విజయనగరం అర్బన్: పీజీఆర్‌ఎస్‌లో అందిన వినతులకు సంబంధించి అర్జీదారులను కలిసి మాట్లాడి న తర్వాతే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని డీఆర్వో శ్రీనివాసమూర్తి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ వినతులపై సోమవారం సమీ క్ష సమావేశం నిర్వహించారు. అర్జీదారునితో మా ట్లాడిన తేదీ, సమయం వారి నివేదికలో నమోదు చేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్ నోడల్ అధికా రి మురళి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై అవగాహన కల్పించాలన్నారు. గృహా ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్‌లో ఎంపీడీఓ నమోదు చేయాలని డీఆర్వో తెలిపారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


