ఉత్సాహంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
జిల్లాల వారీగా షెడ్యూల్
వరంగల్ స్పోర్ట్స్: డీడీజీ(స్టేట్స్), జోనల్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ , చైన్నె డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్‌ఓ సిక్రిందాబాద్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది. కలెక్టర్ స్నేహశబరీష్ సోమవారం ఉదయం 2.30 గంటలకు సైన్యాధికారుల సమక్షంలో ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మొదటి రోజు ఆదిలాబాద్, వనపర్తి అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. ఈ పోటీల్లో రెండు జిల్లాల నుంచి 794 మంది రాత పరీక్షలో అర్హత సాధించగా, 624 మంది హాజరైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి అభ్యర్థులు ఇప్పటికే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైన్యాధికారులు, డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు..
రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా కలెక్టర్ స్నేహశబరీష్ ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియం ఆవరణలో ఓఫైర్ ఇంజిన్ సిద్ధంగా, మరో టిరిజర్వ్‌లో ఉంచారు.అత్యవసర వైద్యసేవల కోసం రెండు 108 అంబులెన్స్, 28 మంది వైద్యులు, 104 మంది పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
నవంబర్ 10 : ఆదిలాబాద్, వనపర్తి 794 మంది రాత పరీక్షకు అర్హత సాధించగా 624 మంది హాజరయ్యారు.
నవంబర్ 11: నిజామబాద్, మెదక్, సంగారెడ్డి,
రంగారెడ్డి.. 800 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 12: కుమరం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్.. 794 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 13 : జయశంకర్‌భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేట..786 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 14: జోగులాంబగద్వాల, యాదాద్రిభువనగిరి, ములుగు, నారాయణపేట, ఖమ్మం..791 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 16: వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్..793 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 17: నిర్మల్, రాజన్న సిరిసిల్ల.. 800 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 18: మంచిర్యాల, పెద్దపల్లి,
హైదరాబాద్..781 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 19: సిద్దిపేట, కరీంనగర్, జనగామ,
మహబూబాబాద్..817 మంది రాత పరీక్షకు అర్హత
నవంబర్ 20: జగిత్యాల, నల్లగొండ, వరంగల్,
హనుమకొండ.. 800 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు.
జేఎన్‌ఎస్‌లో ప్రారంభించిన కలెక్టర్ స్నేహశబరీష్


