జాతీయస్థాయి డిస్కస్ త్రో పోటీలకు గిరిజన విద్యార్థిని
సీతంపేట: జాతీయస్థాయి డిస్కస్ త్రో పోటీలకు గిరిజన విద్యార్థిని ఎంపికై ంది. సీతంపేటలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత ఆశ్రమపాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సవర కావ్య ఇటీవల శ్రీకాకుళం జిల్లా గోవిందాపురంలో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది, త్వరలో జాతీయస్థాయిలో జరగనున్న డిస్కస్‌త్రో పోటీల్లో కావ్య తలపడనుందని ఆ పాఠశాల హెచ్‌ఎం వసంతలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆ బాలికను ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ రామ్మోహన్‌రావు, హెచ్‌డబ్ల్యూవో పాలక అమల, పీడీ శైలజ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.


