● నాలుగు గంటల పాటు స్తంభించిన రాకపోకలు ● క్రేన్‌తో తొల
బొబ్బిలి: ఈపీఎఫ్ 95 పింఛన్‌ను రూ.9వేలకు పెంచాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల్లో 30 నుంచి 40 ఏళ్ల పాటు సర్వీసు చేసి లక్షలాది రూపాయల తమ కష్టార్జితాన్ని దాచుకుంటే కేవలం రూ.700 నుంచి 2వేల లోపు మాత్రమే పెన్షన్ ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్‌ను పెంచాలని కోరుతున్నామన్నారు. పెన్షన్ అయినా ఇవ్వాలని లేకపోతే చనిపోవడానికి అనుమతులు అయినా ఇవ్వాలని కోరారు. సుమారు 20 కోట్ల మంది ఈపీఎఫ్ – 95 పెన్షన్ దారులున్నారనీ ఈపీఎఫ్ సంస్థ వద్ద రూ.25లక్షల కోట్లున్నాయన్నారు. కానీ అతి తక్కువ పెన్షన్లన్నీ రూ.700 నుంచే ఉన్నాయన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 11న ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరపతలపెట్టిన నిరసన కార్యక్రమానికి కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వారి వెంట రామినాయుడు తదితరులు ఉన్నారు.
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, నూనె సరుకులు చేరలేదనే అంశంపై సాక్షిలో ఈ నెల 8వ తేదీన అంగన్‌వాడీల్లో ఆకలి కేకలు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. మోంథా తుఫాన్ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా ఆలస్యమైందని ఐసీడీఎస్ పి.డి విమ లరాణి తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాటికి సరుకులు కేంద్రాలకు చేరుతాయని తెలిపారు.
బొబ్బిలి: పట్టణ పరిధిలోని గొల్లపల్లి నుంచి మండలంలోని అలజంగి – కారాడ గ్రామాల మధ్యలో ఉన్న అతి పెద్ద గోతుల్లో లారీ దిగబడిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం వేకువ జాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ సుమారు నాలుగు గంటలు పైబడి వందల సంఖ్యలో లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీల డ్రైవర్లు, సిబ్బంది ఆహారం కోసం అల్లాడిపోయారు. ఆ సమయంలో అవసరమై న సరుకులు దొరక్క, లారీలు విడిచి వెళ్లలేక అవస్థలు పడ్డారు. మరో పక్క వాహనాలను తప్పించుకుని రావాల్సిన ఆటోలు, మోటారు బైక్‌లు, ఇతర వాహనాలతో రాలేక ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియాలో ఆయా వాహనాల యజమానులు, డ్రైవర్లు, స్థానికులు రోడ్ల దుస్థితి, తమ ఇబ్బందులపై పోస్టులు పెడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చివరకు ట్రాఫిక్ ఎస్సై పి.జ్ఞానప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
● నాలుగు గంటల పాటు స్తంభించిన రాకపోకలు ● క్రేన్‌తో తొల
● నాలుగు గంటల పాటు స్తంభించిన రాకపోకలు ● క్రేన్‌తో తొల


