నేటినుంచి నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లు..
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ మీదుగా బెంగళూరు–ముజఫర్‌పూర్, యశ్వంత్‌పూర్–ముజఫర్‌పూర్ మధ్య 4 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
నవంబర్ 11, 12వ తేదీల్లో ముజఫర్‌పూర్‌లో బయలుదేరే ముజఫర్‌పూర్–యశ్వంత్‌పూర్ (05545) వీక్లీ ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకుంటుంది. నవంబర్ 14, 15వ తేదీల్లో ఎస్‌ఎంవీటీ బెంగళూరులో బయలుదేరే ఎస్‌ఎంవీటీ బెంగళూరు–ముజఫర్‌పూర్ (05546) వీక్లీ ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకుంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌లకు అప్‌అండ్‌డౌన్‌లో హజీపూర్, పాటలీపుత్ర, దానాపూర్, ఆరా, బాక్సర్, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, న్యూవెస్ట్ క్యాబిన్, ప్రయాగ్‌రాజ్, చౌకి, మాణిక్‌పూర్ జంక్షన్, సంత, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, జుజర్‌పూర్, నాగ్‌పూర్, బల్లార్షా, వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కట్‌పడి, జోలర్‌పెట్టాయ్, కృష్ణరాజపురం, ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.


