లక్ష దీపోత్సవం
కార్తిక మూడో సోమవారం పురస్కరించుకుని చీపురుపల్లి
పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సమీపంలో సోమవారం లక్ష దీపోత్సవం వైభవంగా సాగింది. ఎన్‌ఆర్‌ఎస్ ఈవెంట్స్ నేతృత్వంలో లక్ష దీపోత్సవం, పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగాయి.
కల్యాణ మహోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స
సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష, పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నెల్లిమర్ల మండలం టెక్కలిలోని
సెంచూరియన్ వర్సిటీలో విద్యార్థుల లక్షదీపారాధనను
వైభవంగా నిర్వహించారు. –చీపురుపల్లి/నెల్లిమర్ల రూరల్
లక్ష దీపోత్సవం
లక్ష దీపోత్సవం


