ఒకే వేదికపై డాక్టరేట్.. ఒక మధురం
కవి సోగ్గాడు పొట్లపల్లి అనేవారు..
అందెశ్రీ మృతి అత్యంత బాధాకరం. పీడిత, నిరుపేదల కోసం పాటలు రాస్తూ తెలంగాణ ప్రజల్లో చైతన్య కలిగించిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పూడ్చలేని లోటు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి.
–వలీఉల్లాఖాద్రీ,
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
2009లో కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఒకే వేదికపై అందెశ్రీ, నేను డాక్టరేట్ తీసుకోవడం మధుర స్మృతి. అందెశ్రీ తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమ పాటల సంకలనం గ్రంథం ‘ నిప్పుల వాగు’లో నేను రాసిన రెండు పాటలకు చోటుఇచ్చిన విషయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను.
–డాక్టర్ మార్క శంకర్ నారాయణ, ప్రధాన కార్యదర్శి,
అరసం ఉమ్మడి వరంగల్‌జిల్లా
పది సంవత్సరాల క్రితమే కళ్లకు కట్టినట్టు సామాన్య జనానికి అర్థమయ్యేలా వివిధ వేదికలపై పాటలు పాడిన అందెశ్రీ నాకు అత్యంత ఆప్తుడు. భాగవతం, చిందు యక్షగానాలను గురించి విశ్లేషించి వేయిస్తంభాల దేవాలయంలో పాటలు పాడిన గొప్ప వ్యక్తి. ఆయన మృతి తీరని లోటు.
–గంగు ఉపేంద్రశర్మ ,
ప్రధాన అర్చకుడు, వేయిస్తంభాల దేవాలయం
హన్మకొండ కల్చ రల్: తాత్విక కవి అందెశ్రీని ఇటీవలే కలిశా. ప్రభుత్వం ఏటా ఇచ్చే కాళోజీ పురస్కారాల సందర్భంగా.. కమిటీకి అందెశ్రీ చైర్మన్‌గా, నేను సభ్యుడిగా ఉన్నా.. అందెశ్రీ నిబద్ధత గల వ్యక్తి.. ఆయనతో ఎన్నో వేదికలు పంచుకున్నా. ఎప్పుడు కలిసిన కవి సోగ్గాడు పొట్లపల్లి అనేవారు. అందెశ్రీ మృతి కుటుంబసభ్యులకే కాదు సమాజానికి తీరనిలోటు.
– పొట్లపల్లి శ్రీనివాసరావు, కవి,
హనుమకొండ
పాలకుర్తితో అనుబంధం..
పాలకుర్తి టౌన్: ప్రముఖ రచయిత అందెశ్రీకి పాలకుర్తితో అనుబంధం ఉంది. 2006, జూన్ 25న సోమనాథ కళాపీఠం పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ మృతిపై మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ, సాహితీవేత్తలు శంకరమంచి శ్యాంప్రసాద్, జిలుకర శ్రీనివాస్, ఆరూరి సుధాకర్ సంతాపం తెలిపారు.
ఒకే వేదికపై డాక్టరేట్.. ఒక మధురం
ఒకే వేదికపై డాక్టరేట్.. ఒక మధురం


