ఖోఖో పోటీల్లో విన్నర్స్‌గా విజయనగరం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్కూల్ గేమ్స్ బాల, బాలికల ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా జట్లు ద్వితీయ స్థానాలు దక్కించుకున్నాయి. మూడు రోజులుగా నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరిగిన పోటీల్లో అతిథ్య విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన బాలుర జట్టుతో పాటు బాలికల జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరిచి పోటీల్లో రాణించాయి. పోటీల్లో బాలుర విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ స్థానం కై వసం చేసుకోగా.. విజయనగరం ద్వితీయ స్థానం, విశాఖ జట్టు తృతీయ స్థానాన్ని చేజిక్కించుకుంది. బాలికల విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా విజయనగరం ద్వితీయ స్థానం, చిత్తూరు జట్టు తృతీయ స్థానం దక్కించుకున్నాయి. పోటీల్లో విజేతలకు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.తవిటినాయుడు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.
ఖోఖో పోటీల్లో విన్నర్స్‌గా విజయనగరం


