రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు
వరంగల్ స్పోర్ట్స్: రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన 41వ సీనియర్ అంతర్ జిల్లాల తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో వరంగల్ క్రీడాకారులు పతకాలు సాధించారు. జి.స్నేహ (73 కేజీల పై) గోల్డ్, వి.రిషిత (అండర్–58 కేజీ) సిల్వర్, పి.తరుణ్ (అండర్–80) సిల్వర్, వి.శ్రీయాంశ్ (అండర్ 87 కేజీ) సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సతీశ్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఇందులో స్నేహా గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ రెండో వారంలో జరిగే సీనియర్ నేషనల్స్ ఎంపికై నట్లు తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ఒలింపిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి మల్లారెడ్డి, ఎస్‌ఎంఏ తైక్వాండో అకాడమీ కోచ్ ఎల్లావుల గౌతమ్‌యాదవ్ అభినందించారు.


