రెజోనెట్‌కు అనూహ్య స్పందన
హన్మకొండ: రెజోనెన్స్ విద్యాసంస్థ నిర్వహించిన రెజోనెట్ టాలెంట్ టెస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం హనుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాల సెంటర్‌లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌కు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫీజులో 10 నుంచి 100 శాతం రాయితీ కల్పించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీంతో వరంగల్ మహానగరంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. టాలెంట్ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులకు రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్లు లెక్కల మహేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, లెక్కల రమ్య రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


