అరసాడలో బయోగ్యాస్ ప్లాంట్
వంగర: మండలంలోని అరసాడ గ్రామ సమీపంలో రూ.102 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మిస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ప్లాంటు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరుల తో మాట్లాడారు. పీవీఎస్ గ్రూపు ఆధ్వర్యంలో ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ నెల 11న కనిగిరి నుంచి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారన్నారు. రాజాంలో జరగనున్న వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. రోజుకు 20 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ ప్రాజెక్టు వల్ల 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయ న్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్డీఓ సత్యవాణి, తహసీల్దార్ పిన్నింటి రామారావు, పీవీఎస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


