీఈడీ, డీఈడీ, పీఈటీ, పండిట్, టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని డీఎస్సీ ఎప్పుడు పడుతుందా? అని ఎదురు చూసేవారు 50 మందికి పైగా ఉంటారు.మా కుటుంబం నుంచి పది మంది టీచర్లు..
మాది ఉమ్మడి కుటుంబం. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఇందులో నలుగురం, మా బావ, మా పిల్లలు, అల్లుళ్లు మొత్తం పది మందిమి ప్రభుత్వ ఉపాధ్యాయులమే. మా ఇంట్లో ఫంక్షన్లు వస్తే అందరం ఉపాధ్యాయులమే కనిపిస్తాం. ఉపాధ్యాయులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తాం.
– కొండ్రెడ్డి మల్లారెడ్డి, నర్సింహులపేటదొరవారి దగ్గరికి పోతే ఉద్యోగమే..
మా రోజుల్లో పంతులు ఉద్యోగం అంటే జీతం తక్కువ. అందుకోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. మా ఊరి దొరవారు (సర్పంచ్ మనోహర్ రెడ్డి) ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలని ప్రోత్సహించేవారు. చదువుకొని ఆయన దగ్గరికి పోతే పోస్టు పెట్టించే వారు. మా ఇంటి నుంచి ముగ్గురం అన్నదమ్ములం, మా అక్కకొడుకు, వాళ్ల పిల్లలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులమే.
– దాసరోజు దక్షిణామూర్తి, నర్సింహులపేటటీచర్ ఉద్యోగం చేయాలన్న క్రేజీ
మా ఊరిలో ఎంత చదివాం అన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకోసమే నేను, మా తమ్ముడు, మరదలు, ఇద్దరు కొడుకులు, కోడలు అంతా ప్రభుత్వ ఉపాధ్యాయులమే. ఏ ఉద్యోగం చేసినా లేని తృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది.
– గండి మురళీధర్, నర్సింహులపేటపూర్వం నుంచి అదే పద్ధతి
గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. వారిని చూసినప్పుడల్లా తాము కూడా అదే కావాలని కోరుకుంటూ చదువుతారు. అందుకోసమే ఇంటర్ పూర్తి కాగానే డీఈడీ, డిగ్రీ పూర్తి కాగానే బీఈడీ పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ డీఎస్సీలో మా ఊరికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది.
– జినుకల వెంకట్రాం నర్సయ్య, నర్సింహులపేటసాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు, రైతులకు ఎలాంటి సాయమైనా అందించేందుకు అందుబాటులో ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో గురువారం భారీగా కురిసిన వర్షాలపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు.
కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన గురువారం గోవా యూనివర్సిటీ సమీపంలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన 10వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలు కోరుకున్న కులగణన ప్రక్రియను మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతోందన్నారు.
వచ్చే ఏడాదిలో జరిగే జనగణనలో కులగణనను జోడించిందని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీలకు మేలు చేసే ఉద్దేశంతో కేబినెట్‌లో 27 మంది బీసీలకు అవకాశం కలి్పంచారన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ మహాసభల ద్వారా బీసీల ఐక్యత పెరుగుతుందని.. డిమాండ్లు సాధించుకొనే అవకాశం లభిస్తుందన్నారు. తన మంత్రివర్గంలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. గోవా కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాకూర్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు తేల్చి జనాభా ఆధారంగా బీసీలకు వాటా అందించాలన్నారు. సదస్సుకు విశిష్ట అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారం అహిర్ హాజరయ్యారు.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలి: జాజుల
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం చేసిన కులగణన ప్రక టన 100% బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామన్నారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ ప్రకారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశ పథకం కింద రాష్ట్ర ట్రాన్స్‌కో చేసిన ప్రతిపాదనలకు అనుమతినివ్వాలని.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం కలిశారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 13.5 గిగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ పవర్ జోన్‌ను గుర్తించిందని తెలిపారు.
సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా జాతీయ కారిడార్‌కు అందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ట్రాన్స్‌కో రూ.6895 కోట్లతో ఎనిమిది ట్రాన్స్‌మిషన్ పథకాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతించాల్సి ఉందన్నారు. అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ‘భట్టి’ కోరారు.
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న కరీంనగర్ వేదికగా ‘బీసీ సభ’నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత ఈ నెల 8న కరీంనగర్‌లో బీసీ సభ నిర్వహిస్తామని ప్రకటించినా తక్కువ సమయంలో భారీ సభ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో 14వ తేదీకి వాయిదా వేసింది.
ఈ సభ వేదికగా బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ బీసీ కీలక నేతలు గురువారం భేటీ అయ్యారు. మాజీ మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిల్చోఛ్చి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సహా 50 మంది ఈ భేటీలో పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరి, కేంద్రం స్పందిస్తున్న తీరుపై చర్చించారు. కేటీఆర్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. జిల్లాలవారీగా బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో డ్రామాలు
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు తనంతో ఆర్డినెన్స్ ఇచ్చి సంబురాలు చేసుకుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా ముఖ్య నేతలెవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో కేంద్రం నుంచి గ్రాంట్‌లు, కేంద్ర పథకాల నిధులు ఆగిపోయాయి.
దీంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్ది గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం.
8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా
ఈ నెల 8వ తేదీలోగా గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే.సాక్షి, హైదరాబాద్/తిర్యాణి/కెరమెరి/కౌటాల: హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.
సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్‌మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.
నగరమంతా ట్రాఫిక్ చక్రబంధం..
రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటలపాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్‌బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, బషీర్‌బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్‌పేట వరకు, ట్యాంక్‌బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.కూ కట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కా జిగిరి, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబా ద్, నాంపల్లి, చార్మినార్, ఎల్‌బీనగర్, రాజేంద్రన గర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతా బాద్ – రాజ్‌భవన్ రహదారి నీట మునిగింది.
పలు జిల్లాల్లోనూ..
పలు జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాల్లో పిడుగుపాటుకు ఏడు పశువులు మృతిచెందాయి. చేలల్లో పని చేస్తున్న పలువురు గాయపడ్డారు.
Andhra Pradesh
విశాఖ సిటీ: విశాఖ వన్‌టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ రోడ్డులోని వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విస్ఫోటనం ధాటికి షాపు తునాతునకలైంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. సున్నపువీధి ప్రాంతంలో నివాసముంటున్న చల్లా గణేష్ (44) 6 నెలల క్రితమే బుక్కావీధి ప్రాంతంలోని ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించాడు.
వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ తో పాటు హెల్పర్ శ్రీను, రోజువారీ వేతనం కింద ఎర్ర ఎల్లాజీ (45), డి.సన్యాసిరావు (46) పని చేస్తున్నారు. సాయంత్రం 4.30 సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండాపోయింది. షాపు యజమాని చల్లా గణేష్, హెల్పర్ శ్రీను శరీరాలు ముక్కలై షాపు వెనుక ఉన్న 9 అడుగుల గోడ పైనుంచి ఎగిరి అవతలివైపు పడ్డాయి.
వర్కర్లు ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు దాని పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు (27), ఇప్పిలి రంగారావు(53)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో వన్‌టౌన్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి కేజీహెచ్‌కు తరలించారు. చింతకాయల ముత్యాలు శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 7 గంటలకు మరణించాడు. ప్రస్తుతం 95 శాతం కాలిన గాయాలతో ఎల్లాజీ, 75 శాతం గాయాలతో ఇప్పిలి రంగారావు, 18 శాతం గాయాలతో డి.సన్యాసిరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా పేలుడుకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుకు వెల్డింగ్ సిలిండర్ కారణమా? లేదా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగంతోనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
మెళియాపుట్టి : ఆ బాలుడికి కాళ్లు, చేతులు పనిచేయవు. వినిపించదు కూడా. 2024లో శ్రీకాకుళం రిమ్స్ ప్రభుత్వ వైద్యులు అతడికి వందశాతం వైకల్యం ఉందని నిర్ధారించారు. కానీ ప్రభుత్వం అతడికి పింఛన్ మంజూరు చేయలేదు. కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు పింఛన్ ఇచ్చినా తీసుకునేందుకు ఆ బాలుడు లేడు. మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామానికి చెందిన అగ్గాల పార్వతి, సునీల్ కుమార్‌ల ఒక్కగానొక్క కుమారుడు సందీప్(9) పూర్తిగా దివ్యాంగుడు.
బాణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు దివ్యాంగ సరి్టఫికెట్ తీసుకుని పలుమార్లు మండల పరిషత్, సచివాలయాలకు తిరిగినా పింఛన్ మాత్రం రాలేదు. మూడు రోజుల కిందట విద్యార్థి తీవ్రమైన జ్వరంతో పలాసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. దీంతో బిడ్డ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సాక్షి, అమరావతి: నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలుపై కూటమి సర్కారు ఏపాటి చిత్తశుద్ధితో ఉందో ప్రభుత్వ పెద్దల ప్రకటనలే అద్దం పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1న మంత్రి సవిత విడుదల చేసిన ప్రకటనకు తాజాగా గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన లెక్కలకు పొంతన లేకపోవడం గమనార్హం. లబ్ధిదారుల సంఖ్యపై పరస్పర విరుద్ధంగా లెక్కలు చెప్పడంతో నేతన్నలు నివ్వెరపోతున్నారు.
ముఖ్యమంత్రి ఇలా అన్నారు..
మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో చేనేత మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు, పవర్ లూమ్స్ ఉన్న 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికులు ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగంలో దాదాపు 1,22,644 కుటుంబాలు ఉన్నాయన్నారు.2014–19లో 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలున్న 50 వేల కుటుంబాలకు 500 యూనిట్లు (ఈ లెక్కన మొత్తం 1.43 లక్షల కుటుంబాలు) ఉచిత విద్యుత్ అని ప్రకటించడం గమనార్హం.
ప్రభుత్వ ప్రకటనలో ఇలా..
రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, 2.50 లక్షల మంది చేనేత వస్త్రాల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారని బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. మగ్గాలపై నేసే నేతన్నలకు ఏడాదికి రూ.14,956, మర మగ్గాలపై ఆధారపడిన వారికి రూ.32,604 మేర లబ్ధి కలగనుందని ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం రూ.300 కోట్లుపైనే అవుతుంది.మంత్రి ప్రకటన మరోలా..
రాష్ట్రంలో 65 వేల చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ రూపంలో రూ.125 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఈ నెల 1న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 50 వేల మగ్గాలు, 11,500 మర మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కన చూస్తే 61,500 మంది మాత్రమే అవుతారు. లబ్ధిదారుల సంఖ్య, ప్రయోజనం మొత్తంపై ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు గందరగోళంగా వ్యవహరిస్తుంటే పథకం ఏ మేరకు చిత్తశుద్ధితో అమలవుతుందో ప్రభుత్వానికే ఎరుక!!సాక్షి, అమరావతి/మంగళగిరి: చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయ్.. రూ.పదిలక్షల కోట్లు అప్పులున్నాయ్.. వా టికి వడ్డీలు, అసలు కట్టడానికే ఇబ్బందిపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ వీవర్స్ కాలనీలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. సభలో సీఎం మాట్లాడుతూ.. మీ (బీసీలు) వల్లే అధికారంలోకి వచ్చానని, నా మొదటి ప్రాధాన్యం వెనుకబడిన వర్గాలేనని, కొన్ని వర్గాలు వస్తుంటాయి.. పోతుంటాయని పేర్కొన్నారు.
ఇంకా వైకుంఠపాళీ ఆడొద్దని, మళ్లీ మళ్లీ డెవలప్ చేయాలంటే ఇంకా నాకు ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో బీసీల కోసం ఆదరణ–3 తెస్తామని, స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. నేతన్న భరోసా కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చెప్పారు.
అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం
చేనేత ఉత్పత్తులపై విధించే 5 శాతం జీఎస్టీని మొత్తం రూ.15కోట్లను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం పేర్కొన్నారు. చేనేతలో 5,386 మందికి లబ్ధి కలిగేలా రూ.5 కోట్లతో పొదుపు నిధి(థ్రిఫ్ట్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని, మంగళగిరిలో పార్కుకు ఆయన పేరుపెట్టి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.బ్రాహ్మణి కట్టిన చీరనే 98 మంది కొన్నారు : లోకేశ్
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంటే.. మంగళగిరిలో మాత్రం మోదీ, బాబు, లోకేశ్‌తో కూడిన ట్రిపుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీర కట్టిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలాంటి చీరనే 98 మంది కొనుగోలు చేశారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.పేదరిక నిర్మూలన కోసమే పీ–4
సాయం చేస్తే సంతృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో గురువారం పీ–4పై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేదరిక నిర్మూలన కోసమే పీ–4 అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.నవ్వులపాలైన నారా లోకేశ్..
టాస్క్ ఫోర్స్ : ఎప్పటిలాగే మంత్రి నారా లోకేశ్ మరోసారి తప్పులో కాలేశారు. మంగళగిరిలో గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించారు. ఆ మాటల ప్రవాహంలో పాపం నవ్వులపాలయ్యారు. ‘2019 ఎన్నికల్లో.. నేను మంగళగిరిలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, అయితే, నన్ను 2024 ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించమని కోరాను.కానీ, ఏకంగా 91 వేల నాలుగు వందల 13 వేల మెజారిటీతో గెలిపించార’ని నోరుజారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 91 వేల నాలుగు వందల 13 వేలు ఏంట్రా బాబూ అంటూ సభకు వచ్చిన వారు తలపట్టుకుని నవ్వుకున్నారు.
తాడిపత్రి టౌన్: టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు తాడిపత్రిలో మరోసారి రెచ్చిపోయారు. రౌడీల్లా మారి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే దాడులు చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి బుధవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌లో బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం.. రాత్రికే వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు జరగడం చూస్తే జేసీ అనుచరులే దాడులకు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
అర్ధరాత్రి వీరంగం
బుధవారం అర్ధరాత్రి 8 మంది వ్యక్తులు ముఖాలకు మాసు్కలు, హెల్మెట్లు ధరించి పట్టణంలో ద్విచక్ర వాహనాలపై వీరంగం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెచి్చపోయారు. పట్టణంలోని చేనేత కాలనీలో ఉంటున్న గడ్డం పరమేశ్, చిన్నబజార్‌లో ఉన్న షబ్బీర్, రజక వీధిలో ఉన్న డీవీ కుమార్, లక్ష్మీరంగయ్య ఇళ్లపై రాళ్లు, బీరు సీసాలు, రాడ్లతో దాడులు చేశారు.గడ్డం పరమేష్ ఇంటి తలుపులు ధ్వంసం చేసి పరమేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పరమేష్‌కు మెడ, చేతులకు గాయాలయ్యాయి. షబ్బీర్ ఇంటిముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో పచ్చమూకలు ‘మరోసారి వైఎస్సార్‌సీపీ అంటూ కార్యక్రమాలు చేస్తే చంపేస్తాం’ అని గట్టిగా కేకలు వేస్తూ బెదిరింపులకు దిగినట్టు బాధితులు వాపోయారు.
హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
తాడిపత్రిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయని, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, వారి అనుచరులు ఇష్టారీతిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేశారు.టీడీపీ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి ‘ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పెళ్లిళ్లకు, శుభకార్యాలకు తాడిపత్రి ఆహ్వానించినా, ఆయన పేరుమీద వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు నిర్వహించినా దాడులు చేస్తామని హెచ్చరికలు చేశారు. అదేరోజు రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం పరమేష్, లక్ష్మీరంగయ్య, షబ్బీర్ ఇళ్లపై దాడులు జరిగాయి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిసినా కనీం ప్రాథమిక విచారణ కూడా చేయలేదన్నారు. కాగా.. పచ్చమూకల దాడిలో గాయపడిన, భయాందోళనతో ఇంటికే పరిమితమైన బాధిత కుటుంబాలను గురువారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.
సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ విమర్శించింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ కేబినెట్ సమావేశంలోనూ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలపై చర్చించలేదని పేర్కొంది. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలోనైనా బకాయిలు, డీఏలు, ఆరి్థక ప్రయోజనాలు, 12వ పీఆర్సీ, ఐఆర్ పైనా ప్రభుత్వం ప్రస్తావిస్తుందనుకున్నా నిరాశే మిగిలిందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్ కుమార్ రెడ్డి, గెడ్డం సుధీర్ విమర్శించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని, బకాయిలన్నీ విడుదల చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచి్చన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం మానేసిందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు జరిగి మూడు నెలలు కావొస్తున్నా, కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు సత్వరం పరిష్కరించకపోతే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.
‘విద్యాశక్తి’ని వాయిదా వేయాలి
కాగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘విద్యాశక్తి’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి మరో ప్రకటనలో డిమాండ్ చేశారు. పాఠశాల పనివేళలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనడం అధికారుల అనాలోచిత నిర్ణయమని, ఇది ఉపాధ్యాయులపై పనిభారాన్ని పెంచడమేనని విమర్శించారు.సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అలా ఆమోదం తెలిపిందో లేదో.. అందుకు సంబంధించి గురువారం వెనువెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయాయి. బడ్జెట్ బయట ఏపీఐఐసీ, డిస్కమ్స్ ద్వారా ఏకంగా రూ.12,973. 94 కోట్ల అప్పునకు ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల అప్పును వచ్చే 12 నెల ల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా కోటి రూపాయలు అదీకృత షేర్ కేపిటల్, రూ. లక్ష పెయిడ్–అప్ షేర్ కేపిటలతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేశారు. ఎస్‌పీవీ బోర్డు అవసరాల ఆధా రంగా ఎప్పటికప్పుడు అధీకృత పెయిడ్–అప్ కేపి టల్, షేర్ కేపిటల్‌ను పెంచవచ్చునని తెలిపారు.
ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర ఉన్న భూములను ఎస్‌పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు, ఆర్థిక సంస్దలకు తనఖా పెట్టి 9–12 నెలల కాలవ్యధిలోనే రూ.7,500 కోట్లు రుణాన్ని సమీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర 13,000 ఎకరాలకుపైగా భూములున్నాయని, కొత్తగా మరో 30 వేల ఎకరాలను సేకరించడంతోపాటు ఆ భూములను పరిశ్రమల అవసరాలకు అభివృద్ధి చేసేందుకు రూ.7,500 కోట్లు అప్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
విద్యుత్ డిస్కమ్స్ ద్వారా ఇలా..
ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మార్ట్ మీటరింగ్‌తోపాటు రేవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమును అమలు కొనసాగింపునకు ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా రూ.3544.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ ద్వారా రూ.1029.37 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క ఇప్పటికే ఏపీపీడీసీఎల్ ఎస్‌బీఐ, యుబిఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఆ సంస్థ ఖాతాల్లో నిధుల్లేక దివాళా తీసింది.ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులు ఆర్‌బీఐకి, సిబిల్, క్రిసిల్ సంస్థలకు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించాయి. ఏపీపీడీసీఎల్ ఆరి్థక పరిస్థితి దిగజారడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆ బ్యాంకులు దగ్గర ఏపీపీడీసీఎల్ తీసుకున్న రూ.900 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, అమరావతి: ‘‘కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి నిందితుల జాబితాలో ఎవరినీ ఎందుకు చేర్చలేదు? ప్రసన్న సమర్పించిన ఫొటోల్లో దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్పష్టంగా ఉన్నారు కదా? వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు..?’’ అని హైకోర్టు ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా దర్గామిట్ట పోలీసులను ప్రశ్నించింది.
ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు పురోగతి వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంటిపై దాడి గురించి ఫిర్యాదు ఇచ్చినా సకాలంలో కేసు నమోదు చేయలేదని, తర్వాత కేసు నమోదు చేసినా, దాడి చేసినవారిని నిందితులుగా చేర్చలేదని, ఈ విషయంలో పోలీసులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రసన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు.
ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతోనే దాడి...
పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రూపేష్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. దాడికి పాల్పడినవారి ఫొటోలను, ఆ ఘటన సీసీ ఫుటేజీని పిటిషనర్ పోలీసులకు సమర్పించారని తెలిపారు. అయినా పోలీసులు కేసు నమోదులో విపరీతమైన జాప్యం చేసి, దాడి బాధ్యులను నిందితులుగా చేర్చలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల స్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతో... పిటిషనర్ ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఎ.జయంతి వాదిస్తూ, ఎవరిని నిందితులుగా చేర్చాలన్నది పోలీసుల విచక్షణకు సంబంధించినదని తెలిపారు. దర్యాప్తు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్నది పిటిషనర్ నిర్దేశించలేరన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు జరిపారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలని పోలీసులను ఆదేశించారు. అలాగే నిందితులుగా ఎవరినీ ఎందుకు చేర్చలేదో కూడా చెప్పాలన్నారు.
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ప్రధాన కార్యాలయాల ముట్టడికి ఛలో విద్యుత్‌సౌధ కార్యక్రమాన్ని చేపట్టిన కార్మికుల్ని నిరంకుశంగా అడ్డుకుని అణచివేసింది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (యూఈసీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు, నాయకులు గురువారం విజయవాడ తరలివచ్చారు.
కార్మికుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఉదయం 8 గంటల నుంచే అత్యుత్సాహంగా వ్యవహరించారు. రామవరప్పాడు రింగ్, విద్యుత్‌సౌధ, గుణదల వంతెన, గుణదల సెంటర్ నుంచి పడవలరేవు వరకు తనిఖీలు చేపట్టారు. కార్మికులను, నాయకులను మార్గంమధ్యలోనే అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 200 మందికిపైగా కార్మికులను అరెస్టుచేసి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో విజయవాడ గుణదలలోని విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వాలు మారుతున్నా మా గతి మారదా?
విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్), తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని, వేతన వ్యత్యాసాలు లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. రూ.కోటి బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పీస్ రేట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని అభ్యర్థిస్తున్నారు.చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ రూ.10 లక్షలు చెల్లించాలని.. తదితర సమస్యలపై తరబడి వినతిపత్రాలు ఇసూ్తనే ఉన్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఛలో విద్యుత్‌సౌధకు కార్మిక, ఉద్యోగసంఘాలు పిలుపునిచ్చాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రమంగా కార్మికుల్ని, నాయకుల్ని అరెస్టు చేసి, నిర్భంధించటం, ఉక్కుపాదం మోపడం అన్యాయమని యూఈసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు జల్లెడ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం నాయకులు విద్యుత్‌సౌధ ఆవరణలోని ఏపీ ట్రాన్స్‌కో అడిషనల్ సెక్రెటరీ పెద్ది రోజాకు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేదంటే ఈ పోరాటం మరింత తీవ్రతరమవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ నాయకులు డి.సూరిబాబు, బి.సుమన్, ఎన్.విజయరావు, ఎ.వి.నాగేశ్వరరావు, ముజఫర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ విద్యుత్ సౌధ వద్ద గురువారం ఆందోళన చేపట్టిన కార్మికులు, నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు.
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ మీద దాడిచేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు పెల్లుబికాయి. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో వేలాదిగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ నాయకుడు రమేష్ యాదవ్‌పై దాడిచేసిన వారిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం వర్గీయులు ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేమని అడ్డదారుల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాదన్నరగా కూటమి పాలనలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూసి జ్యోతిరావ్ పూలే ఆత్మ క్షోభిస్తోందన్నారు. అధికారం ఉంది కదా అని బీసీలపై దౌర్జన్యానికి, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించబోమన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
శాంతియుతంగా నిరసన
గుంటూరు హిందూ కాలేజీ కూడలి, తిరుపతి బాలాజీ కాలనీ, అనంతపురం జెడ్పీ కార్యాలయం, నెల్లూరు మినీ బైపాస్‌రోడ్డు, కర్నూలులోని బిర్లా సర్కిల్, నంద్యాలలోని పద్మావతినగర్ ఆర్చి, కాకినాడ, ఏలూరు, అనకాపల్లిల్లో జ్యోతిరావ్ పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావ్ పూలే విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్‌లో జ్యోతిరావ్ పూలే చిత్రపటంతో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు.
సాక్షి, అమరావతి: నేతన్నల జీవితాలు బాగు పడాలన్న ఆకాంక్షతో వైఎస్సార్‌సీపీ హయాంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేసి ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచామని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ గురువారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తమ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేస్తూ అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలను సైతం చంద్రబాబు మోసం చేసిన వైనాన్ని ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..
నేతన్నలకు రూ.3,706.16 కోట్ల సాయం చేశాం..
ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘సంత్ కబీర్’’ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్‌లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు అభినందనలు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి అడుగులోనూ నేతన్నలకు అండగా నిలిచాం.మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ఏటా రూ.24,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం.
అంతేకాదు.. వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు మేర సాయం చేశాం. ఇది ఒక రికార్డు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్‌కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం.
ఏ రకంగా ఆదుకున్నట్లు..?
ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపివేయడంతోపాటు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్‌టీ రీయింబర్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే
దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. కానీ రెండు బడ్జెట్‌లలో ఈ ప్రభుత్వం పెట్టింది సున్నా. పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. కానీ 14 నెలలు గడిచినా అమలు చేయలేదు.కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు గానీ విద్యుత్తు చార్జీలు అమాంతం పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19 వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు? పత్రికల్లో ప్రకటనలు మినహా ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు.
ప్రజలను పట్టి పీడించే పిండారీలు, జంతువులను వేటాడే ఆది మానవ తెగలను తలదన్నే రీతిలో పచ్చ ముఠాలు అత్యంత క్రూరంగా, కిరాతకంగా వ్యవహరిస్తున్నాయి. బందిపోటు ముఠాల మాదిరిగా 10 వాహనాల్లో ప్రత్యక్షమై మెరుపు దాడులకు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా వాహనాల్లో సంచరిస్తూ మారణాయుధాలు చేతబూని విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు కూటమి సర్కారు ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
టీడీపీ గూండాలను ఉసిగొల్పిన ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎన్నికల్లో రౌడీ రాజకీయాలకు తెర తీశారు. తమ ముందే బరి తెగించి దాడులకు దిగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయకపోగా కనీస చర్యలు కూడా తీసుకునే పరిస్థితిలో పోలీసు శాఖ లేదు. సర్కారు అండతో నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు బుధవారం నడిరోడ్డుపై పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిలను తీవ్రంగా గాయపరిచాయి. అంతకుముందు మంగళవారం సాయంత్రం పులివెందులలో మరో ఘటనలో.. ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులపై ఫంక్షన్ హాల్‌లోనే టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్ తదితరులను దారుణంగా కొట్టారు. దాదాపు 100 మందికిపైగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ చేసిన పోలీసులు ఘటనలకు కారకులైన టీడీపీ శ్రేణుల వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు.
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలోనే వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర అసహనంతో హత్యా రాజకీయాలకు పురిగొల్పుతోంది. రెడ్‌బుక్ కుట్రలతో ఏడాదిగా రాష్ట్రంలో సాగిస్తున్న అధికారిక దౌర్జన్యకాండను మారణకాండగా మార్చేందుకు టీడీపీ గూండాలకు లైసెన్స్ ఇచ్చేసింది. అయితే పచ్చ ముఠాల అరాచకాలు, ఆగడాలతో సీఎం చంద్రబాబు సంతృప్తి చెందడం లేదని స్పష్టమవుతోంది. అందుకే పట్టపగలు ఆయుధాలు చేతబట్టి నడిరోడ్డుపై హత్యలకు తెగబడమని పచ్చ జెండా ఊపేశారు.
పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు పక్కా పన్నాగంతో మారణాయుధాలు, పెట్రోల్ సీసాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నానికి తెగబడటమే అందుకు తాజా నిదర్శనం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న తీవ్రమైన దాడులు, హత్యాయత్నాలు వెల్లడిస్తున్నాయి.
‘దాడులు, హత్యాయత్నాలకు పాల్పడండి..! మేం చూసుకుంటాం..!’ అన్నట్టుగానే వారిద్దరూ వ్యాఖ్యానించడం గమనార్హం. అందుకోసం టీడీపీ గూండాలతోపాటు గంజాయి గ్యాంగ్‌లను ఉసిగొల్పారు. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణాలు, కల్తీ మద్యం కిక్కుతో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు, ఆకతాయిలు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి కత్తులు, ఇతర ఆయుధాలు చేతబట్టి స్వైర విహారం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఈ అధికారిక అరాచక కాండ, హత్యా రాజకీయాలకు పోలీస్ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీన వైఖరితో వత్తాసు పలుకుతోంది.
‘స్థానిక’ ఎన్నికల్లో అక్రమాలకే హత్యా రాజకీయాల కుట్ర..!
కూటమి సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు. దీంతో యథేచ్చగా అక్రమాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని పన్నాగం రచించారు. దాడులు, దౌర్జన్యాలే కాదు.. హత్యలకు కూడా తెగబడాలని కూడా టీడీపీ రౌడీమూకలకు ఆ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపింది. ఈ హత్యా రాజకీయాలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను చంద్రబాబు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేసుకుంది.ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వేముల మండల నేత వేల్పుల రామలింగారెడ్డి (రాము)లను పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చేందుకు పచ్చముఠాలు యత్నించాయి. పార్టీ నేతలతో మాట్లాడేందుకు నల్లగొండువారిపల్లెకు ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, వేల్పుల రాము వెళ్లిన విషయం పసిగట్టిన టీడీపీ గూండాలు వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో హత్యాయత్నానికి తెగబడ్డారు.
దీంతో అరగంట పాటు గ్రామంలో భీతావహ పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కడప జిల్లాల్లో క్రమం తప్పకుండా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు తెగబడతామని టీడీపీ గూండాలు ఈ ఉదంతం ద్వారా స్పష్టం చేశారు. తద్వారా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీ బహిష్కరించేలా చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగిస్తామని సంకేతాలిస్తూ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, పార్టీ నేత వేల్పుల రాములపై హత్యాయత్నానికి తెగబడింది.
వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకునే కుట్ర..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అరాచక పర్వానికి బరి తెగిస్తుండటం కూటమి ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. ఆయన పర్యటనల్లో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని ఇటీవల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించినప్పుడు టీడీపీ గూండాలు దారిలో మాటు వేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. అనుమతి లేకపోయినా టీడీపీ నేతలు, గూండాలను ఆ మార్గంలోకి పెద్ద ఎత్తున పోలీసులు అనుమతించడం గమనార్హం.టీడీపీ గూండాల గుంపు వైఎస్ జగన్ కాన్వాయ్‌పై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ అసాంఘిక శక్తులు చొరబడటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ముసుగులో అరాచక ముఠాలు ఏకంగా వైఎస్ జగన్ వాహనం వరకు చొచ్చుకు వస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో అడుగడుగునా రభస సృష్టించేందుకు టీడీపీ యత్నించింది. తద్వారా వైఎస్ జగన్ పర్యటనల్లో ఘర్షణలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే ప్రభుత్వ కుట్ర అన్నది స్పష్టమవుతోంది. ఆ నెపంతో వైఎస్ జగన్ పర్యటనలకు అనుమతి ఇవ్వకూడదన్నది ప్రభుత్వ పెద్దల దురాలోచన!!
నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ బరితెగింపు
చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ గూండాలు హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గూండాలు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించారు.ప్రసన్న కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో నివాసం, ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలోనూ జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దంపతులను అంతమొందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గూండాలు విధ్వంస కాండ సృష్టించారు. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం సన్నాహక సమావేశానికి వస్తున్న ఆమెను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె వాహనంపై దాడి చేశారు.
పచ్చమూకలకు మందు, గంజాయి
హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నింది. మద్యం సిండికేట్, గంజాయి మాఫియాను అందుకు సాధనంగా చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 75 వేల బెల్ట్ షాపులను టీడీపీ సిండికేట్ నిర్వహిస్తోంది. వాటి ద్వారా సాధారణ మద్యంతోపాటు సైకోలుగా మార్చే అత్యంత ప్రమాదకర స్పిరిట్‌తో కూడిన కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. మరోవైపు విశాఖ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) కేంద్రంగా గంజాయి మాఫియా రాష్ట్రవ్యాప్త దందా సాగిస్తోంది. మద్యం, కల్తీ మద్యం, గంజాయిలను రౌడీమూకలకు అందిస్తూ టీడీపీ సిండికేట్ వారిని పెంచి పోషిస్తోంది.తాము కనుసైగ చేసిన వెంటనే పల్లెలు, పట్టణాల్లో అలజడులు, విధ్వంసం సృష్టించేందుకు రంగంలోకి దింపుతోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు వారిని వాడుకుంటోంది. నెల్లూరులో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది టీడీపీ గంజాయి గ్యాంగే. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దంపతులపై హత్యాయత్నానికి తెగబడింది టీడీపీ నేతలు, కల్తీ మద్యం సైకో బ్యాచ్‌నే. ఇక పులివెందుల నియోజకవర్గం నల్లగొండువారిపల్లెలో ఏకంగా కత్తులు, సమ్మెట్లుతో దాడి చేయడం... ఓ ఇంటిపై ఏకంగా పెట్రోల్ పోసి మరీ నిప్పంటించి హత్య చేసేందుకు తెగబడటం సాధారణ రౌడీలు చేసే పని కాదు.
గంజాయి, కల్తీ మద్యం మత్తుతో విచక్షణ కోల్పోయి సైకోలుగా మారిన రౌడీమూకలే ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాయని పోలీసువర్గాలే చెబుతున్నాయి. అటువంటి పాశవిక హత్యాయత్నాన్ని కూడా కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెనుకేసుకువచ్చేట్టుగా....ఆ ఘటనను తక్కువ చేసి చూపేందుకు యత్నించడం విస్మయపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నాయి. అధికార టీడీపీ కూటమి హత్యా రాజకీయాలకు కొమ్ముకాయడమే తన ఏకైక కర్తవ్యంగా ఆయన భావిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సర్కారు తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో దాడులు, విధ్వంస కాండ, హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పూర్తిగా బరి తెగించినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Business
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 12.4 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 8.43 బిలియన్ డాలర్లతో పోలిస్తే 47 శాతం పెరిగాయి. ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొబైల్ ఫోన్స్ ఎగుమతులు 55 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 55 శాతం వృద్ధితో 7.6 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
మొబైల్‌యేతర ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్ 3.53 బిలియన్ డాలర్ల నుంచి 37 శాతం పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విభాగంలో సోలార్ మాడ్యూల్స్, స్విచి్చంగ్.. రూటింగ్ పరికరాలు, చార్జర్ అడాప్టర్లు, ఇతర విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి.
వీటితో పాటు ఐటీ హార్డ్‌వేర్, వేరబుల్స్, హియరబుల్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు. విడిభాగాలు, సబ్–అసెంబ్లీస్ నుంచి తుది ఉత్పత్తుల వరకు వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా అంతర్జాతీయంగా పోటీపడగలిగేలా భారతీయ బ్రాండ్లు మరింతగా ఎదగాల్సి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. దశాబ్దకాలంలో దేశీయంగా మొత్తం ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 31 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు ఎగిసింది.
50 బిలియన్ డాలర్ల అంచనాలు..
క్యూ1 తరహాలోనే జోరు కొనసాగితే 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 46–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇవి 29.1 బిలియన్ డాలర్ల నుంచి 38.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి.న్యూఢిల్లీ: రిటైల్ వాహన విక్రయాలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలలో 20,52,759 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈసారి 4% తగ్గి 19,64,213 యూనిట్లుకు దిగివచ్చాయి. ప్రయాణికుల వాహనాలు(పీవీలు), టూ–వీలర్స్‌కు డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది.
→ ప్యాసింజర్ విక్రయాలు గతేడాది జూలైలో పోలిస్తే 3,31,280 యూనిట్లు నుంచి స్వల్పంగా 0.81% తగ్గి 3,28,613 కు పరిమితమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
→ ద్వి చక్రవాహనాల రిజిస్ట్రేషన్ 6.48% క్షీణత చవిచూసింది. ఈ జూలైలో మొత్తం 13,55,504 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 14,49,487 యూనిట్లుగా ఉన్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు మొదలవడం, అధిక వర్షాలు కొనసాగడం గ్రామీణ ప్రాంత డిమాండ్‌ను దెబ్బతీసింది. పండుగ సీజన్ ప్రారంభం నేపథ్యంలో వాహన కొనుగోలు నిర్ణయం ఆగస్టుకు వాయిదా పడిందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.
→ వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు జూలైలో 76,261 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.23% పెరిగి 76,439 యూనిట్లకు చేరుకున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలు, తగ్గిన మోతాదులు నిల్వలు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య వాహనాలకు డిమాండ్ లభించింది. అయితే అధిక వర్షపాతాలు, రవాణా సమస్యలు, రుణ పంపిణీ మందగమన అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను తగ్గించాయి.
→ ట్రాక్టర్ల రిటైల్ అమ్మకాలు 11% పెరిగి 79,961 యూనిట్ల నుంచి 88,722 యూనిట్లకు పెరిగాయి. అధిక వర్షపాత అంచనాలు, వ్యవసాయ సబ్సిడీలు పెరగడం ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు కారణమయ్యాయి.
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉండే పరిశ్రమలకు ఊరటనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద రసాయనాలు, టెక్స్‌టైల్స్‌లాంటి రంగాలకు చేయూతనిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రంగాల ఎగుమతిదార్లతో భేటీ అయిన సందర్భంగా టారిఫ్‌ల ప్రభావాలు, సహాయక చర్యలకు అవకాశాలు తదితర అంశాల గురించి వాణిజ్య శాఖ చర్చించినట్లు వివరించాయి.
కేంద్ర బడ్జెట్‌లో రూ. 2,250 కోట్లతో ప్రతిపాదించిన ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద టారిఫ్ ప్రభావిత రంగాలకు తోడ్పాటు అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఈ మిషన్ కింద చిన్న–మధ్య తరహా సంస్థలు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభ రుణ పథకాలు, విదేశాల్లో వేర్‌హౌసింగ్ సదుపాయాల కల్పన, ఎగుమతి అవకాశాలను దక్కించుకునేందుకు గ్లోబల్ బ్రాండింగ్‌కి సహాయం అందించడం మొదలైనవి ఉంటాయని అంచనా. అమెరికాకు టెక్స్‌టైల్స్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లుగా, రసాయనాల ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వస్త్రాలు, రత్నాభరణాలు, రొయ్యలు, లెదర్.. ఫుట్‌వేర్, రసాయనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మె కానికల్ పరికరాలు మొదలైన రంగాలపై 50% టారిఫ్‌ల ప్రభావం గణనీయంగా ఉండనుంది.
సంస్కరణలకు జీజేఈపీసీ విజ్ఞప్తి..
సుంకాల భారం తగ్గేలా తక్షణం పాలసీపరమైన సంస్కరణలు చేపట్టాలని కేంద్రాన్ని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ కోరింది. డ్యూటీ డ్రాబ్యాక్ స్కీము, మార్కెట్ డైవర్సిఫికేషన్ కోసం ఆర్థిక సహాయం అందించడంలాంటి చర్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కట్, పాలిష్డ్ డైమండ్లలో సగం ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయని, భారీ టారిఫ్‌ల వల్ల మొత్తం పరిశ్రమ స్తంభించిపోయే ముప్పు ఏర్పడిందని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయని వివరించారు.తక్కువ టారిఫ్‌లు ఉండే టర్కీ, వియత్నాలాంటి దేశాలతో అమెరికా మార్కెట్లో భారత్ పోటీపడటం కష్టతరమవుతుందని భన్సాలీ చెప్పారు. దీన్ని పరిష్కరించకపోతే, అమెరికాకు కీలక సరఫరాదారుగా భారత్‌కి ఉన్న హోదా పోతుందని వివరించారు. అయితే, టారిఫ్‌ల ఎఫెక్ట్‌ను పక్కన పెడితే దేశీయంగా ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్, వచ్చే రెండేళ్లలో 130 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనాలు పరిశ్రమకు కాస్త ఊరటనిచ్చే విషయమని భన్సాలీ చెప్పారు. అమెరికాకు భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.
Astrology
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.చతుర్దశి ప.1.45 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.07 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.7.12 నుండి 8.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: ఉ.8.24 నుండి 10.03 వరకు, తదుపరి తె.4.55 నుండి 6.33 (తెల్లవారితే శనివారం), వరలక్ష్మీ వ్రతం.
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.28
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకుమేషం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
వృషభం.... సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబససమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మిథునం.... రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. సోదరులతో కలహాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం.... పనులలో పురోగతి. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
సింహం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య..... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల....... సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
వృశ్చికం.. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు.
ధనుస్సు.. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
మకరం.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.
కుంభం... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం.. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
Politics
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు బీసీలను అణగదొక్కే కుట్రలో భాగమని ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో 31 మంది నాన్–బీసీలు గెలవడం ఏమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఒవైసీ బీసీనా? బీసీలకు రిజర్వు చేసి మజ్లిస్ చేతుల్లో పెట్టడం ద్వారా న్యాయం జరుగుతుందా?’అని కిషన్‌రెడ్డి నిలదీశారు.
రాష్ట్రంలో జరిగిన బీసీ లెక్కల సర్వేను తూతూ మంత్రంగా నిర్వహించారని, హైదరాబాద్ నగరంలో 25 శాతం ఇళ్లలోకి వెళ్లకుండా సర్వే ముగించారని ఆరోపించారు. బీసీ జనాభాను తక్కువగా చూపించి రిజర్వేషన్లను తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను బీసీలు గుర్తించాలని కోరారు.
నాడు బీఆర్‌ఎస్.. నేడు కాంగ్రెస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజకీయ నాటకాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం కుట్రలు చేసినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ‘ఇదేనా మీ తెలంగాణ మోడల్? బీసీలను మోసం చేయడమే మోడలా?’అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వమే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందని తెలిపారు.
రాహుల్‌గాందీని ప్రధానిని చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనను కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ‘మీరు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనైనా గెలవండి. మోదీని గద్దె దించుతామన్న మీ గొప్పలు సూర్యుడిపై ఉమ్మేసినట్టే. అది మీ మీదే పడుతుంది’అని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిపై రాష్ట్ర మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేమే ప్రత్యామ్నాయం
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నారని, రాబోయే ఎన్నికల్లో అవినీతి బీఆర్‌ఎస్, చేతకాని కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ప్రజలు ఆశిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తోందని ఆరోపించారు.సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ (స్థానిక) ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో ఇంతకుమించి జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్‌సీపీ సమర్పించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యల నిమిత్తం డీజీపీకి పంపిందని గుర్తుచేసింది. ఈ వ్యాజ్యంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతటితో పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
⇒ స్థానిక ఎన్నికల ప్రక్రియలో సీసీ టీవీల ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, స్వతంత్ర పరిశీలకులు, అభ్యర్థులకు పోలీసు రక్షణ, ఎన్నికల ప్రక్రియను వీడియో తీసే విషయంలో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారందరికీ సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేశారు.
దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లే..
పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... స్థానిక ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతిని వివరించారు. అధికార పార్టీ కండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతోందని, అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిగే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు.
పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ సమర్పించిన వినతిపై స్పందించామని తెలిపారు. వారు కోరిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని కూడా చెప్పిందన్నారు.ప్రశాంత ఎన్నికల బాధ్యత అధికారులదే!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్
శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పులివెందుల డీఎస్పీ, పులివెందుల గ్రామీణ సీఐ, పట్టణ సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి చర్యల నిమిత్తం ఎన్నికల అధికారి (కలెక్టర్), జిల్లా ఎస్పీకి పంపిన విషయాన్ని రికార్డు చేసింది. తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సెల్ ఏర్పాటు చేయాలి
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా తటస్థంగా వ్యవహరించేలా పులివెందుల పోలీసులను ఆదేశించాలని... ఎన్నికల కమిషన్ ఆమోదం లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయొద్దని ఆదేశాలివ్వాలంటూ పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన తుమ్మల హనుమంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల నిర్వహణకు తటస్థ అధికారులను వినియోగించేలా ఆదేశాలివ్వడంతో పాటు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులకు విభాగం (సెల్) ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్‌కూ వినతిపత్రాలు ఇచ్చామని, ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ విచారణ జరిపారు.
ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వివేక్ చంద్రశేఖర్, సి.విశ్వనాథ్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపామని.. ఆ మేరకు ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయని తెలిపారు. ఈ వివరాలను రికార్డ్ చేసిన న్యాయమూర్తి, ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు.సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగాల్లో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్‌రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్‌వన్నీ డ్రామాలే..: ‘42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఓట్లు వేయించుకున్న రేవంత్.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ సాధించిన తర్వాతే తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ లక్ష్యాన్ని చేరుకున్నారు.
అదే తరహాలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధించారో లేదో చెప్పాలి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీతో సీఎం రేవంత్ ఏకకాలంలో డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే డ్రామాలకు పాల్పడుతున్నాడు. చివరివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ చెప్తున్న మాటలు ఆయన డ్రామాలో భాగమే..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు..
‘బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కండువాలు వేసుకుని దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కానీ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు.
స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అడ్డగోలుగా నిధులు సమకూర్చుకుంటోంది. గడిచిన 20 నెలల్లో సంపాదించిన అవినీతి సొమ్మును స్థానిక ఎన్నికల్లో పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుంది..’అని కేటీఆర్ అన్నారు.
కార్యకర్తలకు న్యాయం చేస్తాం
‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పార్టీ కార్యకర్తలకు తగినంత న్యాయం చేయలేకపోయాం. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకుని వారికి అండగా నిలుస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలి.
కొందరు చెప్తున్నట్లు బీఆర్‌ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యేది లేదు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన కీలక బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది.
తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణపై సీనియర్ నేతలు, అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు.. మూడు ఆప్షన్లు ముందు పెట్టుకొని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అధిష్టానం ఫైనల్ చేసే ఆప్షన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముమ్మరంగా మంతనాలు: స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బుధవారం జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డిలతో గురువారం ఇక్కడ మంతనాలు జరిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మూడు మార్గాలపై చర్చించారు.
మూడు ఆప్షన్లు ఇలా..: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచిచూడటం మూడు ఆప్షన్లలో మొదటిది కాగా.. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళుతూనే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది.
ఈ మూడు ఆప్షన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తే,సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాలి.
అప్పుడైనా కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అంగీకరించినా అప్పటివరకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధులకు ఎదరయ్యే అవాంతరాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం.
జీవో ఇస్తే..కోర్టులకెళితే..
ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇస్తే, దానిపై ఎవరు కోర్టులకెళ్లినా జీవో అమలు సాధ్యం కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంటి తుడుపుగా జీవో ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా పాత జీవోలు అమలు చేస్తే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం చేయాలన్నా..సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు రావచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లపై తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చర్చించాల్సి ఉంటుందని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పించడం, కొన్ని వర్గాల నేతలను ఒప్పించడం చాలా కీలకమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని సమాచారం.
కాగా బీసీ ధర్నా కవరేజీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జర్నలిస్టులు గురువారం ఉదయం తనను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఈ మూడు ఆప్షన్లపై చర్చ పెట్టి, అందులో ఏది మంచిదో సూచించాలని కోరడం గమనార్హం.
రిజర్వేషన్ల అమలు ఆలస్యమైతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలనే సూచనలు రాగా, తాము అమలు చేసినా, ఇతర పార్టీలపై ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం అంత సులువు కాదన్న తరహాలో సీఎం స్పందించినట్లు తెలిసింది.
ఖర్గేతో మంతనాలు..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్ ఈ విషయమై భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయనతో సమావేశమై.. మహాధర్నా విజయవంతమైన తీరును వివరించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఖర్గే దృష్టికి తెచ్చారు.
రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కేంద్రం స్పందన లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన మార్గదర్శనం కోరారు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు కచ్చితంగా జరగాలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
వచ్చే నెల 30 లోగా స్థానిక సమరం!
– తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో..మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గ్రామపంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో...కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం గ్రాంట్‌లు, ఇతర పథకాల కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. తద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది.
ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్దడంతో పాటు, గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం.
8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా
ఈ నెల 8వ తేదీలోగా గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలను మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పరిశీలించి పంపించాలని అధికారులకు పీఆర్‌శాఖ స్పష్టం చేసింది.
Cartoon
పాలన అలాగే కొనసాగిస్తారట!!
Sports
న్యూఢిల్లీ: ఆటలో కొత్తగా వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ... ఫిట్‌నెస్ కాపాడుకోవడం ద్వారానే ఇంకా జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నానని మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మన్‌ప్రీత్ 402 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా... మాజీ కెప్టెన్ , ప్రస్తుత హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ 412 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలోనే టిర్కీని దాటేయనున్న మన్‌ప్రీత్... ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించాడు.
కఠినమైన సాధనతో పాటు కఠోరమైన ఆహార నియమాలతో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నట్లు వెల్లడించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన మన్‌ప్రీత్... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 32 ఏళ్ల మన్‌ప్రీత్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే...
ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి...
2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌ను పొడిగించాలంటే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. జట్టులోకి ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. వారితో పోటీపడి రేసులో నిలవాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి. అనుభవం మంచిదే కానీ, కేవలం అనుభవంతో జాతీయ జట్టులో కొనసాగే పరిస్థితి లేదు. టాలెంట్‌తో పాటు వేగం కూడా అవసరం. శరీరాకృతిని కాపాడుకునేందుకు కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నా.తీపి పదార్థాలు తినడం పూర్తిగా మానేయడంతో పాటు జంక్‌ఫుడ్‌కు స్వస్తి చెప్పా. ‘లో–కార్బ్’ డైట్ ఫాలో అవుతున్నా. వారంలో ఒక్కసారి చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్వీట్స్ తీసుకుంటున్నా. కసరత్తులు కూడా క్రమపద్ధతిలో చేస్తున్నా. దీని వల్ల ఏడు కిలోల బరువు తగ్గా. ఆ మార్పు మైదానంలో స్పష్టంగా కనిపిస్తుంది. బరువు తగ్గిన తర్వాత వేగం పెరిగింది. యోయో పరీక్షల్లోనూ ఎంతో మెరుగయ్యా. అందుకే ఇక ముందు కూడా దీన్నే కొనసాగించాలనుకుంటున్నా.
క్రిస్టియానో రొనాల్డో నాకు స్ఫూర్తి...
19 ఏళ్ల వయసులో 2011లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. అప్పటి నుంచి అంతే ఉత్సాహంతో ఆడుతున్నా. గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జట్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నా కెప్టెన్సీలో భారత జట్టు 41 ఏళ్ల తర్వాత పతకం గెలవడం ఎప్పటికీ మరచిపోలేనిది. 2028 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్ గురించి ఇప్పటినుంచి ఆలోచించడం లేదు.ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించా. ఇదే ఫిట్‌నెస్ కొనసాగిస్తే అది పెద్ద కష్టం కాదు. నేను ఫిట్‌గా లేనని అనుకుంటే తక్షణమే తప్పుకొని మరో ఆటగాడికి జట్టులో అవకాశమిస్తా. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభిమానిస్తా. అతడు నలభై ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్‌గా ఉంటాడు. అతడే నాకు స్ఫూర్తి. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా... దీన్ని మరింత పొడిగించేందకు నిరంతరం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నా.
ప్రతి మ్యాచ్ ఆడాలనుకుంటా...
ప్రస్తుత భారత జట్టు నైపుణ్యం, ఫిట్‌నెస్, తీవ్రత విషయంలో అగ్రజట్లకు ఏమాత్రం తీసిపోదు. టోక్యో ఒలింపిక్స్ ముందు నుంచే ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, జర్మనీ వంటి జట్లపై నిలకడగా విజయాలు సాధిస్తున్నాం. అయితే వ్యూహాలను అమలు చేసే విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరముంది. మేం దానిపై దృష్టి సారించాం.జాతీయ జట్టు, భారత్ ‘ఎ’, భారత్ అండర్–19 ఇలా ఎందరో ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. యువ ఆటగాళ్లకు కూడా అవకాశాలు లభిస్తాయి. వర్క్‌లోడ్ నిర్వహణను జాగ్రత్తగా చూసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ప్రతిఒక్కరికీ రాదు. అలాంటి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోను.
నా వరకైతే జాతీయ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లో నేను ఉండాలనుకుంటా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది. టోర్నమెంట్ అనంతరం తిరిగి ఎలా కోలుకోవాలో తెలుసు. దానిపై దృష్టి పెట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటా అంతేకాని మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని అనుకోను.
హాకీ వరల్డ్‌కప్‌లో సత్తా చాటుతాం...
వచ్చే ఏడాది జరగనున్న హాకీ ప్రపంచకప్‌నకు భారత జట్టు అర్హత సాధించడం ఖాయమే. 1975లో జరిగిన టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. 2023లో భువనేశ్వర్ వేదికగా జరిగిన మెగా టోరీ్నలో ఆతిథ్య భారత జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు 41 ఏళ్లుగా విశ్వక్రీడల్లో మన ప్రదర్శన నామమాత్రమే. అలాంటి ఒక సందర్భం వస్తుంది. ఈసారి ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరు కనబరుస్తాం.గత వరల్డ్‌కప్‌లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆధునిక హాకీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు. ఎవరు ఎవరినైనా ఓడించవచ్చు. ఒలింపిక్స్‌లో జర్మనీపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. అనూహ్య ఫలితాలు అంటూ ఏమీ ఉండవు.
మా వరకైతే ప్రత్యర్థుల గురించి పట్టించుకోము... మా బలాలను పెంచుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో వరస పరాజయాలు ఎదురైన మాట వాస్తవమే. అయితే ఓడిన మ్యాచ్‌ల్లో సైతం మేం ఎంతో పోరాడాం. చివరి నిమిషంలో ప్రత్యరి్థకి ఆధిక్యం సమర్పించుకునే అలవాటును దూరం చేసుకోవాల్సి ఉంది. డిఫెన్స్‌లో మరింత రాటుదేలుతాం. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష కానుంది.
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కన్నెర్ర చేసింది. 11 మంది రెజ్లర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. కొందరు రెజ్లర్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) జారీ చేసినట్లుగా నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో వయో విభాగాల టోర్నీలో పాల్గొనేందుకు చూస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టగా కొందరు కావాలని పుట్టిన ఏడాదిలోపు కాకుండా చాలా ఆలస్యంగా ఎంసీడీలో జనన నమోదు చేస్తున్నారు. తద్వారా తక్కువ వయస్సు విభాగంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు.
విచారణలో జనన నమోదు చేసుకున్న వారిలో కొందరు ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారని తేలడంతో డబ్ల్యూఎఫ్‌ఐ 11 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. సక్ష్యం, మనుజ్, కవిత, అన్షు, అరుశ్ రాణా, శుభమ్, గౌతమ్, జగ్‌రూప్ ధన్‌కర్, నకుల్, దుష్యంత్, సిద్ధార్థ్ బలియాన్‌లపై నిషేధం విధించారు. ప్రత్యేకించి రెజ్లింగ్‌లో రెండు రకాల నకిలీ పత్రాలు సమాఖ్యకు తలనొప్పిగా మారాయి.
ఇందులో మొదటిది తప్పుడు వయో ధ్రువీకరణ కాగా... రెండోది ఒక ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్రాలతో స్థానికత నిబంధనకు విరుద్ధంగా పోటీపడటం. హరియాణాలో రెజ్లింగ్‌కు విపరీతమైన పోటీ ఉంటుంది. కుప్పలుతెప్పలుగా ఉన్న అఖాడాల నుంచి వందల సంఖ్యలో రెజ్లర్లు తయారవుతారు.
కానీ వీరంతా జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే రాష్ట్రం తరఫున గట్టి పోటీ ఉంటుంది. చాలామందికి అవకాశాలు రావు. దీంతో హరియాణా రెజ్లర్లు పక్క రాష్ట్రాలకు చెందిన రెజ్లర్లుగా నకిలీ పత్రాలు సృష్టించి పోటీల్లో పాల్గొంటారు. ప్రతి క్రీడలోనూ వయో విభాగాలు, జూనియర్ టోర్నీల్లో నకిలీ సరి్టఫికెట్ల బెడద వేధిస్తోంది. దీనివల్ల అర్హులైన పిన్న వయసు్కలు నష్టపోతున్నారు.
క్రీడా శాఖకు రెజ్లర్ తండ్రి ఫిర్యాదు
హరియాణాకు చెందిన ఇషిక రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఢిల్లీ తరఫున పోటీపడింది. దీనిపై ఢిల్లీ రెజ్లర్ రితిక తండ్రి నీరజ్ కుమార్ కేంద్ర క్రీడాశాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. స్థానికత నిబంధనలకు విరుధ్దంగా ఇషికను 53 కేజీల కేటగిరీలో ఢిల్లీ తరఫున పోటీపడేందుకు అనుమతించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇషిక నివాస ధ్రువీకరణ పత్రాలను ఆ ఫిర్యాదుకు జతచేసినట్లు ఆయన చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు.జిద్దా (సౌదీ అరేబియా): ఆసియా కప్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 69–100 పాయింట్ల తేడాతో చైనా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. తొలి క్వార్టర్‌లో భారత్ 14 పాయింట్లు, చైనా 29 పాయింట్లు... రెండో క్వార్టర్‌లో భారత్ 17 పాయింట్లు, చైనా 24 పాయింట్లు... మూడో క్వార్టర్‌లో భారత్ 17 పాయింట్లు, చైనా 22 పాయింట్లు... చివరిదైన నాలుగో క్వార్టర్‌లో భారత్ 21 పాయింట్లు, చైనా 25 పాయింట్లు స్కోరు చేశాయి.
భారత్ తరఫున అరవింద్ ముత్తు కృష్ణన్ 16 పాయింట్లు, సహజ్ సెఖోన్ 14 పాయింట్లు, ప్రణవ్ ప్రిన్స్ 14 పాయింట్లు సాధించారు. చైనా తరఫున మింగ్‌జువాన్ జు, జియాజి జావో 17 పాయింట్ల చొప్పున... షుయెపెంగ్ చెంగ్, జున్‌జీ వాంగ్ 13 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. నాలుగు జట్లను గ్రూప్ ‘సి’లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శనివారం ఆతిథ్య సౌదీ అరేబియాతో ఆడుతుంది.
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏడు స్థానాలు ఎగబాకి 63వ ర్యాంక్‌లో నిలిచింది. గత రెండేళ్లలో భారత జట్టుకిదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. 2023 ఆగస్టులో టీమిండియా 61వ స్థానంలో నిలిచింది.
2013లో భారత జట్టు తమ అత్యుత్తమ ర్యాంక్ (49)ను అందుకుంది. థాయ్‌లాండ్‌లో ఇటీవల జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. భారత్... మంగోలియాపై 13–0తో... 4–0తో తిమోర్ లెస్టెపై, 5–0తో ఇరాక్‌పై, చివరి మ్యాచ్‌లో 2–1తో థాయ్‌లాండ్‌పై గెలిచింది.
‘టాప్’ ర్యాంక్‌లో స్పెయిన్
మరోవైపు యూరోపియన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన స్పెయిన్ జట్టు వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న అమెరికాను స్పెయిన్ రెండో స్థానానికి నెట్టేసింది. స్వీడన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా... యూరోపియన్ టైటిల్ నిలబెట్టుకున్న ఇంగ్లండ్ ఒక స్థానం పురోగతి సాధించి నాలుగో ర్యాంక్‌లో నిలిచింది.క్రీడల నిర్వహణలోనే కాదు... పోటీల ప్రారంబోత్సవంలో కూడా అంచనాలకు మించి అద్భుతాలను చూపించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా 12వ వరల్డ్ గేమ్స్ సందర్భంగా ఇది మరోసారి కనిపించింది. చైనాలోని చెంగ్డూలో గురువారం మొదలైన ఈ పోటీలు ఆగస్టు 17 వరకు జరుగనున్నాయి. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తమ చరిత్ర, సంస్కృతి తెలిపే వివిధ ఘట్టాలను చైనా ప్రేక్షకుల ముందు ఉంచింది.
వీటిలో బాణాసంచాతో ప్రత్యేకంగా రూపొందించిన వెలుగులు విరజిమ్మే చెట్టు ఆకారాన్ని ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. శాంతి, స్నేహానికి ప్రతిరూపంగా చెంగ్డూలోని మ్యూజియంలో ఉన్న ‘ట్రీ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ చెట్టును ప్రదర్శించారు. ఈ 12వ వరల్డ్ గేమ్స్‌లో 116 దేశాలకు చెందిన 3,942 మంది అథ్లెట్లు 34 క్రీడాంశాల్లో పోటీ పడుతుండగా... ఆర్చరీలో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో దేశప్రతిష్టను ఇనుమడింప చేసిన స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌కు ఓ క్రీడా సమాఖ్య డైరెక్టర్ నుంచి వివక్ష ఎదురైంది. దీన్ని ఏమాత్రం సహించని ఆమె ఫిర్యాదు చేయడంతో భారత ఒలింపిక్ సంఘం, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణ చేపట్టాయి. గత నెలలో జూమ్ మీటింగ్ (ఆన్‌లైన్) జరిగింది. ఇందులో బాక్సర్ల లవ్లీనాతో పాటు భారత బాక్సింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ అరుణ్ మలిక్, పలువురు ‘సాయ్’, టాప్స్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ ఆన్‌లైన్ మీటింగ్‌లో లవ్లీనా తన వ్యక్తిగత కోచ్‌ను కూడా శిబిరాలకు తనతో పాటు అనుమతించాలని కోరింది. దీనిపై అరుణ్ మలిక్ వివక్షాపూరిత ధోరణితో వ్యవహరించాడని లవ్లీనా వాపోయింది. ‘ఆయన చాలా కోపంగా మాట్లాడారు. నోర్ముయ్. తలదించుకొని మేం చెప్పింది చెయ్ అంతే అని తీవ్రస్థాయిలో స్పందించడం నన్ను లింగ వివక్షకు గురి చేసింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ఏం మాట్లాడాలో కూడా పాలుపోలేదు. కొన్ని క్షణాలపాటు షాక్‌లోనే కూరుకుపోయాను. ఆయన పురుషాధిక్య ధోరణితో మహిళనైనా నన్ను తక్కువ చేసి మాట్లాడారు.
ఇది నన్ను అవమానించడం కాదు. మహిళా అథ్లెట్ల పట్టుదలని అవమానించడమే’ అని లవ్లీనా... క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఫిర్యాదు చేయడంతో ఐఓఏ, సాయ్ విచారణ చేపట్టాయి. 2 వారాల్లోనే దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది. మరోవైపు అరుణ్ లలిక్ మాట్లాడుతూ లవ్లీనా అరోపణలు అసత్యమని అన్నారు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నిబంధనల ప్రకారమే వ్యవహరించానని చెప్పారు. జాతీయ శిబిరాల్లో వ్యక్తిగత కోచ్‌లకు అనుమతించడం కుదరదని సున్నితంగానే చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు.
చెన్నై: క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన మాస్టర్స్ కేటగిరీ తొలి రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ 49 ఎత్తుల్లో అవండర్ లియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్ర యువజన క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తొలి ఎత్తు వేసి అర్జున్–లియాంగ్ గేమ్‌ను ప్రారంభించారు.
ప్రణవ్ (భారత్)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 44 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–రే రాబ్సన్ (అమెరికా) గేమ్ 59 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... విన్సెంట్ కీమెర్ (జర్మనీ) 52 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై విజయం సాధించాడు. ‘మాస్టర్స్’ కేటగిరీలో పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్‌లు జరుగుతాయి.
హారిక పరాజయం
మరోవైపు ఇదే వేదికపై జరుగుతన్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చాలెంజర్స్ టోర్నీని హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పరాజయంతో ప్రారంభించింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దీప్తాయన్ ఘోష్‌తో జరిగిన తొలి గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో ఓడిపోయింది.ఇతర గేముల్లో లియోన్ ల్యూక్ (భారత్) 47 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ప్రాణేశ్ (భారత్) 26 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై నెగ్గారు. అభిమన్యు పురాణిక్ (భారత్)–ఆధిబన్ (భారత్) గేమ్ 46 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–ఇనియన్ (భారత్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. చాలెంజర్స్ టోర్నీ విజేతకు వచ్చే ఏడాది ‘మాస్టర్స్’ టోర్నీలో పాల్గొనే అవకాశం ఇస్తారు.
జైపూర్: ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్‌కు, టీమ్ యాజమాన్యానికి మధ్య విభేదాలు ఉన్నట్లు తాజా పరిణామంతో స్పష్టమైంది. రాజస్తాన్ టీమ్‌లో సుదీర్ఘ కాలంగా భాగమైన సంజు సామ్సన్ జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్–2026 సీజన్‌కు ముందు తనను విడుదల చేయాలని అతను ఫ్రాంచైజీని కోరినట్లు సమాచారం. నిజానికి ఈ ఏడాది లీగ్ ముగియగానే సామ్సన్ తన మనసులో మాటకు మేనేజ్‌మెంట్‌కు వెల్లడించాడు. అయితే దీనిపై రాయల్స్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
2025లో రూ.18 కోట్లతో సామ్సన్‌ను జట్టు అట్టి పెట్టుకుంది. అయితే గాయం కారణంగా సామ్సన్ 9 మ్యాచ్‌లే ఆడాడు. 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచిన రాయల్స్ 9వ స్థానంతో ముగించింది. తాను కోలుకున్నా రియాన్ పరాగ్‌కే కెపె్టన్సీ కొనసాగించడంతో పాటు సీజన్‌కు ముందు జోస్ బట్లర్‌ను టీమ్ వదిలేసుకోవడంపై కూడా యాజమాన్యంతో సామ్సన్‌కు విభేదాలు వచ్చాయి.
2013 నుంచి 2015 వరకు రాజస్తాన్ తరఫున ఆడిన సంజు ఆ తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడి 2018లో మళ్లీ రాయల్స్‌కే వచ్చాడు. 2021లో అతనికి కెప్టెన్సీ ఇవ్వగా తర్వాతి ఏడాదే జట్టు ఫైనల్‌కు కూడా చేరింది. మొత్తం జట్టు తరఫున 11 సీజన్లలో కలిపి అతను 149 మ్యాచ్‌లు ఆడి 4027 పరుగులు చేశాడు.
Movies
మౌళి తనూజ్, శివానీ నగరం లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ చూస్తున్నంత సేపూ ఎంజాయ్ చేశాను. థియేటర్స్‌లో ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా బాగా నవ్వుకుంటారు. ఈ సినిమాను కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ షోస్ వేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ‘‘లిటిల్ హార్ట్స్’ కథను తొలుత మౌళి నమ్మాడు. మౌళి మీద నమ్మకంతో ఆదిత్య హాసన్‌గారు నమ్మారు.
అలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా మారాను’’ అన్నారు సాయి మార్తాండ్. ‘‘2 గంటలు ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు’’ అని ఆదిత్య హాసన్ చెప్పారు. ‘‘బన్నీ వాసుగారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న ఫస్ట్ మూవీ ఇది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ తర్వాత మంచి సబ్జెక్ట్ కోసం వేచి చూడగా ‘లిటిల్ హార్ట్స్’లో మంచి పాత్ర దక్కింది’’ అన్నారు శివానీ. ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది’’ అని మౌళి తనూజ్ చెప్పారు.
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిజా రోజ్, హర్ష రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్ నటించారు. శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
విఘ్నేష్ భాస్కరన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మేఘం వర్షించదా...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. ఈ పాటకి విక్రాంత్ రుద్ర సాహిత్యం అందించగా, కపిల్ కపిలన్, మీరా ప్రకాశ్, సుజిత్ శ్రీధర్ పాడారు. ‘‘స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ కూడా ఉంది. మా సినిమాకి ఇప్పటికే 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి.
అందమైన ప్రేమకథలకి చక్కని భావోద్వేగాలు జోడించి తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
ఈ కథకి ధ్రువ్, రుక్మిణి సరైన జోడీ అనే ఆలోచనతో వారిని ఎంపిక చేశారని టాక్. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారట మణిరత్నం. ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (2024) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్నారు.
‘‘మంచి హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అంద రికీ నచ్చుతుంది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కిందపురి’. అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మించారు.
ఈ చిత్రం నుంచి ‘ఉండిపోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం అందించగా, జావేద్ అలీ పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. అనుపమ మాట్లాడుతూ– ‘‘నాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఇది’’ అన్నారు. ‘‘నేను చదువుకున్న కాలేజీలో నా సినిమా పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ ఈ పాటను, సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కౌశిక్ పెగల్లపాటి. ‘‘చాలా మంచి కథ ఇది’’ అన్నారు చేతన్ భరద్వాజ్.
‘‘సు ఫ్రమ్ సో’ మూవీ కన్నడలో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకువెళతారనే నమ్మకం ఉంది. చక్కని వినోదంతో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు. షనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, ప్రకాశ్ కె. తుమినాడ్, మైమ్ రాందాస్ ముఖ్య తారలుగా జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సు ఫ్రమ్ సో’.
ఈ సినిమా జూలై 25న కన్నడలో విడుదలైంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో నేడు రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ బి. శెట్టి మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌తో తీస్తే మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మాతలు సపోర్ట్ చేస్తారనే నమ్మకం కలిగింది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘తెలుగులో కూడా మా సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు జేపీ తుమినాడ్. ‘‘ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణగారి సినిమాల్లో పూర్తి వినోదం ఉండేది. ఆ తర్వాత ఆ వినోదాన్ని చాలా రోజులు మిస్ అయ్యాం. ఆ లోటును ‘సు ఫ్రమ్ సో’ భర్తీ చేస్తుంది’’ అని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి చెప్పారు.
Family
1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా ఉద్యమం.. ‘డూ ఆర్ డై’ నినాదం. ‘ఇక చాలు... తోక ముడవండి’ అని బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ తిరగబడిన ప్రజాసందోహం. ఆ సమయంలో ఐదుగురు నారీమణులు శివంగులై కదిలారు. నాయిక స్థానంలో నిలిచి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రాణాలు కోల్పోయారు. వారి గొంతు నుంచి ఒక మాట మాత్రం ఆగలేదు– ‘వందే మాతరం’. అరుణ అసఫ్ అలీ, సుచేత కృపలానీ, తారారాణి శ్రీవాస్తవ, కనకలత బారువా, మతింగిని హజ్ర....
ఈ త్యాగదీప్తులకు వందనం.అప్పటికి బ్రిటిష్ వారి ధోరణి పూర్తిగా ముదిరిపోయింది. భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానికితోడు ‘పాక్షిక స్వాతంత్య్రం ఇస్తాం’ అని చెప్పడం పుండు మీద కారం చల్లినట్టయ్యింది. అప్పటికే ఎల్లెడలా స్వాతంత్య్ర కాంక్ష వెల్లువెత్తుతోంది. జనంలోని వేడిని, వారి నాడిని గమనించిన గాంధీజీ ఆగస్టు 8, 1942న బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదాన్ నుంచి ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ నినాదాన్ని అందించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు... అందరూ ఇందులో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వంతో ముడిపడిన కార్యకలాపాలన్నీ బంద్ చేయమన్నారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమంలో కనిపించిన ఒక గొప్ప పరిణామం స్త్రీలు ఇందులో పెద్ద సంఖ్యలో మమేకం కావడం. బ్రిటిష్ వాళ్లు రంగంలో దిగి పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం వల్ల ‘నాయకులు లేని ఉద్యమం’గా గుర్తింపు పొందిన క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీలు నాయక స్థానానికి ఎదిగారు. ప్రజలను నడిపించారు. త్యాగాలు చేశారు.ప్రాణాలు కోల్పోయారు. అట్టి వారిలో ఐదుమంది స్త్రీలు సదా స్మరణీయులు. వారిని తెలుసుకుందాం.అరుణ అసఫ్ అలీ
ఈమెకు ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్’, ‘హీరోయిన్ ఆఫ్ 1942’ తదితర బిరుదులు ఉన్నాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అరుణ అసఫ్ అలీ పేరు సగర్వరంగా తలుచుకుంటారు. గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చాక ఏ మైదానం నుంచైతే ఆ పిలుపునిచ్చారో అదే మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి అరుణ ఆసఫ్ అలీ బయలుదేరారు. అప్పటికే బొంబాయిలో ఆందోళనలు, దుందుడుకు చర్యలు, దహనాలు, వాటిని అణచడానికి పోలీసుల కాల్పులు జరుగుతున్నాయి. అయినా సరేప్రాణాలకు తెగించి అరుణ ఆసఫ్ అలీ జాతీయపతాకాన్ని ఎగుర వేశారు. ఆ తర్వాత గొవాలియా ట్యాంక్ మైదాన్ ‘ఆగస్ట్ క్రాంతి మైదాన్’గా పిలువబడింది.సుచేత కృపలానీ
బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా ఉన్న సుచేత ఆచార్య కృపలానీని వివాహం చేసుకుని సుచేత కృపలానీ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తగా చురుగ్గా పని చేయడంప్రారంభించిన సుచేత ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ స్థాపించారు. క్విట్ ఇండియా పిలుపు అందిన వెంటనే సుచేత భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చి ముందు వరుసలో నడిచారు. అజ్ఞాతంలో ఉంటూ కార్యకర్తలను నడిపించారు. చివరకు బ్రిటిష్ పోలీసులు ఆమె జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలిగా ఉన్న సుచేత ఉత్తరప్రదేశ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.తారారాణి శ్రీవాస్తవ్
క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి తారారాణి శ్రీవాస్తవ్ వయసు 13 సంవత్సరాలు. అప్పటికే పులేందు బాబుతో వివాహం అయ్యింది. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు అందుకుని ఆమె తన ఊరు సివాన్ (బిహార్) పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు బయలుదేరింది. ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరపగా పులేందు బాబు కుప్పకూలాడు. అయినా తారారాణి ఆగలేదు. ముందుకే సాగి పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం ఎగురువేసింది. వెనుకకు వచ్చి తిరిగి చూసే భర్త మరణించి ఉన్నాడు. ఆ వియోగాన్ని భరిస్తూనే చెక్కుచెదరని స్ఫూర్తితో ఆమె ఆ తర్వాతి కాలంలో దేశం కోసం పోరాడింది.కనకలత బారువా
అస్సామ్ చెందిన 17 ఏళ్ల యువతి కనకలత బారువా త్యాగం ఎంతో గొప్పది. దేశం కోసం అప్పటికే ఆమె ‘మృత్యువాహిని’ అనే దళం నడిపేది. క్విట్ ఇండియా పిలుపు విని తన దళంతో ఆమె గోహ్‌పూర్ పోలీస్ స్టేషన్ పై జాతీయ పతాకం ఎగురవేసేందుకు బయలుదేరింది. లాఠీలకు, హెచ్చరికలకు ఆగలేదు. చివరకు కాల్పులు జరిపితే బుల్లెట్‌కు ఎదురొడ్డిప్రాణాన్ని త్యాగం చేసింది. కనకలత లాంటి ఎందరో ధీరలు ‘డూ ఆర్ డై’ నినాదాన్ని నిజ అర్థంలో స్వీకరించే దేశానికి ఉత్తేజం ఇచ్చారు.మతంగిని హజ్రా
ఈమెను అందరూ ‘గాంధీ అవ్వ’ అని పిలిచేవారు. స్వాతంత్య్ర పోరాటంలో 73 ఏళ్ల వయసులో పాల్గొనడమే అందుకు కారణం. గాంధీ ఆదర్శాలకు నిలబడటం వల్ల కూడా. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బెంగాల్‌లోని ‘తమ్‌లుక్’లో పోలీస్ స్టేషన్ వైపు ఆరువేల మంది జనం కదిలారు. వారిలో ముందున్న వ్యక్తి మతంగిని హజ్రా. ఆమె చేతిలో జాతీయ పతాకం ఉంది. పోలీసులు విచక్షణారహితంగా బాదుతున్నా ఆమె ‘వందేమాతరం’ నినాదం ఆపలేదు. చేతిలోని పతాకాన్ని జార విడువలేదు. ఆ దెబ్బలతోనే ఆమె మరణించింది. దేశం కోసం ఆమె చేసిన త్యాగం మరపురానిది.భక్తితో పూజిస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కఠినమైన నిష్ఠలు, నియమాలు, మడులకన్నా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తాలే ముఖ్యం. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల సంపదలూ కలుగుతాయని ప్రతీతి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ఆరోగ్య సంపద, జ్ఞానసంపద మొదలైనవి ఎన్నో.
పూజను చక్కగా... భక్తి శ్రద్ధలతో చేసుకోవాలంటే ముందుగా పూజాద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు.
పూజకు కావలసినవి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరొత్తులు, కర్పూరం, చిల్లరనాణేలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడాకులు, పండ్లు, అమ్మవారి పటం లేదా ప్రతిమ, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో శుచిగా తయారు చేసిన నైవేద్యాలు (శక్తి కొలదీ చేసుకోవచ్చు) బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవునెయ్యి.శ్రావణమాసంలో ΄పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.
వ్రత విధానం
వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన ముగ్గువేసి, కలశం పెట్టాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం ఇలా తయారు చేసుకోవాలి
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి పూజకు సిద్ధం కావాలి.గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలుంచాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. స్వామివారి ముందు పళ్ళు లేదా బెల్లాన్ని నివేదించి తాంబూలం సమర్పించాలి. అనంతరం నీరాజనం సమర్పించాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద ఉంచుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతాన్నిప్రారంభించాలి.కలశపూజ
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై చిలకరించాలి. పూజ చేస్తున్న వారు తమపైన చల్లుకోవాలి.
అనంతరం పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఇంతకుముందు సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజించి కుడిచేతికి తోరం కట్టుకోవాలి.వ్రత కథాప్రారంభం
పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ‘‘మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి’’ అన్నారు. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతికి చెప్పిన ఆ వ్రత కథను ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గల యోగ్యురాలు. రోజూప్రాతఃకాలాన నిద్రలేచి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని భర్త, అత్తమామల సేవలో తరించేది.వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో కనిపించి ‘ఓ చారుమతీ! ఈ శ్రావణ ΄పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను’ అంటూ పూజా విధానాన్ని చెప్పి అంతర్థానమైంది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా ΄పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి రథ గజ తురగ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
ఈ కథ విని అక్షతలు శిరసుపై ధరించాలి. ఆ తరువాత ముతై ్తదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి. పూజ చేస్తున్నంతసేపూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
– డి.వి.ఆర్.
Editorial
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు.
ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు.
ఉక్రెయిన్‌తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!
ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి.
ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్‌పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.
అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్‌ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే.
దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం.
ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.
ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం.
Guest Columns
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు.
అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.
ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?
అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు.
మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?
చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు.
సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్‌లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి.
నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్‌కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.
ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!
అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి.
అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.
వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్‌లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.
అప్రమత్తత కలిగేనా?
ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి.
భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్‌లో నేటికీ ఉన్నాయి.
ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్‌ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం.
రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్‌ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.
విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు